Madhya Pradesh
-
పటౌడీ ఆస్తుల కేసు.. సైఫ్ ఫ్యామిలీకి బిగ్ షాక్ తప్పదా?
ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తన ఇంట్లోనే దాడికి గురై వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల చికిత్స తర్వాత కోలుకుని ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే తాజాగా ఆయన కుటుంబానికి మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల ఆస్తులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది.2011లో సైఫ్ అలీఖాన్(Saif Ali khan) తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మృతి చెందారు. ఆ తర్వాత సైఫ్‌కు భోపాల్ నవాబ్‌గా బిరుదు లభించింది. ప్రస్తుతం పటౌడీ కుటుంబానికి సైఫ్ అలీ ఖాన్ వారసుడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పటౌడీ కుటుంబానికి చెందిన ఆస్తులు ఉన్నాయి. అదే సమయంలో అక్కడి ఆస్తుల గురించి ఎప్పటి నుంచో వివాదాలు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు అక్కడ ఉన్నాయి. కోహెఫిజా నుండి చిక్లోడ్ వరకు విస్తరించి ఉన్నాయి. ఆ కుటుంబానికి చెందిన సుమారు 100 ఎకరాల భూమిలో దాదాపు లక్షన్నర మంది నివసిస్తున్నారు. అయితే.. ఆ చారిత్రక భూమిపై ఎనిమీ ప్రాపర్టీ కేసులో గత 10 ఏళ్లుగా కొనసాగుతున్న స్టే ఇప్పుడు ముగిసింది. ఆస్తిపై దావా వేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు సైఫ్ కుటుంబానికి 30 రోజుల సమయం ఇచ్చింది. అయినా సైఫ్ అలీ ఖాన్ కుటుంబం ఎటువంటి దావా వేయలేదు. కానీ ఇప్పుడు ఆ గడువు ముగిసిపోవడంతో.. తర్వాత ఏం జరగనుందా? అనే ఉత్కంఠ మొదలైంది. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్(Enemy Property Act) 1968 ప్రకారం విభజన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిన వ్యక్తులు భారత్‌లో వదిలిపెట్టిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది.ఈ చట్టం ప్రకారం భోపాల్ చివరి నవాబు ఆస్తులను ప్రభుత్వం నియత్రించాలని ప్రయత్నించింది. అయితే.. సైఫ్ కుటుంబం ఈ నిర్ణయాన్ని 2015లో సవాల్ చేశారు. దీంతో.. కోర్టు స్టే విధించింది. అయితే తాజాగా ఆ స్టేను కోర్టు ఎత్తేసింది. దీంతో ప్రభుత్వం ఆ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. పటౌడీ చివరి నవాబు పెద్ద కుమార్తె యువరాణి అబిదా సుల్తాన్ ఎప్పుడో పాకిస్థాన్ వెళ్లారు. అందువల్ల నవాబు ఆస్తిని శత్రువు ఆస్తిగా(ఎనిమీ ప్రాపర్టీ) ప్రకటించారు. అయితే.. నవాబ్ మరణం తరువాత అతని రెండో కుమార్తె మెహర్ తాజ్ సాజిదా సుల్తాన్ బేగం భోపాల్ వారసత్వ చట్టం 1947 ప్రకారం ఎస్టేట్‌కు వారసురాలుగా ప్రకటించారు. ఇప్పుడు పిటిషన్ వేసిన పటౌడీ కుటుంబంలోని సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాకూర్‌వంటివారు సాజిదా(Sajida) వారసులు. ఈ నేపథ్యలో ఆస్తిపై తమకూ హక్కు ఉందని సైఫ్ ఫ్యామిలీ కోర్టులో దావా వేసింది. వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజెన్ బెంచ్‌లో ఉత్తర్వులను పటౌడీ కుటుంబం సవాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
చింటూగాడి రివెంజ్
పగలు మనుషులకేనా? ప్రకృతిలో ఉన్న ప్రతీ జీవికీ ఉంటుందా? అనే అనుమానాలు.. తరచూ జరిగే కొన్ని సంఘటనలు చూసినప్పుడు, విన్నప్పుడు కలగకమానదు. అయితే ఇక్కడో చింటూగాడి స్వీట్ రివెంట్ ఏకంగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రహ్లాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జనవరి 17వ తేదీన ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు తన కారులో బయల్దేరాడు. గల్లీ చివర అనుకోకుండా ఓ వీధి కుక్కను డ్యాష్ ఇచ్చాడు. దానికి పెద్దగా గాయాలు కాకపోయినా.. అరుస్తూ ఆ కారును కాస్త దూరం వెంబడించిందది. తిరిగి.. అర్ధరాత్రి టైంలో ప్రహ్లాద్ ఇంటికి చేరుకున్నాడు. కారును ఇంటి బయట పార్క్ చేసి ఆయన కుటుంబం నిద్రకు ఉపక్రమించింది. తెల్లారి లేచి చూసేసరికి కారు మీద గీతలు పడి ఉన్నాయి. చిన్నపిల్లల పనేమో అనుకుని సీసీటీవీ ఫుటేజీ తీసి చూశాడాయన. అయితే అందులో ఓ కుక్క కారుపై కసాబిసా తన ప్రతీకారం తీర్చుకోవడం కనిపించింది. ఆ కుక్క పొద్దున ఆయన కారుతో ఢీ కొట్టిందే. ఉదయం తన కారువెంట మొరుగుతూ పరిగెట్టిన కుక్కను చూసి నవ్వుకున్న ఆయన.. అదే శునకంగారి స్వీట్ రివెంజ్‌కు, జరిగిన డ్యామేజ్‌కు ఇప్పుడు తలపట్టుకుని కూర్చుకున్నారు. ఈ వీడియోతో పాటు ఆ టైంలో తన మొబైల్‌తో ఓ వ్యక్తి తీసిన వీడియో కూడా ఇప్పుడు అక్కడ వైరల్ అవుతోంది. Sagar: फिल्मी स्टाइल में कुत्ते ने लिया अपना बदला, टक्कर मारने वाली कार को ढूंढकर मारे स्क्रैच#sagar #dog #madhyapradesh #MPNews #filmystyle #cars pic.twitter.com/rhEWZ8lyHf— Bansal News (@BansalNewsMPCG) January 21, 2025 సాధారణంగా కుక్కలకు చింటూ అని పేరు పెట్టి.. తెలుగు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ చేస్తాయో తెలిసిందే కదా. అలా ఈ చింటూగాడి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. -
కూతుర్ని కొడుకులా పెంచిన తండ్రి.. పెళ్లి సమయంలో..
మగపిల్లలు లేని తల్లిదండ్రులు తమకున్న ఆడపిల్లలనే మగపిల్లలుగా భావిస్తూ పెంచుతుంటారు. ఈ క్రమంలో వారికి తగినంత స్వేచ్ఛనిస్తూ, సమస్తం సమకూరుస్తుంటారు. దీంతోవారు తమకు మగపిల్లలు లేరనే లోటును మరచిపోతుంటారు. ఇదిలా ఉంచితే నేటి కాలంలో ఆడపిల్లలు కూడా మగ పిల్లలతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాకు చెందిన ఒక తండ్రి తన కుమార్తెలోనే కుమారుడిని చూసుకున్నాడు. సాధారణంగా పెళ్లిళ్లలో వరుడు గుర్రపు స్వారీ చేయడాన్ని చూస్తుంటాం. కానీ ఖాండ్వాలో ఒక వధువు గుర్రపు స్వారీ చేసింది. దీనిని ఆమె తన తండ్రి కోరికను నెరవేర్చేందుకే చేసింది. ఖాండ్వాకు 8 కి.మీ. దూరంలో ఉన్న సుర్గావ్ జోషి గ్రామానికి చెందిన రైతు నానాజీ చౌదరి కుమార్తె వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.నానాజీ చౌదరి తన కుమార్తెను కొడుకులా భావించి పెంచిపెద్ద చేశాడు. ఇప్పుడు తన కుమార్తె పెళ్లిలోనూ తనకు కుమారుడు ఉన్న ముచ్చటను తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో తన కుమార్తెను గుర్రంపైకి ఎక్కించి, ఊరేగింపుగా వివాహ వేదికవద్దకు తీసుకువచ్చాడు. ఆమె వెనుక కుటుంబ సభ్యులు నృత్యాలు చేసుకుంటూ వచ్చారు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు ఆశ్చర్యపోయారు. పెళ్లి కుమార్తె భాగ్యశ్రీ చౌదరి ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి అజయ్ జిరాతిని వివాహం చేసుకున్నారు.ఈ సందర్భంగా వధువు బంధువు రవీంద్ర చౌదరి మాట్లాడుతూ భాగ్యశ్రీని ఆమె తండ్రి.. కుమారునిలా పెంచారని, పెళ్లిలో ఆమెను గుర్రంపైకి ఎక్కించాలని అనుకున్నారన్నారు. ఆయన కోరిన విధంగానే తామంతా గుర్రాన్ని తీసుకువచ్చి ఊరేగింపు వేడుక నిర్వహించామన్నారు. వధువు భాగ్యశ్రీ మాట్లాడుతూ తాను గుర్రంపై కూర్చుని ఊరేగింపుగా వివాహవేదిక వద్దకు చేరుకోవాలనేది తన తండ్రి కల అని, అది ఇప్పుడు నెరవేరిందన్నారు.ఇది కూడా చదవండి: ఈ దేశంలో యువత అధికం.. 15 ఏళ్ల లోపువారు మరీ అధికం -
ఇంటింటా లక్ష్మీకళ
ఆడపిల్ల పుడితే ‘అయ్యో’ అంటూ సానుభూతి చూపేవాళ్లు మన దేశంలో ఎన్నోచోట్ల కనిపిస్తారు.మధ్యప్రదేశ్‌లో ఈ ధోరణి మరీ ఎక్కువ. ఆడిపిల్ల పుడితే ఆర్థికభారంగా భావించి పురిట్లోనే ప్రాణం తీసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడానికి మన తెలుగు బిడ్డ, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ‘లాడ్లీ లక్ష్మీ యోజన’తో నడుం బిగించారు. ప్రతిష్ఠాత్మకమైన ‘బేటీ బచావో బేటీ పడావో’ కు స్ఫూర్తిగా నిలిచిన ఈ సంక్షేమ పథకాన్ని పదిహేను రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం...కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆడపిల్ల పుడితే భారంగా భావించడం నుంచి భ్రూణహత్యల వరకు ఎన్నో విషయాలపై మాట్లాడారు. ఆయన మాటల్లో ఎంతో ఆవేదన కనిపించింది. ‘ఈ పరిస్థితుల్లో మనం మార్పు తేవాలి’ అనే పట్టుదల కనిపించింది.ఇదీ చదవండి: Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి‘మనం మాత్రం ఏం చేయగలం సర్, ప్రజలు అలా ఆలోచిస్తున్నారు!’ అని ఆ అధికారులు చేతులెత్తేస్తే కథ కంచికి వెళ్లినట్లే. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. అక్కడినుంచే మొదలైంది. ముఖ్యమంత్రితో సమావేశం అయిన వారిలో ఐఏయస్ అధికారి నరహరి కూడా ఉన్నారు. ఒక సమస్యకు పది రకాల పరిష్కార మార్గాలు ఆలోచించడం ఆయన సొంతం.‘మనం ఏం చేయలేమా!’... సీఎం ఆవేదనపూరిత మాటలు నరహరి మనసులో సుడులు తిరిగాయి.‘కచ్చితంగా చేయాల్సిందే. చేయగలం కూడా’ అని ఒకటికి పదిసార్లు అనుకున్నారు. పేదింటి బిడ్డ అయిన నరహరికి పేదోళ్ల కష్టాలు తెలియనివేమీ కాదు. ఆడపిల్ల అంటే పనిగట్టుకొని వ్యతిరేకత లేకపోయినా పేదరికం వల్ల మాత్రమే ‘ఆడబిడ్డ వద్దు’ అనుకునే వాళ్లను ఎంతోమందిని చూశారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి హరియాణ, పంజాబ్... మొదలైన రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ఎన్నో కోణాలలో ఎన్నో ప్రశ్నలు వేశారు.‘మేం బతకడమే కష్టంగా ఉంది. ఇక ఆడబిడ్డను ఎలా బతికించుకోవాలి సారు’ అనే మాటలను ఎన్నో ప్రాంతాలలో విన్నారు. వారికి ఆర్థిక భరోసా ఇస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్లే కదా! అలా మొదలైందే లాడ్లీ లక్ష్మీ యోజన(గారాల కూతురు). ఇది సంక్షేమ పథకం మాత్రమే కాదు... సామాజిక మార్పు తెచ్చిన శక్తి. ఆడపిల్ల భారం అనే భావన తొలగించేందుకు వారికి ముందు ఆర్థిక భరోసా కల్పించాలి. అదే సమయంలో అమ్మాయిలను విద్యావంతులను చేయాలి... ఈ కోణంలో పథకానికి రూపకల్పన చేశారు. (అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు)‘పుట్టగానే అమ్మాయిని లక్షాధికారి చేస్తాం’ అని ప్రకటించారు. అయితే ఆ డబ్బు చేతికందడానికి షరతులు విధించారు. అమ్మాయి ఇంటర్ పూర్తి చేయాలి. 5వ తరగతి పూర్తి చేస్తే రూ.2000, 8వ తరగతి పూర్తి చేస్తే రూ.4000 చొప్పున ప్రతి తరగతికి బోనస్ చెల్లింపులు చేశారు. అమ్మాయికి పద్దెనిమిది ఏళ్లు వచ్చాక మాత్రమే ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ కు సంబంధించిన డబ్బులు చెల్లించేవారు. అలా పథకం వందశాతం విజయవంతమైంది.ఆడపిల్ల పుడితే రైఫిల్ లైసెన్స్!మధ్యప్రదేశ్‌లోని చంబల్లోయప్రాంతాల్లో కొన్ని కులాల ప్రజలు రైఫిల్‌ను సామాజిక హోదాగా భావిస్తారు. మగవారు సైకిల్ మీద తిరిగినా భుజాన తుపాకీ ఉండాల్సిందే! ఆడపిల్లలను పురిట్లోనే చంపేసేవారు కూడా ఆప్రాంతాల్లో ఎక్కువే. ఆప్రాంతాలలో ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ అంతగా ఫలితం ఇవ్వలేదు. దీంతో ప్రతి 1000 మంది బాలురకు 400 మంది బాలికలే మిగిలారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆయా కులాల వారితో సమావేశం నిర్వహించారు. ‘ఆడపిల్లలను మీరు వద్దనుకుంటూ పోతే వారే కాదు చివరికి మీ కులాలు త్వరలోనే అంతరించి పోవడం ఖాయం’ అని కులపెద్దలకు చెప్పారు. దీంతో వారిలో మార్పు వచ్చింది. అయితే తమకు తుపాకీ లైసెన్స్ లేకుండా ఉండలేమన్నారు. దీంతో ఆడపిల్ల పుడితే రైఫిల్ లైసెన్స్ అని నిబంధన విధించారు!2007 నుంచి 50 లక్షల మంది ఆడపిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. బాలికల లింగ నిష్పత్తి 400 నుంచి 950కి పెరిగింది. ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ ద్వారా సామాజిక ఫలాలు అందుతున్న తీరును అధ్యయనం చేసి ఎంతోమంది పీహెచ్డీ చేశారు.లింగ వివక్షకు తావు లేని సమాజాన్ని కల కంటున్నారు నరహరి. అది చారిత్రక అవసరం. తక్షణ అవసరం.భ్రూణహత్యల నివారణకు...‘లాడ్లీ లక్ష్మీ యోజన’ పథకం విజయవంతంగా అమలు చేస్తూనే మరోవైపు భ్రూణహత్యలపై దృష్టి సారించారు. ఇందుకోసం ఆశావర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, నర్సులు, కిందిస్థాయి సిబ్బందితో విస్తృతమైన విజిలెన్స్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. తప్పుదారి పట్టిన వైద్యులపై కేసులు నమోదు చేశారు. దీంతో చట్టాన్ని ఉల్లంఘించిన వైద్యులు దారికొచ్చారు.పేదింటి బిడ్డఎంతోమంది ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపిన నరహరిది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్. నిరుపేదింట జన్మించిన నరహరి కష్టపడి చదివి ఐఏఎస్ అయ్యారు. ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. జన్మభూమికి ఏదైనా చేయాలనే ఆశయంతో ‘ఆలయ ఫౌండేషన్ ’ స్థాపించి స్థానికంగా విద్య, వైద్య, ఆరోగ్య సంబంధమైన సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు.– భాషబోయిన అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి కరీంనగర్ -
ఇంటి బయట పోలీసులు ఇంట్లో మర్డర్
గ్వాలియర్(ఎంపీ): గొడవలు వద్దు, కూర్చుని మాట్లాడుకోండని సర్దిచెప్పేందుకు వచ్చిన పోలీసులు ఇంటిబయట ఉండగానే కూతురిని కన్న తండ్రి చంపేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అమ్మాయి బంధువు సైతం కాల్పులు జరిపినట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్వాలియర్‌లోని గోలా కా మందిర్ ప్రాంతంలో 45 ఏళ్ల మహేశ్ సింగ్ గుర్జార్‌కు 20 ఏళ్ల కూతురు ఉంది. జనవరి 18వ తేదీన ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. అయితే తనకిప్పుడు ఈ పెళ్లి ఇష్టంలేదని కుమార్తె చెప్పడంతో మహేశ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఎలాగైనా పెళ్లి జరగాల్సిందేనని మహేశ్ మేనల్లుడు రాహుల్ సైతం పట్టుబట్టి ఆమెను ఒప్పించే ప్రయత్నంచేశాడు. ముగ్గురి మధ్య వాగ్వాదం విషయం తెల్సి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వాళ్లు హుటాహుటిన పెళ్లింటికి వచ్చేశారు. పెళ్లి ఏర్పాట్లతో ఇళ్లంతా ముస్తాబు చేసిఉండటంతో లోపలికి వెళ్లకుండా మగ, ఆడ కానిస్టేబుల్స్ ఇంటి బయటే వేచి చూస్తున్నారు. ఎంతచెప్పినా పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మహేశ్, రాహుల్ ఒక నాటు తుపాకీ, పిస్టల్‌తో అమ్మాయిని కాల్చి చంపారు. నాలుగు బుల్లెట్లను కాల్చారు. బుల్లెట్ల మోతతో హుతాశులైన స్థానికులు, పోలీసులు ఇంట్లోకి పరుగులుతీశారు. అప్పటికే రాహుల్ అక్కడి నుంచి తప్పించుకోగా తండ్రి అక్కడే ఉన్నాడు. రక్తమోడుతున్న అమ్మాయిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పారిపోయిన బంధువు రాహుల్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. -
కానిస్టేబుల్ రూ.500 కోట్ల అక్రమాస్తులపై రాజకీయ దుమారం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో రవాణాశాఖ మాజీ కానిస్టేబుల్ ఇంట్లో ఏకంగా రూ.500 కోట్ల అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. బయటపడింది. గత నెలలో కానిస్టేబుల్ సౌరభ్ శర్మ ఇంట్లో లోకాయుక్త పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతని ఇంట్లో ఉన్న పాడుబడిన వాహనంలో ఏకంగా రూ.11 కోట్ల రూపాయల నగదు, 52 కిలోల బంగారం, ఒక డైరీ బయటపడింది. ఇంతేకాక శర్మ మొత్తంగా రూ.500 కోట్ల ఆస్తులు పోగేసినట్లు లోకాయుక్త పోలీసులు కనుగొన్నారు. శర్మ అవినీతి వ్యవహారం ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వల్లే ఈ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత జితూ పట్వారీ ఆరోపిస్తున్నారు. ఈ విషయం సౌరభ్‌శర్మ డైరీ చూస్తే తెలుస్తుందన్నారు. తనకు శర్మ డైరీలోని ఆరు పేజీలు మాత్రమే దొరికాయని పట్వారీ చెప్పారు. ఈ ఆరోపణలపై బీజేపీ ధీటుగా స్పందించింది. గతంలో అధికారంలో ఉన్న కమల్‌నాథ్ ప్రభుత్వం అవినీతికి మారుపేరుగా ఉండేదని కౌంటర్ ఇచ్చారు. అయితే కానిస్టేబుల్ సౌరభ్‌శర్మ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. -
నాలుగు రోజుల్లో కూతురి పెళ్లి : అంతలోనే కన్నతండ్రి కర్కశం
అణచివేతకు వ్యతిరేకంగా మహిళలు శతాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. అనేక రకాల హింసలకు వ్యతిరేకంగా గొంతెత్తున్నారు. సమానత్వం కోసం అలుపెరుగని పోరు చేస్తూనే ఉన్నారు. అయినా చాలా విషయాల్లోనూ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆధిపత్య కత్తి మహిళలపై వేటు వేస్తూనే ఉంది. చెప్పిన మాట వినలేదన్న ఆగ్రహంతో పంచాయతీ పెద్దలు, పోలీసుల ఎదుటే కర్కశంగా కన్నబిడ్డనే కడతేర్చిన ఘటన కంట తడి పెట్టిస్తుంది.20 ఏళ్ల కుమార్తె ‘తను’ ను పోలీసు అధికారులు, కుల పెద్దల ముందే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడో తండ్రి. తాను కుదిర్చిన వివాహం నచ్చలేదని సోషల్ మీడియా ద్వారా చెప్పినందుకే ఈ అఘాయిత్యానికి పూనుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దిగ్భ్రాంతికరమైన హత్య జరిగింది. మంగళవారం సాయంత్రం 9 గంటల ప్రాంతంలో నగరంలోని గోలా కా మందిర్ ప్రాంతంలో ఈ హత్య జరిగింది. పెళ్లికి నాలుగు రోజుల ముందు కూతుర్ని నాటు తుపాకీతో కాల్చి చంపాడుతండ్రి మహేష్ గుర్జార్. బంధువు రాహుల్ మహేష్‌కు తోడుగా నిలిచి, బాధితురాలపై కాల్పులు జరిపాడు.పెద్దలు కుదర్చిన సంబంధాన్ని కాదని తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేయడమే ఆమె చేసిన నేరం. జనవరి 18న పెద్దలు కుదిర్చిన వివాహానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ హత్య జరిగింది. ఇది ఇలా ఉంటే.. హత్యకు కొన్ని గంటల ముందు, తను ఒక వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిందిబాధితురాలు తను. తన ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకోవాలని బలవంతం చేసిందని ఆమె ఆరోపించింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తనకేదైనా అయితే తన తండ్రి మహేష్, ఇతర కుటుంబ సభ్యులతే బాధ్యత అని కూడా పేర్కొంది. (డార్క్ గ్రీన్ గౌనులో స్టైలిష్‌గా,ఫ్యాషన్ క్వీన్‌లా శోభిత ధూళిపాళ)52 సెకన్ల వీడియోలో ఇంకా ఇలా చెప్పింది. "నేను నా ఫ్రెండ్ విక్కీని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నా కుటుంబం మొదట్లో అంగీకరించింది కానీ తరువాత నిరాకరించింది. వారు నన్ను రోజూ కొట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు ఏదైనా జరిగితే, నా కుటుంబమే బాధ్యత వహిస్తుంది". అని తెలిపింది. దీంతో వీడియో వైరల్ అయింది. సూపరింటెండెంట్ ధర్మవీర్ సింగ్ నేతృత్వంలోని పోలీసు అధికారులు ఇద్దిర మధ్యా రాజీ కుదిర్చేందుకు మాట్లాడుతున్నారు. కమ్యూనిటీ పంచాయితీ పెద్దలు కూడా అక్కడే ఉన్నారు.ఈ సమయంలో తను ఇంట్లో ఉండటానికి తను నిరాకరించింది, తనను వన్-స్టాప్ సెంటర్ ( హింసకు గురైన మహిళలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంటర్)కు తీసుకెళ్లమని కోరింది. ఇంతలో ఆమె తండ్రి ఆమెతో ఏకాంతంగా మాట్లాడాలని పట్టుబట్టి, ఆమెను ఒప్పిస్తానని నమ్మబలికాడు. నాటు తుపాకీతో ఉన్న మహేష్, తన కుమార్తె ఛాతీపై కాల్చాడు. అదే సమయంలో, అక్కడే ఉన్న రాహుల్ కూడా విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. (‘భార్యను తదేకంగాఎంతసేపు చూస్తారు? : అమూల్ స్పందన, ఈ కార్టూన్లు చూస్తే!)కేసు నమోదు చేసిన పోలీసులు మహేష్‌ను అరెస్టు చేశారు. ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ రాహుల్ పిస్టల్‌తో తప్పించుకున్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా తను ప్రేమిస్తున్న వ్యక్తి "విక్కీ" ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నివాసి, గత ఆరేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. -
నలుగురిని కనండి.. లక్ష పట్టుకెళ్లండి
ఇండోర్: సమాజంలో బ్రాహ్మణుల జనాభా తగ్గిపోతోందని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి బ్రాహ్మణ జంట నలుగురిని కనాలని, నలుగురిని కన్న జంటలకు రూ.1 లక్ష బహుమతి ఇస్తానని మధ్యప్రదేశ్ పరశురామ్ కళ్యాణ్ బోర్డు చీఫ్ పండిత్ విష్ణు రాజోరియా వ్యాఖ్యానించారు. ఆదివారం ఇండోర్‌లో సనాధ్య బ్రాహ్మణ వర్గాల్లో పెళ్లీడు యువతీయువకుల పరిచయ సమ్మేళనం, వివాహ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘‘బ్రాహ్మణ యువ జంటలు చక్కటి సంపాదన, ఉద్యోగం ఉండి కూడా కేవలం ఒక సంతానంతో సరిపెట్టేస్తున్నారు. ఈ పద్ధతి మంచి కాదు. సమాజంలో బ్రాహ్మణుల జనాభా తగ్గుతోంది. స్వాతంత్య్ర వచ్చినప్పటితో పోలిస్తే సగానికి సగం తగ్గిపోయింది. హిందూయేతర జనాభా అమాంతం పెరుగుతోంటే మన వర్గీయులు జనాభా వ్యవహారాలపై దృష్టిపెట్టడమే మానేశారు. ఇకనైనా ప్రతి బ్రాహ్మణ జంట కనీసం నలుగురిని కనాలి. అలా నలుగురు సంతానం ఉన్న బ్రాహ్మణ కుటుంబాలకు తలో లక్ష రూపాయలు నగదు బహుమతిగా ఇస్తా. నేను పదవి నుంచి దిగిపోయాక కూడా ఇదే నజరానా కొనసాగేలా చూస్తా’’అని రాజోరియా అన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. ‘‘పరశురామ్ కళ్యాణ్ బోర్డ్‌తో దీనికి సంబంధం లేదు. నా స్వంత ఖర్చులతో, సమాజంలోని కొన్ని వర్గాల మద్దతుతో నగదు బహుమతి అందిస్తా. ఇలాంటి పథకంతో మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వానికి సంబంధం లేదు’’అని చెప్పారు. -
ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి..
దేశంలోని పలు ప్రాంతాల్లో హృదయవిదారక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. బృందావన్ ధామ్‌లోని ఒక ఇంట్లో ఫ్రిజ్‌లో ఒక మహిళ మృతదేహం బయటపడటంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది.ఒక ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దేవాస్ పోలీసు అధికారి అమిత్ సోలంకి తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. తాళాలు బద్దలుకొట్టి తలుపు తెరిచారు. లోపలున్న ఒక ఫ్రిజ్‌లో పోలీసులకు ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఆ మృతదేహానికి చేతులు, కాళ్లు కట్టివేసివున్నాయి. ఈ ఉదంతం వెలుగు చూసిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు.పోలీసుల దర్యాప్తు(Police investigation)లో ఆ ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ అని, ఆయన ఈ ఇంటిని 2023 జూలైలో సంజయ్ పాటిదార్‌కు అద్దెకు ఇచ్చారని తేలింది. సంజయ్ జూన్ 2024లో ఇల్లు ఖాళీ చేశాడు. కానీ ఒక ఫ్రిజ్‌తో సహా కొన్ని వస్తువులను ఒక గదిలోనే వదిలేశాడు. కాగా సంజయ్ పాటిదార్ గత ఐదు సంవత్సరాలుగా ప్రతిభా అలియాస్ పింకీ ప్రజాపతితో సహజీవనం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రతిభ వివాహం కోసం ఒత్తిడి తీసుకురావడంతో, ఆందోళనకు గురైన సంజయ్, తన స్నేహితుడు వినోద్ దేవ్‌తో కలిసి 2024 మార్చిలో ఆమెను గొంతు కోసి చంపాడు. తరువాత ఆ మృతదేహానికి చేతులు, కాళ్లు కట్టేసి ఫ్రిజ్(Fridge)లో దాచిపెట్టాడు.ఈ కేసులో సంజయ్ పాటిదార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని స్నేహితుడు వినోద్ ఇప్పటికే రాజస్థాన్‌లోని ఒక జైలులో ఉన్నాడు. సంజయ్ వివాహితుడని, వ్యవసాయ పనులు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. కాగా దేవాస్‌లో జరిగిన ఈ సంఘటన ఢిల్లీలోని శ్రద్ధా వాకర్(Shraddha Walker) హత్యను తలపించేలా ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా తన లివ్-ఇన్ పార్టనర్ శ్రద్ధను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో ఉంచాడు. తరువాత ఆ ముక్కలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ సంఘటన స్థానికులను భయకంపితులను చేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: ట్రంప్‌ను ఓడించేవాడిని: బైడెన్ పశ్చాత్తాపం -
హెల్మెట్ లేకుండా నడిచినందుకు ఫైన్!
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఆపి, ‘హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ కట్టు’అంటాడు ఓ సినిమాలో ట్రాఫిక్ పోలీస్. మధ్యప్రదేశ్‌లో పోలీసులు మరో అడుగు ముందుకేశారు! రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తకి హెల్మెట్ పెట్టుకోలేదంటూ రూ.300 జరిమానా విధించారు! పన్నా జిల్లాలో అజయ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత ఘటన జరిగింది. సుశీల్ కుమార్ శుక్లా అనే వ్యక్తి తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు అతిథులను ఆహ్వానించేందుకు వెళ్తుండగా ఓ పోలీసు వాహనం అడ్డగించింది. బలవంతంగా వాహనంలోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కుమార్తె పుట్టినరోజు వేడుకలకు ఇంటికి వెళ్లాల్సి ఉందని చెప్పినా పోలీసులు విన్పించుకోలేదు. పక్కనే ఉన్న ఓ బైకు రిజి్రస్టేషన్ నంబర్ రాసి మరీ, హెల్మెట్ లేకుండా వాహనం నడిపావంటూ శుక్లాకు జరిమానా విధించారు. దాంతో ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఆధారంగా తప్పక చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పోలీసుల కర్కశం.. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం మాది కాదయ్యా..
భోపాల్ : మానవత్వం చూపించాల్సిన పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోతే.. బాధితుడి భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి కార్యక్రమాలు నిర్వహించాల్సింది పోయి కర్కశాన్ని ప్రదర్శించారు. అచ్చం ‘జై భీమ్’(jai bhim) సినిమాలో పోలీస్ స్టేషన్లో తాము చేసిన దాడిలో గిరిజనుల చనిపోతే.. కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసులు బాధితుల మృతదేహాల్ని జిల్లాల సరిహద్దుల్ని ఎలా మార్చారో.. అలాగే ఈ విషాదంలో బాధితుడికి ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ రెండు రాష్ట్రాల పోలీసులు తప్పించుకున్నారు. డెడ్ బాడీని రోడ్డుమీద వదిలేశారు. చివరికి.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్ అహిర్వార్ (27) దినసరి కూలి. మధ్యప్రదేశ్ (madhya pradesh) నుంచి ఢిల్లీకి వచ్చి అక్కడే దొరికిన పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో రాహుల్ మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ ఓ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా నిన్న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించాడు. రాహుల్ మరణంపై సమాచారం అందుకున్న రాహుల్ సన్నిహితులు మధ్యప్రదేశ్‌లోని హర్పాల్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సన్నిహితుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన ప్రాంతం ఉత్తరప్రదేశ్(uttarpradesh)లోని మహోబా జిల్లాలోని మహోబ్‌కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.చేసేది లేక రాహుల్ భౌతిక కాయాన్ని అక్కడే ఉంచి ఉత్తర ప్రదేశ్ మహోబ్‌కాంత్ పీఎస్‌కు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. శవ పరీక్ష చేయించేందుకు నిరాకరించారు. ఇది తమ ప్రాంతం పరిధిలోకి రాదంటూ బుకాయించారు.దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు రోడ్డును దిగ్బంధించారు. ప్రమాదం జరిగిన నాలుగు గంటల తర్వాత మధ్యప్రదేశ్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపించారు. ఆ తర్వాతే గ్రామస్తులు రోడ్డును క్లియర్ చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.రాహుల్ మరణంతో అతడి కుటుంబ సభ్యులు రోడ్డుపై మృతదేహం పక్కనే రోదిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా యువకుడి బంధువు మాట్లాడుతూ...‘ మా కుటుంబ సభ్యుడు రాహుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. కానీ పోలీసులు కేసు నమోదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మృత దేహం గంటల తరబడి రోడ్డుపైనే ఉంది. మేం చేసిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన మధ్యప్రదేశ్ పోలీసులు.. ఈ ప్రదేశం మా ప్రాంతంలోకి రాదని మమ్మల్ని తిట్టారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించాలని కోరారు.పోలీసుల తీరుతో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగితే..రాత్రి 11 గంటల సమయంలో మృతదేహాన్ని రోడ్డుపై నుంచి బయటకు తీశారు’అని కన్నీరు మున్నీరయ్యారు. -
16 గంటలు శ్రమించినా దక్కని ప్రాణం.. బోరుబావిలో పడిన సుమిత్ మృతి
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణ జిల్లాలో బోరు బావి ఘటనలో బాలుడు సుమిత్ మీనా (Sumit Meena) విషాదాంతమైంది. శనివారం సాయంత్రం బోరు బావిలో పడిన 10ఏళ్ల బాలుడు సుమిత్ మీనాను రెస్యూ సిబ్బంది రక్షించారు. అయితే, చికిత్స పొందుతూ మరణించడంతో బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.గుణ జిల్లా (Guna District) రఘోఘర్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని పిప్లియా అనే గ్రామంలో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో సుమిత్ మీనా అనే బాలుడు ఆటలాడుకుంటూ 140 అడుగుల బోరుబావిలో పడ్డాడు. 39 అడుగుల లోతులోకి కూరుకుపోయాడు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు,రెస్క్యూ సిబ్బంది బాలుడిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. 16 గంటల పాటు శ్రమించి సుమిత్ మీనాను బోరుబావి (borewell) నుంచి సురక్షితంగా బయటకు తీశాయి. ఆదివారం ఉదయం 9.30గంటల సమయంలో అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. అయినప్పటికీ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు గుణ జిల్లా వైద్యాదికారి డాక్టర్ రాజ్‌కుమార్ రిషేశ్వర్ తెలిపారు.#WATCH | Guna, Madhya Pradesh: The 10-year-old boy, Sumit who fell into a borewell in the Janjali area of Raghogarh yesterday has been taken out and sent to a hospital. Details awaited. pic.twitter.com/5rSjIsv48j— ANI (@ANI) December 29, 2024 ‘బాలుడు రాత్రంతా చలి వాతావరణంలో బోర్‌వెల్‌లోనే ఉన్నాడు. అతని చేతులు, కాళ్ళు తడిసి వాచిపోయాయి.నోట్లోకి బురద చేరింది.మోతాదుకు మించి (అల్పోష్ణస్థితి) నీరు చేరడం వల్ల బాలుడి అంతర్గత భాగాల పనితీరు స్తంభించి పోయింది. సకాలంలో మెరుగైన వైద్యం అందించినా సమయం మించిపోయినందున బాలుడిని కాపాడుకోలేకపోయాం’అని విచారం వ్యక్తం చేశారు. -
బ్యాంకులకు కొత్త టైమింగ్స్.. జనవరి 1 నుంచే..
వివిధ పనుల నిమిత్తం నిత్యం బ్యాంకులకు (Banks) వెళ్తుంటారా..? అయితే ఈ వార్త మీకోసమే. బ్యాంక్ తెరిచే వేళలు, మూసే సమయం ఒక్కో బ్యాంకుకు ఒక్కో రకంగా ఉంటున్నాయి. దీంతో ప్రజలు చాలాసార్లు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలను మెరుగుపరచడానికి మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జాతీయ బ్యాంకుల పని వేళలు (Bank Timings) ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంది.ఈ మార్పులు 2025 జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు ఉదయం 10 గంటలకు తెరిచి సాయంత్రం 4 గంటలకు మూసివేస్తారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. బ్యాంకింగ్ సేవలను క్రమబద్ధీకరించడంలో ఈ చర్య సహాయపడుతుందని కమిటీ అభిప్రాయపడింది.మార్పు ఎందుకంటే..వివిధ బ్యాంకులకు వేర్వేరు సమయాల కారణంగా ఖాతాదారులు గందరగోళానికి గురవుతున్నారు. చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని బ్యాంకులు ఉదయం 10 గంటలకు తెరుచుకోగా, మరి కొన్ని బ్యాంకులు 10:30 లేదా 11 గంటలకు తెరుచుకుంటున్నాయి. ఈ వ్యత్యాసం కారణంగా ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు వెళ్లాల్సిన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కస్టమర్లు ఇప్పుడు వివిధ బ్యాంక్ షెడ్యూల్ల ప్రకారం ప్రణాళిక లేకుండా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఏ బ్యాంకుకు అయినా వెళ్లవచ్చు. ఏకరీతి పని వేళలు ఉండటం వల్ల గందరగోళం తగ్గుతుంది. వినియోగదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు.అన్ని బ్యాంకులు ఒకే సమయంలో పని చేయడం వల్ల ఇంటర్-బ్యాంక్ లావాదేవీలు, కస్టమర్ రిఫరల్స్ వంటి సేవల్లో మెరుగైన సమన్వయం ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులకు కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆఫీసు షిఫ్ట్‌ల మెరుగైన ప్రణాళికలో సహాయపడుతుంది. మధ్యప్రదేశ్ తీసుకున్న ఈ చర్యను దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా అనుసరించవచ్చు. -
అంబేడ్కర్ కృషిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు
ఖజురహో: దేశంలో జల వనరుల అభివృద్ధికి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చేసిన కృషిని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. 21వ శతాబ్దంలో తగనన్ని జల వనరులతోపాటు వాటి నిర్వహణలో మెరుగ్గా ఉన్న దేశాలే ప్రగతి పథంలో ముందుకు సాగుతాయని స్పష్టంచేశారు. 21వ శతాబ్దంలో నీటి సంరక్షణే అతిపెద్ద సవాలు అని తేలి్చచెప్పారు. బుధవారం మధ్యప్రదేశ్‌లో కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఖజురహోలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. అంబేడ్కర్ అందించిన సేవలను కొనియాడారు. మన దేశంలో జల వనరుల బలోపేతానికి, నిర్వహణకు, డ్యామ్‌ల నిర్మాణానికి అంబేడ్కర్ దార్శనికత, దూరదృష్టి ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఏర్పాటు వెనుక అంబేడ్కర్ కృషి ఉందన్నారు. అతిపెద్ద నదీ లోయ ప్రాజెక్టుల అభివృద్ధికి ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. జల సంరక్షకుడు అంబేడ్కర్‌ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. జల సంరక్షణ ప్రాధాన్యతను సైతం పక్కనపెట్టాయని విమర్శించారు. ఈ సందర్భంగా దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్, రూ.100 నాణాన్ని మోదీ విడుదల చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 1,153 అటల్ గ్రామ్ సేవా సదనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.437 కోట్లతో ఈ సదనాలు నిర్మిస్తారు. నేడు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకంతో ప్రాజెక్టులు ఆలస్యం మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. నదుల అనుసంధానంలో భాగంగా దౌధన్ సాగునీటి ప్రాజెక్టుకు సైతం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కెన్–బెత్వా నదుల నీటిని నింపిన రెండు కలశాలను ప్రధాని మోదీకి అందజేశారు. రెండు నదుల అనుసంధాన ప్రాజెక్టు నమూనా(మోడల్)లో మోదీ ఈ నీటిని ధారగా పోశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని లాంఛనంగా ఆరంభించారు. కెన్–బెత్వా నదుల అనుసంధానంతో బుందేల్‌ఖండ్ ప్రాంతంలో సౌభాగ్యం, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని మోదీ ఉద్ఘాటించారు. రూ.44,605 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్‌లో 44 లక్షల మందికి, ఉత్తరప్రదేశ్‌లో 21 లక్షల మందికి తాగునీరు లభించనుంది. 2,000 గ్రామాల్లో 7.18 లక్షల వ్యవసాయ కుటుంబాలు లబ్ధి పొందుతాయి. అలాగే 103 మెగావాట్ల హైడ్రోపవర్, 27 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతుంది. -
సుర్యాంశ్ షేడ్గే ఊచకోత.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంబైదే
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని ముంబై జట్టు కైవసం చేసుకుంది. ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన ఫైనల్లో ముంబై మధ్యప్రదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్.. కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 81 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ చివరి వరకు క్రీజ్‌లో నిలబడి మధ్యప్రదేశ్‌కు ఫైటింగ్ టోటల్ అందించాడు. ఇన్నింగ్స్ చివరి రెండు ఓవర్లలో పాటిదార్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సుభ్రాన్షు సేనాపతి (23), హర్‌ప్రీత్ సింగ్ (15), వెంకటేశ్ అయ్యర్ (17), రాహుల్ బాథమ్ (19) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆర్పిత్ గౌడ్ (3), హర్ష్ గావ్లి (2), త్రిపురేశ్ సింగ్, శివమ్ శుక్లా (1) సింగిల్ డిజిట్ స్కోర్లరే పరిమితమయ్యారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకోలేకర్, శివమ్ దూబే, సుయాంశ్ షేడ్గే తలో వికెట్ దక్కించుకున్నారు.రాణించిన రహానే, స్కై.. షేడ్గే, అంకోలేకర్ ఊచకోత175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఆదిలోనే పృథ్వీ షా (10) వికెట్ కోల్పోయింది. అయితే రహానే (30 బంతుల్లో 37), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9 బంతుల్లో 16) ఏమాత్రం తగ్గకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మధ్యలో సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 48) తనదైన స్టయిల్లో విరుచుకుపడ్డాడు. చివర్లో శివమ్ దూబే (6 బంతుల్లో 9), అథర్వ అంకోలేకర్ (6 బంతుల్లో 16 నాటౌట్), సూర్యాంశ్ షేడ్గే (15 బంతుల్లో 36 నాటౌట్) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి ముంబైని గమ్యానికి చేర్చారు. ముఖ్యంగా షేడ్గే మధ్యప్రదేశ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అంకోలేకర్ సిక్సర్ బాది మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దేశవాలీ క్రికెట్లో ముంబైకు ఇది 63వ టైటిల్. రెండో సయ్యద్ ముస్తాక్ అలీ టైటిల్. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన రహానేకు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు, ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సూర్యాంశ్ షేడ్గేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు లభించాయి. సూర్యాంశ్ షేడ్గేను ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ కేవలం 30 లక్షలకు సొంతం చేసుకుంది. -
SMAT Final: రజత్ పాటిదార్ విధ్వంసం
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఫైనల్లో మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటిదార్ విధ్వంసం సృష్టించాడు. మధ్యప్రదేశ్, ముంబై జట్ల మధ్య బెంగళూరు వేదికగా ఇవాళ (డిసెంబర్ 15) ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి మధ్యప్రదేశ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. రజత్ పాటిదార్ చివరి రెండు ఓవర్లలో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సుయాంశ్ షేడ్గే వేసిన 19వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన పాటిదార్.. శార్దూల్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ కొట్టాడు. అంతకుముందు మధ్యప్రదేశ్‌కు ఇన్నింగ్స్ 18వ ఓవర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఓవర్లో రాయ్స్టన్ డయాస్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. ఆ ఓవర్లో మొదటి రెండు బంతులకు రాహుల్ బాథమ్ సిక్సర్, బౌండరీ బాదాడు. అయితే ఆ తర్వాతి బంతికే రాయ్స్టన్ డయాస్ బౌలింగ్‌లో బాథమ్ ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో రజత్ పాటిదార్ ఒంటరిపోరాటం చేశాడు. ఓ పక్క సహచరులంతా పెవిలియన్‌కు చేరుతున్నా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పాటిదార్ ఆతర్వాత మరింత రెచ్చిపోయి ఆడాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సుభ్రాన్షు సేనాపతి (23), హర్‌ప్రీత్ సింగ్ (15), వెంకటేశ్ అయ్యర్ (17), రాహుల్ బాథమ్ (19) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆర్పిత్ గౌడ్ (3), హర్ష్ గావ్లి (2), త్రిపురేశ్ సింగ్, శివమ్ శుక్లా (1) సింగిల్ డిజిట్ స్కోర్లరే పరిమితమయ్యారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకోలేకర్, శివమ్ దూబే, సుయాంశ్ షేడ్గే తలో వికెట్ దక్కించుకున్నారు. -
టైటిల్ వేటలో ముంబై, మధ్యప్రదేశ్
బెంగళూరు: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ముంబై జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న తుది పోరులో మధ్యప్రదేశ్‌తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ దశలో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన ముంబై జట్టు టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంటే... 13 ఏళ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించిన మధ్యప్రదేశ్ జట్టు ఇదే జోష్‌లో ట్రోఫీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ముంబై జట్టు స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతుండగా... మధ్యప్రదేశ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ముంబై జట్టులో అజింక్య రహానే, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ వంటి టీమిండియా ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ జట్టుకు రజత్ పటిదార్ సారథ్యం వహిస్తుండగా... ఇటీవల ఐపీఎల్ వేలంలో రికార్డు ధర (రూ. 23.75 కోట్లు) దక్కించుకున్న పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కీలకం కానున్నాడు. భారత టి20 జట్టు కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే తన మెరుపులతో అదరగొడుతున్నాడు. సంప్రదాయ ఆటతీరుకు చిరునామా అయిన రహానే... భారీ హిట్టింగ్తో విరుచుకుపడుతూ ముంబై జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించాడు. తాజా టోర్నీలో 8 మ్యాచ్‌లాడిన రహానే 170కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో 432 పరుగులు సాధించాడంటే అతడి జోరు ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న శ్రేయస్ అయ్యర్ 189 స్ట్రయిక్ రేట్‌తో 329 పరుగులు సాధించాడు. పృథ్వీ షా అడపాదడపా మెరుగైన ప్రదర్శన చేస్తుండగా... సూర్యకుమార్ రాణించాల్సిన అవసరముంది. మిడిలార్డర్లో శివమ్ దూబేతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ సూర్యాన్‡్ష షెగ్డే భారీ షాట్లు ఆడగల సమర్థులే. బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, తనుష్ కోటియాన్, సూర్యాన్‡్ష, అథర్వ కీలకం కానున్నారు.మరోవైపు సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్ జట్టు... తుది పోరులోనూ అదే కొనసాగించాలని భావిస్తోంది. ‘మా జట్టు సామర్థ్యంపై నమ్మకముంది. ఎవరితో తలపడుతున్నామనే విషయాన్ని పెద్దగా ఆలోచించడం లేదు. దీన్ని కూడా మరో మ్యాచ్‌లాగే చూస్తున్నాం. మెరుగైన ప్రదర్శనతో ట్రోఫీ చేజిక్కించుకోవడమే మా లక్ష్యం’ అని మధ్యప్రదేశ్ కెపె్టన్ రజత్ పటిదార్ అన్నాడు. ఈ టోర్నీలో పటిదార్ 183 స్ట్రయిక్ రేట్‌తో 347 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉన్నాడు. మిడిలార్డర్లో వెంకటేశ్ అయ్యర్ హిట్టింగ్ జట్టుకు బలం కానుంది. ఈ టోర్నీలో అతడు 162 స్ట్రయిక్ రేట్‌తో 210 పరుగులు సాధించడంతో పాటు... ఉపయుక్తకరమైన మీడియం పేస్‌తో 6 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్, త్రిపురేశ్ సింగ్, కుమార్ కార్తికేయ మధ్యప్రదేశ్ బౌలింగ్ భారం మోయనున్నారు. -
మధ్యప్రదేశ్ X ముంబై
దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు తుదిపోరుకు దూసుకెళ్లాయి. సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే దంచి కొట్టడంతో బరోడాపై ముంబై జట్టు ఘనవిజయం సాధిస్తే.... కెప్టెన్ రజత్ పాటిదార్ మెరుపులతో ఢిల్లీపై మధ్యప్రదేశ్ పైచేయి సాధించింది. బెంగళూరులో ఆదివారం జరగనున్న ఫైనల్లో మధ్యప్రదేశ్‌తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూరు: సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ముంబై జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో అడుగు పెట్టింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో బరోడాను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శివాలిక్ శర్మ (24 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... కెపె్టన్ కృనాల్ పాండ్యా (30; 4 ఫోర్లు), శాశ్వత్ రావత్ (33; 4 ఫోర్లు) రాణించారు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (5) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ముంబై బౌలర్లలో సుర్యాంశ్ షెగ్డే 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 17.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రహానే త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. ఈ టోర్నీలో ఫుల్ ఫామ్ కనబర్చిన రహానే... బరోడా బౌలర్లను కుదురుకోనివ్వకుండా మైదానం నలువైపులా షాట్లతో అలరించాడు. ఓపెనర్ పృథ్వీ షా (8), సూర్యకుమార్ యాదవ్ (1) విఫలమైనా... లక్ష్యం పెద్దది కాకపోవడంతో ముంబై జట్టుకు పెద్దగా ఇబ్బందులు ఎదురవలేదు. బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అతిత్ సేత్, అభిమన్యు సింగ్, శాశ్వత్ రావత్ తలా ఒక వికెట్ తీశారు. రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 13 ఏళ్ల తర్వాత... ఢిల్లీతో జరిగిన రెండో సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ ఢిల్లీని చిత్తుచేసిన మధ్యప్రదేశ్ జట్టు 13 ఏళ్ల తర్వాత ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. వికెట్ కీపర్ అనూజ్ రావత్ (33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్‡్ష ఆర్య (29; 3 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ రావత్ (24; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకోవడంతో... ఢిల్లీ జట్టు పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ 2 వికెట్లు పడగొట్టగా... త్రిపురేశ్ సింగ్, అవేశ్ ఖాన్, కుమార్ కార్తికేయ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో మధ్యప్రదేశ్ జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 152 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ (29 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... హర్‌ప్రీత్ సింగ్ (38 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్‡్ష (18 బంతుల్లో 30, 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ముఖ్యంగా రజత్ పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలింగ్‌ను ఏమాత్రం లెక్కచేయని రజత్ భారీ షాట్లతో విజృంభించాడు. హర్‌ప్రీత్‌తో కలిసి రజత్ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 57 బంతుల్లోనే 106 పరుగులు జోడించడంతో... మధ్యప్రదేశ్ జట్టు మరో 26 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 2 వికెట్లు, హిమాన్షు చౌహాన్ ఒక వికెట్ తీశారు. రజత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
రెచ్చిపోయిన రజత్ పాటిదార్.. ఫైనల్లో మధ్యప్రదేశ్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మధ్యప్రదేశ్ ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ (డిసెంబర్ 13) సాయంత్రం జరిగిన రెండో సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. అనుజ్ రావత్ (33 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ప్రియాన్ష్ ఆర్య 29, యశ్ ధుల్ 11, ఆయుశ్ బదోని 19, హిమ్మత్ సింగ్ 15, మయాంక్ రావత్ 24, హర్ష్ త్యాగి 9 (నాటౌట్) పరుగులు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్ 2, కుమార్ కార్తికేయ, ఆవేశ్ ఖాన్, త్రిపురేశ్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. రెచ్చిపోయిన రజత్ పాటిదార్147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్.. రజత్ పాటిదార్ రెచ్చిపోవడంతో 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రజత్ పాటిదార్ 29 బంతుల్లో 4 ఫోర్లు, అర డజన్లు సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాటిదార్‌కు హర్‌ప్రీత్ సింగ్ భాటియా (46 నాటౌట్) సహకరించాడు. ఆదిలో ఓపెనర్ హర్ష్ గావ్లి (30) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. హిమాన్షు చౌహాన్ ఓ వికెట్ తీశాడు.ఫైనల్లో మధ్యప్రదేశ్ఢిల్లీపై గెలుపుతో మధ్యప్రదేశ్ ఫైనల్లోకి ప్రవేశించింది. డిసెంబర్ 15న జరిగే ఫైనల్లో మధ్యప్రదేశ్ ముంబైని ఢీకొంటుంది. ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బరోడాపై గెలిచి ముంబై ఫైనల్‌కు చేరింది. రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించి ముంబైని ఒంటిచేత్తో గెలిపించాడు. -
బంతితో రాణించిన వెంకటేశ్ అయ్యర్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ ఆటగాడు, టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ బంతితో రాణించాడు. ఢిల్లీతో ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ రెండు ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయ్యర్‌తో పాటు కుమార్ కార్తికేయ (3-0-23-1), ఆవేశ్ ఖాన్ (4-0-36-1), త్రిపురేశ్ సింగ్ (3-0-18-1) వికెట్లు తీయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. అనుజ్ రావత్ (33 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ప్రియాన్ష్ ఆర్య 29, యశ్ ధుల్ 11, ఆయుశ్ బదోని 19, హిమ్మత్ సింగ్ 15, మయాంక్ రావత్ 24, హర్ష్ త్యాగి 9 (నాటౌట్) పరుగులు చేశారు. ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బరోడాపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శాశ్వత్ రావత్ (33), కృనాల్ పాండ్యా (30), శివాలిక్ శర్మ (26 నాటౌట్), అథీత్ సేథ్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హార్దిక్ పాండ్యా 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.159 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించడంతో 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రహానేకు జతగా శ్రేయస్ అయ్యర్ (46) కూడా కాసేపు మెరుపులు మెరిపించాడు.భీకర ఫామ్‌లో రహానేముంబై వెటరన్ అజింక్య రహానే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న రహానే.. ఈ టోర్నీలో గత ఆరు మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు.గత ఆరు మ్యాచ్‌ల్లో రహానే చేసిన స్కోర్లు..- 52(34) vs మహారాష్ట్రపై- 68(35) vs కేరళపై - 22(18) vs సర్వీసెస్‌పై- 95(53) vs ఆంధ్రపై- 84(45) vs క్వార్టర్ ఫైనల్లో విదర్భపై- 98(57) vs సెమీస్‌లో బరోడాపై -
వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షో.. సెమీస్‌లో మధ్యప్రదేశ్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ అడుగుపెట్టింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసిన మధ్యప్రదేశ్.. తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. సౌరాష్ట్ర బ్యాటర్లలో చిరాగ్ జాని(80) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్విక్ దేశాయ్917), మన్కడ్916) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. త్రిపురేష్ సింగ్, రాహుల్ బాథమ్, శుక్లా తలా వికెట్ సాధించారు.అదరగొట్టిన అర్పిత్, అయ్యర్.. అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని మధ్యప్రదేశ్ 4 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. మధ్యప్రదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ అర్పిత్ గౌడ్(42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరితో పాటు హర్‌ప్రీత్ సింగ్ భాటియా(9 బంతుల్లో 22) మెరుపు మెరిపించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కట్, అనుకుర్ పన్వార్, జాని తలా వికెట్ సాధించారు. కాగా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మరోవైపు సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ ప్రత్యర్ధి ఎవరో బెంగాల్, బరోడా మ్యాచ్‌తో తేలనుంది.చదవండి: PAK vs SA: షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు.. -
13 బంగారు పతకాలు, తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : ఎవరీ శ్రద్ధా
సాధించాలన్న పట్టుదల, కృషి,అచంచలమైన సంకల్ప శక్తి ఇవి ఉంటే చాలు. ఎలాంటి వారైనా తమ కలలను సాకారం చేసుకోవచ్చు. ఈవిషయాన్నే తన విజయం ద్వారా నిరూపించింది ఓ యువతి. ఒకటి కాదు రెండు ఏకంగా 13 బంగారు పతకాలను సాధించింది. CLATలలో అగ్రస్థానంలో నిలిచి, బంగారు పతకాలు సాధించడమే కాకుండా, యూపీఎస్సీలో మంచి (60) సాధించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన శ్రద్ధా గోమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం రండి!శ్రద్ధా గోమ్ తండ్రి రిటైర్డ్ SBI అధికారి. ఆమె తల్లి వందన గృహిణి. శ్రద్ధా చిన్నప్పటినుంచీ తెలివైన విద్యార్థిని. ఇండోర్‌లోని సెయింట్ రాఫెల్స్ హెచ్ఎస్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ అగ్రస్థానంలో నిలిచింది.తరువాత శ్రద్ధా గోమ్ న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించాలని బావించింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)లో టాపర్‌గా నిలిచింది. ఈ ఘనత ఆమె ప్రతిష్టాత్మకమైన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU), బెంగుళూరు, భారతదేశంలోని అత్యుత్తమ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందింది. అత్యుత్తమ ప్రతిభకు గాను అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రచేతులమీదుగా 13 బంగారు పతకాలను అందుకుంది. ఇలాంటి అవార్డులు, రివార్డుల పరంపరకొనసాగుతూనే ఉంది. (మసాబా మెచ్చిన చ్యవన ప్రాశ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!)హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీలో లీగల్ మేనేజర్‌గా పనిచేసింది. ముంబై, లండన్‌లో విలువైన అనుభవాన్ని పొందింది. తరువాత తన స్వస్థలమైన ఇండోర్‌కు తిరిగొచ్చి, 2021లొ సివిల్ సర్వీసెస్‌కు (సీఎస్ఈ) ప్రిపేర్ అయింది. ఇంటర్నెట్ ద్వారా స్టడీ మెటీరియల్ సమకూర్చుకుని స్వయంగా పరీక్షకు సిద్ధమైంది. మొక్కవోని దీక్షతో చదివి తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రద్ధా మంచి ఆర్టిస్ట్ కూడా. -
జయహో జార్ఖండ్
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న జార్ఖండ్ జట్టు ఈసారి మాత్రం విన్నర్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో జార్ఖండ్ విజేతగా అవతరించింది. హోరాహోరీగా సాగిన తుది సమరంలో పుష్పా డాంగ్ సారథ్యంలోని జార్ఖండ్ జట్టు 1–0 గోల్ తేడాతో కృష్ణ శర్మ నాయకత్వంలోని మధ్యప్రదేశ్ జట్టును ఓడించింది. ఆట 15వ నిమిషంలో ఎడమ వైపు నుంచి జమునా కుమారి బంతితో దూసుకెళ్లి హెమ్రోమ్ లియోనికి పాస్ అందించింది. హెమ్రోమ్ ఎలాంటి తప్పిదం చేయకుండా బంతిని లక్ష్యానికి చేర్చింది. దాంతో జార్ఖండ్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ జట్టు స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసింది. అయితే జార్ఖండ్ డిఫెన్స్ అత్యంత పటిష్టంగా ఉండటంతో చివరకు మధ్యప్రదేశ్‌కు ఓటమి తప్పలేదు. గత ఏడాది ఫైనల్లో హరియాణా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన జార్ఖండ్ ఈసారి మాత్రం టోర్నీ మొత్తం పకడ్బందీ ఆటతీరుతో అదరగొట్టింది.టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడని జార్ఖండ్ ప్రత్యర్థి జట్లకు ఒకే ఒక్క గోల్ సమర్పించుకోవడం విశేషం. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మిజోరం జట్టు 4–3 గోల్స్ తేడాతో ఒడిశా జట్టుపై గెలిచింది. విజేతగా నిలిచిన జార్ఖండ్ జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ. 3 లక్షలు... రన్నరప్ మధ్యప్రదేశ్‌కు రూ. 2 లక్షలు... మూడో స్థానంలో నిలిచిన మిజోరం జట్టుకు రూ. 1 లక్ష ప్రైజ్‌మనీని ప్రకటించారు. బహుమతి ప్రదానోత్సవంలో హాకీ ఇండియా కార్యదర్శి భోళానాథ్ సింగ్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (ఎస్ఏటీజీ) చైర్మన్ శివసేనా రెడ్డి, ఎస్ఏటీజీ మేనేజింగ్ డైరెక్టర్ సోనీబాలా దేవి, తెలంగాణ హాకీ సంఘం కార్యదర్శి భీమ్ సింగ్, అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 272 మొత్తం 28 జట్లు పాల్గొన్న జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో నమోదైన మొత్తం గోల్స్. ఇందులో 191 ఫీల్డ్ గోల్స్, 76 పెనాల్టీ కార్నర్ గోల్స్, 5 పెనాల్టీ స్ట్రోక్ గోల్స్ ఉన్నాయి. -
MP Vs HYD: రజత్ పాటిదార్ మెరుపులు.. తిలక్ వర్మను వెంటాడిన దురదృష్టం
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. పేలవ ఆటతీరు కొనసాగించిన తిలక్ సేన.. నాలుగో పరాజయంతో నాకౌట్ దశకు చేరే అవకాశాలను కోల్పోయింది.గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు మధ్యప్రదేశ్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 179 పరుగుల లక్ష్యఛేదనలో 14 ఓవర్లు ముగిసేసరికి 125/3తో పటిష్ట స్థితిలో కనిపించిన హైదరాబాద్ జట్టు ఆ తర్వాత మిడిలార్డర్ వైఫల్యంతో 16 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి పరాజయాన్ని మూట గట్టుకుంది.రజత్ పాటిదార్ మెరుపులుటాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హర్ష్ గావ్లి (29 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా... సుభ్రాంషు సేనాపతి (42; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ రజత్ పాటిదార్ (16 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో చామా మిలింద్, అజయ్‌దేవ్ గౌడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.తిలక్ వర్మను వెంటాడినన దురదృష్టంఅనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ ఠాకూర్ తిలక్ వర్మ (34 బంతుల్లో 46; 1 ఫోర్, 2 సిక్స్‌లు), తన్మయ్ అగర్వాల్ (33 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. దీంతో హైదరాబాద్ విజయందిశగా సాగిపోయింది. అయితే మధ్యప్రదేశ్ బౌలర్లు విజృంభించడంతో హైదరాబాద్ మిడిలార్డర్ కుప్పకూలింది.మికిల్ జైస్వాల్ (0), ప్రతీక్ రెడ్డి (1), తనయ్ త్యాగరాజన్ (9) విఫలమయ్యారు. చివర్లో మిలింద్ (19; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడినా హైదరాబాద్ జట్టును గట్టెక్కించలేకపోయాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో కుమార్ కార్తికేయ, కమల్ త్రిపాఠి చెరో 3 వికెట్లు తీశారు. మొత్తం 8 జట్లున్న గ్రూప్ ‘ఎ’లో 6 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు రెండింటిలో గెలిచి, నాలుగింటిలో ఓడిపోయి 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. గురువారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో మిజోరంతో హైదరాబాద్ తలపడనుంది. స్కోరు వివరాలు మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్: సుభ్రాంషు సేనాపతి (సి) రాహుల్ బుద్ధి (బి) నితిన్ సాయి యాదవ్ 42; హర్ష్ గావ్లి (సి) తన్మయ్ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 51; రజత్ పాటిదార్ (సి) రోహిత్ రాయుడు (బి) నితిన్‌సాయి యాదవ్ 36; హర్‌ప్రీత్ సింగ్ (సి) తిలక్ వర్మ (బి) మిలింద్ 12; వెంకటేశ్ అయ్యర్ (సి) తనయ్ త్యాగరాజన్ (బి) మిలింద్ 22; అనికేత్ వర్మ (బి) మిలింద్ 0; రాహుల్ బాథమ్ (సి) నితిన్‌సాయి యాదవ్ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 5; కమల్ త్రిపాఠి (సి) తిలక్ వర్మ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 1; కుమార్ కార్తికేయ (నాటౌట్) 0; అవేశ్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–92, 2–105, 3–142, 4–151, 5–151, 6–163, 7–165, 8–177. బౌలింగ్: రవితేజ 4–0–42–0; మిలింద్ 4–0–33–3; అజయ్ దేవ్ గౌడ్ 4–0–20–3; తనయ్ 4–0–51–0; నితిన్ సాయి 4–0–29–2.హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) కమల్ త్రిపాఠి (బి) కార్తికేయ 47; రోహిత్ రాయుడు (సి) హర్‡్ష (బి) అవేశ్ ఖాన్ 8; తిలక్ వర్మ (సి) అనికేత్ వర్మ (బి) కమల్ త్రిపాఠి 46; రాహుల్ బుద్ధి (సి) అనికేత్ వర్మ (బి) కార్తికేయ 20; మికిల్ జైస్వాల్ (సి) రజత్ (బి) కార్తికేయ 0; ప్రతీక్ రెడ్డి (సి అండ్ బి) కమల్ త్రిపాఠి 1; తనయ్ త్యాగరాజన్ (సి) కార్తికేయ (బి) కమల్ త్రిపాఠి 9; అజయ్‌దేవ్ గౌడ్ (సి) పాటిదార్ (బి) అవేశ్ ఖాన్ 12; మిలింద్ (సి) అనికేత్ వర్మ (బి) రాహుల్ బాథమ్ 19; రవితేజ (నాటౌట్) 1; నితిన్‌సాయి యాదవ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–31, 2–87, 3–125, 4–125, 5–127, 6–128, 7–143, 8–167, 9–168.బౌలింగ్: అవేశ్ ఖాన్ 4–0–31–2; ఖెజ్రోలియా 2–0–30–3; రాహుల్ 3–0–27–1; కమల్ 4–0–31–3; వెంకటేశ్ అయ్యర్ 3–0–24–0; కార్తికేయ 4–0–25–3. చదవండి: సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. శివమ్ దూబే ఊచకోత -
దాడిలో భర్త మృతి.. గర్భిణి భార్య చేత బెడ్ శుభ్రం చేయించి..
దిండోరి: మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో మానవత్వం మంటగలిగిన ఉదంతం చోటుచేసుకుంది. దాడిలో ఒక యువకుడు మృతి చెందగా, పుట్టెడు దు:ఖంలో మునిగిన అతని భార్యకు ఆస్పత్రిలో ఘోర అవమానం ఎదురయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఉదంతం దిండోరి జిల్లాలోని గడసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే లాల్పూర్ గ్రామంలో చోటుచేసుకున్న భూ వివాదం రక్తాపాతానికి దారితీసింది. భూవివాదం కారణంగా ఓ వర్గం ఒక కుటుంబ సభ్యులపై పదునైన ఆయుధాలతో దాడికి తెగబడింది. ఆ కుటుంబ పెద్దతో పాటు అతని ముగ్గురు కుమారులపై నిందితులు దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధ తండ్రితో పాటు అతని ముగ్గురు కుమారుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.బాధిత కుటుంబానికి చెందిన సోదరులు శివరాజ్, రామరాజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని స్థానికులు గడసరాయ్లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే శివరాజ్ ఆరోగ్య కేంద్రంలోని మంచంపై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం శివరాజ్ భార్య తన భర్త మృతిచెందిన బెడ్‌పై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. దీంతో జిల్లా వైద్య యంత్రాంగంలో కలకలం చెలరేగింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నత వైద్యాధికారులు సదరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యునితో పాటు సిబ్బందికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇది కూడా చదవండి: నేడు గంగోత్రి.. రేపు యమునోత్రి మూసివేత