Indore
-
యాచకులకు డబ్బులిస్తే జైలుకే.. జనవరి ఒకటి నుంచి అమలు
దేశంలోని పలు నగరాల్లో యాచన అనేది వ్యాపారంగా మారింది. బిక్షాటన కోసం యాచకులు పలు అక్రమ మార్గాలను అనుసరిస్తున్న ఉదాహరణలు అనేకం కనిపిస్తున్నాయి. ఇటువంటి వ్యవహారాలను నివారించేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఒక ముందడుగు వేసింది.ఇండోర్ జిల్లా యంత్రాంగం నగరాన్ని యాచకరహితంగా మార్చేందుకు బిచ్చగాళ్లకు డబ్బులు ఇచ్చే వారిపై 2025 జనవరి ఒకటి నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్‌ను యాచక రహితంగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి.జిల్లా యంత్రాంగం ఇప్పటికే నగరంలో భిక్షాటనపై నిషేధం విధించింది. దేశంలోని 10 నగరాల్లో ఇటువంటి ప్రచారం జరుగుతోంది. ఇండోర్‌లో బిచ్చగాళ్లకు ఆశ్రయం కల్పించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఇండోర్ ఇప్పటికే భారతదేశపు అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందింది. ఇకపై యాచకరహిత నగరంగా మారనుంది. జనవరి 1 నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని, ఇండోర్‌లో భిక్షాటనపై నిషేధం విధిస్తూ పరిపాలన ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు.దేశంలో ఈ ప్రాజెక్ట్ 10 నగరాల్లో అమలుకానుంది. ఈ జాబితాలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇండోర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పట్నా, అహ్మదాబాద్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇండోర్‌లో ఈ ప్రాజెక్టు అధికారి దినేష్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ నగరంలో కొంతమంది యాచకులకు శాశ్వత ఇళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. కొందరు యాచకుల పిల్లలు బ్యాంకుల్లో పనిచేస్తున్నారు. మరికొందరు వడ్డీలకు అప్పులు ఇస్తున్నారన్నారు. భిక్షాటన చేసేందుకు రాజస్థాన్ నుంచి పిల్లలతో ఓ ముఠా ఇక్కడికి వచ్చిందని, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు.మధ్యప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా మాట్లాడుతూ నగరాన్ని యాచక రహితంగా మారుస్తున్న తరుణంలో బిచ్చగాళ్లకు ఒక స్వచ్ఛంద సంస్థ ఆరు నెలల పాటు ఆశ్రయం కల్పించనున్నదని తెలిపారు. వారిలో అర్హులైనవారికి వివిధ పనుల్లో ఆ సంస్థ శిక్షణ ఇవ్వనున్నదన్నారు. ఇక్కడి ప్రజలు బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వడం మానుకోకపోతే ఈ పథకం విజయవంతం అవదన్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోవచ్చు -
చూస్తే చెయ్యెత్తి మొక్కుతారు! (ఫొటోలు)
-
అతడిదో ‘చెత్త’ కల(ళ) : గట్టిగా కొట్టాడు సక్సెస్!
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఇండోర్‌కు చెందిన యువకుడికి చిన్నప్పటినుంచీ ఒక అలవాటు ఉండేది. తన పరిసరాల్లో కనిపించిన పనికి రాని వస్తువుల ద్వారా ఏదో ఒక ఉపయోగపడే వస్తువును తయారు చేసేవాడు. ఆ అలవాటే అతడిని అద్భుత కళకారుడిగా తీర్చిదిద్దింది. స్క్రాప్ మెటల్‌తో తన కలలకు ప్రాణం పోసి, అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తున్నాడు. దేశ విదేశాల్లో అతని కళాఖండాలకు ఆదరణ లభిస్తోంది. ఇంతకీ ఎవరా యువకుడు? అతని కథేంటి తెలుసుకుందాం ఈ కథనంలో.దేశంలో చాలా మంది కళాకారులు మట్టి , రాయి, చెక్క, ఇలా అనేక రకాల వస్తువులతో విగ్రహాలు తయారు చేయడం మనకు తెలుసు. ఇండోర్‌లో నివసిస్తున్న ఈ కళాకారుడి విగ్రహాలు మాత్రం చాలా స్పెషల్. ఇండోర్‌కు చెందిన దేవల్ వర్మకు చిన్నప్పటినుంచీ ఫిక్షన్ సినిమాలు, బైక్‌లు అంటే ఇష్టం. చిన్నతనంలో, దేవల్ వారాంతాల్లో తన ఇల్లు ,పాఠశాల చుట్టూ దొరికిన స్క్రాప్‌లను ఉపయోగించి తనకు నచ్చిన విధంగా చిన్న చిన్న వస్తువులను తయారు చేసేవాడు. అదే అతణ్ని గొప్పవాడిగా మలుస్తుందని అస్సలు ఊహింఛలేదు.యువకుడిగా మారిన కొద్దీ, కాస్త విజ్ఞానం అలవడుతున్న కొద్దీ తను చేస్తున్న పనిపై మరింత ఆసక్తి పెరిగింది. కళాశాలకు చేరుకునే సమయానికి, ట్రాన్స్ఫార్మర్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల పట్ల ప్రేమతో ప్రేరణ పొంది స్క్రాప్ మెటల్‌తో క్లిష్టమైన నమూనాలను తయారు చేసేశాడు. దీనికి తోడు ప్రముఖ టీవీ షో M.A.D (సంగీతం, కళ , నృత్యం), దాని హోస్ట్ హరున్ రాబర్ట్ నుంచి మరింత ప్రేరణ లభించింది. అలా వ్యర్థ పదార్థాలతో కార్లు, మోటార్ సైకిళ్ల సూక్ష్మ నమూనాలను తయారు చేస్తూ ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు దేవల్ వర్మ. View this post on Instagram A post shared by Deval Verma (@devalmetalart) ఈ ఆసక్తి తగ్గట్టుగానే దేవల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు,స్థానిక గ్యారేజీలు . ఆటోమోటివ్ ఫ్యాక్టరీల దృష్టిని ఆకర్షించాయి. వారినుంచి మెటల్ స్క్రాప్ సేకరించి హార్లే డేవిడ్సన్ అధికారిక లోగో రూపకల్పన గొప్ప మైలురాయిగా నిలిచింది. వారి షోరూమ్ కోసం ఈ స్క్రాప్ ఇన్‌స్టాలేషన్‌ను ప్రత్యేకంగా రూపొందించాడు.ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత దేవల్ క్రియేటివ్ జర్నీ మరింత వేగం పుంజుకోవడమే కాదు, కీలక మలుపు తిరిగింది. తన కళను కరియర్‌గా మలుచుకోవాని నిర్ణయించుకున్నాడు. ప్రారంభంలో తల్లిదండ్రుల నుండి ప్రారంభ అభ్యంతరాలు ఉన్నప్పటికీ, చివరికి కుమారుడికి అండగా నిలిచారు. పూణేలోని MIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో ప్రోడక్ట్ డిజైన్‌లో కోర్సును అభ్యసించాడు. అలా దుబాయ్‌లో తొలి ప్రదర్శన సక్సెస్ అయింది. మెటల్ స్క్రాప్‌తో రూపొందించిన రెండు గిటార్లు అందర్నీ విపరీతంగా ఆకట్టుకోవడంతో మెటల్ ఆర్టిస్ట్‌గా వృత్తిపరమైన ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.ఈరంగంలో నిపుణుల సలహాలను తీసుకుంటూ మరింత పట్టుదల ఎదిగాడు. కళా ప్రపంచంలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపు పొందాడు. మినీ-రోబోట్ ప్లాంటర్ మొదలు అందమైన శిల్పాల వరకు కొలువు దీరాయి. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ అద్భుత కళాఖండాలుగా నిలిచాయి. సింగపూర్, ఇటలీ, అమెరికాలోని కొనుగోలుదారులను కట్టిపడేస్తున్నాయి.దేవల్ వర్మ స్టార్టప్2017 నుండి ఒక సొంత స్టార్టప్‌ను నడుపుతున్నాడు. అతను ఇప్పటివరకు అనేక రకాల శిల్పాలు , కళాఖండాలను తయారు చేశాడు. ఏనుగు, నెమలి, చిలుక, గిటార్, డేగ, ఇండియా మ్యాప్, పువ్వులు ఇలా ఒకటేంటి అనేక రకాల జంతువులు, పక్షుల బొమ్మలను రూపొందించాడు. ముఖ్యంగా హనుమాన్ విగ్రహం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.అద్భుతమై హనుమాన్ విగ్రహంగుజరాత్లోని గోద్రాకు చెందిన ఓ వ్యాపారవేత్త సోషల్ మీడియా ద్వారా దేవల్ గురించి తెలుసుకుని హనుమంతుని విగ్రహాన్ని తయారు చేయమని ఆర్డర్ ఇచ్చాడు. దీన్ని సవాల్‌గా తీసుకున్న దేవల్ 350 కిలోల స్క్రాప్ ఉపయోగించి, ఏడాది పాటు శ్రమించి హనుమాన్జీ విగ్రహాన్ని రూపొందించాడు. ఇత్తడి స్టీల్ వస్తువులు, గేర్-బేరింగ్‌లతో కండలు తిరిగిన దేహంతో అందమైన హనుమాన్ విగ్రహం చూస్తే ఎవరైనా చేయొత్తి మొక్కాల్సిందే. -
13 బంగారు పతకాలు, తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : ఎవరీ శ్రద్ధా
సాధించాలన్న పట్టుదల, కృషి,అచంచలమైన సంకల్ప శక్తి ఇవి ఉంటే చాలు. ఎలాంటి వారైనా తమ కలలను సాకారం చేసుకోవచ్చు. ఈవిషయాన్నే తన విజయం ద్వారా నిరూపించింది ఓ యువతి. ఒకటి కాదు రెండు ఏకంగా 13 బంగారు పతకాలను సాధించింది. CLATలలో అగ్రస్థానంలో నిలిచి, బంగారు పతకాలు సాధించడమే కాకుండా, యూపీఎస్సీలో మంచి (60) సాధించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన శ్రద్ధా గోమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం రండి!శ్రద్ధా గోమ్ తండ్రి రిటైర్డ్ SBI అధికారి. ఆమె తల్లి వందన గృహిణి. శ్రద్ధా చిన్నప్పటినుంచీ తెలివైన విద్యార్థిని. ఇండోర్‌లోని సెయింట్ రాఫెల్స్ హెచ్ఎస్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ అగ్రస్థానంలో నిలిచింది.తరువాత శ్రద్ధా గోమ్ న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించాలని బావించింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)లో టాపర్‌గా నిలిచింది. ఈ ఘనత ఆమె ప్రతిష్టాత్మకమైన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU), బెంగుళూరు, భారతదేశంలోని అత్యుత్తమ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందింది. అత్యుత్తమ ప్రతిభకు గాను అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రచేతులమీదుగా 13 బంగారు పతకాలను అందుకుంది. ఇలాంటి అవార్డులు, రివార్డుల పరంపరకొనసాగుతూనే ఉంది. (మసాబా మెచ్చిన చ్యవన ప్రాశ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!)హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీలో లీగల్ మేనేజర్‌గా పనిచేసింది. ముంబై, లండన్‌లో విలువైన అనుభవాన్ని పొందింది. తరువాత తన స్వస్థలమైన ఇండోర్‌కు తిరిగొచ్చి, 2021లొ సివిల్ సర్వీసెస్‌కు (సీఎస్ఈ) ప్రిపేర్ అయింది. ఇంటర్నెట్ ద్వారా స్టడీ మెటీరియల్ సమకూర్చుకుని స్వయంగా పరీక్షకు సిద్ధమైంది. మొక్కవోని దీక్షతో చదివి తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రద్ధా మంచి ఆర్టిస్ట్ కూడా. -
ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్.. సుడిగాలి ఇన్నింగ్స్!
భారత క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. సర్వీసెస్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల సునామీ సృష్టించాడు. అయితే, శతకానికి కేవలం మూడు పరుగుల దూరంలో ఉన్నప్పుడు రుతురాజ్ అవుట్ కావడం దురదృష్టకరం.కాగా దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. ఇటీవల రంజీ ట్రోఫీ(ఫస్ట్‌క్లాస్ క్రికెట్)లో అదరగొట్టాడు. అయితే, దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం రుతుకు శుభారంభం లభించలేదు. గత నాలుగు మ్యాచ్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ చేసిన పరుగులు వరుసగా.. 1, 19, 4, 2.48 బంతుల్లోనే 97 పరుగులుఈ నేపథ్యంలో రుతు టీ20 బ్యాటింగ్ తీరుపై విమర్శలు రాగా.. సర్వీసెస్‌తో మ్యాచ్ సందర్భంగా బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఆష్రిన్ కులకర్ణి(29)తో కలిసి మహారాష్ట్ర ఇన్నింగ్స్ ఆరంభించిన రుతు.. 48 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి.ఇక 202కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన రుతు.. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉన్నపుడు అవుటయ్యాడు. సర్వీసెస్ బౌలర్ మోహిత్ రాఠీ బౌలింగ్‌లో వికాస్ హథ్వాలాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రాహుల్ త్రిపాఠి విఫలంమిగతా వాళ్లలో రాహుల్ త్రిపాఠి(13) విఫలం కాగా.. సిద్ధార్థ్ మాత్రే మెరుపు ఇన్నింగ్స్(19 బంతుల్లో 32), ధన్‌రాజ్ షిండే(14 బంతుల్లో 32) ధనాధన్ బ్యాటింగ్‌తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.చదవండి: టీ20 క్రికెట్లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్ పాండ్యా లేకుండానే! -
దీపావళి మర్నాడు.. హింగోట్ యుద్ధంలో 15 మందికి గాయాలు
ఇండోర్: మనదేశంలో విభిన్న సంప్రదాయాలు కనిపిస్తాయి. వీటిలో కొన్ని ఎంతో వింతగా అనిపిస్తాయి. ఇటువంటి వింత సంప్రదాయం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కొనసాగుతోంది. దీపావళి మర్నాటి రోజున ఇండోర్ జిల్లా గౌతమ్‌పురాలో సంప్రదాయం పేరుతో కళంగి- తుర్రా సమూహాల మధ్య హింగోట్ యుద్ధం శుక్రవారం జరిగింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ యుద్ధాన్ని వీక్షించేందుకు ఇండోర్, ఉజ్జయిని, ధార్, దేవాస్ సహా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రంలో దీపావళి మర్నాడు ఈ తరహా యుద్ధం జరిగే ఏకైక ప్రదేశం గౌతమ్‌పురా. ఈ యుద్ధంలో 15 మందికి పైగా యోధులు మరియు ప్రేక్షకులు గాయపడ్డారు.ఇండోర్ హింగోట్ యుద్ధం చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం స్టేడియం ప్రాంతంలో 25 అడుగుల ఎత్తులో నెట్‌ను ఏర్పాటు చేశారు. యుద్ధభూమిలో భద్రతను దృష్టిలో ఉంచుకుని, 300 మందికి పైగా పోలీసులను మోహరించారు. దీంతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.గౌతమ్పురాను గౌతమ ఋషి నగరంగా పరిగణిస్తారు. ఏళ్ల తరబడి సాగుతున్న హింగోట్ యుద్ధం ఎలాంటి ప్రచారం లేకుండానే ఉత్కంఠభరితంగా సాగుతుంటుంది. రాష్ట్రంలోని పలు నగరాల నుంచి వేలాది మంది ప్రేక్షకులు హింగోట్ యుద్ధాన్ని వీక్షించేందుకు తరలివస్తుంటారు. ఈ సారి ఈ యుద్ధాన్ని చూసేందుకు వచ్చేవారితో మైదానం మొత్తం నిండిపోయింది. హింగోట్ యుద్ధంలో ముందుగా ఇరువర్గాల యోధులు డప్పుల మోతతో ఊరేగింపుగా వచ్చారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తలపై శిరస్త్రాణం, చేతుల్లో కవచాలు, నిప్పుల బాణాలు భుజాలకు తగిలించుకుని యోధులు మైదానంలోకి రావడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రారంభంలో 50 నుండి 60 మంది యోధులు ముఖాముఖి తలపడ్డారు. సుమారు గంటపాటు జరిగిన ఈ యుద్ధం రాత్రి 7.30 గంటలకు ముగిసింది. ఇది కూడా చదవండి: 1,101 మంది మహిళలు.. ఒకే రంగు చీరతో కాళీ పూజలు -
ఇదేం నిరసన..! 'గడ్డం తొలగించండి.. ప్రేమను కాపాడండి’
యువతుల వినూత్న ర్యాలీ... కాలానుగుణంగా యువతలో ఫ్యాషన్ అభిరుచులు మారుతున్నాయి. అబ్బాయిల్లో ఇటీవల ఎక్కువమంది గడ్డం, జుట్టు పెంచి ఫ్యాషన్‌గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై ఇండోర్‌లో ఉన్న కొందరు కాలేజీ యువతులు అబ్బాయిల గడ్డం విషయమై ర్యాలీ తీయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మాకు గడ్డంలేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలంటూ యువతులు ఈ వినూత్న ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ‘గడ్డం తొలగించండి.. ప్రేమను కాపాడండి’ అనే నినాదంతో యువతులు ముఖాలకు గడ్డం మేకప్‌తో ర్యాలీ నిర్వహించారు. వారి చేతిలో ఉన్న ప్లకార్డులపై ’నో క్లీన్ షేవ్.. నో లవ్’, ’మాకు గడ్డంలేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి’, ‘నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్’ వంటి లైన్స్ కనిపించాయి. ఈ ర్యాలీ తాలూకు వీడియోను ఓ ‘ఎక్స్’ యూజర్ నెట్టింట ΄ోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఈ యువతుల డిమాండ్ కరెక్టే. వారానికి ఒక్కసారైనా క్లీన్ షేవ్ కాకున్నా కనీసం ట్రీమ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మనం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్మన్లా కనిపిస్తాం‘ అని ఒకరు కామెంట్ చేశారు. ‘మా బాడీ మా ఇష్టం’ అని ఒకరు కామెంట్ చేస్తే ‘వారి గడ్డం.. వారి ఇష్టం.. మధ్యలో మీకెందుకు‘ అని ఇంకొకరు కామెంట్ చేశారు. (చదవండి: అతుకులే అదుర్స్! ఏకంగా 180 క్లాత్ ప్యాచ్‌లు..) -
గడ్డం కావాలా? గర్ల్ ఫ్రెండ్ కావాలా? రోడ్డెక్కిన కాలేజీ అమ్మాయిలు
ఎలాంటి భర్త కావాలి? లేదా ఎలాంటి భార్య కావాలి? అని పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెద్దలు అడగడం సాధారణం. అలాగే నాకు ఎర్రగా, బుర్రగా ఉన్న అమ్మాయి కావాలి అని అబ్బాయిలు, ఆరడుగులుంటాడా? ఆరెంకెల జీతం ఉందా? అని అమ్మాయిలు ఆశపడటం చాలా కామన్. కానీ ఇపుడు ట్రెండ్‌మారింది అంటున్నారు ఇండోర్ యువతులు. అంతేకాదు ఏకంగా ‘మాకొద్దీ గడ్డం బూచోళ్లు’,‘నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్' అంటూ రోడ్డుమీద కొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడమే కాదు. ఫ్యాషన్‌గా గెడ్డం పెంచుకుంటున్న పెళ్లి కాని ప్రసాదుల గుండెల్లో బాంబు పేల్చింది.ఇండోర్‌లో కొందరు కాలేజీ యువతులు 'గడ్డం తొలిగించండి.. ప్రేమను కాపాడండి' అనే నినాదంతో యువతులు ర్యాలీ తీశారు. ముఖాలకు గడ్డం మేకప్ వేసుకొని మరీ అబ్బాయిల గడ్డం విషయమై ర్యాలీ తీయడం హాట్ టాపిక్‌గా నిలిచింది., ‘గడ్డం రఖో యా జిఎఫ్ రఖో’(గడ్డం కావాలా? గర్ల్‌ఫ్రెండ్‌కావాలా), 'గడ్డం హటావో ప్యార్ బచావో' నినాదాలతో వీధుల్లోకి వచ్చారు. 'నో క్లీన్ షేవ్.. నో లవ్', 'నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్' అనే ప్లకార్డులతో తీసిన ర్యాలీ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను ఓ 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు.వారి డిమాండ్ కరెక్టేగా కనీసం వారానికి ఒకసారైనా క్లీన్ షేవ్ కాకున్నా కనీసం ట్రీమ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మనం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్మెన్లా ఉంటాం అంటూ కామెంట్ చేయడం విశేషం. మరికొందరు దీని వెనుకున్న మతలబు ఏంటి భయ్యా అంటూ దీర్ఘాలోచనలో పడిపోయారు.ఇదీ చదవండి: నిద్రపోనివ్వని కల అంటే ఇదే! శభాష్ మల్లవ్వ! కాగా పురుషులు గడ్డాలతో అందంగా కనిపిస్తారా లేదా గడ్డం లేకపోతే అందంగా కనిపిస్తారా? అనేది పెద్ద చర్చే. గడ్డాలున్న పురుషులనే మహిళలు ఇష్టపడతారని అనేక అధ్యయనాలు చెబుతున్నప్పటికీ, క్లీన్ షేవ్ మెన్ మరింత ఆకర్షణీయంగా ఉంటారని మరికొందరి వాదన.Clean shave ke liye ladkiyon ne kiya kalesh🤯 pic.twitter.com/QkmIROdDyk— Ghar Ke Kalesh (@gharkekalesh) October 17, 2024 -
ట్రెయినీ ఆర్మీ అధికారులపై దాడి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. యువ సైనికాధికారులను తీవ్రంగా కొట్టి, వారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇండోర్ సమీపంలోని మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ పొందుతున్న ఇద్దరు అధికారులు, తమ స్నేహితురాళ్లతో కలిసి బుధవారం మధ్యాహ్నం చోటీ జామ్ వద్ద ఫైరింగ్ రేంజ్ సమీపంలోని ప్రదేశానికి పిక్నిక్కు వెళ్లారు.తుపాకులు, కత్తులు, కర్రలతో వచ్చిన 8 మంది దుండగులు అకస్మాత్తుగా వారిని చుట్టుముట్టారు. నలుగురినీ చితకబాది వారివద్ద డబ్బు, విలువైన వస్తువులను దోచుకున్నారు. ఒక అధికారిని, అతడి స్నేహితురాలిని బందీలుగా ఉంచుకున్న దుండగులు రూ.10 లక్షలు తెస్తేనే విడిచిపెడతామంటూ మరో అధికారి, అతడి స్నేహితురాలిని పంపించారు. బాధితుడు హుటాహుటిన తన యూనిట్‌కు వెళ్లి కమాండింగ్ అధికారికి సమాచారమిచ్చారు. ఈ మేరకు పోలీసులు, మిలటరీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోగా.. వారిని చూసి దుండగులు పారిపోయారు. నలుగురు బాధితులను పోలీసులు మోవ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరు అధికారులకు గాయాలయ్యాయి. ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. దోపిడీ, అత్యాచారం, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. మోవ్ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో శాంతి భద్రతలు మచ్చుకైనా కానరావడం లేదని దుయ్య బట్టారు. మహిళలపై జరుగుతున్న నేరాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళనకర అంశమని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
Madhya Pradesh: ఆర్మీ అధికారులపై దుండగుల దాడి.. ఒకరిపై అత్యాచారం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి మరో ఇద్దరు యువ ఆర్మీ అధికారులపై గుర్తు తెలియని దుండగులు తీవ్రంగా దాడిచేశారు. దోపిడీ చేయడానికి వచ్చిన దుండగులు.. వారిపై దాడి చేసి ఓ మహిళా అధికారిణిపై అత్యాచారం చేసినట్లు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ తీసుకుంటున్న అధికారులు మంగళవారం జామ్‌లోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో మహిళలతో కలిసి బయటకు వెళ్లారు. అకస్మాత్తుగా ఎనిమిది మంది దుండగులు తుపాకులు, కత్తులు కర్రలతో వారిని చుట్టుముట్టారు. ట్రైనీ ఆఫీసర్లు, మహిళల డబ్బు, వస్తువులను దోచుకునే ముందు వారిపై దాడి చేశారు. ఒక మహిళను, మరో ఆర్వీ అధికారిని బందీలుగా పట్టుకుని.. మిగతా ఇద్దరు రూ.10 లక్షల ఇవ్వాలని అలాఅయితే వారివద్ద ఉన్న అధికారులను వదిపెడతామని డిమాండ్ చేశారు. ట్రైనింగ్ సెంటర్ వెళ్లిన యువ అధికారులు మోవ్ ఆర్మీ కాలేజీ అధికారులు, పోలీసులకు సమాచారం అధించారు. దీంతో పోలీసులను అప్రమత్తమై.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావటాన్ని గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన నలుగురినీ వైద్య పరీక్షల నిమిత్తం మోవ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు అధికారులు గాయపడినట్లు డాక్టర్లు తెలిపారు. అదేవిధంగా వైద్య పరీక్షల్లో ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లు తెలిసిందని బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగు పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బంది రంగంలోకి దిగి నేరస్తుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.చదవండి: ప్రజ్వల్‌కు చీర చిక్కు -
ప్రశాంతంగా, కంటికి హాయిగా : బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్
అపార్టమెంట్లలో పచ్చని ప్రకృతి శోభ ఉండేలా, శుభ్రమైన గాలికోసం ఇంట్లోమొక్కలను పెంచుకోవడం ఒక ట్రెండ్. వీటినే ఇండోర్ ప్లాంట్లు అని అంటారు. ఇలాంటి మొక్కలు ఇంటి అందాన్ని ఇనుమడింపజేయడం మాత్రమే కాదు స్వచ్ఛమైన గాలితో కంటికి ఆహ్లాదంగా ఉంటూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇండోర్ ప్లాంట్లు కలిగి ఉంటాయి. మరి అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందామా!పర్యావరణహితమైన ఆరోగ్యకరమైన ఇండోర్ ప్లాంట్లతో ఇంట్లోని గాలి నాణ్యత మెరుగు పడుతుంది. కాలుష్యానికి చెక్ చెప్పవచ్చు. ఒత్తిడి లేకుండా మనసుకు హాయిగా ఉంటుంది. పచ్చని ఇండోర్ వల్ల ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయిస్నేక్ ప్లాంట్అత్తగారి నాలుక అని కూడా పిలుస్తారు. ఇది రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. బెడ్రూమ్లో ఈ మొక్కను పెట్టుకోవచ్చు. గాలిలోని ఫార్మాల్డిహైడ్, జిలీన్, బెంజీన్, టోలున్, ట్రైక్లోరోఎథిలిన్ లాంటి వాటిని ఫిల్టర్ చేస్తుందిఅలోవెరాఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న అలోవెరా ఇండోర్ ప్లాంట్‌గా బెంజీన్, ఫార్మాల్డిహైడ్‌ను ఫిల్టర్ చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ , కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చుకుంటుంది. తొమ్మిది ఎయిర్ ప్యూరిఫయర్లు చేసిన పనితో దీని సామర్థ్యం సమానమని చెబుతారు. కొద్దిగా ఎండ, కొద్దిపాటి నీళ్లతో దీన్ని చాలా సులభంగా పెంచుకోవచ్చు. కలబంద జెల్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి.పీస్ లిల్లీతెల్లటి పువ్వులతో అందంగా కనిపించే ఈ మొక్క కూడా గాలిలో ఉండే కొన్ని విష రసాయనాలను శుద్ధి చేస్తుంది. ఈ సూపర్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఇండోర్ ప్లాంట్‌ను ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ , ఇతర గృహోపకరణాల ద్వారా విడుదలయ్యే ఇండోర్ కాలుష్యాలను సమర్థవంతంగా తొలగించగల క్లెన్సర్‌లలో ఒకటి.కాలుష్య కారకాలను తొలగించే విషయంలో ఇది పవర్‌హౌస్. స్పైడర్ ప్లాంట్స్పైడర్ ప్లాంట్‌ను కూడా ఇంట్లో చక్కగా చేర్చుకోవచ్చు, ప్రత్యేకించి పెంపుడు జంతువులకు విషపూరితం కాని కొన్ని మొక్కలలో ఇది ఒకటి. కార్బన్ మోనాక్సైడ్,జిలీన్తో సహా టాక్సిన్స్‌తో నివారిస్తుంది.వెదురు మొక్కబటర్ఫ్లై పామ్ లేదా అరేకా పామ్ అని పిలిచే ఈ వెదురు మొక్క భారతదేశంలోని అత్యుత్తమ గాలిని శుద్ధి చేసే మొక్కలలో ఒకటి. ఇది గాలి శుద్దీకరణకు మించిన అదనపు ప్రయోజనంగా, ఇది సహజ హ్యూమిడిఫైయర్ కూడా. ఇది పొడి శీతాకాలంలో మరింత ఉపయోగకరంగా ఉంటుంది.పోథోస్ లేదా మనీ ప్లాంట్: డెవిల్స్ ఐవీ అని కూడా పిలుస్తారు. ఇంట్లోని టాక్సిన్స్ తొలగించడంలో ప్రసిద్ధి చెందింది, ప్రతి 1-2 వారాలకు ఒకసారి నీళ్లు పోస్తే చాలు. ఇందులో చాలా రకాలున్నాయి.జెడ్ జెడ్ ప్లాంట్ తక్కువ-కాంతిలో కూడా చక్కగా పెరుగుతుంది. జిలీన్, టోలున్ , బెంజీన్ వంటి టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. దీన్ని ఆఫీసుల్లో కూడా పెట్టుకోవచ్చు. వీటితోపాటు స్పైడర్ ప్లాంట్ (క్లోరోఫైటమ్ కోమోసమ్), ఫెర్న్ మొక్కలు కూడా ఈ కోవలోకే వస్తాయి. -
Madhya pradesh: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్-జబల్పూర్ (సోమనాథ్) ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఎక్స్‌ప్రెస్ ఇండోర్ నుండి జబల్పూర్కు వస్తున్న క్రమంలో జబల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున 5. 40 గంటలకు జబల్పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉండడంతో రైలు వేగం చాలా తక్కువగా ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.#WATCH | Two coaches of Indore- Jabalpur Overnight Express derailed in Jabalpur, Madhya Pradesh. No casualties/injuries reported. More details awaited pic.twitter.com/A8y0nqoD0r— ANI (@ANI) September 7, 2024 రెండు కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులందరినీ హడావుడిగా రైలు ఎక్కించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
24 గంటల్లో 11 లక్షల మొక్కలు నాటి..
మధ్యప్రదేశ్ వ్యాపార రాజధాని ఇండోర్ పేరు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. కేవలం 24 గంటల్లో 11 లక్షల మొక్కలు నాటడం ద్వారా ఈ నగరం సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. ఇండోర్ నగరం, పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. చిన్నారులు, వృద్ధులు, యువకులు, మహిళలు, పురుషులు, సామాన్యులు.. అంతా కలసి ఉత్సాహంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్, పట్టణ పరిపాలనా మంత్రి కైలాష్ విజయవర్గీయ, మేయర్ పుష్యమిత్ర భార్గవ తదితరులు ఒక్కరోజులో 11 లక్షలకు పైగా మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 50 వేల మంది శ్రమించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని బహిరంగ ప్రదేశాలు, పార్కులు, ఉద్యానవనాలు, అడవుల్లో మొక్కలు నాటారు.ఇండోర్‌లోని బీఎస్ఎఫ్ రేవతి రేంజ్లో 11 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో పాల్గొన్న విద్యార్థులు ‘మా తుజే సలామ్’ అంటూ దేశభక్తి గీతాలు ఆలపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాను మొక్కలు నాటుతూ ఇతరులను ఉత్సాహపరిచారు. -
లోక్‌సభ ఎన్నికల్లో నోటా సంచలనం
ప్రజాస్వామ్యంలో నచ్చిన వ్యక్తిని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకునే హక్కు ప్రతీ ఓటర్‌కు ఉంది. అలాగే.. ఏ అభ్యర్థి నచ్చకుంటే నోటా(None Of The Above)కు ఓటేయొచ్చు. ఇందుకోసమే 2013లో నోటాను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో నోటా సరికొత్త రికార్డు సృష్టించింది.మధ్యప్రదేశ్ ఇండోర్ పార్లమెంట్ స్థానంలో ఈసారి ఏకంగా నోటాకు లక్షన్నరకు పైగా ఓట్లు పడ్డాయి. విశేషం ఏంటంటే.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ 9,90,698 ఓట్లు పోల్‌కాగా, రెండో స్థానంలో నోటా ఓట్లు(1,72,798) ఉన్నాయి. మూడో స్థానంలో బీఎస్సీ అభ్యర్థి సంజయ్ సోలంకీ 20,104 ఓట్లతో నిలిచారు.విచిత్రం ఏంటంటే.. కాంగ్రెస్ తమ ఓట్లను నోటాకే ఓటేయాలని ప్రచారం చేయడం. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున ఇక్కడ నామినేషన్ వేసిన అక్షయ్ కంటీ బామ్.. చివరి నిమిషంలో తన నామినేషన్ విత్‌డ్రా చేసుకుని బీజేపీలో చేరారు. ఇది కాంగ్రెస్‌కు పెద్ద షాకే ఇచ్చింది. ఈ పరిణామంపై ఇక్కడి నుంచి ఏడుసార్లు నెగ్గిన అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇక్కడి నుంచి ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావించినా.. అందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అంగీకరించలేదు. దీంతో అనివార్యంగా పోటీ నుంచి వైదొలగింది. అయితే బరిలో నిలిచిన వాళ్లకు మద్దతు ఇవ్వకుండా.. నోటాకు ఓటేయాలని ప్రచారం చేసింది కాంగ్రెస్. తద్వారా తమ పార్టీ అభ్యర్థిని లాక్కెల్లిన బీజేపీకి నోటా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రయత్నించింది.నోటా చరిత్ర తిరగేస్తే..2019లో బీహార్ గోపాల్‌గంజ్(ఎస్సీ)లో 51,660 నోటా ఓట్లు పడ్డాయి. ఇది నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో 5 శాతంఅక్కడ జేడీయూ అభ్యర్థి డాక్టర్ అలోక్ కుమార్ సుమన్ 5,68,160 ఓట్లతో గెలుపొందారు.2014 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నీలగిరిలో 46, 559 నోటా ఓట్లు పడ్డాయి. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం మహీంద్రా ఎస్యూవీను ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.ఈ ఘటనపై అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ జిల్లాలోని ఇండోర్-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై ఘటాబిల్లోడ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నట్టు ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. #NewsWithR #MadhyaPradesh: Eight people killed and one injured in road accident.According to Additional Superintendent of Police (ASP) Rupesh Kumar Dwivedi, a jeep collided with an unidentified vehicle near Ghatabillod on the Indore-Ahmedabad National Highway.@MPPoliceDeptt pic.twitter.com/x994AFzsiq— Ravi Rana (@RaviRRana) May 16, 2024 ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అయితే, ప్రమాదం జరిగిన అనంతరం గుర్తు తెలియని వాహనం డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడని చెప్పారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతుండగా.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, సదరు వాహనం గునా అనే ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. -
Lok Sabha Election 2024: ఇండోర్‌లో ఉచిత పోహా, జిలేబీ..
ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎవరి స్థాయిలో వారు పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉచితంగా పోహా, జిలేబీ పంచారు. రాష్ట్రంలో 29 లోక్‌సభ స్థానాలకు గాను.. చివరి 8 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది. అందులో ఇండోర్ నియోజకవర్గం కూడా ఉంది. అయితే.. ఇక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రఖ్యాత ఫుడ్ స్ట్రీట్ ‘56 దుకాణ్’ చొరవ తీసుకుంది. ఓటేసి వచి్చనవారికి పోహా, జిలేబీ ఉచితంగా పంచుతామని ప్రకటించింది. అన్నట్టుగానే సోమవారం ఉదయం 7 గంటల నుంచి 9.30 వరకు ఓటేసిన వారికి పోహా, జిలేబీని అందించింది. దాదాపు 3 వేల మంది ఉచితంగా తిన్నారు. అందుకోసం ఐదు క్వింటాళ్ల పోహా అవసరమైందని వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గుంజన్ శర్మ చెప్పారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతకు, ఓటేసిన వృద్ధులకు అదనంగా ఐస్‌క్రీమ్ కూడా అందించారు. 25 లక్షలకు పైగా ఓటర్లున్న ఇండోర్ లోక్‌సభ స్థానం రాష్ట్రంలోనే పెద్దది. ఇక్కడ 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1989 నుంచి ఇది బీజేపీ కంచుకోటగా ఉంది. -
ఓటర్లకు అల్పాహారం, ఐస్‌క్రీమ్
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్థానిక దుకాణదారులు వినూత్న ప్రయత్నం చేశారు. '56 దుకాణ్' దుకాణదారుల సంఘం ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లకు ఉచిత అల్పాహారం, ఐస్‌క్రీమ్‌లు అందించారు.నగరంలోని 56 దుకాణ్ మార్కెట్లోని దుకాణాల వద్ద అల్పాహారం తీసుకునేందుకు ఓటర్లు బారులు తీరి కనిపించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, దేవాస్, ఉజ్జయిని, మందసౌర్, రత్లాం, ధార్, ఖర్గోన్, ఖాండ్వాతో సహా ఎనిమిది పార్లమెంటు స్థానాలలో నాలుగో దశలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది."ఇండోర్ ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఓటింగ్‌లో కూడా మేము ప్రత్యేకంగా నిలుస్తాం. ఓటర్లకు ఉచితంగా అల్పాహారం అందించాం. తద్వారా వారు త్వరగా బయటకు వచ్చి ఓటు వేయవచ్చు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఇక్కడి ఓటర్లందరికీ పోహా, జిలేబీ వంటి ఇష్టమైన అల్పాహారాన్ని అందిస్తున్నాం" అని 56 దుకాణ్లోని షాప్ యజమాని శ్యామ్‌లాల్ శర్మ చెప్పారు. ఓటర్లలో అవగాహన పెంచి ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని ఆయన అన్నారు. -
ఇక్కడ కాంగ్రెస్ ప్రచారం ‘నోటా’కే..
ఇండోర్ (మధ్యప్రదేశ్): లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు ఓటేయాలని అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మాత్రం నోటాకే ఓటేయాలని ఓటర్లను కోరుతూ ప్రచారం నిర్వహిస్తోంది. ఇక్కడ తాము నిలబెట్టిన అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి బీజేపీలో చేరడమే ఇందుకు కారణం.ఇండోర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీకి పోటీగా అక్షయ్ కాంతి బామ్‌ను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. అయితే ఆయన నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజున కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. నామినేషన్ విత్‌డ్రా చేసుకని కాషాయ పార్టీలోకి చేరారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గానికి నాలుగో దశలో మే 13న పోలింగ్ జరగనుంది.“గత మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్ ఓటర్లు బీజేపీకి భారీ విజయాన్ని అందించారు. అయినప్పటికీ, కాషాయ పార్టీ తమ అభ్యర్థి బామ్‌ను అన్యాయంగా ప్రలోభపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఓటర్లు నోటాకు ఓటేసి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత శోభా ఓజా పీటీఐతో అన్నారు.తమ పార్టీ ఏ అభ్యర్థికీ మద్దతివ్వదని, బీజేపీని శిక్షించేందుకు ఓటర్లకు నోటా అవకాశం ఉందని ఎంపీ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ అన్నారు. అయితే నోటాకు ఓటేయాలని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో 'ప్రతికూల వ్యూహాలను' అవలంభిస్తోందని బీజేపీ అభ్యర్థి లాల్వానీ అన్నారు. -
ఫ్రీగా సినిమా టికెట్లు.. ఓటేసినందుకు కాదు! మరి...
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓటర్లకు ఉచితంగా సినిమా టికెట్లు ఇస్తామంటోంది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం. అయితే ఇది ఓటేసినందుకు కాదు.. మరి ఎందుకో ఈ కథనంలో తెలుసుకోండి..ఇండోర్ లోక్‌సభ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుండి మే 8 వరకు ఓటరు స్లిప్‌లను ఇంటింటికీ పంపిణీ చేసే ప్రక్రియను జిల్లా ఎన్నికల యంత్రాంగం చేపట్టనుంది. నిర్ణీత వ్యవధిలోగా బీఎల్ఓలు ఓటరు స్లిప్‌ను అందిచకపోతే వాట్సాప్ లేదా టెలిఫోన్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సింగ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఓటరు స్లిప్పులు అందని ఓటర్లు తమ అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వివరాలతో జిల్లా ఎన్నికల హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్ 9399338398 లేదా ల్యాండ్‌లైన్ నంబర్ 0731-2470104, 0731-2470105లో మే 10వ తేదీ వరకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు నిజమైనదని తేలితే బీఎల్ఓపై చర్యలు తీసుకోవడంతోపాటు సరైన సమాచారం ఇచ్చిన ఓటర్లకు బహుమతిగా నగరంలోని సినిమా థియేటర్లో సినిమా చూసేందుకు రెండు సినిమా టిక్కెట్లను ఉచితంగా అందజేస్తారు. -
కాంగ్రెస్‌కు షాక్.. నామినేషన్ వెనక్కి తీసుకున్న ఇండోర్ అభ్యర్థి
భోపాల్: లోక్‌సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌కు వరుస షాక్ తగులుతున్నాయి. తాజాగా ఇండోర్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి.. అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఇండోర్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ చివరి నిమిషంలో తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. అనంతరం ఆయన హస్తం పార్టీని వీడి అధికార బీజేపీలో చేరారు.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానానికి నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇండోర్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ శంకర్ లాల్వానీకి పోటీగా కాంగ్రెస్ కాంతిని బరిలోకి దింపింది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు నేడే (ఏప్రిల్ 29) ఆఖరి తేదీ. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం అక్షయ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. ఆయన వెంట బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలా కూడా ఉన్నారు. కాంగ్రెస్ ఇండోర్ అభ్యర్థి అక్షయ్ బీజేపీలో చేరినట్లు మంత్రి విజయ్‌వర్గియ పేర్కొన్నారు. అక్షయ్‌తో ఒకే కారులో వెళ్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ఆయన్ను పార్టీలోకి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇండోర్ మరో సూరత్ కానుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్‌లోని సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడం, మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
ప్రాణాలు తీసిన ప్రాంక్.. ఫ్రెండ్‌ను ఫూల్ చేయబోయి విద్యార్ధి మృతి
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ప్రాంక్‌ల హవా బాగా నడుస్తోంది. కుటుంబ సభ్యులు, తెలిసిన వారికి ఏదైనా విషయం గురించి చెప్పి భయపెట్టడం.. తరువాత అదంతా ప్రాంక్ అని చెప్పడం ఫ్యాషన్‌గా మారింది. అయితే కొన్ని సార్లు ఈ చర్యలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రాంక్ మోజులో పడి అనేక మంది యువత తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఏప్రిల్ ఫూల్స్ డే రోజు చేసిన తన స్నేహితుడిని ప్రాంక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఇండోర్‌లోని మల్హర్గంజ్లో 11వ తరగతి చదువుతున్న అభిషేక్ అనే విద్యార్ధి సోమవారం ఏప్రిల్స్ ఫూల్స్డే రోజు తన స్నేహితుడిని ప్రాంక్ చేయాలని ప్రయత్నించాడు. ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నటించాడు. స్టూల్‌పై నిల్చొని మెడకు తాడు బిగించి తను చనిపోతున్నట్లు స్నేహితుడిని నమ్మించాడు. ఈ క్రమంలో అనుకోకుండా స్టూల్ జారిపోవడంతో మెడకు తాడు బిగుసుకుపోయి మృతి చెందాడు. ఈ సంఘటనను చూసిన వెంటనే స్నేహితుడు.. అభిషేక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు డీసీపీ రాజేష్ దండోటియా తెలిపారు. చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు గమనిక: దయచేసి ఎవరూ ఇలాంటి ప్రాంక్‌లు ప్రయత్నించవద్దు. చిన్న చిన్న సరదాలకు పోయి.. నిండు ప్రాణాలను బలితీసుకోవద్దు -
ఎన్నికల డ్యూటీ వద్దంటూ వినతుల వెల్లువ
దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులను రద్దు చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన వెంటనే పలువురు ఉద్యోగులు తాము తమ ఎన్నికల డ్యూటీకి హాజరకాలేమంటూ ఉన్నతాధికారులకు వినతులు సమర్పించుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల డ్యూటీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే పలువురు ఉద్యోగులు సెలవుల కోసం దరఖాస్తు చేయడం మొదలుపెట్టారు. ఒకరు అనారోగ్యం కారణంగా ఎన్నికల విధులు నిర్వహించలేమని పేర్కొనగా, మరొకరు తమ ఇంటిలో పెళ్లి వేడుకలు ఉన్నాయంటూ సెలవుల కోసం అభ్యర్థించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సింగ్ ఉద్యోగుల సెలవులను రద్దు చేసినప్పటి నుండి సెలవులకు సంబంధించిన దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులలో ముగ్గురు తాము విదేశాలకు వెళ్తున్నామని రాశారు. ఒకరు తమ కుమార్తె జపాన్‌లో డిగ్రీ అందుకోబోతున్నదని రాయగా, మరొకరు అమెరికాలో తమ కుమార్తె డెలివరికీ వెళ్లాలని రాశారు. ఇంకొకరైతే వివాహ శుభలేఖను కూడా జతచేశారు. ఎన్నికల విధులను తప్పించుకునేందుకు పలువురు ఉద్యోగులు తమ ఆనారోగ్యాన్ని సాకుగా చూపుతున్నారు. నిజానికి ఎన్నికల డ్యూటీలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ఎంతో శ్రద్ధగా విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఈ కారణంగానే పలువురు ఉద్యోగులు ఎన్నికల విధులను తప్పించుకోవాలని చూస్తారనే మాట వినిపిస్తుంటుంది. -
బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్
షిమ్లా: సుదూరంగా మాటువేసి గురిచూసి షూట్‌చేసే ‘స్నైపర్’ విధుల్లో చేరి పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ సుమన్‌కుమారి చరిత్ర సృష్టించనున్నారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)లో తొలి స్నైపర్‌గా కుమారి పేరు రికార్డులకెక్కనుంది. ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్(సీఎస్‌డబ్ల్యూటీ)లో ఎనిమిది వారాల కఠోర శిక్షణను కుమారి విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. దీంతో శిక్షణలో ఆమె ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ సాధించారు. బీఎస్ఎఫ్లో స్నైపర్ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. కుమారి 2021లో బీఎస్ఎఫ్లో చేరారు. నిరాయుధంగా శత్రువుతో పోరాడే ‘నిరాయుధ దళం’కు గతంలోనే ఆమె ఎంపికయ్యారు. పాకిస్తాన్ సరిహద్దుల వెంట మాటువేసి అదనుచూసి చొరబాట్లకు తెగబడే ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో స్నైపర్లది కీలక పాత్ర. -
‘బుల్డోజర్ చర్య ఫ్యాషన్ అయింది’.. హైకోర్టు సీరియస్
మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న బుల్డోజర్ చర్యను రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా ఖండించింది. బుల్డోజర్ చర్యలు ఇటీవల కాలంలో ఒక ఫ్యాషన్‌గా తయారైందని కోర్టు సీరియస్ అయింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇల్లును ప్రభుత్వ అధికారులు కూల్చేయడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ తప్పు పట్టింది. సరైన విధానాలు అమలు పర్చకుండా నిందితుడి ఇంటిని కూల్చివేయటం సరికాదని ప్రభుత్వ అధికారులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిందితుడు రాహుల్ లాంగ్రీ.. ఓ వ్యక్తి వద్ద ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తిపై బెదింపులకు పాల్పడగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో ప్రస్తుతం రాహుల్ లాంగ్రీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే సమయంలో తాజాగా రాహుల్ లాంగ్రీ ఇంటిపై ప్రభుత్వ అధికారులు బుల్డోజర్ చర్య చేపట్టి.. అతని ఇంటిని కూల్చేశారు. దీంతో రాహుల్ లాంగ్రీ భార్య రాధా కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అధికారుల బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా రాధా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తమ ఇంటి పాత యజమాని అధికారులు నోటీసులు పంపారు. తమ వివరణ వినకుండా ఉజ్జయినిలోని తమ ఇంటిని ప్రభుత్వ అధికారులు కూల్చివేశారని లాంగ్రీ భార్య పిటిషన్లో పేర్కొన్నారు. తమ ఇల్లు అక్రమంగా కట్టింది కాదని.. ఆ ఇంటికి బ్యాంక్‌లో లోన్ కూడా తీసుకున్నామని ఆమె పిటిషన్లో తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు ఇండోర్ బెంచ్ ప్రభుత్వ అధికారుల చేపట్టిన బుల్డోజర్ చర్యలను తప్పుపడుతూ.. నష్టపరిహారంగా లాంగ్రీ భార్య, తల్లికి చెరో రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. ఇక..ఈ కేసులో మరింత నష్టం పరిహారం పొందేందుకు పిటిషన్‌దారులు సివిల్ కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: బిహార్‌లో మోదీని ఎదుర్కొంటాం: తేజస్వీ యాదవ్ -
'మిలియనీర్లుగా బిచ్చగాళ్లు'..జస్ట్ 45 రోజుల్లో ఏకంగా రూ. 2.5 లక్షలు..!
బిచ్చగాళ్లని చూడగానే జాలిపడి డబ్బులిస్తాం. అందులోనూ పుణ్యక్షేత్రాల్లోనూ, ప్రుమఖ దేవాలయాల వద్ద ఉంటే భక్తులు కచ్చితంగా డబ్బులు ఇస్తారు. భక్తిపారవశ్యంతో ఇంకాస్త ఎక్కువగానే డబ్బులు ఇస్తారు. దీన్నే బిచ్చగాళ్లు క్యాష్ చేసుకుని పిల్లా జల్లాతో సహా అక్కడకి వాలిపోయి వేర్వేరుగా డబ్బులు సంపాదించడం మొదలు పెడతున్నారు. ఒక రకరంగా చెప్పాలంటే భిక్షాటననే ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారని చెప్పొచ్చు. అందుటోనూ పెట్టుబడి లేని వ్యాపారం. లాభమే గాని నష్టం అంటూ ఉండదు. దీంతో పలువురు వ్యక్తులు భిక్షాటనే వృత్తిగా లక్షల్లో డబ్బులు ఆర్జిస్తూ కోట్లకు పడగెత్తుతున్నారు. అందుకు సంబంధించిన సంచలన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎంతలా ఆ బిక్షగాళ్లు డబ్బులు ఆర్జిస్తున్నారో వింటే కంగుతింటారు. వామ్మో ఏంటీది..? అని నోటి మీద వేలేసుకుంటారు. అసలేం జరిగిందంటే..ఇండోర్‌లోని ఓ మహిళ భిక్షాటన ద్వారా కేవలం 45 రోజుల్లో రూ. 2.5 లక్షలు సంపాదించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు సులభమైన మార్గం భిక్షాటనే. దీంతో కొందరూ దీన్నే వృత్తిగా ఎంచుకుని ఇంటిల్లాపాది నెలకు లక్షలు కూడుబెడుతున్నట్లు తేలింది. సెలవు సమయాల్లో వారి ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయల్లా సుఖంగా సాగిపోతుంది. అందులోని గుళ్ల వద్ద యాచిస్తుంటారు. దీంతో ఓ పక్క ఆదాయానికి ఆదాయం, మరోవైపు పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా భోజనం లభించేస్తోంది. ఇక దీంతో వారి వ్యక్తిగత అవసరాల కంటూ పెద్ద ఖర్చు ఉండదు. అందువల్ల చాలామంది దీన్నే ఆదాయ మార్గంగా ఎంచుకుని డబ్బుల సంపాదిస్తున్న దిగ్బ్రాంతికర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇందులోకి ముక్కుపచ్చలారని పిల్లలను కూడా దించి లక్షలు సంపాదిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక అధికారులు అదుపులోకి తీసుకున్న మహిళ తన సంపాదనలో ఒక లక్ష రూపాయలను తన పుట్టింట్లో ఉంచిన ఇద్దరు పిల్లల కోసం పంపిస్తుందని, ఇక రూ. 50 వేలు పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా..మిగతా డబ్బు వ్యక్తిగత అవసరాలకు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు. ఈ వృత్తిలోనే ఆమె భర్త, చెల్లి మరో ఇద్దరు పిల్లలు కొనసాగుతున్నట్లు చెప్పారు. కుటుంబం మొత్తం ఇండోర్ నుంచి ఉజ్జయినికి వెళ్లే కూడలిలో వేర్వేరు నగరాల్లో భిక్షాటన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధికారులు ఇండోర్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చే కార్యక్రమంలో భాగాంగా తనిఖీలు చేస్తుండగా సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె చెల్లి, బావా, మరో ఇద్దరు పిల్లలు పారిపోయారు. కొద్దిసేపటిలోనే అధికారుల బృందం వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. పైగా అధికారులు వద్ద ఆ మహిళ తానేమి దొంగతనం చేయడం లేదని అడుక్కుంటాను కదా అని ధర్జాగా వాదిస్తోంది. విచారణలో ఆమె 45 రోజుల్లో రూ. 2.5 లక్షల దాక సంపాదించగలనని ఒప్పుకుంది. అంటే ఏడాదికి ఆమె ఆదాయం దగ్గర దగ్గర రూ. 20 నుంచి రూ. 27 లక్షల దాక ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ఇక సెలవు లేదా ఏదైన పర్వదినాల్లో వారి ఆదాయం మరింత ఎక్కువగానే ఉండొచ్చని చెప్పారు అధికారులు. అలాగే ఆమెను అదుపులో తీసుకునే టైంలోనే ఆమె వద్ద రూ. 19,200 లభించినట్లు తెలిపారు. అది కేవలం ఆమె ఏడు రోజుల్లో సంపాదించిన మొత్తం అని చెబుతున్నారు. ఇక ఆమె పిల్లలు ఉదయం నుంచి మధ్యాహ్నాం లోపల రూ. 600 దాక సంపాదిస్తారని అన్నారు. ఇక కుటుంబం మొత్తం మిలియనర్ రేంజ్లో ఉందని, వారికి ఇల్లు, స్మార్ట్ ఫోన్లు, బ్యాంక్ బాలెన్స్‌లు ఉన్నప్పటికీ నగరంలో భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. అంతేగాదు ఈ మహిళ గతేడాది కూడా ఇలాగే పట్టుబడిందని, కౌన్సిలింగ్ ఇచ్చామని అన్నారు. అయినప్పటికీ పోలీసులు కళ్లగప్పి ఇదే యాచక వృత్తిని అవలంభిస్తున్నట్లు తెలిపారు. ఇండోర్‌లో యాచకులు దాదాపు 7 వేల మంది దాక ఉన్నారు. వీరిలో 98.7% వరకు యాచన ద్వారా దండిగా డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఆదాయపు లెక్కల ప్రకారం.. వాస్తవానికి భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను డేటా ప్రకారం..ఏడాదికి రూ. 20 లక్షల పైన సంపాదించేవారు కొద్దిమంది మాత్రమే. దాదాపు 3.25 కోట్ల మంది పన్ను చెల్లింపుదారుల్లో కేవలం 5 లక్షల మంది వ్యక్తుల మాత్రమే 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్నట్లు డేటా చూపిస్తుంది. దీన్ని బట్టి మొత్తం పన్ను చెల్లింపుదారులు సుమారుగా 1.3%గా ఉంటుంది. ఇలా యాచక వృత్తితో లక్షల్లో డబ్బులు గడించే వారే సంగతి బయటకు పొక్కుండా, గణాంకాలకు సైతం దొరక్కుండా తప్పించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. బిచ్చగాళ్లల్లో రకాలు.. బిచ్చగాళ్లలో మూడు వర్గాలు ఉన్నారని చెబుతున్నారు అధికారులు. పెద్ద పెద్ద నగరాల్లో దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల మంది దాక భిక్షాటన చేస్తారని, అందులో పిల్లల సంఖ్యే ఏకంగా మూడువేలకు పైనే ఉన్నట్లు తెలిపారు. వారిలో ఎవ్వరూ లేని అనాధలు మొదటి వర్గం. రాష్ట్రం బయట నుంచి వచ్చి మరీ బిక్షాటన చేసేవారు రెండోవర్గం. యాచక ముఠాలో భాగమైన వారు మూడో వర్గం అని వెల్లడించారు. వారందరి దృష్టిలో యాచక వృత్తి అనేది మంచి ఆదాయ వనరు, పైగా ఎవ్వరూ తమను పట్టుకోరనే ధైర్యంతోనే ఈ యాచక వృత్తిలోకి ప్రజలు వస్తున్నట్లు తెలిపారు. దీనికి తక్షణమే అడ్డుకట్ట వేసి చర్యలు తీసుకోవాలని కౌన్సలర్ రూపాలి జైన్ చెబుతున్నారు. భిక్షాటనే సంపాదనగా భావించడం క్షమించరాని చెడు మనస్తత్వం అని అన్నారు. ఇది సమాజంలోని ఒక వర్గానికి తప్పుడు సందేశం ఇస్తుందని కూడా అన్నారు రూపాలి జైన్. (చదవండి: రియల్ ఐరన్ మ్యాన్ సూట్‌ని రూపొందించిన యూట్యూబర్! నెటిజన్లు ఫిదా)