NCR
-
రాజధానిలో ఇళ్ల ధరలు రెట్టింపు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతమైన గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ (ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం) పరిధిలో గడిచిన ఐదేళ్ల కాలంలో కొత్త ప్రాజెక్టుల్లోని ఇళ్ల ధరలు సగటున రెట్టింపైనట్టు రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. 2019 నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కాలంలో నోయిడాలో అత్యధికంగా చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) ధర 152 శాతం మేర పెరిగి రూ.5,910 నుంచి రూ.14,946కు చేరింది.ఘజియాబాద్‌లో 139 శాతం పెరిగి రూ.3,691 నుంచి రూ.8,823కు చేరింది. గురుగ్రామ్‌లో ఎస్ఎఫ్టీ ధర రూ.19,535కు చేరింది. 2019లో ఉన్న రూ.8,299తో పోల్చి చూస్తే 135 శాతం పెరిగింది. గ్రేటర్ నోయిడాలో చదరపు అడుగు ధర 121 శాతం పెరిగి రూ.8,601గా ఉంది. 2019లో ఇక్కడ చదరపు అడుగు రేటు రూ.3,900గా ఉంది. -
ఢిల్లీలో ఎడతెగని వానలు.. దేశంలో వాతావరణం ఉందిలా..
న్యూఢిల్లీ: ఈసారి రుతుపవనాలు పర్వత ప్రాంతాలు మొదలుకొని నుండి మైదాన ప్రాంతాల్లో ఉండేవారి వరకూ అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా, పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో చాలా రహదారులు మూసుకుపోయాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో ఎడతెగని వానల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. ఈ రోజు కూడా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో వర్షాల కారణంగా 10 మంది మృతిచెందారు. గడచిన 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లో సగటున 28.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 51 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు ఢిల్లీలో గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ అధ్వాన్నంగా మారడంతో ఎక్కడైనా ప్రమాదాలు చోటుచేసుకుంటాయని పలువురు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు.వర్షం కారణంగా ఘజియాబాద్లోనిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న ఇంటి పైకప్పు కూలిపోయింది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న మహిళ, ఆమె ఇద్దరు కూతుళ్లు అందులోనే సమాధి అయ్యారు. రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో సాధారణంగా పగటిపూట మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం కురియనుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మొత్తం 117 రహదారులపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. శనివారం సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా ఓ మోస్తరు వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఇది కూడా చదవండి: చైనాలో రిటైర్మెంట్ వయసు పెంపు ! -
ఢిల్లీలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం
దేశరాజధాని ఢిల్లీలో భారీవర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఫలితంగా వాహనదారులు, పాదచారులు పడరాని పాట్లు పడుతున్నారు. భారత వాతావరణశాఖ జూలై 22 నుంచి 24 వరకు ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఈ సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 33 నుండి 34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26 నుండి 28 డిగ్రీల మధ్య ఉండవచ్చు. జూలై 25, 26 తేదీల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 34, కనిష్ట ఉష్ణోగ్రత 26 నుండి 27 డిగ్రీల మధ్య ఉండవచ్చు.గత కొన్ని రోజులుగా ఢిల్లీ-ఎన్సీఆర్లో విపరీతమైన వేడి వాతావరణానికి తోడు కాలుష్య తీవ్రత కూడా అధికంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదయం కురిసిన వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ చెరువులుగా మారుతుంటాయి. -
ఢిల్లీలో 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. వేడి గాలులు వీస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.రానున్న రోజుల్లో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజధాని ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో 46.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. నజాఫ్‌గఢ్‌లో ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలకు చేరుకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరుసగా రెండవ రోజు కూడా వేడిగాలులు వీస్తున్నాయి.రానున్న రోజుల్లో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, పగటిపూట ఢిల్లీ-ఎన్సీఆర్లో గంటకు 25 నుండి 35 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రుతుపవనాలు దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ రుతుపవనాల ప్రభావం ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో తేలికపాటి వర్షం కురిసింది. దీంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. -
చిరు జల్లులు.. చినుకుల్లో తడిచిన జనం (ఫోటోలు)
-
తీరాన్ని శోధించేందుకు సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: ఉష్ణమండల తుపానులు... రుతుపవన సీజన్లో వచ్చే వరదలు... సముద్రమట్టాల పెరుగుదల... మడ అడవుల విస్తీర్ణం తగ్గుదల... పెరుగుతున్న కాలుష్య కారకాల కారణంగా సాగర తీరంలో సంభవిస్తున్న పెను మార్పులు... కోతకు గురవుతున్న తీరప్రాంతాలు... ఇటువంటి విపత్తులన్నింటినీ నియంత్రించేందుకు తీసుకోవాల్సి న ముందుజాగ్రత్త చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశోధిస్తోంది. ఈ తరుణంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్(ఎన్‌సీసీఆర్) ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత పరిరక్షణకు నడుం బిగించింది. తీరంలో తలెత్తుతున్న అలజడులపై రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తూ, సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకునేలా పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని డాల్ఫిన్ నోస్‌పై రీసెర్చ్ సెంటర్‌ను నిర్మించింది. రూ.62 కోట్ల వ్యయంతో 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఎన్‌సీసీఆర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. పరిశోధన కేంద్రంతోపాటు ఎర్త్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా సిద్ధం చేసింది. లేబొరేటరీ, పరిశోధన భవనం, వర్క్‌షాప్, ఆడిటోరియం, సెమినార్ హాల్, గెస్ట్ హౌస్, హాస్టల్, ఇతర భవనాలు కూడా నిర్మించింది. దీనిని ఈ నెల 14న కేంద్ర ఎర్త్ సైన్స్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఎన్‌సీసీఆర్ తాత్కలిక కేంద్రం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఎన్విరాన్మెంట్ విభాగం భవనంలో నిర్వహిస్తున్నారు. దీన్ని డాల్ఫిన్నోస్లో నిర్మించిన నూతన భవనంలోకి నెల రోజుల్లో తరలిస్తారు. ఎన్‌సీసీఆర్ ఏం చేస్తుందంటే... ♦ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న సమస్యలపై విశాఖలోని ఎన్‌సీసీఆర్ కేంద్రం పరిశోధనలు నిర్వహించనుంది. ♦ మొత్తం 972 కిలో మీటర్ల తీరం వెంబడి ఏయే సమస్యలు ఉన్నాయనేది ఎన్‌సీసీఆర్ స్వయంగా పరిశీలించనుంది. ప్రతి అంశంపై పరిశోధనలు నిర్వహించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కృషిచేస్తుంది. ♦ సముద్ర తీరంలో ఎక్కడ, ఎంత మేర కాలుష్యమవుతోంది. దీనివల్ల మత్స్య సంపద, జీవరాశులకు ఎలాంటి విఘాతం కలుగుతోంది. కాలుష్యం వల్ల సముద్రంలో వస్తున్న మార్పులు, మడ అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల తలెత్తుతున్న ప్రమాదాలు వంటి వాటిపై నిరంతరం పరిశోధనలు నిర్వహిస్తుంది. ♦ ఇప్పటికే దేశవ్యాప్తంగా షోర్లైన్ మేనేజ్మెంట్ అట్లాస్ సిద్ధం చేసిన ఎన్‌సీసీఆర్... త్వరలోనే ఆంధ్రప్రదేశ్ షోర్లైన్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను కూడా తయారు చేయనుంది. దీనిద్వారా ఏయే తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి.. వాటిని ఎలా పరిష్కరించాలనే విషయంపై స్పష్టత ఇవ్వనుంది. దానిప్రకారం ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ♦ సముద్రజలాల నాణ్యతను పర్యవేక్షిస్తుంది. ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ(పీడబ్ల్యూక్యూ), ఎకో సిస్టం సర్వీస్, సముద్ర తీర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై కూడా పరిశోధనలు చేస్తుంది. ♦సముద్రంలో చేరుతున్న కాలుష్య కారకాలు, పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపైనా దృష్టి సారిస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏం చర్యలు చేపట్టాలనే అంశంపై పరిశోధనలు చేసి నివేదికను రూపొందిస్తుంది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు చేపడతారు. -
ఉత్తర భారత్‌ను వణించిన భూకంపం..
న్యూఢిల్లీ: ఉత్తర భారతం భూకంపంతో వణికిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం తేలికపాటి ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ రీజియన్, పంజాబ్, ఘజియాబాద్ జమ్ము కశ్మీర్లో భూమి కంపించింది. పొరుగు దేశం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఈ ప్రభావం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Another Earthquake in Islamabad Pray for everyone safety#Earthquake #Islamabad pic.twitter.com/ykMZ3tNuUS — Muhammad Fayyaz (@fayyaz_85) January 11, 2024 భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం అఫ్గనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో గుర్తించింది పరిశోధన కేంద్రం. భూకంపం తీవ్రతకు జమ్మూకశ్మీర్ పూంచ్ సెక్టార్లో కొండచరియలు విరిగిపడ్డాయి. భయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఎవరికి ఎటువంటి గాయాలు, ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. Earthquake of Magnitude:6.1, Occurred on 11-01-2024, 14:50:24 IST, Lat: 36.48 & Long: 70.45, Depth: 220 Km ,Location: Afghanistan for more information Download the BhooKamp App https://t.co/fN2hpmK3jO @KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/q5pkBVscsW — National Center for Seismology (@NCS_Earthquake) January 11, 2024 Earthquake of magnitude 6.1 on Richter scale hits Afghanistan, tremors felt in North India.#Earthquake #Delhi #DelhiNews #EarthquakeNews #Noida #JammuAndKashmir #earthquake #DelhiNCR #Earthquake pic.twitter.com/bR6xWokMcJ — Neha Bisht (@neha_bisht12) January 11, 2024 🇮🇳Earthquake tremors felt in Poonch, India, too.#JammuAndKashmir #Earthquake #Delhi #India #climatecrisis #emergency #DelhiNCR pic.twitter.com/YreWZoOHTF — Attentive Media (@AttentiveCEE) January 11, 2024 -
ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లో గత నెల రోజులుగా కాలుష్య తీవ్రత కొనసాగుతోంది. దీపావళికి ముందు కురిసిన వర్షంతో ఇక్కడి జనం కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ, దీపావళి నుండి కాలుష్యం ‘అతి పేలవమైన’ స్థాయికి చేరడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం కూడా ఢిల్లీలో గాలి నాణ్యత సూచి(ఏక్యూఐ) 300 కంటే ఎక్కువగా ఉంది. అంటే అతి పేలవమైన కేటగిరీలో ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత స్థాయి 360 దాటింది. ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 350, ఆర్కె పురంలో 325, పంజాబీ బాగ్‌లో 332, ఐటీవోలో 328గా ఉంది. శనివారం నుంచి గాలి వేగం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ ఏక్యూఐ శుక్రవారం 324గా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో గాలి వేగం తక్కువగా ఉంది. పగటిపూట గాలి వేగం సాధారణంగా గంటకు పది కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంటుంది. అందుకే ఇక్కడి గాలిలో కాలుష్య కణాలు ఎక్కువ కాలం ఉంటాయి. శనివారం, ఆదివారాల్లో ఢిల్లీవాసులు ప్రాణాంతక కాలుష్యం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో గాలి వేగం గంటకు 12 నుంచి 16 కిలోమీటర్లు ఉండవచ్చు. బలమైన గాలి ప్రభావం కారణంగా కాలుష్యం తగ్గే అవకాశాలున్నాయి. శుక్రవారం ఆకాశం నిర్మలంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా 25.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శనివారం కూడా ఉదయం తేలికపాటి పొగమంచు, పగటిపూట నిర్మలమైన ఆకాశం ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రత 25, కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. శని, ఆదివారాల్లో ఈదురు గాలులు వీస్తాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉన్నందున ఉదయం, సాయంత్రం వేళల్లో చలి పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: హాయిగా నడుస్తూ వెళ్తున్న వ్యక్తికి హఠాత్తుగా పులి ఎదురైతే? -
ఉత్తరాదిన పొగమంచు.. దక్షిణాదిన భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను అటు దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పొగమంచులో కప్పుకుని పోయేలా చేస్తే... ఇటు దక్షిణాదిలో భారీ వర్షాలకు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుపాను ప్రభావం కారణంగా ఇప్పటికే రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో విజిబిలిటీ బాగా తగ్గిపోయిందని, కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి అని భారత వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 28.2 డిగ్రీ సెల్సియస్‌గా నమోదు కావడం గమనార్హం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘మిధిలీ’ తుఫాను ప్రస్తుతం బంగ్లాదేశ్ తీరం దాటింది. కానీ దీని ప్రభావం ఈశాన్యం నుంచి అండమాన్ నికోబార్ వరకు కనిపిస్తోంది. ఫలితంగా భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.మరోవైపు ఢిల్లీ-ఎన్సీఆర్తోపాటు యూపీలోనూ చలిగాలులు వీస్తున్నాయి. అండమాన్ నికోబార్ దీవులు, మిజోరాం, త్రిపురసహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల సమీపంలో గంటకు 50-60 కిలోమీటర్ల నుండి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు తీర ప్రాంతాలకు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు. తమిళనాడులో.. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరడంతో జనం పలు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల చెట్లు కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. కడలూరు, మైలదుతురై, నాగపట్నం, తిరువారూర్, పుదుచ్చేరిలోని కారైకల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. #COMK Daily #Weather Update. 17th Nov. '23 #NEM2023 The deep depression over Bay of Bengal is expected to become a Cyclone in the next few hours while it continues to move towards Bangladesh coast. In the meanwhile the Cyclonic circulation near Sri Lanka continues to persist and… pic.twitter.com/rmUN5qDHNt — Chennai Rains (COMK) (@ChennaiRains) November 17, 2023 చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, తంజావూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ఐదు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపధ్యంలో తమిళనాడులోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. చెన్నై, తిరువళ్లూరు జిల్లాలోని విద్యాసంస్థలు మూతపడ్డాయి. అలాగే పుదుచ్చేరి, కారైకల్‌లలో పాఠశాలలు, కళాశాలలకు కూడా సెలవు ప్రకటించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఇది కూడా చదవండి: 15 ఏళ్లకే అమ్మ.. 33కు అమ్మమ్మ.. కొత్త ట్విస్ట్ ఇదే! I look forward to the music and rain that I enjoyed listening to back in the day.i love western Ghats Manjolai. #kmtr#LatinGRAMMY @ambai_dd @AnandaVikatan @BBC_Travel @ChennaiRains @supriyasahuias @Collectortnv @venki_ranger @Vish_speaks @praddy06 @ParveenKaswan @SudhaRamenIFS pic.twitter.com/4kMT9erZ6v — manjolai selvakumar 0+ (@Mselvak44272998) November 17, 2023 -
ఢిల్లీ వాసులకు ‘హై స్పీడ్’ ప్రయాణం
‘ప్రయాణానికి తక్కువ సమయం, కుటుంబానికి ఎక్కువ...!’. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రీజనల్ రైల్ సరీ్వస్‌కు సంబంధించిన ఆకర్షణీయమైన నినాదాల్లో ఇదొకటి! ర్యాపిడ్ ఎక్స్‌గా పిలుస్తున్న ఈ తొలి సెమీ హై స్పీడ్ ప్రాంతీయ రైలు దేశ రాజధాని ప్రాంత (ఎన్సీఆర్) వాసులకు అందుబాటులోకి రానుంది. మొత్తం 82 కిలోమీటర్ల మేర చేపట్టిన ఢిల్లీ–గాజియాబాద్–మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్) కారిడార్‌లో 17 కి.మీ. ప్రస్తుతం సిద్ధమైంది. సాహిబాబాద్–దుహై స్టేషన్ల మధ్యనున్న ఈ కారిడార్‌ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ర్యాపిడ్ ఎక్స్ రైలుకు నమోభారత్‌గా గురువారం నామకరణం చేశారు. శనివారం నుంచి ఇది ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. కారిడార్‌లో కొత్తగా నిర్మించిన స్టేషన్లలో అందమైన కుడ్యచిత్రాలు, ఆకర్షణీయమైన నినాదాలు అలరిస్తున్నాయి. అంతేనా...! ఈ ర్యాపిడ్ ఎక్స్ హై స్పీడ్ రైల్వే వ్యవస్థ విశేషాలు అన్నీ ఇన్నీ కావు... గంటకు 160 కి.మీ. వేగం! ► ర్యాపిడ్ ఎక్స్ ద్వారా రాజధాని వాసులకు ప్రయాణ సమయం ఏకంగా మూడో వంతు దాకా తగ్గనుంది. ► ప్రయోగాల సందర్భంగానే ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు గంటకు 160 కి.మీ. వేగాన్ని సులువుగా అందుకున్నాయి! ► అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఈ రైళ్ల సొంతం. ► ఒక్కో రైల్లో ఆరు కోచ్‌లుంటాయి. వీటిలో 1,700 మంది ప్రయాణించవచ్చు. ► ప్రతి రైల్లో ఒక మహిళా కోచ్‌తో పాటు వారికి దివ్యాంగులకు, వృద్ధులకు కొన్ని సీట్లు ప్రత్యేకిస్తారు. ► రెండు వరుసల్లో, వరుసకు రెండు చొప్పున సీట్లుంటాయి. నిలబడేందుకు విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది. ► ల్యాప్‌టాప్, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, లగేజీ ర్యాక్‌లు, అభిరుచికి అనుగుణంగా లైటింగ్‌ను మార్చుకునే వెసులుబాటు, సీట్ పుష్ బ్యాక్, కోట్ తగిలించుకునే హుక్, ఫుట్ రెస్ట్, ప్రీమియం కోచ్‌లో ప్రయాణికులకు సాయపడేందుకు అసిస్టెంట్, స్నాక్స్, డ్రింక్స్ కొనుక్కునేందుకు వెండింగ్ మెషీన్ల వంటివెన్నో ఇందులో ఉన్నాయి. ► ఉదయం ఆరింటి నుంచి రాత్రి 11 దాకా ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. ► డిమాండ్‌ను, అవసరాన్ని బట్టి మున్ముందు ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు నడుపుతారు. ► చార్జీలు స్టాండర్డ్ కోచ్‌లో రూ.20–రూ.40, ప్రీమియం కోచ్‌లో రూ.40–రూ.100. ► ప్రతి స్టేషన్నూ ఆకర్షణీయమైన రంగులతో కూడిన కుడ్య చిత్రాలు, నినాదాలతో ఆకట్టుకునేలా తయారు చేశారు. ళీ ఈ ర్యాపిడ్ ఎక్స్ ప్రాజెక్టును ఢిల్లీ, హరియాణా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతో కలిసి కేంద్రం సంయుక్తంగా చేపట్టింది. ► ఢిల్లీ–గాజియాబాద్–మీరట్ మధ్య 81.15 కి.మీ. ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ 2025 కల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ► ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.30 వేల కోట్లు. ‘ఏఐ’ బ్యాగేజ్ స్కానింగ్ ర్యాపిడ్ ఎక్స్ రైళ్ల ఉద్దేశమే ప్రయాణ సమయం తగ్గించడం. అందుకు అనుగుణంగా కారిడార్‌లోని స్టేషన్లలో బ్యాగేజీ తనిఖీ సమయాన్ని బాగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ ఆధారంగా పని చేసే సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. నియంత్రిత, నిషేధిత వస్తువులుంటే అది వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ► ఇందులో డ్యుయల్ వ్యూతో కూడిన ఎక్స్ రే బ్యాగేజీ తనిఖీ వ్యవస్థ ఉంటుంది. దాంతో బ్యాగేజీ తాలూకు పై, లోపలి భాగాలు స్క్రీన్‌పై విడిగా, స్పష్టంగా కని్పస్తాయి. ► ఈ స్టేషన్లలో తక్షణ స్పందన బృందం, బాంబ్ డిటెక్షన్–డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వంటివాటిని యూపీ పోలీసులు అందుబాటులో ఉంచనున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ విషయంలో ముంబైని వెనక్కి నెట్టనున్న హైదరాబాద్
విభిన్న సంస్కృతులకు వేదికైన హైదరాబాద్ నగరం వేగంగా మెట్రోపాలిటన్ సిటీగా ఎదిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అవకాశాలను వేగంగా అందిపుచ్చుకుని అనతి కాలంలోనే దేశంలో పెద్ద నగరాల సరసన నిలిచింది. ఐటీ విషయంలో ఇప్పటికే చెన్నై, కోల్‌కతాలను వెనక్కి నెట్టిన హైదరాబాద్ తాజాగా ముంబైని వెనక్కి నెట్టేందుకు రెడీ అవుతోంది. అగ్రస్థానం సిలికాన్ సిటీదే ప్రస్తుతం దేశంలో కమర్షియల్ స్పేస్ లభ్యత విషయంలో బెంగళూరు నగరం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరు నగరం అనేక స్టార్టప్ కంపెనీలు, ఐటీ కంపెనీలకు వేదికగా ఉంది. దీంతో ఇక్కడ కమర్షియల్ స్పేస్‌కి డిమాండ్ బాగా పెరిగింది. రియల్టీ ఇండస్ట్రీ వర్గాల లెక్కల ప్రకారం బెంగళూరులో ప్రస్తుతం 16 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అందుబాటులో ఉంది. రేసులో ఎన్సీఆర్ వందళ ఏళ్లుగా దేశ రాజధానిగా ఉన్న హస్తినలో పొలిటికల్ డెవలప్మెంట్ జరిగినంత వేగంగా ఐటీ, ఇతర ఇండస్ట్రీలు పుంజుకోలేదు. కానీ ఢిల్లీ నగర శివార్లలో వెలిసిన గురుగ్రామ్, నోయిడాలతో ఢిల్లీ నగర రూపు రేఖలు మారిపోయాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోకి వచ్చే ఈ మూడు నగరాలు ఐటీతో పాటు అనేక పరిశ్రమలకు నెలవుగా ఉన్నాయి. దీంతో ఇక్కడ అతి తక్కువ కాలంలోనే కమర్షియల్ స్పేస్‌కి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో 11 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అందుబాటులో ఉంది. ముంబై వెంటే భాగ్యనగరం దేశ వాణిజ్య రాజధాని ముంబై ఐటీ పరిశ్రమను అందిపుచ్చుకోవడంలో వెనుకబడిందనే చెప్పాలి. దీంతో ఆ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు ఎక్కువగా పూనెకు తరలిపోయాయి. ఐనప్పటికీ ఈ వాణిజ్య రాజధానిలో కమర్షియల్ స్పేస్‌కి డిమాండ్ ఎంత మాత్రం తగ్గలేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం ముంబై నగరంలో 10.50 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అందుబాటులో ఉంది. అయితే మరికొద్ది రోజుల్లోనే ఈ మార్కు చేరుకునేందుకు దక్షిణాది నగరమైన హైదరాబాద్ రివ్వున దూసుకొస్తోంది. హైదరాబాద్, ఢిల్లీలదే రియల్టీ వర్గాల గణాంకాల ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో 7.6 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ఇప్పటికే అందుబాటులో ఉంది. కాగా మరో 4 కోట్ల చదరపు అడుగుల స్థలం 2023 కల్లా అందుబాటులోకి రానుంది. దీంతో వచ్చే ఏడాది కల్లా హైదరాబాద్ నగరం కమర్షియల్ స్పేస్‌లో ముంబైని దాటనుంది. మరోవైపు ఢిల్లీని మినహాయిస్తే ముంబై, బెంగళూరులలో కమర్షియల్ స్పేస్ మార్కెట్ శాచురేషన్కి చేరుకుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోనాలుగైదేళ్ల పాటు ఢిల్లీ, హైదరాబాద్‌లలోనే కమర్షియల్ స్పేస్ జోష్ కనిపించనుంది. చదవండి: ఏడు ప్రధాన నగరాల్లో బిగ్ రియాల్టీ డీల్స్ ఇవే -
డీజిల్ డోర్ డెలివరీ... ఎప్పుడు? ఎక్కడ?
ఢిల్లీ: వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డీజిల్ డోర్ డెలవరీ స్కీంని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అమల్లోకి తెచ్చింది. ఢిల్లీకి చెందిన స్టార్టప్ సంస్థతో కలిసి సేఫ్20 పేరుతో డీజిల్ డోర్ డెలివరీ చేస్తోంది. 20 లీటర్ల క్యాన్ ఢిల్లీ కేంద్రంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో 20 లీటర్ల జెర్రీ క్యాన్లను ఢోర్ డెలివరీగా బీపీసీఎల్ అందిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న హమ్ సఫర్ సంస్థతో బీపీసీఎల్ టై అప్ అయ్యింది. 20 లీటర్ల సామర్థ్యం కల జెర్రీ క్యాన్లలో డీజిల్‌ని డోర్ డెలివరీ చేస్తోంది. డోర్ డెలివరీ కావాలంటే కనీసం 20 లీటర్లు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఉపయోగకరం డోర్ డెలివరీ పథకం వల్ల అపార్ట్మెంట్లు, సెల్‌ఫోన్ టవర్లు, షాపింగ్ కాంప్లెక్సులు, హాస్పటిల్స్, బ్యాంకులు, కన్స్ట్రక్షన్ సైట్లు, హోటళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బీపీసీఎల్ అంటోంది. గతంలో డీజిల్ కావాలంటే పెట్రోల్ పంప్‌కు రాక తప్పని పరిస్థితి నెలకొని ఉండేది. పైగా ఫ్యూయల్ స్టేషన్ నుంచి డీజిల్ రవాణా చేయడం ప్రయాసతో కూడిన వ్యవహరం. మార్గమధ్యంలో డీజిల్ ఒలకడం సర్వ సాధారణంగా జరిగేది. అయితే తాజా డోర్ డెలివరీతో ఈ కష్టాలు తీరనున్నాయి. ఇంటి వద్దకే డీజిల్ తెప్పించుకుని జనరేటర్, లిఫ్టు, క్రేన్లు, భారీ యంత్రాలు తదితర అవసరాలకు సులభంగా ఉపయోగించవచ్చు. మొదట అక్కడే గతంలో పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే హిమాచల్ ప్రదేవ్, ఉత్తరఖండ్ ప్రాంతాల్లో ఈ డోర్ డెలివరీ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టగా మంచి ఫలితాలు వచ్చాయి. ఊరికి దూరంగా కొండ ప్రాంతాల్లో ఉండే హోటళ్లు, రిసార్టులకు ఈ స్కీం చాలా ప్రయోజనకారిగా మారింది. ఆ తర్వాత వ్యవసాయ అవసరాలు ఎక్కువగా ఉండే పంజాబ్, హర్యానాల్లోనూ అమలు చేశారు. దేశమంతటా డీజిల్ డోర్ డెలివరీని మొదటగా అమలు చేసిన నాలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని ఈ సారి డిమాండ్ ఎక్కువగా ఉండే ఢిల్లీలో డీజిల్ డోర్ డెలివరీని అమల్లోకి తెచ్చారు. ఇక్కడ సానుకూల ఫలితాలు వస్తే క్రమంగా దేశమంతటా విస్తరించనున్నారు. -
ఏటీఎం: కార్డు లేకుండానే నగదు విత్ డ్రా
గతంలో బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేయాలంటే సదురు బ్యాంకు శాఖకు వెళ్లి నగదును తీసుకునేవాళ్లం. ఇక ఏటీఎం మిషన్ వచ్చాక బ్యాంకుకు వెళ్లకుండానే కార్డులు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నాం. ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీ వల్ల త్వరలో ఏటీఎం కార్డు అవసరం లేకుండానే గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ ద్వారా ఏటీఎం కేంద్రాలలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు కావాల్సిన మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీని మీరు ఉపయోగించడానికి ఇంకెంతో సమయం ఆగాల్సిన అవసరం లేదు. ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్(ఎటిఎం) తయారుచేసే ఎన్సీఆర్ కార్పొరేషన్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపీఐ) ప్లాట్‌ఫాంతో కలిసి మొట్టమొదటి సారిగా ఇంటర్‌పెరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా(ఐసిసిడబ్ల్యు) సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొనిరావడానికి సిటీ యూనియన్ బ్యాంక్, ఎన్సీఆర్తో చేతులు కలిపింది. క్యూఆర్ కోడ్ ఆధారిత ఇంటర్‌పెరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా సదుపాయాన్ని బ్యాంక్ ఇప్పటికే 1,500 ఏటీఎంలను అప్‌గ్రేడ్ చేసింది. ఈ ఏటీఎంలలో ఎటువంటి కార్డు అవసరం లేకుండానే స్కాన్ చేసి క్షణాల్లో డబ్బులు డ్రా చేయొచ్చు. "మొబైల్ ఫోన్లో ఉన్న యుపీఐ యాప్ ద్వారా ఎటిఎమ్ లో ఉన్న క్యూఆర్ కోడ్ క్యాష్ విత్ డ్రా చేయవచ్చు, దీని కోసం ఎటువంటి కార్డులు అవసరం లేదు" అని ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & ఎన్సీఆర్ కార్పొరేషన్లో సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు నవ్రోజ్ దస్తూర్ పీటీఐకి చెప్పారు. ఎలా పని చేస్తుంది ఈ కొత్త సదుపాయంతో వినియోగదారులు తమ మొబైల్ లోని యుపీఐ ఎనేబుల్ చేసిన బీమ్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ ద్వారా నగదు డ్రా చేసుకోవచ్చు. దీనికోసం ఎటువంటి కార్డ్స్ కూడా అవసరం లేదు. మొదట ఏటీఎం స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఎంతమొత్తం డ్రా చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పిన్ ఎంటర్ చేయాలి. అంతే యూపీఐ యాప్‌లో ప్రాసెస్ పూర్తి కాగానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అవుతాయి. ప్రస్తుతం, పరీక్ష దశలో ఉంది కాబట్టి రూ.5వేలకు డ్రా మించి విత్ డ్రా చేయలేరు. ఇది సురక్షితమేనా? భద్రతా విషయంలో ఇది ఇంకా అత్యంత సురక్షితమైనది. ఎందుకంటే కార్డు అవసరం లేదు కాబట్టి కార్డుతో జరిగే మోసాలు అరికట్టవచ్చు. ఇక ఈ లావాదేవీ డైనమిక్ క్యూఆర్ కోడ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి లావాదేవీ సమయంలో క్యూఆర్ కోడ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ డైనమిక్ క్యూఆర్ కోడ్ ఆధారిత ఇంటర్‌పెరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా సేవలను అన్ని బ్యాంకుల యూజర్లకు అందుబాటులోకి తీసుకోని రావడానికి ఎన్సీఆర్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు నవ్రోజ్ దస్తూర్ తెలిపారు. చదవండి: రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్ గడువు పొడగింపు రైల్వే ప్రయాణికులకు తీపికబురు -
రాజస్థాన్‌లో భూకంపం
జైపూర్ : రాజస్తాన్‌లో గురువారం తెల్లవారుజామున 4.10 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు తెలిపారు. రాజస్థాన్ బికనేర్ నగరానికి 669 కిలోమీటర్ల దూరంలో భూకంప తీవ్రతను గుర్తించారు. భూకంప ఉపరితలానికి దాదాపు 30 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. గత వారంలోనూ రాజస్థాన్‌లో భకంపం సంభవించిన సంగతి తెలిసిందే. వరుస భూ ప్రకంపనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. राजस्थान के बीकानेर में महसूस हुए भूकंप के झटके, रिक्टर स्केल पर इतनी थी तीव्रता#Rajasthan #Earthquake #Bikaner https://t.co/kW54UJFNMn — ABP News (@ABPNews) August 13, 2020 -
ఢిల్లీలో భూప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో శుక్రవారం సాయంత్రం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప కేంద్రం హరియాణాలోని గుర్గావ్కు నైరుతి దిశగా 63 కిలోమీటర్ల దూరంలో ఉందని జాతీయ భూప్రకంపనల కేంద్రం తెలిపింది. భూకంప ప్రభావంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైంది. కాగా భూప్రకంపనలతో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించిన వివరాలూ ఇంతవరకూ వెల్లడికాలేదు. గత రెండు నెలల్లో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో భూమి కంపించడం ఇది 17వసారి కావడం గమనార్హం. ఢిల్లీలో జూన్ 8న చివరిసారిగా భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.1గా నమోదైంది. వరుసగా తేలికపాటి భూప్రకంపనలు చోటుచేసుకోవడం జాతీయ రాజధాని ప్రాంతంలో భారీ భూకంపం సంభవించేందుకు సంకేతాలనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ ప్రకంపనలు భారీ భూకంపానికి సంకేతాలుగా భావించలేమని, వీటి ఆధారంగా సన్నద్ధతకు సిద్ధం కావచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇతర ప్రకృతి వైపరీత్యాల మాదిరిగా భూకంప తీవ్రతను నిర్ధిష్టంగా ఊహించలేమని అన్నారు. చదవండి : డాక్టర్ గుప్తా కుటుంబానికి రూ. కోటి పరిహారం -
రిలయన్స్ జియో... వై–ఫై కాలింగ్ సేవలు
న్యూఢిల్లీ: వై–ఫై ద్వారా కూడా వాయిస్, వీడియో కాలింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు టెలికం సంస్థ రిలయన్స్ జియో వెల్లడించింది. దీనితో ఇళ్లలో లేదా ఆఫీసుల్లో కాల్స్ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్టీఈ నుంచి వై–ఫైకి మారవచ్చ ని పేర్కొంది. జనవరి 16లోగా దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు జియో వివరించింది. పోటీ సంస్థ భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే ఈ తరహా సర్వీసులను ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో జియో ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఢిల్లీలో పగటివేళ మాత్రమే నిర్మాణాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో జరుగుతున్న నిర్మాణాలపై ప్రస్తుతం అమలవుతున్న ఆంక్షలను సుప్రీంకోర్టు పాక్షికంగా ఎత్తివేసింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు నిర్మాణాలు చేపట్టుకోవచ్చని స్పష్టంచేసింది. అయితే సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం స్పష్టం చేసింది. భవన నిర్మాణాలను, కూల్చివేతలను తాత్కాలికంగా ఆపివేయాలంటూ గత నెల 4న సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
క్యాషే కింగ్!
నగదు లావాదేవీల్లో బ్లాక్ మనీని నియంత్రించేందుకు కేంద్రం చేపట్టిన రూ.1,000, రూ.500 నోట్ల రద్దు (డీమానిటైజేషన్) పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. డీమానిటైజేషన్ చేపట్టి మూడేళ్లు గడిచినా.. నేటికీ ప్రాపర్టీ డీల్స్‌లో 30 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో కంటే ద్వితీయ శ్రేణి నగరాల్లోని గృహ విభాగంలోనే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ తెలిపింది. సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్‌లో నల్లధన లావాదేవీలకు పేరొందిన నగరాలు ఎంఎంఆర్, ఎన్సీఆర్. ఇక్కడ ప్రైమరీ గృహ అమ్మకాల్లో నగదు వినియోగం తగ్గినప్పటికీ.. రీసేల్ ప్రాపరీ్టల్లో మాత్రం క్యాషే కింగ్. మొత్తం ప్రాపర్టీ విలువలో 20–25 శాతం నల్లధనం రూపంలోనే జరుగుతాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. . బెంగళూరు, పుణే, హైదరాబాద్ వంటి నగరాల్లో రీసేల్ ప్రాపర్టీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా ఉంది. ఇక్కడ రీసేల్ గృహాల మార్కెట్లలో బ్లాక్‌మనీ ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రాపర్టీ విలువలో సుమారు 30 శాతం దాకా నగదు రూపంలోనే చెల్లింపులు చేస్తున్నారు. క్యాషే కింగ్ ఎందుకంటే? సర్కిల్ రేట్ల కంటే మార్కెట్ రేట్లు ఎక్కువగా ఉన్న చోట, ఊహాజనిత (స్పెక్లేటివ్) కొనుగోళ్లు, అమ్మకాల్లో నగదు లావాదేవీలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సర్కిల్ రేట్లకు, మార్కెట్ రేట్లకు మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండే ప్రధాన నగరాల్లోని రియల్టీ లావాదేవీల్లో నల్లధనం వినియోగం చాలా తక్కువ. ఉదాహరణకు గుర్గావ్లోని ఎంజీ రోడ్లో సగటు సర్కిల్ రేటు చ.అ.కు రూ.11,205లుగా ఉంటే.. మార్కెట్ రేటు రూ.11,000లుగా ఉంది. అలాగే డీఎల్ఎఫ్ సిటీ ఫేజ్–4లో డెవలపర్ విక్రయించే మార్కెట్ రేటు, అక్కడి సర్కిల్ రేటు రెండూ చ.అ.కు రూ.10,800లుగా ఉంది. ముంబైలోని లోయర్ పరేల్‌లో సర్కిల్ రేటు చ.అ.కు రూ.32,604, అదే మార్కెట్ రేటు రూ.32,750లుగా ఉంది. రీసేల్ నగదు రూపంలోనే.. ప్రాథమిక గృహాల్లో కంటే రీసేల్ ప్రాపర్టీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా జరుగుతుంది. కొనుగోలుదారులు, అమ్మకందారులు అధికారిక చెల్లింపులను మాత్రమే అకౌంటెడ్‌గా చేస్తున్నారని.. మిగిలిన చెల్లింపులన్నీ నగదు రూపంలోనే చేస్తున్నారు. రీసేల్ ప్రాపరీ్టల్లో ధర, పారదర్శకత రెండూ నల్లధన ప్రవాహానికి కారణమవుతున్నాయి. రీసేల్ ప్రాపరీ్టలకు స్థిరమైన ధర, క్రయవిక్రయాల్లో కఠిన నిబంధనలు లేకపోవటమే ఇందుకు కారణమని అనూజ్ పూరీ తెలిపారు. ప్రాథమిక గృహాల ధర స్థానిక మార్కెట్‌ను బట్టి ఉంటుంది. అదే రీసేల్ ప్రాపరీ్టలకు లొకేషన్, వసతులు తదితరాల మీద ఆధారపడి ధరల నిర్ణయం ఉంటుంది. హైదరాబాద్‌లో... హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా జరిగేది స్థలాలు, ప్రీలాంచ్ గృహాల కొనుగోళ్లలోనే. పెద్ద మొత్తంలో భూముల కొనుగోళ్లు క్యాష్ రూపంలో జరగడానికి ప్రధాన కారణం.. ఆఫీసర్లే! ఎందుకంటే చేయి తడిపితే గానీ పని చేయని ఆఫీసర్లు బోలెడు మంది. పెద్ద మొత్తంలోని ఈ సొమ్మును రియల్ ఎస్టేట్‌లో తప్ప బ్యాంక్‌లోనో లేక ఇంట్లోనో దాచుకోలేరు. అందుకే భారీగా స్థలాలు, ప్రీమియం గృహాల కొనుగోళ్లు చేస్తుంటారని అప్పా జంక్షన్‌కు చెందిన ఓ డెవలపర్ ‘సాక్షి రియలీ్ట’కి తెలిపారు. క్యాష్‌ను తగ్గించాలంటే? రియల్టీ లావాదేవీల్లో నగదు వినియోగాన్ని తగ్గించాలంటే మార్కెట్ ధరలను పెంచి.. స్టాంప్ డ్యూటీని తగ్గించాలని షాద్‌నగర్‌కు చెందిన ఓ డెవలపర్ సూచించారు. ఉదాహరణకు సదాశివపేటలో మార్కెట్ రేటు ఎకరానికి రూ.50 లక్షలు, ప్రభుత్వ విలువ రూ.70 వేలుగా ఉంది. ఈ లావాదేవీలను వైట్ రూపంలో ఇవ్వడానికి డెవలపర్ రెడీనే. కానీ, అమ్మకందారులు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఎక్కువ మొత్తం స్టాంప్ డ్యూటీని చెల్లించేందుకు అమ్మకందారు ఒప్పకోడు. అదే ఒకవేళ ప్రభుత్వం గనక ప్రభుత్వ రేటును పెంచి.. స్టాంప్ డ్యూటీని తగ్గిస్తే వైట్ రూపంలో లావాదేవీలు జరిపేందుకు ముందుకొస్తారు. -
ఢిల్లీని వదిలేందుకు సిద్ధం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం నుంచి మరో నగరానికి తరలివెళ్లేందుకు 40%మందికి పైగా సిద్ధంగా ఉన్నారు. 16% మంది ప్రజలు మాత్రం ఈ కాలంలోనే ఢిల్లీని విడిచి వెళ్లాలనుకుంటున్నారు. ‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ 17వేల మందితో నిర్వహించిన సర్వేలో ఈమేరకు వెల్లడైంది. 31%మంది మాత్రం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోనే ఉండి వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా వారు ఎయిర్ ప్యూరిఫైర్స్, మాస్క్‌లు వినియోగించడం, మొక్కలు నాటడం వంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. 13%మంది మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇక్కడ ఉండాల్సి వస్తోందని, అయితే పెరుగుతున్న వాయుకాలుష్యాన్ని ఎదుర్కోవడం తప్ప తమకు మరోమార్గం లేదని తెలిపారు. గతవారం వాయుకాలుష్యాన్ని మీరు, మీ కుటుంబ సభ్యులు ఎలా ఎదుర్కొన్నారు? అన్న ప్రశ్నకు..13%మంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు వైద్యుల్ని కలిసినట్లు తెలిపారు. అయితే అప్పటికే వైద్యుల్ని కలిసిన వారిలో 29%మంది ఉన్నారు. వాయుకాలుష్యం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారెవరూ ఆస్పత్రికి గాని, వైద్యుల వద్దకు వెళ్లలేదని 44%మంది తెలిపారు. 14%మంది మాత్రమే వాయుకాలుష్యం వల్ల తమకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకాలేదని తెలిపారు. ఇదిలా ఉండగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం వర్షం పడినప్పటికీ కాలుష్యం తారాస్థాయిలోనే ఉంది. పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ ప్రజారోగ్యంపై అత్యవసరస్థితిని ప్రకటించడంతో ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లను మూసివేసింది. అదేవిధంగా ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో భవన నిర్మాణ కార్యకలాపాల్ని ఈపీసీఏ నిషేధించిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత మళ్లీ... కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సమాచారం మేరకు ఢిల్లీలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 494గా నమోదైంది. నవంబర్ 6, 2016న ఇది 497గా ఉండగా, మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో సూచీ నమోదైంది. ఈ సూచీ అధికస్థాయిలో పూసా ప్రాంతంలో 495, ఐటోలో 494, మండ్కా, పంజాబీ భాగ్ ప్రాంతాల్లో 493గా ఉంది. నిర్ధారిత ఏక్యూఐ ప్రామాణికాలివీ.. సూచీ 0–50 మధ్య ఉంటే మంచిగా ఉన్నట్లు, 51–100 సంతృప్తికర స్థాయి, 101–200 మోస్తర్లు, 201–300 బాగోలేదని, 301–400 అస్సలు బాగోలేదని, 401–500 అథమస్థాయి, 500 కంటే పైన తీవ్రమైన అథమస్థాయిగా పరిగణిస్తారు. -
ఇంధనానికి తగ్గ రంగు స్టిక్కర్లు
న్యూఢిల్లీ: దేశరాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో నడిచే వాహనాలకు అధికారులు ఇకపై ఇంధనాన్ని బట్టి స్టిక్కర్లు ఏర్పాటు చేయనున్నారు. హోలోగ్రామ్ స్టిక్కర్ రంగును బట్టి ఆ వాహనం పెట్రోల్, సీఎన్జీ, డీజిల్, విద్యుత్‌లలో దేంతో నడుస్తోందో కనిపెట్టేయవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఎన్సీఆర్లో శీతాకాలంలో కాలుష్యం బెడదను తగ్గించేందుకు తీసుకునే చర్యలపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తాజా ప్రతిపాదనల ప్రకారం పెట్రోల్, సీఎన్జీ వాహనాలకు లేత నీలిరంగు, డీజిల్‌తో నడిచే వాహనాలకు ఆరెంజ్ కలర్ హోలోగ్రామ్ స్టిక్కర్లుంటాయి. దీంతోపాటు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు గ్రీన్ నంబర్ ప్లేట్లను లేదా గ్రీన్ హోలోగ్రామ్ స్టిక్కర్లను వాడేలా చూడాలని సూచించింది. -
ఢిల్లీలో కారులో గ్యాంగ్‌రేప్
గుర్గావ్/నోయిడా: దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో మరో సామూహిక అత్యాచారం జరిగింది. 35 ఏళ్ల మహిళపై ముగ్గురు మృగాళ్లు కారులో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. రాజస్తాన్‌కు చెందిన మహిళ గుర్గావ్లోని సోహ్న ప్రాంతంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో రోడ్డుపై నడచుకుంటూ వెళ్తుండగా ఆమెను దుండగులు స్విఫ్ట్ కారులోకి లాగారు. అనంతరం ఐదు గంటలపాటు ఆమెపై అత్యాచారం చేస్తూ ఢిల్లీ మీదుగా నోయిడా వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఆమెను నోయిడాలో వదిలేశారు. నిందితులు అత్యాచారం చేస్తూ కారులో గుర్గావ్ నుంచి ఢిల్లీ మీదుగా నోయిడా వరకు వచ్చినా..ఏ ఒక్క పోలీసూ గుర్తించకపోవడం రాజధాని ప్రాంతంలోని భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ ఘటనపై నోయిడా, గుర్గావ్ పోలీసులు సంయుక్తంగా విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు గౌతమ బుద్ధ నగర్ ఎస్సెస్పీ లవ్ కుమార్ చెప్పారు. 2012లో నిర్భయ ఘటన సమయంలో పెద్ద ఉద్యమమే జరిగినా ఎన్సీఆర్లో మహిళలకు నేటికీ భద్రత కరువైంది. ఎన్సీఆర్ ప్రాంతంలో తరచూ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. -
జనవరి 1నుంచి ప్లాస్టిక్ కప్పుల నిషేధం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అంతకంతకూ పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ, దాని చుట్టుపక్కల ఎన్సీఆర్ పరిధిలో డిస్పోజబుల్ ప్లాస్టిక్ ను నిషేధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు జనవరి 1, 2017 నుంచి అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పింది. ముఖ్యంగా పచారీ సరుకుల్లో వినియోగించే ప్లాస్టిక్, వాడి పారేసే ప్లాస్టిక్ కప్పుల వాడకాన్ని బ్యాన్ చేసింది. ఎన్జీటీ అధ్యక్షుడు స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కు, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సత్వరమే చర్యలు చేపట్టాలని కోరింది. వ్యర్థాల తగ్గింపు, వ్యర్థాల వినియోగం కోసం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ఎన్సీటీ సహా ఇతర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఢిల్లీలో ఆందోళనకరంగా మారుతున్న వాయుకాలుష్యం, కప్పివేస్తున్న పొగమంచు పరిస్థితులపై ప్రభుత్వ ఉదాసీన వైఖరిపట్ల ఇటీవల ఎన్ జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీని దడ దడ లాడిస్తున్న కాలుష్యం
-
ఢిల్లీ కాలుష్య నియంత్రణకు టెరీ ప్రణాళిక
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో కాలుష్య నివారణకు ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ (టెరీ) సోమవారం పది సూత్రాల అత్యవసర ప్రణాళికను ప్రకటించింది. ఇందులో... పంట దహనాన్ని తగ్గించడం, ఢిల్లీ–ఎన్ సీఆర్‌లో పదేళ్లకు పైబడిన డీజిల్ వాహనాలపై నిషేధం విధించడం లాంటివి ఉన్నాయి. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు ఈ ప్రణాళికను సమర్పిస్తూ దీన్ని సత్వరమే అమల్లోకి తేవాలని సిఫార్సు చేసింది. ఢిల్లీ కాలుష్యంపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్(సీఎస్ఈ) సమర్పించిన నివేదికపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. -
గుర్గావ్లో తగ్గిన వాయునాణ్యత
గుర్గావ్: నగరంలో వాయు నాణ్యత బాగా తగ్గిపోయింది. ఇందువల్ల నగరవాసి ఆయుఃప్రమాణం మూడు సంవత్సరాల మేర తగ్గిపోయే ప్రమాదముందంటూ వస్తున్న వార్తలు కలవరం రేకెత్తిస్తున్నాయి. జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోకి వచ్చే ఈ నగరంలో వాయునాణ్యతపై హరియాణా రాష్ర్ట కాలుష్య నియంత్రణ సంస్థ (హెచ్‌ఎస్‌పీసీబీ) నివేదిక అందరినీ బెంబేలెత్తించేలా చేస్తోంది. ఈ సంస్థ ప్రతి నెలా ఆ రాష్ర్టంలోని ఆన్ని నగరాల్లో వాయు కాలుష్యంపై డాటా విడుదల చేస్తుంది. గాలిలో ధూళికణాల శాతం పదిగా నమోదైంది. రద్దీ సమయంలో ఇది గంటకు 2.5గా ఉంటోందని తన నివేదికలో హెచ్‌ఎస్‌పీసీబీ పేర్కొంది. ఇంకా దీనితోపాటు కార్బన్, నైట్రోజన్ల శాతం గణనీయంగా పెరిగిందని తెలిపింది. కాగా నగరంలో ఇటీవలి కాలంలో నిర్మాణ రంగ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇది కూడా వాయు నాణ్యత క్షీణించడానికి ఓ కారణంగా మారిపోయింది. దీంతోపాటు రహదారుల నిర్మాణం కూడా జోరుగా జరుగుతోంది. భవనాల నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండడంతో గాలిలో దుమ్ముధూళి కణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏదైనా ఓ రహదారి నిర్మాణ పనులు చేపడితే అది ఎడతెగకుండా కొనసాగుతుండడం ఈ సమస్యను మరింత జటిలం చేస్తోంది. నగరంలోని గోల్ఫ్‌కోర్సు ప్రాంతంలో నివశిస్తున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. ఈ ప్రాంత పరిధిలో విషవాయువులు గాలిలో కలవడంతో స్థానికులకు ఒక్కొక్కసారి ఊపిరాడని పరిస్థితి తలెత్తుతోంది. అగ్నికి ఆజ్యం విద్యుత్ కోతలు వాయు నాణ్యత క్షీణించడానికి ఓ కారణంగా మారిపోయింది. విద్యుత్ సరఫరాలో కోతల కారణంగా అనేకమంది డీజిల్ జనరేటర్లను వాడుతున్నారు. ఇందుకోసం డీజిల్‌ను వినియోగిస్తున్నారు. దీంతో వాయు నాణ్యత నానాటికీ తగ్గిపోతోంది. -
ఢిల్లీ-ఎన్సీఆర్ల మధ్య 5,500 ఆటోలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి ఎన్సీఆర్కు వెళ్లే ప్రయాణికుల సమస్యలు తొలగిపోనున్నాయి. ఇందుకోసం ఢిల్లీ రవాణా విభాగం 5,500 ఆటోలకు పర్మిట్లు జారీ చేయాలని నిర్ణయించింది. యూపీ, హర్యానాల కిందకు వచ్చే ఎన్సీఆర్ కోసం 2,750- 2,750 ఆటోలకు పర్మిట్లు జారీచేయనుంది. ఈ మేరకు ఢిల్లీ రవాణా విభాగం దరఖాస్తులను ఆహ్వానించింది. డిసెంబర్ 20 వరకు రవాణా విభాగానికి చెందిన బురాడీ క్యాలయంలో పర్మిట్ల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల పరిశీలన తరువాత డ్రా ద్వారా పర్మిట్లు జారీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పర్మిట్లు జారీ చేయడంలో మహిళలకు ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఢిల్లీ నుంచి గాజియాబాద్, నోయిడా, గుర్గావ్, ఫరీదాబాద్ వెళ్లే ప్రయాణికుల వ్యయ ప్రయాసలు తగ్గనున్నాయి. -
అభాగ్యులకు డీయూఎస్ఐబీ అండ
న్యూఢిల్లీ: చలికాలం వచ్చిందంటే ఇళ్లలోనే దుప్పట్లు..ఎవరి మోతాదులో వారు చలిని తట్టుకొనేందుకు కుస్తీపడుతుంటారు. మరీ! ఇళ్లులేని నిరుపేదలు, ఇంకా చెప్పాలంటే ఇల్లేకాదు, ఏ అండా ఆ దెరువు లేనోళ్లు చలికాలంలో గజగజ వణుకుతూ వీధుల వెంటే ఏ చెట్టుకిందో..పుట్టకిందో తలదాచుకొంటారు. అలాంటి అనాధలు, అభాగ్యులకు, వలస వచ్చే ప్రజలకు ఢిల్లీ పట్టణ నివాస అభివృద్ధి బోరు ్డ(డీయూఎస్ఐబీ)అండగా ఉంటానంటోంది. ఇందులో భాగంగా చలికాలంలో వారికి కనీస సౌకర్యాలను కల్పించడానికి నడుంబిగించింది.పెరుగుతున్న వలసలు: రోజురోజుకూ దేశ రాజధాని ప్రాంతానికి(ఎన్సీఆర్) వలసల తాకిడి పెరుగుతోంది. భవిష్యత్‌లో ఇదే ప్రధాన సవాల్‌గా మారనుంది. దీన్ని అధిగమించడానికి సెప్టెంబర్‌లోనే ప్రణాళిక సిద్ధం చేసింది. అన్నీ సంపూర్తిగా పూర్తి అయ్యాయి. చలికాలాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని డీయూఎస్ఐబీ డెరైక్టర్ కమల్ మల్హోత్రా మంగళవారం తెలిపారు. ఇప్పటికే 20,000 శద్దర్లు, 5,000 డేరాలు,5,000 జ్యూట్ మ్యాట్లకు ఆర్డర్లు ఇచ్చామని చెప్పారు. బహిరంగ టెండర్లు నిర్వహించామని, త్వరలోనే సామగ్రి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. నగరంలో వలసలు ప్రధాన సమస్యగా మారిందని అన్నారు. ఆశ్రయం పొందేవారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అయితే ఈ సమస్య తీవ్రమవుతున్నప్పటికీ నివాసం కల్పించాల్సిన బాధ్యత తమపై ఉంది. కానీ, అంత స్థలం అందుబాటులో లేదని అన్నారు.ఇప్పటికే 184 షెల్టర్లు..: ఇప్పటికే నగరంలో 184 రాత్రి షెల్టర్లు ఉన్నాయి, ఇందులో సుమారు 14,500 మంది ఆశ్రయం పొందుతున్నారు. వలసలు ఇలా పెరిగితే వారి అవసరాలు తీర్చలేమని, అయినప్పటికీ సాధ్యమైనన్ని రాత్రి షెల్టర్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. 7,000 వేల చదరపు మీటర్ల స్థలాన్ని డీడీఏ నుంచి కొనుగోలు చేశామని, మరో ప్రాంతంలో కూడా ఇలాగే తీసుకోనున్నామని చెప్పారు, ఇంకో రెండు షెల్టర్లు నవంబర్ 30 వరకు యమున పుస్తాలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వైద్యసేవలు: ఇళ్లులేని పేదలకు తక్షణమే వైద్యపరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ సూచించారని, ఈ మేరకు ఇళ్లలేని వారికి వైద్యపరీక్షలు కూడా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని కమల్ మల్హోత్రా చెప్పారు. ఆరోగ్యశాఖ అదనపు డెరైక్టర్ డాక్టర్ కేఎస్ భగోటియా తన బృందంతో డీయూఎస్ఐబీ సహకరిస్తారని చెప్పారు. సంచార వైద్య బృందాలు అన్ని ప్రాంతాల్లో షెల్టర్లలో ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రధానంగా ఈ షెల్టర్లలో ఉండేవారు క్షయ, హెచ్ఐవీ భారిన పడుతున్నారని చెప్పారు. వీరందరికీ అవసరమైన వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. మరో ప్రధాన సమస్య నగరంలో మాదక ద్రవ్యాల బానిసలు పెరిగిపోతున్నారని, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. -
ఢిల్లీ ‘చుట్టూ’ కేంద్ర మంత్రులు
* ఎన్సీఆర్లోని అన్ని ప్రాంతాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం * ప్రాజెక్టులు వేగవంతమయ్యే అవకాశం * ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి సాక్షి, న్యూఢిల్లీ: మన్మోహన్సింగ్ కేబినెట్‌తో పోలీస్తే నరేంద్ర మోదీ కేబినెట్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం తగ్గినప్పటికీ జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత లభించింది. తాజా కేబినెట్ విస్తరణలో మహేశ్ శర్మకు మంత్రిపదవి లభించడంతో ఢిల్లీ- ఎన్సీఆర్ నుంచి ఐదుగురికి మంత్రిపదవులు దక్కాయి. దీనితో ఢిల్లీ- ఎన్సీఆర్లో పెండింగులో ఉన్న అనేక ప్రాజెక్టుల అమలులో వేగం వస్తుందన్న ఆశలు మొదలయ్యాయి. ఢిల్లీకి చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి కేంద్ర కేబినెట్లో చోటు దక్కిన ఐదుగురు మంత్రులలో ఒకరు కేబినెట్ మంత్రి హర్షవర్ధన్ కాగా మిగతా మిగతావారు వీకే సింగ్, రావ్ ఇందర్‌జీత్‌సింగ్, మహేశ్ శర్మ, కృష్ణపాల్ సహాయ మంత్రులుగా ఉన్నారు. వీరిలో జనరల్ వీకే సింగ్ ఘజియాబాద్‌కు, రావ్ ఇందర్జీత్ సింగ్ గుర్గావ్కు, మహేశ్ శర్మ నోయిడాకు, కృష్ణపాల్ ఫరీదాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఐదుగురు మంత్రుల సమన్వయంతో ఢిల్లీ ఎన్సీఆర్ల మధ్య రోడ్డు, రవాణా, నీటిసరఫరా, విద్యుత్తు రంగాలలో ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న ప్రాజెక్టులు వేగం పుం జుకుంటాయని ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, మీరట్, పానిపట్‌లతో ముడిపడిన రాపిడ్ రైలు ప్రాజెక్టుకు పచ్చజెండా లభిస్తుందని, యమునా నది నీటి పంపకంపై హర్యానా ప్రభుత్వంతో వివాదానికి పరి ష్కారం లభిస్తుందని, బవానా విద్యుత్తు ప్లాంటుకు గ్యాస్ లభిస్తుందని, ఈస్టర్న్, వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులు వేగంగా అమలవుతాయని ఆశిస్తున్నారు. అంతేకాక ఈ ఐదుగురు మంత్రుల వల్ల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలు మరింత మెరుగుపడవచ్చని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎన్సీఆర్ ప్రాంతాలకు చెందిన నలుగురు మంత్రులు సరిహద్దు నియోజకవర్గాలలోని ఓటర్లను ప్రభావితం చేస్తారని, బీజేపీ వారిని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటుందని అంటున్నారు. హర్షవర్ధన్ పలుకుబడి కృష్ణానగర్‌తో పాటు చాందినీచౌక్ పరిధిలోని నియోజకవర్గాల ఓటర్లపై ప్రభావం చూపుతుందని బీజేపీ వర్గాలు ఆశిస్తున్నాయి. అలాగే రావ్ ఇందర్జీత్ సింగ్ దక్షిణఢిల్లీలోని సరిహద్దు నియోజకవర్గాల ఓటర్లను, ముఖ్యంగా జాట్ ఓటర్లను, కృష్ణపాల్ గుర్జర్ గుజ్జర్ ఓటర్లు అధికంగా ఉన్న తుగ్లకాబాద్, బదర్‌పుర్ నియోజకవర్గాలను ప్రభావితం చేస్తారని వారు అంటున్నారు. నోయిడా ఎంపీ మహేశ్ శర్మ ట్రాన్స్ యమునా ప్రాంతంలోని నియోజకవర్గాలను ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్లను ఆకట్టుకోగలరని ఆశిస్తున్నారు. ఎన్సీఆర్కు చెందిన నలుగురు మంత్రుల ప్రభావం తుగ్లకాబాద్, బదర్‌పుర్, మెహ్రోలీ, బిజ్వాసన్, ద్వారకా, కోండ్లీ, త్రిలోక్‌పురి, పట్పర్గంజ్, సీమాపురి, షహదరా, రోహతాస్, విశ్వాస్‌నగర్ నియోజకవర్గాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
డీజేబీలో కుంభకోణం 21 ప్రాంతాల్లో సీబీఐ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ జల్ బోర్డులో అవకతవకలపై విచారణ జరుపుతున్న సీబీఐ గురువారం ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడాలలోని 21 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లకు మోటారు పంపులు, గేర్ బాక్సులు తదితర పరికరాల సరఫరాలో అవకతవకలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలొచ్చిన సంగతి విదితమే. ఈ ప్లాంట్లకు నాసిరకం పరికరాలను అత్యధిక ధరకు సరఫరా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో డీజేబీలోని యుటిలిటీ సర్వీసు విభాగంలోని ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఐదుగురు జూని యర్ ఇంజనీర్లపై ఐదు ఎఫ్ఐఆర్లు దాఖలయ్యా యి. ఈ అధికారులు ప్రయివేటు కంపెనీలతో కుమ్మక్కై చౌక ధరలకు లభించే నకిలీ విడిభాగాలను అధిక ధరలకు సరఫరా చేసి ప్రభుత్వాన్ని ఆరు కోట్ల రూపాయల మేర మోసగించారని సీబీఐ ఆరోపించింది. నకిలీ పత్రాలతో అధికారులు ప్రైవేటు కంపెనీని మాన్యుఫాక్చరింగ్ కంపెనీ అధీకృత డీలర్‌గా చూపించారని సీబీఐ ఆరోపించింది. సీవేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లకు ఉపయోగించే గేర్ బాక్సులు, మోటారు పంపులు, ఇతర విడిభాగాల విషయంలో మోసం జరిగిందని సీబీఐ ఆరోపించింది.కాగా మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లకు మోటారు పంపులు, గేర్ బాక్సులు తదితర పరికరాల సరఫరాలో అవకతవకలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలొచ్చిన సంగతి విదితమే. -
ఎన్సీఆర్పై ఆప్ కన్ను
ఘజియాబాద్: ఢిల్లీ ఎన్నికల్లో ఆరంభంలోనే అదరగొట్టిన సామాన్యుడి పార్టీ జాతీయ ప్రాదేశిక ప్రాంతం(ఎన్సీఆర్)లోనూ పట్టు బిగించడంపై దృష్టి సారించింది. భవిష్యత్‌లో ఇక్కడ కూడా మంచి ఫలితాలను రాబట్టేందుకు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కసరత్తు చేస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రధాన పార్టీలను అధిగమించి మెరుగైన ఫలితాలు రాబట్టుకోవాలని యోచిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ్ నగర్ (నోయిడా), గుర్గావ్, ఫరీదాబాద్, మీరట్, జైపూర్‌కు చెందిన అనేక మంది ఆప్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. ఓటర్ను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఆప్‌కు అనుకూలంగా మలచడంలో వీరు కీలకపాత్ర పోషించారు. ఇలాంటి వారు ఉంటున్న నగరాల్లో కొత్త పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తే చెప్పుకోదగ్గ ఫలితాలు వస్తాయనే ప్రచారం ఊపందుకోంది. ఆయా నగరాల్లో ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని ఆప్ కార్యకర్తలు అంటున్నారు. సాధారణ ఎన్నికల్లో ఢిల్లీ, జాతీయ ప్రాదేశిక ప్రాంతంలో తమ పార్టీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని ఆప్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే మనీశ్ సిసోడియా విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏడు లోక్‌సభ సీట్లు ఉన్నాయని, జాతీయ ప్రాదేశిక ప్రాంతంలో ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ్ నగర్ (నోయిడా), గుర్గావ్, ఫరీదాబాద్, మీరట్, జైపూర్, రోహతక్, హిస్సార్, కురుక్షేత్ర, సోనిపట్ స్థానాలు ఉన్నాయని అన్నారు. గౌతమ్‌బుద్ధ్ నగర్లో ఇప్పటికే సాధారణ ఎన్నికలకు పార్టీ మద్ధతుదారులు సన్నద్ధమవుతున్నారని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించిన స్థానిక పార్టీ కార్యకర్తలకు నోయిడాకు చెందిన ఆప్ మద్దతుదారుడు అనూప్ ఖన్నా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ప్రభావం ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీల హవాకు ఆప్ పార్టీ బ్రేకులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాన్యుల ఆలోచన విధానాన్ని మార్చడంలో కేజ్రీవాల్ సఫలీకృతులయ్యారన్నారు. ఒకవేళ ఆప్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఢిల్లీతో పాటు జాతీయ ప్రాదేశిక ప్రాంత ఓటర్లు భారీ స్థాయిలో మద్దతు పలుకుతారన్నారు. అవినీతికి వ్యతిరేకంగా జనలోక్‌పాల్ బిల్లు కోసం ఢిల్లీలో అన్నా హజారే దీక్ష చేసినప్పుడు నోయిడాకు నుంచి పదివేల మంది వెళ్లి మద్దతుగా నిలిచారని నోయిడా లోక్ మంచ్ ప్రధాన కార్యదర్శి మహేశ్ సక్సేనా అన్నారు. సామాజిక సమస్యలపై ఇంత మంచి అవగాహన ఉన్న ప్రజలు ఆప్ పోటీ చేస్తే అక్కున చేర్చుకుంటారన్నారు. -
ఎన్సీఆర్లో ఇళ్లకు భారీ గిరాకీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లో ఆవాసాలకు గిరాకీ పెరిగింది. తొలి ఆరు నెలల కాలంలో 18 శాతంమేర ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ ఆరు నెలల కాలంలో మొత్తం 35 వేల ఇళ్లు అమ్ముడుపోయాయి. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం మెరుగుపడిందనేందుకు సంకేతంగా నిలిచిందని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. చౌక ధరల ఇళ్లకు మంచి గిరాకీ ఉందని, 2012లో కంటే ఈ ఏడాది విక్రయాలు బాగా పెరిగాయని తెలిపింది. ఇక గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో 14,300 ఇళ్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ ప్రాంతంలో అమ్ముడైన ఇళ్ల సంఖ్య 3,750 మాత్రమే. గుర్గావ్, నోయిడా ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు కొంతమేర తగ్గిపోయాయి. గతంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయడంపైనే బిల్డర్లు దృష్టి సారించారని, కొత్తవాటి జోలికి వెళ్లడం లేదని, కొనుగోలుదార్ల సెంటిమెంట్ కూడా గుర్గావ్, నోయిడా ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టడానికి కారణమైందని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. అయితే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే తదితర ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ దాకా ఈ రెండుచోట్ల దాదాపు 49 వేల యూనిట్లు అమ్ముడుపోయాయి. 2012తో పోలిస్తే ఈ రెండు ప్రాంతాల్లో ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు 11 శాతం మేర పెరిగాయి. జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లో ఈ ఏడాది 5.4 లక్షల ఆవాసాలు నిర్మాణదశలో ఉన్నాయి. ఇందులో 1.32 లక్షల యూనిట్లు ఇంకా అమ్ముడుపోలేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్థిరంగా ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. డిమాండ్‌ను అందుకునే దిశగానే బిల్డర్లు అడుగులు వేస్తున్నారన్నారు. 2010తో పోలిస్తే గడచిన రెండు సంవ త్సరాల్లో జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లో ఇళ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.