Registration number
-
SEBI: అన్ని వివరాలూ వెల్లడించాలి
న్యూఢిల్లీ: పెట్టుబడి సలహాలిచ్చే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, పరిశోధనా అనలిస్టులకు సంబంధించి పారదర్శకత పెంచే దిశగా సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. తమ ప్రకటనల్లో సెబీ రిజిస్ట్రేషన్ నంబర్, పూర్తి పేరు, లోగో, పూర్తి చిరునామా, టెలిఫోన్ నంబర్లను వెల్లడించాలని పేర్కొంది. సెబీ ఇచ్చిన రిజిస్ట్రేషన్ కానీ, బీఎస్ఈ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్విజన్ సభ్యత్వం కానీ, రాబడులు, పనితీరుకు భరోసాగా, హామీగా చూడొద్దంటూ విధిగా ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుందని సెబీ ఆదేశించింది. వారు ప్రచురించే పబ్లికేషన్లు, కేవైసీ పత్రాలు, క్లయింట్లతో చేసుకునే ఒప్పంద పత్రాలు, ఇన్వెస్టర్లతో నిర్వహించే అన్ని రకాల సంప్రదింపుల్లోనూ ఈ వివరాలు ఉండాలని సెబీ స్పష్టం చేసింది. దీనికి అదనంగా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, రీసెర్చ్ అనలిస్టులు ఇచ్చే ప్రకటనల్లో సెబీ లోగో వాడకుండా నిషేధం విధించింది. కొంత మంది పెట్టుబడుల సలహాదారులు, పరిశోధనా విశ్లేషకులు తమ ప్రకటనలు, ఇన్వెస్టర్లతో నిర్వహించే సంప్రదింపులు, ఒప్పందాల సమయంలో సెబీ వద్ద నమోదు చేసుకున్న పేరు, రిజిస్ట్రేషన్ నంబర్‌కు బదులు బ్రాండ్ లేదా లోగోను వాడుతున్నట్టు సెబీ దృష్టికి రావడంతో ఈ మేరకు ఆదేశించింది. -
నంబరు ప్లేట్ కోసం రూ.15 లక్షలు.. ఆ వెంటనే అజ్ఞాతంలోకి!?
ఎవరో ఏదో అనుకుంటారని, పక్కవారి మెచ్చుకోలు కోసం వేలం పాటలో గొప్పలకు పోతే చివరికి చిక్కులు తప్పవు. అందుకు చండీగడ్ బ్రిజ్మోహన్ తాజాగా ఉదాహారణగా నిలిచాడు. యాక్టివా స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబరు కోసం పది హేను లక్షలు వెచ్చించాడంటూ దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన బ్రిట్ మోహన్ తాజాగా చీకట్లలోకి వెళ్లిపోయాడు. ఎప్పటి నుంచో ఫ్యాన్సీ నంబర్లంటే చెవి కోసుకునేవారు ఉన్నారు. ఈ డిమాండ్‌ను ఆధారంగా చేసుకుని రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్లను వేలం వేస్తుంది. ఇలాంటి వేలం పాటలో చండీగడ్‌కు చెందిన బ్రిజ్ మోహన్ అనే వ్యక్తి తన యాక్టివా స్కూటర్‌కి CH-01-0001 అనే నంబరు కోసం ఆన్లైన్ వేలంలో పాల్గొన్నాడు. వేలంలో పాట పాడుతూ పోయి ఏకంగా రూ.15.41 లక్షలకు ఆ నంబరు దక్కించుకున్నాడు. యాక్టివా స్కూటరు రిజిస్ట్రేషన్ నంబరు కోసం రూ.15.41 లక్షలు వెచ్చించిన వ్యక్తిగా ఒక్క రోజులో అతని పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఎవరీ బ్రిజ్మోహన్ అంటూ మీడియా అతని వెంట పడింది. ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రతినిధులు పోలో మంటూ అతని ఇంటికి వెళ్లారు. ఇదే సమయంలో బ్రిజ్మోహన్కి అంత ఆస్తులు, ఆదాయం ఎక్కడిదంటూ ఆరా తీసే పనిలో పడింది ఇన్‌కం ట్యాక్స్ శాఖ. మరోవైపు స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబరు కోసం అంత డబ్బు వెచ్చించడంపై కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. బ్రిజ్ మోహన్ కుటుంబం ఎప్పటి నుంచో ఆర్థికంగా స్థితిమంతుల కుటుంబమే. అయితే వేలం పాటతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఒక్కసారిగా వచ్చిన పాపులారిటీతో ఆదాయపు పన్ను శాఖ తనపై ఫోకస్ చేస్తే లేని పోని చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని సందేహిస్తున్నట్టు సమాచారం. వచ్చిన క్రేజ్ కంటే ఒత్తిడి ఎక్కువ కావడంతో బ్రిజ్ మోహన్ రెండు రోజులుగా ఎవరికీ కనిపించచడం లేదు. ఐటీ దాడులు ఉంటాయనే ముందు జాగ్రత్తగా అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటాడని స్థానికంగా చర్చ జరుగుతోంది. మరోవైపు టూవీలర్ నంబరు కోసం దేశ చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో భారీ మొత్తం పాడటం పట్ల ఆర్టీఓ అధికారులు కూడా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అసలు బ్రిజ్ మోహన్ మానసిక స్థితి ఎలాంటిది అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన సొమ్ము చెల్లించి నంబరు తీసుకుంటాడా లేక డిపాజిట్‌గా కట్టిన డబ్బు వదిలేసుకుంటాడా అనేదానిపై స్థానికంగా బెట్టింగులు పెట్టుకుంటున్నారు. బ్రిజ్ మోహన్ అజ్ఞాతం వీడితేనే ఈ అంశంపై స్పష్టత రానుంది. చదవండి:ఫ్యాన్సీ నెంబర్ కోసం ఇంత మోజా! స్కూటీ ధర వేలల్లో ఉంటే. -
రిజిస్ట్రేషన్ ప్లేట్ రచ్చ చేస్తోంది!... అందుకే ఈ స్కూటీ నడపను!!
న్యూఢిల్లీ: మన ఇంట్లో పిల్లలు వాళ్లకు నచ్చిన వస్తువును కొనేంతవరకు మనల్ని ఒక పట్టాన వదలరు. ఒకవేళ ఎంతో ప్రయాసపడి కొంటే దాన్ని కొద్దిరోజులు వాడి పక్కన పెట్టేస్తారు. పైగా పెద్దవాళ్లకి కూడా తమ పిల్లలకు ఇష్టమైనవి కొనడం ఒక సరదా. అయితే ఇక్కడొక అమ్మాయి కూడా అలానే ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ తనకు నచ్చిన స్కూటీ కొనుక్కుంది కానీ నడిపేందుకు వీల్లేకుండా అయిపోయింది. (చదవండి: వామ్మో! అప్పుడే ఈ ఒమ్రికాన్ వైరస్ 12 దేశాలను చుట్టేసింది!!) అసలు విషయంలోకెళ్లితే...ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థిని అయిన ఆ అమ్మాయి జంకాపురి నుంచి నోయిడాకు మెట్రోలో ప్రయాణించేది. అయితే రద్దీగా ఉండే మెట్రో రైళ్లలో ప్రయాణించడం కష్టంగా ఉందంటూ తన తండ్రిని స్కూటీ కొనివ్వమని అడిగింది. ఈ మేరకు ఆమె తన తండ్రిని ఒప్పించేందకు ఏడాది పాటు ప్రయత్నించింది. అయితే ఆమె తండ్రి ఎట్టకేలకు అంగీకరించి ఆ అమ్మాయికి ఒక మంచి స్కూటీని కొనిచ్చాడు. అయితే స్కూటీకి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్‌తో అసలు తలనొప్పి మొదలైంది. ఆఖరికి కుటుంబ సభ్యులు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను మార్చుకునేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఒకసారి వాహనానికి నంబర్‌ను కేటాయించిన తర్వాత దానిని మార్చడం ఏమాత్రం కుదరదని, మొత్తం ప్రక్రియ ఒక సెట్ నమూనాలో నడుస్తుంది అని ఢిల్లీ రవాణా కమిషనర్ కెకె దహియా ఆమె తండ్రితో అన్నారు. అయితే ఆ అమ్మాయికి కేటాయించిన నెంబర్ ప్లేట్ మీద కాస్త ఇబ్బందికరమైన విధానంలో నెంబర్ సిరీస్ ఉంది. పైగా ఆమె స్కూటిని నడుపుతున్నప్పుడు వెనుక నుంచే వచ్చే మిగత వాహనదారులంతా ఆ నెంబర్ ప్లేట్‌ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఆ అమ్మాయి ఆ స్కూటీని నడపను అంటూ తన తండ్రి వద్ద వాపోయింది. ఈ క్రమంలో రవాణా కమిషనర్ ఆశిష్ కుంద్రా మాట్లాడుతూ..."వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు ఆటోమేటిక్‌గా రూపపొందింబచడతాయి. అయితే ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆ సిరీస్‌లను నిలిపివేశాం" అని ఆయన అన్నారు. అంతేకాదు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మరో సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు కూడా చెప్పారు (చదవండి: టిక్‌టాక్ పిచ్చి.. డాక్టర్ వికృత చేష్టలు.. ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి..) -
సినిమా ట్విస్ట్‌ను తలపించే ఘటన
చండీగఢ్: చనిపోయే ముందు ఓ పోలీస్ కానిస్టేబుల్ చూపించిన సమయస్ఫూర్తితో అతడి హత్యకు కారణమయిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా ట్విస్ట్‌ను తలపించే ఈ ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. వివరాలు.. గత వారం బుటానా పోలీస్ స్టేషన్ సమీపంలో సోనిపట్ జింద్ రోడ్డు పక్కన కొందరు దుండగులు తమ వాహనాన్ని నిలిపి రోడ్డు మీదే మద్యం సేవించసాగారు. కర్ప్యూ కొనసాగుతున్నప్పటికి వారు దాన్ని లెక్క చేయక రోడ్డు మీదే మందు తాగారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ రవీందర్ సింగ్(28), కప్తాన్ సింగ్(43) వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దాంతో దుండగులు, కానిస్టేబుల్స్‌కు మధ్య వివాదం జరిగింది. ఈ ఘర్షణలో రవీందర్ సింగ్, కప్తాన్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. అయితే చనిపోయే ముందు రవీందర్ సింగ్ తన చేతి మీద దుండగుల వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ని నోట్ చేశాడు. ఆ తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు రవీందర్ చేతి మీద ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా దుండగులను గుర్తించారు. చనిపోయే ముందు కూడా రవీందర్ చూపిన సమయస్ఫూర్తిని పోలీసులు తెగ ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా హరియాణా పోలీసు చీఫ్ మనోజ్ యాదవ్ మాట్లాడుతూ.. ‘చనిపోయే ముందు మా పోలీస్ కానిస్టేబుల్ రవీందర్ సింగ్ చూపిన తెగువ అభినందనీయం. ఇది ఓ సాధారణ పోలీసింగ్ స్కిల్. చనిపోయే ముందు రవీందర్ సింగ్ దుండగులు వాహనం నంబర్ని తన చేతి మీద రాసుకున్నాడు. పోస్టుమార్టం సమయంలో దీని గురించి తెలిసింది. కేసు దర్యాప్తులో ఈ క్లూ ఎంతో సాయం చేసింది. లేదంటే నిందితులను పట్టుకునేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది’ అన్నారు. ఈ కేసులో పోలీసులు మొత్తం ఆరుగురుని అరెస్ట్ చేశారు. -
నంబర్ ఒక్కటే ... వాహనాలే రెండు!
సాక్షి, వరంగల్: వాహనాన్ని రిజిస్టేషన్ చేయించుకోకుండా మరో వాహనం నంబర్ వేసుకోని అడ్డంగా దొరికిపోయిన సంఘటన హన్మకొండ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. హన్మకొండ కిషన్‌పురకు చెందిన సృజన్‌కుమార్ 2014లో ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. వాహనాన్ని రిజిస్టేషన్ చేయించుకోకుండా తన వద్ద పనిచేసే యువకుడికి అప్పగించాడు. సదరు వ్యక్తి కూడా దానిని రిజిస్టేషన్ చేయించకుండా తన స్నేహితుడికి తెలియకుండా అతడి బండి నంబర్ వేసుకోని నడుపుతున్నాడు. ఇటీవల కాలంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు రేగొండకు చెందిన ప్రశాంత్ ఫోన్ వచ్చింది. దీంతో తాను ఎక్కడ కూడా నిబంధనలను ఉల్లంఘించలేదని, జరిమానాలు ఎందుకు వస్తున్నాయని ప్రశాంత్ హన్మకొండ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన ఎస్సై లక్కసీ కొంరెళ్లి ఒకే నంబర్‌తో నడుస్తున్న రెండు వాహనాలను పట్టుకున్నారు. వాహనాన్ని సకాలంలో రిజిస్టేషన్ చేయించుకోకుండా నిర్లక్ష్యం వహించినందుకు సృజన్కుమార్పై, తన స్నేహితుడి బండి నంబర్‌ను వేసుకోని వాహనాన్ని వాడుకుంటూ నిబంధనలు అతిక్రమించినందుకు సత్యనారాయణపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైన ఇటువంటి మోసలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
డూప్లికేట్ నెంబర్లతో జాగ్రత్త...
బైకులు, ఆటోలకూ డబుల్ రిజిస్ట్రేషన్ తమ బండికి వేరే వారి వాహనం నంబర్ పెట్టుకొని షికార్లు ట్రాఫిక్ చలాన్లు, ఆర్టీఏ పన్ను ఎగ్గొట్టేందుకే.. చేయని తప్పుకు అసలు వాహనదారుడికి చలాన్ చార్మినార్:ఆర్టీఏ పన్ను ఎగ్గొట్టేందుకు కొందరు ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్‌తో రెండు బస్సులు, లారీలు, టిప్పర్ వంటి భారీ వాహనాలను తిప్పుతూ పట్టుబడిన వైనం ఇప్పటి వరకు మనకు తెలుసు. అయితే, ఈ సంస్కృతి ఇప్పుడు ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు వంటివాటికి కూడా సోకింది. ఆర్టీఏ పన్నుతో పాటు ట్రాఫిక్ చలాన్ల బారి నుంచి తప్పించుకొనేందుకు కొందరు వాహన యజమానులు తమ వాహనాలకు వేరే వారి బండి నెంబర్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఇలా దొంగ నెంబర్ పెట్టుకొని వెళ్తున్న వారు ఎక్కడైన ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ నెంబర్ గల అసలు వాహనదారుడి ఇంటికి చలాన్ వెళ్తోంది. తాను చేయని తప్పుకు చలాన్ రావడంతో కంగుతింటున్న అతను ట్రాఫిక్ వెబ్సైట్లోకి లాగిన్ అయి చూస్తే... ఈ నంబర్‌తో మరో వాహనం కనిపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనంతో పాటు దాన్ని నడిపిన వ్యక్తి ఫొటో వెబ్సైట్లో కనిపించడంతో ఒరిజినల్ వాహనదారుడు నివ్వెరపోతున్నాడు. ఏపీ 11 ఏఎఫ్ 9212తో రెండు వాహనాలు... మలక్‌పేట్ ఆనంద్‌నగర్ నివాసి సోమారపు యోగానంద్ 13-07-2009లో హీరో హోండా స్ల్పెండర్‌ను తన పేరుతో ఈస్ట్ జోన్ ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే ఇదే నంబర్‌తో యాక్టివా వాహనంపై గతనెల 24న పాతబస్తీ నయాపూల్ వద్ద ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ ముందుకు వెళ్లాడు. దీంతో చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు ఒరిజినల్ నెంబర్ యజమానికి రూ.100 చలాన్‌ను విధించారు. గత నెలలో తాను నయాపూల్ వైపు వెళ్లలేదని.. చలాన్ ఎలా వచ్చిందో తెలుసుకొనేందుకు యోగానంద్ ట్రాఫిక్ పోలీసుల వెబ్సైట్లో చూడగా.. తన బైక్ నెంబర్‌తో యాక్టివా వాహనం, దానిని నడుపుతున్న వ్యక్తి కనిపించాడు. దీంతో ఈస్ట్ జోన్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ఆయన చాదర్ఘట్ పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేశాడు. పొంచి ఉన్న ప్రమాదం... ఉద్దేశపూర్వకంగా వేరే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను తమ వాహనాలకు తగిలించుకొని తిరిగే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని బాధిత వాహనదారుడు సోమారపు యోగానంద్ కోరారు. తన వాహనం నంబర్‌తో మరో వాహనం ఉన్నట్లు తేలడంతో తాను షాక్‌కు గురయ్యానన్నారు. డూప్లికేట్ నంబర్లతో ఒరిజినల్ వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.