NCR region
-
Delhi: ఆంక్షల సడలింపునకు సుప్రీంకోర్టు నిరాకరణ..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు విధించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (జీఆర్ఏపీ-4) నిబంధనలను సడలించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం దేశ రాజధానిలో గాలి నాణ్యత సూచి చాలా పేలవమైన కేటగిరిలో కొనసాగుతోందని.. ఇది మరింత స్థాయికి చేరినప్పుడు మాత్రమే నిబంధనలను సడలించేందుకు అనుమతిస్తామ తెలిపింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఢిల్లీ కాలుష్యంపై విచారణ చేపట్టింది.ఢిల్లీలో జీఆర్‌పీఏ నిబంధనల కారణంగా ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులకు పరిహారం చెల్లించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ, హర్యాణ, రాజస్థాన్, యూపీ రాష్ట్రాలకు చెందిన ఆయా విభాగాల ప్రధాన కార్యదర్శలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిసెంబర్ 5న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.‘భవన నిర్మాణ కార్మికులకు పరిహారం చెల్లించాలన్న మా ఆదేశాలను ఎన్సీఆర్ రాష్ట్రాలు ఏవీ పాటించలేదని మేము గుర్తించాము. పైసా చెల్లించినట్లు కూడా రుజువు చూపలేదు. ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు(వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని ఆదేశిస్తున్నా. వారికి సమన్లు జారీ చేస్తేనే వారు సీరియస్‌గా తీసుకుంటారు,’అని ధర్మాసనం పేర్కొంది. -
టాయ్స్‌లో ‘రోవన్’ ద్వారా రిలయన్స్ విస్తరణ
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ ఎక్కువ అమ్మకాలు నమోదయ్యే ఆట బొమ్మల మార్కెట్లో ‘రోవన్’ బ్రాండ్ ద్వారా వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తోంది. చిన్న సైజు షాపుల రూపంలో రోవన్ బ్రాండ్‌ను మరింత మందికి చేరువ చేయాలన్న ప్రణాళికతో ఉంది. టాయ్స్ పంపిణీ వ్యాపారాన్ని ఇప్పటి వరకు రోవన్ ద్వారా నిర్వహిస్తుండగా, దీన్నే ప్రధాన బ్రాండ్‌గా కస్టమర్ల ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని గురుగ్రామ్‌లో మొదటి ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ తెరవనుంది. తన టాయ్స్ అవుట్‌లెట్‌లో రోవన్ బ్రాండ్ ఆటబొమ్మలే కాకుండా, ఇతర బ్రాండ్ల అందుబాటు ధరల్లోని వాటినీ ఉంచనుంది. రిలయన్స్ రిటైల్ కింద బ్రిటిష్ టాయ్ రిటైల్ బ్రాండ్ హ్యామ్లేస్ కూడా ఉన్న విషయం తెలిసిందే. దీన్ని 2019లో కొనుగోలు చేసింది. హ్యామ్లేస్ ప్రీమియం టాయ్స్‌కు సంబంధించిన బ్రాండ్‌గా కొనసాగనుంది. రోవన్ బ్రాండ్‌ను 500–1000 చదరపు అడుగుల విస్తీర్ణం సైజు అవుట్‌లెట్స్‌తో, బడ్జెట్ ఆటబొమ్మలతో నిర్వహించాలన్నది సంస్థ ప్రణాళికగా రియలన్స్ రిటైల్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ గౌరవ్జైన్ తెలిపారు. -
హైదరాబాద్ టూ వరంగల్.. రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్..
నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉన్న రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలి దశలో హైదరాబాద్ - వరంగల్, మలి దశలో హైదరాబాద్ - విజయవాడల మధ్య ఈ ట్రాన్సిట్ కనెక్టివిటీ అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీ- ఘజియాబాద్ - మీరట్ మార్గంలో రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (ఆర్ఆర్టీఎస్) నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆర్ఆర్టీఎస్ విధానం రెగ్యులర్ రైల్వే నెట్వర్క్, సబర్బన్ మెట్రో రైల్లకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రెండు నగరాల మధ్య వేగంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రత్యేక ట్రాక్‌లను, నియంత్రణ వ్యవస్థలను నిర్మిస్తారు. ఈ మార్గంలో రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది ప్రస్తుతం నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఢిల్లీ నుంచి హర్యాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో పలు నగరాలను కలుపుతూ మూడు కారిడార్లలో ఆర్ఆర్టీఎస్ పనులు సాగుతున్నాయి. ఈ మేరకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్సిట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుకి నిధులు సమకూరుస్తున్నాయి. ఇదే పద్దతిలో తెలంగాణలోనూ ఆర్‌ఆర్‌టీఎస్‌ను చేపట్టాలని ఇక్కడి సర్కార్ నిర్ణయించింది. ఆర్ఆర్టీఎస్ నెట్‌వర్క్‌పై చర్చించేందుకు తెలంగాణకు చెందిన వివిధ విభాగాల అధికారులు ఆర్‌ఆర్‌టీఎస్‌కి సంబంధించి అంచనా వ్యయం, వనరుల లభ్యత తదితర అంశాలపై పూర్తి వివరాలను అధ్యయనం చేయనున్నారు. ఈ మేరకు త్వరలో అధికారుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం. వీరు సమర్పించే నివేదిక ఆధారంగా ఈ ప్రాజెక్టు చేపట్టాలా వద్దా అనేది తేలనుంది దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ పార్క్‌ని వరంగల్‌లో ప్రారంభించారు. వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లను నిర్మిస్తున్నాయి. అయితే వరంగల్‌లో ఎయిర్పోర్ట్ లేకపోవడం లోటుగా మారింది. ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు తెలంగాణ సర్కార్ ఓ వైపు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరోవైపు ఆర్ఆర్టీఎస్ వంటి నెట్వర్క్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ - వరంగల్ల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. పారిశ్రామికంగా వరంగల్‌కు ఇది ఎంతో ఉపయోగకరం. -
ఢిల్లీలో కట్టడిపై మోదీ ప్రశంస
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగాల కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ ఆవలంబించిన విధానాలనే జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లోనూ అమలు చేసి, మహమ్మారిని అదుపు చేయాలని సూచించారు. అదేవిధంగా, కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్న రాష్ట్రాలు, ప్రాంతాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కంటైన్మెంట్ అమలు తీరుపై సమీక్ష జరిపి, సూచనలను ఎప్పటికప్పుడు అందిస్తుండాలని కూడా ఆయన కోరారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్–19 పరిస్థితి, ఆయా రాష్ట్రాల సన్నద్ధతపై ప్రధాని మోదీ శనివారం సమీక్ష జరిపారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వైరస్‌ను వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు వ్యక్తిగత పరిశుభ్రత, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో రాజీకి తావులేదన్నారు. ఈ జాగ్రత్తలపై యంత్రాంగాలు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కరోనా బాధితులను ఇంటివద్దే పర్యవేక్షించి, వైద్యం అందించే ‘ధన్వంతరి రథ్’ విధానం ఫలితాలను ఇచ్చిందనీ, దీనిని మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా పాల్గొన్నారు. -
కుంభమేళా కోసం ప్రత్యేక మొబైల్ యాప్
లక్నో: అలహాబాద్‌లో జనవరి 15 నుంచి జరగనున్న కుంభమేళా కోసం నార్త్ సెంట్రల్ రైల్వే(ఎన్సీఆర్) ప్రత్యేకంగా ’రైల్ కుంభ సేవా మొబైల్ యాప్’ ను ఆవిష్కరించింది. కుంభ మేళాలో పాల్గొనేందుకు అలహాబాద్‌ను సంద ర్శించే భక్తులు, పర్యాటకులు, ఇతర ప్రయా ణికులకు అవసరమైన సమాచారాన్ని అందించ డానికి ఈ యాప్‌ను రూపొందిం చినట్టు ఎన్సీఆర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అమిత్ మాల్వియ తెలిపారు. ఈ యాప్ కుంభమేళా ప్రత్యేక రైళ్లకు సంబంధించిన సమాచారం, రిజర్వ్ సీట్లు, రిజర్వు కాని సీట్ల వివరాలను తెలియజేస్తుందని ఆయన చెప్పారు. ఏ సమ యంలోనైనా, ఎక్కడినుంచైనా కుంభమేళా కు సంబంధించిన సమాచారం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. భక్తులు తమ ప్రస్తుత స్థానంతో పాటు, అలహాబాద్‌లోని అన్ని రైల్వేస్టేషన్లు, మేళా ప్రాంతం, ప్రధాన హోట ళ్ళు, బస్స్టేషన్లు, ఇతర సౌకర్యాలకు సంబం ధించిన సమాచారం కూడా ఈ యాప్ ద్వారా పొందొచ్చని చెప్పారు. పార్కింగ్, అల్పాహార గదులు, వేచి ఉండు గదుల సమాచారం కూడా ఈ యాప్ అందిస్తుందన్నారు. -
బిజినెస్‌కి బెంగళూరు భేష్..
న్యూఢిల్లీ: ఐటీ రంగానికి సంబంధించి దేశీ సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరు భారత్‌లో వ్యాపారాల నిర్వహణకు అత్యంత అనుకూలమైన నగరంగా అగ్రస్థానం దక్కించుకుంది. హైదరాబాద్ 12వ స్థానంలో, విశాఖపట్నం 21వ స్థానంలో నిల్చాయి. గ్లోబల్ ఇనీషియేటివ్ ఫర్ రీస్ట్రక్చరింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ మేనేజ్మెంట్ (జిరెమ్), రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ దిగ్గజం డీటీజెడ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నగర అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాలు, మానవవనరులు, నగర సంస్కృతి, జీవన ప్రమాణాలు, రవాణా సౌకర్యాలు, నీరు, వసతి వంటి అంశాలను దీనికి ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈ జాబితాలో బెంగళూరు తర్వాత చెన్నై, ముంబై, పుణే నగరాలు వరుసగా తర్వాత స్థానాలు దక్కించుకోగా ఢిల్లీకి అసలు చోటు దక్కలేదు. అయితే, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని నోయిడా (17), గుర్గావ్ (19)లకు స్థానం లభించింది. మొత్తం 21 నగరాలను ఈ సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో కొన్ని మాత్రమే పూర్తి స్థాయిలో వ్యాపార కేంద్రాలుగా రూపొందాయని, మిగతావి మరింత ఎదిగేందుకు అవకాశం ఉందని జిరెమ్ చైర్మన్ సంకే ప్రసాద్ వివరించారు. ఈ నగరాలకి ఇచ్చిన ర్యాంకింగ్‌ని బట్టి భవిష్యత్‌లో పెట్టుబడుల అవకాశాల గురించి వ్యాపార సంస్థలకు ఒక అవగాహన లభించగలదని ఆయన పేర్కొన్నారు. మెట్రో నగరాలు ఇప్పటికే ర్దీగా మారడంతో పెట్టుబడులకు, వ్యాపార నిర్వహణకు అనువైన కొత్త ప్రాంతాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా ద్వితీయ శ్రేణి నగరాలను మెరుగుపర్చాల్సి ఉంటుందని ప్రసాద్ పేర్కొన్నారు. ఒకవైపు మెట్రోల్లో రద్దీని తగ్గించేందుకు, మరోవైపు ద్వితీయ శ్రేణి నగరాల్లో టాలెంట్‌ని ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడగలదని చెప్పారు. జాబితాలో మరిన్ని నగరాలు... సర్వే ప్రకారం ఇండోర్ (5వ ర్యాంకు), భువనేశ్వర్ (6), కోయంబత్తూర్ (7), అహ్మదాబాద్ (8), నాగ్‌పూర్ (9), కొచ్చి 10వస్థానం దక్కించుకున్నాయి. అలాగే చండీగఢ్‌కి 11వ స్థానం, మంగళూరు (13), వడోదర (14), జైపూర్ (15), కాలికట్ (16), కోల్‌కతా (18), నవీ ముంబై 20వ స్థానాల్లో నిల్చాయి.