Delhi Transport Department
-
రిజిస్ట్రేషన్ ప్లేట్ రచ్చ చేస్తోంది!... అందుకే ఈ స్కూటీ నడపను!!
న్యూఢిల్లీ: మన ఇంట్లో పిల్లలు వాళ్లకు నచ్చిన వస్తువును కొనేంతవరకు మనల్ని ఒక పట్టాన వదలరు. ఒకవేళ ఎంతో ప్రయాసపడి కొంటే దాన్ని కొద్దిరోజులు వాడి పక్కన పెట్టేస్తారు. పైగా పెద్దవాళ్లకి కూడా తమ పిల్లలకు ఇష్టమైనవి కొనడం ఒక సరదా. అయితే ఇక్కడొక అమ్మాయి కూడా అలానే ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ తనకు నచ్చిన స్కూటీ కొనుక్కుంది కానీ నడిపేందుకు వీల్లేకుండా అయిపోయింది. (చదవండి: వామ్మో! అప్పుడే ఈ ఒమ్రికాన్ వైరస్ 12 దేశాలను చుట్టేసింది!!) అసలు విషయంలోకెళ్లితే...ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థిని అయిన ఆ అమ్మాయి జంకాపురి నుంచి నోయిడాకు మెట్రోలో ప్రయాణించేది. అయితే రద్దీగా ఉండే మెట్రో రైళ్లలో ప్రయాణించడం కష్టంగా ఉందంటూ తన తండ్రిని స్కూటీ కొనివ్వమని అడిగింది. ఈ మేరకు ఆమె తన తండ్రిని ఒప్పించేందకు ఏడాది పాటు ప్రయత్నించింది. అయితే ఆమె తండ్రి ఎట్టకేలకు అంగీకరించి ఆ అమ్మాయికి ఒక మంచి స్కూటీని కొనిచ్చాడు. అయితే స్కూటీకి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్‌తో అసలు తలనొప్పి మొదలైంది. ఆఖరికి కుటుంబ సభ్యులు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను మార్చుకునేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఒకసారి వాహనానికి నంబర్‌ను కేటాయించిన తర్వాత దానిని మార్చడం ఏమాత్రం కుదరదని, మొత్తం ప్రక్రియ ఒక సెట్ నమూనాలో నడుస్తుంది అని ఢిల్లీ రవాణా కమిషనర్ కెకె దహియా ఆమె తండ్రితో అన్నారు. అయితే ఆ అమ్మాయికి కేటాయించిన నెంబర్ ప్లేట్ మీద కాస్త ఇబ్బందికరమైన విధానంలో నెంబర్ సిరీస్ ఉంది. పైగా ఆమె స్కూటిని నడుపుతున్నప్పుడు వెనుక నుంచే వచ్చే మిగత వాహనదారులంతా ఆ నెంబర్ ప్లేట్‌ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఆ అమ్మాయి ఆ స్కూటీని నడపను అంటూ తన తండ్రి వద్ద వాపోయింది. ఈ క్రమంలో రవాణా కమిషనర్ ఆశిష్ కుంద్రా మాట్లాడుతూ..."వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు ఆటోమేటిక్‌గా రూపపొందింబచడతాయి. అయితే ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆ సిరీస్‌లను నిలిపివేశాం" అని ఆయన అన్నారు. అంతేకాదు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మరో సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు కూడా చెప్పారు (చదవండి: టిక్‌టాక్ పిచ్చి.. డాక్టర్ వికృత చేష్టలు.. ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి..) -
400 మందికి ఢిల్లీ నివాసులుగా నకిలీ గుర్తింపు!
న్యూఢిల్లీ : బస్సుల్లో భద్రత కోసం ఢిల్లీ ప్రభుత్వం పౌర రక్షణ వాలంటీర్లను(సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్) నియమించాలని నిర్ణయించుకుంది. ఈ కొలువులు కేవలం స్థానికులకే అని తెలిపింది. ఈ నేపథ్యంలో ఓ జిల్లా మేజిస్ట్రేట్ ఆఫీసర్ కొంత మందికి నకీలి ధృవీకరణ పత్రాలను జారీ చేశారు. షాహదార జిల్లా మేజిస్ట్రేట్ కుల్దీప్ పకాడ్ దాదాపు నాలుగు వందల మందికి పైగా నకిలీ ధృవీకరణ పత్రాలను జారీ చేసినట్లు తెలిసింది. వీరిలో అత్యధికంగా కుల్దీప్ సొంత రాష్ట్రం వారే ఉండటం గమనార్మం. తన రాష్ట్రానికి చెందిన పలువురుకి, ఢిల్లీ నివాసితులుగా గుర్తింపునిస్తూ కుల్దీప్ పత్రాలను జారీ చేసినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్ ఈ కేసులో నిజానిజాలను తేల్చేందుకు విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా కైలాష్ మాట్లాడుతూ.. ‘అధికారిపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. నిజానిజాలు తేల్చేందుకు ఓ కమిటీని వేసింది. రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. నివేదిక ఆధారంగా కుల్దీప్పై చర్యలు తీసుకుంటాము’ అని తెలిపారు. అంతేకాక విచారణ పూర్తయ్యేవరకు షాహదార జిల్లాలో సివిల్ డిఫెన్స్ వాలంటీర్ల ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఢిల్లీ ప్రభుత్వం ఇటివల బస్సుల్లో పౌర రక్షణ వాలంటీర్లను నియమించాలని జిల్లా డీఎంలను ఆదేశించింది. అన్ని జిల్లాలను కలుపుకోని రవాణా శాఖలో మొత్తం పది వేల మార్షల్ సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ కొలువులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. -
ఢిల్లీ-ఎన్సీఆర్ల మధ్య 5,500 ఆటోలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి ఎన్సీఆర్కు వెళ్లే ప్రయాణికుల సమస్యలు తొలగిపోనున్నాయి. ఇందుకోసం ఢిల్లీ రవాణా విభాగం 5,500 ఆటోలకు పర్మిట్లు జారీ చేయాలని నిర్ణయించింది. యూపీ, హర్యానాల కిందకు వచ్చే ఎన్సీఆర్ కోసం 2,750- 2,750 ఆటోలకు పర్మిట్లు జారీచేయనుంది. ఈ మేరకు ఢిల్లీ రవాణా విభాగం దరఖాస్తులను ఆహ్వానించింది. డిసెంబర్ 20 వరకు రవాణా విభాగానికి చెందిన బురాడీ క్యాలయంలో పర్మిట్ల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల పరిశీలన తరువాత డ్రా ద్వారా పర్మిట్లు జారీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పర్మిట్లు జారీ చేయడంలో మహిళలకు ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఢిల్లీ నుంచి గాజియాబాద్, నోయిడా, గుర్గావ్, ఫరీదాబాద్ వెళ్లే ప్రయాణికుల వ్యయ ప్రయాసలు తగ్గనున్నాయి.