Outlet
-
రేపు వేల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రారంభం
హైదరాబాద్: వేల్యూ జోన్ హైపర్ మార్ట్ కొత్త అవుట్లెట్ మాల్ హైదరాబాద్‌లోని పటాన్చెరులో గురువారం (రేపు) ప్రారంభం కానుంది. సినీ నటుడు బాలకృష్ణ లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. ఇందులో ప్రముఖ బ్రాండ్లపై 40% డిస్కౌంట్ లభిస్తుంది. అవుట్లెట్ చుట్టుపక్కల ఇక్రిశాట్, నిమ్జ్, ఐఐటీ, ప్రధాన సంస్థలు ఉండటంతో విద్యార్థులు, కుటుంబాలు, నిపుణులను మాల్ ఆకర్షిస్తుందన్న విశ్వాసాన్ని యాజమాన్యం వ్యక్తం చేసింది. ‘‘మాల్ ఆర్కిటెక్చర్, లేవుట్ నిర్మాణం భాగ్యనగర సంస్కృతి, అభివృద్ధికి వేదికగా నిలిచింది. వెడలై్పన కారిడార్లు, సహజకాంతి, అధునాతన పద్ధతుల్లో రూపొందించిన స్టోర్ల మిశ్రమం సందర్శకులకు గొప్ప షాపింగ్ అనుభూతి పంచుతాయి’’ అని యాజమాన్యం వివరించింది. -
రిటైల్ విక్రయాల్లోకి సుగ్న స్టీల్స్
హైదరాబాద్: చిన్న నిర్మాణాలకు కూడా ఫ్యాక్టరీ ధరలకే స్టీల్‌ను అందించే ఉద్దేశంతో సుగ్న మెటల్స్ సంస్థ రిటైల్ విక్రయాల్లోకి ప్రవేశించింది. రోహిత్ స్టీల్స్‌తో కలిసి హైదరాబాద్‌లో తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. 8 ఎం.ఎం. మొదలుకుని 32 ఎంఎం వరకు వివిధ ఉక్కు ఉత్పత్తులను ఎన్ని టన్నులైనా ఈ స్టోర్ నుంచి కొనుగోలు చేయొచ్చని సుగ్నా చైర్మన్ భరత్ కుమార్ అగ్రవాల్ తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ సహా దక్షిణాదిలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు టీఎంటీ స్టీల్‌ను సరఫరా చేస్తున్నట్లు వివరించారు. పరిగిలోని తమ సొంత ప్లాంటులో రోజుకు 1,300 టన్నుల ఉక్కును ఉత్పత్తి కంపెనీ సేల్స్ ప్రెసిడెంట్ నితిన్ జైన్ తెలిపారు. తమ ఉత్పత్తుల రిటైల్, హోల్‌సేల్ పంపిణీ కోసం ఎక్స్‌క్లూజివ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్‌గా రోహిత్ స్టీల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. -
టాయ్స్‌లో ‘రోవన్’ ద్వారా రిలయన్స్ విస్తరణ
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ ఎక్కువ అమ్మకాలు నమోదయ్యే ఆట బొమ్మల మార్కెట్లో ‘రోవన్’ బ్రాండ్ ద్వారా వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తోంది. చిన్న సైజు షాపుల రూపంలో రోవన్ బ్రాండ్‌ను మరింత మందికి చేరువ చేయాలన్న ప్రణాళికతో ఉంది. టాయ్స్ పంపిణీ వ్యాపారాన్ని ఇప్పటి వరకు రోవన్ ద్వారా నిర్వహిస్తుండగా, దీన్నే ప్రధాన బ్రాండ్‌గా కస్టమర్ల ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని గురుగ్రామ్‌లో మొదటి ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ తెరవనుంది. తన టాయ్స్ అవుట్‌లెట్‌లో రోవన్ బ్రాండ్ ఆటబొమ్మలే కాకుండా, ఇతర బ్రాండ్ల అందుబాటు ధరల్లోని వాటినీ ఉంచనుంది. రిలయన్స్ రిటైల్ కింద బ్రిటిష్ టాయ్ రిటైల్ బ్రాండ్ హ్యామ్లేస్ కూడా ఉన్న విషయం తెలిసిందే. దీన్ని 2019లో కొనుగోలు చేసింది. హ్యామ్లేస్ ప్రీమియం టాయ్స్‌కు సంబంధించిన బ్రాండ్‌గా కొనసాగనుంది. రోవన్ బ్రాండ్‌ను 500–1000 చదరపు అడుగుల విస్తీర్ణం సైజు అవుట్‌లెట్స్‌తో, బడ్జెట్ ఆటబొమ్మలతో నిర్వహించాలన్నది సంస్థ ప్రణాళికగా రియలన్స్ రిటైల్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ గౌరవ్జైన్ తెలిపారు. -
మెక్ డొనాల్డ్స్ నిర్వాకం: కూల్ డ్రింకులో చచ్చిన బల్లి..చివరికి
అహ్మదాబాద్: కూల్ డ్రింక్స్‌లో పురుగు మందుల అవశేషాలున్నాయని అనేక రిపోర్టులు చెబుతున్నా పట్టించుకోని శీతల పానీయాల ప్రియులకు మరో షాకింగ్ న్యూస్. తాజాగా అహ్మదాబాద్‌లోని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులకు చేదు అనుభవం ఎదురైంది. భార్గవ జోషి అనే వ్యక్తి ఆర్డర్ చేసిన కూల్ డ్రింకులో చచ్చిన బల్లి దర్శనమిచ్చింది. బల్లిని చూసి షాకైన భార్గవ జోషి రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి, ఇందేంటని నిలదీశాడు. అయితే ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్న సిబ్బంది డబ్బులు వాపస్ ఇస్తాం అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంత కడుపు మండి మున్సిపల్ అధికారులకు చేరేలా చేశాడు. ఈ సందర్భంగా తాను వీడియోను పోలీసులకు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు భార్గవ జోషి. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై అహ్మదాబాద్ పురపాలక శాఖ స్పందించింది. మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు రెస్టారెంట్ అవుట్ లెట్‌కు సీల్ వేశారు. కూల్ డ్రింకు శాంపిల్స్ ను పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌కి పంపించినట్టు వెల్లడించారు. Here is video of this incidents happens with me...@McDonalds pic.twitter.com/UiUsaqjVn0 — Bhargav joshi (@Bhargav21001250) May 21, 2022 -
100 ఔట్లెట్లు దాటిన డికాక్షన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీ, కాఫీ వంటి పానీయాల విక్రయంలో ఉన్న డికాక్షన్ 100 స్టోర్ల మైలురాయిని అధిగమించింది. కార్యకలాపాలు మొదలైన ఏడాదిన్నరలోపే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఏపీ, తెలంగాణలో 25 నగరాలు, పట్టణాల్లో 110 స్టోర్లున్నాయని డికాక్షన్ ఫుడ్స్, బెవరేజెస్ కో–ఫౌండర్ అద్దేపల్లి సంతోషి తెలిపారు. ఒక్కటి మినహా మిగిలిన కేంద్రాలన్నీ ఫ్రాంచైజీలవేనని చెప్పారు ‘ఏప్రిల్ నాటికి 130 ఔట్లెట్లు దాటతాం. కర్నాటక నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోనే 70 కేంద్రాలు ఉన్నా యి. ఫ్రాంచైజీల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు. 80 లక్షల మందికిపైగా కస్టమర్లను సొంతం చేసుకున్నాం. మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ వంటి పానీయాలూ విక్రయిస్తున్నాం. ప్రతి కేంద్రానికి 2–4 మందికి ఉపాధి లభిస్తోంది’ అని తెలిపారు. తొలుత ఫ్రాంచైజీ కేంద్రాలు.. సొంత స్టోర్ కంటే ముందే రెండు ఫ్రాంచైజీ కేంద్రాలు ఏర్పాటయ్యాయని డికాక్షన్ కో–ఫౌండర్ అద్దేపల్లి జయ కిరణ్ తెలిపారు. మొదటి 10 ఔట్‌లెట్లూ ఆర్టిస్టులవేనని చెప్పారు. ‘వృత్తిరీత్యా గాయకుడిని. కరోనా కారణంగా కార్యక్రమాలు లేక ఆర్థిక భారం మీద పడింది. ఆ సమయంలో వేడి పానీయాలకు డిమాండ్ ఉండడంతో వ్యవస్థీకృతంగా టీ వ్యాపారం ఎంచుకున్నాం. డికాక్షన్ తొలి కేంద్రం అక్టోబర్ 2020లో హైదరాబాద్ ఏర్పాటైంది. నేను, నా భార్య సంతోషి మూడు నెలలపాటు మా స్టోర్‌లో పనిచేశాం. తొలి 25 ఔట్లెట్లు 2021 మార్చి నాటికి, 50 సెంటర్స్ అక్టోబర్ కల్లా అందుబాటులోకి వచ్చాయి. మూడు నెలల్లోనే వీటికి 50 స్టోర్లు తోడవడం బ్రాండ్ పట్ల నమ్మకానికి నిదర్శనం’ అని వివరించారు. డికాక్షన్ కో–ఫౌండర్స్ జయ కిరణ్, సంతోషి -
నిత్యవసర వస్తువుల అమ్మకాల్లో హిందుస్తాన్ పెట్రోలియం
న్యూఢిల్లీ: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ఇంధనేతర వ్యాపారంలోకి ప్రవేశించింది. హ్యాపీ షాప్ పేరుతో తొలి ఔట్‌లెట్‌ను ముంబైలోని క్లబ్ హెచ్‌పీ పెట్రోల్ పంప్లో ప్రారంభించింది. ఆహార పదార్థాలు, సబ్బులు, ఆరోగ్య సంబంధ ఉత్పత్తులు, బేకరీ, సరుకులు, మందుల వంటివి ఇక్కడ లభిస్తాయి. రోజువారీ అవసరమయ్యే వస్తువులను కస్టమర్ల సౌకర్యార్థం 24 గంటలూ అందుబాటులోకి తేవడం కోసం స్టోర్‌ను తెరిచినట్టు కంపెనీ తెలిపింది. హెచ్‌పీ–పే యాప్ ద్వారా హోమ్ డెలివరీ సౌకర్యమూ ఉంది. ఇతర నగరాల్లోనూ ఇటువంటి కేంద్రాలను ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది. ఖరీదైన కార్లు, బైక్స్ కోసం 100 ఆక్టేన్ రేటింగ్‌తో అల్ట్రా ప్రీమియం గ్రేడ్ పెట్రోల్‌ను పవర్ 100 పేరుతో హెచ్‌పీసీఎల్ అందుబాటులోకి తెచ్చింది. చదవండి: స్పెషల్ ఎకనామిక్ జోన్, 2.15 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు -
అనాథలకు హైహై లంచ్
-
హైదరాబాద్‌లో స్టార్ హైపర్ స్టోర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్ పేరుతో గ్రాసరీ రిటైల్ చైన్లను నిర్వహిస్తున్న ట్రెంట్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇక్కడి గచ్చిబౌలిలో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టార్ హైపర్‌మార్కెట్‌ను ప్రారంభించింది. ఇందుకోసం రూ.8 కోట్ల వ్యయం చేసింది. ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, దుస్తుల వంటి 16,000 పైచిలుకు ఉత్పత్తులు ఇక్కడ కొలువుదీరాయి. వచ్చే మూడేళ్లలో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణే నగరాల్లో 200 ఔట్లెట్లను తెరవనుంది. టాటా, టెస్కోలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ట్రెంట్‌కు ప్రస్తుతం 45 స్టోర్లున్నాయి. 20–25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టార్ హైపర్, 8–10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టార్ మార్కెట్ పేరుతో కేంద్రాలను నిర్వహిస్తున్నట్టు ట్రెంట్ హైపర్‌మార్కెట్ ఎండీ జమ్షెద్ దబూ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. స్టార్ మార్కెట్‌కు ఒక్కో సెంటర్‌కు రూ.4 కోట్ల వ్యయం అవుతుందని చెప్పారు. రూ.25 కోట్లతో పటాన్చెరు వద్ద భారీ గిడ్డంగిని కంపెనీ నెలకొల్పుతోంది. వికలాంగులకు ఉపాధి..: ఒక్కో హైపర్ స్టోర్‌లో 100 మంది, స్టార్ మార్కెట్ కేంద్రానికి 30 మంది సిబ్బందిని కంపెనీ నియమిస్తోంది. సిబ్బందిలో 10% మంది వికలాంగులు ఉన్నారు. వీరి సంఖ్యను 25 శాతానికి చేరుస్తామని జమ్షెద్ తెలిపారు. సామాజిక బాధ్యత కింద ఈ విధంగా చొరవ తీసుకుంటున్నట్టు చెప్పారు. -
జూబ్లీహిల్స్‌లో డీజిల్ టైల్స్ స్టోర్
♦ దేశంలోనే తొలి ఔట్లెట్; ఫ్రాంచైజీ తీసుకున్న హోమ్ 360 ♦ డీజిల్ టైల్స్‌తో పాటూ లైట్లు, సోఫాలు కూడా ♦ వీటితో పాటూ 300 రకాల అంతర్జాతీయ టైల్స్ ♦ మాడ్యులర్ కిచెన్, గృహోపకరణాలు, శానిటరీవేర్ కూడా.. సాక్షి, హైదరాబాద్: డీజిల్.. ఫ్యాషన్ ప్రపంచంలో ఈ పేరు తెలియనివారుండరు. దుస్తులు, పాదరక్షలు, బ్యాగులు, గడియారాలు వంటి ఇతరత్రా యాక్ససరీస్‌కు అంతర్జాతీయ బ్రాండ్. కానీ, ఇప్పుడిదే డీజిల్.. టైల్స్ రూపంలో భాగ్యనగరివాసుల ముందుకొచ్చింది. ఒక్క టైల్సే కాదు.. లైట్లు, సోఫాసెట్లతో నివాస, వాణిజ్య సముదాయాలను కట్టిపడేయనుంది. నగరానికి చెందిన ప్రముఖ బ్రాండెడ్ టైల్స్ సప్లయర్ ‘హోమ్ 360 డిగ్రీస్’.. డీజిల్ సంస్థతో ఒప్పందం చేసుకొని జూబ్లిహిల్స్‌లో డీజిల్ టైల్స్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంస్థ యజమాని, శ్రీనాథ్ ర«థి, పార్టనర్ కె.శారదలు ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. వారింకా ఏమన్నారంటే.. ♦ హోమ్ 360 అనేది కొత్త స్టోరేమీ కాదు. పదేళ్ల క్రితం నుంచే కాచిగూడ కేంద్రంగా దేశ, విదేశీ టైల్స్ సప్లయర్‌గా ఉన్నాం. విస్తరణలో భాగంగా, ప్రధాన నగరంలోనూ సేవలందించాలనే లక్ష్యంతో జూబ్లిహిల్స్‌లో స్టోర్‌ను ఏర్పాటు చేశాం. ప్రాంతానికి తగ్గట్టుగా స్టోర్‌లోనూ ప్రత్యేకత చాటాలనే ఉద్దేశంతో ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ డీజిల్‌తో ఒప్పందం చేసుకొని.. టైల్స్ ఫ్రాంచైజీ తీసుకున్నాం. ఇది దేశంలోనే మొట్టమొదటి డీజిల్ టైల్స్ స్టోర్ ఇదే. ♦ ఇటలీలో తయారైన డీజిల్ టైల్స్‌ను దిగుమతి చేసుకొని నగరం కేంద్రంగా విక్రయిస్తున్నాం. ప్రస్తుతం ఇండస్ట్రియల్ గ్లాసీ, రస్టిక్, డార్క్, లెదర్, మెటాలిక్ వంటి 5 రకాల ఫినిషింగ్ టైల్స్ అందుబాటులో ఉన్నాయి. టైల్స్‌తో పాటూ ఇంటీరియర్ డిజైనింగ్ కోసం లైట్లు, సోఫాసెట్ల వంటివి కూడా ఉన్నాయి. నివాస, వాణిజ్య సముదాయాలు రెండిట్లోనూ వినియోగించుకోవచ్చు. ధరలు చ.అ.కు రూ.600 నుంచి 1,200 మధ్య ఉన్నాయి. టైల్ మీద డీజిల్ బ్రాండ్ గుర్తు ఉండటమే వీటి ప్రత్యేకత. ♦ డీజిలే కాకుండా ఇటలీ, స్పెయిన్, చైనా వంటి ఇతర దేశాలకు చెందిన 300 రకాల బ్రాండెడ్ టైల్స్ ఉన్నాయిక్కడ. పొర్సిలానోసా, నెక్సియాన్, ఐరిస్, గోమేజ్, రొసేర్సా, బొకెట్, రెలోండ వంటి టైల్స్ ఉన్నాయి. వీటి ప్రారంభ ధరలు చ.అ.కు రూ.300. టైల్స్‌తో పాటూ ఆరంసియా మాడ్యులర్ కిచెన్, హఫెల్ గృహోపకరణాలు, రోకా, ఓయ్‌స్టార్ అండ్ శానిటరీ, బాత్ఫిట్టింగ్ ఉత్పత్తులూ ఉన్నాయి. ఇంటికి అవసరమైన అన్ని రకాల ఉత్పత్తులనూ అందుబాటు ధరల్లో ఉంచడమే హోమ్ 360 ప్రత్యేకత. స్థానిక టైల్స్ కూడా అందుబాటులో.. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో టైల్స్, ఇతరరత్రా ఉత్పత్తులను అందించేందుకు మన దేశానికి చెందిన పలు రకాల కంపెనీల టైల్స్ ఉన్నాయి. ప్రస్తుతం సింపోలో, క్యూటోన్, కజారియా ఇంటర్నిటీ, సొమానీ, నిట్కో, ఏజీఎల్ వంటి బ్రాండ్ల టైల్స్ ఉన్నాయిక్కడ. వెర్టెక్స్, వంశీరాం, ఎన్సీసీ ఆర్బన్, రిలయెన్స్ బిల్డర్స్, అక్యురెట్, ఉర్జిత్, ఇన్కార్, సలార్పూరియా సత్వా, అన్నపూర్ణ వంటి నిర్మాణ సంస్థలకు టైల్స్ సరఫరా చేస్తున్నాం. సుమారు నెలకు 1.5–2 లక్షల చ.అ. టైల్స్ విక్రయిస్తున్నాం. ♦ జూబ్లిహిల్స్‌లో ప్రారంభించిన స్టోర్ 8,500 చ.అ.ల్లో జీ+2 అంతస్తుల్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 300 రకాల బ్రాండెడ్ టైల్స్, మొదటి అంతస్తులో మాడ్యులర్ కిచెన్, గృహోపకరణాలు, ఇతరత్రా శానిటరీ ఉత్పత్తులుంటాయి. చివరి అంతస్తులో మన దేశానికి చెందిన వివిధ రకాల బ్రాండెడ్ టైల్స్ ఉంటాయి. -
హైదరాబాద్‌లో ‘మెట్రో’ మరో ఔట్లెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోల్‌సేల్ విక్రయంలో ఉన్న మెట్రో క్యాష్ అండ్ క్యారీ హైదరాబాద్‌లో నాల్గవ ఔట్‌లెట్‌ను బుధవారం ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా మెట్రో స్టోర్ల సంఖ్య 24కు చేరుకుంది. బోయినపల్లి సమీపంలోని సుచిత్ర జంక్షన్ వద్ద 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పారు. ఈ ఔట్లెట్ రాకతో కొత్తగా 350 మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్ మార్కెట్లో మరింత విస్తరణకు ఆస్కారం ఉందని కంపెనీ ఎండీ అరవింద్ మెదిరట్ట తెలిపారు. భారత్‌లో మెట్రోకు 11 లక్షల పైచిలుకు వర్తకులు కస్టమర్లుగా ఉన్నారు. ఇందులో 2 లక్షల మందికిపైగా హైదరాబాద్‌లో ఉన్నారు. ఇప్పటికే భాగ్యనగరిలో కూకట్పల్లి, ఉప్పల్, శంషాబాద్‌లో మెట్రో కేంద్రాలు నెలకొన్నాయి. -
హైదరాబాద్‌లో మెట్రో కొత్త స్టోర్
మే నెలలో ప్రారంభానికి సన్నాహాలు ⇒ ఈ ఏడాదే వరంగల్‌లో స్టోర్ ⇒ 2018లో వైజాగ్, గచ్చిబౌలిలో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోల్‌సేల్ వ్యాపారంలో ఉన్న మెట్రో క్యాష్ అండ్ క్యారీ హైదరాబాద్‌లో మరో ఔట్‌లెట్‌ను తెరుస్తోంది. కొంపల్లి సమీపంలోని సుచిత్ర వద్ద ఈ స్టోర్‌ను మే నెలలో ప్రారంభిస్తోంది. దీంతో తెలంగాణలో కంపెనీ ఔట్లెట్ల సంఖ్య నాలుగుకు చేరుకోనుంది. 67,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఏర్పాటవుతోంది. రూ.150 కోట్ల దాకా ఖర్చు చేసినట్టు సమాచారం. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, సౌందర్య సాధనాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ వంటి 10,000 రకాల ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయి. కొత్త స్టోర్‌తో ప్రత్యక్షంగా 200 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుందని కంపెనీ ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ఇప్పటికే సంస్థకు భాగ్యనగరిలో మూసాపేట్, ఉప్పల్, గగన్ పహాడ్ వద్ద కేంద్రాలున్నాయి. విజయవాడలో ఒక సెంటర్‌ను నిర్వహిస్తోంది. 2020 నాటికి 50 కేంద్రాలు..: మెట్రో క్యాష్ అండ్ క్యారీకి బెంగళూరులో ఆరు కేంద్రాలున్నాయి. ఈ నగరం తర్వాత అత్యధికంగా స్టోర్లను నిర్వహిస్తున్నది హైదరాబాద్‌లోనే. గచ్చిబౌలిలో స్థలాన్ని కొనుగోలు చేసింది కూడా. వచ్చే ఏడాది ఈ ఔట్లెట్ అందుబాటులోకి రానుంది. ఇక వరంగల్‌లో ఈ ఏడాది డిసెంబరు నాటికి మెట్రో కేంద్రం ప్రారంభం అవుతోంది. 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఏర్పాటవుతోంది. వైజాగ్‌లో 2018లో ఔట్లెట్ రెడీ కానుంది. అహ్మదాబాద్‌లో ఈ సంవత్సరమే స్టోర్‌ను ప్రారంభిస్తోంది. మెట్రోకు దేశవ్యాప్తంగా 23 ఔట్లెట్లు ఉన్నాయి. 2020 నాటికి 50 స్టోర్లను తెరవాలన్నది లక్ష్యం. ఒక్కో కేంద్రానికి రూ.100–150 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. 10 లక్షలు ఆపై జనాభా ఉన్న నగరాల్లో అడుగు పెట్టాలన్నది సంస్థ ధ్యేయం. ప్రతి కేంద్రంలో 10,000 రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతోంది. వీటిలో 1,100లకుపైగా రకాలు మెట్రో సొంత బ్రాండ్లలో విక్రయిస్తోంది. -
టైటాన్ అతిపెద్ద వాచ్ స్టోర్ హైదరాబాద్‌లో..
• 2017లో 200 కొత్త మోడళ్లు • కంపెనీ సీఈవో రవికాంత్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వాచీల తయారీ దిగ్గజం టైటాన్ కంపెనీ అతి పెద్ద ఔట్లెట్ హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభమైంది. ఇక్కడి జూబ్లీహిల్స్‌లో 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో పునరుద్ధరించిన ఈకేంద్రంలో వరల్డ్ ఆఫ్ టైటాన్, హీలియోస్ స్టోర్లను నెలకొల్పారు. టైటాన్‌కు చెందిన ఫాస్ట్‌ట్రాక్, సొనాటా, జూప్, స్కిన్‌తోపాటు రేమండ్ వీల్, మొవాడో, గెస్, ఎంపోరియో అర్మాణీ, ఫాసిల్ వంటి 25 ప్రముఖ విదేశీ బ్రాండ్లుసైతం కొలువుదీరాయి. ఈ ఔట్లెట్లో ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో భాగంగా వాచీలపై 40 శాతం దాకా డిస్కౌంట్ ఇస్తున్నట్టు టైటాన్ కంపెనీ వాచెస్, యాక్సెసరీస్ సీఈవో ఎస్.రవికాంత్ తెలిపారు. స్టోర్‌ను ప్రారంభించినఅనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడళ్ల ధర రూ.1.8 లక్షల దాకా ఉందని వివరించారు. వచ్చే ఏడాదీ 200 మోడళ్లు.. ఇటీవల ప్రవేశపెట్టిన సొనాటా యాక్ట్ సేఫ్టీ వాచ్‌కు మహిళల నుంచి మంచి స్పందన ఉందని రవికాంత్ వెల్లడించారు. మొత్తంగా టైటాన్ ప్రస్తుత సంవత్సరంలో 200 మోడళ్లను ప్రవేశపెట్టింది. 2017లోనూ అదే స్థాయిలోమోడళ్లను పరిచయం చేస్తామని వెల్లడించారు. ఏటా 1.4 కోట్ల యూనిట్ల వాచీలను విక్రయిస్తున్నట్టు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వీటిలో అంతర్జాతీయ బ్రాండ్ల వాటా 10 శాతం దాకా ఉందన్నారు. స్మార్ట్ వాచీలవిభాగంలో మరిన్ని మోడళ్లను తేనున్నట్టు తెలిపారు. రూ.10 వేలలోపు ధరలో స్మార్ట్ వాచీలు ఆరు నెలల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్‌లో 6–7 శాతం అమ్మకాలుతగ్గాయన్నారు. 50 శాతమున్న కార్డు చెల్లింపులు 75%కి చేరాయని తెలిపారు. -
దుబాయ్ గ్లోబల్ విలేజ్‌లో జోయాలుక్కాస్ ఔట్లెట్
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ ‘జోయాలుక్కాస్’ తాజాగా దుబాయ్‌లోని గ్లోబల్ విలేజ్‌లో (ఇండియన్ పెవిలియన్‌లో) కొత్త ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో పలు ఆకర్షణీయమైన డిజైన్లతో కూడిన వివిధ దేశాలకు చెందిన ఆభరణాలను కస్టమర్లు/టూరిస్ట్‌ల కోసం అందుబాటులో ఉంచామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. డైమండ్ జువెలరీపై 70 శాతం, పొల్కి జువెలరీపై 65 శాతం, పెరల్ జువెలరీపై 50 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఎంపిక చేసిన ఆభరణాలపై తయారీ చార్జీలను వసూలు చేయడం లేదని తెలిపింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జాన్ పాల్ అలుక్కాస్, డెరైక్టర్ సోనియా జాన్ పాల్ సహా పలువురి ప్రముఖుల సమక్షంలో జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ జాయ్ అలుక్కాస్ ఈ కొత్త ఔట్‌లెట్‌ను ప్రారంభించారు. -
ఎంపెసా కస్టమర్లకు వొడాఫోన్ అవుట్లెట్లలో నగదు
న్యూఢిల్లీ: నగదు కొరత నేపథ్యంలో... వొడాఫోన్ ఎంపెసా కస్టమర్లు సంస్థకు చెందిన రిటైల్ అవుట్లెట్ల ద్వారా నగదు పొందవచ్చని ఆ సంస్థ గురువారం తెలియజేసింది. నగదు కోసం వొడాఫోన్ కస్టమర్లు బ్యాంకు ఏటీఎంల వద్ద క్యూలలో నించువోవాల్సిన అవసరం లేదని సూచించింది. బ్యాంకు శాఖలకు సమాంతరంగా దేశవ్యాప్తంగా తాము 1,20,000 ఎంపెసా అవుట్లెట్లను సిద్ధం చేసినట్టు పేర్కొంది. కస్టమర్లు వీటిలో ఏదేనీ అవుట్లెట్కు వెళ్లి క్యాష్ అవుట్ సదుపాయం ద్వారా తమ డిజిటల్ వాలెట్ నుంచి నగదును వెనక్కి తీసుకోవచ్చని ఎంపెసా అధిపతి సురేష్ సేతి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం కస్టమర్లు తమ వెంట గుర్తింపు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలని సూచించారు. అందుబాటును బట్టి నగదు పొందే సౌలభ్యం ఉందన్నారు. -
కంట్రీ ఓవెన్ ఫ్రాంచైజీ బాట
♦ దేశవ్యాప్తంగా ఔట్లెట్ల ఏర్పాటు ♦ యూఎస్‌లోనూ మరిన్ని స్టోర్లు ♦ ఏడాదే ప్యాకేజ్డ్ విభాగంలోకి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బేకరీ ఉత్పత్తుల తయారీ, విక్రయంలో ఉన్న కంట్రీ ఓవెన్ ... ఫ్రాంచైజీ బాట పట్టింది. 1993 నుంచి ఈ రంగంలో ఉన్న కంపెనీ ప్రస్తుతం యూఎస్‌లో 4, భారత్‌లో 26 కేంద్రాలను సొంతంగా నిర్వహిస్తోంది. రెండేళ్లలో ఫ్రాంచైజీ విధానంలో మొత్తం ఔట్లెట్ల సంఖ్యను 100కు చేర్చాలని నిర్ణయించింది. ఫ్రాంచైజీ ఏర్పాటుకు వివిధ నగరాల నుంచి చాలా మంది ఔత్సాహికులు సంసిద్ధత వ్యక్తం చేశారని కంట్రీ ఓవెన్‌ను ప్రమోట్ చేస్తున్న పొల్సాని గ్రూప్ చైర్మన్ సుధాకర్‌రావు పొల్సాని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. చాలా కాలం నుంచి వినతులు వచ్చినప్పటికీ బ్రాండ్‌ను స్థిరపరిచిన తర్వాతే ఈ విధానాన్ని అమలు చేయాలని భావించామన్నారు. కంట్రీ ఓవెన్‌కు 8 లక్షలకుపైగా రెగ్యులర్ కస్టమర్లున్నారని చెప్పారు. ఒక్కో స్టోర్‌కు రూ.15-20 లక్షల పెట్టుబడి అవసరం అవుతుందన్నారు. చిన్న నగరాల కు విస్తరణ.. కేక్స్, కన్ఫెక్షనరీ, ఫాస్ట్ ఫుడ్ స్నాక్స్ వంటి 500లకుపైగా రకాలు కంట్రీ ఓవెన్ ఔట్లెట్లలో లభిస్తాయి. భారతీయ ఫాస్ట్ ఫుడ్, కేక్స్‌కు యూఎస్‌లో మంచి ఆదరణ ఉందని కంపెనీ తెలిపింది. కస్టమర్లలో 70 శాతం ఎన్నారైలు, 30% స్థానికులని సుధాకర్‌రావు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ మరో 10 స్టోర్లను తెరుస్తామని చెప్పారు. భారత్‌లో ఔట్లెట్ల ఏర్పాటుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కొద్ది రోజుల్లో ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలోకి ప్రవేశిస్తామని వెల్లడించారు. కంట్రీ ఓవెన్‌తోపాటు ఫుడ్ రిటైల్ షాపుల ద్వారా వీటిని విక్రయిస్తామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీలో 500 మంది ఉద్యోగులు ఉన్నారు. విస్తరణ పూర్తి అయితే మరో 1,500 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వెల్లడించారు. భారత్‌లో తొలి ఈ-కామర్స్ సైట్ కంట్రీ ఓవెన్దేనని గుర్తు చేశారు. -
ఖైదీల ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు పెట్రోల్ బంక్ వద్ద ‘మై నేషన్’ పేరుతో ఏర్పాటు చేసిన ఔట్‌లెట్‌ను తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వినయ్ కుమార్‌సింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఔట్లెట్లో ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఔట్లెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ ఇంచార్జ ఐజీ చంద్రశేఖర నాయుడు, చంచల్‌గూడ పురుష, మహిళల జైళ్ల సూపరింటెండెంట్లు బి.సైదయ్య, బషీరాబేగం, డిప్యూటీ సూపరింటెండెంట్ డి. శ్రీనివాస్, జైలర్లు పాల్గొన్నారు.