black badges
-
టీడీపీ హత్యా రాజకీయాలపై.. ఎగసిన నిరసన
సాక్షి, అమరావతి/నెట్వర్క్ : సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి తెగబడటాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. స్కూలు పిల్లల నుంచి వృద్ధులు, అభిమానులు, మహిళలు, పార్టీ నేతలు పెద్దఎత్తున నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పోద్బలంతోనే ఈ హత్యాయత్నం జరిగిందని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో జగన్‌ను ఎదుర్కోలేక.. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ప్రజాస్పందనను చూసి ఓర్వలేక.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం ఖాయమనే అక్కసుతోనే సీఎంపై హత్యాయత్నానికి పురిగొలిపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనేకచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్థం చేశారు. ఇందులో భాగంగా.. సీఎంపై హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఆదివారం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో హోంమంత్రి తానేటి వనిత నేతృత్వంలో పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రిని రాజకీయంగా ఎదుర్కోలేకే దాడిచేయడం బాధాకరమని మంత్రి అన్నారు. దండకున్న తీగ గుచ్చుకుని గాయమైనట్లు కొంతమంది వక్రీకరిస్తున్నారని.. తీగ గుచ్చుకుని గాయమైతే వెనుకనున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ఎలా గాయమైందని ప్రశ్నించారు. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కుక్కునూరు మండలం కివ్వాక గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. భీమడోలు మండలం కోడేరుపాడు గ్రామంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం మర్రితిప్ప వద్ద చీఫ్ విప్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాకినాడ రూరల్ మండలంలో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ప్రత్తిపాడులో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థి దవులూరి దొరబాబు సామర్లకోటలో, పి.గన్నవరంలో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాలరావు, జగ్గంపేట, తునిలో పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హత్యాయత్నానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. జగన్‌ను టచ్ చేశారు పుట్టగతులుండవు : మంత్రి ‘కొట్టు’ సీఎం జగన్‌ని దాడి ద్వారా టచ్ చేశారు, ఈ కుట్రకు పాల్పడిన వారికి పుట్టగతులుండవని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో ఆయన నల్లరిబ్బన్లు ధరించి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌ను ఎదుర్కోలేక పిరికిపంద చర్యలకు పాల్పతున్నారన్నారు. ఆయనకు వస్తున్న జనాదరణను తట్టుకోలేక ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇక సీఎంపై దాడి ముమ్మాటికీ చంద్రబాబు పనేనని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకులో ఆరోపించారు. పేదలకు సంక్షేమం, విద్య, వైద్యం ఉచితంగా అందిస్తున్నందుకు జగన్‌పై దాడులు చేయిస్తావా చంద్రబాబూ అని నిలదీశారు. వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా చంద్రబాబు అంతమొందించాడని, నేడు అదే కోవలో ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. విజయనగరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జామి మండలంలోని పీతలపాలెంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, పాలకొండలో ఎమ్మెల్యే కళావతి నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలిపారు. సీఎంపై జరిగిన దాడి అమానుషమని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు హేయమైనవని కోలగట్ల అన్నారు. సీఎం జగన్‌పై జరిగిన దాడికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం, నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్‌లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సోంపేటలో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, కొత్తూరులో ఎమ్మెల్యే రెడ్డిశాంతి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. చంద్రబాబు కేడర్‌ను రెచ్చగొడుతున్నారు ఇక సీఎం జగన్‌పై దాడికి నిరసనగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత.. సింగరాయకొండలో మంత్రి ఆదిమూలపు సురేష్, చీమకుర్తిలో మంత్రి మేరుగ నాగార్జున, కంభంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, మార్కాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు, కనిగిరిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. చంద్రబాబు పదేపదే తన కేడర్‌ను రెచ్చగొడుతున్నారని, ఇది హేయమైన చర్య అని బాలినేని, ఆదిమూలపు, మేరుగ నాగార్జున ఆరోపించారు. చీరాల, అద్దంకి, పర్చూరు, అధికార పార్టీ అభ్యర్థులు కరణం వెంకటేష్, పానెం హనిమిరెడ్డి, ఎడం బాలాజీ, వేమూరు అభ్యర్థి వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, రేపల్లె అభ్యర్థి ఈవూరి గణేష్‌లు ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండించారు. ఉమ్మడి విశాఖలో ఆగ్రహ జ్వాలలు.. ఉమ్మడి విశాఖ జిల్లా మర్రిపాలెంలో వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆడారి ఆనంద్‌కుమార్, ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఎండాడలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించగా.. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. గాజువాకలో మంత్రి అమర్నాథ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. చంద్రబాబు నీచరాజకీయాలు చెల్లవని.. ఇలాంటి దాడులను తాము సహించబోమన్నారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. పాయకరావుపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా.. జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే, విప్ సామినేని ఉదయభాను, తిరువూరులో ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు, మైలవరంలో ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు యాదవ్, విజయవాడ పశ్చిమంలో ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, సెంట్రల్ నియోజకవర్గంలో డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్లు, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇక మచిలీపట్నం, అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ, పామర్రు, పెడన, పెనమలూరు నియోజకవర్గాలోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పెనమలూరు మండలం గంగూరులో మంత్రి జోగి రమేష్, పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో.. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఇక్కడి ప్రస్తుత అభ్యర్ధి షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. పొన్నూరులో ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ, గుంటూరులో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, మచిలీపట్నం పోర్టు ట్రస్టు ఎండీ మేకతోటి దయాసాగర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇతర మండలాల్లోనూ నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేశారు. అలాగే, సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు నాయకత్వంలో నల్లకండువాలు ధరించి ర్యాలీ నిర్వహించారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అమరావతిలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రాస్తారోకోలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. రొంపిచర్ల, వినుకొండలోనూ ఆందోళనలు చేశారు. ఇది ముమ్మాటికీ కూటమి కుట్రే ఇదిలా ఉంటే.. సీఎంపై హత్యాయత్నం ముమ్మాటికీ ప్రతిపక్ష పార్టీల కుట్రేనని తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆరోపించారు. చంద్రగిరిలో ఆయన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కూడా హాజరయ్యారు. అలాగే, హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఆధ్వర్యంలో తిరుపతిలో నల్ల కండువాలు, నల్లబ్యాడ్జీలు ధరించి పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్నకు హాని జరిగితే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని వారన్నారు. ఇక అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీఎంపై హత్యాయత్నం వెనుక కుట్రకోణం ఉందన్నారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీ‹Ùకుమార్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు కూడా తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లో భారీఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లోనూ నిరసనలు జరిగాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుత ఆందోళనలు జరిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ జనాగ్రహం పెల్లుబికింది. ఆత్మకూరు పట్టణంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆధ్వర్యంలో.. ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లరిబ్బన్లను ధరించి నిరసన వ్యక్తంచేశారు. నెల్లూరు నగరంలోనూ నిరసన ర్యాలీలను నిర్వహించారు. -
నల్ల రిబ్బన్లతో టీమిండియా..
అంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు టీమిండియా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి మైదానంలోకి దిగారు. కేంద్ర మాజీ మంత్రి, మాజీ డీడీసీఏ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ మరణానికి సంతాపంగా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. కేంద్ర మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు చేసిన జైట్లీకి క్రికెట్‌తోనూ మంచి అనుబంధం ఉంది. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం(1999-2013) పని చేసిన జైట్లీ.. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా తన సేవలందించారు. ఢిల్లీ క్రికెట్ అభివృద్ధికి కృషి చేశారు. ఆటగాళ్ల సమస్యలను, వారికి మౌలిక వసతులను కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఢిల్లీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, తదితరులు టీమిండియా తరుపున ఆడారు. ఇప్పటికే అరుణ్ జైట్లీ మృతి పట్ల తాజా, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. -
శ్రీవారి ముంగిట నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసనలు
-
టీటీడీ చరిత్రలో చీకటి రోజు
-
నిరసన దేవుడిపైనా?
సాక్షి ప్రతినిధి, తిరుపతి / తిరుమల : టీటీడీ చరిత్రలో గురువారం చీకటి రోజుగా మిగిలిపోనుంది. అర్చకుల తొలగింపు, నియామకాల్లో చోటు చేసుకున్న రాజకీయాలు శ్రీవారి గర్భగుడి వరకు వెళ్లడం భక్తులను విస్మయానికి గురిచేసింది. టీటీడీ అధికారులు, ప్రభుత్వ నిర్ణయాలను ఎత్తిచూపుతూ మాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేస్తోన్న ఆరోపణలకు వ్యతిరేకంగా టీటీడీ ఉద్యోగులు, ఆలయ అర్చకులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావడం చూసి భక్తులు నివ్వెరపోయారు. తిరుమలలో ఈ తరహా నిరసనలను ఎన్నడూ చూడలేదన్న అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ తిరుపతిలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకే పరిమితమైన ఆందోళనలు, నిరసనలు తొలిసారి ఆలయ ప్రాంగణంలో జరగడం భక్తులను విస్మయానికి గురిచేశాయి. ప్రభుత్వమే ఉద్యోగులు, అర్చకులను రెచ్చగొట్టి రాజకీయం చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రమణ దీక్షితులేమన్నా రాజకీయ నాయకుడా...? ఆయన్ని లక్ష్యంగా చేసుకుని ఉద్యోగులందరినీ వివాదంలోకి లాగడం ఎంత వరకూ సబబన్న ప్రశ్న తలెత్తుతోంది. శ్రీవారి గర్భగుడిలోనూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఆలయ ప్రతిష్టను దిగజార్చవద్దంటూనే అధికార పార్టీ పెద్దలు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. అధికార పార్టీ పెద్దల ఒత్తిడికి లొంగిన టీటీడీ అధికారులు చెప్పడంతో ఇష్టంలేకపోయినా నిరసనకు దిగినట్లు ఉద్యోగులు, అర్చకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే సూత్రధారులా? ఉద్యోగులు, అర్చకులు నిరసనలకు దిగడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా తిరుమల కొండపై నిరసనలు, ఆందోళనలు నిషేధం. ఉద్యోగులుగానీ, అర్చకులుగానీ ఎవరూ తిరుమల క్షేత్రంపై నిరసనలు జరిపిన సందర్భాలు లేవు. అలాంటిది తాజాగా టీటీడీ ఉద్యోగులు జేబులకు, అర్చకులు ధోవతులకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. స్వామి వారి సేవా కైంకర్యాలకు హాజరయ్యే తమకు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపడం ఇష్టం లేకపోయినా అధికారుల నుంచి ఉన్న ఒత్తిడి కారణంగా తప్పడం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని అర్చకులిద్దరు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. నిరసన సరికాదన్న జేఈవో... ఇదిలా ఉండగా తిరుమల క్షేత్రంలో నల్లబ్యాడ్జీలతో నిరసన సరికాదని తెలియజేస్తూ తిరుమల జేఈవో శ్రీనివాసరాజు గురువారం మధ్యాహ్నం తరువాత సర్క్యులర్ విడుదల చేశారు. ఉద్యోగులు, అర్చకులు ఈ తరహా నిరసనలకు దిగకూడదని అందులో స్పష్టం చేశారు. రోజుకో ఘటనతో తిరుమల ప్రతిష్టకు భంగం గత వారం రోజులుగా తిరుమలలో రోజుకో కొత్త సంఘటన చోటు చేసుకుంటోంది. ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టీటీడీ అధికారులపై ఆరోపణలు చేసిన «మరుసటి రోజే ధర్మకర్తల మండలి తిరుమలలో సమావేశమై 65 ఏళ్ల వయో పరిమితిని విధించడం అర్చకుల మధ్య రగడకు కారణమైంది. వారసత్వ అర్చకత్వాన్ని రద్దు చేసే అధికారం టీటీడీకి లేదని వాదిస్తూ రమణ దీక్షితులు తనదైన పోరాటాన్ని మొదలు పెట్టారు. ఆయన వ్యవహార శైలిపై భగ్గుమన్న టీటీడీ అధికారులు ప్రధాన అర్చకత్వ బాధ్యతల నుంచి రమణ దీక్షితులును తొలగించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. టీటీడీ నిర్ణయాన్ని చట్టపరంగా ఎదుర్కొంటానన్న రమణదీక్షితులు ఆలయంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అధికారులు చేసిన పనులను ఎత్తి చూపారు. ఆభరణాలు మాయమవుతున్నాయనీ, నేలమాళిగల్లోని అరుదైన సంపద కోసం పోటులో తవ్వకాలు జరిగాయన్న దీక్షితుల ఆరోపణలు టీటీడీ అధికారులను ఇరుకున పడేశాయి. సీఎం దగ్గరకెళ్లిన టీటీడీ ట్రస్ట్‌బోర్డు చైర్మన్, ఈవోలు సుధీర్ఘ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే రమణ దీక్షితులు చేస్తోన్న ఆరోపణలకు ప్రత్యారోపణలు చేసేందుకు ప్రభుత్వం అటు అధికారులను, ఇటు అర్చకులనూ వాడుకుందన్న వాదనలు తెరమీదకు వచ్చాయి. ఎన్నడూ మీడియా ముందుకు రాని అనువంశిక అర్చకులు, జియ్యంగార్లు, పోటు కార్మికులు ఈ వివాదంలో జోక్యం చేసుకుంటూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చడమే ఇందుకు నిదర్శనం. ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా చోటచేసుకుంటున్న ఘటనలతో తిరుమల ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో నిరసనలా..? స్వామి దర్శనానికి చాలా సార్లు వచ్చాను. ఇలా నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన మొట్టమొదటిసారి చూశాను. ఏది ఏమైనా స్వామి వారి సన్నిదానంలో ఈ తరహా నిరసనలు సమంజసం కాదు కదా... – సినీనటి కవిత. ఖండించాల్సిన అంశం... ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో నిరసనలు ఉండకూడదు. అందరం ఖండించాల్సిందే. ఇలాంటి వాటిని ప్రభుత్వం నిలిపివేయాలి. టీటీడీ అధికారులే ఇలాంటివి ప్రోత్సహించడం హిందూ సంప్రదాయానికి విరుద్ధం. ప్రభుత్వం జోక్యం చేసుకుని తిరుమలలో పెరుగుతున్న వివాదాలకు అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉంది. – భానుప్రకాశరెడ్డి, బీజేపీ నేత -
సాక్షి ఎఫెక్ట్: దిగొచ్చిన టీటీడి
-
ఉద్యోగ భద్రత కల్పించాలి
మధురానగర్ : 16 ఏళ్లుగా కాంట్రాక్టు లెక్చరర్స్‌గా పనిచేస్తున్న లెక్చరర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని గవర్నమెంట్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎం దయాకర్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్స్ డిమాండ్ల పరిష్కారం కోరుతూ శనివారం ప్రభుత్వ కళాశాలలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారటం లేదని విచారం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్నామన్నారు. జీతాలు చాలక కుటుంబాలు అర్ధాకలితో, పిల్లలకు కనీస అవసరాలు తీర్చలేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామని చెప్పిన పాలకులు నేడు తమను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా అమలుచేయని ప్రభుత్వాలు, తమను క్రమబద్ధీకరించటానికి మాత్రం సుప్రీం కోర్టు అభ్యంతరం చెప్పిందంటూ మోసం చేస్తున్నాయని విమర్శించారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో జీఓ 16 ప్రకారం 2–94 యాక్ట్‌ను సవరించిందని, ఏపీలో తమ గురించి ఆలోచించిన వారే కరువయ్యారని విచారం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు జీతాలను రెట్టింపు చేసుకునేందుకు నిధుల సమస్యలు లేవని తమ వేతనాలు పెంచడానికి, క్రమబద్ధీకరించడానికి నిధుల కొరత కనిపించడం హేయమన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం దశల వారీ ఉద్యమం చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేశామని, 21 నుంచి 23 వరకు పోస్టుకార్డు ఉద్యమం, 24, 25 తేదీలలో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించటం, 28న కలెక్టరేట్‌వద్ద ధర్నా, డిసెంబర్ 1న కుటుంబ సభ్యులతో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నామని వివరించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే డిసెంబర్ 2 నుంచి నిరవధిక దీక్షలను చేపడతామని హెచ్చరించారు. జిల్లా నాయకులు జాన్సన్, విజయశ్రీ,, రాంబాబు, సుధాకరన్, జ్యోతి, సునీత, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సకల’ వేతనాలు అందరికీ చెల్లించాలి
సెంటినరీకాలనీ : సింగరేణిలోని అన్ని విభాగాల కార్మికులకు సకలజనుల సమ్మెకాలపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆర్జీ–3 డివిజన్లోని డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం వద్ద ఎస్అండ్ పీసీ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ ఎస్అండ్పీసీ రామగుండం రీజియన్ ఇన్చార్జి అంబటి నరేష్ మాట్లాడుతూప్రాణాలనుపణంగా పెట్టి సంస్థ ఆస్తులను కాపాడిన సిబ్బందికి సకలజనుల సమ్మె కాలపు వేతనం చెల్లించకపోవడం బాధాకరమన్నారు. టీబీజీకేఎస్ లోపభూయిష్టం ఒప్పందంతోనే కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. కార్మికులందరికీ వేతనాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నా.. టీబీజీకేఎస్ అడ్డుకుందని ఆరోపించారు. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ సీఅండ్ఎండీ శ్రీధర్‌తో చర్చలు జరుపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్అండ్పీసీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
జిల్లా సాధన దీక్షలు ప్రారంభం
మేడ్చల్: మేడ్చల్ జిల్లా సాధన కోసం.. జిల్లా సాధన సమితి నాయకులు బుధవారం పట్టణంలో దీక్షలు ప్రారంభించారు. మేడ్చల్‌లోని వివేకానందుడి విగ్రహం వద్ద శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షురాలు రాగజ్యోతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రేపట్నుంచి నర్సుల రాష్ట్ర వ్యాప్త ఆందోళన
విశాఖ మెడికల్: నర్సుల నియామకాలు, ఇతర డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించనున్నట్టు ప్రభుత్వ నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.భాగ్యలక్ష్మి తెలిపారు. విశాఖలో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 31 నుంచి రాష్ట్ర వ్యాప్తం గా అన్ని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి ఆస్పత్రుల ఎదుట గంట పాటు నినాదాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ధర్నాలు చేపట్టి దశలువారీగా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. 2007 నుంచి ప్రభుత్వం పోస్టుల నియామకాలను నిలిపివేసిందని ఆరోపించా రు. ఇటీవల ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది నర్సు పోస్టుల భర్తీ చేపడతామని చెప్పినప్పటికీ ఇంతవరకూ ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. గుంటూరు జీజీహెచ్ ఆస్ప త్రి ఘటనకు సంబంధించి ఇద్దరు నర్సులను సేవా లోపం నెపంతో సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. -
టీడీపీ దౌర్జన్యాలను అరికట్టాలి
నల్లబ్యాడ్జీలతో వైఎస్ వివేకా, వైఎస్ భాస్కర్‌రెడ్డిల నిరసన ర్యాలీ పులివెందుల/అర్బన్ : పులివెందులలోని నగరిగుట్ట గిరిజనులపై మంగళవారం టీడీపీ కార్యకర్తలు సుమారు 200మంది రాళ్లు, సీసాలు, కర్రలతో విచక్షణారహితంగా గంటపాటు దాడి చేసి మూడు రోజులవుతున్నా అరెస్ట్ చేయకపోవడంపై నిరసన ర్యాలీ చేపట్టారు. పులివెందులలోని వెంకటేశ్వర ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. వారికి మద్దతుగా వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. కొత్త బస్టాండు సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ వైఎస్సాఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అక్కడ నుంచి పాత బస్టాండు మీదుగా పూలంగళ్ల సర్కిల్‌కు చేరుకొని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అదేవిధంగా ముద్దనూరు రోడ్డులోని పాత జూనియర్ కళాశాల వద్ద మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి ర్యాలీ ముగించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ర్యాలీ అనంతరం పులివెందుల పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని వైఎస్ఆర్ సీపీ నేతలు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, డీఎస్పీ హరినాథబాబు, సీఐ భాస్కర్లతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను టీడీపీ నాయకులు భయాందోళనకు గురిచేస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీకి చెందిన వారు దాడులు చేస్తే గిరిజనులపై కేసులు పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గిరిజనులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. -
నల్లబ్యాడ్జీలతో వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్ల ధర్నా
అనంతపురం : హిందుపురం కౌన్సిల్ సమావేశంలో చర్చ లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మంగళవారం ధర్నాకు దిగారు. గాంధీ విగ్రహం ఎదుట వారు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాగా కౌన్సిల్ సమావేశం ఈరోజు ఉదయం ప్రారంభం అయిన అయిదు నిమిషాలకే ముగిసింది. ఈ చర్యను వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు అభ్యంతరం తెలుపుతూ ఆందోళనకు దిగారు.