
న్యూఢిల్లీ: ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో జరుగుతున్న నిర్మాణాలపై ప్రస్తుతం అమలవుతున్న ఆంక్షలను సుప్రీంకోర్టు పాక్షికంగా ఎత్తివేసింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు నిర్మాణాలు చేపట్టుకోవచ్చని స్పష్టంచేసింది. అయితే సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం స్పష్టం చేసింది. భవన నిర్మాణాలను, కూల్చివేతలను తాత్కాలికంగా ఆపివేయాలంటూ గత నెల 4న సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.