అంబేడ్కర్ స్వగ్రామంలో సంవిధాన్ బచావో ర్యాలీకి హాజరు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు సోమవారం మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. ఇండోర్‌కు సమీపంలోని అంబేడ్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్‌లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్నారు.
ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment