వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించింది. గత శనివారం ఎన్నికల ప్రచారంలో ఉన్న ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్‌గా ఎఫ్‌బీఐ తేల్చి చెప్పింది. అయితే.. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందిన ఈ యువకుడు.. ఎందుకు ట్రంప్‌పై కాల్పులు జరిపాడనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఇంతటి చర్యకు పాల్పడటానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై దేశీయ ఉగ్రవాద చర్యగా తాము విచారణ చేపట్టినట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది. నిందితుడు ఒంటరిగానే ఈ కాల్పులు జరిపినట్లు పేర్కొంది. అయితే యువకుడి కాల్పుల వెనక స్పష్టమైన కారణాలు తెలియకపోవడం వల్ల కుట్ర కోణం దాగి ఉండవచ్చని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అంతేగాక ఘటనకు ముందు అతని సోషల్ మీడియా అకౌంట్లలలో ఎలాంటి బెదిరింపు సమాచారాన్ని తాము కనుగొనలేదని చెప్పారు. కొన్ని నెలలుగా సోషల్ మీడియా ఉపయోగించడం లేదని తెలిపారు. గతంలోనూ రాజకీయాలతో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. అయితే క్రూక్స్ కుటుంబ సభ్యులు తమ విచారణకు సహకరిస్తున్నారని ఎఫ్‌బీఐ అధికారులు పేర్కొన్నారు.
కాగా క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుగా రిజిస్టర్ చేసుకున్నాడు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి తొలిసారి ఓటర్నగా నమోదు చేసుకున్నాడు. అయితే, క్రూక్స్2021లో డెమోక్రటిక్ పార్టీకి 15 డాలర్ల విరాళం ఇచ్చినట్టుగా కూడా గుర్తించారు. కాగా, పిట్స్ బర్గ్ శివార్లలోని బెథెల్ పార్క్ ఏరియాకు చెందిన క్రూక్స్ 2022లో హైస్కూల్ విద్య పూర్తి చేశాడు. నేషనల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇనీషియేటివ్ నుంచి అతడు 500 డాలర్ల ‘స్టార్ అవార్డు’ కూడా అందుకున్నట్లు తెలిసింది.
స్కూల్లో ఉండగా.. గణితంలో అతడు చురుగ్గా ఉండేవాడని సమాచారం. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుపుతామని ఎఫ్‌బీఐ ప్రకటించింది. దీనికి కొంత సమయం పట్టొచ్చని తెలిపింది. ఏదైనా సమాచారం ఉంటే తమతో పంచుకోవాలని ర్యాలీకి హాజరైన వారిని కోరింది.
ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు ట్రంప్. ఈ ఈక్రమంలో జూలై 13న నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతుండగా ఆయనపై అనుకోకుండా దాడి జరిగింది. ట్రంప్ స్టేజ్ నుంచి 140 మీటర్ల దూరంలోఉన్న ఓ భవనంపై నుంచి దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు.
పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమై రక్తం కారింది. మరో ఇద్దరికి గాయాలవ్వగా.. మాజీ అగ్నిమాపక అధికారి ప్రాణాలు కోల్పోయాడు వెంటనే అప్రమత్తమైన ట్రంప్ భద్రతా సిబ్బంది (సిక్రెట్ సర్వీస్ స్నైపర్లు) అంగతకుడిపై కాల్పులు జరిపి అంతమొందించారు. ట్రంప్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment