Morphing photos
-
విశాఖలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి
-
కొండా సురేఖ,రఘునందన్ ఫొటో మార్ఫింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు ఫొటో మార్ఫింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఎంపీ రఘునందన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా వివాదాస్పద ఫొటోలను మార్పింగ్ చేసిన నిజామాబాద్ జిల్లా కోనాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న,జగిత్యాల రాయకల్‌కు చెందిన వ్యాపారవేత్త మహేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. -
నిన్ను లవ్ చేస్తున్నా.. ఫ్యాకల్టీ నో చెప్పాడని.. ఎంత పనిచేసిందంటే..
సాక్షి, హైదరాబాద్: ఫొటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న యువతిని సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీని ఇష్టపడిన యువతి లక్ష్మి ప్రపోజ్ చేసింది. తనకు పెళ్లైందని.. ప్రేమను తిరస్కరించడంతో ఆ యువతి ద్వేషం పెంచుకుంది. ఫ్యాకల్టీ ప్రొఫెసర్, అతని భార్య, కూతురు ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ అకౌంట్స్ సృష్టించి న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో ఆ యువతి పోస్ట్ చేసింది. ఫోటోలను అడ్డుపెట్టుకొని పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగింది. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలు రాసిన ఆ యువతి.. ఐఏఎస్ కోసం అశోక్ నగర్లో కోచింగ్ తీసుకుంటుంది. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసి యాచకుల పేరుతో సిమ్ కార్డు తీసుకుందని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. అనంతపురానికి చెందిన లక్ష్మీని అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: షణ్ముఖ్‌పై కేసు నమోదు.. గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ -
రూ.50కి అశ్లీల వీడియో!
సాక్షి, సిటీబ్యూరో: ఓ బాలికకు చెందిన మార్ఫింగ్ అశ్లీల వీడియోను ట్విట్టర్ ద్వారా వైరల్ చేస్తూ, రూ.50కి విక్రయిస్తున్న వ్యక్తిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నగర షీ–టీమ్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, ఈ తరహా వీడియోలు కలిగిన ట్విట్టర్ వినియోగదారులను మందలించామని డీసీపీ కవిత శుక్రవారం పేర్కొన్నారు. భూక్యా రమేష్‌కి ట్విట్టర్లో అకౌంట్ ఉంది. ఇతగాడు మార్ఫింగ్ ద్వారా రూపొందించిన ఓ బాలికకు చెందిన అశ్లీల వీడియోను వైరల్ చేస్తున్నాడు. పలువురు ట్విట్టర్ ఖాతాదారులను సంప్రదించి రూ.50 వసూలు చేస్తూ ఆ వీడియో వారికి షేర్ చేస్తున్నాడు. ఈ విషయం గుర్తించిన సిటీ షీ–టీమ్స్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. -
జడ్జినే బెదిరించాడు!
జైపూర్: మార్ఫ్డ్ ఫొటోలను పంపి రూ.20 లక్షలివ్వకుంటే వాటిని బయటపెడతామంటూ మహిళా జడ్జిని బెదిరించిన ఘటన రాజస్తాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆగంతకుడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. రాష్ట్రానికి చెందిన ఓ మహిళా జడ్జికి ఫిబ్రవరి 7న ఒక పార్సిల్ వచ్చింది. జడ్జి పిల్లలు చదివే స్కూలు నుంచి వచ్చిందంటూ ఓ అగంతకుడు పార్సిల్‌ను కోర్టు స్టెనోగ్రాఫర్‌కు ఇచ్చాడు. పేరు అడగ్గా చెప్పకుండానే వెళ్లిపోయాడు. ఆ పార్సిల్లో కొన్ని స్వీట్లతోపాటు అభ్యంతరకరంగా ఉన్న జడ్జి ఫొటోలు కనిపించాయి. రూ.20 లక్షలు ఇవ్వకుంటే ఆ ఫొటోలను ఆన్లైన్లో పెట్టి పరువు తీస్తాననే హెచ్చరికతో కూడిన ఉత్తరం ఉంది. జడ్జి చాంబర్‌లోని సీసీ కెమెరాలో ఓ 20 ఏళ్ల యువకుడు పార్సిల్ తెచ్చినట్లుగా రికార్డయింది. మరో 20 రోజుల తర్వాత జడ్జి ఇంటికి మళ్లీ ఒక పార్సిల్ వచ్చింది. ‘రూ.20 లక్షలు సిద్ధంగా ఉంచు. సమయం, ప్రాంతం త్వరలోనే చెబుతా’అంటూ లేఖ ఉంది. బాధిత న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన కేసు నమోదు చేశారు. ఆగంతకుడిని గుర్తించామని, అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
వీబీఐటీ కేసు: వల వేసి.. సవాల్ విసిరి.. పోలీసులకు చిక్కాడు
సాక్షి, మేడ్చల్-మల్కాజిగిరి: ఘట్కేసర్ మండలం అవుషాపూర్ వీబీఐటీ(విజ్ఞానభారతి ఇంజినీరింగ్) కాలేజ్ అమ్మాయిలపై వేధింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేధింపులకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు(?) ప్రదీప్‌ను ఎట్టకేలకు పోలీసులు ట్రేస్ చేశారు. దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు సవాల్ విసిరిన ఈ హ్యాకర్‌ను.. పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం విశేషం. ప్రదీప్‌తో పాటు ఈ వ్యవహారంలో అతనికి సహకరించిన మరో ఇద్దరిని సైతం శుక్రవారం ఘట్కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ విజయవాడకు చెందిన ప్రదీప్.. వీబీఐటీ కాలేజీ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి.. న్యూడ్ ఫొటోలుగా మార్చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో.. వాట్సాప్ డీపీలతో పాటు ఏకంగా ఫోన్ డాటా మొత్తాన్ని హ్యాక్ చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. సేకరించిన డాటాను డార్క్‌నెట్‌లో పెట్టి డబ్బు సంపాదించడంతో పాటు ఫేక్ ఫొటోల ద్వారా వాళ్లపై వేధింపులకు పాల్పడాలని యత్నించాడట ప్రదీప్. అయితే.. వేధింపులను భరించలేక యువతులు ఈ విషయాన్ని డిసెంబర్ 31వ తేదీకి ముందే కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ యాజమాన్యం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ దశలో ధర్నాకు దిగగా.. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు విద్యార్థినులకు మద్ధతుగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యువతి వల్లే ఇదంతా! ఈ మొత్తం వ్యవహారం వెనుక వీబీఐటీలోనే చదివే ఒక అమ్మాయి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు దర్యాప్తు ద్వారా తేల్చారు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయిని ట్రాప్ చేసిన ప్రదీప్.. ఆమెతో చాలాకాలం ఛాటింగ్ చేశాడు. ఇద్దరూ బాగా దగ్గరయ్యాక.. ఆమె ద్వారా యువతి ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో చేరాడు. ఆపై మిగిలిన అమ్మాయిల నెంబర్లు సంపాదించాడు కూడా. ఇక ప్రదీప్‌కు ఘనితో పాటు మరో స్నేహితుడు తోడయ్యారు. ఈ ముగ్గురూ వాట్సాప్ గ్రూపుల్లోని తరచూ ఏదో ఒక నెంబర్లకు ఫోన్లు చేశారు. అవి అమ్మాయిల పర్సనల్ నెంబర్లే అని నిర్ధారించుకునేదాకా.. పదే పదే ఫోన్ చేశారు. ఆపై పరిచయం పెంచుకుని స్నేహం ప్రారంభించారు. వాళ్ల వాట్సాప్ డీపీలుగా ఉన్న ఫోటోలను సేకరించారు. అదే సమయంలో ‘‘ఎంటర్ ది డ్రాగన్, కింగ్ ఈజ్ బ్యాక్’’ ల పేరుతో వాట్సప్ గ్రూప్‌లను క్రియేట్ చేశారు. ఆ గ్రూప్‌లో వీబీఐటీ స్టూడెంట్స్‌ను సైతం యాడ్ చేశారు. ఇక అపరిచిత లింకులను ఆ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి.. అవి క్లిక్ చేసిన అమ్మాయిల ఫోన్లోని డాటాను హ్యాకింగ్ చేశారు ప్రదీప్ అండ్ కో. సుమారు 43 మంది డాటాను సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు సవాల్ మరోవైపు ఏడు నెంబర్ల నుంచి అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలుగా మార్చేసి బ్లాక్ మెయిల్ దిగాడు. ఇక ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేపట్టిన సమయంలోనూ ప్రదీప్ పోలీసులకు, బాధిత యువతులకు చుక్కలు చూపించాడు. దమ్ముంటే తమను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరాడు. అలాగే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నెట్లో ఆ ఫొటోలు పెడతానని అమ్మాయిలను బెదిరించిన సైబర్ ఛీటర్ ప్రదీప్.. అన్నంత పని చేయబోయాడట. అయితే.. సరైన సమయంలో ప్రదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మరికొందరి డాటా డార్క్‌నెట్‌లో అప్లోడ్ కాకుండా నిలువరించగలిగారట. ఇక ప్రదీప్‌కు నేరంలో సహకరించిన ఫస్ట్ ఇయర్ యువతిని సస్పెండ్ చేసే యోచనలో కాలేజీ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. కాలేజీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.. స్టూడెంట్స్‌కు సంక్రాంతి సెలవులు ముందుగానే ప్రకటించింది యాజమాన్యం!. -
బాబు వాడుకున్నారు.. జనం ఆడుకున్నారు
సాక్షి, అమరావతి: జనాదరణ పోయింది. పిలిచినా సభలకు రావటం లేదు. దీంతో ఒకరోజు ఇరుకు సందుల్లోనే సభ పెట్టబోయారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆ సాహసానికి.. పాపం 8 మంది అమాయకులు బలైపోయారు. జనం రద్దీ బాగా కనిపించే డ్రోన్షాట్ల కోసం ఇరుకు రోడ్లోకి వాహనాన్ని పోనిచ్చి... అక్కడ చంద్రబాబు మాట్లాడబోగా, అప్పటికే ఉన్న జనం వెనక్కివెళ్లే తొందర్లో ఒకరిపై ఒకరు పడి... పాపం ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాన్ని రప్పించడానికి వారికి కానుకల ఆశ చూపించారు చంద్రబాబు. విలువైన చీర, ఇతర సరుకులు ఇస్తామని నమ్మబలికి టోకెన్లు పంచి మరీ వేల మందిని రప్పించారు. కానీ చౌకబారు చీరలతో నాసిరకం కానుకలిచ్చారు. అది కూడా టోకెన్లున్న వారందరికీ ఇవ్వకపోవటంతో అక్కడా తోపులాట తప్పలేదు. పాపం.. మరో ముగ్గురు బలైపోయారు. ఎలాగైనా తమకు జనాదరణ తగ్గలేదని చూపించడానికి చంద్రబాబు ముఠా ఎల్లో మీడియా, సోషల్ మీడియా వేదికగా మరో దుస్సాహసానికి దిగింది. చంద్రబాబును చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను ఈ ముఠా వైరల్ చేసింది. ‘కుప్పం గడ్డ.. ఇది చంద్రబాబు అడ్డా’ అనే నినాదాలతో విపరీతంగా జనం కనిపిస్తున్న ఆ ఫొటోలను కొన్ని ఎల్లో చానళ్లు కూడా ప్రసారం చేశాయి. ఇక సోషల్ మీడియాలో అయితే టీడీపీ బ్యాచ్ మొత్తం ఈ ఫొటోలను షేర్ చేస్తూ శివాలెత్తిపోయింది. బాబును ప్రభుత్వం ఎంతలా అడ్డుకున్నా జనం ఆయన వెంటే ఉన్నారంటూ కామెంట్లు కూడా ఊదరగొట్టేశారు. కానీ నిజమేంటో తెలుసా? ఆ ఫొటోలు కుప్పంలోనివి కాదు. అసలు చంద్రబాబుకే కాదు.. ఈ రాష్ట్రానికే సంబంధం లేని ఫొటోలు. కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ప్రముఖుడిగా గుర్తింపు పొందిన సిద్ధేశ్వర స్వామి సోమవారం మరణించగా.. ఆయన అంతిమ యాత్రకు దాదాపు 2 లక్షల మంది భక్తులు, సామాన్య ప్రజలు హాజరయ్యారు. లింగాయత్ సంప్రదాయానికి చెందిన సిద్ధేశ్వర స్వామి.. దశాబ్దాల పాటు సమాజానికి విశేష సేవలు అందించి కర్ణాటక వ్యాప్తంగా విశేష గుర్తింపు పొందటంతో జనం తండోపతండాలుగా వచ్చారు. భక్తుల్లో చాలామంది పసుపు రంగు దుస్తులు ధరించి ఉండటం.. వాహనానికి కూడా పసుపు రంగు ఉండటంతో ఇది తమకు సరిగ్గా మ్యాచ్ అవుతుందనుకున్న టీడీపీ వర్గాలు.. ఆ ఫొటోలను, వీడియోలను డౌన్లోడ్ చేసి తమ బాబు సభకు వచ్చిన జనం అంటూ వైరల్ చేసేశాయి. ఏకి పారేసిన నెటిజన్లు.. ఆ ఫొటోల లోగుట్టును నెటిజన్లు క్షణాల్లోనే పట్టేశారు. ఆ ఫొటోలు కుప్పంలో చంద్రబాబు పర్యటనవి కావంటూ నిజాన్ని నిగ్గు తేల్చారు. చుట్టుపక్కల పరిసరాలు, ఆ ఫొటోల్లో ఉన్న ప్రజల ఆహార్యాన్ని గుర్తించిన ప్రజలే.. ఇవి ఫేక్ అంటూ ఎండగట్టే సరికి పచ్చ గ్యాంగ్‌కు దిమ్మ తిరిగిపోయింది. ‘బాబు మరీ ఇంత ఫేకా’ అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. నిజానికి 1989 నుంచీ చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం స్థానంలో ఇపుడు టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలున్న తరుణంలో మూడు రోజుల పర్యటనకు గాను చంద్రబాబు బుధవారం కుప్పంలో అడుగుపెట్టారు. బాబు వస్తున్నారని వారం పది రోజులుగా ఎంత ప్రచారం చేసినా, అక్కడి ప్రజల నుంచి ఏమాత్రం స్పందన కనిపించ లేదు. దీంతో ఫొటోల మార్ఫింగ్‌కు దిగారు టీడీపీ ఘనులు. అయినా జనం వచ్చేది నాయకులు చేసే మంచిని చూసి. మరి చంద్రబాబు ఏం చేశారని వస్తారు?. -
ఘట్కేసర్: బీటెక్ స్టూడెంట్స్ మార్ఫింగ్ న్యూడ్ ఫోటోల కలకలం
సాక్షి, హైదరాబాద్: ఘట్కేసర్లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినుల మార్పింగ్ న్యూడ్ ఫొటోల కలకలం చెలరేగింది. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి కొందరు ఆకతాయి.. వాటిని వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేశారు. అంతేకాదు వాటి ఆధారంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో విద్యార్థినిలు బుధవారం అర్ధరాత్రి కాలేజ్ ముందుకు చేరి ధర్నా చేపట్టారు. ఈ ఉదయం వీళ్లకు విద్యార్థి సంఘాలు కూడా తోడు కావడంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. ఘట్కేసర్ వీబీఐటీ( విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజీ) దగ్గర గురువారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు ఆకతాయిలు ఆ కాలేజీలో చదువుతున్న అమ్మాయిల ఫొటోలను సేకరించి.. వాటిని న్యూడ్ ఫొటోలుగా మార్ఫింగ్ చేశారు. అంతటితో ఆగకుండా వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. వాటిని చూపిస్తూ.. వాట్సాప్ గ్రూపుల్లో చేరి వీడియో కాల్స్ చేయాలని యువతులను బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ పరిణామం వెనుక ఎవరున్నారేది తేల్చే పనిలో ఉన్నారు. అయితే.. ఈ లోపే విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఈ పరిణామంపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కూతుర్ల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. ఇదిలా ఉండగా.. విద్యార్థినుల ధర్నా చేపట్టిన సమయంలో ఆగంతకుల నుంచి వార్నింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించినట్లు విద్యార్థినులు చెప్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు చెప్తున్నారు. -
కోరిక తీర్చకుంటే మార్ఫింగ్ ఫోటోలను అప్లోడ్ చేస్తా.. యాంకర్‌కు వేధింపులు
సాక్షి, హైదరాబాద్: కోరిక తీర్చకుంటే మార్ఫింగ్ చేసిన అశ్లీల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్న వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల మేరకు.. మధురానగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్న 27 ఏళ్ల యువతి ఓ టీవీ చానెల్లో యాంకర్‌గా పనిచేస్తుంది. కళాశాలలో ఆమెతో కలిసి చదువుకున్న క్లాస్మేట్ కూకట్పల్లి నివాసి కె.సామ్రాట్ ఆమెను వేధిస్తున్నాడు. ప్రేమించాలని వెంట పడటంతో అందుకు నిరాకరించగా స్నేహితుల్లా ఉందామని నమ్మించాడు. ఓసారి తన కారులో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించగా తిరిగి హాస్టల్ వద్ద విడిచివెళ్లాడు. యువతిపై కోపం పెంచుకున్న సామ్రాట్ ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. కోరిక తీర్చకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తానని బెదిరింపులకు దిగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కటకటాలకు కంత్రీగాళ్లు
ఆధార్ మార్ఫింగ్ చేసి.. ఫోర్జరీ సంతకాలతో భూమి కొట్టేసి.. రూ.కోట్లు కొల్లగొట్టాలనుకున్న కంత్రీగాళ్లను పోలీసులు కటకటాలకు పంపారు. కేసులో ఐదుగురు నిందితులు హనుమంతాచారి అలియాస్ హనుమంతు, వేణుగోపాల్, రమేష్ రామ్మోహన్‌రెడ్డి, వడ్డే రాముడును రుద్రంపేట వద్ద అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరిపై 420, 467, 468, 470, 471, 120 బీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఎక్సైజ్ కోర్టులో న్యాయమూర్తి ఓంకార్ ఎదుట హాజరుపరిచారు. ఆయన వారికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు వెల్లడించారు. సాక్షి అనంతపురం: అనంతపురంలోని వక్కలం వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకటసుబ్బయ్యకు వెంకటరమణ, నందకిషోర్ సంతానం. వెంకటసుబ్బయ్యకు వివిధ ప్రాంతాల్లో రూ కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అందులో భాగంగా రాచానపల్లి సర్వే నంబర్ 127లో 14.96 ఎకరాల భూమి ఉంది. రూ.45 కోట్లు విలువ చేసే ఈ భూమిపై అంపగాని శ్రీనివాసులు (పక్ష పత్రిక ప్రతినిధి)పై కన్నుపడింది. ఇతని సమీప బంధువు, వరుసకు బావ అయిన సత్యమయ్య (అంపగాని శ్రీనివాసులు బినామీ), వివిధ టీవీ చానళ్లలో పని చేసే హనుమంతాచారి అలియాస్ హనుమంతు, వేణుగోపాల్, రమేష్ రామ్మోహన్‌రెడ్డితో ముఠాగా ఏర్పడ్డారు. భూ‘మాయ’ మొదలైందిలా.. వెంకటసుబ్బయ్య స్థిరాస్తిని కాజేయడానికి అంపగాని శ్రీనివాసులు ముఠా పలు దఫాలు ప్రయత్నాలు చేసింది. మొదట వెంకట సుబ్బయ్య కుమారుడైన వెంకటరమణ ఆధార్‌ను బుక్కరాయసముద్రం చెన్నంపల్లికి చెందిన తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫొటోతో మార్చాలని చూశారు. వెంకటరమణ అడ్రస్‌కు తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫొటోతో కూడిన ఆధార్ వెళ్లడంతో వారు అప్రమత్తమై వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 21న తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. రెండో ప్రయత్నంలో ముఠా సభ్యులు ఆర్కే నగర్‌కు చెందిన బత్తల శేఖర్, అచ్చుకట్ల ఇంతియాజ్ (తహసీల్దార్ కార్యాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి), కర్తనపర్తి సురేష్ (ఆధార్ సెంటర్ నిర్వాహకుడు) సహాయంతో వెంకటసుబ్బయ్య ఆధార్‌లోని ఫొటోకు బదులుగా హకీం అబ్దుల్ మసూద్ అనే వ్యక్తి ఫొటోను అప్డేట్ చేశారు. అప్డేట్ ఆధార్ కార్డు వెంకటసుబ్బయ్య అడ్రెస్‌కు వెళ్లడంతో ఏదో జరుగుతోందని భావించి.. కుటుంబ సభ్యులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో శేఖర్, ఇంతియాజ్‌ను ఈ నెల 21న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. మూడో ప్రయత్నంలో ముఠా సభ్యులు విజయం సాధించారు. టీచర్స్ కాలనీకి చెందిన వడ్డే రాముడు ఆధార్ కార్డులో వడ్డే రాముడు పేరు బదులుగా వెంకటసుబ్బయ్య పేరు, అతని తండ్రి పేరును నవీకరించారు. అదే విధంగా వెంకటసుబ్బయ్య ఫోన్ నంబర్‌కు బదులుగా వడ్డే రాముడు ఫోన్ నంబర్‌నే ఆధార్‌లో పొందుపర్చారు. అడ్రస్ సైతం వడ్డే రాముడిదే ఉంచారు. ఈ విధంగా వడ్డే రాముడినే వెంకటసుబ్బయ్యగా చూపుతూ ఈ నెల ఒకటో తేదీన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అంపగాని శ్రీనివాసులు బావ అయిన సత్యమయ్యకు 14.96 ఎకరాలు రిజి్రస్టేషన్ చేయించారు. అలా రిజిస్ట్రేషన్ చేయించిన భూమిని పెదవడుగూరుకు చెందిన ప్రస్తుతం నగరంలో ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి దేవేందర్‌రెడ్డికి ఎకరా రూ.కోటి చొప్పున విక్రయిస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. అందుకోసం దేవేందర్‌రెడ్డి అడ్వాన్స్ రూపంలో సదరు ముఠా సభ్యులకు కోటీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు. పరారీలో రంగనాయకులు.. మూడో ప్రయత్నం సఫలమవడానికి హనుమంతాచారి అలియాస్ హనుమంతు ద్వారా సీన్లోకి వచ్చిన రంగనాయకులు అలియాస్ కేశవ (గోల్డ్ స్మిత్) ఆధార్ మార్పులో కీలకంగా వ్యవహరించాడు. ఆధార్ మార్చడానికి, వడ్డే రాముడును తీసుకువచ్చిన రంగనాయకులుకు అంపగాని శ్రీనివాసులు, సత్యమయ్య, హనుమంతు, వేణుగోపాల్, రమేష్, రామ్మోహన్‌రెడ్డి రూ.18 లక్షలు ముట్టజెప్పినట్లు విచారణలో తేలింది. ఆధార్ మార్పునకు సహకరించిన రంగనాయకులు పరారీలో ఉన్నాడు. ఇలా వెలుగులోకి.. మార్పులతో వచ్చిన ఆధార్ కార్డులు ఇంటికి రావడంతో వెంకటసుబ్బయ్య కుటుంబీకులకు అనుమానం వచ్చింది. వెంకటసుబ్బయ్య కుమారుడైన నందకిషోర్(ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్) రిజి్రస్టేషన్ కార్యాలయానికి వెళ్లి చూడగా ఫోర్జరీ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ నెల ఏడో తేదీన డీపీఒలో జరిగిన ‘స్పందన’ కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పకు నందకిషోర్ ఫిర్యాదు చేశాడు. సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులును ఎస్పీ ఆదేశించారు. డీఎస్పీ లోతుగా విచారణ చేపట్టడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. -
లోన్ యాప్ దుర్మార్గం
కావలి: లోన్ యాప్ యాజమానుల దుర్మార్గాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. తాజాగా అప్పు చెల్లించలేదని శ్రీపొట్టిశ్రీరామలు నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ మహిళ ఫొటోను నగ్న చిత్రాలతో మార్ఫింగ్ చేసి ఆమె కాంటాక్ట్ లిస్ట్‌లోని వారికి పంపించి వేధింపులకు గురి చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఈ మేరకు కావలి ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ పి.ఆదిలక్ష్మి కథనం మేరకు.. కావలిలోని కచ్చేరిమిట్టకు చెందిన పసుపులేటి మౌనికను భర్త వదిలేశాడు. ఆమె తన ముగ్గురు కుమార్తెలను ఉపాధి పనులు చేసుకుంటూ పోషించుకుంటోంది. ప్రస్తుతం ఒక హోటల్లో దినసరి కూలీగా పని చేస్తోంది. అయితే, ఆరు నెలల క్రితం ఆన్లైన్లో ‘స్పీడ్’ అనే యాప్‌లో రూ.5,000 అప్పు కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమె అకౌంట్లో రూ.2,500 నగదు జమ అయింది. అప్పటి నుంచి ఆమెను యాప్‌కు సంబంధించిన వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తూ రూ.70 వేల వరకు నగదు ఆమె వద్ద నుంచి కట్టించుకున్నారు. అయినా ఇంకా బాకీ ఉందని వేధిస్తుండడంతో, ఆమె తనకు ఆర్థిక స్థోమత లేదని చెప్పింది. దీంతో ఆమె ఫొటోను నగ్న చిత్రంతో మార్ఫింగ్ చేసి ‘స్పీడ్’ యాప్ ద్వారా ఆమె కాంటాక్ట్ లిస్ట్‌లోని వారందరికీ పంపారు. బాధితురాలు నుంచి ఫిర్యాదు అందుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సినీ నటి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో..
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నటిని వాట్సాప్ ద్వారా వేధిస్తున్న పోకిరీకి అరదండాలు పడ్డాయి. స్టార్ మేకర్స్ యాప్ ద్వారా నటి ఫోన్ నంబరు తీసుకున్న ఆకతాయి నటి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. పలుమార్లు అసభ్యకరంగా దూషించాడు. దీంతో భయపడిపోయిన నటి షూటింగ్‌లకు కూడా వెళ్లలేదు. ఆఖరికి సైబరాబాద్ షీ టీమ్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీంతో మాదాపూర్ షీ టీమ్ రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకొని రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. చదవండి: (Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం.. పరారీలో ఇషిక) -
ఏనాడూ అలాంటి పని చేయలేదు.. బాధగా ఉంది: సచిన్
సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద పుకార్లు వైరల్ కావడం సహజమే. చాలామంది వాటిని తేలికగా తీసుకుంటారు. కొందరు మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ ఒక రేంజ్‌లోనే కౌంటర్లు ఇస్తుంటారు. ఈ క్రమంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కి మార్ఫింగ్ ఫొటోలతో తనను బద్నాం చేయడం ఇబ్బంది పెట్టిందట. అందుకే న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు ఆయన. గోవాకు చెందిన ఓ కాసినోపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గరం అయ్యారు. అనుమతి లేకుండా తన ఫొటోలను వాడుకోవడంపై లీగల్ యాక్షన్‌కు సిద్ధమయ్యారు ఆయన. ఈ మేరకు మార్ఫింగ్ చేసిన తన ఫొటోలను ‘బిగ్ డాడీ’ క్యాసినో ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటోందని అసహనం వ్యక్తం చేశారాయన. Requesting everyone to remain vigilant about misleading images on social media. pic.twitter.com/VCJfdyJome — Sachin Tendulkar (@sachin_rt) February 24, 2022 ‘‘నా ఇన్నేళ్ల కెరీర్లో గ్యాంబ్లింగ్గానీ, టొబాకోగానీ, ఆల్కాహాల్ ఉత్పత్తులనుగానీ.. నేరుగా గానీ, పరోక్షంగా గానీ తాను ఏనాడూ ఎండోర్స్ చేయలేదని, అలాంటిది తన ఫొటోలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేదిగా ఉండడం తనని బాధించిందని చెప్తున్నారు 48 ఏళ్ల టెండూల్కర్. ‘నా లీగల్ టీం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. కానీ, ప్రతి ఒక్కరికి ఈ సమాచారం అందించాలనే ఉద్దేశంతో ఈ పోస్ట్ చేస్తున్నా. తప్పుదోవ పట్టించే ఆ ఫొటోలను నమ్మకండి’ అంటూ ట్విటర్లో సచిన్ ఇవాళ ఒక ట్వీట్ చేశారు. -
Bully Boy App Case: 19 ఏళ్ల యువతే ప్రధాన సూత్రధారి!
ముంబై(మహరాష్ట్ర): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బుల్లి బాయ్ యాప్ కేసులో ముంబై సైబర్ సెల్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి శ్వేతా సింగ్‌ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి విశాల్ కుమార్ ఝా (21)ను సోమవారమే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విశాల్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన నిందితురాలైన శ్వేతా సింగ్‌ను ఉత్తరాఖండ్‌లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇద్దరూ ఫ్రెండ్స్ శ్వేత, విశాల్‌లకు పూర్వ పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని పోలీసులు తెలిపారు. శ్వేతను ముంబైకి తీసుకురావడానికి వీలుగా ఉత్తరాఖండ్‌లోని స్థానిక కోర్టు ఆమెకు నాలుగురోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించింది. విశాల్‌ను మంగళవారం ముంబైలోని బాంద్రా మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట హాజరుపరచగా న్యాయస్థానం అతనికి జనవరి 10 వరకు రిమాండ్ విధించింది. ముంబై సైబర్ పోలీసుల బృందం ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్న శ్వేతా సింగ్ ఈ యాప్ రూపొందించడం వెనుక కీలక పాత్ర పోషించిందన్న అనుమానాలున్నాయి. ఈ యాప్‌కి సంబంధించి ఆమె ఎన్నో వేర్వేరు అకౌంట్లు కలిగి ఉంది. విశాల్‌ని, యువతిని కలిసికట్టుగా విచారించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే 100 మందికిపైగా ముస్లిం మహిళల ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి బుల్లి బాయ్ అనే యాప్‌లో అప్లోడ్ చేసి వేలానికి ఉంచిన విషయం తెలిసిందే. నిందితులు ఆ ఫోటోలను వేలానికి పెట్టినప్పటికీ వారి అసలు ఉద్దేశం మైనార్టీ మహిళల్ని అవమానించడమేనని పోలీసులు భావిస్తున్నారు. విశాల్ ‘ఖాల్సా సుప్రిమసిస్ట్’ పేరుతో ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్నాడని, మరికొన్ని నకిలీ ట్విట్టర్ ఖాతాల పేర్లను కూడా మార్చి సిక్కుల పేర్లను పోలిన వాటిని వాడినట్లు పోలీసులు తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించే ప్రయత్నం ఏదైనా చేశారా? అనే కోణంలోనూ విచారించనున్నట్లు తెలిపారు. చదవండి: ముస్లిం విద్యార్థులు సూర్య నమస్కారాల్లో పాల్గొనవద్దు -
‘నాతో మాట్లడకపోతే నీ ఫోటోలు పోర్న్ సైట్లో పెడతాను’
మనం విన్నదంతా వాస్తవం అనలేం. మనం చూసింది నిజం కాకపోవచ్చు. మన చుట్టూ ఉన్నవారందరూ మంచి వాళ్లే అని చెప్పలేం. ప్రియ (పేరు మార్చడమైనది) విషయంలో అదే జరిగింది. స్నేహితులతో సరదాగా ఉంటుంది. చదువులో నెంబర్ వన్. అందంలో మిస్ కాలేజ్. చదివేది ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్. అమ్మానాన్నలకు గారాల కూతురు. ఎప్పుడూ సంతోషంగా ఉండే ప్రియ ఆరు నెలలుగా శూన్యం ఆవరించినట్టుగా ఉంది. చదువులో వెనకబడిపోయింది. సరైన తిండి, నిద్రకు దూరమై పేషెంట్లా తయారైంది. స్నేహితులను కూడా కలవట్లేదు. తన గది దాటి బయటకు రావడం లేదు. మానసిక సమస్యేమో అని తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దామంటే రానంటుంది. తనకేమీ కాలేదని, బాగానే ఉన్నానంటోంది. ప్రియ వాళ్ల పెద్దమ్మ కూతురు రాగిణి అమెరికా నుండి వచ్చి, తిరిగి వెళ్లే ముందు పిన్నిబాబాయిలను కలవడానికని వచ్చింది. విషయం తెలిసిన రాగిణి రెండు రోజులు ప్రియ వాళ్లంట్లోనే ఉంది. ప్రియతోనే ఉంటూ మాటలు కలిపింది. అసలు విషయం తెలిసి షాక్ అయ్యింది. నిమిషం కూడా విడవనంటూ.. యుఎస్ నుంచి అదే పనిగా ప్రియ వాట్సప్‌కి మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్ వస్తూనే ఉన్నాయి. వాటికి సమాధానం ఇవ్వడంలో నిమిషం ఆలస్యమైనా కంగారు పడుతుంది ప్రియ. ‘ఆర్నెల్ల క్రితం ఫేస్బుక్లో ఫ్రెండ్ అయిన వ్యక్తి, నా గురించి అన్నీ తెలిసినట్టుగా చెబుతుంటే ఆసక్తిగా అనిపించి, చాట్ కొనసాగించాను. అక్కణ్ణుంచి మా మధ్య మంచి స్నేహం కుదిరింది. ఫోన్లు, చాటింగ్ అంతా బాగానే ఉంది. నమ్మకం కుదిరింది. ఫొటోలు కూడా షేర్ చేసుకున్నాం. ‘చాటింగ్, ఫోన్లతో చదవడమే కుదరడం లేదు మానేద్దాం’ అన్నాను. అప్పటి నుంచి నా ఫొటోలు పోర్న్సైట్లో పెట్టేస్తానని’ బెదిరిస్తున్నాడు అని ప్రియ తెలిపింది. ‘మంచి ఫ్రెండ్ అని నమ్మితే ఇలా మోసం చేశాడు. నా అకౌంట్లో అప్లోడ్ చేసిన ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడాలి. లేదంటే, మార్ఫింగ్ చేసిన ఫొటోలు అందరికీ షేర్ చేసి, నా పరువు, కుటుంబపరువు తీస్తానని బెదిరిస్తున్నాడు. అందువల్లే కాలేజీ మొహం చూడటం లేదు. అమ్మానాన్నలకు ఈ విషయం తెలిస్తే వాళ్లు బతకరు. నాకు చనిపోవాలని ఉందం’టూ రాగిణికి చెప్పి ఇన్నాళ్లూ దిగమింగుకున్న బాధను ఏడుస్తూ చెప్పింది ప్రియ. భయపడకుండా తను చెప్పినట్టుగా వినమని సైబర్‌క్రైమ్‌కు పిర్యాదు చేసింది రాగిణి. స్నేహితురాలే అడ్డంకి.. ప్రియ అన్నింటా ముందుండటం తట్టుకోలేని స్నేహితురాలు సుజి ఇదంతా చేసిందని తెలిసి అందరూ షాక్ అయ్యారు. అమెరికా వెళ్లొచ్చిన స్నేహితుడు అక్కడి విశేషాలు చెబుతూ వాడిన యుఎస్ సిమ్ గురించి కూడా చెప్పాడు. ఆ నెంబర్‌తో ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేసిన సుజి కొత్త గేమ్ ఆడటం మొదలు పెట్టింది. కొన్నాళ్లు ఆ కొత్త నెంబర్‌తో యాక్టివేట్ అయిన అకౌంట్ నుంచి ప్రియతో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. తన స్నేహితుడి సాయంతో రోజూ కొన్ని గంటల పాటు ప్రియను మాటల్లో పెట్టించి, ఇంటి గడప దాటకుండా చేసింది. ఆ తర్వాత కొత్త బెదిరింపులకు పాల్పడింది. ప్రియతో చాటింగ్ చేస్తున్న అకౌంట్ ద్వారా నెంబర్ కనుక్కున్న నిపుణులు అమెరికా నుంచి వచ్చిన యువకుడిని అరెస్ట్ చేస్తే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏదో రకంగా ఇతర దేశాల సిమ్‌లను ఉపయోగిస్తూ వంచనకు పాల్పడేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ప్రముఖ బ్రాండ్ లేదా సంస్థ అధికారిక ప్రతినిధిగా నటిస్తారు. ముందుగా URLను తనిఖీ చేయాలి. వారి అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేశారు, ఆ పేరు లేదా నెంబర్‌తో గతంలో మరికొన్ని అకౌంట్ లు ఉన్నాయోమో చూడాలి. ఫ్రాడ్ అకౌంటైతే తక్కువ ఫాలోవర్లు, అతి తక్కువ పోస్టులు ఉంటాయి. సంక్లిష్ట పదాలతో పాస్వర్డ్ మారుస్తూ ఉండాలి. ప్రొఫైల్ లాక్ చేసుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. అనుమానాస్పద లింక్‌ల పై క్లిక్ చేయకూడదు. తెలిసిన వ్యక్తులతో మాత్రమే సంభాషణ కొనసాగించాలి. ఆఫ్‌లైన్‌లో ఎలా ఉంటామో ఆన్‌లైన్‌లోనూ అదేవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ తెలిసినవారే అయ్యుంటారా?! నిధి రజ్దాన్ ఓ ప్రఖ్యాత టీవీ ఛానెల్లో జర్నలిస్ట్. ఆర్నెల్ల క్రితం తను భారీగా మోసపోయిన విధానం గురించి చెబుతూ, ఇది ఎవరికైనా ఓ పాఠంలా ఉపయోగపడితే చాలు అంది. ‘హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జర్నలిజం బోధించడానికి, అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరడానికి 21 ఏళ్ల తర్వాత నేను పని చేస్తున్న సంస్థను వీడి వెళ్తున్నాను అని ట్విట్టర్లో ప్రకటించాను. ఇది ఒక అద్భుతమైన అవకాశం అని నేను నిజంగా నమ్మాను. హార్వర్డ్ యూనివర్శిటీలో చేరడానికి నా బ్యాంక్ ఖాతా, వ్యక్తిగత డేటా, ఇమెయిల్, మెడికల్ రికార్డులు, పాస్‌పోర్ట్, నా కంప్యూటర్, ఫోన్ వంటి పరికరాలు యాక్సెస్ చేయడానికి జరిగిన అధునిక ఫిషింగ్ దాడిలో ఇదంతా భాగం అని 8 నెలల తర్వాత తెలిసింది. ఆఫర్ లెటర్, అగ్రిమెంట్‌తో అధికారిక హార్వర్డ్ ఈమెయిల్ ఐడి నుంచి నాకు మెయిల్ వచ్చింది. విశ్వవిద్యాలయ లోగోతో ఉన్న లెటర్‌హెడ్, పదవులు పొందిన సీనియర్ అధికారులందరి సంతకాలు ఉన్నాయి. నేను పనిచేసే యజమానులకు సిఫారసు లేఖ కూడా పంపారు. అన్నీ పూర్తి చేసుకొని ఉద్యోగాన్ని మానేశాను. హార్వర్డ్ వెళ్లాలనే నిర్ణయించుకున్నాను. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలను బట్టి అర్థమైంది నా డబ్బు, వ్యక్తిగత డేటా దుర్వినియోగం చేయడానికి ఇంతా జరిగిందని. పోలీసులకు అన్ని పత్రాలతో ఫిర్యాదు చేశాను’ అంటూ వివరించారు. ఇదంతా చూస్తుంటే తెలిసిన వాళ్లే ఆమెను ఉద్యోగం నుంచి తప్పించడానికే చేశారేమో?! అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వెరిఫికేషన్ ముఖ్యం మోసపోయాక కళ్లు తెరవడం కన్నా ముందే జాగ్రత్తపడటం మంచిది. అసూయతో సన్నిహితం గా ఉండే వారు కూడా మనల్ని మోసం చేయవచ్చు. నిత్యం మన పక్కనే ఉంటూ మనల్ని మోసం చేసేవారూ ఉంటారు. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే విచక్షణ ముఖ్యం. డబ్బు కోసం, తమ సొంత ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా వెనకాడనివారుంటారు. మన చదువుకు, వృత్తికి, అభిరుచికి తగిన లింక్స్ ఆకట్టుకునే విధంగా మెయిల్స్‌కు వస్తుంటాయి. కొత్తగా వచ్చిన మెయిల్ URL పూర్తిగా వెరిఫై చేసుకున్నాక గానీ ఆ లింక్ ఓపెన్ చేయకూడదు. మన పూర్తి డేటా ఇవ్వకూడదు. ఎక్కడైనా అనుమానం వస్తే సైబర్ నిపుణుల సాయం తీసుకోవడం మేలు చేస్తుంది. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ -
వారం రోజుల్లో పెళ్లి.. ఇదేంటే.. అసలు విషయం తెలిసి
‘‘కావ్యా (పేరుమార్చడమైనది) ఒక్కసారి కళ్లు తెరువమ్మా! ఏమైందే. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడిలా చేశావ్, నీకీ పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెబితే సరిపోయేది కదా!’’ సుభద్రమ్మ ఏడుస్తునే ఉంది. ‘‘నువ్వు కాసేపు మౌనంగా ఉండు’’ అంటూ భర్త రాఘవరావు సుభద్ర మీద కేకలేశాడు. కాసేపటికి కావ్య లేచి తల్లిదండ్రులని చూసి, తలదించుకుంది. ‘‘ఏమైందమ్మా! కాస్త ఆలస్యమైతే ఎంత దారుణం జరిగేది. ఉరివేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది తల్లీ’’ అనునయంగా అడిగాడు రాఘరావు. ఆ మాటలతో కావ్య తండ్రిని పట్టుకుని ఏడుస్తూనే ఉండిపోయింది. ‘‘నీకు ఇష్టమని చెప్పాకనే కదా, పెళ్లి పెట్టుకున్నది..’ సందేహంగా అడిగాడు కూతుర్ని. ‘‘నిజమే నాన్నా!’’ అంటూ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయిన కూతుర్ని చూసి, భయమేమీ లేదమ్మా ఇప్పటికైనా చెప్పు. ‘‘పెళ్లి ఆపేద్దామంటే వాళ్లకు చెప్పేస్తే. నీ చావు చూసే పెళ్లి వద్దమ్మా!’ అన్నాడు రాఘరావు. ‘‘అది కాదు నాన్న నేను ఎంతగానో నమ్మిన వంశీ (పేరుమార్చడమైనది) నన్ను టార్గెట్ చేశాడు’’ ఏడుస్తూనే చెప్పింది కావ్య. అర్థం కాక ‘‘వంశీ నీ బెస్ట్ ఫ్రెండ్ కదమ్మా, ఏమైంది’’ కంగారుగా అడిగాడు. కూతురు చెప్పిన విషయం వినడంతోనే రాఘవరావు కోపంతో ఉగిపోయాడు. ∙∙ కావ్య తన క్లాస్మేట్ వరుణ్(పేరు మార్చడమైనది)తో స్నేహంగా ఉండేది. బీటెక్ నాలుగేళ్లూ ఇద్దరూ చాలా క్లోజ్‌గా తిరిగారు. పెద్దలకు చెప్పి, పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. ఇద్దరూ ఒక అవగాహనతో తాము క్లోజ్‌గా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేసుకున్నారు. రెండుమూడు నెలల వరకు ఎవరి పనుల్లో వారుండిపోయారు. ఓ రోజు ఫ్రెండ్ ఫోన్ చేసి, డేటింగ్ సైట్స్‌లో కావ్య వరుణ్ క్లోజ్‌గా ఉన్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయని చెప్పింది. వాటిని కావ్య చూసింది. వరుణ్‌కి ఫోన్ చేసి తిట్టింది కావ్య. తనేమీ వాటిని షేర్ చేయలేదని రివర్స్ అయ్యాడు వరుణ్. ఈ విషయాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన వంశీకి చెప్పింది. ఎలాగైనా ఆ సైట్స్ నుంచి తన ఫొటోలు డిలీట్ చేయించమని వేడుకుంది. కావ్య చెప్పినట్టు వంశీ వాటిని వివిధ సైట్స్ నుంచి తొలగించేశాడు. ‘హమ్మయ్య’ అనుకుని వంశీకి ‘థాంక్స్’ చెప్పింది. ఆరు నెలల తర్వాత ఇంట్లో పెద్దలు చూసిన సంబంధానికి ఓకే చెప్పింది. త్వరలో పెళ్లి అనుకున్నారు. భవిష్యత్తు సంతోషంగా ఉండబోతుందనుకున్న కావ్యకు పాత వీడియోలు, ఫొటోలు మళ్లీ వివిధ రకాల సైట్లలో అప్లోడ్ అయి ఉండటంతో షాకైంది. వంశీని అడిగితే పెళ్లికి ముందు తనతో గడిపితేనే, అవన్నీ తీసేస్తానని, లేదంటే సమాచారం అంతా పెళ్లికొడుక్కి చేరుతుందని బెదిరించడం మొదలుపెట్టాడు వంశీ. షాకైంది కావ్య. ‘సైట్స్ నుంచి తొలగించినట్టే తొలగించి, అవన్నీ దాచిపెట్టుకొని, పెళ్లి కుదిరే సమయానికి పాత వీడియోలను, ఫొటోలను అడ్డుపెట్టుకొని తన జీవితంతో ఆడుకుంటున్నాడ’ని అర్ధమైంది కావ్యకు. పెళ్లి ఆగిపోతుందని, పరువు పోతుందని భయపడి చావే శరణ్యం అనుకుంది. విషయమంతా తెలుసుకున్న రాఘరావు కూతురుని తీసుకొని పోలీసులను ఆశ్రయించాడు. కావ్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వంశీ ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. వ్యక్తిగత వివరాలు గోప్యం కొందరు సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసుకుంటుంటారు. చాలాసార్లు సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలు తీస్తుంటారు. ఇద్దరి మధ్య సంబంధం చెడినప్పుడు వీటిని అడ్డుగా పెట్టుకొని ముఖ్యంగా అమ్మాయిలను రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. వివిధ రకాల యాప్‌ల ద్వారా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి పోర్న్సైట్లలో పెట్టడం ఎక్కువగా జరుగుతోంది. అందుకని ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండటం అవసరం. పరువు పోతుందని పొలీసులను సంప్రదించకుండా మూడోమనిషి సాయం తీసుకుంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే ముందు కేసు ఫైల్ చేయాలి. వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం. సమస్యకూ సత్వరమే పరిష్కారం అందుతుంది. సైబర్ క్రైమ్ సమస్యలకు htps://4s4u.appolice.gov.in/ ఫోన్ నెంబర్: 90716 66667 సంప్రదించవచ్చు. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ బ్లాక్ చేయకూడదు.. బ్లాక్మెయిల్ చేస్తున్నారనగానే వెంటనే భయపడిపోతారు. వేధింపులు భరించలేక సదరు వ్యక్తి నెంబర్ బ్లాక్ చేస్తుంటారు. ఒకసారి వేధించాలనుకున్న వ్యక్తి రకరకాల మార్గాల ద్వారా బెదిరింపులకు దిగుతాడు. డబ్బులు ఇస్తామనో, మరో విధంగానో కాంప్రమైజ్ అవుతాను అనే ధోరణి నుంచి బయపడాలి. బ్లాక్మెయిల్ చేస్తున్నాడనగానే వారి డేటా, కాల్ రికార్డ్ చేసుకోవాలి. అన్ని మెసేజ్‌లను స్క్రీన్ షాట్స్ చేసి పెట్టుకోవాలి. వెంటనే http://www.cybercrime.gov.in/ నేషనల్ పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఫ్యామిలీ గ్రూప్‌లో నగ్న చిత్రాలు.. కాపురంలో చిచ్చు
ఫోన్ పోతే లైట్ తీసుకునేవాళ్లకు ఒక అలర్ట్ లాంటిది ఈ ఘటన. ఫోన్ చోరీకి గురైందని పట్టించుకోకుండా ఉండిపోయింది ఆమె. అయితే నెలరోజుల తర్వాత ఆమె వాట్సాప్ నుంచే ఫ్యామిలీ గ్రూప్‌లో ఆమెవేనంటూ నగ్న ఫొటోలు, అశ్లీల వీడియోలు షేర్ చేశాడు ఆ దొంగ. అంతేకాదు పని చేసే చోట ఆమె ఎఫైర్లు పెట్టుకుందంటూ ఆమె భర్తకే కాల్ చేసి చెప్పాడు. కాపురంలో చిచ్చు పెట్టిన ఫోన్ చోరీ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భోపాల్: గ్వాలియర్‌కు చెందిన మహిళ(28) స్థానికంగా ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. నెల క్రితం ఫోన్ పోగా.. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆపై కొత్త ఫోన్ కొనుక్కుని వాడుకుంటోంది. పది రోజుల కిందట కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో ఆమె నగ్న చిత్రాలు, అశ్లీల దృశ్యాలు షేర్ అయ్యాయి. అవి చూసి ఆమె కంగుతింది. తన ప్రమేయం లేకుండా తన వాట్సాప్ నుంచే అవి పోస్ట్‌కావడంతో భయపడింది. ఈలోపు ఆమె భర్తకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రతీకాత్మక చిత్రం ఖంగుతిన్న భర్త ఆమె పనిచేస్తున్న ఆస్పత్రిలో మేల్ స్టాఫ్‌తో శారీరక సంబంధం పెట్టుకుందని, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని ఆ ఆగంతకుడు ఆమె భర్తకి ఫోన్లో చెప్పాడు. అంతటితో ఆగకుండా కొన్ని పంపాడు కూడా. దీంతో ఆమె భర్త షాక్ తిన్నాడు. నిలదీయడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంతో పరువు పొగొట్టుకున్న ఆ యువతి.. మహరాజ్‌పుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రతీకాత్మక చిత్రం అవి మార్ఫింగ్‌వి! కాగా, తనవని ప్రచారం జరుగుతన్న ఫొటోలు, వీడియోలు ఎవరో మార్ఫ్ చేసినవని ఆమె వాపోయింది. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చిన ఆమె.. వాటిని షేర్ చేయొద్దని ప్రజలకు రిక్వెస్ట్ చేసింది. ఈ విషయంలో భర్త కుటుంబంతో రాజీ చర్చలు జరుపుతున్నామని ఆమె బంధువు ఒకరు తెలిపారు. కాగా, వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ నేరాల కింద కేసు నమోదు చేసుకున్న మహరాజ్‌పుర పోలీసులు.. సైబర్ క్రైమ్ వింగ్సాయంతో కేసును చేధించి నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు. -
నాటి అమెరికన్ ప్రెసిడెంట్లు ఇప్పుడు ఎలా ఉండేవారో..
మొన్న అమెరికన్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసింది జో బైడెన్ కాదనుకుందాం. అబ్రహం లింకన్ అనుకుందాం! పోనీ థామస్ జెఫర్సన్, పోనీ జాన్ ఆడమ్స్, పోనీ జేమ్స్ మ్యాడిసన్ అనుకుందాం. పోనీ అమెరికన్ ఫస్ట్ ప్రెసిడెంట్ జార్జి వాషింగ్టన్నే మొన్న స్వోర్న్–ఇన్ చేశారని అనుకుందాం. రాతియుగం నాటి ఆ ప్రెసిడెంట్ ల ముఖాలు ఈ పాలరాతి యుగంలో ఎలా ఉంటాయి? ఎంత పాలిష్డ్ గా, ఎంత ఫెయిర్ గా, ఎంత గ్లో గా, ఎంత లవ్లీ గా, ఎంత స్మార్ట్ గా.. అండ్, ఎంత ముద్దుగా (సేమ్ అదే వయసులో) ఉంటాయి? ఎలా ఉంటాయో అవార్డ్ విన్నింగ్ అమెరికన్ కామిక్ బుక్ రైటర్ ఒకావిడ ఊహించి పెయింట్ చేశారు! ‘అబ్బ! ఈ ప్రాచీన పురుష విగ్రహాలను ఇంతగా ఎలా ఈ న్యూ ఏజ్ లోకి మోసుకు రాగలిగారండీ..‘ అంటే.. ‘ఏం లేదు. ముఖం పై కనిపించీ కనిపించకుండా కాస్త స్మైల్ పులిమానంతే..’ అని ఆమె నవ్వుతూ చెబుతున్నారు. ఫొటోగ్రఫీ పుట్టక ముందే యూఎస్ ప్రెసిడెంట్ పుట్టారు! సరాసరి ప్రెసిడెంట్‌గా పుట్టడం కాదు లెండి. యూఎస్‌కు స్వాతంత్య్రం వచ్చాక తొలి అధ్యక్షుడిగా జార్జి వాషింగ్టన్ 1789 లో ప్రమాణ స్వీకారం చేస్తే, 1826 లోనో 1827 లోనో మానవాళికి ఫొటోగ్రఫీ చేతనైంది. అంతకు పూర్వం, ఆ తర్వాత కూడా ఏళ్ల పాటు అమెరికన్ అధ్యక్షులు చిత్రలేఖనాల్లో మాత్రమే ఫొటోలుగా ఉండేవారు. యు.ఎస్. ప్రెసిడెంట్లు వచ్చి ఇప్పటికి 232 ఏళ్లు గడిచాయి. ఫొటోలు వచ్చి 195 ఏళ్లు అయ్యాయి. ఇన్నేళ్లగా పాలకులు నాగరికం అవుతూ వస్తున్నట్లే ఫొటోగ్రఫీ కూడా అత్యాధునికం అవుతూ వచ్చింది. అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కనుక మొన్న జో బైడెన్‌కు బదులుగా ప్రమాణం స్వీకారం చేసి ఉంటే అప్పటికన్నా ఆయన భిన్నంగా ఉండేవారు. అలాగే ఆ పందొమ్మిదో శతాబ్దపు అధ్యక్షులంతా! అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ కూడా మోడర్న్‌గా ఉండేవారు. ఏమిటీ వింత ఊహ! వింత ఊహే కానీ ఆసక్తిని కలిగించే ఊహ. ప్రముఖ కామిక్ పుస్తకాల అమెరికన్ రచయిత్రి 36 ఏళ్ల మగ్దలీన్ విసాజియోకు వచ్చిన ఒక ‘అందమైన’ ఆలోచన ఇది. ఆలోచన వచ్చిన వెంటనే ఆమె తొలినాళ్ల అమెరికా అధ్యక్షులను ఎంపిక చేసుకుని వారిని ఈ కాలానికి తగ్గట్లుగా ఫొటో తీశారు! అలాగని ఆమె చిత్రకారిణి గానీ, ఫొటోగ్రాఫర్ కానీ కాదు. తన స్మార్ట్ ఫోన్లోని ఫేస్‌యాప్, ఎయిర్ బ్రెష్‌లను ఉపయోగించి అధ్యక్షుల వారిని ఆధునాతనంగా ‘చిత్రీకరించారు’. మగ్దలీన్ ఇప్పటి వరకు ఐదు సార్లు కామిక్ పుస్తకాలకు ఇచ్చే ఔట్‌స్టాండింగ్ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఫేస్ మార్ఫింగ్‌కి ప్రత్యేకంగా అవార్డులు ఉంటే కనుక ఈ ముఖ రచనలకు నామినేట్ అవడమే కాదు, తప్పనిసరిగా అవార్డును సాధిస్తారు కూడా. అంత నాణ్యంగా, ఓ గంట క్రితమే ఈ అధ్యక్షులు అందరూ దివి నుంచి భువికి దిగి, మేకోవర్ చేయించుకుని వచ్చినట్లుగా ఉన్నారంటే అది.. పోలికలు పోకుండా పూర్వపు ఏలికల్ని సృష్టించిన మగ్దలీన్ ప్రావీణ్యమే! ఒక్కో ఫొటోకి జీవం పోయడానికి 15–30 నిముషాలు మాత్రమే పట్టిందట. అమెరికా తొలి పదిహేడు మంది అధ్యక్షుల ఆధునిక రూపాలివి. జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడు. -
మరో మన్మథుడు.. మహిళలే టార్గెట్
సాక్షి, చెన్నై: రామనాథపురంలో మరో మన్మథుడు పోలీసులకు చిక్కాడు. యుక్త వయస్సు దాటిన మహిళలు, వివాహమైన వారిని టార్గెట్ చేయడం, వారి చిత్రాలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న సరిగ్గా మీసాలు కూడా రాని ఈ మన్మథుడికి తమదైన స్టైల్లో పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంతే కాదు, ఇతగాడి బాధితులు ఉంటే, ఫిర్యాలు చేయాలని ప్రత్యేక నంబర్‌ను ప్రకటించారు. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో కాశి అనే మన్మతుడు యువతుల్ని టార్గెట్ చేసి సాగించిన లీల, మోసాలు, బ్లాక్ మెయిలింగ్ గురించి తెలిసిందే. ఇతగాడి చేతిలో మోసపోయిన వాళ్లు ఎక్కువే కావడంతో కేసు సీబీసీఐడీకి సైతం చేరింది. ఈ పరిస్థితుల్లో ఆంటీలను టార్గెట్ చేసి, అంకుల్స్‌కు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్న మరో మన్మథుడి లీల బయటపడింది. చదవండి: కరోనా ఎఫెక్ట్: మెట్రో కీలక నిర్ణయం ధైర్యంగా ఫిర్యాదు.. రామనాథపురం పరమకుడికి చెందిన ఓ ఉద్యోగి శుక్రవారం ఎస్పీ వరుణ్‌కుమార్‌కు ఓ ఫిర్యాదు చేశాడు. తన భార్య చిత్రాల్ని మార్ఫింగ్ చేసి ఎవరో ఓ యువకుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, ఆమె తీవ్ర ఆందోళనతో ఉందని, మరో వేదనలో పడి ఉందని వివరించాడు. తాను ఆ యువకుడితో మాట్లాడగా రూ. 20 వేలు ఇస్తే సరి అని, ఇవ్వకుంటే సామాజిక మాధ్యమాల్లోకి ఆ ఫొటోల్ని ఎక్కిస్తానని బెదిరిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ఫిర్యాదును తక్షణం పరిగణనలోకి తీసుకున్న ఎస్పీ ఓ బృందాన్ని రంగంలోకి దించారు. ఆ యువకుడ్ని పట్టుకునేందుకు పథకం వేశారు. ఆ యువకుడు అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి ఆ ఉద్యోగి సిద్ధమయ్యాడు. ఆ నగదు తీసుకునేందుకు శనివారం వేకువజామున ఓ చోటకు వచ్చిన ఆ యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. ఇతడు స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నట్టు, అతడు ఉలగనాథపురానికి చెందిన రోహిత్ అని తేలింది. సరిగ్గా మీసాలు కూడా రాని ఇతడు ఫేస్ బుక్, టిక్ టాక్, వాట్సాప్‌ల ద్వారా యుక్త వయస్సు దాటిన వాళ్లు, వివాహమైన మహిళల్ని టార్గెట్ చేశాడు. వారితో పరిచయాలు పెంచుకోవడమే కాదు, వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి వారికే పంపించడం సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కిస్తానని బెదిరించడం, కొందర్ని లొంగ దీసుకున్నట్టు, మరి కొందరి వద్ద నగదు దోచుకున్నట్టు విచారణలో తేలింది. అలాగే, అతడి సెల్‌ఫోన్ నిండా మార్ఫింగ్ చేసిన మహిళ చిత్రాలే ఉండడం, బెదిరింపు మెసేజ్‌లు అనేక మందికి పంపించి ఉండడం వెలుగు చూసింది. దీంతో ఇతగాడి బాధితులు ఎక్కువగానే ఉంటారని భావించిన పోలీసులు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. అలాగే, ఓ సెల్ నంబర్‌ను ప్రకటించి, సమాచారం ఇవ్వాలని, బాధితుల వివరాల్ని గోప్యంగా ఉంచుతామని ఎస్పీ వరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఇతగాడికి తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తూ, మరిన్ని విషయాల్ని రాబట్టే పనిలో రామనాథపురం పోలీసులు నిమగ్నం అయ్యారు. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే -
‘ఇన్‌స్టా’లో ‘బాయిస్’ బీభత్సం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బాయిస్ లాకర్ రూమ్’అనే గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని బాలికల ఫొటోలను మార్ఫింగ్ చేసి, వారిపై అసభ్యంగా కామెంట్స్ చేస్తున్న మైనర్ విద్యార్థులపై ఢిల్లీ పోలీస్‌కు చెందిన సైబర్ క్రైమ్ విభాగం చర్యలు తీసుకుంది. ఆ గ్రూప్ అడ్మిన్‌ను బుధవారం అదుపులోకి తీసుకుంది. అతడి నుంచి గ్రూప్‌లోని ఇతర విద్యార్థుల సమాచారం సేకరించింది. ఢిల్లీలోని 3 ప్రముఖ పాఠశాలలకు చెందిన విద్యార్థులుగా వారిని గుర్తించింది. బాలికల ఫొటోలను నగ్న ఫొటోలుగా మార్ఫ్ చేయడం, వాటిని ఆ గ్రూప్ చాట్ రూమ్‌లో షేర్ చేసుకుంటూ అసభ్యంగా, గ్యాంగ్ రేప్ చేయాలంటూ నేరపూరితంగా సందేశాలు పంపుకునేవారు. ఆ డిస్కషన్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇతర మాధ్యమాల్లో వైరల్ అయ్యి, సంచలనం సృష్టించడంతో సైబర్ క్రైమ్ రంగంలోకి దిగింది. ముఖ్యంగా ఒక బాలిక ఈ గ్రూప్ సంభాషణల స్క్రీన్ షాట్స్‌ను బహిర్గతపర్చడంతో మొదట ఈ గ్రూప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చదవండి: అమెరికాలో లాక్డౌన్ ఎత్తివేత ఫలితం? గ్రూప్‌లో 13–18 ఏళ్లలోపువారు.. నోయిడాలోని ఒక ప్రముఖ స్కూల్లో 12వ తరగతి పూర్తి చేసుకున్న 18 ఏళ్ల విద్యార్థి ఆ గ్రూప్ అడ్మిన్‌గా గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 27 మంది గ్రూప్ సభ్యులను పోలీసులు గుర్తించారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు. వారిలో చాలామంది 11, 12 తరగతుల వారే. గ్రూప్‌లో 13 ఏళ్ల విద్యార్థి నుంచి 18 ఏళ్ల వయస్సున్న విద్యార్థి వరకు ఉన్నారు. ఆ గ్రూప్‌లోని మైనర్ సభ్యులను పోలీసులు వారి తల్లిదండ్రులు, ఎన్జీఓ ప్రతినిధుల ముందు ప్రశ్నిస్తున్నారు. మొత్తం 51 మంది సభ్యులున్నారని, మార్చి నెలాఖరులో తమను చేర్చుకున్నారని పలువురు విద్యార్థులు తెలిపారు. బాలికలు తమ ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పోస్ట్ చేసుకున్న ఫొటోలను వీరు అసభ్యంగా మార్ఫ్ చేసి బాయిస్ లాకర్ రూమ్ గ్రూప్‌లో షేర్ చేసేవారు. ఈ గ్రూప్ వివరాలను ఇన్స్టాగ్రామ్ నుంచి కోరామని, వారి నుంచి సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు తెలిపారు. జువనైల్ జస్టిస్ చట్టం ప్రకారం మైనర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు, ఇన్‌స్టాగ్రామ్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసును సుమోటాగా స్వీకరించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు బుధవారం ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ డీఎన్ పటేల్‌కు లేఖ రాశారు. పోక్సో, ఐటీ చట్టాలు, ఐపీసీ కింద వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు. చదవండి: డర్టీ ఛాట్ -
తాజ్ వద్దకు తీసుకెళ్లినందుకు థ్యాంక్స్: ఇవాంకా
న్యూఢిల్లీ: నటుడు, గాయకుడు దిల్జిత్ దొసాంజ్ చేసిన ఓ ట్వీట్ ట్విట్టర్‌ను ఊపేస్తోంది. దీనికి కారణం ఆ ట్వీట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు రిప్లై ఇవ్వడమే. వివరాల్లోకి వెళితే.. ఇవాంకా ట్రంప్ ఇటీవల భారత పర్యటనలో తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. అందులో ఆమె తాజ్‌మహల్ వద్ద దిగిన ఓ ఫొటోను దిల్జిత్ ఫొటోషాప్ ఉపయోగించి మార్ఫింగ్ చేసి, ఇవాంకా పక్కన తన ఫొటో పెట్టుకున్నాడు. ‘నేనే తనను తాజ్‌మహల్ వద్దకు తీసుకెళ్లాను.. అంతకంటే ఏం చేయగలను ?’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై ఇవాంకా స్పందిస్తూ.. ‘నన్ను తాజ్‌మహల్ వద్దకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు. దీన్ని నేనెప్పటికీ మరచిపోలేను.’ అంటూ రిప్లై ఇచ్చారు. దీనిపై దిల్జిత్ స్పందిస్తూ.. ‘ఓ మైగాడ్.. కృతజ్ఞతలు ఇవాంకా ! ఇది ఫొటోషాప్ చేసిన చిత్రం కాదని అందరికీ చెప్పేప్రయత్నం చేస్తున్నారు. ఈసారి లూథియానాకు రండి’ అన్నారు. దీనిపై మళ్లీ స్పందించిన ఇవాంకా ‘భారతీయ అభిమానులను అభినందిస్తున్నా’ అంటూ ఫొటోషాప్ చేసిన మరికొన్ని చిత్రాలను షేర్ చేశారు. తనపై ఫొటోషాప్ చేసిన ఫొటోలపై ఇవాంకా సీరియస్‌గా కాకుండా ఫన్నీగా స్పందించడంతో ట్విట్టర్లో నవ్వులు పూశాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఇవాంకా ట్రంప్ మార్ఫింగ్ ఫొటోలు -
‘బీహార్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇచ్చారు’
సాక్షి, అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ ఏ ఫొటోల ఆధారంగా హైకోర్టు తమ వివరణ కోరిందో అందులో పలు ఫొటోలు మార్ఫింగ్ చేసినవని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు సుమోటోగా తీసుకున్న వ్యాజ్యంతో జత చేసి ఉన్న ఫొటోల్లో మార్ఫింగ్ చేసిన ఫొటోలున్నాయని తెలిపారు. బీహార్‌లో ఎప్పుడో జరిగిన ఘటన తాలూకు ఫొటోను ఇప్పుడు అమరావతి ప్రాంత రైతుల ఆందోళనతో ముడిపెట్టి మార్ఫింగ్ చేశారని కోర్టుకు వివరించారు. మిగిలిన ఫొటోల్లో చూపిన దానికి, క్షేత్రస్థాయిలో జరిగిన దానికీ చాలా తేడా ఉందని పేర్కొన్నారు. వాస్తవంగా జరిగిన ఘటన తాలూకు అసలు వీడియోలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని కోర్టు ముందుంచుతామని తెలిపారు. అంతేకాక అప్పుడప్పుడు కొన్ని సమయాల్లో తప్ప 2014 నుంచి 144 సెక్షన్ అమలు చేస్తూనే ఉన్నామన్నారు. వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, తగిన వ్యవధినివ్వాలని హైకోర్టును శ్రీరామ్ కోరారు. స్పందించిన హైకోర్టు.. విచారణను 20కి వాయిదా వేసింది. మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి అమరావతి ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు హైకోర్టు నిర్ధిష్టమైన ఆదేశాలిచ్చింది. ఏ మహిళను కూడా సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయానికి ముందు అరెస్ట్ చేయరాదని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సి వస్తే మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫొటోల ఆధారంగా సుమోటో వ్యాజ్యం 144 సెక్షన్ విధించడమే కాకుండా, అమరావతి ప్రాంత రైతులపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని, ఫొటోలను హైకోర్టు తనంతట తాను (సుమోటో) ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా(పిల్) పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యానికి సదరు పత్రికలో ప్రచురితమైన ఫొటోలను, ఇతర ఫొటోలను హైకోర్టు జత చేసింది. అలాగే అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ విధింపును సవాలు చేస్తూ పలువురు వేర్వేరుగా 8 పిటిషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ఓ ప్రాథమిక కౌంటర్‌ను ధర్మాసనం ముందుంచారు. నిరసనకారులను కొడుతున్నట్లున్న ప్రచురితమైన ఫొటోలు మార్ఫింగ్ చేసినవని వివరించారు. రక్తం కారుతూ ఉన్న ఆ మహిళ ఫొటో బీహార్‌లోని భాగల్పూర్లో గతంలో జరిగిన ఓ ఘటనలో గాయపడ్డ మహిళ అని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. 2017లో ఘటనలకు సంబంధించి ఫేస్బుక్లో వచ్చిన ఫొటోలను ఇక్కడి అమరావతి ఆందోళనలతో ముడిపెట్టారని తెలిపారు. వాస్తవానికి అటువంటి ఘటనలేవీ ఇక్కడ జరగలేదన్నారు. మార్ఫింగ్ ఫొటోలను ప్రచురించడం కోర్టు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. కోర్టు సైతం ఆ ఫొటోల ఆధారంగా ఓ నిర్ణయానికి రాకూడదని, ఘటన పూర్తి క్రమాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... నిరసనకారులు సైతం కొంత నిగ్రహం పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. -
నన్ను పెళ్లి చేసుకోకపోతే ఫలితం అనుభవిస్తావ్
కొద్దిరోజుల క్రితం ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫోన్ చేసి ‘నువ్వు, నీ భార్య కలిసున్న చిత్రాలు, వీడియోలు అశ్లీల వెబ్సైట్లో ఉంచుతాం’ అంటూ బెదిరించారు. ఆయన స్పందించకపోవడంతో ఆయన భార్య చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సాక్షి, సిటీబ్యూరో: సార్... నా పేరు స్వాతి (పోలీసులు పేరు మార్చారు). పీజీ చదువుకుంటున్నాను. కొద్దిరోజుల క్రితం బంధువుల ఇంట్లో జరిగిన విందులో పాల్గొని, అందరితో కలిసి ఫొటోలు తీసుకున్నాను. ఇటీవల నాకు నిశ్చితార్థమైంది.నా స్నేహితుడంటూ ఎవరో అపరిచిత వ్యక్తి నాకు కాబోయే భర్తకు ఆ ఫొటోలను పంపించాడు. నా ఫోన్ నంబరుసంపాదించి ‘నన్ను పెళ్లి చేసుకోకపోతే ఫలితం అనుభవిస్తావ్’ అంటూ బెదిరించాడు. అసభ్యకరమైన చిత్రాలకు నా ముఖాన్ని మార్ఫింగ్ చేసి వ్యాఖ్యలు రాశాడు. ఈ కారణంగా నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు. మా అమ్మానాన్న నచ్చజెప్పినా వినడం లేదు. నేను తప్పు చేయలేదని నిరూపించండి. సైబర్ క్రైమ్ పోలీస్ అధికారితో స్వాతి మొర ఇది. ఇలాంటి ఇబ్బందులు ఒక్క స్వాతికే పరిమితం కాదు. ఎంతో మంది విద్యార్థినులు, యువతులు, మహిళలకు ఎదురవుతున్నాయి. తమ చిత్రాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని విశ్లేషించిన పోలీస్ అధికారులు అపరిచితులు పంపిన చిత్రాలు, పోస్ట్‌లకు స్పందించవద్దని సూచిస్తున్నారు. ఈ తరహా కేసులు సైబరాబాద్, రాచకొండలో ఎక్కువవుతున్నాయి. అపరిచితులతో స్నేహం వద్దు... ఫేస్బుక్ ఖాతాలతోనే విద్యార్థినులు, యువతులు, మహిళలకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన చిత్రాలు, వ్యాఖలకు ‘లైక్’ కొట్టడం ద్వారా ఇలా జరుగుతోందని వివరిస్తున్నారు. ఎప్పుడో స్నేహితులతో గడిపిన సందర్భాలు, దేవాలయాలు, సినిమా థియేటర్లు, హోటళ్లకు వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో సైబర్ నేరగాళ్లు వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇందులో చాలామంది విద్యార్థినులు పెళ్లికి ముందు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫేస్బుక్ ఖాతాల్లోకి ప్రవేశిస్తున్న నిందితులు, నేరగాళ్లు... యువతులు, విద్యార్థినులు లక్ష్యంగా చేసుకుని వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిందితుల్లో బాధితులకు తెలిసినవారు, అపరిచితులు ఉంటున్నారు. సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్లలో ఖాతాలున్న యువతులు, విద్యార్థినుల వ్యక్తిగత వివరాలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలను నేరగాళ్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. స్నేహితులు, బంధువులే ఎక్కువ ఫేస్బుక్ ద్వారా వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది బాధితుల స్నేహితులు, బంధువులే ఉంటున్నారు. ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు ఈ వివరాలు వెల్లడవుతున్నాయి. ఫేస్బుక్ ఖాతాలున్న యువతులు, విద్యార్థినులు తమ వ్యక్తిగత వివరాలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. వీటిని నేరగాళ్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెబుతున్నారు. అవతలి వారు ఇష్టం లేదని చెప్పిన రెండు, మూడు రోజుల నుంచి వేధింపులు ప్రారంభిస్తున్నారు. స్నేహితులు.. కదా అనుకొని వారితో ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్లుంటే ఆ ఫొటోలను ఫేస్బుక్లో ఉంచుతున్నారు. తల్లిదండ్రులకు చెబితే కొడతారన్న భయంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. వేధింపులు తీవ్రంగా మారినప్పుడు మాత్రం తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అపరిచితులు బ్లాక్మెయిల్ చేసి బాధితుల నుంచి డబ్బు తీసుకునేందుకు ఫేస్‌బుక్‌ను ఎంచుకుంటున్నారు. వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు పెట్టొద్దు మాకొస్తున్న ఫిర్యాదుల్లో బాధితులు చాలామంది తమ ఫేస్బుక్, ట్విట్టర్లో పెట్టిన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేశారని అంటున్నారు. మేం³రిశీలిస్తే 50శాతం వరకు అలాంటివే. అందుకే విద్యార్థినులు, యువతులు... పార్టీలు, వేడుకలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫొటోలు, వీడియోలు దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని గుర్తించాలి. బంధువులు, స్నేహితులతో గడిపేటప్పుడు హద్దుల్లో ఉండండి. అపరిచితులతో ఫంక్షన్లకు వెళ్లడం, సినిమాలు, పార్టీలకు హాజరుకావడం వంటివి చేస్తే ఇబ్బందుల్లో పడతామనిగ్రహించండి. కళాశాలలు, కార్యాలయాల్లో జరిగే విషయాలను, ఇబ్బందికరంగా అనిపించినవి తల్లిదండ్రులకు తెలిపితే ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే పరిష్కరించుకోవచ్చు. – రోహిణి ప్రియదర్శిని, డీసీపీ,సైబరాబాద్ క్రైమ్స్ -
పిన్ని, బంధువుల ఫోటోలు సైతం అసభ్యంగా ఫేస్బుక్లో
చెన్నై,తిరువొత్తియూరు: వందకు పైబడిన మహిళల ఫొటోలను అసభ్యంగా చిత్రీకరించి ఫేస్బుక్లో పెట్టిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పెరియ కాంచీపురం మల్లిగై వీధికి చెందిన మహ్మద్ గయాస్ (27) శ్రీ పెరంబదూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. అతను చెన్నై ట్రిప్లికేన్‌లో అద్దె ఇంటిలో వివాహం చేసుకోకుండా సుమతి అనే యువతితో కలసి వుంటున్నాడు. ఈ క్రమంలో సుమతితో కలిసి పలు కార్యక్రమాలకు హాజరైన గయాస్ మహిళలకు తెలియకుండా ఫోటోలు తీసి వాటిని అసభ్యంగా చిత్రీకరించి ఫేస్బుక్లో పెట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఓ యువతి ఫేస్బుక్ చూస్తున్న సమయంలో తన ఫొటో అసభ్యంగా చిత్రీకరించడం చూసి దిగ్భ్రాంతి చెందింది. దీనిపై చెన్నై వెస్టుజోన్ జాయింట్ కమిషనర్ విజయకుమార్‌కు ఫిర్యాదు చేసింది. దీనినై విచారణ చేసిన పోలీసులు మహ్మద్ గయాస్‌ను అరెస్టు చేశారు. అతని సెల్ఫోన్లో తనిఖీ చేయగా 50 ఏళ్లలోపు 100 మందికి పైబడిన మహిళా ఫొటోలను అసభ్యంగా చిత్రీకరించినట్లు గుర్తించారు. అతను తన తల్లి, పిన్ని, బంధువులు ఫోటోలు సైతం అసభ్యంగా చిత్రీకరించాడు. గయాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మాయలేడి; ఫొటోలు మార్ఫింగ్ చేసి..
సాక్షి, హైదరాబాద్ : ఉన్నత విద్యను అభ్యసించిన ఓ యువతి తన తెలివితేటలను ఉపయోగించి కొత్త తరహా మోసానికి తెర లేపింది. స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ డబ్బులు వసూల్ చేసింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ప్రస్తుతం కటకటాలపాలైంది. వివరాలు... నగరానికి చెందిన 21 ఏళ్ల యువతి బీఎస్సీ కంప్యూటర్స్ చదివింది. విలాసాలకు అలవాటుపడిన ఆమె వివిధ స్కూళ్లకు సంబంధించిన వెబ్సైట్లను, సోషల్ మీడియా అకౌంట్లపై దృష్టి సారించింది. స్కూళ్లకు సంబంధించిన పలు ఈవెంట్లలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర సిబ్బంది ఫొటోలను డౌన్లోడ్ చేసుకునేది. వాటిని మార్ఫింగ్ చేసి తిరిగి ఆ స్కూల్ అకౌంట్లకే పంపించేది. తాను సైబర్ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నానని... మీకు సంబంధించిన అశ్లీల ఫొటోలు నా వద్ద ఉన్నాయంటూ స్కూల్ యాజమాన్యాన్ని బెదిరించేది. తనకు డబ్బులు ఇస్తేనే వాటిని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేది. ఈ నేపథ్యంలో యువతి ఆగడాలు రోజురోజుకీ శ్రుతిమించడంతో ఓ బాధిత స్కూలు యాజమాన్యం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. దీంతో సదరు యువతి బండారం బట్టబయలైంది. విద్యార్థులకు సంబంధించిన విషయం కావడంతో ఈ కేసును సవాలుగా తీసుకుని.. త్వరితగతిన ఛేదించినట్లు అడిషనల్ సీపీ రఘువీర్ తెలిపారు. యువతి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని.. అందులో 225 స్కూళ్లకు సంబంధించిన వివరాలు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. స్కూల్ వెబ్సైట్లను హ్యాక్ చేసి.. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి..తన నంబరు ద్వారా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగేదని పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియా వల్ల లాభాలతో పాటు ఎన్నో నష్టాలు కూడా ఉన్నందున వ్యక్తిగత ఫొటోలు అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని రఘువీర్ సూచించారు. పర్సనల్ ఫొటోలు పెట్టేపుడు ప్రైవసీ సెట్టింగ్స్ ఫాలో అయితే ఇలాంటి కిలాడీల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.