assassination attempt
-
మూడో రోజుకు చేరిన సుఖ్బీర్ ప్రాయశ్చిత్త దీక్ష
చండీగఢ్: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో జరిగిన హత్యాయత్నం నుంచి తృటిలో బయటపడిన పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్సింగ్ బాదల్ ప్రాయశ్చిత్త దీక్షను వరుసగా మూడో రోజు యథాతథంగా కొనసాగించారు. ఆయన గురువారం రూప్‌నగర్ జిల్లాలోని తఖ్త్ శ్రీకేస్‌గఢ్ సాహిబ్ గురుద్వారా బయట కాపలాదారుడిగా(సేవాదార్) విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జెడ్ ప్లస్ భద్రత కలిగిన సుఖ్బీర్సింగ్ ఉదయం 9 గంటలకు చక్రాల కురీ్చలో గురుద్వారాకు చేరుకున్నారు. కాపలాదారుడి దుస్తులు ధరించి, చేతిలో ఈటెతో విధుల్లో చేరారు. తర్వాత కొంతసేపు సిక్కు కీర్తనలు విన్నారు. ఇక్కడి వంటశాలలో పాత్రలు శుభ్రంచేశారు. సుఖ్బీర్ సింగ్‌తో ఆయన భార్య, ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్, కుమారుడు అనంత్బీర్ సింగ్ బాదల్, కుమార్తెలు హర్కీరత్కౌర్ బాదల్, గుర్లీన్ కౌర్ బాదల్ సైతం వంటశాలలో సేవలందించారు. 2007 నుంచి 2017 దాకా పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా సిక్కు అత్యున్నత సంస్థ అకల్ తఖ్త్ సుఖ్బీర్ సింగ్‌కు మతపరమైన శిక్ష విధించిన సంగతి తెలిసిందే. స్వర్ణ దేవాలయంలోపాటు మొత్తం ఐదు గురుద్వారాల్లో రెండు రోజుల చొప్పున పది రోజులపాటు సేవాదారుడిగా పనిచేయాలని అకల్ తఖ్త్ ఆదేశించింది. స్వర్ణ దేవాలయంలో రెండో రోజు బుధవారం ప్రాయశ్చిత్త దీక్షల ఉండగా సుఖ్బీర్ సింగ్‌పై హత్యాయత్నం జరిగింది. మాజీ ఉగ్రవాది నారాయన్ సింగ్ జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. -
విశాఖలోని సింగరాయకొండలో దారుణం
-
విశాఖలో దారుణం.. భార్యకు మత్తు మందు ఇచ్చి..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. భార్యకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి, ఆపై నిప్పంటించి భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మత్తులోకి జారుకున్న తర్వాత ఒంటిపై భర్త నిప్పు అంటించాడు. మంటలు అంటుకున్న కొద్దిసేపటికి బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. గ్యాస్‌స్టవ్ ప్రమాదమని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. చికిత్స పొందుతూ ఆమె కోలుకోవడంతో అసలు బండారం బయటపడింది. విశాఖలోని మురళీనగర్ సింగరాయ కొండపై నివసిస్తున్న వెంకటరమణ, కృష్ణవేణిలకు ఐదేళ్ల క్రితం పెళ్లయి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటరమణకు మద్యం వ్యసనంతో పాటు భారీగా అప్పులున్నాయి. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యను హత్య చేయాలని భావించిన వెంకటరమణ.. 16వ తేదీ రాత్రి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తెచ్చి భార్యకు ఇచ్చాడు. అనంతరం నిప్పంటించాడు. మత్తుమందు ప్రభావం నుంచి కోలుకున్నాక.. కృష్ణవేణి కేకలు వేయడంతో స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. -
సెటిల్మెంట్ అని పిలిపించి.. కారుతో తొక్కించి
‘దొంగలతో దోస్తీ’ ఆరోపణలపై పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయిన మేకల ఈశ్వర్‌పై గురువారం రాత్రి హత్యాయత్నం జరిగింది. వ్యవస్థీకృతంగా జేబు దొంగల ముఠాలు నడిపే ఈశ్వర్‌కు, ఆ ముఠాలకు చెందిన మరికొందరు నాయకుల మధ్య ఆధిపత్య పోరే దీనికి కారణమని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొన్నాళ్లుగా తమిళనాడులో ఉంటూ తెలంగాణ వ్యాప్తంగా సెల్‌ఫోన్ జేబు దొంగల ముఠాలు నిర్వహిస్తున్న ఇతడిని సెటిల్మెంట్ కోసమని పిలిచిన నలుగురు కీలక నిందితులు కారుతో ఢీ కొట్టారు. అతడి పైనుంచి రెండుసార్లు వాహనాన్ని నడపటంతో ఈశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. మీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని మందమల్లమ్మ చౌరస్తా వద్ద ఈ ఘటన జరగ్గా.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలిసింది. – సాక్షి, హైదరాబాద్క్రైమ్ వర్క్ చేస్తూ క్రిమినల్స్‌తో నెట్వర్క్ఆంధ్రప్రదేశ్కు చెందిన మేకల ఈశ్వర్ 2010లో కానిస్టేబుల్‌గా పోలీసు విభాగంలో అడుగుపెట్టాడు. ఎస్సార్‌నగర్, చిక్కడపల్లి, బేగంపేట పోలీసుస్టేషన్లతో పాటు టాస్క్‌ఫోర్స్‌లోనూ పని చేశాడు. మొదట్నుంచీ నేరాలకు సంబంధించిన విధులే నిర్వర్తించిన ఇతను.. అప్పట్లో చోరీ చేసిన ఫోన్లు ఖరీదు చేసే వాళ్లను బెదిరిస్తూ దందా మొదలెట్టాడు. తనకున్న పరిచయాలను వినియోగించుకుని చోరీకి గురైన ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు సేకరించేవాడు.వాటి ఆధారంగా అవి ప్రస్తుతం ఎవరు వాడుతున్నారో గుర్తించేవాడు. విషయం తెలియక సెకండ్ హ్యాండ్ మార్కెట్లలో చోరీ ఫోన్లు కొనుగోలు చేసి వాడుతున్న వారిని పిలిచి బెదిరించేవాడు. ఫోన్ తీసుకోవడంతో పాటు కేసు పేరుతో భయపెట్టి కనీసం రూ.25 వేలు వసూలు చేసేవాడు. రికవరీ చేసిన ఫోన్‌ను అమ్ముకుని సొమ్ము చేసుకునే వాడు. ఇలా మొదలైన ఈశ్వర్ దందా పెద్ద నెట్‌వర్క్‌గా మారింది.వసతులు, ‘జీతాలు’ ఇచ్చి నేరాలుచోరీ ఫోన్ల మార్కెట్‌పై పట్టు లభించడంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న స్నాచర్లు, దొంగలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఓ ప్రాంతానికి చెందిన వారిని మరోచోటుకు పంపేవాడు. అక్కడ వారికి అద్దె ఇంటిలో వసతి కల్పించేవాడు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం నాలుగు ఫోన్లు కొట్టేయాలనే టార్గెట్ పెట్టేవాడు. వీటిలో ఒక ఫోన్‌ను విలువను లెక్కించి ఆ మొత్తాన్ని జీతం కింద వారికి ఇచ్చేవాడు.ఇక ఈ ఫోన్లను విక్రయించడానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉన్న సెకండ్ హ్యాండ్ మార్కెట్లలోని వ్యాపారులతో సంబంధాలు పెట్టుకున్నాడు. వీరినుంచి ప్రతినెలా మామూళ్లు కూడా వసూలు చేసేవాడని తెలిసింది. మరోవైపు సెల్ఫోన్లతో పాటు బంగారు నగలనూ స్నాచింగ్ చేయించేవాడు. 2022లో నల్లగొండ పోలీసులు ఈ తరహా ఓ కేసులో ఈశ్వర్‌ను అరెస్టు చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు.తల్లిదండ్రులకు అప్పులిచ్చి పిల్లలతో దందాహైదరాబాద్లో ఫోన్ల దొంగతనం, విక్రయం దందా చేసే ముఠాలు ఎన్నో ఉన్నాయి. కొన్నాళ్లుగా వీళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో ప్రత్యేకంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. తల్లిదండ్రులకు భారీ మొత్తం అప్పు ఇవ్వడం ద్వారా వారి పిల్లలతో హైదరాబాద్ సహా దక్షిణాదిలోని ఇతర ప్రధాన నగరాల్లో దందా చేయిస్తున్నారు. వీరికి వసతి కల్పించడంతో పాటు ఆహారం, మద్యం సరఫరా చేయడమే కాకుండా ప్రతిరోజూ రూ.300 ఖర్చుల కోసం ఇస్తున్నారు.రద్దీ ప్రదేశాలు, బస్సులు, సభలు, సమావేశాల్లో సెల్ఫోన్ల చోరీ వీరి పని. ఈ ముఠాల్లో అప్పులు తీసుకున్న మహిళలు కూడా ఉన్నారు. వీరు తమ చిన్నారులతో కలిసి బంగారం, ఇతర దుకాణాలకు వెళ్లి, యజమానులు వర్కర్ల దృష్టి మళ్లించి చోరీలు చేస్తుంటారు. వీరు ప్రతిరోజూ నిర్దిష్ట సంఖ్యలో చోరీలు చేయాలనే షరతు ఉంది. కాగా చోరీ చేసిన సొత్తులో కొంత మొత్తం వారి అప్పులో అసలు, వడ్డీ జమ చేసుకుంటారు. ఇలా అప్పు తీరే వరకు వీరంతా ముఠా నాయకుల కోసం పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి నగరంలో పలు ముఠాలు ఉన్నట్లు తెలుస్తోంది.కక్ష కట్టి, సెటిల్మెంట్ అంటూ పిలిచి..ఇలాంటి కొన్ని ముఠాలపై ఈశ్వర్ గుత్తాధిపత్యం సాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నగరంలో మరే ఇతర ముఠాకు ‘పనివారు’ దొరకుండా చేస్తున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆధిపత్య పోరు పెరిగిపోగా ఎవరైనా అతికష్టమ్మీద వేరే ప్రాంతం నుంచి దొంగల్ని పట్టుకుని వస్తే, ఈశ్వర్ తనకున్న పాత పరిచయాల ద్వారా పోలీసులకు సమాచారం చేరవేస్తూ వాళ్లు అరెస్టు అయ్యేలా చేస్తున్నాడు. దీంతో కక్షకట్టిన నాలుగు ముఠాలకు చెందిన నాయకులు అతనిపై హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.గురువారం మందమల్లమ్మ చౌరస్తాలోని ఓ బార్‌కు అతన్ని పిలిచిన నలుగురు నిందితులు.. కొద్దిసేపు వాగ్వాదం తర్వాత తమ ప్రతిపాదనల్ని తిరస్కరించి, బెదిరించి వెళ్లిపోతున్న ఈశ్వర్‌పై కారుతో ఢీ కొట్టి హత్యాయత్నం చేసినట్లు తెలిసింది. అయితే కొందరు వ్యక్తులు చిట్టీల వ్యాపారంలో విభేదాల వల్లే ఈశ్వర్‌పై హత్యాయత్నం చేశామంటూ మీర్‌పేట పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలుస్తోంది. దీంతో రాచకొండ పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
శివకొండారెడ్డిపై హత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప నగర టీడీపీ అధ్యక్షుడు శివకొండారెడ్డిపై హత్యా యత్నం కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. పెద్దల ఒత్తిడితో పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారని శివకొండారెడ్డి అన్నారు. నాపై హత్యాయత్నం వెనుక లక్కిరెడ్డిపల్లికి చెందిన వ్యక్తి ఏ1గా ఉన్నారు. ఏ1 రవితేజ ఎవరికి సన్నిహితుడో, వీరవిధేయుడో అందరికీ తెలుసు అంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేస్తూ.. నిందితుడు ఆ కుటుంబానికి వీరవిధేయుడని శివకొండారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ల వద్దకు వెళ్తా.. వారే నాకు న్యాయం చేయాలని శివకొండారెడ్డి అన్నారు.కాగా, అధికార తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలకు విలువ లేకుండా పోయిందని కొందరు... కష్ట నష్టాలకు ఓర్చుకున్న వాళ్లకు దిక్కు దివానం లేకుండా పోయిందని ఇంకొందరు ఆవేదనలో ఉన్నారు. ఎమ్మెల్యే మనుషులం, మేము చెప్పిందే వేదమని నడిమంత్రపు హోదాతో మరికొందరు రెచ్చిపోతున్నారు. ఈక్రమంలో పరస్పర దాడులు తెరపైకి వస్తున్నాయి. ముద్దనూరు, కడప ఘటనలు అందులో భాగమేనని తెలుస్తోంది. సానపురెడ్డి శివకొండారెడ్డిపై హత్యాయత్నం ఘటన కూడా అందులో భాగమేనని తెలుగు తమ్ముళ్లు బాహాటంగా చెప్పుకు వస్తున్నారు. -
పన్నూ హత్యకు కుట్ర కేసులో ‘రా’ మాజీ అధికారిపై అమెరికా కోర్టులో అభియోగాలు
వాషింగ్టన్: ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్‌సింగ్ పన్నూను హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) మాజీ అధికారి వికాస్ యాదవ్‌పై అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. పన్నూను అంతం చేయడానికి జరిగిన కుట్రలో వికాస్ యాదవ్ పాత్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు గురువారం న్యూయార్క్ కోర్టులో అభియోగ పత్రాలు సమరి్పంచారు. ఆయనను సీసీ–1(సహ కుట్రదారుడిగా) నిర్ధారించారు. పన్నూను హత్య చేయడానికి కిరాయి మనుషులను నియమించడం, మనీ లాండరింగ్‌కు పాల్పడడం అనే అభియోగాలు మోపారు. ప్రస్తుతం వికాస్ యాదవ్ ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు. 39 ఏళ్ల వికాస్ యాదవ్ గతంలో భారతదేశ విదేశీ ఇంటెలిజెన్స్ సేవలు, ‘రా’ వ్యవహారాలను పర్యవేక్షించే కేబినెట్ సెక్రటేరియట్లో పనిచేశారు. పన్నూ హత్యకు కుట్ర కేసులో భారతీయుడు నిఖిల్ గుప్తాను అమెరికా పోలీసులు గత ఏడాది చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్టు చేశారు. నిఖిల్ గుప్తా ప్రస్తుతం అమెరికాలో జైలులో ఉన్నాడు. అమెరికా గడ్డపై పన్నూను హత్య చేయడానికి భారత ఏజెంట్లు కుట్ర పన్నారని, ఈ కుట్రను తాము భగ్నం చేశామని అమెరికా దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే, అమెరికా అధికారుల ఆరోపణలను భారత ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. పత్వంత్‌సింగ్ పన్నూ ఇండియాలోని పంజాబ్ రాష్ట్రంలో జని్మంచాడు. కెనడాకు వలస వెళ్లాడు. అక్కడి నుంచే భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతడికి కెనడాతోపా టు అమెరికా పౌరసత్వం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిజ్జర్ హత్య కేసులో కెనడాలోనూవాషింగ్టన్: మరోవైపు కెనడాలో జరిగిన ఖలిస్తాన్ ఉగ్రవాది హరిదీప్ సింగ్ నిజ్జర్ అలియాస్ నిజ్జర్ హత్యతోనూ వికాస్ యాదవ్ పేరును ముడిపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కెనడాలో 2023 జూన్ 18న నిజ్జర్ హత్య తర్వాత మృతదేహం తాలూకు రియల్–టైమ్ వీడియోను వికాస్ యాదవ్.. నిఖిల్ గుప్తాకు షేర్ చేశాడని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇదే సమాచారాన్ని అమెరికా ప్రభుత్వం కెనడాతో పంచుకొనే వీలుంది. దీన్నిబట్టి నిజ్జర్ హత్య కేసులో వికాస్ యాదవ్‌పై కెనడా ప్రభుత్వం కూడా అభియోగాలు నమోదు చేసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
పరువుచేటు పనులు!
అంతర్జాతీయంగా సంచలనం సృష్టించే హత్యలూ, హత్యాయత్నాలూ ఒక్కోసారి ఉలిక్కిపడేలా చేస్తాయి. వాటి వెనక ప్రభుత్వాల ప్రమేయం ఉన్నదన్న అనుమానాలు తలెత్తితే అవి మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. చాలా సందర్భాల్లో అవి దేశాలమధ్య చిచ్చు రేపుతాయి. ఇలాంటి ఆపరేషన్లను గుట్టుచప్పుడు కాకుండా చేయడంలో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఆరితేరింది. చేతికి నెత్తురంటకుండా, సాక్ష్యాధారాలేమీ మిగలకుండా ప్రత్యర్థులను మట్టుబెట్టడంలో ఆ సంస్థ తర్వాతే ఎవరినైనా చెప్పుకోవాలి. అలాంటి ఉదంతంలో ఇప్పుడు మన దేశం పేరు వినబడటం ఆశ్చర్య కరమే. అమెరికాలో స్థిరపడిన ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యాయత్నం కేసులో అమెరికాలో దాఖలైన తాజా నేరారోపణ పత్రం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి ఏడాదికాలంగా ఆ పంచాయతీ నడుస్తోంది. నేరుగా భారత్‌ను నిందించక పోయినా నిరుడు మే నెలలో దాఖలు చేసిన నేరారోపణ పత్రం తమ గడ్డపై తమ పౌరుడిని హత్య చేసేందుకు జరిగిన ప్రయత్నం వెనక ‘భారత ప్రభుత్వంలో పనిచేసే ఒక ఉద్యోగి ప్రమేయం ఉన్నద’ంటూ ఆరోపించింది. అప్పట్లో ఆ ఉద్యోగి పేరు వెల్లడించకుండా ‘సీసీ 1’గా మాత్రమే ప్రస్తావించింది. కానీ శుక్రవారం అమెరికా న్యాయశాఖ అతని పేరు వికాస్ యాదవ్ అనీ, భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో ఇంతక్రితం పనిచేశాడనీ వెల్లడించింది. వికాస్ యాదవ్ ప్రస్తుతం భారత ప్రభుత్వ ఉద్యోగి కాదని నేరారోపణ పత్రం చెప్పటం... భారత ప్రభుత్వం ఈ కేసులో తమకు సహకరిస్తున్నదని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అనటం ఉన్నంతలో ఊరట. తమ దేశంలో స్థిరపడిన ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నదని ఒకపక్క కెనడా ఆరోపిస్తున్న తరుణంలో అమెరికా సైతం ఇదే తరహా ఆరోపణ చేయటం గమనించదగ్గది. ఎన్నికల్లో సిక్కు ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రధాని ట్రూడో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసిన మన దేశానికి తాజా పరి ణామం ఇబ్బంది కలిగిస్తుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే గురుపత్వంత్ను హతమార్చ టానికి ఏమేం చేయాలో నిందితులు చర్చించుకున్న సందర్భంలోనే నిజ్జర్ హత్యను జయప్రదంగా పూర్తిచేయటం గురించిన ప్రస్తావన వచ్చింది. ఇలాంటి వ్యవహారాలు చక్కబెట్టే వారికి వేయి కళ్లుండాలి. తాము ఎవరిని సంప్రదిస్తున్నామోక్షుణ్ణంగా తెలిసివుండాలి. కానీ ఆ సమయంలో రా సీనియర్ అధికారిగా ఉన్న వికాస్ యాదవ్ మాదకద్రవ్య ముఠాలతో సంబంధాలుండే నిఖిల్ గుప్తాకు గురుపత్వంత్ను అంతంచేసే బాధ్యత అప్పగించటం, గుప్తా దాన్ని కాస్తా కిరాయి హంతకుడనుకున్న మరో వ్యక్తికి ఇవ్వటంతో కథ అడ్డం తిరిగింది. నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్లో దొరికిపోవటం, అతన్ని ఆ దేశం అమెరికాకు అప్పగించటం పర్యవసానంగా మొత్తం పథకం బట్టబయలైంది. కిరాయి హంతకుడనుకున్న వ్యక్తి కాస్తా అమెరికా మాదకద్రవ్య నిరోధక విభాగం ఏజెంటు. ఆ సంగతి తెలియక హత్య కోసం అతనితో లక్ష డాలర్లకు కాంట్రాక్టు కుదుర్చుకోవటం, అందులో 15 వేల డాలర్లు చెల్లించటం నిఖిల్ గుప్తాతోపాటు వికాస్ మెడకు చుట్టుకుంది. అది మన దేశ ప్రతిష్ఠకు కూడా మచ్చ తెచ్చింది. వికాస్ సాధారణ అధికారి కాదు. రా సంస్థకు ముందు ఆయన సీఆర్పీఎఫ్లో పనిచేశాడు. వికాస్‌ను సర్వీసునుంచి తొలగించి అతనికోసం గాలిస్తున్నామని మన ప్రభుత్వం ఇచ్చిన వివరణకు అమెరికా సంతృప్తి చెందింది. ‘రా’లో ఉన్నతాధికారులకు చెప్పకుండా వికాస్ యాదవ్ ఇలాంటి పెడధోరణులకు పాల్పడ్డాడని మన ప్రభుత్వం చెబుతోంది. విదేశాల్లో గూఢచర్యం ఆషామాషీ కాదు. అలాంటి పనిలో నిమగ్నమైవుండేవారు ఉన్నతాధి కారులకు తమ కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు వర్తమానం అందిస్తే వేరే విషయం. చెప్పినా చెప్ప కున్నా అంతా సవ్యంగా జరిగితే రివార్డులు దక్కవచ్చేమో. కానీ వికటిస్తే ఆ అధికారితోపాటు దేశం పరువు కూడా పోతుంది. గురుపత్వంత్ ఖలిస్తాన్ వేర్పాటువాదే కావొచ్చు. ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తే అయివుండొచ్చు. మన దేశంలో కేసులుంటే తమకు అప్పగించాలని అమె రికాను కోరాలి. ఆ దేశ పౌరుడిగా అక్కడే స్థిరపడిన వ్యక్తిపై అంతకుమించి ఏదో సాధించాలను కోవటం తెలివితక్కువతనం. అసలు ఒక వ్యక్తిని భౌతికంగా లేకుండా చేసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోతుందా? అతని సహచరులు భయకంపితులై ఉద్యమానికి దూరమవుతారా? ఏం సాధిద్దా మని వికాస్ ఇలాంటి పనికి సిద్ధపడ్డాడో తేల్చటం అవసరం. వికాస్ యాదవ్ విషయంలో ఇంత పట్టుదలగా పనిచేస్తున్న అమెరికా చరిత్ర కూడా తక్కువేమీ కాదు. 2003 నాటి రవీందర్ సింగ్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. ‘రా’లో సంయుక్త కార్య దర్శిగా ఉన్న రవీందర్ అమెరికా గూఢచార సంస్థ సీఐఏకు డబుల్ ఏజెంటుగా పనిచేసి పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ వగైరా దేశాల్లో రా కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అందజేశాడు. తనసంగతి బయటపడిందని గ్రహించగానే కుటుంబంతో సహా మాయమై అమెరికాలో తేలాడు. వారికి అక్కడ మారు పేర్లతో పాస్‌పోర్టులు కూడా మంజూరయ్యాయి. విచిత్రంగా మన దేశం అతన్ని అప్పగించాలని పట్టుబట్టలేదు. ఉద్యోగంనుంచి తొలగించి అధికార రహస్యాల చట్టం కింద కేసు పెట్టడంతో సరిపెట్టింది. 2016లో ఒక రోడ్డు ప్రమాదంలో రవీందర్ మరణించాడని అంటున్నా దాన్ని ధ్రువీకరించే సమాచారం మన ప్రభుత్వం దగ్గరలేదు. మొత్తానికి గూఢచర్యం వికటిస్తే ఏమవుతుందో వికాస్ యాదవ్ ఉదంతం తెలియజెబుతోంది. -
ట్రంప్‌పై హత్యాయత్నం: నిందితుడి లేఖలో ఏముందంటే..
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడి అయ్యాయి. ట్రంప్‌ను హత్యచేస్తానని కొన్ని నెలల ముందే నిందితుడు ర్యాన్ రౌత్.. లేఖ రాసినట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు. ట్రంప్‌ను హత్య చేయాడానికి గల ఉద్దేశాలను ఆ లేఖలో నిందితుడు రాశాడు. ఇక..దాడికి ముందు మందుగుండు సామగ్రి, ఒక మెటల్ పైపు, ఇతర నిర్మాణ సామగ్రి, నాలుగు ఫోన్లతో ఉన్న బాక్స్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఇంటిముందు నిందితుడు పడేశాడని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన వెలుగులోకి వచ్చాక.. ఆ గుర్తు తెలియని వ్యక్తి బాక్స్‌ను తెరవగా అందులో ఈ లేఖ బయటపడినట్లు తెలిపారు. ఆ లేఖలో.. ‘‘ఇది డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాప్రయత్నం. కానీ విఫలం చేశాను. నేను నా వంతు ప్రయత్నం చేశాను. నేను సేకరించిన అన్ని ఇందులో ఉన్నాయి. ఇక.. ట్రంప్‌ను అంతం చేయటం మీ ఇష్టం. ట్రంప్ హత్య పూర్తి చేసినవారికి 150,000 డాలర్లు అందిస్తా’’ అని రాసినట్లు తెలిపారు. ఇక.. ఇరాన్‌తో చిన్నపిల్లల మాదిరిగానే ట్రంప్ సంబంధాలను ముగించారని ఆ లేఖలో పేర్కొనటం గమనార్హం.సెప్టెంబర్ 15న ట్రంప్ వెస్ట్ పామ్ బీచ్ కోర్స్‌లో గోల్ఫ్ ఆడుతున్నప్పుడు సమయంలో నిందితుడు ర్యాన్ రౌత్ అక్కడే సంచరిస్తూ.. హత్యాయత్నానికి ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ట్రంప్‌ను కాపాడిన విషయం తెలిసిందే. 58 ఏళ్ల నిందితుడిపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో నిందితుడు విచారణ ఎదుర్కొనున్నాడు. -
ట్రంప్ భద్రతలో వైఫల్యం
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జూలైలో హత్యాయత్నం జరిగిన ర్యాలీలో భద్రతా వైఫల్యాలను యూఎస్ సీక్రెట్ సర్వీస్ అంగీకరించింది. తమ సమీక్షలో వెల్లడైన వైఫల్యాలను శుక్రవారం వివరించింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ నిర్వహించిన ఔట్‌డోర్ కార్యక్రమంలో షూటర్ థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరపడం, కుడి చెవికి గాయంతో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం తెలిసిందే. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఈ ర్యాలీలో కాల్పుల్లో ఇద్దరు గాయపడగా, అగి్నమాపక సిబ్బంది మరణించారు. కాల్పులు జరిపిన క్రూక్స్‌ను సీక్రెట్ సరీ్వస్ సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటన తరువాత సీక్రెట్ సరీ్వస్ డైరెక్టర్ కింబర్లీ చీట్లే రాజీనామా చేశారు. సీక్రెట్ సరీ్వస్ ఏజెంట్లు సెలవులో వెళ్లారు. దీనిపై సమీక్ష నిర్వహించిన సీక్రెట్ సర్వీస్ ప్రణాళిక, దాని అమలులో లోపాలను గుర్తించిందని తాత్కాలిక డైరెక్టర్ రోనాల్డ్ రోవ్ జూనియర్ తెలిపారు. అడ్వాన్స్ టీంలోని కొందరు చాలా శ్రద్ధగా వ్యవహరించగా, మరికొందరి అలసత్వం భద్రతా ప్రోటోకాల్స్ ఉల్లంఘనకు దారితీసిందన్నారు. హెచ్చరికలు లేవు.. స్థానిక యంత్రాంగంతో పేలవమైన కమ్యూనికేషన్, మొబైల్ పరికరాలపై అతిగా ఆధారపడటం, సమాచారం పక్కదారి పట్టడం వంటి సమస్యలను గుర్తించామని రోవ్ తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం సుమారు 18:10 గంటలకు కౌంటర్ స్నైపర్ రెస్పాన్స్ ఏజెంట్‌కు సీక్రెట్ సరీ్వస్ సెక్యూరిటీ రూమ్ కాల్ చేసి.. ఏజీఆర్ భవనం పైకప్పుపై ఒక వ్యక్తి ఉన్నట్లు తెలిపింది. అయితే సీక్రెట్ సరీ్వస్ రేడియో నెట్వర్క్ ద్వారా ఆ కీలక సమాచారం ప్రసారం కాలేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు దానికి ప్రతిస్పందించేందుకు కాక, ఏదీ జరగకుండా నివారించేందుకు సీక్రెట్ సర్వీస్‌కు అదనపు నిధులు, సిబ్బంది, పరికరాలు అవసరం... ట్రంప్‌పై హత్యాయత్నాన్ని దర్యాప్తు చేస్తున్న కాంగ్రెషనల్ టాస్‌్కఫోర్స్ తెలిపింది. ఉద్యోగులను జవాబుదారీ చేయడం విషయంలో రోవ్‌ను అనుసరించాలని, స్వతంత్ర దర్యాప్తునకు సహకరించాలని, సీక్రెట్ సరీ్వస్‌లో అలసత్వానికి స్థానం ఉండకూడదని సూచించింది. అధ్యక్షుడితో సమాన భద్రత.. గత వారాంతంలో ఫ్లోరిడాలోని వెస్ట్‌పామ్ బీచ్‌లోని గోల్ఫ్‌కోర్స్‌లో ట్రంప్‌పై రెండోసారి హత్యాయత్నం జరగడంతో భద్రతకు డిమాండ్ పెరిగింది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షులతో సమానంగా అధ్యక్ష అభ్యర్థులకు సీక్రెట్ సరీ్వస్ భద్రతను పెంచే బిల్లును అమెరికా ప్రతినిధుల సభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. సెనేట్‌లో ఓటింగ్, అధ్యక్షుడు జో బైడెన్ సంతకం పూర్తయితే ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. అయితే ట్రంప్‌కు ఇప్పుడు అధ్యక్షుడితో సమానమైన రక్షణ కలి్పస్తున్నామని రోవ్ చెప్పారు. సీక్రెట్ సర్వీస్ పనిచేసే వాతావరణానికి ముప్పు విపరీతంగా ఉందని ఆదివారం జరిగిన ఘటన రుజువు చేస్తోందని రోవ్ అన్నారు. ఇక ఫ్లోరిడాలో గన్‌మెన్ ట్రంప్‌వైపు చూడను కూడా చూడలేదని, ముందే అతన్ని అరెస్టు చేశామని తెలిపారు. -
ట్రంప్‌పై హత్యాయత్నం!.. మస్క్ అనుమానం
ఆస్టిన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ నామినీ డొనాల్ట్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరిగిందన్న వార్త కలకలం రేపుతోంది. ట్రంప్‌కు అతి సమీపంలోనే కాల్పులు జరిగాయని, అయితే ఆయన క్షేమంగా బయటపడ్డారన్నది, అనుమానితుడ్ని భద్రతా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయన్నది ఆ కథనాల సారాంశం. ఇక.. ఈ ఘటనను అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు. అయితే..ట్రంప్ మద్దతుదారుడిగా పేరున్న ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారాన్ని రేపింది. ‘‘డొనాల్డ్ ట్రంప్‌ను వాళ్లు ఎందుకు చంపాలనుకుంటున్నారు?’’ అని ఓ వ్యక్తి ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేయగా దానికి మస్క్ స్పందించాడు. బైడెన్, కమలపై మాత్రం ఎందుకనో ఎవరూ హత్యాయత్నం చేయడం లేదు అంటూ ట్వీట్ చేశారాయన.And no one is even trying to assassinate Biden/Kamala 🤔 https://t.co/ANQJj4hNgW— Elon Musk (@elonmusk) September 16, 2024ఆ అనుమానాలకు కొనసాగింపుగా.. ఆయన మరిన్ని ట్వీట్లు చేశారు. తాను లేవనెత్తిన అంశాన్ని కనీసం ఎవరూ ప్రస్తావించడం లేదంటూ మరో ట్వీట్ చేశారు. ఈలోపు.. ట్రంప్ వ్యవస్థను భయపెడుతున్నారని, అందుకే ఆ వ్యవస్థ ఆయన్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఆ వ్యవస్థ బైడెన్, కమల అంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. అయితే మస్క్ దానికి నూటికి నూరు శాతం అంటూ రిప్లై ఇచ్చారు. మస్క్ ట్వీట్‌పై డెమోక్రటిక్ మద్దతుదారులతో పాటు రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఇదీ చదవండి: చంపినా వెనక్కి తగ్గను: ట్రంప్ -
మదురో హత్యకు సీఐఏ కుట్ర!
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో హత్యకు అమెరికా నిఘా సంస్థ సీఐఏ కుట్ర పన్నిందా? అవునని వెనిజులా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో ఆరోపించారు. తమ దేశాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో ఒక యూఎస్ నేవీ సీల్ ఆఫీసర్‌తో సహా ఆరుగురు విదేశీయులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వారిలో అమెరికన్లు ఇద్దరు స్పెయిన్, ఒక చెక్ పౌరుడు ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా 400 అమెరికా రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కుట్రలో సీఐఏతో పాటు స్పెయిన్ జాతీయ నిఘా విభాగం కూడా పాలుపంచుకుందని కాబెల్లో ఆరోపించారు. వీటిని అమెరికా విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. మదురోను గద్దె దించే కుట్రలో తమ ప్రమేయముందన్న వాదనలు పూర్తిగా అవాస్తవమని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి ఒకరన్నారు. వెనిజులా రాజకీయ సంక్షోభానికి ప్రజాస్వామ్య పరిష్కారం కోసం అమెరికా మద్దతిస్తూనే ఉంటుందన్నారు. దీనిపై అదనపు సమాచారం కోరుతున్నట్లు తెలిపారు. తాము కూడా దీనిపై వెనిజులాను సమాచారం అడుగుతున్నట్లు స్పెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది. మదురో ఇటీవలే అధ్యక్ష ఎన్నికల్లో వివాదాస్పద రీతిలో గెలవడం తెలిసిందే. ఆ విజయాన్ని గుర్తించడానికి వెనిజులా ప్రతిపక్షంతో పాటు అమెరికా కూడా నిరాకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. – కారాకస్ -
ట్రంప్‌కు భద్రత కల్పించడంలో విఫలమయ్యాం
వాషింగ్టన్: పెన్సిల్వేనియాలో జూలై 13వ తేదీన ఎన్నికల ర్యాలీ సమయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన తమ వైఫల్యమేనని అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం పేర్కొంది. ఆయనకు భద్రత కల్పించడంలో వైఫల్యానికి తమదే బాధ్యతని తెలిపింది. బట్లర్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న ట్రంప్‌పై ఓ యువకుడు కాల్పులకు పాల్పడటం తెల్సిందే. ఆ ఘటన నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఒక బుల్లెట్ మిల్లీమీటర్ దూరం నుంచి దూసుకెళ్లగా, మరో బుల్లెట్ ఆయన చెవిని గాయపర్చింది. అప్పటి ఘటనకు బాధ్యత వహిస్తూ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చియాటిల్ రాజీనామా చేయగా, ఆమె స్థానంలో రొనాల్డ్ రోవె తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. -
అమెరికా రాజకీయంలో హింసాపర్వం
అమెరికా రాజకీయ జీవితంలో హింస ఒక భాగమైందన్నది వాస్తవం. తుపాకుల లభ్యత, వాటి యాజమాన్యంపై నియంత్రణలను సడలించారు.ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన కోల్ట్ ఏఆర్–15 వంటి ఆయుధాలను నిషేధించే ప్రయత్నం పదేళ్లే కొనసాగింది. ఇది కోర్టులో పదేపదే సవాళ్లను ఎదుర్కొంది. ఎక్కువగా ఇటువంటి ఆయుధాలతోనే సామూహిక కాల్పులు జరుపుతారు. 2023లో, 604 కాల్పులు జరగగా 754 మంది మరణించారు. ఇక ట్రంప్ మీద జరిగిన హత్యాయత్నం ఆయనకు రాజకీయంగా లాభిస్తుందనేది సుస్పష్టం. అలాగే ట్రంప్ వాచాలత్వం పెను మంటలు రగిలించేలా ఉందన్నదీ రహస్యం కాదు. ఆయన ఎలా వ్యవహరిస్తారనే దానిపై ప్రస్తుత పరిస్థితి చాలావరకు ఆధారపడి ఉంటుంది.అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి సంబంధించిన రాజకీయ పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అవి ఆయనకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయి. తనపై జరిగిన దాడి పట్ల ట్రంప్ సహజమైన, పోరాట ప్రతిస్పందనలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఆయనను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు చుట్టుముట్టినప్పుడు, తన ముఖం మీద రక్తపు చారలతో, తన కుడి పిడికిలిని పైకెత్తి, ‘ఫైట్, ఫైట్, ఫైట్’(పోరాడు) అంటూ గర్జించారు. రక్తసిక్తమైన, ఆగ్రహోదగ్రుడైన ట్రంప్ పిడికిలి బిగించి ఉండగా, ఆయన వెనుక ఒక అమెరికన్ జెండా రెపరెపలాడుతున్న చిత్రాలు వైరల్‌గా మారాయి. రెండు వారాల క్రితం అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన చర్చలో జో బైడెన్ ప్రదర్శన, సమర్థ వంతమైన ప్రచారాన్ని నిర్వహించగల ఆయన సామర్థ్యం వల్ల అధ్యక్ష పోటీ ఇప్పటికే గందరగోళంలో పడింది.తనపై ఉన్న కేసుల కారణంగా తనను తాను అమర వీరుడు గానూ, హింసకు గురైన వ్యక్తిగానూ ప్రదర్శించుకోవడం ట్రంప్ విధానం. కాల్పుల ద్వారా మృత్యువుకు సమీపంగా వెళ్లడం అనేది ఆయనకు అమరత్వ భావనను ఆపాదిస్తుంది. అధ్యక్షుల చర్చలో పరాజయం తరువాత డెమోక్రాటిక్ అభ్యర్థిగా బైడెన్‌ను తొలగించా లనే ప్రచారంపై ట్రంప్ మీద హత్యాయత్నం తప్పక ప్రభావం చూపు తుంది. ట్రంప్ వర్గానికి అంతకంటే కావాల్సింది లేదు.ట్రంప్‌పై కాల్పుల ఘటన బైడెన్ ప్రచారాన్ని క్లిష్టతరం చేస్తుంది. ఇప్పుడు నేరుగా ట్రంప్‌పై దృష్టి సారిస్తానని అమెరికా అధ్యక్షుడు గత వారంలో అన్నారు. ట్రంప్‌ను ఓడించడానికి తానే ఉత్తమ అభ్యర్థిగా ఉన్నానని ఆయన అభిప్రాయం. ‘లక్ష్యానికి సంబంధించిన కేంద్ర స్థానంలో ట్రంప్‌ను ఉంచే సమయం వచ్చింది’ అన్న బైడెన్ మాటల్ని, తమ అధ్యక్ష అభ్యర్థిపై హింసకు పిలుపుగా ఇప్పుడు కొంతమంది రిపబ్లికన్లు ఆపాదిస్తున్నారు. ఇది ఒక విడి ఘటన కాదనీ, ట్రంప్ ‘ఏ రకంగానైనా అడ్డుకోవలసిన నిరంకుశ ఫాసిస్ట్’ అనే డెమోక్రాటిక్ పార్టీ వాచాలత్వపు అనివార్య పరిణామమనీ రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ పోస్ట్ చేశారు.అమెరికా రాజకీయ జీవితంలో హింస ఒక భాగమైందన్నది వాస్తవం. తుపాకుల లభ్యత, వాటి యాజమాన్యంపై నియంత్రణ లను సడలించడం వంటి నిర్ణయాలతో కోర్టులేమీ మేలు చేయలేదు. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన కోల్ట్ ఏఆర్–15 వంటి దాడి ఆయుధాలను నిషేధించే ప్రయత్నం కేవలం పదేళ్లపాటు కొనసాగింది. ఇది కోర్టులో పదేపదే సవాళ్లను ఎదుర్కొంది. ప్రస్తుతం, కొన్ని రాష్ట్రాలు తమ సొంత చట్టాల ద్వారా అటువంటి ఆయుధాలను నిషేధించాయి. కాల్పుల ఘటన జరిగిన పెన్సిల్వే నియా వాటిలో లేదు. ఎక్కువగా ఇటువంటి ఆయుధాలతోనే సామూహిక కాల్పులు జరుపుతారు. జూలైలో ఇప్పటికే మరొక కాల్పుల ఘటన, అయిదు మంది మరణాలకు దారితీసింది. 2023లో, 604 కాల్పులు జరగగా 754 మంది మరణించారు, దాదాపు 2,500 మంది గాయపడ్డారు. అమెరికన్ సుప్రీంకోర్ట్ సహాయకారిగా లేదని చెప్పడం చిన్న మాటే అవుతుంది.బైడెన్ గెలుపొందిన ఎన్నికల ఫలితాలను ట్రంప్ మద్దతుదారులు 2021 జనవరి 6న తారుమారు చేయడానికి ప్రయత్నించిన కాపిటల్ అల్లర్ల నుండి, అమెరికా ఎన్నికల ప్రక్రియ హింసకు దారితీసింది. తిరుగుబాటును అణిచివేసేందుకు ముందు రేగిన అల్లకల్లోలంలో తొమ్మిది మంది మరణించారు. దీనివల్లనే ట్రంప్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత అమెరికన్ రాజకీయాలు లోతుగా విభజనకు గుర య్యాయి. ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ పోల్ ప్రకారం, ప్రతి రాజకీయ పక్షంలోనూ దాదాపు మూడింట రెండు వంతుల మంది... ఇతర పార్టీలలోని వారు అనైతికులనీ, నిజాయితీ లేనివారనీ, సంకు చిత మనస్తత్వం గలవారనీ నమ్ముతున్నారు.ట్రంప్ వాచాలత్వం పెను మంటలు రగిలించేలా ఉందన్నది రహస్యం కాదు. తాను వచ్చే నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే ‘రక్తపాతం’ ఉంటుందని మార్చ్ నెలలో ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. తరువాత ఒక ర్యాలీలో, ‘ఇప్పుడు నేను ఎన్నిక కాకపోతే... అది దేశానికి రక్తపాత కారకం అవుతుంది’ అని పునరావృతం చేశారు. 2023 మార్చిలో, ట్రంప్ దోషిగా నిర్ధారించబడిన కేసులో మాన్ హట్టన్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది తనపై అభియోగాలు మోపినట్లయితే ‘సంభావ్య మరణం, విధ్వంసం’ జరగొచ్చని మాజీ అధ్యక్షుడు హెచ్చరించారు. తనకు అన్యాయం జరిగితే ‘వీధుల్లో అల్లర్లు జరుగు తాయి’, ‘దేశంలో అల్లర్లు జరుగుతాయి’ అని బెదిరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన అనుచరులు మరోవైపున వలసదారులు, విదేశీయులు, శ్వేతజాతీయేతర జాతుల ప్రజలపై హింస గురించి మాట్లాడారు. నిజానికి, వ్యాపార లావాదేవీల్లో 34 నేరాలకు ట్రంప్ పాల్పడ్డారని మే నెలలో న్యాయస్థానం ఆయనను దోషిగా ప్రకటించిన తర్వాత, ట్రంప్ అనుకూల వెబ్సైట్లు అల్లర్లు, విప్లవం, హింసాత్మక ప్రతీకారం అనే పిలుపులతో నిండిపోయాయి.ఇటీవలి సంవత్సరాలలోని హింసలో రాజకీయ నమూనా ఉంది. 2017లో, బేస్‌బాల్ గేమ్‌లో రిపబ్లికన్ హౌస్ మెజారిటీ విప్ అయిన స్టీవ్ స్కలైస్ మీద రిపబ్లికన్ వ్యతిరేక గన్ మ్యాన్ కాల్పులు జరిపాడు (ఆ గన్‌మ్యాన్‌ను అప్పుడే కాల్చి చంపారు). 2018లో, ఫ్లోరిడాకుచెందిన ఒక వ్యక్తి నాటి అధ్యక్షుడు ట్రంప్ విమర్శకులకు పైపు బాంబు లను మెయిల్ చేశాడు. అతడు లక్ష్యంగా చేసుకున్నవారిలో బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, కమలా హారిస్ ఉన్నారు. 2020 ఎన్నికలకు ముందు, మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మెర్ను కిడ్నాప్ చేసి, రాజ ద్రోహ నేరం కింద ఆమెను ‘విచారణ’లో నిలబెట్టడానికి ఆరు గురు వ్యక్తులు కుట్ర పన్నారు. 2022లో, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీని లక్ష్యంగా చేసుకున్నారు; దాడిలో ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడు పెలోసీని బందీగా తీసుకోవాలని పథకం వేశాడు.ఈ పరిస్థితులలో, సగటు అమెరికన్ నిరుత్సాహానికీ, నిరాశకూ గురవుతాడు. రెండు పార్టీలలోని అతివాద శక్తులు అధికారం చేజిక్కించుకుని ఉన్నాయనీ, గతంలో అమెరికన్ రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన ద్వైపాక్షికతకు పెద్దగా చోటు లేకుండా చేశాయనీ సగటు అమెరికన్లు భావిస్తున్నారు.రాబోయే రోజులూ, వారాల్లో బైడెన్ చర్చ వైఫల్యం, దానిపై పొరలుగా, ట్రంప్‌పై హత్యాయత్నం వంటి ఇటీవలి సంఘటనలకు చెందిన పరిణామాల పెరుగుదలను మనం చూస్తాం. చాలామంది సరైన ఆలోచనాపరులు ట్రంప్‌పై కాల్పుల దాడి కలిగించిన షాక్ ప్రభావం ఎంతో కొంత ప్రశాంతతను తెస్తుందని ఆశిస్తున్నప్పటికీ, అలా జరుగుతుందనడానికి ఎటువంటి హామీ లేదు. రష్యన్లు, చైనీయులు తమ వంతు పాత్రను జోడించడంతో ఇప్పటికే తప్పుడు సమాచారం, అతిశయోక్తి, తీవ్రవాదం, జాత్యహంకారం, విభజన, అపనమ్మకం లాంటివి సైబర్ ప్రపంచంలో చెడతిరుగుతున్నాయి.ట్రంప్ ఎలా వ్యవహరిస్తారనే దానిపై ప్రస్తుత పరిస్థితి చాలావరకు ఆధారపడి ఉంటుంది. తనపై హత్యాయత్నాన్ని ఆయన డెమో క్రాట్లపై దాడి చేయడానికి, విభజనలను మరింతగా పెంచడానికి ఉపయోగించవచ్చు లేదా నైతికంగా అత్యున్నత మార్గాన్ని చేపట్టి, పక్షపాత చీలికలను నయం చేయడానికి ఎంచుకోవచ్చు. కానీ ఫిర్యా దులు, ప్రతీకారం చాలాకాలంగా ట్రంప్ ఇతివృతాలుగా ఉన్నాయి. ఆయన తక్షణ ప్రతిస్పందన నెమ్మదిగానూ, తెలివిగానూ ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ట్రంప్ ఏ దిశలో వెళ్లగలరనే దానిపై అంచనాలు ఊహకందడం లేదు.- వ్యాసకర్త న్యూఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్లోడిస్టింగ్విష్డ్ ఫెలో (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- మనోజ్ జోషి -
Donald Trump: దేవుడు నా వైపే.. గెలుపు నాదే
మిల్వాకీ: హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న అమెరికా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(78) సమరోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. భగవంతుడు తనవైపు ఉండడం వల్లే పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని చెప్పారు. భగవంతుడి దయతోనే మళ్లీ జనం ముందుకు వచ్చానని పేర్కొన్నారు. మరో నాలుగు నెలల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. హత్యాయత్నం ఘటన తర్వాత తొలిసారిగా మిల్వాకీలో గురువారం రాత్రి జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో ట్రంప్ భావోద్వేగంతో ప్రసంగించారు. రిపబ్లికన్ అభ్యరి్థగా తన నామినేషన్‌ను లాంఛనంగా ఆమోదించారు. తూటాల దాడి జరిగినా తన సంకల్పం చెక్కుచెదరలేదని, అమెరికా ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దేశాన్ని కాపాడాలన్న నా తపనను ఏ ప్రమాదం, ఏ అవరోధం అడ్డుకోలేవని తేలి్చచెప్పారు. హత్యాయత్నం తర్వాత తనపై ప్రేమాభిమానాలు కురిపించి, మద్దతు ప్రకటించిన ప్రజలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆత్మవిశ్వాసం, ఆశ, బలం అనే సందేశాన్ని మోసుకొని ఈరోజు అమెరికన్ల ముందుకు సగర్వంగా వచ్చానని అన్నారు. పార్టీ సదస్సులో ట్రంప్ ఇంకా ఏం మాట్లాడారంటే... నూతన యుగానికి ఆరంభం ‘‘మరో నాలుగు నెలల్లో మనం అద్భుతమైన విజయం సొంతం చేసుకోబోతున్నాం. అమెరికా చరిత్రలో నాలుగు అతిగొప్ప సంవత్సరాలకు శ్రీకారం చుట్టబోతున్నాం. మతం, రంగు, జాతితో సంబంధం లేకుండా ప్రజలందరికీ భద్రత, సౌభాగ్యం, స్వేచ్ఛ కలి్పంచే నూతన యుగాన్ని మనమంతా కలిసికట్టుగా ఆరంభిద్దాం. మన సమాజంలో ప్రజల మధ్య అడ్డుగోలకు తావు లేకుండా చేద్దాం. అమెరికన్లుగా మనది ఒకేబాట, ఒకేమాట. మనం ఐక్యమత్యంగా ఉండాలి. అందరం కలిసి పైకి ఎదగాలి. కలిసి ఉండలేకపోతే నష్టపోతాం. సగం అమెరికాకు కాదు, మొత్తం అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు బరిలో నిల్చున్నా. మనం ఒకే దేశం బిడ్డలం నాపై హత్యాయత్నం జరిగిన సంగతి అందరికీ తెలుసు. అసలేం జరిగిందని చాలామంది అడుగుతున్నారు. నా శరీరం నుంచి అంగుళంలో మూడోవంతు దూరంలో తుపాకీ తూటా దూసుకెళ్లింది. నా తల రక్తంతో తడిసిపోయింది. దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డా. ఈ విషయం మరోసారి నేను పంచుకోలేను. ఎందుకంటే అది చాలా బాధాకరమైన అనుభవం. మాటల్లో చెప్పలేనిది. నాపై క్రూరమైన దాడి జరిగిన తర్వాత మన ఐక్యత మరింత పెరిగింది. మన సంకల్పం, ఉద్దేశం ఏమాత్రం మారలేదు. అమెరికాను మరోసారి గెలిపించాలి. అమెరికాను మళ్లీ సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన గొప్పదేశంగా మార్చాలి. మనం ఒకే దేశం బిడ్డలం. రాజకీయపరమైన అంశాలు మన మధ్య విభజన రేఖలు గీయకూడదు.ఈ ఎన్నికలు అత్యంత కీలకం యావత్తూ దేశానికి ఒక దార్శనికతను నిర్దేశించడానికి ఇక్కడికి వచ్చా. ఈ సందర్భంగా దేశంలో ప్రతి పౌరుడికీ స్నేహ హస్తం అందిస్తున్నా. వారికి విధేయత ప్రకటిస్తున్నా. ప్రపంచం ఎన్నడూ చూడని విధంగా అమెరికాను నూతన శిఖరాల వైపు నడిపిద్దాం. నా నాయకత్వంలో అమెరికా మళ్లీ గౌరవం పొందుతున్న విశ్వాసం ఉంది. మన బల సంపన్నతను ఏ దేశమూ ప్రశ్నించలేదు. మన శక్తి సామర్థ్యాలను ఏ శత్రువూ అనుమానించలేరు. మన సరిహద్దులు భద్రంగా ఉంటాయి. మన ఆర్థిక వ్యవస్థ ఉజ్వలంగా మారుతుంది. మన భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవాలంటే విఫలమైన నాయకత్వం నుంచి దేశాన్ని తొలుత రక్షించుకోవాలి. అమెరికా చరిత్రలో ఈ ఎన్నికలు అత్యంత కీలకం. శత్రుదుర్భేద్యంగా మారుస్తాఅక్రమ వలసలు అమెరికాకు పెద్ద సమస్యగా మారాయి. దక్షిణ సరిహద్దు నుంచి పోటెత్తుతున్న వలసలు, చొరబాట్లు దేశమంతటా కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అక్రమ వలసల కారణంగా నేరాలు, పేదరికం, వ్యాధులు, విధ్వంసం పెరుగుతున్నాయి. ప్రపంచమంతటా ఇలాంటి వలసల సంక్షోభం కనిపిస్తోంది. మరోవైపు యూరప్, మధ్యప్రాచ్యంలో యుద్ధాలు కొనసాగుతున్నాయి. తైవాన్, కొరియా, ఫిలిప్పైన్స్‌లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. కేవలం ఆసియా ఖండమే కాదు, మొత్తం భూగోళం నేడు మూడో ప్రపంచ యుద్ధం అనే అంచుపై ఉందని చెప్పక తప్పదు. ఈ పరిస్థితి మారాలన్నదే నా ఆశ. తైవాన్ను చైనా చుట్టుముడుతోంది. అమెరికా సమీపంలో రష్యా యుద్ధ నౌకలు, అణు జలాంతర్గాములు చెక్కర్లు కొడుతున్నారు. ఈ విషయాలు ప్రస్తావించేందుకు మీడియా ఇష్టపడడం లేదు. నేను అధికారం చేపట్టిన తర్వాత మన భూభాగాలను శత్రు దుర్భేద్యంగా మారుస్తా.మార్పునకు సమయమిదే అమెరికాలో మార్పునకు సమయం ఆసన్నమైంది. ఇప్పుడున్న పరిపాలనను మరో నాలుగేళ్లు మనం భరించలేం. అందుకే మార్పునకు పట్టం కట్టాలి. అమెరికా పౌరుల ఎదుట ఈ క్షణాన ప్రతిజ్ఞ చేస్తున్నా. ద్రవ్యోల్బణ సంక్షోభాన్ని అంతం చేస్తా. వడ్డీ రేట్లను తగ్గిస్తా. మన సరిహద్దును మూసివేస్తా. గోడ నిర్మాణం పూర్తిచేస్తా. అక్రమ వలసలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తా. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి శుభం కార్డు వేసేస్తాం. నేను అధికారంలో ఉండి ఉంటే ఈ యుద్ధాలు అసలు జరిగేవే కాదు. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో నా విజయానికి సహరించాలని అందరినీ సవినయంగా కోరుతున్నా. మిమ్మల్ని తలెత్తుకొనేలా, గర్వపడేలా చేయడమే నా ధ్యేయం. -
ట్రంప్‌పై దాడికి ముందు.. నిందితుడు క్రూక్స్ ఏం చేశాడంటే..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి ఉదంతంపై ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్ఐబీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ట్రంప్‌పై హత్యాయత్నానికి ముందు నిందితుడైన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ కదలికలపై ఎఫ్‌బీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ట్రంప్‌పై కాల్పులు జరిపే కొన్ని గంటల ముందు నిందితుడికి సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగుచూశాయి.ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ట్రంప్‌పై దాడి చేసేందుకు క్రూక్స్ దాదాపు 48 గంటలు పనిచేసినట్లు తేలింది. దాడికి ముందు రోజు శుక్రవారం క్రూక్స్ తన స్వస్థలమైన పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌లో షూటింగ్ రేంజ్‌ను సందర్శించాడు. అక్కడ కాల్చడం ప్రాక్టీస్ చేశాడు. తరువాతి రోజు శనివారం ఓ దుకాణానికి వెళ్లి అయిదు అడుగుల నిచ్చెన కొనుగోలు చేశాడు. అనంతరం స్థానిక గన్ స్టోర్‌కు వెళ్లి 50 రౌండ్ల బుల్లెట్లు కొన్నాడు. సాయంత్రం క్రూక్స్ తన కారులో బట్లర్ ప్రాంతానికి చేరుకున్నాడు. కారును బయట పార్క్ చేసి, అందులోనే అధునాతన పేలుడు పరికరాన్ని వదిలేశాడు. నిచ్చెనతో సమీపంలోని భవనంపైకి ఎక్కి తుపాకీతో ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. అయితే దాడికి ఉపయోగించిన గన్ను క్రూక్స్ తండ్రి 2013లో అధికారికంగా కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ విషయాలన్నీ అధికారులు వెల్లడించినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.కాగా శనివారం(జూల్13న) పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ట్రంప్‌పై ఆగంతకుడు కాల్పులకు తెగబడటం తెలిసిందే. ర్యాలీ ప్రాంతం నుంచి 130 మీటర్ల దూరం నుంచి ట్రంప్‌పై హత్యాయత్నం చేసింది. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా తేలింది. నిందితుడిని ఘటనా స్థలంలోనే భద్రతా సిబ్బంది సెక్యూరిటీ స్నైపర్స్ అంతమొందించారు. అయితే ఈఘటనలో ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన కుడి చెవికి గాయమవ్వగా.. ఆసుపత్రిలో చేరి చికిత్స పొదుతున్నారు.మరోవైపు నిందితుడు ట్రంప్‌పై ఈ ఈ దుశ్చర్యకు పాల్పడటం వెనక గల ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు ఎఫ్‌బీఐ అధికారులు యత్నిస్తున్నారు. క్రూక్స్ సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను పరిశీలిస్తున్నారు. అతడి చర్య వెనక రాజకీయపరమైన, సైద్ధాంతికపరమైన భావజాలం ప్రభావం ఏదైనా ఉందా..? అని ఆరా తీసుకున్నారు. అదే విధంగా క్రూక్స్ కారులో లభించిన పేలుడుపదార్థం గురించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రంప్‌పై దాడి.. కొనసాగుతున్న సస్పెన్స్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించింది. గత శనివారం ఎన్నికల ప్రచారంలో ఉన్న ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్‌గా ఎఫ్‌బీఐ తేల్చి చెప్పింది. అయితే.. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందిన ఈ యువకుడు.. ఎందుకు ట్రంప్‌పై కాల్పులు జరిపాడనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఇంతటి చర్యకు పాల్పడటానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనపై దేశీయ ఉగ్రవాద చర్యగా తాము విచారణ చేపట్టినట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది. నిందితుడు ఒంటరిగానే ఈ కాల్పులు జరిపినట్లు పేర్కొంది. అయితే యువకుడి కాల్పుల వెనక స్పష్టమైన కారణాలు తెలియకపోవడం వల్ల కుట్ర కోణం దాగి ఉండవచ్చని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక ఘటనకు ముందు అతని సోషల్ మీడియా అకౌంట్లలలో ఎలాంటి బెదిరింపు సమాచారాన్ని తాము కనుగొనలేదని చెప్పారు. కొన్ని నెలలుగా సోషల్ మీడియా ఉపయోగించడం లేదని తెలిపారు. గతంలోనూ రాజకీయాలతో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. అయితే క్రూక్స్ కుటుంబ సభ్యులు తమ విచారణకు సహకరిస్తున్నారని ఎఫ్‌బీఐ అధికారులు పేర్కొన్నారు.కాగా క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుగా రిజిస్టర్ చేసుకున్నాడు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి తొలిసారి ఓటర్నగా నమోదు చేసుకున్నాడు. అయితే, క్రూక్స్2021లో డెమోక్రటిక్ పార్టీకి 15 డాలర్ల విరాళం ఇచ్చినట్టుగా కూడా గుర్తించారు. కాగా, పిట్స్ బర్గ్ శివార్లలోని బెథెల్ పార్క్ ఏరియాకు చెందిన క్రూక్స్ 2022లో హైస్కూల్ విద్య పూర్తి చేశాడు. నేషనల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇనీషియేటివ్ నుంచి అతడు 500 డాలర్ల ‘స్టార్ అవార్డు’ కూడా అందుకున్నట్లు తెలిసింది. స్కూల్లో ఉండగా.. గణితంలో అతడు చురుగ్గా ఉండేవాడని సమాచారం. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుపుతామని ఎఫ్‌బీఐ ప్రకటించింది. దీనికి కొంత సమయం పట్టొచ్చని తెలిపింది. ఏదైనా సమాచారం ఉంటే తమతో పంచుకోవాలని ర్యాలీకి హాజరైన వారిని కోరింది.ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు ట్రంప్. ఈ ఈక్రమంలో జూలై 13న నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతుండగా ఆయనపై అనుకోకుండా దాడి జరిగింది. ట్రంప్ స్టేజ్ నుంచి 140 మీటర్ల దూరంలోఉన్న ఓ భవనంపై నుంచి దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు.పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమై రక్తం కారింది. మరో ఇద్దరికి గాయాలవ్వగా.. మాజీ అగ్నిమాపక అధికారి ప్రాణాలు కోల్పోయాడు వెంటనే అప్రమత్తమైన ట్రంప్ భద్రతా సిబ్బంది (సిక్రెట్ సర్వీస్ స్నైపర్లు) అంగతకుడిపై కాల్పులు జరిపి అంతమొందించారు. ట్రంప్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
USA Presidential Elections 2024: ట్రంప్‌పై హత్యాయత్నం
పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులకు తెగబడటంతో ట్రంప్ తల వెనుకగా దూసుకెళ్తున్న తూటా. ఆయనపై మొత్తం నాలుగైదు రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయి.షికాగో/వాషింగ్టన్: అమెరికా చరిత్రపై మరో రక్తపు మరక. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78)పై హత్యా యత్నం జరిగింది. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలిచి మరోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు రిపబ్లికన్ల అభ్యరి్థగా సర్వశక్తులూ ఒడ్డుతున్న ఆయన ఈ ప్రాణాంతక దాడి నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం పెన్సిల్వేనియాలోని బట్లర్ టౌన్లో ఔట్‌డోర్ ఎన్నికల ర్యాలీలో ఉండగా ఈ ఘోరం జరిగింది. భారీగా హాజరైన మద్దతుదారులు, అభిమానులను ఉద్దేశించి సాయంత్రం ఆరు గంటలకు ట్రంప్ ప్రసంగం మొదలు పెట్టారు. అప్పటికే సమీప గోడౌన్‌పై నక్కిన ఓ దుండగుడు ఏఆర్ శ్రేణి ఆటోమేటిక్ అసాల్ట్ రైఫిల్‌తో ట్రంప్‌పైకి కనీసం ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు. దాంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అరుపులు, కేకలు, ఆక్రందనలు, పారిపోతున్న జనాలతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఒక తూటా ట్రంప్ కుడి చెవి పై భాగాన్ని గాయపరిచింది. మరిన్ని తూటాలు ఆయన తలకు అతి సమీపం నుంచి దూసుకెళ్లాయి. ట్రంప్ బాధతో తన చెవిని చేత్తో పట్టుకుంటూనే తూటాల నుంచి తప్పించుకునేందుకు వెంటనే డయాస్ కిందకు వంగారు. ఆలోపే సీక్రెట్ సరీ్వస్ సిబ్బంది టంప్ర్ను చుట్టుముట్టి రక్షణ కవచంలా నిలిచారు. చెవి నుంచి కుడి చెంప మీదుగా రక్తమోడుతున్న ట్రంప్‌ను హుటాహుటిన వేదిక నుంచి తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి సురక్షితంగా తరలించారు. వేదికను వీడుతూ ట్రంప్ పిడికిలి బిగించి పైకెత్తి, సభికులనుద్దేశించి ‘ఫైట్’ అని పదేపదే భావోద్వేగంతో బిగ్గరగా నినాదాలు చేశారు. వారు కూడా తమ నేతకు మద్దతుగా ఫైట్ అంటూ పెద్దపెట్టున ప్రతి నినాదాలు చేశారు. అక్కణ్నుంచి ట్రంప్‌ను హుటాహుటిన పిట్స్బర్గ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారెక్కే ముందు కూడా ట్రంప్ మరోసారి పిడికిలి బిగించి నినాదాలు చేశారు. ఈ మొత్తం ఉదంతానికి సంబంధించిన వీడియో ప్రపంచమంతటా వైరలవుతోంది. ట్రంప్ క్షేమంగా ఉన్నట్టు అనంతరం ఆయన ప్రచార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దుండగుని కాల్పుల్లో సభికుల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమీప భవనాలపై మోహరించి ఉన్న సీక్రెట్ సరీ్వస్ స్నైపర్లు తక్షణం స్పందించి దుండగున్ని కాల్చి చంపారు. అతన్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకునిగా గుర్తించారు. అతను కాల్పులకు తెగబడేందుకు కారణం తెలియాల్సి ఉంది. అమెరికా వంటి అగ్ర రాజ్యంలో మాజీ అధ్యక్షుని స్థాయి నేతపై ఇంత సమీపం నుంచి కాల్పులు జరగడం ఘోర భద్రతా వైఫల్యమేనంటున్నారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. ట్రంప్‌పై దాడితో ప్రపంచం నివ్వెరపోయింది. హత్యా యత్నాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశాధినేతలంతా ఈ ఘటనను ఖండించారు.దేవుడే కాపాడాడు: ట్రంప్ ప్రాణాంతక దాడి నుంచి తనను భగవంతుడే రక్షించాడని ట్రంప్ అన్నారు. కాల్పుల ఘటనపై తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్’లో ఆయన స్పందించారు. కాల్పుల్లో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘నిర్భయంగా ముందుకెళ్దాం. ఈ సమయంలో అమెరికన్లమంతా మరింత సమైక్యంగా నిలబడాల్సిన అవసరముంది. అమెరికన్లుగా మన వ్యక్తిత్వాన్ని చాటాల్సిన, దుష్టశక్తి గెలవకుండా అడ్డుకోవాల్సిన సమయమిది. మిమ్మలి్న, మన దేశాన్ని నేను త్రికరణశుద్ధిగా ప్రేమిస్తున్నా. త్వరలో విస్కాన్సిన్ సభ ద్వారా మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అని రిపబ్లికన్ పార్టీ మూడు రోజుల సదస్సును ఉద్దేశించి అన్నారు. ఈ సదస్సులో అధ్యక్ష అభ్యరి్థని అధికారికంగా ప్రకటించనుండటం తెలిసిందే.120 మీటర్ల నుంచే కాల్పులు ట్రంప్‌పై కాల్పుల ఘటనపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కేవలం 120 నుంచి 150 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిగినట్టు ప్రాథమికంగా తేలింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండే అమెరికా మాజీ అధ్యక్షునిపైకి ఇంత సమీపం నుంచి కాల్పులు జరపడం నమ్మకశ్యం కాని విషయమని ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ కెవిన్ రోజెక్ అన్నారు. అంతమంది భద్రతా సిబ్బంది రక్షణలో ఉన్న ట్రంప్‌పైకి దుండగుడు అన్ని రౌండ్ల పాటు కాల్పులు జరపగలగడం వింతగా ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘దుండగుడు అంత సమీపానికి ఎలా రాగలిగాడు, ఎవరు సహకరించారు వంటి కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుంది’’ అని చెప్పారు.దుండగుడు రిపబ్లికన్ ఓటరే ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డ థామస్ మాథ్యూ క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ ఓటరుగా నమోదు చేసుకున్నట్టు తేలడం విశేషం. అయితే 2021లో డెమొక్రటిక్ పార్టీ అనుబంధ విభాగానికి 15 డాలర్ల విరాళం ఇచి్చనట్టు కూడా వెల్లడైంది. కొద్ది రోజుల ముందే ట్రంప్‌ను ద్వేషిస్తూ, రిపబ్లికన్ పార్టీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడట. క్రూక్స్ది పెన్సిల్వేనియాలో పిట్స్బర్గ్ శివార్లలోని బెథెల్ పార్క్ అని తేలింది. బతికుంటే ఈ నవంబర్‌లో అతను తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవాడు. మృతదేహం వద్ద గుర్తింపు కార్డుల వంటివేవీ లభించకపోవడంతో అతన్ని గుర్తించడం ఏజెంట్లకు కష్టంగా మారింది. దాంతో చివరికి డీఎన్ఏ పరీక్ష చేసి గుర్తించారు.దుండగుని ముందస్తు ఏర్పాట్లు! ట్రంప్‌పై కాల్పులకు తెగబడేందుకు దుండగుడు ముందుగానే పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నట్టు భావిస్తున్నారు. దాడికి పాల్పడ్డ గోడౌన్ వంటి భవనం ర్యాలీకి అతి సమీపంలో ఉంది. దానిపైకి చేరుకునేందుకు ఒక నిచ్చెన కూడా ఏర్పాటు చేసి ఉంది. అతని మృతదేహం పక్కన పలు రకాలైన ప్యాకేజీలను పోలీసులు గుర్తించారు. వాటిలో పేలుడు పదార్థాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భీతావహంగా ఘటనా స్థలి ట్రంప్‌పై హత్యా యత్నం జరిగిన బట్లర్ కేవలం 13 వేల జనాభా ఉండే చిన్న పట్టణం. పశి్చమ పెన్సిల్వేనియాలో పిట్స్బర్గ్కు 33 మైళ్ల దూరంలో ఉంటుంది. ఆరుబయట మైదాన ప్రదేశంలో ర్యాలీ జరిగింది. తన మార్కు ఎర్ర టోపీ, నల్ల సూటులో ట్రంప్ వేదికపైకి చేరుకుని ప్రసంగం మొదలు పెట్టారు. అమెరికాలోకి అక్రమ వలసలు పెరిగిపోయాయంటూ చార్ట్ సాయంతో వివరిస్తుండగా కాల్పులు మొదలయ్యాయి. దాంతో అంతా ప్రాణభయంతో కేకలు వేశారు. తూటాలను తప్పించుకునేందుకు నేలపై పడుకుండిపోయారు. ఆ ప్రదేశమంతా భీతావహంగా మారింది. ట్రంప్‌ను సురక్షితంగా తరలించాక కూడా చాలాసేపటిదాకా జనం నేలపై పడుకునే కని్పంచారు. అనంతరం భద్రతా సిబ్బంది రంగప్రవేశం చేసి ర్యాలీ వేదికను అదుపులోకి తీసుకున్నారు.ముందే చూసిన జనం...! ట్రంప్‌పై కాల్పులకు దిగిన దుండగుడు క్రూక్స్‌ను తాము ముందే చూసినట్టు సభికుల్లో పలువురు వెల్లడించారు. అతడు గోడౌన్‌పై నెమ్మదిగా కదులుతూ ట్రంప్‌కు వీలైనంత సమీపంగా వచి్చనట్టు ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాల్పులకు ముందే క్రూక్స్ చేతిలో తుపాకీని స్పష్టంగా చూసినట్టు మరో ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ‘‘దేవుడా! అతని చేతిలో తుపాకీ ఉందంటూ అరిచా. అంతలోనే కాల్పులకు తెగబడటంతో వెంటనే నేలపై పడుకుని తలెత్తి చూశా. ఏజెంట్ల తూటాలకు అతని తల పేలిపోవడాన్ని కళ్లారా చూశా’’ అని చెప్పుకొచ్చాడు. పెరిగిన ట్రంప్ విజయావకాశాలు! అధ్యక్ష ఎన్నికల రేసులో ఇప్పటికే దూసుకుపోతున్న ట్రంప్ విజయావకాశాలు కాల్పుల ఉదంతం నేపథ్యంలో మరింతగా పెరిగినట్టు చెబుతున్నారు. ఆయన విజయావకాశాలు గత 24 గంటల్లోనే 8 శాతం పెరిగి ఏకంగా 70 శాతానికి చేరినట్టు రాజకీయ అంచనాల వేదిక పాలీమార్కెట్ పేర్కొంది. అంతటి ప్రాణాపాయ పరిస్థితిలోనూ ట్రంప్ అత్యంత వీరోచితంగా వ్యవహరించారంటూ అన్నివైపుల నుంచీ ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘తల పక్కనుంచి తూటాలు దూసుకెళ్లాయి. ఒకటి చెవిని ఛిద్రం చేసింది. అయినా ట్రంప్ అస్సలు భయపడలేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి మోకాళ్లపై పాక్కుంటూ పోవడం వంటివేవీ చేయలేదు. ఏ మాత్రం వెరవకుండా తిరిగి లేచి నుంచున్నారు. భద్రతా సిబ్బందిని నిలువరించి మరీ పిడికిలి బిగించి పోరాట నినాదాలు చేశారు’’ అంటూ పలువురు మద్దతుదారులు ప్రశంసిస్తున్నారు.ట్రంప్‌తో మాట్లాడిన బైడెన్ హత్యా యత్నంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విస్మయం వెలిబుచ్చారు. ఈ దారుణ ఘటనను అంతా తీవ్రంగా ఖండించాల్సిన అవసరముందన్నారు. ట్రంప్ క్షేమంగా ఉండటం పట్ల హర్షం వెలిబుచ్చారు. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం బైడెన్ ప్రజలనుద్దేశించి కూడా మాట్లాడారు. ఇలాంటి హింసకు అమెరికాలో తావు లేదన్నారు. షెడ్యూల్ ప్రకారం వారాంతాన్ని గడిపేందుకు బైడెన్ డెలావెర్ వెళ్లాల్సి ఉన్నా పర్యటన రద్దు చేసుకుని వైట్‌హౌస్‌కు తిరిగొచ్చారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జి బుష్, డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీ నేతలు తదితరులు కూడా దాడిని తీవ్రంగా ఖండించారు.మోదీ ఖండన ట్రంప్‌పై హత్యా యత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో హింసకు తావు లేదని స్పష్టం చేశారు. ‘‘నా మిత్రుడు ట్రంప్‌పై దాడి పట్ల తీవ్రంగా ఆందోళన చెందా. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశాధినేతలు మాక్రాన్ (ఫ్రాన్స్), స్టార్మర్ (బ్రిటన్), ఆల్బనీస్ (ఆస్ట్రేలియా), మెలోనీ (ఇటలీ), కిషిడా (జపాన్), ట్రూడో (కెనడా), జెలెన్స్కీ (ఉక్రెయిన్), నెతన్యాహూ (ఇజ్రాయెల్) తదితరులు కూడా దాడిని తీవ్రంగా ఖండించారు.ఎప్పుడు ఏమి జరిగిందంటేఅమెరికా స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఆరింటికి ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం మొదలైంది. తర్వాతేం జరిగిందంటే... 6:11:33 – ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఒక తూటా కుడి చెవికి తాకడంతో బాధతో ముఖాన్ని తడుముకున్నారు 6:11:35 – తూటాల నుంచి తప్పించుకునేందుకు డయాస్ కిందికి వంగారు. ‘గెట్ డౌన్’ అని అరుస్తూ భద్రతా సిబ్బంది పోడియంపైకి దూసుకొచ్చారు. రక్షణ కవచంలా ట్రంప్‌ను చుట్టుముట్టారు. అంతలో మరిన్ని తూటాలు దూసుకొచ్చాయి. 6:11:41 – ‘ఏం చేస్తున్నాం మనం? ఏం జరుగుతోంది?’ అంటూ మహిళా ఏజెంట్ కేకలు. జనం కేకలు, అరుపులు. అంతటా గందరగోళం 6:11:50 – మళ్లీ కాల్పుల చప్పుడు. ఒక మహిళ ఆక్రందన 6:11:58 – ‘‘స్పేర్ (కారు) దగ్గరికి కదలండి’’ అంటూ ట్రంప్ భద్రతా ఏజెంట్ల పరస్పర హెచ్చరికలు 6:12:06 – ‘హాక్ఐ (కౌంటర్ అటాక్ టీం) వచ్చేసింది, కారు వైపు వెళ్దాం’ అన్న భద్రతా సిబ్బంది6:12:09 – సిద్ధంగా ఉండాలంటూ కార్లోని సిబ్బందికి సూచనలు6:12:21 – షూటర్ చనిపోయాడని నిర్ధారించుకున్న ట్రంప్ భద్రతా సిబ్బంది6:12:22 – కారువైపు కదిలేందుకు సేఫేనా అంటూ ఏజెంట్ల ఆరా6:12:23 – ‘అంతా సేఫ్, కారువైపు పదండి’ అన్న మరో ఏజెంట్. ట్రంప్‌ను పైకి లేపిన సిబ్బంది.6:12:35 – అంతా ఓకే అని ట్రంప్‌కు చెప్పిన ఏజెంట్లు6:12:36 – తన షూ వేసుకోనివ్వాలన్న ట్రంప్6:12:37 – ‘ఆగండి సర్. మీ తలంతా రక్తం’ అని ట్రంప్‌తో ఓ ఏజెంట్6:12:39 – ‘సర్, మనం కారువైపు కదలాలి’ అన్న మరో ఏజెంట్ 6:12:47 – ‘ఆగండి, ఆగండి’ అంటూ భద్రతా సిబ్బందిని నిలువరించిన ట్రంప్. జనంకేసి చూస్తూ పిడికిలి బిగించి ‘ఫైట్’ అంటూ బిగ్గరగా నినాదాలు. అంతే బిగ్గరగా బదులిచి్చన జనం 6:12:54 – ‘మనమిక వెళ్లాలి’ అంటూ ట్రంప్‌ను కారుకేసి తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది. మరోసారి నినాదాలు చేస్తూ కార్లో కూర్చున్న ట్రంప్జుయ్మంటూ తూటాలు దూసుకెళ్తున్న శబ్దాలు స్పష్టంగా విని్పంచాయి. ఏదో జరుగుతోందని అనుకునేంతలో ఓ తూటా నా కుడి చెవి పై భాగాన్ని ఛిద్రం చేసింది. చర్మం తెగిపోయింది. విపరీతంగా రక్తం కారింది. ఏం జరుగుతోందో అప్పటికి నాకర్థమైంది. అమెరికా వంటి దేశంలో ఇలాంటి చర్య జరగడం అనూహ్యం. గాడ్ బ్లెస్ అమెరికా– తనపై కాల్పులను ఉద్దేశించి సొంత సోషల్ మీడియా ‘ట్రూత్’లో డొనాల్డ్ ట్రంప్ -
జీపుతో ఢీకొట్టి కిడ్నాప్..
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీ కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. పట్టణ నడిబొడ్డున అందరూ చూస్తుండగా మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త చాకలి శ్రీనును జీపుతో ఢీకొట్టి.. ఆపై కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే అఖిల ప్రియ ఇంట్లో.. ఆమె సమక్షంలో తీవ్రంగా కొట్టి పట్టణ శివారులో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బాధితుల కథనం మేరకు.. ఆళ్లగడ్డకు చెందిన వైఎస్సార్సీపీ నేత భూమా కిషోర్‌రెడ్డికి లింగందిన్నెకు చెందిన చాకలి శ్రీను అనుచరుడు. శుక్రవారం ఆరోగ్యం సరిగాలేదని ఆళ్లగడ్డలోని మెడికల్ స్టోర్‌కు వచ్చి, మందులు తీసుకుని మరో యువకుడితో కలిసి బైక్‌పై లింగందిన్నెకు బయలుదేరాడు. వారిని వాహనంలో వెంబడిస్తూ వచ్చిన ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు బైక్‌ను ఢీకొట్టారు. దీంతో శ్రీను, మరో యువకుడు కిందపడ్డారు. వెంటనే కర్రలు, రాడ్లతో వాహనంలోంచి దిగిన టీడీపీ రౌడీ మూకలు శ్రీనును కొట్టుకుంటూ వాహనంలో వేసుకుని ఎమ్మెల్యే ఇంట్లోకి తీసుకెళ్లారు. మరో యువకుడు పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని శ్రీనును కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఇంట్లో బంధించారని పోలీసులకు చెప్పినా ఫలితం లేదు. తుదకు శ్రీనును చంపొద్దని బతిమాలడంతో స్పృహ కోల్పోయేలా కొట్టి పొలాల్లో పడేశారు. ఆపై పోలీసులు 108లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. 3 గంటలకు పైగా ఉత్కంఠ శ్రీనును కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఇంట్లో బంధించిన విషయం పట్టణంలో దావానలంలా వ్యాపించింది. టీవీ చానళ్లలో ప్రముఖంగా ప్రసారమైంది. అయినా పోలీసులు చలనం లేకుండాపోయింది. సుమారు 3 గంటలకు పైగా బాధితుడిని ఇంట్లో ఉంచి కొడుతున్నా.. అరుపులు బయటకు వినిపిస్తున్నా.. పోలీసులు మౌనం వహించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే.. విడిచి పెట్టాలని కోరుతున్నామని చెప్పారే తప్ప కనీసం ఆ ఇంటి వద్దకు కూడా వెళ్లక పోవడం విమర్శలకు తావిస్తోంది. విషయం వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని.. టీడీపీ శ్రేణులతో చర్చలు కొనసాగించినట్లు తెలుస్తోంది. కొట్టి పొలాల్లో పడేస్తామని వారు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో ముందుగానే పోలీసులు 108 వాహనాన్ని సిద్ధం చేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడికి ఆళ్లగడ్డలో ప్రథమ చికిత్స కూడా చేయించకుండా 50 కి.మీ దూరంలోని నంద్యాల వైద్యశాలకు తరలించడం గమనార్హం. -
ముగ్గురు పిల్లలతో సహా చనిపోవాలని..
అబ్దుల్లాపూర్‌మెట్: మార్నింగ్ వాక్ చేసేందుకు ముగ్గురు పిల్లలతో కలిసి బయటకు వచ్చిన ఓ తండ్రి.. తన పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన అశోక్ వ్యాపార నిమిత్తం నగరానికి వలస వచ్చి మీర్‌పేట పరిధిలోని అల్మాస్గూడ శ్రీహోమ్స్ కాలనీలో నివాసముంటున్నాడు. బిజినెస్‌లో నష్టం రావడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆత్మహత్యే శరణ్యమని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఉదయం 6గంటలకు తన పిల్లలు 14 ఏళ్ల అవిఘ్నశ్రీ , 13 ఏళ్ల శ్రీధర్, తొమ్మిదేళ్ల వయసున్న సహస్రను తీసుకుని కారులో బయటకు వెళ్లాడు. నేరుగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడలోని బైరాన్ఖాన్ చెరువు వద్దకు చేరుకున్నాడు. ద్విచక్ర వాహనాలు మాత్రమే వేళ్లేందుకు అనువుగా ఉండే చెరువు కట్టపై నుంచి కారును వేగంగా చెరువులోకి దింపాడు. సమీపంలోని తాటి చెట్లపై ఉన్న గీత కార్మికులు, రోడ్డు పక్కనే ఉన్న స్థానికులు చూస్తుండగానే కారు నీళ్లలో మునుగుతుండగా.. భయంతో వణికిపోయిన బాలుడు శ్రీధర్.. తనవైపు కిందకు దించి ఉన్న కారు అద్దం నుంచి బయటకు వచ్చి, వాహనం పైకి ఎక్కాడు. మిగిలిన ఇద్దరు పిల్లలు సైతం అతన్ని అనుసరించారు. ఆ తర్వాత అశోక్ సైతం బయటకు వచ్చాడు. కారు పూర్తిగా నీటిలో మునుగుతున్న సమయంలో.. వేగంగా స్పందించిన స్థానికులు తాడు, ట్యూబ్ సాయంతో చెరువులోకి వెళ్లి.. ముగ్గురు పిల్లలతో పాటు అశోక్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న అశోక్‌కు ఆర్థిక సమస్యలకు తోడు పాటు భార్యతో సైతం గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. తాను చనిపోతే తన పిల్లలు అనాథలవుతారనే ఉద్దేశంతోనే అశోక్ ఇలా వ్యవహరించి ఉంటాడని ఘటనా స్థలంలో ఉన్నవారు తెలిపారు. మీర్పేట్ పీఎస్‌లో ఫిర్యాదుకాగా, మార్నింగ్ వాక్ కోసం పిల్లలను తీసుకెళ్లిన అశోక్ చాలా సమయం గడిచినప్పటికీ తిరిగి రాకపోవడంతో అతని తమ్ముడు సంజీవ మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇనాంగూడ చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపే స్థానికులు వారిని బయటకు తీశా రు. అనంతరం మీర్పేట్ పీఎస్‌కు తరలించి.. అశోక్ భార్యతో పాటు అతని సో దరుడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
భూమిని ఆక్రమించారని కలుపు మందు తాగాడు
కారేపల్లి: తన భూమిని అన్యాయంగా ఆక్రమించి ట్రాక్టర్లతో దున్నుతున్నారంటూ ఓ రైతు కలుపు మందు తాగి ఆత్మహ త్యాయత్నం చేశాడు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయపల్లికి చెందిన పచ్చిపాల భద్రయ్య, ఆయన సోదరులు సోమయ్య, రామయ్య, మల్లయ్యకు ఆలియాతండాలో వ్యవసాయ భూమి ఉంది. ఇందులో భద్రయ్య మినహా మిగతా వారు ఆర్టీఐ మాజీ కమిషనర్ జి.శంకర్‌నాయక్‌కు భూమి అమ్ముకు న్నట్లు సమాచారం. అయితే, సర్వేనంబర్ 548లోని తన 1.20 ఎకరాల భూమిని శంకర్‌నాయక్ తప్పుడు పత్రాలతో బై నంబర్లు సృష్టించి పట్టా చేసుకున్నారని భద్రయ్య కొన్నే ళ్లుగా ఆరోపిస్తున్నాడు. మరోపక్క శంకర్‌నాయక్ తాను చట్ట ప్రకారమే భూమి కొన్నట్టు చెబుతున్నారు. దీనిపై ఇరు వర్గాలు తహసీల్దార్ మొదలు ఉన్నతాధికారుల వరకు ఫిర్యా దు చేసుకున్నారు. భద్రయ్య కోర్టును సైతం ఆశ్రయించినట్లు సమాచారం. ఈ క్రమంలో గురువారం శంకర్‌నాయక్ మను షులు ట్రాక్టర్లతో వివాదాస్పద భూమిని దున్నసాగారు. దీంతో రైతు భద్రయ్య, ఆయన భార్య భాగ్యమ్మ అడ్డుకున్నారు. ట్రాక్టర్ కదలకుండా భద్రయ్య అడ్డుగా పడుకోవడంతో పాటు తన వెంట తెచ్చుకున్న కలుపు మందు తాగి అస్వస్థత కు గురయ్యాడు. ఆయనను తొలుత ఇల్లెందుకు, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆలియాతండాకు వెళ్లి వివరాలు ఆరాతీశారు. ఇదే జిల్లా ప్రొద్దుటూరులో ఇటీవల భూవివాదంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకోగా ఇప్పుడు మరో రైతు ఆత్మహత్యకు యత్నించడం చర్చనీయాంశమైంది. తాజా ఘటనలో భద్ర య్య భార్య భాగ్యమ్మ ఫిర్యాదుతో పలువురిపై కేసు నమోదు చేసినట్లు కారేపల్లి ఎస్సై రాజారాం తెలిపారు. భద్రయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. -
తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
నర్సింహులపేట: తన పేరున భూమి పట్టా మార్పిడి కావడం లేదని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మహ బూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం హజ తండాకు చెందిన భూక్య బాలు అనే రైతు గురువారం పురుగు మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. తండాలోని 498 సర్వేనంబర్‌లో తనకు 6 ఎకరాల భూమి ఉందని, అయితే ఆ భూమి భూక్య బాలు, భూక్య భద్రు పేరిట ఉన్నట్లు రికా ర్డులో చూపిస్తోందని, దానిని తన పేరిట పట్టాచేయాలని 6 నెలల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాలు అవేదన వ్యక్తం చేశాడు. తన కూతురు పెళ్లి కోసం ఆ భూమి ని అమ్మానని, అయితే తన పేర పట్టాకాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నానని తెలిపాడు. ఇదిలా ఉండగా బాలుకు సంబంధించిన వ్యక్తులు కార్యాలయంలో మా ట్లాడుతుండగానే ఆయన పురుగుమందు డబ్బాతో చెట్టు ఎక్కాడు. సమస్య పరిష్కరి స్తామని తహసీల్దార్ నాగరాజు హమీ ఇవ్వడంతో కిందికి దిగాడు. ›ఈ అంశంపై తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై హత్యాయత్నం
రాయచోటి: ఎన్నికల ముందురోజు వరకు ప్రశాంతంగా ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో టీడీపీ నేతలు వరుస దాడులతో అరాచకం సృష్టిస్తున్నారు. కౌంటింగ్ ముగిసిననాటి నుంచి టీడీపీ రౌడీలు వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని హత్యాయత్నాలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి రాయచోటి టీడీపీ నేత సయ్యద్ ఖాన్ కొంతమంది రౌడీలతో వైఎస్సార్సీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాత్రి 11.30 గంటల సమయంలో నాలుగో వార్డు కౌన్సిలర్ హారూన్ బాషా ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లో నుంచి బయటికి రావాలని, చంపుతామంటూ టీడీపీ రౌడీలు కేకలు వేశారు. ఆ సమయంలో హారూన్ ఇంటిలో లేకపోవడంతో ఆయన తల్లి బయటకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారిని ప్రాధేయపడ్డారు. అయినా వినని టీడీపీ రౌడీలు పెద్ద బండరాళ్లతో ఇంటి ఆవరణలో ఉన్న బైక్‌ను ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పీఏ నిస్సార్ అహ్మద్‌ను కూడా చంపుతామంటూ కేకలు పెడుతూ వెళ్లిపోయారు. ఆ తర్వాత వీధుల్లో బైకులపై కేకలు వేసుకుంటూ 7వ వార్డు కౌన్సిలర్ మున్నీసా ఇంటికి వెళ్లి ఆమె భర్త ఇర్ఫాన్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీ రౌడీల దాడిలో ఇర్ఫాన్ కత్తిపోట్లకు గురయ్యారు. ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయనను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు టీడీపీ నేత సయ్యద్ ఖాన్, బాబ్జీ, ఫిరోజ్ ఖాన్, శివారెడ్డి, అఫ్రోజ్, అబూజర్లను అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి, డీఎస్పీ రామానుజులు టీడీపీ నేతలపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కౌంటింగ్ నాటి నుంచే వరుస దాడులు..ఈనెల నాలుగో తేదిన ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాగానే అదే రోజు రాత్రి రాయచోటి రూరల్ మండలం ఎండపల్లి పంచాయతీ బోయపల్లిలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో సుబ్బారెడ్డి సోదరుడు, మరొకరు గాయాలపాలయ్యారు. ఇంటి ముందు ఉన్న కారును కూడా ధ్వంసం చేశారు.అలాగే వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిగా ఉన్న ఆర్టీసీ కండక్టర్ రామ్మోహన్ ఇంటిపై దాడులకు తెగబడి ఆయన బైకును తగులబెట్టారు. ఇలా రాయచోటిలో టీడీపీకీ చెందిన రౌడీ మూకలు, గ్యాంగ్‌లు దాడులు చేయడమే కాకుండా ఫోన్ల ద్వారా తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపుతామని బెదిరిస్తున్నారు.టీడీపీ రౌడీమూకల దాడులు దారుణంరాయచోటిలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపైన టీడీపీ రౌడీ మూకలు దాడి చేయడం దారుణమని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశాంత వాతావరణానికి అలవాటుపడిన రాయచోటి ప్రజలను ఈ రకమైన దాడులు చేసి భయాందోళనలకు గురి చేయడం సరికాదన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. అధికారమనేది ఎవరికీ శాశ్వతం కాదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిపైనా కక్షపూరిత రాజకీయాలు చేయ లేదని గుర్తు చేశారు. టీడీపీ రౌడీలు అర్ధరాత్రి వేళ మద్యం తాగి గుంపులుగా వచ్చి తమ పార్టీ కౌన్సిలర్లపై దాడులు చేయడం దారుణమన్నారు.రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు ఆయన ఫోన్ చేసి పరామర్శించారు. ప్రస్తుతం తాను విజయవాడలో ఉన్నానని, త్వరలో బాధితులను కలుస్తానని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ హత్యాయత్నం
చంద్రగిరి (తిరుపతి జిల్లా)/తిరుపతి క్రైమ్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మత్తులో టీడీపీ కార్యకర్తలు రాష్ట్రంలో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఈ దాడులు బుధవారమూ కొనసాగాయి. తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ కార్యకర్తలు కొందరు గంజాయి మత్తులో వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన మరో వ్యక్తిని కూడా గాయపరిచారు. మరో చోట వార్డు సభ్యుడిపై దాడి చేసి, గాయపరిచారు. తిరుపతి నగరంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కత్తులు, రాడ్లతో దాడి బుధవారం రాత్రి వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి, పార్టీ మండల కనీ్వనర్ మస్తాన్‌పై టీడీపీ కార్యకర్తలు చంద్రగిరిలో హత్యాయత్నానికి పాల్పడ్డారు. గంజాయి మత్తులో ఉన్న టీడీపీ కార్యకర్తలు కొందరు బుధవారం రాత్రి మస్తాన్ ఇంటి వద్దకు వచ్చారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంతో ఇంటి నుంచి బయటకు వస్తున్న ఆయనపై కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఓ వ్యక్తి కత్తితో మస్తాన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకొన్నప్పటికీ వారు ఆగలేదు. టీడీపీ వారిని అడ్డుకోబోయిన మస్తాన్ బంధువైన సాదిక్‌ను కూడా గాయపరిచారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నాయకులు పలువురు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ వారు జారుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో ధాబా ధ్వంసం అదే విధంగా చంద్రగిరి మండలం పరిధిలోని ఐతేపల్లి వద్ద ఉన్న ధాబాను టీడీపీ కార్య కర్తలు కొందరు ధ్వంసం చేశా రు. బుధవారం మద్యం సేవించిన కొందరు టీడీపీ కార్యకర్తలు ధాబా వద్దకు వెళ్లి గొడవకు దిగారు. సమాచారం అందుకున్న వార్డు సభ్యుడు సక్కూరు వంశీ అక్కడి వెళ్లారు. అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. మాపైనే పోలీసులకు చెప్తావా అంటూ వార్డు సభ్యుడు వంశీపై టీడీపీ వారు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ధాబాలోని కురీ్చలు, టేబుళ్లు ధ్వంసం చేశారు. తీవ్రంగా గాయపడిన వంశీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్యాలయం ధ్వంసం తిరుపతి నగరం 8వ డివిజన్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూటమి కార్యకర్తలు ధ్వంసం చేశారు. సంజయ్ కాలనీలో ఉన్న ఈ కార్యాలయాన్ని మురళి నిర్వహిస్తున్నారు. షట్టర్ ఓపెన్ చేసి గ్లాస్ డోర్‌కు తాళం వేసుకుని వెళ్లిన సమయంలో కూటమి మూకలు రాళ్లతో దాడిచేసి లోపలికి ప్రవేశించి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. టీవీలు, కంప్యూటర్లు, బల్లలు అన్నింటినీ విరగ్గొట్టారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కార్యాలయం నిర్వాహకుల నుంచి ఫిర్యాదు తీసుకొన్నారు. -
వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం
తిరుపతి క్రైమ్: తిరుపతిలో వైఎస్సార్సీపీ నాయకుడిపై శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అలిపిరి సీఐ రామారావు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఎన్జీవో కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు వెంకటశివారెడ్డి ఇంటి ఎదురుగా గిరీష, శ్రీలక్ష్మి అనే వ్యక్తులు నివాసం ఉండేవారు. వీరు ప్రతి రోజు మద్యం, గంజాయి తాగి రచ్చరచ్చ చేస్తుండేవారు. వారి ప్రవర్తన వల్ల ఎదురు ఇంట్లో ఉంటున్న వెంటకశివారెడ్డి కుటుంబానికి నిద్ర ఉండేది కాదు.ఈ విషయంపై వెంకటశివారెడ్డి, గిరీషకు మధ్య తరచూ గొడవలు జరిగేవి. అదేవిధంగా గిరీష కొద్దికాలం కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి స్టలం ఇప్పిస్తానని రూ.20లక్షలు తీసుకుని మోసం చేశాడు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడిగా ఉన్న వెంకటశివారెడ్డిని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. దీంతో గిరీష కుటుంబ సభ్యులను వెంకటశివారెడ్డి పిలిపించి వారి డబ్బులు ఇవ్వాలని సూచించారు. దీంతో వెంకటశివారెడ్డి, గిరీష మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఆ గొడవలు జరిగిన అనంతరం గిరీష, శ్రీలక్ష్మి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. వారు ఎన్నికలకు ముందు తిరిగి వచ్చారు.హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి ఇవ్వాల్సిన డబ్బులు గురించి ఎన్నికల తర్వాత మాట్లాడదామని గిరీష చెప్పాడు. ఈ నేపథ్యంలో వెంకటశివారెడ్డి శనివారం ఉదయం ఎన్జీవో కాలనీలోని తన నివాసం నుంచి వాకింగ్‌కు బయలుదేరి వెళ్లారు. మెయిన్ రోడ్డులో ఉన్న అరవింద స్కూల్ సమీపాన ఆటోస్టాండ్ వద్దకు వెళ్లగానే ఆయనపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేశారు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన వెంకటశివారెడ్డిని స్థానికులు హుటాహుటిన ఆస్పపత్రికి తరలించారు.వెంకటశివారెడ్డిపై గిరీష కక్ష పెంచుకుని, ఆయన ఉదయం వాకింగ్‌కి వెళ్లే సమయంలో దాడి చేయాలని ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు సీసీ ఫుటేజీలో నమోదైంది. వెంకటశివారెడ్డి కుమారుడు బాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ రామారావు వెల్లడించారు. -
ప్రధాని మోదీని చంపేస్తాం!.. ఎన్ఐఏకి బెదిరింపు కాల్
సాక్షి, చెన్నై: ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ అందిన బెదిరింపు కాల్‌తో చెన్నైలోని జాతీయ దర్యాప్తు విభాగం అప్రమత్తమైంది. చెన్నై పురసైవాక్కంలో ఎన్ఐఏ కార్యాలయం ఉంది. బుధవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ కార్యాలయానికి ఫోన్ చేసి...ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని హతమా రుస్తామంటూ హిందీలో హెచ్చరించాడు. వెంటనే ఎన్ఐఏ అధికారులు చెన్నై సైబర్‌క్రైం బ్రాంచిని అప్రమత్తం చేశారు. మధ్యప్రదేశ్ నుంచి ఆ కాల్ వచ్చిన ట్టుగా తేలడంతో గురువారం ఉదయం ఎన్ఐఏ, సైబర్ క్రైం బృందాలు భోపాల్‌కు వెళ్లాయి. అదేవిధంగా, చివరి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానికి భద్రతను మరింతగా పెంచాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం.