
అహ్మదాబాద్: కూల్ డ్రింక్స్‌లో పురుగు మందుల అవశేషాలున్నాయని అనేక రిపోర్టులు చెబుతున్నా పట్టించుకోని శీతల పానీయాల ప్రియులకు మరో షాకింగ్ న్యూస్. తాజాగా అహ్మదాబాద్‌లోని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులకు చేదు అనుభవం ఎదురైంది. భార్గవ జోషి అనే వ్యక్తి ఆర్డర్ చేసిన కూల్ డ్రింకులో చచ్చిన బల్లి దర్శనమిచ్చింది.
బల్లిని చూసి షాకైన భార్గవ జోషి రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి, ఇందేంటని నిలదీశాడు. అయితే ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్న సిబ్బంది డబ్బులు వాపస్ ఇస్తాం అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంత కడుపు మండి మున్సిపల్ అధికారులకు చేరేలా చేశాడు. ఈ సందర్భంగా తాను వీడియోను పోలీసులకు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు భార్గవ జోషి. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది.
ఈ వ్యవహారంపై అహ్మదాబాద్ పురపాలక శాఖ స్పందించింది. మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్‌లో తనిఖీలు చేపట్టిన అధికారులు రెస్టారెంట్ అవుట్ లెట్‌కు సీల్ వేశారు. కూల్ డ్రింకు శాంపిల్స్ ను పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌కి పంపించినట్టు వెల్లడించారు.
Here is video of this incidents happens with me...@McDonalds pic.twitter.com/UiUsaqjVn0
— Bhargav joshi (@Bhargav21001250) May 21, 2022