
ఎన్‌ఐఏకి ఆగంతకుడి బెదిరింపు కాల్
సాక్షి, చెన్నై: ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ అందిన బెదిరింపు కాల్‌తో చెన్నైలోని జాతీయ దర్యాప్తు విభాగం అప్రమత్తమైంది. చెన్నై పురసైవాక్కంలో ఎన్‌ఐఏ కార్యాలయం ఉంది. బుధవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ కార్యాలయానికి ఫోన్ చేసి...ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని హతమా రుస్తామంటూ హిందీలో హెచ్చరించాడు.
వెంటనే ఎన్‌ఐఏ అధికారులు చెన్నై సైబర్‌క్రైం బ్రాంచిని అప్రమత్తం చేశారు. మధ్యప్రదేశ్ నుంచి ఆ కాల్ వచ్చిన ట్టుగా తేలడంతో గురువారం ఉదయం ఎన్‌ఐఏ, సైబర్ క్రైం బృందాలు భోపాల్‌కు వెళ్లాయి. అదేవిధంగా, చివరి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానికి భద్రతను మరింతగా పెంచాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment