fancy number
-
బీఎస్ఎన్ఎల్కు మారుతున్నారా?.. నచ్చిన నెంబర్ ఎంచుకోండిలా
జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ నెట్వర్క్స్ అన్నీ కూడా రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచిన తరువాత.. అందరి చూపు బీఎస్ఎన్ఎల్ వైపు పడింది. దీంతో ఇప్పటికే చాలామంది తమ నెట్‌వర్క్‌ను బీఎస్ఎన్ఎల్కు మార్చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం తక్కువ ధరలోనే అద్భుతమైన ప్లాన్స్ అందిస్తోంది.ఎక్కువమంది బీఎస్ఎన్ఎల్కు మారుతున్న తరుణంలో సంస్థ కూడా తన నెట్‌వర్క్‌ను విస్తరించడానికి తగిన సన్నాహాలు చేస్తోంది. తమ నెట్‌వర్క్‌కు మారాలనుకునే వారికోసం బీఎస్ఎన్ఎల్ నచ్చిన నెంబర్ ఎందుకుని వెసులుబాటు కూడా కల్పించింది. ఆన్లైన్లో యూజర్ ఇప్పుడు ఫేవరేట్ నెంబర్ సెలక్ట్ చేసుకోవచ్చు.ఆన్లైన్లో నెంబర్ ఎంచుకోవడం ఎలా?గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్‌లో BSNL Choose Your Mobile Number అని సెర్చ్ చేయాలి.ఇలా సెర్చ్ చేసిన వెంటనే BSNL CYMN అనేది కనిపిస్తుంది. దీనిపైనా క్లిక్ చేయగా మరో పేజీ ఓపెన్ అవుతుంది.ఇక్కడ ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్ అని నాలు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీ జోన్ సెలక్ట్ చేసుకుని రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.ఇలా ఎందుకున్న తరువాత ఛాయిస్ నెంబర్, ఫ్యాన్సీ నెంబర్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. కావాల్సిన ఆప్షన్ ఎందుకున్న తరువాత నెంబర్ సెలక్ట్ చేసుకోవచ్చు.నచ్చిన నెంబర్ ఎంచుకున్న తరువాత రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.ప్రక్రియ పూర్తయ్యాక సమీపంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసుకు వెళ్లి సీఎం తెచ్చుకోవచ్చు. ఫ్యాన్సీ నెంబర్ కోసం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. -
టీజీ 09 9999 రూ.25 లక్షలు
సాక్షి, హైదరాబాద్: టీజీ 09 9999 ఫ్యాన్సీ నంబరుకు రూ. 25 లక్షల ధర పలికింది. ఖైరతా బాద్ ఆర్టీఏలో సోమవారం నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో సోనీ ట్రాన్స్పోర్ట్ సొల్యూ షన్స్ ‘టయోటా లాండ్ క్రూజర్ ఎల్ఎక్స్’ వాహనం కోసం ఈ నంబరును దక్కించుకుంది. దీనిపై ఆర్టీఏ విధించిన రూ.50 వేల ఫీజు తో పాటు, బిడ్డింగ్ మొత్తం రూ.25,50,000 చెల్లించి సొంతం చేసుకుంది. ఆల్‌నైన్స్ కోసం ఈ స్థాయిలో పోటీ రావడం తెలంగాణలోనే ఇది మొదటిసారి అని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి.రమేష్ తెలిపారు. ప్రత్యేక నంబర్లకు ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో ఒక్క రోజే రూ.43,70,284 లభించినట్టు ఆయన చెప్పారు. ఆల్‌నైన్స్ ఆన్లైన్ అత్యధిక బిడ్డింగ్ ఇలా..👉 టీఎస్ 09 జీడీ 9999’ నంబరుకు ముప్పా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెల్లించిన మొత్తం రూ.15,53,000👉 టీఎస్ 09 జీఈ 9999 నంబరుకు కీస్టోన్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ చెల్లించిన మొత్తం రూ.17,35,000👉 టీఎస్09 జీసీ 9999 నంబరుకు ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీస్ చెల్లించిన బిడ్డింగ్ మొత్తం రూ.21,60,000 👉 తాజాగా ‘టీజీ 09 9999’ నంబర్‌కు సోని ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ చెల్లించిన మొత్తం రూ.25,50,000 -
లక్ష రూపాయల స్కూటీకి కోటి రూపాయల నంబర్!
ఖరీదైన కార్లకు ఖరీదైన ఫ్యాన్సీ నంబర్లు కొనుగోలు చేయడం చూస్తుంటాం. కానీ లక్ష రూపాయలు విలువ చేసే స్కూటీకి ఫ్యాన్సీ నంబర్ కోసం కోటి రూపాయలకుపైగా వెచ్చించడం గురించి ఎప్పుడైనా విన్నారా..? ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా జిల్లా కోట్‌ఖాయ్ పట్టణంలో రవాణా శాఖ HP-99-9999 నంబర్‌ను ఆన్లైన్లో వేలానికి ఉంచింది. దీని కనీస ధరను రూ. 1000గా నిర్ణయించింది. ఈ నంబరును దక్కించుకునేందుకు మొత్తం 26 మంది బిడ్డింగ్‌లో పాల్గొన్నారు. అందులో రూ.1.12 కోట్లకు పైగా ఆన్లైన్ బిడ్ రావడం అధికారులను ఆశ్చర్యపరిచింది. ఓ ఫ్యాన్సీ నంబర్‌కు ఇంత మొత్తం కోట్ చేయడం ఆ రాష్ట్రంలో ఇదే తొలిసారి. అయితే భారీ మొత్తంలో కోట్ చేసిన ఆ వ్యక్తి వివరాలు తెలియరాలేదు. బిడ్లు ముగించి నంబర్‌ను కేటాయించిన తర్వాతే వివరాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై సిమ్లా డీసీ ఆదిత్య నేగి స్పందిస్తూ HP-99-9999 నంబర్ కోసం అత్యధికంగా రూ. 1,12,15,500 కోట్ చేశారని, సదరు వ్యక్తి ఈ నంబర్‌ను కొనుగోలు చేస్తున్నది ద్విచక్ర వాహనం కోసమా లేదా నాలుగు చక్రాల వాహనం కోసమా అన్నది తెలియలేదని వివరించారు. (ఇదీ చదవండి: యూపీఐకి క్రెడిట్ కార్డుల అనుసంధానం.. ఫస్ట్ టైమ్!) -
ఆల్‌నైన్ వేలం అదుర్స్.. 9999 నెంబర్‌కు అన్ని లక్షలా..?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్లపై వాహనదారులు తమ క్రేజ్‌ను చాటుకున్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏలో శుక్రవారం ప్రత్యేక నెంబర్లకు నిర్వహించిన ఆన్లైన్ వేలంకు వాహనదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. అన్ని ప్రత్యేక నెంబర్లపైన ఆర్టీఏకు రూ.35,58,778 లభించినట్లు జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. టీఎస్ 09 ఎఫ్.వి 9999 నెంబర్ కోసం జి.రాజశేఖర్‌రెడ్డి అనే వాహనదారుడు ఆన్లైన్ వేలం పోటీలో రూ.4,49,999 చెల్లించి సొంతం చేసుకున్నారు. ‘టీఎస్ 09 ఎఫ్ డబ్ల్యూ 0001’ అనే మరో నెంబర్ కోసం శ్రీనిధి ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వేలంలో పోటీపడి రూ.4 లక్షలు చెల్లించింది. ‘టీఎస్ 09 ఎఫ్డబ్ల్యూ 0099’ నెంబర్ కోసం వై.బిందురెడ్డి ఆన్లైన్ వేలంలో రూ.3,72,000 చెల్లించి సొంతం చేసుకున్నారు. చదవండి: (Hyderabad: గుడ్‌న్యూస్.. సిటీబస్సు @ 24/7) -
నంబరు ప్లేట్ కోసం రూ.15 లక్షలు.. ఆ వెంటనే అజ్ఞాతంలోకి!?
ఎవరో ఏదో అనుకుంటారని, పక్కవారి మెచ్చుకోలు కోసం వేలం పాటలో గొప్పలకు పోతే చివరికి చిక్కులు తప్పవు. అందుకు చండీగడ్ బ్రిజ్మోహన్ తాజాగా ఉదాహారణగా నిలిచాడు. యాక్టివా స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబరు కోసం పది హేను లక్షలు వెచ్చించాడంటూ దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన బ్రిట్ మోహన్ తాజాగా చీకట్లలోకి వెళ్లిపోయాడు. ఎప్పటి నుంచో ఫ్యాన్సీ నంబర్లంటే చెవి కోసుకునేవారు ఉన్నారు. ఈ డిమాండ్‌ను ఆధారంగా చేసుకుని రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్లను వేలం వేస్తుంది. ఇలాంటి వేలం పాటలో చండీగడ్‌కు చెందిన బ్రిజ్ మోహన్ అనే వ్యక్తి తన యాక్టివా స్కూటర్‌కి CH-01-0001 అనే నంబరు కోసం ఆన్లైన్ వేలంలో పాల్గొన్నాడు. వేలంలో పాట పాడుతూ పోయి ఏకంగా రూ.15.41 లక్షలకు ఆ నంబరు దక్కించుకున్నాడు. యాక్టివా స్కూటరు రిజిస్ట్రేషన్ నంబరు కోసం రూ.15.41 లక్షలు వెచ్చించిన వ్యక్తిగా ఒక్క రోజులో అతని పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఎవరీ బ్రిజ్మోహన్ అంటూ మీడియా అతని వెంట పడింది. ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రతినిధులు పోలో మంటూ అతని ఇంటికి వెళ్లారు. ఇదే సమయంలో బ్రిజ్మోహన్కి అంత ఆస్తులు, ఆదాయం ఎక్కడిదంటూ ఆరా తీసే పనిలో పడింది ఇన్‌కం ట్యాక్స్ శాఖ. మరోవైపు స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబరు కోసం అంత డబ్బు వెచ్చించడంపై కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. బ్రిజ్ మోహన్ కుటుంబం ఎప్పటి నుంచో ఆర్థికంగా స్థితిమంతుల కుటుంబమే. అయితే వేలం పాటతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఒక్కసారిగా వచ్చిన పాపులారిటీతో ఆదాయపు పన్ను శాఖ తనపై ఫోకస్ చేస్తే లేని పోని చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని సందేహిస్తున్నట్టు సమాచారం. వచ్చిన క్రేజ్ కంటే ఒత్తిడి ఎక్కువ కావడంతో బ్రిజ్ మోహన్ రెండు రోజులుగా ఎవరికీ కనిపించచడం లేదు. ఐటీ దాడులు ఉంటాయనే ముందు జాగ్రత్తగా అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటాడని స్థానికంగా చర్చ జరుగుతోంది. మరోవైపు టూవీలర్ నంబరు కోసం దేశ చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో భారీ మొత్తం పాడటం పట్ల ఆర్టీఓ అధికారులు కూడా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అసలు బ్రిజ్ మోహన్ మానసిక స్థితి ఎలాంటిది అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన సొమ్ము చెల్లించి నంబరు తీసుకుంటాడా లేక డిపాజిట్‌గా కట్టిన డబ్బు వదిలేసుకుంటాడా అనేదానిపై స్థానికంగా బెట్టింగులు పెట్టుకుంటున్నారు. బ్రిజ్ మోహన్ అజ్ఞాతం వీడితేనే ఈ అంశంపై స్పష్టత రానుంది. చదవండి:ఫ్యాన్సీ నెంబర్ కోసం ఇంత మోజా! స్కూటీ ధర వేలల్లో ఉంటే. -
వామ్మో..ఫ్యాన్సీ నెంబర్ కోసం ఇంత ఖర్చా..! బండి ఖరీదు వేలల్లో ఉంటే..నెంబర్ మాత్రం!
వాహనదారులు కొత్త వెహికల్స్ కొనడం ఒక ఎత్తైతే. వాటికి ఫ్యాన్సీ నెంబర్లను ఎంపిక చేయడం మరో ఎత్తు. వాహనదారులు ప్రతీ నెంబర్‌కు ఓ ప్రత్యేకత ఉందని భావిస్తారు. నెంబర్ 1 నాయకత్వానికి సూచిక. అందుకే దాదాపూ ఈ నెంబర్ కోసం పోటీ పడుతుంటారు. ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. గతంలో ఈ తరహా పోటీ జరగ్గా... తాజాగా అదే తరహా సీన్ రిపీట్ అయ్యింది. ఛండీఘడ్కు చెందిన బ్రిజ్ మోహన్ అడ్వటైజింగ్ ఏజెన్సీలో జాబ్ చేస్తున్నాడు. అయితే మోహన్ తాజాగా రూ.71వేలకు హోండా యాక్టీవాను కొనుగోలు చేశాడు. కానీ ఆ బండి ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎంత ఖర్చు చేశాడో తెలుసా? అక్షరాల రూ.15.44లక్షలుగా ఉంది. ఫ్యాన్సీ నెంబర్‌ను కొనుగోలు చేయడంపై మోహన్ మాట్లాడుతూ..హోండా యాక్టీవాను ఈ ఫ్యాన్సీ నెంబర్‌ను వినియోగిస్తాను. త్వరలో కారు కొంటా. ఆ కారుకి కూడా సేమ్ ఫ్యాన్సీ నెంబర్‌ను ఉపయోగిస్తానని చెబుతున్నాడు. ఇటీవల ఛండీఘడ్ ఆర్టీఓ అధికారులు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 16 వరకు ఫ్యాన్సీ నెంబర్ల వేలం నిర్వహించారు. ఈ ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో కొత్త సిరీస్ సీహెచ్01- సీజే-0001 (CH01-CJ) నెంబర్ ఉందని అన్నారు. తాము నిర్వహించిన వేలంలో ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.1.5కోట్ల వరకు వాహనదారులు చెల్లించినట్లు తెలిపారు. సీహెచ్01- సీజే-0001 ఫ్యాన్సీ నెంబర్‌కు మోహనే అత్యధికంగా రూ.15.44 లక్షలు చెల్లించాడని ఆర్టీఓ అధికారులు చెప్పారు. ఇక ఈ నెంబర్ రిజర్వ్ ధర రూ.50వేలు ఉండగా రెండవ అత్యంత ఖరీదైన ఫ్యాన్సీనెంబర్ సీహెచ్-01-సీజే-002పై రూ.5.4 లక్షలు చెల్లించిచారని..సీహెచ్-01-సీజే-007 నెంబర్ ధర రూ.4.4 లక్షలు పలకగా..సీహెచ్-01-సీజే-003 నెంబర్ రూ.4.2లక్షలకు వాహనదారులు సొంతం చేసుకున్నారు. ఇక ఈ నంబర్ రిజర్వ్ ధర రూ.30వేలుగా ఉంది. కాగా, ఇప్పటివరకు, 0001కి అత్యధిక బిడ్ 2012లో వచ్చింది. సెక్టార్ 44 నివాసి సీహెచ్ -01-ఏపీ సిరీస్ నుండి రూ.26.05 లక్షలకు నంబర్‌ను కొనుగోలు చేశారు.ఇది అతని ఎస్ -క్లాస్ మెర్సిడెస్ బెంజ్ కోసం కొనుగోలు చేశాడని ఆర్టీఓ అధికారులు గుర్తు చేశారు. -
ఫాన్సీ నెంబర్లపై ఇంత మోజా! 0001 ధరెంతో తెలుసా?
ఇండోర్: ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లపై ఉన్న క్రేజ్ మామూలుదికాదు. తమ ముచ్చటైన వాహనానికి లక్కీ నెంబర్ దక్కించుకునేందుకు వాహనదారులు ఎంత సొమ్మైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు. వీఐపీ నంబర్లంటే అంత మోజు! అందుకే వీటిని ఈ-వేలంలో అత్యధిక ధరకు సొంతం చేసుకుంటూ ఉంటారు. ఈ వ్యామోహమే రవాణా కార్యాలయాలకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. తాజాగా ఇండోర్ ఆర్టీఓ కార్యాలయం కూడా వీఐపీ నంబర్ల విక్రయం ద్వారా బంపర్ ఆదాయన్ని సాధించింది. ‘0001’ రిజిస్ట్రేషన్ నంబర్ 5 లక్షల 21 వేల అమ్ముడుబోయింది. అలాగే 0009 నంబర్ లక్షా 82 వేలకు విక్రయించింది. ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ప్రజలు తమ ఆసక్తి కనబర్చడం ఇదే మొదటిసారి కాదు. ఆ స్పెషల్ నంబర్లు గతంలో కూడా రికార్డు ధరకు అమ్ముడు బోయాయి. ఉదాహరణకు, 2017 లో "0001" నంబరు ఢిల్లీలో రూ .16 లక్షలకు వేలం వేయగా, ఈ సిరీస్ 2014 లో రూ .12. 50 లక్షలకు, 2015 ఏడాదిలో రూ.12.05 లక్షలకు విక్రయించబడింది. పుట్టినరోజు, ఇతర ముఖ్యమైన రోజులతోపాటు, ఇంకా వారి వారి జాతకం ఆధారంగా కొందరు కొన్ని లక్కీ నెంబర్లను ఎంచుకుంటారు. -
'ఫ్యాన్సీ’ సెల్‌ఫోన్ నెంబర్లు ఇప్పిస్తానంటూ టోకరా
సాక్షి, సిటీబ్యూరో: ఫ్యాన్సీ సెల్‌ఫోన్ నెంబర్లకు ఉన్న క్రేజ్‌కు ఓ సైబర్ నేరగాడు తెలివిగా క్యాష్ చేసుకున్నాడు. వీటి కోసం అనేక మంది సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదిస్తుంటారని తెలుసుకుని దాని ఉద్యోగినే టార్గెట్‌గా చేశాడు. అతగాడు విసిరిన వల్లోపడి రూ.20 వేలు పోగొట్టుకున్న బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. గుజరాత్ నుంచి నగరానికి వచ్చి నివసిస్తున్నట్లు అనుమానిస్తున్న ఓ దుండగుడు ఈ ఫ్రాడ్‌కు సూత్రధారిగా ఉన్నాడు. ఇతగాడు వేర్వేరు వివరాలతో రెండు ఫోన్ నెంబర్లు తీసుకున్నాడు. వీటిలో ఒకటి జియో సంస్థకు చెందిన ఫ్యాన్సీ నెంబర్. దీన్ని ఆధారంగా చేసుకుని వాట్సాప్‌లో ఫ్యాన్సీ నెంబర్స్ పేరుతో ఓ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఈ గ్రూప్‌లో తన రెండో నెంబర్‌ను వేరే వ్యక్తి పేరుతో సేవ్ చేసి, దాన్నీ యాడ్ చేసుకుని అడ్మిన్‌ను చేశాడు. ఇలా మోసానికి అవసరమైన సన్నాహాలు పూర్తి చేసుకున్న దుండగుడు ‘క్షేత్రస్థాయి’లోకి దిగాడు. అనేక మంది ఫ్యాన్సీ నెంబర్లు కావాలని కోరుతూ వివిధ సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన ఔట్‌లెట్స్‌లోని ఉద్యోగుల్ని సంప్రదిస్తూ ఉంటారు. ఎయిర్టెల్ సంస్థకు చెందిన అలాంటి ఓ ఔట్లెట్లో పని చేసే ఉద్యోగిని సంప్రదించిన ఈ మోసగాడు తనకు ఉన్న జియో ఫ్యాన్సీ నెంబర్‌ను పోర్ట్ చేయాలని కోరాడు. ఆ పని చేస్తూ సదరు ఉద్యోగి ఈ ఫ్యాన్సీ నెంబర్ ఎలా పొందాలంటూ ప్రశ్నించాడు. వీటికోసం వాట్సాప్‌లో ఓ ప్రత్యేక గ్రూప్ ఉందని, తాను పంపే లింకు ద్వారా అందులో జాయిన్ అయితే వాటిని ఖరీదు చేసుకోవచ్చని నమ్మబలికాడు. దీంతో మోసగాడి నుంచి లింకు షేర్ చేయించుకున్న ఉద్యోగి దాని ద్వారా ఆ వాట్సప్ గ్రూప్‌లో చేరాడు. చివరలో ఐదు తొమ్మిదులు వచ్చే ఫ్యాన్సీ నెంబర్ కావాలంటూ గతంలో ఓ వినియోగదారుడు ఇతడిని అడిగాడు. ఆ విషయం దృష్టిలో పెట్టుకున్న ఈ ఉద్యోగి ఆ నెంబర్ కోసం ఈ వాట్సాప్ గ్రూప్‌లో సంప్రదించాడు. వెంటనే అడ్మిన్‌గా ఉన్న నెంబర్ ద్వారా జవాబు ఇవ్వడం ప్రారంభించిన మోసగాడు రూ.20 వేలు చెల్లిస్తే ఆ నెంబర్ కేటాయించేలా చేస్తానంటూ చెప్పాడు. ఈ మాటలు నమ్మిన ఉద్యోగి గూగుల్ పే ద్వారా ఆ మొత్తం పంపేశాడు. ఆ తర్వాత అడ్మిన్‌గా ఉన్న నెంబర్‌తో ఈ ఉద్యోగి నెంబర్‌ను బ్లాక్ చేసిన మోసగాడు, ఫోన్లకూ స్పందించడం మానేశాడు. దీంతో తనను అడ్మిన్‌గా ఉన్న వ్యక్తి మోసం చేశాడని భావించిన బాధితుడు తనకు ఆ గ్రూప్‌లో చేరడానికి లింకు షేర్ చేసిన వ్యక్తిని అతడి నెంబర్లో సంప్రదించి వివరణ కోరాడు. ఏమీ తెలియనట్లు వ్యవహరించిన మోసగాడు ఆ అడ్మిన్‌తో మాట్లాడతానంటూ మూడు రోజుల వ్యవధి కోరారు. ఆ గడువు పూర్తయిన తర్వాత బాధితుడు మరోసారి ప్రయత్నించగా సదరు మోసకారి అడ్మిన్ తన నెంబర్ కూడా బ్లాక్ చేశాడంటూ చెప్పి.. ఆపై అతగాడూ బాధితుడి నెంబర్‌ను బ్లాక్ చేసేశాడు. అప్పుడు అనుమానం వచ్చిన బాధితుడు పరిశీలించగా... పోర్ట్ చేయాలంటూ తనను సంప్రదించి, వాట్సాప్ గ్రూప్ లింకు పంపిన వ్యక్తి సెల్‌ఫోన్ నెంబర్‌తోనే ఆ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయినటు గుర్తించాడు. మరోపక్క సాంకేతికంగా ఆరా తీయగా... ఆ నెంబర్‌తో పాటు గ్రూప్ అడ్మిన్ నెంబర్ కూడా ఒకే వ్యక్తి పేరుతో ఉన్నట్లు గ్రహించాడు. దీంతో అతగాడు పథకం ప్రకారం తనను మోసం చేశాడని భావించి గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో బాధితుడు నివసించే ప్రాంతం రాచకొండ పరిధిలోని బాలాపూర్ పోలీసుస్టేషన్ కిందికి వస్తుందని గుర్తించారు. దీంతో తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే చట్ట పరంగా ఇబ్బందులు వస్తాయని, ఎల్బీనగర్ చౌరస్తాలోని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించి పంపారు. ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన పూర్తి సాంకేతిక సహకారం అందిస్తామని ఆయన బాధితుడికి హామీ ఇచ్చారు. ఆ మోసగాడు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ ద్వారా మరికొందరూ మోసపోయే ప్రమాదం ఉందని, ఇలాంటి వాటి పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కేవీఎం ప్రసాద్ సూచించారు. -
ఎయిర్టెల్ సంస్థ సీఈఓనని ‘ఫ్యాన్సీ’ వల
సాక్షి, సిటీబ్యూరో: ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రముఖులను టార్గెట్‌గా చేసుకుంటాడు... తక్కువ ధరకు ఫ్యాన్సీ సెల్‌ఫోన్ నంబర్లు ఇస్తానంటూ ఎస్సెమ్మెస్ పంపిస్తాడు... కాల్ చేసిన వారితో ఎయిర్టెల్ సంస్థ సీఈఓనని పరిచయం చేసుకుంటాడు... ఆసక్తి చూపిన వారి నుంచి అందినంత బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయించుకుంటాడు... ఆపై తన సెల్ నంబర్ మార్చేసి మోసం చేస్తాడు... ఈ పంథాలో రెచ్చిపోతున్న మద్దెల దీపుబాబును నగర సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడికి విఠల్, గోపాల్, ప్రతాప్‌రెడ్డి అనే పేర్లు కూడా ఉన్నాయని జాయింట్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి సోమవారం వెల్లడించారు. సెల్‌ఫోన్ ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్‌ను ఇతను క్యాష్ చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రికి చెందిన దీపుబాబు బీటెక్ చదువుతూ మధ్యలోనే మానేశాడు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మోసాల బాట పట్టాడు. సాధారణ వ్యక్తుల్ని టార్గెట్‌గా చేసుకుంటే వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని భావించాడు. అదే ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కార్పొరేట్ సంస్థలకు చెందిన పెద్దల్ని మోసం చేస్తే చిన్న చిన్న మొత్తాల కోసం పోలీసులకు ఫిర్యాదు చేయరని భావించాడు. దీనికోసం బోగస్ పేర్లు, వివరాలతో కొన్ని సిమ్‌కార్డులు తీసుకోవడంతో పాటు బ్యాంకు ఖాతాలు తెరిచాడు. ఇంటర్నెట్ ద్వారా పలువురు ప్రముఖుల ఫోన్ నంబర్లు సేకరించేవాడు. తన వద్ద ఉన్న సిమ్‌కార్డుల్ని వినియోగించి ఆయా ప్రముఖులకు ఎస్సెమ్మెస్‌లు పంపేవాడు. అందులో తాను ఎయిర్టెల్ సంస్థ సీఈఓ అని, 9899999999, 9123456789, 9999999099, 9999999999 తదితర ఫ్యాన్సీ నంబర్లు అందుబాటులో ఉన్నాయని, తక్కువ ధరకే వీటిని అందిస్తున్నామని చెప్పేవాడు. సాధారణంగా ఈ తరహా ఫ్యాన్సీ నంబర్లు రూ.లక్షకు పైగా ఖరీదు చేస్తాయి. అయితే ఆసక్తి చూపి తనను సంప్రదించే వారితో ఇతగాడు రూ.40 వేల నుంచి రూ.50 వేలకు ఈ నెంబర్లు ఇస్తానంటూ చెప్పేవాడు. ఇది అర్జంట్ సేల్ అని, అనేక మంది ఖరీదు చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పడంతో ఎదుటి వ్యక్తి వెంటనే కొనడానికి ముందుకు వచ్చేవాడు. అలాంటి వారి నుంచి అడ్వాన్స్‌గా లేదా మొత్తం తాను సూచించిన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకునే వాడు. ఆపై తన సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఆ సిమ్‌కార్డు ధ్వంసం చేసేవాడు. ఇలా ఇతగాడి చేతిలో అనేక మంది ప్రముఖులు మోసపోయారు. అయితే ఎవరికి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేయడంతో దీపుబాబు ఆటలు సాగాయి. నగరానికి చెందిన జానకి రామమోహన్ నుంచి ఇతను ఇదే తరహాలో రూ.45,800 కాజేయడంతో ఆయన సిటీ సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ బి.మధుసూదన్ నేతృత్వంలో ఎస్సైలు టి.వినయ్‌కుమార్, హెడ్–కానిస్టేబుల్ హనుమాన్ ప్రసాద్, కానిస్టేబుల్ ప్రభు దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలతో పాటు బ్యాంకు ఖాతా నంబర్ల ఆధారంగా నిందితుడు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్ళిన ప్రత్యేక బృందం దీపుబాబును అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఇతడు ఇదే తరహా నేరాలు చేయడంతో గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల, గుంటూరు పోలీసులు అరెస్టు చేసినట్లు తేలింది. కొన్నాళ్లు గుంటూరులో నివసించిన ఇతను ఆపై తన మకాంను బెంగళూరుకు మార్చాడు. కేవలం మోసా లు చేయడం మినహా ఎలాంటి పని చేయట్లేదని తేలింది. ఇలా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడంతో పాటు గుర్రపు రేసుల్లోనూ పందేలు కాసేవాడని వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ఓ మాజీ ఎమ్మెస్సీ సైతం ఇతడి చేతిలో మోసపోయినట్లు సమాచారం. సైబర్ క్రైమ్ ఠాణాలోనే నమోదైన మరో కేసులోనూ దీపుబాబు నిందితుడిగా ఉండటంతో అతడిని పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని అధికారులు నిర్ణయించారు. -
ఫాన్సీ నంబర్ కోసం ఇన్ని లక్షలా..!
తిరువనంతపురం : వాహనాల కొనుగులకంటే కూడా వాటికి కేటాయించే నంబర్ల మీద చాలా ఎక్కువ ఖర్చు చేస్తారు జనాలు. ఫ్యాన్సీ నంబర్ కోసం ఓ బిజినేస్ మ్యాన్ ఏకంగా రూ.31 లక్షలు ఖర్చు చేశాడు. వివరాలు.. కేరళకు చెందిన వ్యాపారవేత్త బాలగోపాల్... తాను ఎంతో ముచ్చటపడి కొనుకున్న కోటి రూపాయల ఖరీదైన పోర్ష్ కారు కోసం ఫ్యాన్సీ నంబర్‌ను వేలంలో కొనుగోలు చేశారు. వేలం పాటలో రూ. 31 లక్షలు పెట్టి తాను కోరుకున్న కేఎల్ 01 సీకే 1 నంబర్‌ను సొంతం చేసుకున్నారు. ఈ ఫ్యాన్సీ నంబర్ కోసం బాలగోపాల్‌తో పాటు మరో ఇద్దరు పోటీ పడ్డారు. దుబాయ్‌కు చెందిన వ్యక్తి వేలంలో రూ. 10 లక్షల వరకు కోట్ చేశారు. ఆ తరువాత అతను వేలం నుంచి డ్రాప్ అయ్యారు. అయితే మరో వ్యక్తి మాత్రం ఈ నంబర్ కోసం రూ. 25.50 లక్షల వరకు కోట్ చేశారు. కానీ బాలగోపాల్ ఏకంగా రూ. 31 లక్షలు చెప్పడంతో... అతను కూడా వేలం పాటు నుంచి తప్పుకున్నారు. దీంతో అత్యధిక రేటు కోట్ చేసిన వ్యాపారవేత్త బాలగోపాల్... కేఎల్ 01 సీకే 1 నంబర్‌ను సొంతం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం తాను ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న టయోటా ల్యాండ్ క్రూయిజర్ కోసం కేఎల్ 01 సీబీ 01 నంబర్‌ను వేలం పాటలో రూ. 19 లక్షలకు కొనుగోలు చేశారు బాలగోపాల్. ఓ ఫ్యాన్సీ నంబర్‌కు ఈ స్థాయిలో ధర పలకడం కేరళతో పాటు దక్షిణాదిలో కూడా ఇదే మొదటిసారి అని తెలిపారు రవాణాశాఖ అధికారులు. -
ఫ్యాన్సీ నంబర్.. క్రేజీ ఆఫర్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వాహనదారుల్లో ఫ్యాన్సీ నంబర్లపై అమితాసక్తి చూపుతున్నారు. దీంతో జిల్లా రవాణాశాఖకు కాసుల వర్షం కురుస్తోంది. లక్షలు పోసి కొనుగోలు చేసిన వాహనం కోసం మెచ్చిన నంబర్ ఉండాలని భావిస్తున్న కొందరు భారీగా డబ్బులు కుమ్మరిస్తున్నారు. పెద్ద పెద్ద వాహనలకే కాదు, ద్విచక్ర వాహనాలకు కూడా ఫ్యాన్సీ నంబర్ కోసం వేల రూపాయలు చెల్లిస్తున్నారు. మరోవైపు రూ.50 వేల కేటగిరీతో ఉన్న 9999 నంబర్‌ను దక్కించుకునేందుకు రియల్టర్లు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈక్రమంలో ఒకే నంబర్ కోసం పోటీ వారికి ఆర్టీఏ అధికారులు వేలం నిర్వహిస్తూ.. ఎక్కువ ధర కోట్ చేసిన వారికి నంబర్ కేటాయిస్తున్నారు. ద్విచక్రవాహనదారులు సైతం తొమ్మిది వచ్చేలా(అన్ని అంకెలకు కూడితే) చూసుకుంటున్నారు. ఇందుకోసం ముందుగానే తమకు నచ్చిన నంబర్లను సొంతం చేసుకునేందుకు రిజర్వేషన్ చేసుకుంటుండటంతో జిల్లా కార్యాలయంలో ఓపెన్ బిడ్ నిర్వహిస్తున్నారు. ఈ బిడ్‌లో ఎవరు ఎక్కువకు కోట్ చేస్తే వారికే నెంబర్ కేటాయిస్తున్నారు. రూ.3 లక్షలతో ఫ్యాన్సీ నంబర్ సిద్దిపేట, చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్ ప్రాంతాల్లో రవాణాశాఖ కార్యాలయాలు ఉండగా.. వాటి పరిధిలో వాహనదారులు ముందుగానే ఫ్యాన్సీ నంబర్ల కోసం వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండగా, 2016–17 సంవత్సరానికి గాను ఈ ఆదాయం రూ.23,61,440 రాగా, 2017–18లో ఫ్యాన్సీ నంబర్లను 1,472 వాహనాలకు కేటాయించారు. దీంతో జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి రూ.60,02,875 ఆదాయం వచ్చింది. ఇలా ఒక్క సంవత్సరంలోనే రూ.37 లక్షలు ఆదాయం ఫ్యాన్సీ నంబర్ల ద్వారా జిల్లా రవాణాశాఖకు చేరింది. అత్యధికంగా టీఎస్ 36ఎ 9999 వాహనానికి రిజర్వేషన్ రూ.50,000తో పాటు ఓపెన్ బిడ్‌లో రూ.3,26,000 చెల్లించి జిల్లాకు చెందిన ఓ మహిళ సొంతం చేసుకున్నారు. అలాగే టీఎస్ 36ఎ 6666 వాహనానికి రిజర్వేషన్ రూ.30,000తో పాటు ఓపెన్ బిడ్‌లో రూ.1,12,500 చెల్లించి మరో మహిళ సొంతం చేసుకున్నారు. జిల్లాలో వందల సంఖ్యల్లో వాహనాలు నిత్యం రిజిస్ట్రేషన్లు జరుపుకుంటుండగా.. వీటికి ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు ఆర్టీఓ కార్యాలయాలకు బారులు తీరుతున్నారు. మా అన్ని వాహనాలకు 3456 మాకున్న నాలుగు కార్లకు ఒకే నంబర్లు ఉండేలా 3456 నంబర్ కోసం ఓపెన్ బిడ్‌లో పాల్గొన్నాం. ఇందుకోసం ముందుగానే రూ.20,000 చెల్లించి నంబర్‌ను రిజర్వ్ చేసుకున్నాం. అన్ని కార్లకు ఒకే నంబర్ ఉండటం ఒకరకంగా హోదాగా ఉంటుంది. – రోహిత్ యాదవ్, సిద్దిపేట ఫ్యాన్సీ నంబర్లపై మక్కువ వాహనదారుల్లో ఫ్యాన్సీ నంబర్లపై మక్కువ పెరుగుతోంది. దీంతో ఎంత ఖర్చు చేసేందుకు అయినా రెడీ అవుతున్నారు. 2017–18 సంవత్సరానికి 1,472 మంది వాహనదారులు వారు కోరుకున్న నంబర్లు చేజిక్కించుకున్నారు. దీంతో రవాణాశాఖకు రూ.60,02,875 ఆదాయం వచ్చింది. ఖరీదైన వాహనాలకే కాదు, ద్విచక్ర వాహనాలకు సైతం ఫ్యాన్సీ నంబర్లు ఉండేలా వాహనదారులు కోరుకుంటున్నారు. – రామేశ్వర్‌రెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి జిల్లాలో ఫాన్సీ నంబర్ల ధరలు.. రూ.50వేల కేటగిరి: 0001, 0009, 0999, 9999... రూ.30 వేల కేటగిరి: 0099, 0333, 0555, 0666, 0777, 0888... రూ.20 వేల కేటగిరి: 0123, 0222, 0369, 0444... రూ.10 వేల కేటగిరి: 0003, 0005, 0006, 0007... -
ఆ నంబర్ కోసం 16 లక్షలు
జైపూర్ : ఎంతగానో ఇష్టపడి కొనుక్కునే వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ కావాలని కోరుకునేవారు అందుకోసం భారీమొత్తం చెల్లించడానికి కూడా వెనుకాడటం లేదు. జైపూర్‌కు చెందిన వ్యాపారవేత్త రాహుల్ తనేజా మాత్రం తన కొత్త కారు నంబరు కోసం ఏకంగా రూ.16 లక్షలు వెచ్చించారు. గతంలో ఫ్యాన్సీ నంబర్ల కోసం భారీగానే ఖర్చు చేశారు రాహుల్. 2011లో తాను మొదట కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ 5 సిరీస్‌కు ‘నంబర్ 1’ కోసం రూ.10.31 లక్షలు చెల్లించి.. ఆర్జే 14 సీపీ 0001 పొందారు. ఆ తర్వాత స్కోడా, బీఎండబ్ల్యూ 7 సిరీస్‌లకు కూడా భారీగా వెచ్చించి 0001 నంబరు దక్కించుకున్నారు. తాజాగా మార్చి 25న రూ.1.5 కోట్లతో జాగ్వార్ కారును కొనుగోలు చేశారు. దీనికి కూడా అదే ఫ్యాన్సీ నంబరు పొందడానికి దాదాపు 45 రోజులు ఎదురుచూశారు. చివరికి రూ. 16 లక్షలు చెల్లించి ఆర్జే 45 సీజీ 0001 నంబరును సొంతం చేసుకున్నారు. ఒక వాహనం నంబరు కోసం చెల్లించిన భారీ మొత్తం ఇదేనని జైపూర్ రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా రాహుల్ తనేజా మొబైల్ నంబర్లో కూడా ఐదు ఒకట్లు ఉంటాయని తెలుస్తోంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. తనకు ‘నంబరు 1’ బాగా కలిసొచ్చిందని తెలిపారు. అందుకు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పుకొచ్చారు. -
ఫ్యాన్సీ నంబర్.. ధర సూపర్!
వేలంలో 9999 నంబరు దక్కించుకున్న మహిళ సాక్షి, మలక్‌పేట(హైదరాబాద్): మూసారంబాగ్‌లోని ఈస్ట్‌జోన్ ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్లకు నిర్వహించిన వేలం పాటలో ఓ మహిళ టీఎస్ 11ఈకే 9999 నంబరును రూ. 2,50,285 లక్షలకు దక్కించుకున్నారని ఆర్టీఏ మొహిమిన్ తెలిపారు. గడ్డిఅన్నారానికి చెందిన జి. ప్రత్యుషరెడ్డి హోండా అమేజ్ కారును కొనుగోలు చేశారు. ఈ కారుకు ఫ్యాన్సీ నంబర్ (టీఎస్ 11ఈకే 9999) కోసం ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. అయితే, ఇదే నెంబర్‌కు కోసం మరో నలుగురు పోటీ పడటంతో ఆర్టీఏ అధికారులు సోమవారం వేలం పాట నిర్వహించగా.. 2,50,285కు ప్రత్యుషరెడ్డి సొంతం చేసుకున్నారు. వాహనదారులు ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ పడుతుండటంతో రవాణాకు శాఖకు ఆదాయం పెరుగుతోంది. అ‘ధర’హో.. ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ రవాణాశాఖ నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో కొన్ని నంబర్లకు ఊహించని ధర దక్కింది. టీఎస్ 09 ఈఎస్ 9999 నంబరు ఏకంగా రూ.10 లక్షలు పలికింది. రూ. 6.85 కోట్ల విలువైన బెంట్లీ ముల్సానే బ్రాండు కారు కోసం హెట్రో డ్రగ్స్ ప్రతినిధులు ఈ నంబరు దక్కించుకున్నారు. టీఎస్ 09 ఈఎస్ 0099 నెంబరును రూ. 1.93 లక్షలకు సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ వాళ్లు పాడుకున్నారు. రూ. 4.49 కోట్లతో కొన్న ఫెరారీ 488 జీటీబీ మోడల్‌కు ఈ నంబర్ పొందారు. టీఎస్ 09 ఈఎస్ 0009 నంబరుకు రూ. 1.73 లక్షల ధర పలికింది. ఇంటర్ కాంటినెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ తాము రూ. 20 లక్షలతో తీసుకున్న ఇన్నోవా క్రిస్టా కారుకు ఈ నంబరు తీసుకుంది. ఇక టీఎస్ 09 ఈఎటీ 0007 నంబరును గాయత్రి ప్రాజెక్ట్స్ సంస్థ రూ. 1.15 లక్షలకు పాడుకుంది. రూ. 1.28 కోట్లతో కొన్న బెంజ్ ఎస్350 సీడీఐ కారుకు ఈ నంబరు పొందారు. -
ఆ నంబర్ కోసం భారీగా చెల్లించిన బాలకృష్ణ
హైదరాబాద్ : ఎంత డబ్బు చెల్లించైనా సరే ఫ్యాన్సీ నంబర్ కోసం క్రేజీ కొనసాగుతూనే ఉంది. తాజాగా పలు ఫ్యాన్సీ నంబర్లపై రవాణా శాఖకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటల్లో పలు ప్రత్యేక నంబర్లపై రవాణాశాఖకు రూ.30.34 లక్షల ఆదాయం లభించింది. గవి కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ తమ బెంజ్ కారు కోసం 10.05 లక్షల రూపాయలు చెల్లించి వేలంలో ‘టీఎస్ 09 ఈటీ 9999’ నంబర్ సొంతం చేసుకుంది. ‘టీఎస్ 09 ఈయూ 0001’ నంబర్ కోసం సినీనటుడు నందమూరి బాలకృష్ణ రూ.7.77 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. తమ బెంట్లీ కారు కోసం ఆయన ఈ నంబర్‌ను వేలంలో గెలుచుకున్నారు. అలాగే ‘టీఎస్ 09 ఈయూ 0099’ నంబర్ కోసం ఆర్ఎస్ బ్రదర్స్ వస్త్రవ్యాపార సంస్థ రూ.2.70 లక్షలు చెల్లించింది. తమ ల్యాండ్‌రోవర్ కారు కోసం ఈ నెంబర్‌ను సొంతం చేసుకున్నారు. కాగా గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా రూ.11లక్షలు చెల్లించి ‘9999’ నంబర్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
ఫ్యాన్సీ..నో క్రేజీ!
లక్కీ నెంబర్లపై తగ్గిన మోజు 40 శాతం తగ్గిన ఆర్టీఏ ఆదాయం ఆల్ నైన్స్ నెంబర్‌కు..గతేడాది రూ.10 లక్షలు..ఈసారి రూ.2.35 లక్షలే.. ‘అదృష్టానికి’ అడ్డంకిగా పెద్ద నోట్ల రద్దు తగ్గిన హై ఎండ్ వాహనాల అమ్మకాలు సిటీబ్యూరో : 9, 1, 999, 9999, 786, 6,666, 1111 ..... ఇలాంటి ఫ్యాన్సీ, లక్కీ నెంబర్లపై వాహనదారులకు ఉండే క్రేజ్ మాటల్లో చెప్పలేం. పెద్దఎత్తున పోటీకి దిగుతారు. వేలంలో రూ.లక్షలు చెల్లించేందుకు సిద్ధమవుతారు. ఆ సీరీస్‌లో కోరుకున్న నెంబర్ రాలేదంటే మరో సీరీస్ కోసం ఎదురు చూస్తారు. ఏడాదైనా సరే నచ్చిన నెంబర్ చేతికి వచ్చేదాకా ఆగుతారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. గత రెండు నెలలుగా ఫ్యాన్సీ నెంబర్లపై ఆసక్తి తగ్గింది. రూ.లక్షలు వెచ్చించేందుకు వాహన యజమానులు వెనుకడుగు వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో సంపన్నుల నుంచి సామాన్యుల వరకు ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. నెంబర్లపై ఎక్కువ మొత్తం ఖర్చు చేసేందుకు సాహసించడం లేదు. దీంతో రవాణాశాఖ ఆదాయంపై కూడా గణనీయమైన ప్రభావం పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాహనాల నెంబర్లపైన వచ్చే ఆదాయం 40 శాతం వరకు పడిపోయినట్లు అంచనా. సంపన్న వర్గాలు ఎక్కువ కొనుగోలు చేసే హై ఎండ్ వాహనాల అమ్మకాలు కూడా తగ్గడం ఇందుకు మరో కారణం. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా... ∙గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటల్లో ‘టీఎస్ 09 ఈఎల్ 9999’ అనే నెంబర్ కోసం సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ చెల్లించిన మొత్తం అక్షరాలా రూ.10.50 లక్షలు. సోమవారం నిర్వహించిన వేలం పాటల్లో అదే నెంబర్ ‘టీఎస్ 09 ఈఆర్ 9999’ కోసం ఆర్ఎస్ బ్రదర్స్ వేలంలో చెల్లించిన మొత్తం కేవలం రూ.2.35 లక్షలు. ► ఒక్క ఖైరతాబాద్‌లోనే కాదు. అత్తాపూర్, మలక్‌పేట్, సికింద్రాబాద్ తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో గతేడాది ఇలాంటి నెంబర్ల కోసం వాహనదారులు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు చెల్లించారు. కానీ ఇప్పుడు డిమాండ్ బాగా పడిపోయింది. గత సంవత్సరం రూ.15 కోట్ల ఆదాయం లభించింది. ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చే నెంబర్ల సీరీస్‌పై రూ.25 లక్షల వరకు ఆదాయం వచ్చేది. తాజాగా నిర్వహించిన వేలం పాటల్లో రూ.11.66 లక్షల ఆదాయం మాత్రమే లభించింది. మొత్తంగా ఈ ఏడాది కాలంలో వాహనాల ఫ్యాన్సీ నెంబర్లపైన ఆదాయం 40 శాతం వరకు పడిపోయినట్లు రవాణావర్గాలు అంచనా వేస్తున్నాయి. అదృష్ట సంఖ్యలు, రైజింగ్ నెంబర్లపై ఇష్టం ఉన్నా...వేలంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ‘హైఎండ్’ అమ్మకాలు కూడా తగ్గుముఖం... ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో విక్రయాలు జరిగే బీఎండబ్ల్యూ, ల్యాండ్‌రోవర్, ల్యాండ్‌క్రూజర్, ఆడి వంటి ఖరీదైన కార్ల అమ్మకాలు ఈసారి సగానికి సగం పడిపోయాయి. స్పోర్ట్స్ బైక్‌లు కూడా తగ్గాయి. ఒకవైపు నోట్ల రద్దు, మరోవైపు ఏడాది చివరి రోజులు కావడంతో అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. ఒక్క హై ఎండ్ మాత్రమే కాకుండా మధ్యతరగతి, వేతన జీవులు కొనుగోలు చేసే స్విఫ్ట్ డిజైర్ వంటి వాహనాల అమ్మకాలు కూడా తగ్గాయి. నగరంలోని అన్ని ఆటోమోబైల్ షోరూమ్‌లలో ప్రతి నెలా సుమారు 25 వేల నుంచి 27 వేల వరకు వాహన విక్రయాలు జరుగుతాయి. నోట్ల రద్దు కారణంగా ఈ సంఖ్య ఏకంగా 15 వేలకు పడిపోయింది. వీటిలో హై ఎండ్, మధ్యతరగతి వర్గాలు విరివిగా కొనుగోలు చేసే వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. సాధారణ వినియోగదారులు కొనుగోలు చేసే బైక్‌ల అమ్మకాలు మాత్రం పెద్దగా తగ్గుముఖం పట్టకపోవడం గమనార్హం. ఇలా వాహన విక్రయాలు తగ్గడం కూడా ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్లపైన ప్రతికూల ప్రభావం చూపింది. హోదా కోసం... అదృష్ట సంఖ్యలుగా భావించే నెంబర్ల కోసం కొందరు పోటీకి దిగితే, సామాజిక హోదా కోసం, పేరు ప్రతిష్టల కోసం మరికొందరు ఫ్యాన్సీ నెంబర్ల కోసం పోటీ పడుతున్నారు. ► ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్టీఏలో కొత్త సీరీస్ ప్రారంభమవుతుంది. మొత్తం నెంబర్లలో 2500 వరకు ఫ్యాన్సీ నెంబర్లు ఉంటాయి. ఈ నెంబర్ల కోసం అనూహ్యమైన పోటీ ఉంటుంది. గతంలో ఒక నెంబర్ కోసం సగటున 10 మంది పోటీ పడితే ఇప్పుడు ఆ సంఖ్య 6 కు పడిపోయింది. సోమవారం నిర్వహించిన వేలంలో పలికిన ధరలు ఇలా... ► టీఎస్ 09 ఈఆర్ 9999 – రూ.2.35 లక్షలు ► టీఎస్ 09 ఈఎస్ 0007 – రూ.1.47 లక్షలు ► టీఎస్09 ఈఎస్ 005 – రూ.1.35 లక్షలు -
ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎమ్మెల్సీ బెదిరింపులు!
-
ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎమ్మెల్సీ బెదిరింపులు!
విజయవాడ: వాహనానికి ఫ్యాన్సీ నెంబర్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ అనుచరులు వీరంగం చేశారు. టెండర్ నుంచి తప్పుకోకపోతే ఎత్తేస్తామని, ఎమ్మెల్సీ వాహనానికే పోటీ వచ్చేటంతటోడివా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. తనలాంటి వీఐపీలకే ఇలాంటి నెంబర్స్ అవసరం కానీ, లేబర్ వాడికి ఎందుకు అంటూ ఎమ్మెల్సీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఉయ్యూరు ఆర్టీవో కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ 16డీడీ 7777 నెంబర్ కోసం ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. ఒకరు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరుడు ప్రవీణ్‌కుమార్ కగా, మరోవ్యక్తి పేరు వినయ్‌కుమార్. ఫ్యాన్సీ నెంబర్ తమకే దక్కాలంటూ ఎమ్మెల్సీ అనుచరులు రెచ్చిపోయారు. ఆర్టీవో కార్యాలయం వద్దకు ఇరువర్గాలు రావడంతో ఆ ఫ్యాన్సీ నెంబర్ తమ వాహనానికే దక్కాలని, టెండర్ నుంచి తప్పుకోవాలని వినయ్‌కుమార్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ తతంగాన్ని రవివర్మ అనే వ్యక్తి తన మొబైల్లో చిత్రీకరించడానికి యత్నించాడు. అనుచరులు ఫోన్ కలుపగా ఫోన్లోనే ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, రవివర్మను దుర్భాషలాడారు. నాలాంటి వీఐపీకి ఫ్యాన్సీ నెంబర్ కావాలి కానీ.. లేబర్ వాడికి కాదు.. మరోసారి ఎవరినైనా కొట్టేటప్పుడు మళ్లీ మొబైల్లో రికార్డు చేసుకో అంటూ రవివర్మ అనే వ్యక్తిపై కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. -
నిబంధనలు తూచ్!
* రాజధాని జిల్లాలో ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ * వీఐపీలు, రాజకీయ నేతలకు తక్కువ ధరకే కేటాయింపు * పోటీకి ఎవరూ రాకుండా బెదిరింపులకు దిగుతున్న వైనం * 9999 నంబర్‌ను రూ. 50 వేలకే దక్కించుకున్న తారకరత్న సాక్షి, గుంటూరు: అక్కడ సామాన్యులకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయి... ఉన్నతాధికారులు, వీఐపీలు, రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మాత్రం నిబంధనలు అడ్డురావు. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ అధికంగా ఉంటున్న విషయం తెలిసిందే. గతంలో ఈ నంబర్లను లక్షల్లో వేలం ద్వారా దక్కించుకున్న దాఖలాలున్నాయి. ఫ్యాన్సీ నంబర్లకు వేలం లేకుండా అసలు ధరకే ఇవ్వాలంటూ ఆర్టీఏ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తుండడంతో అడ్డుచెప్పలేక మిన్నకుండిపోతున్నారు. గుంటూరు డీటీసీ కార్యాలయంతోపాటు నరసరావుపేటలోని ఆర్టీవో కార్యాలయం, తెనాలి, పిడుగురాళ్ల యూనిట్ కార్యాలయాల్లో మాత్రం ఫ్యాన్సీ నంబర్లు కేటాయిస్తారు. జిల్లాలో నూతన రాజధాని నిర్మాణం జరుగనున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వీఐపీలు, ఉన్నతాధికారులు సైతం ఇక్కడే తమ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు మక్కువ చూపుతున్నారు. ఒక మోస్తరు ఫ్యాన్సీ నంబరుకు సైతం పోటీ అధికంగా ఉండడంతో లక్షలు వెచ్చించి వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. ఇది సామాన్యులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రతి నెంబరును ఆన్లైన్ ద్వారా‡ నిబంధనల ప్రకారం కేటాయిస్తామని చెబుతున్న ఆర్టీఏ అధికారులు పలుకుబడి ఉన్నవారికి మాత్రం నిబంధనలు పక్కన బెట్టి నిర్ణయించిన ధరకే కేటాయిస్తున్నారు. నిర్ణయించిన ధరకే ఫ్యాన్సీ నంబర్.. గుంటూరులో కొన్ని నెలలుగా పోటీ ఎక్కువగా ఉన్న ఫ్యాన్సీ నంబర్లు సైతం నిర్ణయించిన ధరకే పోతున్నాయి తప్ప, అధిక ధరలకు ఎవరూ తీసుకోవడం లేదు. ఖర్చుపెట్టేందుకు ఆసక్తికనబర్చడం లేదనుకుంటే పొరబడినట్లే. ఫ్యాన్సీ నంబర్ల మీద కన్నేసిన ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతలు, వారి బంధువులు తమ పలుకుబడి ఉపయోగించి ఎవరినీ పాటకు రాకుండా బెదిరిస్తూ నిర్ణయించిన ధరకే తమకు కావాల్సిన నంబరును దక్కించుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం జిల్లాకు చెందిన ఓ ఉన్నతస్థాయి అధికారి తన వాహనానికి ఫ్యాన్సీ నంబ రును కేటాయించాలంటూ ఆర్టీఏ అధికారులకు హుకుం జారీ చేయడంతోపాటు, తన కార్యాలయ పరిపాలన అధికారిని అక్కడ ఉంచి ఎవరూ పోటీకి రాకుండా చేసి తక్కువధరకు దక్కించుకున్నారు. నగరానికి చెందిన ఓ నాయకుడు సైతం ఫ్యాన్సీ నంబరును నిర్ణయించిన ధరకే దక్కించుకున్నాడు. జిల్లాలో ఫ్యాన్సీ నంబర్లకు పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం రాకపోవడం చూస్తుంటే అధికారులు ఏస్థాయిలో నిబంధనలకు పాతర వేస్తున్నారో అర్ధమవుతోంది. రూ. 50 వేలకు.. ముఖ్యమంత్రి బంధువు, హీరో నందమూరి తారకరత్న తన వాహనానికి నరసరావుపేట ఆర్టీవో కార్యాలయంలో ఏపీ07 సీడబ్ల్యూ 9999 నంబరును కేవలం రూ. 50వేలకు దక్కించుకున్నారు. స్థాని కంగా నివాసం ఉండనప్పటికీ ఓ బ్యాంకులో ఖాతా తెరిచి, దాన్ని ఆర్టీవో కార్యాలయంలో అడ్రస్సు ప్రూఫ్‌గా చూపించి నంబరును దక్కించుకున్నారు. ఈ నంబరుకు మరికొందరు పోటీకి వచ్చినప్పటికీ అధికారులు నచ్చజెప్పి వారిని విరమించుకునేలా చేసినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ కార్డు 15 రోజుల తరువాత పోసులో పంపుతారు. తారకరత్నకు మాత్రం నిమిషాల్లో కార్డు తయారు చేయించి చేతికిచ్చి పంపి ఆర్టీఏ అధికారులు తమ స్వామిభక్తి చాటుకున్నారు. -
నిబంధనలు తూచ్!
రాజధాని జిల్లాలో ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ వీఐపీలు, రాజకీయ నేతలకు తక్కువ ధరకే కేటాయింపు పోటీకి ఎవరూ రాకుండా బెదిరింపులకు దిగుతున్న వైనం 9999 నంబర్‌ను రూ. 50 వేలకే దక్కించుకున్న తారకరత్న గుంటూరు : అక్కడ సామాన్యులకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయి... ఉన్నతాధికారులు, వీఐపీలు, రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మాత్రం నిబంధనలు అడ్డురావు. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ అధికంగా ఉంటున్న విషయం తెలిసిందే. గతంలో ఈ నంబర్లను లక్షల్లో వేలం ద్వారా దక్కించుకున్న దాఖలాలున్నాయి. ఫ్యాన్సీ నంబర్లకు వేలం లేకుండా అసలు ధరకే ఇవ్వాలంటూ ఆర్టీఏ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తుండడంతో అడ్డుచెప్పలేక మిన్నకుండిపోతున్నారు. గుంటూరు డీటీసీ కార్యాలయంతోపాటు నరసరావుపేటలోని ఆర్టీవో కార్యాలయం, తెనాలి, పిడుగురాళ్ల యూనిట్ కార్యాలయాల్లో మాత్రం ఫ్యాన్సీ నంబర్లు కేటాయిస్తారు. జిల్లాలో నూతన రాజధాని నిర్మాణం జరుగనున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వీఐపీలు, ఉన్నతాధికారులు సైతం ఇక్కడే తమ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు మక్కువ చూపుతున్నారు. ఒక మోస్తరు ఫ్యాన్సీ నంబరుకు సైతం పోటీ అధికంగా ఉండడంతో లక్షలు వెచ్చించి వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. ఇది సామాన్యులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రతి నెంబరును ఆన్లైన్ ద్వారా నిబంధనల ప్రకారం కేటాయిస్తామని చెబుతున్న ఆర్టీఏ అధికారులు పలుకుబడి ఉన్నవారికి మాత్రం నిబంధనలు పక్కన బెట్టి నిర్ణయించిన ధరకే కేటాయిస్తున్నారు. నిర్ణయించిన ధరకే ఫ్యాన్సీ నంబర్ గుంటూరులో కొన్ని నెలలుగా పోటీ ఎక్కువగా ఉన్న ఫ్యాన్సీ నంబర్లు సైతం నిర్ణయించిన ధరకే పోతున్నాయి తప్ప, అధిక ధరలకు ఎవరూ తీసుకోవడం లేదు. ఖర్చుపెట్టేందుకు ఆసక్తికనబర్చడం లేదనుకుంటే పొరబడినట్లే. ఫ్యాన్సీ నంబర్ల మీద కన్నేసిన ఉన్నతాధికారులు, అధికారపార్టీ నేతలు, వారి బంధువులు తమ పలుకుబడి ఉపయోగించి ఎవరినీ పాటకు రాకుండా బెదిరిస్తూ నిర్ణయించిన ధరకే తమకు కావాల్సిన నంబరును దక్కించుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం జిల్లాకు చెందిన ఓ ఉన్నతస్థాయి అధికారి తన వాహనానికి ఫ్యాన్సీ నంబ రును కేటాయించాలంటూ ఆర్టీఏ అధికారులకు హుకుం జారీ చేయడంతోపాటు, తన కార్యాలయ పరిపాలన అధికారిని అక్కడ ఉంచి ఎవరూ పోటీకి రాకుండా చేసి తక్కువధరకు దక్కించుకున్నారు. నగరానికి చెందిన ఓ నాయకుడు సైతం ఫ్యాన్సీ నంబరును నిర్ణయించిన ధరకే దక్కించుకున్నాడు. జిల్లాలో ఫ్యాన్సీ నంబర్లకు పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం రాకపోవడం చూస్తుంటే అధికారులు ఏస్థాయిలో నిబంధనలకు పాతర వేస్తున్నారో అర్ధమవుతోంది. 9999 నంబరును రూ. 50 వేలకు దక్కించుకున్న తారకరత్న ముఖ్యమంత్రి బంధువు, హీరో నందమూరి తారకరత్న తన వాహనానికి నరసరావుపేట ఆర్టీవో కార్యాలయంలో ఏపీ07 సీడబ్ల్యూ 9999 నంబరును కేవలం రూ. 50వేలకు దక్కించుకున్నారు. స్థాని కంగా నివాసం ఉండనప్పటికీ ఓ బ్యాంకులో ఖాతా తెరిచి, దాన్ని ఆర్టీవో కార్యాలయంలో అడ్రస్సు ప్రూఫ్‌గా చూపించి నంబరును దక్కించుకున్నారు. ఈ నంబరుకు మరికొందరు పోటీకి వచ్చినప్పటికీ అధికారులు నచ్చజెప్పి వారిని విరమించుకునేలా చేసినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ కార్డు 15 రోజుల తరువాత పోసులో పంపుతారు. తారకరత్నకు మాత్రం నిమిషాల్లో కార్డు తయారు చేయించి చేతికిచ్చి పంపి ఆర్టీఏ అధికారులు తమ స్వామిభక్తి చాటుకున్నారు. -
ఫ్యాన్సీ నంబర్ కోసం రూ. 5 లక్షలు
తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు ఉండేలా చూసుకునే ఔత్సాహికులు వాటి కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు. తాజాగా శుక్రవారం నగరంలోని ఉప్పల్ ఆర్టీఏ పరిధిలో టీఎస్ 08 ఈవీ 9999 నెంబర్ కోసం ఓ వ్యక్తి రూ. 5 లక్షలు వెచ్చించాడు. హబ్సీగూడ వాసి భారీ మొత్తాన్ని విచ్చించి తన సొంతం చేసుకున్నాడు. -
ఆ ఫ్యాన్సీ నంబర్ ధర రూ.2,51,000
వాహనాల నెంబర్లు తమ హుందాతనాన్ని ప్రస్ఫుటిస్తాయని నమ్ముతారు కొందరు. తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకోవడానికి ఎంత ఖర్చైన వెనకాడరు. తాజాగా శుక్రవారం రాజేంద్రనగర్ ఆర్టీవో పరిధిలో టీఎస్ 07 ఎఫ్ సీ 7777 నెంబర్‌ను వేలంపాట నిర్వహించగా.. అందరి కంటే ఎక్కువగా రూ. 2,51,000లు పెట్టి సెవన్ హిల్స్ గ్లోబల్ వారు నెంబర్‌ను తమ సొంతం చేసుకున్నారు. -
ఫ్యాన్సీ నంబర్ కోసం పోటాపోటీ
6666... రూ.62వేలు! ఖిలా వరంగల్ : వరంగల్ ఆర్టీఏ కార్యాలయం లో సోమవారం ఫ్యాన్సీ నంబర్ టీఎస్03 ఈ ఎం 6666కు ఇద్దరు వాహనదారులు పోటీ ప డ్డారు. రవాణాశాఖ ఈ నంబర్‌కు రూ.30 వేలు ధర నిర్ణయించింది. అయితే, ఇద్దరు పోటీకి రా గా ఆర్టీఓ మాధవరావు పర్యవేక్షణలో వేలం పా ట నిర్వహించారు. హన్మకొండకు చెందిన కె. వి శాల్ రూ.31,500 వరకు వేలంలో పాల్గొన్నారు. అయితే, గోపాలపురానికి చెందిన నడిపల్లి విజ్జన్‌రావు రూ.62వేలు పాడడంతో ఆయనకు టీ ఎస్ 03 ఈఎం 6666 నంబర్ కేటాయించారు. -
నేనే నంబర్-1
9999 ఫ్యాన్సీ నంబర్‌కు రూ.2.70 లక్షలు ఇష్టమైన వాహనాలు కొనుగోలు చేసేందుకు లక్షలు, కోట్లు వెచ్చిస్తుంటారు. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో తమ అదృష్ట సంఖ్య రాకపోతే నిరుత్సాహపడుతుంటారు. అందుకే చాలామంది ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ పడుతుంటారు. ఎంత డబ్బులైనా వెచ్చించి సొంతం చేసుకునేందుకు తహతహలాడుతుంటారు. అచ్చం అలాంటిదే మంగళవారం తిరుపతి ఆర్టీవో కార్యాలయంలో చోటుచేసుకుంది. తిరుపతి ఆర్టీవో వివేకానందరెడ్డి సమక్షంలో ఏపీ03-బివి 9999 ఫ్యాన్సీ నంబర్‌కు నిర్వహించిన వేలం పాటలో పలువురు పోటీ పడ్డారు. ఈ నంబర్‌ను పుత్తూరుకు చెందిన ఓ విద్యాసంస్థ యాజమాన్యం రూ.2,69,999 వెచ్చించి సొంతం చేసుకుంది. జిల్లాలో ఫ్యాన్సీ నంబర్ కోసం ఇంత పెద్దమొత్తం వెచ్చించడం ఇదే మొదటిసారని తెలిసింది. - తిరుపతి, మంగళం -
‘ఫ్యాన్సీ’ ఫ్రాడ్!
ఆకర్షణీయమైన సెల్‌ఫోన్ నెంబర్ల పేరుతో టోకరా వారం రోజుల్లో 14 మంది నుంచి రూ.5 లక్షలు స్వాహా సూత్రధారి ఏపీకి చెందిన వ్యక్తిగా అనుమానం సిటీబ్యూరో: ఫ్యాన్సీ నెంబర్లంటే చాలా మందికి క్రేజ్... న్యూమరాలజీ అంటే మరికొందరికి నమ్మకం... అందుకే ఆర్టీఏ నిర్వహించే వేలంలో కొన్ని నెంబర్లు భారీ రేటు పలుకుతుంటాయి... సరిగ్గా ఇదే అంశాన్ని క్యాష్ చేసుకున్నాడో ఏపీ వాసి. ఫ్యాన్సీ సెల్‌ఫోన్ నెంబర్లు తక్కువ ధరకు విక్రయిస్తున్నామంటూ నగరంలోని అనేక మంది కి సంక్షిప్త సందేశాలు పంపాడు. స్పందించిన వారి నుం చి ఆన్లైన్లో అందినకాడికి దండుకున్నాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ తరహా నేరాలకు సం బంధించి వారం రోజుల్లో 14 ఫిర్యాదులు అందాయి. ప్రాథమిక ఆధారాలు ప్రకారం ఈ స్కామ్‌కు సూత్రధారి ఒక్కరేనని గుర్తించినట్లు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ రియాజుద్దీన్ తెలిపారు. డిస్కౌంట్ సేల్ పేరుతో ఎర... ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్, సైబరాబాద్‌లోని అనేక మంది సెల్‌ఫోన్ వినియోగదారులకు అనేక ఫ్యాన్సీ, వీఐపీ సెల్‌ఫోన్ నెంబర్లు విక్రయిస్తున్నట్టు ఎస్సెమ్మెస్‌లు వచ్చాయి. సాధారణంగా ఇలాంటి ప్రీమియం నెంబర్ల ను ఆయా కంపెనీలో వేలం ద్వారా విక్రయిస్తుంటాయి. అయితే రేట్లు మాత్రం భారీగా ఉంటాయి. ఈ సందేశా లు పంపిన వ్యక్తి మాత్రం తనను సంప్రదించిన వారితో ఆక్షన్‌లో అమ్మగా మిలిగిన నెంబర్లు తాము ఖరీదు చేశామని, డిస్కౌంట్లో విక్రయిస్తున్నామంటూ నమ్మబలికా డు. దీంతో అనేకమంది ఆకర్షితులయ్యారు. బాధితులంతా విద్యాధికులే... ఆయా ఫ్యాన్సీ నెంబర్లు కావాలంటే తాను చెప్పిన బ్యాంకు ఖాతాలోకి నగదు జమ చేయాలని చెప్పాడు. దీంతో హైదరాబాద్, సైబరాబాద్‌లకు చెందిన అనేక మంది ఆ వ్యక్తి చెప్పిన బ్యాంకు ఖాతాల్లో రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకు జమ చేశారు. డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అవతలి వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. సంక్షిప్త సందేశం పంపడం, సంప్రదింపులు జరపడానికి వినియోగించిన సెల్‌ఫోన్ కూడా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గుర్తించి బాధితుల్లో 14 మంది వారం రోజుల వ్యవధిలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. వీరంతా విద్యాధికులు, ఎగువ మధ్యతరగతికి చెందిన వారే కావడం గమనార్హం. ఏపీ కేంద్రంగా సాగిన దందా... బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమిక ఆధారాలను బట్టి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఈ దందా జరిగిందని, ఒకే వ్యక్తి సూత్రధారని గుర్తించారు. నేరగాడు వినియోగించిన సెల్‌ఫోన్ నెంబర్ విజయవాడ సమీపంలోని చిరునామాతో రిజిస్టరై ఉన్నట్లు తేలింది. బాధితుల నుంచి నగదు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఉపయోగించిన ఖాతా తిరుపతిలోని ఓ బ్యాంకులో తెరిచినట్లు గుర్తించారు. బాధితులతో సైబర్ నేరగాడు తెలుగులో మాట్లాడటంతో పాటు ఈ ఆధారాల నేపథ్యంలో ఆ రాష్ట్రంపై దృష్టిపెట్టి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సెల్ఫోన్లో తప్పుడు వివరాలు, చిరునామాతో తీసుకున్న ప్రీయాక్టివేటెడ్ సిమ్‌కార్డు వాడి ఉంటారని, బ్యాంకు ఖాతా సైతం డమ్మీ వ్యక్తులదో, దళారులదో అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఎవరూ సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించలేదు: ప్రీమియం నెంబర్లుగా పిలిచే ఫ్యాన్సీ నెంబర్లను ఆయా సర్వీస్ ప్రొవైడర్లే వేలం ద్వారా విక్రయిస్తారు. ఈ 14 మంది బాధితుల్లో ఏ ఒక్కరూ తమకు వచ్చిన ఎస్సెమ్మెస్ నిజమేనా అనే అంశాన్ని సర్వీసు ప్రొవైడర్లు, డీలర్లను సంప్రదించి నిర్థారించుకోలేదు. మరోపక్క ఫ్యాన్సీ నెంబర్ల క్రయవిక్రయ లావాదేవీలన్నీ ఆయా సర్వీసు ప్రొవైడర్ల అధికారిక ఖాతా ద్వారానే జరుగుతాయి. ఇక్కడ వ్యక్తిగత ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయమని నిందితుడు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ తరహా నేరాలకు ప్రజలు అప్రమత్తతోనే పూర్తిస్థాయిలో చెక్ చెప్పగలం. - మహ్మద్ రియాజుద్దీన్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్, సైబరాబాద్ -
ఫ్యాన్సీ నంబర్.. స్టేటస్ సింబల్..
వాహనదారుల్లో తీవ్ర పోటీ ఆర్టీఏకు కనకవర్షం ‘టీఎస్ 09 ఈఎల్ 9999’ ఆర్టీఏ నిర్ణయించిన ఫీజు రూ.50 వేలు. వేలంలో జూనియర్ ఎన్టీఆర్ చెల్లించిన మొత్తం రూ.10.50 లక్షలు. ‘టీఎస్07 ఈఎక్స్ 9999’ నంబర్‌కు గచ్చిబౌలికి చెందిన ఓ ఖరీదైన వాహన యజమాని చెల్లించిన మొత్తం రూ.5.77 లక్షలు. గురువారం మలక్‌పేట్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో ‘టీఎఫ్ 11 ఈఎఫ్ 9999’ నంబర్ కోసం ఓ కాంట్రాక్టర్ చెల్లించింది రూ.4.80 లక్షలు. కారు ఉంటే హోదా రాదు.. ఎంత ఖరీదైన కారు కొన్నావన్నది కాదు.. దానికి ఫ్యాన్సీ నంబర్ ఉందా.. లేదా..! అన్నదే ముఖ్యం. అందుకే ‘9,1,999,9999, 786,6, 666,1111’ వంటి నంబర్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఫ్యాన్సీ నంబర్ క్రేజ్ ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ మధ్య ఇది మరీ ఎక్కువైంది. తమకు నచ్చిన నంబర్ల కోసం వాహనదారులు లక్షలు వెచ్చించేందుకు వెనుకాడ్డం లేదు. ఇదే ఆర్టీఏకు కనకవర్షం కురిపిస్తోంది. సిటీబ్యూరో: ఫ్యాన్సీ నంబర్లు, అదృష్ట సంఖ్యలు, రైజింగ్ నెంబర్లుగా భావించే కొన్ని రకాల వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం అనూహ్యమైన పోటీ నెలకొంటోంది. వాహనదారులు పెద్ద ఎత్తున పోటీకి దిగుతున్నారు. బీఎండబ్ల్యూ, ల్యాండ్ రోవర్, ల్యాండ్ క్రూజర్, ఆడి వంటి ఖరీదైన వాహనాలే కాదు, బెక్ల కోసం కూడా వాహనదారులు పోటీకి దిగుతున్నారు. నచ్చిన నంబర్లకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నిర్వహించిన వేలం పాటల్లో ఇలాంటి నంబర్లపై రూ.20.25 కోట్ల ఆదాయం లభించింది. వాహనదారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘9’తో మొదలయ్యే ఖైరతాబాద్ కార్యాలయంలోనే రూ.15 కోట్లకు పైగా ఆదాయం లభించడం విశేషం. హోదా కోసమే ఎక్కువ.. అదృష్ట సంఖ్యలుగా భావించే నంబర్ల కోసం కొందరు పోటీకి దిగితే సామాజిక హోదా కోసం, పేరు కోసం మరికొందరు ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ పడుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, సినిమాలు, రాజకీయాలు, పరిశ్రమలు వంటి భిన్న రంగాలకు చెందినవారు ‘లక్కీ’ నంబర్ల కోసం ఎగబడుతున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్టీఏలో కొత్త సీరిస్ ప్రారంభమవుతుంది. మొత్తం నంబర్లలో 2500 వరకు ఫ్యాన్సీ నంబర్లు ఉంటాయి. ఈ నెంబర్ల కోసం వేలాది మంది పోటీపడుతున్నారు. నచ్చిన నంబర్ లభించనివారు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. సెంటిమెంట్‌తో మరికొందరు.. కేవలం ఫ్యాన్సీ కోసం కాకుండా కొన్ని నంబర్లతో అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకం కూడా ఈ క్రే జీకి కారణమే. జ్యోతిషం ప్రకారం తమ స్వభావానికి తగిన నంబర్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఉదాహరణకు ‘1’ నాయకత్వానికి, ‘2’ శాంత స్వభావానాకి, గురుగ్రహ ప్రభావం కోసం ‘3’, ‘5’ను బుధుడికి ప్రతిబింబంగా భావిస్తారు. ఇలా 1 నుంచి 9 వరకు నమ్మకాలున్నాయి. ఇక ఎక్కువ మంది కోరుకునే ‘9’ కుజ గ్రహానికి ప్రతీకగా భావిస్తారు. జీవితంలో తిరుగులేని నాయకులుగా ఎదగాలంటే ఈ నెంబ ర్ ఉండాలని భావిస్తారు. ఈ క్రేజ్ ఎనిమిదో దశాబ్దం నుంచే.. ప్రస్తుతం ఖరీదైన వాహనాలతో పాటే నగరంలో ఫ్యాన్సీ నంబర్లకు సైతం క్రేజ్ పెరిగింది. కానీ 1980 నుంచే ఈ నంబర్ల పట్ల వాహనదారుల్లో మక్కువ ఉంది. ‘9999’ వంటి నెంబర్లు అప్పట్లో రూ. 500 కే లభించేవి. ఎలాంటి పోటీ ఉండేది కాదు. అప్పట్లో ఎన్టీ రామారావు ‘27’, 999’, ‘9999’ వంటి నంబర్లకు ప్రాధాన్యతనిచ్చేవారు. పైగా ప్రముఖులు నివసించే ప్రాంతం కావడంతో ఖైరతాబాద్‌లో ఈ నెంబర్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఆదాయం పెరిగింది గత రెండేళ్లుగా ఫ్యాన్సీ నంబర్లపై అనూహ్యమైన క్రేజ్ కనిపిస్తోంది. ఖైరతాబాద్ కార్యాలయంలో గతంలో రూ. 2 కోట్ల ఆదాయం ఇప్పుడు రూ.15 కోట్లకు పెరిగింది. లగ్జరీ వాహనాల వినియోగం పెరగడం, ద్విచక్ర వాహనదారుల నుంచి కూడా ఈ నంబర్ల కోసం గట్టి పోటీ ఉంటోంది. - టి.రఘునాథ్, హైదరాబాద్ జేటీసీ నంబర్‌ను గిఫ్టుగా ఇస్తున్నారు.. ఇటీవల వినియోగదారులు తమ కుటుంబ సభ్యులకు బహుమానంగా వాహనాలతో పాటు రిజిస్ట్రేషన్ నంబర్లను గిఫ్ట్‌గా ఇస్తున్నారు. ‘1313’ (తేరా తేరా) అంటే పంజాబీలకు ఎంతో ఇష్టం. దీనిని వాళ్లు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ‘5121’ నంబర్‌ను ఆంగ్ల అక్షరాల్లో ‘సిరి’గా భావిస్తారు. ‘143’, ‘214’, ‘8045’ వంటి నంబర్లలకు ఎంతో క్రేజీ ఉంది. - జీపీఎన్ ప్రసాద్, ప్రాంతీయ రవాణా అధికారి, ఖైరతాబాద్ -
ఫ్యాన్సీ నంబర్ రూ. 4.8 లక్షలు
హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నంబర్ల కోసం వినియోగదారులు పోటీపడి మరి భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంటున్నారు. తమకు నచ్చిన నంబరు కావాలనుకున్న వారు.. ఎంత రేటు పెట్టడానికైనా వెనుకాడడం లేదు. తాజాగా గురువారం టీఎస్ 11 ఈఎఫ్ 9999 నంబర్ రూ. 4.8 లక్షల ధర పలికింది. మలక్‌పేట్ ఆర్టీవో పరిధిలో వెంకట్‌రెడ్డి అనే వ్యాపారి ఈ నంబర్‌ను దక్కించుకున్నాడు. మలక్‌పేట్ పరిధిలో ఇంత మొత్తానికి నంబర్ అమ్ముడు పోవడం ఇదే మొదటి సారి అని ఆర్టీవో అధికారులు తెలిపారు. గత వారంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో టీఎస్ 09 ఈఎల్ 9999 ఫ్యాన్సీ నంబర్‌కు రూ.10 లక్షలు వెచ్చించిన విషయం తెలిసిందే. -
9 అంటే అంత మోజు ఎందుకు?!
హైదరాబాద్: 'మీ లక్కీ నంబర్ ఏది?' అని ఎవరినైనా అడగండి.. చాలా మంది తొమ్మిదే తమ అదృష్ట సంఖ్య అంటారు. 'ఎందుకు?' అని మరో ప్రశ్న అడగండి.. కొద్ది ఇష్టమంటారు, ఇంకొద్ది మంది సెంటిమెంట్ అంటారు, మరికొద్దిమంది తెలియదని బదులిస్తారు. సమాధానాల సంగతి ఎలా ఉన్నా 9 చాలా విశిష్టమైన సంఖ్య అని సంఖ్యాశాస్త్రవేత్తలు చెబుతారు. అందేకే వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో 9కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సెలబ్రిటీల దగ్గర్నుంచి చిన్నతరహా ధనవంతుల వరకు ఆ నంబర్ ను దక్కించుకోవడానికి పోటీపడుతుంటారు. అందుకే రవాణా శాఖ తెలివిగా 9 సిరీస్ నంబర్లను వేలం వేస్తుంటుంది. ఇంతకు ముందు ఈ సిరీస్ నంబర్ దక్కించుకునేందుకు లక్షలు కుమ్మరించిన సినీ నటులకు సంబంధించిన వార్తలు ఎన్నో విన్నాం. ఇది కూడా అలాంటిదే గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ లోగల రవాణా శాఖ కార్యాలయంలో టీఎస్ 07 ఈఎక్స్ 9999 అనే ఫ్యాన్సీ నంబర్ వేలంలో రికార్డు ధర పలికింది. బుధవారం నిర్వహించిన వేలంలో పలువురు బడాబాబులు తమ సత్తాను ప్రదర్శించారు. అయితే చివరికి ఆ నంబర్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ యజమాని దక్కించుకున్నారు. తాను నూతనంగా కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారు కు ఫ్యాన్సీ నంబర్ కోసం ఆయన ఏకంగా రూ. 5.75 లక్షలను రవాణ శాఖకు చెల్లించారు. -
ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.10 లక్షలు వెచ్చించిన ఎన్టీఆర్
హైదరాబాద్ : సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా కొనుగోలు చేసిన బీఎండబ్ల్యు కారు కోసం టీఎస్ 09 ఈఎల్ 9999 ఫ్యాన్సీ నంబర్ ను భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్నారు. ఈ నంబర్ కోసం రూ.10 లక్షలు వెచ్చించారు. ఈ నంబర్ కోసం శనివారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో జూనియర్‌తో పాటు మరో ముగ్గురు పోటీపడ్డారని రవాణా శాఖ అధికారులు తెలిపారు. చివరికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే బరిలో నిలిచి నంబర్ దక్కించుకున్నారని తెలిపారు. -
రూ. 6.03 లక్షలు పలికిన 'ఫ్యాన్సీ నెంబర్'
విజయవాడ : ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ పెరిగింది. కోరుకున్న నంబరును దక్కించుకునేందుకు ఎంతైనా చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు ఏపీ డీహెచ్ 9999 నంబరు కోసం ముగ్గురు పోటీపడ్డారు. వారిలో సూపర్‌విజ్ ప్రొఫెషనల్స్ లిమిటెడ్ యజమాని గుప్తా రిజర్వేషన్ ఫీజు రూ.50వేలు, బిడ్ అమౌంట్ రూ.5,53,000 మొత్తం రూ.6,03,000 అధిక మొత్తం వేయడంతో వారికి కేటాయించారు. ఇది నగరంలోని ఆర్టీఏ చరిత్రలో అత్యధిక ధరగా చెపుతున్నారు. ఇప్పటివరకూ ఇంత ధర చెల్లించి ఎవరూ నంబరును దక్కించుకోలేదని ఆర్టీఏ వర్గాలు చెపుతున్నారు. రూ.10 లక్షల ఆదాయం రిజర్వేషన్ ఫీజుల రూపంలో రూ.3,16000, బిడ్ అమౌంట్ రూ.7,57,745 మొత్తం రూ.10,73,745 ఆదాయం వచ్చినట్లు అదనపు రవాణా కమిషనర్ పి.శ్రీనివాస్ చెప్పారు. డీటీసీ కార్యాలయంలో ఏపీ16డీహెచ్ సిరీస్‌తో నంబర్ల కేటాయింపు కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రవాణేతర వాహనాలకు నూతన సిరీస్ ఏపీ16డీహెచ్ 1నుంచి 9999నంబర్ల వరకు కేటాయించినట్లు తెలిపారు. మొత్తం 77మంది రిజర్వేషన్ నంబర్లు కోసం పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి టీడీసీ రాజారత్నం, ఆర్టీవోలు డీఎస్ఎన్.మూర్తి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
9999 @రూ.3.51 లక్షలు
విశాఖపట్నం : వాహనాల ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రవాణాశాఖకు ఆదాయం కలిసి వచ్చింది. శుక్రవారం ఫ్యాన్సీ నంబర్ల సీరీస్ ప్రారంభం కావడంతో రికార్డు ధరలు పలికాయి. ఆయా ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు పోటీ పడ్డారు. ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న డిమాండ్‌ను బట్టి రవాణా అధికారులు షీల్డ్ వేలం నిర్వహించారు. ఏపీ 31డీఏ 9999 నంబరు అత్యధికంగా రూ.3.51 లక్షల ధర పలికింది. సింగిల్ నంబర్ 1 రూ.1.10 లక్షలు, నంబర్ 7 రూ.90,300, నంబర్ 9 రూ.1.17లక్షల ధరలు పలికాయి. ఫ్యాన్సీ నంబర్ల ద్వారా శుక్రవారం రూ.10.20 లక్షల ఆదాయం లభించినట్లు డీటీసీ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఇదిలా ఉండగా గతంలో 9999 నంబర్ రూ.2.85 లక్షల ఆదాయం రాబట్టింది. ఈసారి అదే నంబర్ రికార్డు స్థాయిలో రూ.3.51 లక్షల ధర పలికింది. -
12.5 లక్షలు పలికిన 0001
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో వీఐపీ నంబర్లపై మోజు పెరిగింది. రవాణశాఖ కేటాయించిన వీఐపీ ఆన్లైన్ ఆప్షన్ మొదటి రౌండు శుక్రవారం ముగిసింది. ఈ వేలంలో 0001 నంబరు కోసం అధికసంఖ్యలో దరఖాస్తున్నారు. ఈ నంబర్‌కు అత్యధిక రేటు పలికింది. రవాణా విభాగం 0001 నంబరు కనీస రిజర్వ్ ధరను మిగతా వీఐపీ నంబర్ల కన్నా అధికంగానే నిర్ణయించింది. రూ.5 లక్షలు ప్రాథమిక విలువగా నిర్ణయించిన ఈ నంబర్ ఆన్లైన్ అప్షన్లలో రూ.12.5 లక్షలు పలికింది. అతితక్కువ రేటు.. ఆన్లైన్ వేలంలో 8888 నంబరు, 0900 న ంబర్లు అతి తక్కువ రేటు పలికాయి. ఈ నంబర్ల ప్రాథమిక విలువ రూ. లక్షగా నిర్ణయించగా ఆన్లైన్ అప్షన్లోనూ ఈ నంబర్లు అదే రేటు పలికాయి. రెండోస్థానంలో.. 0009 నంబరు రూ.8.25 లక్షలు, 0007 నంబరు రూ.5.55 లక్షలతో రెండో స్థానంలో నిలిచాయి. ఈ రెండు నంబర్ల కనీస రిజర్వ్ ధరను రవాణా విభాగం రూ.3 లక్షలుగా నిర్ణయించింది. 9999 నంబరు కనీస ధరను రూ. 2 లక్షలుగా నిర్ణయించగా వేలంలో అది రూ.3.20 లక్షలు పలికింది. తక్కువగా.. 0005 నంబరు కనీస ధరను రూ.3లక్షలుగా నిర్దారించినప్పటికీ అది 9999 కన్నా కొంత తక్కువ రేటు పలికింది. 0005 నంబరు రూ.3.15లక్షలు పలికింది. 0006 నంబరు కనీస రిజర్వ్ ధరను మూడు లక్షల రూపాయలుగా నిర్ణయించగా అది అంతే పలికింది. 0786 నంబరు కనీస ధర 2 లక్షల రూపాయలుండగా అది రూ.2.15 లక్షలు పలికింది. ప్రచారం లోపం కారణంగా.. వీఐపీ నంబర్లను వేలం వేయడం మొదటిసారి కావడంతో ప్రజలకు అంతగా తెలియలేదని, మూడోరౌండు నుంచి అధిక స్పందన లభిస్తుందని ఆశిస్తున్నామని రవాణా విభాగం అధికారి చెప్పారు. మొదటి రౌండులో రవాణా విభాగానికి రూ.72.40 లక్షల ఆదాయం లభించింది. మొదటి రౌండులో రవాణా విభాగం 140 వీఐపీ నంబర్లను వాటి కనీస రిజర్వ్ ధర నిర్దారించి ఆన్లైన్ వేలానికి పెట్టింది. వేలంలో పాల్గొనడం కోసం 127 మంది రవాణా విభాగం వెబ్సైట్లో పేర్లు నమోదుచేసుకున్నారు. కానీ చివరి వేలంలో 41 మంది పాల్గొన్నారు. మంగ ళ, గురు. శుక్రవారాలు జరిగిన ఫైనల్ బిడ్డింగ్‌లో 29 మంది పాల్గొని 29 నంబర్లను దక్కించుకొన్నారు. వేలం ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరిగిందని, ఎటువంటి సాంకేతిక సమస్య ఎదురుకాలేదని రవాణా విభాగం అధికారులు పేర్కొన్నారు. -
0001 నెంబరు.. వెల 8.5 లక్షలు!!
ఫ్యాన్సీ నెంబరు అంటే చాలు.. ఎంతయినా పెట్టేందుకు రెడీగా ఉంటారు కొంతమంది. అలాగే.. ఛత్తీస్‌గఢ్‌లో ఓ పారిశ్రామికవేత్త తనకు కావల్సిన నెంబర్ కోసం ఏకంగా 8.5 లక్షల రూపాయలు చెల్లించారు. అక్కడ కొత్తగా మొదలుపెట్టిన సీహెచ్-01-ఎజడ్ అనే సిరీస్‌లో తొలిసారిగా 0001 నెంబరు వేలానికి వచ్చింది. అంతే.. సోనాలికా గ్రూపు ఛైర్మన్ ఎల్డీ మిట్టల్ ఆ నెంబరును 8.5 లక్షలు వెచ్చించి గెలుచుకున్నారు. ఇంతకుముందు 2013 మే నెలలో సీహెచ్-01-ఏటీ సిరీస్‌లో 0001 నెంబరుకు 9.1 లక్షలు పలికింది. దాని తర్వాత ఇదే అత్యంత ఎక్కువ మొత్తం. సోనాలికా గ్రూపు ప్రధాన కంపెనీ అయిన ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ కోసం కొత్తగా కొన్న మెర్సిడెస్ ఎస్ సిరీస్ కారు కోసం ఈ నెంబరును ఆయన వేలంలో పాడుకున్నారు. ఈ సంవత్సరం మొదట్లోనే మిట్టల్ ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలోకి చేరుకున్నారు. -
9999నెం.కు రూ.5.54 లక్షలు
హైదరాబాద్: ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ రవాణాశాఖకు కాసుల పంట పండిస్తోంది. బుధవారం మేడ్చల్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో నూతన సిరీస్ ఏపీ 28 డీవై ప్రారంభం కావడంతో 9999 నంబరును దక్కించుకునేందుకు పలువురు వేలంలో పాల్గొన్నారు. ఇందులో మెగా ఇంజినీరింగ్ కంపెనీ తమ సంస్థకు చెందిన బెంట్లీ కారుకు రూ.5,54,550 చెల్లించి ఈ ఫ్యాన్సీ నంబరును దక్కించుకుందని ఆర్టీఓ శంకర్ తెలిపారు. గతంలో నూజివీడు ఎంవీఐ కార్యాలయంలో ఏపీ సీజీ శ్రేణిలో 6666 నంబరు రూ.1,21,300 పలికింది.