ప్రతికాత్మక చిత్రం
న్యూఢిల్లీ: మన ఇంట్లో పిల్లలు వాళ్లకు నచ్చిన వస్తువును కొనేంతవరకు మనల్ని ఒక పట్టాన వదలరు. ఒకవేళ ఎంతో ప్రయాసపడి కొంటే దాన్ని కొద్దిరోజులు వాడి పక్కన పెట్టేస్తారు. పైగా పెద్దవాళ్లకి కూడా తమ పిల్లలకు ఇష్టమైనవి కొనడం ఒక సరదా. అయితే ఇక్కడొక అమ్మాయి కూడా అలానే ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ తనకు నచ్చిన స్కూటీ కొనుక్కుంది కానీ నడిపేందుకు వీల్లేకుండా అయిపోయింది.
(చదవండి: వామ్మో! అప్పుడే ఈ ఒమ్రికాన్ వైరస్ 12 దేశాలను చుట్టేసింది!!)
అసలు విషయంలోకెళ్లితే...ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థిని అయిన ఆ అమ్మాయి జంకాపురి నుంచి నోయిడాకు మెట్రోలో ప్రయాణించేది. అయితే రద్దీగా ఉండే మెట్రో రైళ్లలో ప్రయాణించడం కష్టంగా ఉందంటూ తన తండ్రిని స్కూటీ కొనివ్వమని అడిగింది. ఈ మేరకు ఆమె తన తండ్రిని ఒప్పించేందకు ఏడాది పాటు ప్రయత్నించింది. అయితే ఆమె తండ్రి ఎట్టకేలకు అంగీకరించి ఆ అమ్మాయికి ఒక మంచి స్కూటీని కొనిచ్చాడు.
అయితే స్కూటీకి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్‌తో అసలు తలనొప్పి మొదలైంది. ఆఖరికి కుటుంబ సభ్యులు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను మార్చుకునేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఒకసారి వాహనానికి నంబర్‌ను కేటాయించిన తర్వాత దానిని మార్చడం ఏమాత్రం కుదరదని, మొత్తం ప్రక్రియ ఒక సెట్ నమూనాలో నడుస్తుంది అని ఢిల్లీ రవాణా కమిషనర్ కెకె దహియా ఆమె తండ్రితో అన్నారు. అయితే ఆ అమ్మాయికి కేటాయించిన నెంబర్ ప్లేట్ మీద కాస్త ఇబ్బందికరమైన విధానంలో నెంబర్ సిరీస్ ఉంది.
పైగా ఆమె స్కూటిని నడుపుతున్నప్పుడు వెనుక నుంచే వచ్చే మిగత వాహనదారులంతా ఆ నెంబర్ ప్లేట్‌ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఆ అమ్మాయి ఆ స్కూటీని నడపను అంటూ తన తండ్రి వద్ద వాపోయింది. ఈ క్రమంలో రవాణా కమిషనర్ ఆశిష్ కుంద్రా మాట్లాడుతూ..."వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు ఆటోమేటిక్‌గా రూపపొందింబచడతాయి. అయితే ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆ సిరీస్‌లను నిలిపివేశాం" అని ఆయన అన్నారు. అంతేకాదు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మరో సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు కూడా చెప్పారు
(చదవండి: టిక్‌టాక్ పిచ్చి.. డాక్టర్ వికృత చేష్టలు.. ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి..)
Comments
Please login to add a commentAdd a comment