
సాక్షి, హైదరాబాద్: ఫొటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న యువతిని సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో ఫ్యాకల్టీని ఇష్టపడిన యువతి లక్ష్మి ప్రపోజ్ చేసింది. తనకు పెళ్లైందని.. ప్రేమను తిరస్కరించడంతో ఆ యువతి ద్వేషం పెంచుకుంది.
ఫ్యాకల్టీ ప్రొఫెసర్, అతని భార్య, కూతురు ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ అకౌంట్స్ సృష్టించి న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో ఆ యువతి పోస్ట్ చేసింది. ఫోటోలను అడ్డుపెట్టుకొని పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగింది.
ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలు రాసిన ఆ యువతి.. ఐఏఎస్ కోసం అశోక్ నగర్‌లో కోచింగ్ తీసుకుంటుంది. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసి యాచకుల పేరుతో సిమ్ కార్డు తీసుకుందని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. అనంతపురానికి చెందిన లక్ష్మీని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: షణ్ముఖ్‌పై కేసు నమోదు.. గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ
Comments
Please login to add a commentAdd a comment