ఎవరో ఏదో అనుకుంటారని, పక్కవారి మెచ్చుకోలు కోసం వేలం పాటలో గొప్పలకు పోతే చివరికి చిక్కులు తప్పవు. అందుకు చండీగడ్ బ్రిజ్‌మోహన్ తాజాగా ఉదాహారణగా నిలిచాడు. యాక్టివా స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబరు కోసం పది హేను లక్షలు వెచ్చించాడంటూ దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన బ్రిట్ మోహన్ తాజాగా చీకట్లలోకి వెళ్లిపోయాడు.
ఎప్పటి నుంచో ఫ్యాన్సీ నంబర్లంటే చెవి కోసుకునేవారు ఉన్నారు. ఈ డిమాండ్‌ను ఆధారంగా చేసుకుని రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్లను వేలం వేస్తుంది. ఇలాంటి వేలం పాటలో చండీగడ్‌కు చెందిన బ్రిజ్ మోహన్ అనే వ్యక్తి తన యాక్టివా స్కూటర్‌కి CH-01-0001 అనే నంబరు కోసం ఆన్‌లైన్ వేలంలో పాల్గొన్నాడు. వేలంలో పాట పాడుతూ పోయి ఏకంగా రూ.15.41 లక్షలకు ఆ నంబరు దక్కించుకున్నాడు.
యాక్టివా స్కూటరు రిజిస్ట్రేషన్ నంబరు కోసం రూ.15.41 లక్షలు వెచ్చించిన వ్యక్తిగా ఒక్క రోజులో అతని పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఎవరీ బ్రిజ్‌మోహన్ అంటూ మీడియా అతని వెంట పడింది. ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రతినిధులు పోలో మంటూ అతని ఇంటికి వెళ్లారు. ఇదే సమయంలో బ్రిజ్‌మోహన్‌కి అంత ఆస్తులు, ఆదాయం ఎక్కడిదంటూ ఆరా తీసే పనిలో పడింది ఇన్‌కం ట్యాక్స్ శాఖ. మరోవైపు స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబరు కోసం అంత డబ్బు వెచ్చించడంపై కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
బ్రిజ్ మోహన్ కుటుంబం ఎప్పటి నుంచో ఆర్థికంగా స్థితిమంతుల కుటుంబమే. అయితే వేలం పాటతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఒక్కసారిగా వచ్చిన పాపులారిటీతో ఆదాయపు పన్ను శాఖ తనపై ఫోకస్ చేస్తే లేని పోని చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని సందేహిస్తున్నట్టు సమాచారం. వచ్చిన క్రేజ్ కంటే ఒత్తిడి ఎక్కువ కావడంతో బ్రిజ్ మోహన్ రెండు రోజులుగా ఎవరికీ కనిపించచడం లేదు. ఐటీ దాడులు ఉంటాయనే ముందు జాగ్రత్తగా అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటాడని స్థానికంగా చర్చ జరుగుతోంది.
మరోవైపు టూవీలర్ నంబరు కోసం దేశ చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో భారీ మొత్తం పాడటం పట్ల ఆర్టీఓ అధికారులు కూడా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అసలు బ్రిజ్ మోహన్ మానసిక స్థితి ఎలాంటిది అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన సొమ్ము చెల్లించి నంబరు తీసుకుంటాడా లేక డిపాజిట్‌గా కట్టిన డబ్బు వదిలేసుకుంటాడా అనేదానిపై స్థానికంగా బెట్టింగులు పెట్టుకుంటున్నారు. బ్రిజ్ మోహన్ అజ్ఞాతం వీడితేనే ఈ అంశంపై స్పష్టత రానుంది.
చదవండి:ఫ్యాన్సీ నెంబర్ కోసం ఇంత మోజా! స్కూటీ ధర వేలల్లో ఉంటే.
Comments
Please login to add a commentAdd a comment