9 అంటే అంత మోజు ఎందుకు?! | fancy number 9999 goes for record prise in An auction | Sakshi
Sakshi News home page

9 అంటే అంత మోజు ఎందుకు?!

Published Wed, Apr 20 2016 7:44 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

9 అంటే అంత మోజు ఎందుకు?! - Sakshi

9 అంటే అంత మోజు ఎందుకు?!

హైదరాబాద్: 'మీ లక్కీ నంబర్ ఏది?' అని ఎవరినైనా అడగండి.. చాలా మంది తొమ్మిదే తమ అదృష్ట సంఖ్య అంటారు. 'ఎందుకు?' అని మరో ప్రశ్న అడగండి.. కొద్ది ఇష్టమంటారు, ఇంకొద్ది మంది సెంటిమెంట్ అంటారు, మరికొద్దిమంది తెలియదని బదులిస్తారు. సమాధానాల సంగతి ఎలా ఉన్నా 9 చాలా విశిష్టమైన సంఖ్య అని సంఖ్యాశాస్త్రవేత్తలు చెబుతారు. అందేకే వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో 9కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సెలబ్రిటీల దగ్గర్నుంచి చిన్నతరహా ధనవంతుల వరకు ఆ నంబర్ ను దక్కించుకోవడానికి పోటీపడుతుంటారు. అందుకే రవాణా శాఖ తెలివిగా 9 సిరీస్ నంబర్లను వేలం వేస్తుంటుంది. ఇంతకు ముందు ఈ సిరీస్ నంబర్ దక్కించుకునేందుకు లక్షలు కుమ్మరించిన సినీ నటులకు సంబంధించిన వార్తలు ఎన్నో విన్నాం. ఇది కూడా అలాంటిదే

గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ లోగల రవాణా శాఖ కార్యాలయంలో టీఎస్ 07 ఈఎక్స్ 9999 అనే ఫ్యాన్సీ నంబర్ వేలంలో రికార్డు ధర పలికింది. బుధవారం నిర్వహించిన వేలంలో పలువురు బడాబాబులు తమ సత్తాను ప్రదర్శించారు. అయితే చివరికి ఆ నంబర్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ యజమాని దక్కించుకున్నారు. తాను నూతనంగా కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారు కు ఫ్యాన్సీ నంబర్ కోసం ఆయన ఏకంగా రూ. 5.75 లక్షలను రవాణ శాఖకు చెల్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement