న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ ఎక్కువ అమ్మకాలు నమోదయ్యే ఆట బొమ్మల మార్కెట్లో ‘రోవన్’ బ్రాండ్ ద్వారా వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తోంది. చిన్న సైజు షాపుల రూపంలో రోవన్ బ్రాండ్‌ను మరింత మందికి చేరువ చేయాలన్న ప్రణాళికతో ఉంది. టాయ్స్ పంపిణీ వ్యాపారాన్ని ఇప్పటి వరకు రోవన్ ద్వారా నిర్వహిస్తుండగా, దీన్నే ప్రధాన బ్రాండ్‌గా కస్టమర్ల ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) పరిధిలోని గురుగ్రామ్‌లో మొదటి ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్‌లెట్ తెరవనుంది.
తన టాయ్స్ అవుట్‌లెట్‌లో రోవన్ బ్రాండ్ ఆటబొమ్మలే కాకుండా, ఇతర బ్రాండ్ల అందుబాటు ధరల్లోని వాటినీ ఉంచనుంది. రిలయన్స్ రిటైల్ కింద బ్రిటిష్ టాయ్ రిటైల్ బ్రాండ్ హ్యామ్లేస్ కూడా ఉన్న విషయం తెలిసిందే. దీన్ని 2019లో కొనుగోలు చేసింది. హ్యామ్లేస్ ప్రీమియం టాయ్స్‌కు సంబంధించిన బ్రాండ్‌గా కొనసాగనుంది. రోవన్ బ్రాండ్‌ను 500–1000 చదరపు అడుగుల విస్తీర్ణం సైజు అవుట్‌లెట్స్‌తో, బడ్జెట్ ఆటబొమ్మలతో నిర్వహించాలన్నది సంస్థ ప్రణాళికగా రియలన్స్ రిటైల్ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ గౌరవ్‌జైన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment