జూబ్లీహిల్స్‌లో డీజిల్‌ టైల్స్‌ స్టోర్‌ | diesel tiles store in jublihills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో డీజిల్‌ టైల్స్‌ స్టోర్‌

Published Fri, Jun 23 2017 10:41 PM | Last Updated on Fri, Sep 28 2018 3:27 PM

జూబ్లీహిల్స్‌లో డీజిల్‌ టైల్స్‌ స్టోర్‌ - Sakshi

జూబ్లీహిల్స్‌లో డీజిల్‌ టైల్స్‌ స్టోర్‌

దేశంలోనే తొలి ఔట్‌లెట్‌; ఫ్రాంచైజీ తీసుకున్న హోమ్‌ 360
డీజిల్‌ టైల్స్‌తో పాటూ లైట్లు, సోఫాలు కూడా
వీటితో పాటూ 300 రకాల అంతర్జాతీయ టైల్స్‌
మాడ్యులర్‌ కిచెన్, గృహోపకరణాలు, శానిటరీవేర్‌ కూడా..


సాక్షి, హైదరాబాద్‌: డీజిల్‌.. ఫ్యాషన్‌ ప్రపంచంలో ఈ పేరు తెలియనివారుండరు. దుస్తులు, పాదరక్షలు, బ్యాగులు, గడియారాలు వంటి ఇతరత్రా యాక్ససరీస్‌కు అంతర్జాతీయ బ్రాండ్‌. కానీ, ఇప్పుడిదే డీజిల్‌.. టైల్స్‌ రూపంలో భాగ్యనగరివాసుల ముందుకొచ్చింది. ఒక్క టైల్సే కాదు.. లైట్లు, సోఫాసెట్లతో నివాస, వాణిజ్య సముదాయాలను కట్టిపడేయనుంది. నగరానికి చెందిన ప్రముఖ బ్రాండెడ్‌ టైల్స్‌ సప్లయర్‌ ‘హోమ్‌ 360 డిగ్రీస్‌’.. డీజిల్‌ సంస్థతో ఒప్పందం చేసుకొని జూబ్లిహిల్స్‌లో డీజిల్‌ టైల్స్‌ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంస్థ యజమాని, శ్రీనాథ్‌ ర«థి, పార్టనర్‌ కె.శారదలు ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. వారింకా ఏమన్నారంటే..

హోమ్‌ 360 అనేది కొత్త స్టోరేమీ కాదు. పదేళ్ల క్రితం నుంచే కాచిగూడ కేంద్రంగా దేశ, విదేశీ టైల్స్‌ సప్లయర్‌గా ఉన్నాం. విస్తరణలో భాగంగా, ప్రధాన నగరంలోనూ సేవలందించాలనే లక్ష్యంతో జూబ్లిహిల్స్‌లో స్టోర్‌ను ఏర్పాటు చేశాం. ప్రాంతానికి తగ్గట్టుగా స్టోర్‌లోనూ ప్రత్యేకత చాటాలనే ఉద్దేశంతో ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌ డీజిల్‌తో ఒప్పందం చేసుకొని.. టైల్స్‌ ఫ్రాంచైజీ తీసుకున్నాం. ఇది దేశంలోనే మొట్టమొదటి డీజిల్‌ టైల్స్‌ స్టోర్‌ ఇదే.

ఇటలీలో తయారైన డీజిల్‌ టైల్స్‌ను దిగుమతి చేసుకొని నగరం కేంద్రంగా విక్రయిస్తున్నాం. ప్రస్తుతం ఇండస్ట్రియల్‌ గ్లాసీ, రస్టిక్, డార్క్, లెదర్, మెటాలిక్‌ వంటి 5 రకాల ఫినిషింగ్‌ టైల్స్‌ అందుబాటులో ఉన్నాయి. టైల్స్‌తో పాటూ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోసం లైట్లు, సోఫాసెట్ల వంటివి కూడా ఉన్నాయి. నివాస, వాణిజ్య సముదాయాలు రెండిట్లోనూ వినియోగించుకోవచ్చు. ధరలు చ.అ.కు రూ.600 నుంచి 1,200 మధ్య ఉన్నాయి. టైల్‌ మీద డీజిల్‌ బ్రాండ్‌ గుర్తు ఉండటమే వీటి ప్రత్యేకత.

డీజిలే కాకుండా ఇటలీ, స్పెయిన్, చైనా వంటి ఇతర దేశాలకు చెందిన 300 రకాల బ్రాండెడ్‌ టైల్స్‌ ఉన్నాయిక్కడ. పొర్సిలానోసా, నెక్సియాన్, ఐరిస్, గోమేజ్, రొసేర్సా, బొకెట్, రెలోండ వంటి టైల్స్‌ ఉన్నాయి. వీటి ప్రారంభ ధరలు చ.అ.కు రూ.300. టైల్స్‌తో పాటూ ఆరంసియా మాడ్యులర్‌ కిచెన్, హఫెల్‌ గృహోపకరణాలు, రోకా, ఓయ్‌స్టార్‌ అండ్‌ శానిటరీ, బాత్‌ఫిట్టింగ్‌ ఉత్పత్తులూ ఉన్నాయి. ఇంటికి అవసరమైన అన్ని రకాల ఉత్పత్తులనూ అందుబాటు ధరల్లో ఉంచడమే హోమ్‌ 360 ప్రత్యేకత.

స్థానిక టైల్స్‌ కూడా అందుబాటులో..
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో టైల్స్, ఇతరరత్రా ఉత్పత్తులను అందించేందుకు మన దేశానికి చెందిన పలు రకాల కంపెనీల టైల్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం సింపోలో, క్యూటోన్, కజారియా ఇంటర్నిటీ, సొమానీ, నిట్‌కో, ఏజీఎల్‌ వంటి బ్రాండ్ల టైల్స్‌ ఉన్నాయిక్కడ. వెర్టెక్స్, వంశీరాం, ఎన్‌సీసీ ఆర్బన్, రిలయెన్స్‌ బిల్డర్స్, అక్యురెట్, ఉర్జిత్, ఇన్‌కార్, సలార్పూరియా సత్వా, అన్నపూర్ణ వంటి నిర్మాణ సంస్థలకు టైల్స్‌ సరఫరా చేస్తున్నాం. సుమారు నెలకు 1.5–2 లక్షల చ.అ. టైల్స్‌ విక్రయిస్తున్నాం.

జూబ్లిహిల్స్‌లో ప్రారంభించిన స్టోర్‌ 8,500 చ.అ.ల్లో జీ+2 అంతస్తుల్లో ఉంటుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 300 రకాల బ్రాండెడ్‌ టైల్స్, మొదటి అంతస్తులో మాడ్యులర్‌ కిచెన్, గృహోపకరణాలు, ఇతరత్రా శానిటరీ ఉత్పత్తులుంటాయి. చివరి అంతస్తులో మన దేశానికి చెందిన వివిధ రకాల బ్రాండెడ్‌ టైల్స్‌ ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement