న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు విధించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (జీఆర్‌ఏపీ-4) నిబంధనలను సడలించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం దేశ రాజధానిలో గాలి నాణ్యత సూచి చాలా పేలవమైన కేటగిరిలో కొనసాగుతోందని.. ఇది మరింత స్థాయికి చేరినప్పుడు మాత్రమే నిబంధనలను సడలించేందుకు అనుమతిస్తామ తెలిపింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఢిల్లీ కాలుష్యంపై విచారణ చేపట్టింది.
ఢిల్లీలో జీఆర్‌పీఏ నిబంధనల కారణంగా ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులకు పరిహారం చెల్లించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ, హర్యాణ, రాజస్థాన్, యూపీ రాష్ట్రాలకు చెందిన ఆయా విభాగాల ప్రధాన కార్యదర్శలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిసెంబర్ 5న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
‘భవన నిర్మాణ కార్మికులకు పరిహారం చెల్లించాలన్న మా ఆదేశాలను ఎన్సీఆర్ రాష్ట్రాలు ఏవీ పాటించలేదని మేము గుర్తించాము. పైసా చెల్లించినట్లు కూడా రుజువు చూపలేదు. ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు(వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని ఆదేశిస్తున్నా. వారికి సమన్లు జారీ చేస్తేనే వారు సీరియస్‌గా తీసుకుంటారు,’అని ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment