ఢిల్లీ నుంచి ఎన్సీఆర్‌కు వెళ్లే ప్రయాణికుల సమస్యలు తొలగిపోనున్నాయి. ఇందుకోసం ఢిల్లీ రవాణా విభాగం 5,500 ఆటోలకు పర్మిట్లు జారీ చేయాలని
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి ఎన్సీఆర్‌కు వెళ్లే ప్రయాణికుల సమస్యలు తొలగిపోనున్నాయి. ఇందుకోసం ఢిల్లీ రవాణా విభాగం 5,500 ఆటోలకు పర్మిట్లు జారీ చేయాలని నిర్ణయించింది. యూపీ, హర్యానాల కిందకు వచ్చే ఎన్సీఆర్ కోసం 2,750- 2,750 ఆటోలకు పర్మిట్లు జారీచేయనుంది. ఈ మేరకు ఢిల్లీ రవాణా విభాగం దరఖాస్తులను ఆహ్వానించింది. డిసెంబర్ 20 వరకు రవాణా విభాగానికి చెందిన బురాడీ క్యాలయంలో పర్మిట్ల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల పరిశీలన తరువాత డ్రా ద్వారా పర్మిట్లు జారీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పర్మిట్లు జారీ చేయడంలో మహిళలకు ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఢిల్లీ నుంచి గాజియాబాద్, నోయిడా, గుర్గావ్, ఫరీదాబాద్ వెళ్లే ప్రయాణికుల వ్యయ ప్రయాసలు తగ్గనున్నాయి.