ఇండోర్: ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లపై ఉన్న క్రేజ్ మామూలుదికాదు. తమ ముచ్చటైన వాహనానికి లక్కీ నెంబర్ దక్కించుకునేందుకు వాహనదారులు ఎంత సొమ్మైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు. వీఐపీ నంబర్లంటే అంత మోజు! అందుకే వీటిని ఈ-వేలంలో అత్యధిక ధరకు సొంతం చేసుకుంటూ ఉంటారు. ఈ వ్యామోహమే రవాణా కార్యాలయాలకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. తాజాగా ఇండోర్ ఆర్‌టీఓ కార్యాలయం కూడా వీఐపీ నంబర్ల విక్రయం ద్వారా బంపర్ ఆదాయన్ని సాధించింది.
‘0001’ రిజిస్ట్రేషన్ నంబర్ 5 లక్షల 21 వేల అమ్ముడుబోయింది. అలాగే 0009 నంబర్ లక్షా 82 వేలకు విక్రయించింది. ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ప్రజలు తమ ఆసక్తి కనబర్చడం ఇదే మొదటిసారి కాదు. ఆ స్పెషల్ నంబర్లు గతంలో కూడా రికార్డు ధరకు అమ్ముడు బోయాయి. ఉదాహరణకు, 2017 లో "0001" నంబరు ఢిల్లీలో రూ .16 లక్షలకు వేలం వేయగా, ఈ సిరీస్ 2014 లో రూ .12. 50 లక్షలకు, 2015 ఏడాదిలో రూ.12.05 లక్షలకు విక్రయించబడింది. పుట్టినరోజు, ఇతర ముఖ్యమైన రోజులతోపాటు, ఇంకా వారి వారి జాతకం ఆధారంగా కొందరు కొన్ని లక్కీ నెంబర్లను ఎంచుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment