Insta Reels: పోలీస్‌ స్టేషన్‌ను వదల్లేదు! | Hyderabad Brats Instagram Reel In Old City Police Station Viral | Sakshi
Sakshi News home page

సెల్‌లో స్నేహితుడు.. ములాఖత్‌ వీడియో తీసి ఇన్‌స్టాలో.. హైదరాబాద్‌లో ఘటన

Published Tue, Jul 16 2024 7:10 PM | Last Updated on Tue, Jul 16 2024 7:36 PM

Hyderabad Brats Instagram Reel In Old City Police Station Viral

హైదరాబాద్‌, సాక్షి: సోషల్‌ మీడియాలో మోజుతో ఎక్కడపడితే అక్కడ రీల్స్‌ చేసే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. మొన్నీమధ్య తిరుమల పుణ్యక్షేత్రంలోనూ రీల్స్‌ చేసి ఆకతాయిలు భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా ఓ వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌ను వదల్లేదు. 

పాతబస్తీ బండ్లగూడ పోలీస్‌ స్టేషన్‌ సెల్‌లో ఉన్న స్నేహితుడిని చూడడానికి వచ్చిన ఓ వ్యక్తి.. అక్కడ ఇన్‌స్టా రీల్‌ చేశాడు. పీఎస్‌ ఆవరణలో అంతా వీడియో తీశాడు. పైగా దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పాటను ఉంచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయ్యింది. అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement