
సాక్షి, హైదరాబాద్: సినీ హీరోయిన్ల ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్న కేసులో సీఐడీ అధికారులు బుధవారం ఓ సివిల్ ఇంజినీర్‌ను అరెస్టు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు గత ఏడాది ఈ కేసు నమోదైన విషయం విదితమే. అప్పటి నుంచి బాధ్యులను గుర్తిస్తున్న సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు వరుస అరెస్టులు చేస్తున్నారు.
బోడుప్పల్‌కు చెందిన రుద్రవరకు రఘువరన్ ఓ ప్రైవేట్ సంస్థలో సివిల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఇంటర్‌నెట్‌లో ఓ బ్లాగ్‌స్పాట్ క్రియేట్ చేసిన ఇతను ప్రముఖ హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ అందులో పోస్ట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి కల్పిత కథలను పొందుపరుస్తున్నాడు. తద్వారా సైట్‌కు హిట్స్ పెరగడంతో ఆర్థికంగా లాభం పొందుతున్నాడు. బుధవారం నిందితుడిని అరెస్టు చేసిన సీఐడీ అధికారులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment