Heroines
-
టాలీవుడ్ హీరోయిన్స్ సంక్రాంతి స్పెషల్ విషెస్ (ఫోటోలు)
-
న్యూ ఇయర్ వేకేషన్లో లావణ్య- వరుణ్ తేజ్.. లండన్‌లో రకుల్ ప్రీత్ సింగ్ సెలబ్రేషన్స్
లండన్‌లో రకుల్ ప్రీత్ సింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్...న్యూ ఇయర్ వేకేషన్లో లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్..2024 జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న రహస్య గోరఖ్..చిల్ అవుదామంటోన్న అనికా సురేంద్రన్...న్యూ ఇయర్ విషెస్ చెప్పిన నేషనల్ క్రష్ రష్మిక..కొత్త ఏడాది ఆలయంలో రాశీ ఖన్నా పూజలు.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Rahasya Kiran (@rahasya_kiran) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో సినీతారలు సందడి (ఫోటోలు)
-
హీరోలకు తక్కువేం కాదు.. ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తున్న హీరోయిన్లు
వెండితెరపై వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తుంటారు హీరోయిన్లు. కొన్ని చిత్రాల్లో ఫెరోషియస్ రోల్స్ చేస్తుంటారు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తుంటారు. హీరోలా సినిమాని నడిపించేలా హీరోషియస్ రోల్స్ చేస్తున్న కొంతమంది హీరోయిన్స్‌పై కథనం.ప్రతీకారంపవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేసే అగ్రశ్రేణి హీరోయిన్స్ జాబితాలో అనుష్కా శెట్టి ముందు వరసలో ఉంటారు. ‘అరుంధతి, భాగమతి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో అనుష్క చేసిన నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ను ఆడియన్స్ అంత సులభంగా మర్చిలేరు. కొంత గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ పవర్ఫుల్ రోల్‌నే ‘ఘాటి’ చిత్రంలో చేస్తున్నారు అనుష్క. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటీవల ‘ఘాటి’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఈ వీడియోలో ఓ మనిషి తలను అతి క్రూరంగా కొడవలితో నరికిన మహిళగా అనుష్క కనిపించారు. ఈ విజువల్స్ ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో స్పష్టం చేశాయి. ‘షూటి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది.ఇక వ్యాపారంలో అత్యుత్తమంగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు దారుణంగా మోసం చేస్తారు. ఈ మోసంతో ఆ మహిళ మనసు విరిగిపోయి, కఠినంగా మారుతుంది. తనను మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడే గెలవాలనుకుంటుంది. ఆ మహిళ ఎలా గెలిచింది? అన్నదే ‘ఘాటి’ కథ అని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ సినిమాలో అనుష్క ఓ లీడ్ రోల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.శివశక్తిదాదాపు ఇరవైఏళ్ల సినీ కెరీర్లో హీరోయిన్ తమన్నా డిఫరెంట్ రోల్స్ చేశారు. వీటిలో కొన్ని యాక్షన్ తరహా చిత్రాలూ ఉన్నాయి. అయితే ఈసారి కొంచెం కొత్తగా యాక్షన్‌తో కూడిన ఆధ్యాత్మిక పాత్ర నాగసాధువు శివశక్తిగా కనిపించనున్నారు తమన్నా. దర్శకుడు సంపత్ నంది కథతో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ సినిమాలోనే నాగసాధువు శివశక్తిగా తమన్నా కనిపిస్తారు.మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ, నాగమహేశ్ వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఓదెల మల్లన్న ఆలయం, ఆ గ్రామంలో జరిగే కొన్ని ఊహాతీత ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.కూతురి కోసం...ఓ రాక్షసుడి నుంచి తన చిన్నారి కుమార్తెను కాపాడుకోవడానికి ఓ తల్లి రాక్షసిగా మారింది. ఈ రాక్షసుడిపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో ఆ తల్లి ఎలా పోరాడింది? అనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘రాక్కాయి’. నయనతార లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో కూతురి రక్షణ కోసం ఎంతకైనా తెగించే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. సెంథిల్ నల్లసామి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో బరిసె పట్టుకుని, ఆ బరిసెకు కొడవలి బిగించి, మరో చేతిలో మరో కొడవలిని పట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న నయనతార విజువల్స్ ‘రాక్కాయి’ టైటిల్ గ్లింప్స్‌లో కనిపించాయి. ఇప్పటివరకు ‘డోరా, ఐరా, నెట్రిక్కన్’ వంటి హారర్ ఫిల్మ్స్, ‘కర్తవ్యం’ వంటి సామాజిక సందేశం ఉన్న సినిమాల్లోనే నయనతార ఎక్కువగా నటించారు. తొలిసారిగా ఆమె ‘రాక్కాయి’ వంటి పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.వంట గదిలో తుపాకీకిచెన్లో గరిటె పట్టుకునే గృహిణిగానే కాదు... అవసరమైతే అదే చేత్తో తుపాకీ కూడా పట్టుకోగలదు. ఇంతకీ ఆ గృహిణి పూర్తి కథ ఏంటో తెలుసుకోవాలంటే ‘మా ఇంటి బంగారం’ సినిమా థియేటర్స్‌లోకి వచ్చేంతవరకూ వేచి ఉండాలి. ఇందులో సమంత లీడ్ రోల్లో నటిస్తారు. ‘ట్రా లా లా’ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను సమంతనే నిర్మిస్తుండటం విశేషం. ఈ ఏడాది సమంత బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాను ప్రకటించారు.అయితే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, షూటింగ్ అప్డేట్స్ వంటి విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, షూట్ మొదలైందని సమాచారం. ఇక ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌లో సమంత ఓ యాక్షన్ రోల్ చేసి, బుల్లితెరపై సూపర్‌హిట్ అయ్యారు. ఇప్పుడు వెండితెరపైనా ఈ రిజల్ట్‌ను రిపీట్ చేయాలనుకుని యాక్షన్ బేస్డ్ మూవీ ‘మా ఇంటి బంగారం’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్.హ్యాండ్ బాగ్‌లో బాంబుఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో ఏముంటాయి? మేకప్ కిట్, మొబైల్ ఫోన్... వగైరా వస్తువులు ఉండటం కామన్. కానీ ఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో మాత్రం రక్తంతో తడిసిన కత్తి, ఓ తుపాకీ, బాంబు ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరు అంటే రివాల్వర్ రీటా. వెండితెరపై రివాల్వర్ రీటాగా చేస్తున్నారు కీర్తీ సురేష్. పవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేయడంలో సిద్ధహస్తురాలైన హీరోయిన్స్‌లో ఒకరైన కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’లో మరోసారి నటిగా తానేంటో చూపించనున్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు కె. చంద్రు తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.గాంధారి గతంకిడ్నాప్కు గురైన తన కుమార్తెను రక్షించుకోవడం కోసం ఓ తల్లి చేసే సాహసాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘గాంధారి’. ఈ చిత్రంలో తల్లి పాత్రలో తాప్సీ నటిస్తున్నారు. ఈ ఫిల్మ్‌లోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను ఆమె డూప్ లేకుండా చేశారు. దేవాశిశ్ మఖీజా దర్శకత్వంలో ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తున్నారు. ఓ తల్లి గతం వల్ల ఆమె కూతురు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఏం చేసింది? అనే అంశాలతో ‘గాంధారి’ చిత్రకథ ఉంటుందని సమాచారం.ఇలా యాక్షన్ రోల్స్ చేసే హీరోయిన్స్ మరికొంతమంది ఉన్నారు. : ముసిమి శివాంజనేయులు -
హీరామండి సిరీస్‌లో అదరగొట్టిన అందాల ముద్దుగుమ్మలు (ఫోటోలు)
-
Mothersday 2024 ‘బంగారం నువ్వమ్మా’! టాలీవుడ్ అమ్మల్నిచూశారా?
-
మదర్స్ డే 2024 : బీటౌన్ మామ్స్పై ఒక లుక్కేసుకోండి! (ఫోటోలు)
-
ఈ హీరోయిన్ల రాశి ఏంటో తెలుసా? (ఫొటోలు)
-
డీ గ్లామర్‌కి సై అంటున్న స్టార్ హీరోయిన్లు
డీ గ్లామరస్ క్యారెక్టర్లంటే కొంచెం రిస్క్. అయితే ఆర్టిస్ట్‌గా మంచి పేరు వస్తుంది. అందుకే ఆ తరహా క్యారెక్టర్లకు చాన్స్ వచ్చినప్పుడు గ్లామర్ గురించి ఆలోచించకుండా డీ గ్లామరస్ క్యారెక్టర్లకు సై అంటారు. ఆ పాత్రల్లో గుర్తు పట్టలేనంతగా మారిపోయిన కథానాయికల గురించి తెలుసుకుందాం. స్వాగతం బంగారం తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ‘తంగమ్’గా తయారయ్యారు హీరోయిన్ జాన్వీ కపూర్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ చిత్రంలోని జాన్వీ కపూర్ పాత్ర పేరు తంగమ్ (బంగారం) . దేశంలో విస్మరణకు గురైన తీర ప్రాంంతాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ మురికివాడ బస్తీలో జీవనం సాగించే తంగమ్ అనే యువతి పాత్రలో జాన్వీ కపూర్ కనిపిస్తారని తెలిసింది. కథ రీత్యా జాన్వీ కపూర్ కొన్ని సీన్స్‌లో డీ గ్లామరస్‌గా కనిపిస్తారు. తెలుగులో చేస్తున్న తొలి సినిమాతో జాన్వీ ఇలాంటి ఓ డీ–గ్లామరస్ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఆమె పాత్రలో ఎంత డెప్త్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వేషధారణ, తెలుగు భాష ఉచ్ఛరణ వంటి అంశాల్లో స్పష్టత ఉండేలా జాన్వీ ‘దేవర’ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిరిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం అక్టోబరు 10న రిలీజ్ కానుంది. ‘కల్కి’ కోసం... బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ఫుల్ గ్లామరస్‌గా కనిపించారు. ఈ బ్యూటీ హీరోయిన్గా కెరీర్నుప్రాంరంభించింది తెలుగు చిత్రం ‘లోఫర్’తోనే. 2015లో విడుదలైన ‘లోఫర్’ తర్వాత బాలీవుడ్లో దిశా ఫుల్ బిజీ అయ్యారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత దిశా పటానీ తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సైన్ చేశారు. ప్రభాస్ హీరోగా, దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో దిశా కొన్ని సీన్స్‌లో డీ గ్లామరస్‌గా కనిపిస్తారని సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ ఫిక్షనల్ ఫ్యూచరిస్ట్ సైంటిఫిక్ చిత్రాన్ని సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్న ‘కల్కి 2898ఏడీ’ మే 9న విడుదల కానుంది. సరికొత్త మేకోవర్ ‘తంగలాన్’ సినిమా కోసం కొత్త మేకోవర్‌లోకి మారిపోయారు హీరోయిన్లు మాళవికా మోహనన్, పార్వతి. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో ఆదివాసీ తెగ అమ్మాయిలుగా కనిపిస్తారట మాళవిక, పార్వతి. ‘‘తంగలాన్’ సినిమాలో నా పాత్ర చాలా బలమైనది. ఈ పాత్ర చేయడం నాకు సవాల్‌గా అనిపించింది’’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు మాళవికా మోహనన్. ఈ చిత్రంలో మాళవిక పాత్రకు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని టాక్. 18వ శతాబ్దంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది. ‘రాయన్’లో... వరలక్ష్మీ, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి... ఫుల్ డీ గ్లామరస్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఈ ముగ్గురూ ఈ చాలెంజ్‌ను తీసుకున్నది ‘రాయన్’ చిత్రం కోసం. హీరో ధనుష్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ప్రకాశ్‌రాజ్, సెల్వారాఘవన్, వరలక్ష్మీ శరత్‌కుమార్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, అనిఖా సురేంద్రన్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేశారు. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ‘రాయన్’. కథ రీత్యా ఈ చిత్రంలోని హీరోయిన్లందరూ డీ గ్లామరస్ రోల్స్‌లో కనిపిస్తారని ఇప్పటికే విడుదలైన వారి ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్పష్టం చేస్తున్నాయి. ధనుష్ కెరీర్లో 50వ సినిమాగా తెరకెక్కిన ‘రాయన్’ని సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఇలా డీ గ్లామరస్ సవాల్ తీసుకున్న కథానాయికలు ఇంకొందరు ఉన్నారు. -
గ్లామర్, డ్యాన్స్‌లకు మాత్రమే పరిమితం కాదని నిరూపించిన హీరోయిన్లు
డ్యాన్స్ మాత్రమే వచ్చా? అలా అంటారేంటీ.. ఫైట్స్ కూడా చేస్తారు. కాకపోతే ఆ ఒక్క చాన్స్ రావాలి. ఆ చాన్స్ వచ్చినప్పుడు హీరోయిన్లు యాక్షన్‌లోకి దిగుతారు. అలా కొందరు కథానాయికలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు పెరిగాయి. ఈ మహిళా దినోత్సవానికి కథానాయికల పరంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక సినిమాలో సమస్యలపై పోరాడుతున్న హీరో‘యిన్ యాక్షన్’ గురించి తెలుసుకుందాం. యువతి పోరాటం ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’.. ఇలా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో అనుష్కా శెట్టి సూపర్ హిట్. తాజాగా ఆమె మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ సైన్ చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. ఆంధ్రా – ఒడిస్సా సరిహద్దు లొకేషన్స్‌లో ఇటీవల షూటింగ్ జరి΄ారు. ఓ యువతి పోరాటంతో సాగే ఈ సినిమాకు ‘శీలవతి’ టైటిల్‌ను అనుకుంటున్నారట. సత్యభామ పోలీసాఫీసర్ సత్యభామగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. ఓ అమ్మాయి హత్య కేసులో నిజమైన దోషులను పోలీస్ ఆఫీసర్ సత్యభామ ఏ విధంగా పట్టుకుంది? అనే అంశంతో ఈ సినిమా సాగుతుంది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే హిందీలో కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన ‘ఉమ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డిటెక్టివ్ అను ఓ కొత్త చిత్రం కోసం చెన్నైలో డిటెక్టివ్ ఏజెన్సీ ఆరంభించనున్నారు శ్రుతీహాసన్. ఈ సినిమాకు ఫిలిప్ జాన్ దర్శకుడు. ఇందులో డిటెక్టివ్ అను ΄ాత్రలో కనిపిస్తారు శ్రుతీహాసన్. ఈ సినిమాకు ‘ది చెన్నై స్టోరీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. తన నాన్న ఆచూకీ తెలుసుకోవాల్సిందిగా ఓ ఇంగ్లిష్ కుర్రాడు చెన్నైకి వచ్చి, డిటెక్టివ్ అనుని కలిశాక ఏం జరిగింది? అనే అంశం చుట్టూ ఈ సినిమా ఉంటుంది. అలాగే శ్రుతీహాసన్ నటించిన ఇంగ్లిష్ చిత్రం ‘ది ఐ’. చనిపోయిన భర్త అస్తికలను సముద్రంలో కలిపేందుకు మరో చోటుకు వెళ్లిన ఓ మహిళ ఎలాంటి నిజాలు తెలుసుకుంది? ఎవరెవర్ని హత్య చేయాలనుకుంటుంది? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందట. కాలేజ్ స్టూడెంట్ రష్మికా మందన్నా తొలిసారి రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘చిలసౌ’ (2018)తో దర్శకుడిగా హిట్టైన నటుడు రాహుల్ రవీంద్రన్ ఇటీవల ‘ది గాళ్ ఫ్రెండ్’ కోసం మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఈ సినిమాలో రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక కాలేజ్ స్టూడెంట్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ఓ కాలేజ్ స్టూడెంట్ ప్రేమ, సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది. రష్మిక నటిస్తున్న మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రెయిన్ బో’. ఈ సినిమాకు శాంతరూబన్ దర్శకుడు. ఓ మనిషి తన జీవితంలో ఎదుర్కొనే వివిధ దశల పరిస్థితులను ‘రెయిన్ బో’లో చెబుతున్నారట. హక్కుల కోసం పోరాటం ‘మహానటి’ (2018) సినిమాతో నటిగా తనలో ఎంత ప్రతిభ ఉందో నిరూపించుకున్నారు కీర్తీ సురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ‘రఘు తాతా’, ‘రివాల్వర్ రీటా’, ‘కన్నె వెడి’ వంటి మూడు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఉన్నాయి. ‘రఘు తాతా’కు సుమన్‌కుమార్ దర్శకుడు. బలవంతంగా హిందీ భాష నేర్చుకోవాలన్నప్పుడు ఓ యువతి ఏ విధంగా పోరాటం చేసింది? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. అలాగే కీర్తి మరో ఫిల్మ్ ‘రివాల్వర్ రీటా’ కూడా పోరాటం నేపథ్యంలో సాగే సినిమాయే. ‘కన్నె వెడి’ సినిమాకు గణేశ్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హీరోయిన్గా ‘బేబీ జాన్’ చిత్రంతో హిందీకి పరిచయం అవుతున్నారు కీర్తి. గీతాంజలి మళ్లీ వచ్చింది తెలుగు హీరోయిన్ అంజలి నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గీతాంజలి’. 2014లో విడుదలైన ఈ హారర్ కామెడీ ఫిల్మ్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ వస్తోంది. అంజలి మెయిన్ లీడ్ రోల్ చేశారు. ఏప్రిల్ 11న విడుదల కానుంది. శివ తుర్ల΄ాటి దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించిన ‘గీతాంజలి 2’ అంజలి కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఓ ఇంట్లో చోటు చేసుకునే హారర్ ఎలిమెంట్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. రోడ్ ట్రిప్ హీరోయిన్లు అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత కలిసి రోడ్ ట్రిప్‌కు వెళ్లారు. వెకేషన్ కోసం కాదు.. సినిమా కోసమే. రోడ్ ట్రిప్ నేపథ్యంలో ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, దర్శన, సంగీత లీడ్ రోల్స్ చేస్తున్నారు. సెల్ఫ్ డిఫెన్స్ వరుసగా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు హన్సిక. గత ఏడాది హన్సిక మెయిన్ లీడ్ రోల్ చేసిన ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’, ‘105 మినిట్స్’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాది మరో రెండు రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. తమిళ ‘గార్డియన్’ చిత్రం నేడు విడుదల అవుతోంది. కాగా హన్సిక సైన్ చేసిన ‘రౌడీ బేబి’ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. జేఏమ్ రాజశరవణన్ ఈ మూవీకి దర్శకుడు. ఇవి కాకుండా హన్సిక చేతిలో మరో రెండో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలు ఉన్నాయి. ఇలా మరికొందరు హీరోయిన్లు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌కి సై అన్నారు. -
Heroines New Year 2024 Party Celebrations: తెలుగు హీరోయిన్స్ న్యూ ఇయర్ పార్టీ (ఫొటోలు)
-
Celebrities Christmas Celebrations Photos: క్రిస్మస్ రోజు రెడ్ అండ్ హాట్‌గా మెరిసిన తారలు..
-
ఈ ముద్దుగుమ్మలు ఆడా లేరు...ఈడా లేరు!
ఈ ఏడాది కొంతమంది కథానాయికలను తెలుగు తెర మిస్సయింది. ఆ మాటకొస్తే తెలుగులో మాత్రమే కాదు.. ఏ భాష తెరపైనా ఈ తారలు కనిపించలేదు. ఆడా లేరు.. ఈడా లేరు అన్నట్లు ఎక్కడా కనిపించకుండా ఆ నాయికలు ఏం చేస్తున్నారో చూద్దాం. ‘లవ్ స్టోరీ (2021)’, ‘శ్యామ్ సింగరాయ్ (2021)’, ‘విరాటపర్వం (2022)’ సినిమాలతో రెండేళ్లుగా తెలుగు తెరపై సందడి చేసిన సాయి పల్లవి ఈ ఏడాది మాత్రం సిల్వర్ స్క్రీన్‌కి దూరమయ్యారు. చెప్పాలంటే 2023లో నటిగా సాయిపల్లవి పూర్తిగా బ్రేక్ తీసుకున్నట్లే. ఎందుకంటే ఆమె హీరోయిన్గా చేసిన సినిమాలేవీ తెలుగులోనే కాదు... ఇతర భాషల్లో కూడా విడుదల కాలేదు. 2022లో తమిళంలో చేసిన ‘గార్గి’ చిత్రం తర్వాత సాయి పల్లవి నటించిన మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం నాగచైతన్యతో ‘తండేల్’, శివ కార్తికేయన్‌తో ఒక చిత్రం... సాయి పల్లవి కమిట్ అయిన సినిమాలు ఇవే. ‘తండేల్’ షూటింగ్ జరుగుతోంది. శివ కార్తికేయన్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. సో.. వచ్చే ఏడాది డబుల్ ధమాకాలా సాయి పల్లవి ఈ రెండు చిత్రాలతో థియేటర్స్‌లో సందడి చేస్తారు. హీరోయిన్గా ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’, ‘అంటే.. సుందరానికీ’ సినిమాలో ఓ అతిథి పాత్ర, ‘బటర్ ఫ్లై’తో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఇలా.. 2022లో అనుపమా పరమేశ్వరన్ ఫుల్ ఫామ్‌లో కనిపించారు. కానీ ఈ ఏడాది వెండితెరపై సందడి చేయలేదు. తెలుగులో అనుపమ చేస్తున్న ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘డీజే టిల్లు స్క్వేర్’ చిత్రం ఈ ఏడాది విడుదలకు ముస్తాబైనా కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. దాంతో ఈ ఏడాది ఆమె కనిపించలేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో రవితేజ ‘ఈగల్’, తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ ఉన్నాయి. ఇతర భాషల్లో మరో రెండు సినిమాలు ఉన్నాయి. జనవరిలో ‘ఈగల్’, ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు స్క్వేర్’ విడుదలవుతాయి. చూస్తుంటే.. 2024లో అనుపమా పరమేశ్వరన్ ముచ్చటగా మూడు సార్లయినా వెండితెరపై మెరిసే అవకాశం ఉంది. గత ఏడాది రెండు తెలుగు సినిమాలు (పక్కా కమర్షియల్, థాంక్యూ), రెండు తమిళ సినిమాలు (తిరుచిత్రంబలం, సర్దార్)లతో కెరీర్లో దూకుడు పెంచినట్లుగా కనిపించారు రాశీ ఖన్నా. కానీ ఆ స్పీడ్‌కు ఈ ఏడాది స్పీడ్ బ్రేకర్ పడింది. రాశీ ఖన్నా సైన్ చేసిన హిందీ చిత్రం ‘యోధ’ రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అలాగే తెలుగులో శర్వానంద్‌తో రాశీ ఖన్నా కమిట్ అయిన సినిమా ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంది. ఇలా రాశీ ఖన్నా వెండితెరపై మెరవలేకపోయారు. అయితేనేం.. తమిళంలో రాశీ ఖన్నా ఓ హీరోయిన్గా నటించిన ‘అరణ్మణై 4’, హిందీ ‘యోధ’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో.. వచ్చే ఏడాది రాశీ ఖన్నా జోరు మళ్లీ కనిపిస్తుంది. అన్నట్లు మరో మాట.. తెలుగులో ‘తెలుసుకదా’ అనే సినిమాలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు రాశీ ఖన్నా. సిద్ధు జొన్నలగడ్డ ఓ హీరోగా, ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధీ శెట్టి మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఇక గత ఏడాది ‘కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్, తమిళంలో ‘కోబ్రా’ చిత్రంతో తెరపై కనిపించిన శ్రీనిధీ శెట్టి ఈ ఏడాది కనిపించలేదు. తెలుగులో ‘హీరో’, తమిళంలో ‘కలగ తలైవన్’ సినిమాలతో గత ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై మెరిశారు నిధీ అగర్వాల్. కానీ ఈ ఏడాది మాత్రం స్లో అయ్యారు. ఈ ఏడాది ఆమె హీరోయిన్గా నటించిన ఏ చిత్రం ఏ భాషలో కూడా వెండితెరపైకి రాలేదు. నిధి నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ దశలో ఉంది. నాని ‘గ్యాంగ్‌లీడర్’, శర్వానంద్ ‘శ్రీకారం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ సుపరిచితురాలే. గత ఏడాది ‘ఈటీ’, ‘డాన్’ వంటి తమిళ చిత్రాలతో వెండితెరపై మెరిశారామె. అయితే ఈ యంగ్ బ్యూటీ కూడా ఈ ఏడాది వెండి తెరపై కనిపించలేదు. ప్రియాంక హీరోయిన్గా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం ఈ ఏడాది రిలీజ్‌కు షెడ్యూలై, ఆ తర్వాత సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. అలా ఈ ఏడాదిని మిస్ అయ్యారు ప్రియాంక. ప్రస్తుతం తెలుగులో ‘సరిపోదా శనివారం’, ‘ఓజీ’, తమిళంలో ‘బ్రదర్’ చిత్రాలు చేస్తున్నారు ప్రియాంకా అరుళ్ మోహన్. -
ఈ ఏడాది నిర్మాతలుగా డామినేట్ చేసిన మహారాణులు
‘అనుకున్న టైమ్‌కి షూటింగ్ పూర్తి కావాల్సిందే... ప్లాన్ తప్పకూడదు’ అని హుకుం జారీ చేయాలంటే చేసే పని మీద ప్రేమ, శ్రద్ధ... ఈ రెంటికీ మించి ధైర్యం, ఆత్మవిశ్వాసం లాంటివి కూడా ఉండాలి. ముఖ్యంగా ‘మేల్ డామినేటెడ్’ ఇండస్ట్రీస్‌లో ఒకటైన సినిమా పరిశ్రమలో ‘ఫీమేల్ప్రొడ్యూసర్’ రాణించాలంటే తెగువ కావాలి. అవసరమైనప్పుడు రాణిలా హుకుం జారీ చేయాలి. సున్నితంగా పనులు చక్కబెట్టడంతో పాటు కఠినంగానూ ఉండాలి. అలా రెండు రకాలుగా ఉంటూ... ‘మేం రాణిస్తాం’ అంటూ ఈ ఏడాది నిర్మాణ రంగంలోకి వచ్చిన కొందరు ఫీమేల్ ప్రొడ్యూసర్ క్వీన్స్ గురించి తెలుసుకుందాం. హీరోయిన్గా యాభైకి పైగా సినిమాలు చేశారు సమంత. అగ్రశ్రేణి నటిగా ప్రేక్షకులు కితాబులిచ్చారు.ఇప్పుడు ‘ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారామె. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన కథలను ఈ నిర్మాణ సంస్థ వేదికగా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నామని సమంత పేర్కొన్నారు. ► ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు కుమార్తె హన్షితా రెడ్డి తండ్రి బాటలో నిర్మాత అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు ఇప్పటికే 50కి పైగా సినిమాలు నిర్మించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాల నిర్మాతగా ఆయనకు పేరుంది. ఇక ‘దిల్’రాజుప్రొడక్షన్స్ స్థాపించి ‘ఏటీఎమ్’ వెబ్ సిరీస్ నిర్మించిన హన్షిత తొలిసారి ‘బలగం’ సినిమా నిర్మించి, బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకునిగా మారారు. ఈ ఏడాది మార్చి 3న విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. అన్నట్లు.. ‘బలగం’కి హర్షిత్ రెడ్డి మరో నిర్మాత. ఇక ఆ మధ్య రెండు చిత్రాలు ఆరంభించిన ఈ నిర్మాతలు మంగళవారం మరో చిత్రాన్ని ఆరంభించారు. ► ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర ‘మ్యాడ్’ చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ కీలక పాత్రల్లో నటించారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 6న రిలీజై, హిట్‌గా నిలిచింది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను బాగా నవ్వించింది. తొలి చిత్రంతోనే అభిరుచి ఉన్న నిర్మాత అనిపించుకున్నారు హారిక. ► తండ్రి నిమ్మగడ్డ ప్రసాద్ సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్. ఇక కూతురికి సినిమాలంటే ఫ్యాషన్. ఆ∙ఇష్టంతో ‘మంగళవారం’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, తొలి విజయం అందుకున్నారు స్వాతీ రెడ్డి. పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ నిర్మించిన ఈ సినిమా గత నెల 17న విడుదలై హిట్‌గా నిలిచింది. ► మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక (నాగబాబు కుమార్తె) అటు నటన, ఇటుప్రొడక్షన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకూ పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ నిర్మించిన ఆమె తొలిసారి ఫీచర్ ఫిల్మ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా యాదు వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. అంతేకాదు.. పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు పరిచయమవుతుండటం విశేషం. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. ► శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘బన్నీ’ వాసుతో కలిసి విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న విడుదలైన ఈ పొలిటికల్, పోలీస్ బ్యాక్‌డ్రాప్ మూవీ హిట్‌గా నిలిచింది. ► నటిగా, గాయనిగా, నర్తకిగా గుర్తింపు తెచ్చుకున్న రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మాతగా మారి, ‘కలశ’ చిత్రాన్ని నిర్మించారు. భానుశ్రీ, సోనాక్షీ వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కొండ రాంబాబు దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. చిన్న బడ్జెట్ చిత్రమైనా కాన్సెప్ట్ బాగుందనిపించుకుంది. ► పాయల్ సరాఫ్కి సినిమా నేపథ్యం లేదు. అయితే నిర్మాత కావాలన్నది ఆమె కల. ‘భరతనాట్యం’ చిత్రంతో నిర్మాతగా మారారామె. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో సూర్యతేజ ఏలే హీరోగా, మీనాక్షీ గోస్వామి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ‘‘షూటింగ్ లొకేషన్లో అమ్మాయిలు తక్కువగా ఉంటారు. మనం అమ్మాయి అనే విషయాన్ని మరచిపోయి మన పని మనం శ్రద్ధ చేయగలిగితే సక్సెస్ గ్యారంటీ’’ అంటున్నారు పాయల్ సరాఫ్. -
అశ్లీల కంటెంట్‌పై ఆలస్యంగా మన తారలు!
‘ఫన్ కోసం ఫేస్ మార్చేయండి’.. ఓ నాలుగైదేళ్లుగా ఎడిటింగ్ సాంకేతికత ద్వారా నడుస్తున్న సరదా ట్రెండ్. అయితే తెర వెనుక జరిగే తతంగం వేరే ఉంటోంది. సాధారణ జనాలు వీటిని సరదా వ్యవహారంగానే చూస్తున్నప్పటికీ.. అశ్లీల కంటెంట్ విపరీతంగా పుట్టుకురావడానికి ఈ టెక్నాలజీనే ఒకరకంగా కారణం అవుతోంది. సగటున రోజుకి లక్షల మార్ఫింగ్ వీడియోలు, కోట్లలో మార్ఫింగ్ ఫొటోలు ఇంటర్నెట్లో అప్లోడ్ అవుతున్నట్లు ఒక అంచనా. అయితే మన దగ్గర సెలబ్రిటీలు ఇంతకాలం ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకున్నప్పటికీ.. వేరే దేశాల్లో మాత్రం ఈ ఫేక్ కంటెంట్ కట్టడి కోసం ఎప్పటి నుంచో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. సెలబ్రిటీలు ఏ పని చేసినా.. అదో వైరల్ న్యూసే!. ముఖ్యంగా గ్లామర్ ప్రపంచంలోని ఫీమేల్ సెలబ్రిటీల విషయంలో ఇది ఎక్కువ. వాళ్ల దృష్టిలో ఇంటర్నెట్ అనేది అధికప్రచార సాధనం. అందుకే తమ క్రేజ్‌ను నిలబెట్టుకునేందుకు ఫొటో.. వీడియో ఆధారిత కంటెంట్‌ను ఫాలోవర్లతో, యూజర్లతో పంచుకుంటారు. ఉదయం లేచింది మొదలు ఫిట్నెస్ మొదలుకుని.. తినడం, తిరగడం, సరదా కబుర్లు ఇలా.. రోజూవారీ అప్డేట్లు ఇస్తుంటారు. అయితే వాళ్లకు తెలియకుండానే ఆ కంటెంట్ తప్పుడు దోవలో దూసుకుపోతోంది. ఇంటర్నెట్ నిండా ఫేక్ ఫొటోలు, వీడియోలతో నిండిపోతోంది. దాదాపు పాత, కొత్త తరం తారలంతా ఫేక్ కంటెంట్ బాధితులుగానే ఉన్నారు. అశ్లీలత గురించి ఓపెన్‌గా చర్చించడం మన హీరోయిన్లకు ఇప్పటికీ నామోషీనే. అయితే తమను నెట్టింటికీడుస్తున్న వ్యవహారాలపై కూడా పోరాడటానికి కూడా ఎందుకనో వెనుకంజ వేస్తున్నారు. విదేశాల్లో మాత్రం ఇలాంటి కంటెంట్‌ను హీరోయిన్లు ఏమాత్రం సహించడం లేదు. టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్లెట్, సీనియర్ హీరోయిన్ జెస్సికా ఆల్బా ఈ విషయంలో ఫిర్యాదులు చేయడంతో పాటు సోషల్ మీడియాలో బహిరంగంగా తమ తమ మీద నడుస్తున్న మార్ఫింగ్ కంటెంట్ మీద చర్చించారు. ‘వండర్ వుమెన్’ ఫేమ్ గాల్ గాడోట్ అయితే ఏకంగా అశ్లీల కంటెంట్ కట్టడి కోసం చిన్నసైజు ఉద్యమాన్నే నడిపిస్తోంది. ఈజిప్ట్ నటి నెల్లీ కరీం.. ఓ అడుగు ముందుకు వేసి తన పేరుతో వైరల్ అవుతున్న కంటెంట్‌ను సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ షేర్ చేసి మరీ నిరసన వ్యక్తం చేసింది. కొందరు బ్రిటిష్ నటీమణులు సైతం ఇలాంటి అశ్లీల కట్టడి విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. ఈ తతంగాన్ని తీవ్రంగా పరిగణించి.. ప్రత్యేక చట్టాలు చేయాలని ఆ దేశాల ప్రభుత్వాలను కోరుతున్నవాళ్లు లేకపోలేదు. అవకాశం ఉన్నా గప్‌చుప్.. కానీ, మన దగ్గర పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా భాషలకతీతంగా సినీ తారలు బాధితులవుతున్నారు. గూగుల్‌లో వాళ్ల ఎడిటింగ్ కంటెంట్(అసభ్యతతో కూడుకున్నది) కుప్పలుగా కనిపిస్తోంది. దారుణమైన విషయం ఏంటంటే.. ‘ఎక్స్’, ఫేస్బుక్ లాంటి ప్రముఖ సోషల్ మీడియా సైట్లలోనూ వేల కొద్దీ అకౌంట్ల ద్వారా అలాంటివి వ్యాప్తి చెందుతుండడం, అలాంటి పేజీలకు వేల నుంచి లక్షల్లో ఫాలోవర్స్ ఉండడం!. ఈ తరహా వ్యవహారంలో వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేయడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు న్యాయ నిపుణులు. ఐసీసీలోని సెక్షన్ 292(అశ్లీల కంటెంట్‌ను సర్క్యులేట్ చేయడం), 354సీ(అనుమతి లేకుండా అసభ్య వీడియోల్ని చిత్రీకరించడం), 499(వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం), 509(మహిళా గౌరవానికి భంగం కలిగించడం), వీటితో పాటు ఐటీ యాక్ట్‌లో 66ఈ, 67, 67ఎ, 72 సెక్షన్లు ఇలాంటి ఫేక్ వీడియో, ఫొటోల సర్యులేషన్ పై కఠిన చర్యలుంటాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చిన్నతారలు ధైర్యంగా.. ఇంటర్నెట్లో దాదాపు అగ్ర హీరోయిన్ల ఫేక్ వీడియోల, ఫొటో కంటెంట్ ఎక్కువగా చక్కర్లు కొడుతుంటాయి. కానీ, ఈ విషయంలో అగ్ర తారల కంటే చిన్న ఆర్టిస్టులే ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఓ చిన్న నటి.. ట్విటర్లో హీరోయిన్ల ఫేక్ ఫొటోల్ని షేర్ చేస్తున్న ఓ అడల్ట్ అకౌంట్‌కు ఫాలో రిక్వెస్ట్ పెట్టింది. అది చూసి సంబురంగా ఆ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసి మరీ ఆమె ఫాలో రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు ఆ అకౌంట్ అడ్మిన్. వెంటనే సైబర్ విభాగానికి ఫిర్యాదు చేసి అతన్ని కటకటాల వెనక్కి నెట్టించింది ఆమె. అలా.. కొందరు ఈ-సెలబ్రిటీలు(సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్లు), షార్ట్‌ఫిల్మ్ తారలు, చిన్నాచితకా క్యారెక్టర్లు చేసే నటీమణులు ఫిర్యాదుల విషయంలో ముందుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. రష్మిక వీడియో.. అసలేం జరిగిందంటే.. ఫొటో మార్ఫింగ్, ఎడిటింగ్లు సరదా కోసం చేయడం సాధారణమైన వ్యవహారం. కానీ, టెక్నాలజీ అప్డేట్ మూలంగా అది మరీ శ్రుతి మించిపోతోంది. అందులో ప్రముఖంగా చెప్పుకోదగింది.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది డీప్‌ఫేక్ టెక్నాలజీ. నేషనల్ క్రష్‌గా పేరుండి.. సోషల్ మీడియాలోనూ విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న రష్మిక మందన్నకు సంబంధించిన ఓ వీడియో ఈ మధ్య వైరల్ అయ్యింది. అయితే ఎక్స్ మాధ్యమం ద్వారా ఆ వీడియో పలువురు ప్రముఖుల దృష్టికి వెళ్లింది. ఫైనల్‌గా అందులో ఉంది రష్మిక కాదని.. జారా పటేల్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తేలింది. అయితే అప్పటికే ఆ వీడియో గురించి విపరీతమైన చర్చ నడిచింది. రష్మికతో గతంలో ఓ చిత్రంలో నటించిన బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ సైతం స్పందించడంతో ఈ వ్యవహారం వార్తల్లోకి ఎక్కింది. మరోవైపు ఈ వీడియో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. ఇంటర్నెట్ ను వినియోగించే వాళ్ళందరికీ భద్రత కల్పించే విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో బాధ్యత ఆ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్దేనని, ఏ వినియోగదారు కూడా తమ అకౌంట్ నుంచి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే దాని 36 గంటల్లోగా సదరు ఫ్లాట్‌ఫారమ్ తొలగించాలని, ఈ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలకు గురి కావలసి వస్తుందని హెచ్చరించారు. ఇక తాజాగా ఈ డీప్ ఫేక్ వీడియో పై రష్మిక మందన సైతం స్పందించింది. ఇలాంటి ఓ ఘటనపై స్పందించాల్సి రావడం నిజంగా ఎంతో బాధ కలిగిస్తుందని చెప్పుకొచ్చింది రష్మిక. డీప్ ఫేక్‌తో పాటు ఫేస్ స్వాప్ కూడా.. డీప్‌ఫేక్ ఫీచర్.. ఇది ఒకరకంగా మార్ఫింగ్ లాంటిదే. ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ టూల్‌ను ఉపయోగించి ఇతర వ్యక్తుల ఫోటోల్లో, వీడియోల్లో నచ్చని వారి ఫోటోలను చొప్పించి, నకిలీ చిత్రాలను, విడియోలను తయారు చేసే సింథటిక్ మీడియా. డీప్‌ఫేక్ ఫీచర్ సాయంతో అల్రెడీ మొబైల్లో ఉన్న వీడియోతోగానీ, అప్పటికప్పుడు చేసే వీడియోతో ఫన్నీ వీడియోల్ని క్రియేట్ చేయొచ్చు. ఒక వీడియోలోగానీ, ఫొటోలోగానీ ముఖాన్ని ఈ ఫీచర్ ద్వారా మార్చేయొచ్చు. ఆ ప్లేస్‌లో యూజర్ తన ఫేస్‌ని లేదంటే తనకు కావాల్సిన ముఖాన్ని అప్డేట్ చేసి ఓ కొత్త వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక సరదా వ్యవహారం. ఇందుకోసం కోట్లు ఖర్చు చేసి ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ) టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. కానీ, సినీ ఫీల్డ్ సెలబ్రిటీలకు ఫేక్ వీడియోలతో ఇప్పుడిది కొత్త తలనొప్పిగా మారింది. మరోవైపు యూట్యూబ్‌లోనూ డీప్‌ఫేక్ టెక్నాలజీ, బాధిత హీరోయిన్ల గురించి టెక్ గురూలు, నిపుణులు దాని గురించి వీడియోలు బోలెడన్ని కనిపిస్తుంటాయి. ఇక అశ్లీలతను వ్యాప్తిచెందిస్తోన్న మరో టెక్నాలజీ ఫేస్ స్వాప్. రివెంజ్ పోర్న్ ద్వారా వార్తల్లోకి ఎక్కిన ఫేస్ స్వాప్.. ఆ తర్వాత ఓ ఎంటర్టైనింగ్ ఫీచర్\టూల్‌గా మారింది. దీనిని ఆసరాగా తీసుకుని ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలను తెర మీదకు తెస్తున్నారు కొందరు. హీరోయిన్ల ఫొటోలను ఎడిట్ చేసి.. ఇంటర్నెట్లో వదులుతున్నారు. -
దేవి పాత్రలలో జేజేలు అందుకున్న హీరోయిన్స్
విజయ దశమి అంటే...కొత్త బట్టలు, పిండివంటలు, బంధు మిత్రుల కోలాహలం గుర్తుకు వస్తుంది. చిన్నా పెద్ద దసరాను సంబరంగా జరుపుకుంటారు. నవరాత్రులలో దుర్గామాత 9 అవతారాలను పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోటానికి పూజాలు చేస్తారు. ఇక ఈ దేవి రూపంలో టాలీవుడ్ వెండితెర మీద కొందరు హీరోయిన్స్ కనిపించడమే కాకుండా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్నారు. వారెవరో ఈ కథనంలో చూసేద్దాం.. మొదట గుర్తొచ్చేది ఆవిడే.. అప్పట్లో వెండితెర మీద దేవత పాత్రలు వేసిన నటీమణులలో కె.ఆర్ విజయ పేరు మొదటి వరసలో ఉంటుంది.ఎన్టీఆర్ పేరు చెబితే కృష్ణుడు, రాముడు లాంటి వారు గుర్తుకు వస్తారు. ఇక దేవతల క్యారెక్టర్ల గురించి మాట్లాడితే.. కె ఆర్ విజయ పేరు మనసులో మెదలుతుంది. అమ్మ వారి పాత్ర వేసినప్పుడు ఎంతో నిష్టగా ఉండేవారట. శాఖాహారం మాత్రమే తీసుకునేవారట. శభాష్ అనిపించుకున్న విజయశాంతి లేడి సూపర్ స్టార్‌గా విజయ శాంతి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు నేషనల్ అవార్డు సైతం కొల్లగొట్టింది. ఈ సీనియర్ తార కూడా మహా చండి అవతారంలో విశ్వరూపం చూపించింది. దేవత పాత్రలో కనిపించి శభాష్ అనిపించుకుంది. రోమాలు నిక్కబొడుచుకునే అమ్మోరు సీన్.. శరదృతువు ఆరంభంలో వచ్చే పండగ కనక నవరాత్రి, శరన్నవరాత్రి అనే పేరు వచ్చింది. పండగ మొదటి మూడు రోజులు పార్వతి దేవికి, ఆ తరువాత మూడు రోజులు లక్ష్మీ దేవికి.. ఆ తరువాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఇక అమ్మోరు తల్లి గ్రామంలో వెలిసి.. దుష్ట శక్తులను పారదోలుతుంది. ఈమె విశ్వరూపం చూసే భాగ్యం అందరికీ దక్కదు. అలాంటి అవకాశం దక్కే సీన్ అమ్మోరు సినిమాలో చూపించారు. వెండితెర మీద ఈ సన్నివేశాన్ని చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మహా కనక దుర్గగా రమ్యకృష్ణ రమ్య కృష్ణ అమ్మోరు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో దేవతగా కనిపించి వెండితెర మీద కనికట్టు చేసింది. దేవుళ్లు సినిమాలో భక్తితో వేడుకుంటే ఆ మహా కనక దుర్గ కూడా కదిలి వస్తుంది అనే సన్నివేశాలలో మానవరూపం దాల్చిన దేవతగా కనిపించింది. నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్లముందు కనిపించే దైవం అవుతుంది.లేదనుకునే అల్పులకీ కళ్లు తెరిపిస్తుంది. అమ్మోరు తల్లిగా, భక్తురాలిగా రోజా అమ్మోరు తల్లిగా కనిపించిన వారి లిస్ట్‌లో మరో సీనియర్ తార రోజా కూడా ఉంది. భక్తురాలిగా, అమ్మోరు తల్లిగా రెండు పాత్రలలో అమ్మోరు తల్లి సినిమాలో మెప్పించింది. శ్రీవెంకటేశునికి చెల్లెలివమ్మా, చిట్టి చెల్లిలి వయ్యా అని ఈ దేవతను పొగుడుతూ భక్తు రాలిగా పాట పాడి మెప్పించింది. భక్తురాలిగా సావిత్రి జననీ శివ కామిని దరి చేరితే భయాలు తొలుగిపోతాయి. అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మ దయ దొరికితే జయాలు కలుగుతాయి. ఎన్టీఆర్, సావిత్రి నటించిన నర్తన శాల మూవీలో అమ్మ దయ కోసం...సావిత్రి జననీ శివ కామినీ అనే పాట పాడి ఆకట్టుకుంది. ‘‘ఇక్కడ క్లిక్ చేసి సాక్షి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
హీరోయిన్లా మజాకా.. యాక్షన్ తగ్గేదే లే!
ఒకరు తుపాకీ పట్టుకున్నారు.. ఇంకొకరు ఫ్లయిట్ ఎక్కారు... ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. ‘యాక్షన్‌కి సై’ అంటూ బరిలోకి దిగారు. ప్రత్యర్థులను రఫ్ఫాడారు. సుకుమారంగా కనిపించే కథానాయికలు రఫ్‌గా మారిపోయి, విలన్లను ఇరగదీశారు. సమంత, త్రిష, కీర్తీ సురేశ్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, ఆలియా భట్, కృతీ సనన్ వంటి నాయికలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో యాక్షన్ రోల్స్ చేస్తున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం. పవర్ఫుల్ రీటా ఓ వైపు హీరోయిన్గా అగ్రహీరోల సరసన నటిస్తూనే మరోవైపు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో మెప్పిస్తున్నారు కీర్తీ సురేశ్. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘రివాల్వర్ రీటా’. చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, థ్రిల్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో రెండు చేతుల్లో రెండు రివాల్వర్స్ పట్టుకుని ఉన్న కీర్తి పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలకానుంది. కాగా ‘సైరన్, రఘు తాత, కన్ని వెడి’ వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు కీర్తీ సురేశ్. వీటిలో ‘కన్ని వెడి’ లేడీ ఓరియంటెడ్ మూవీ. ‘రఘు తాత’ కూడా దాదాపు ఇలాంటి సినిమానే. ఇక చిరంజీవి చెల్లెలిగా కీర్తి నటించిన ‘భోళా శంకర్’ ఈ 11న విడుదల కానున్న విషయం తెలిసిందే. బాలీ టు హాలీవుడ్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ఈ మధ్య ఎక్కువగా యాక్షన్ సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన షారుక్ ఖాన్ ‘పఠాన్’ మూవీలో యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టిన దీపిక ప్రస్తుతం ‘ఫైటర్’, ‘సింగం 3’ వంటి చిత్రాల్లో యాక్షన్ రోల్స్‌కి సై అన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్’ కోసం ప్రత్యేకంగా స్టంట్స్‌లో శిక్షణ తీసుకున్నారు దీపిక. అలాగే ‘సింగం’ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగం 3’ రూపొందనుంది. ‘సింగం’, ‘సింగం 2’ చిత్రాలు తెరకెక్కించిన రోహిత్ శెట్టి దర్శకత్వంలోనే ‘సింగం 3’ తెరకెక్కనుంది. ఈ మూడో భాగం హీరోయిన్ ఓరియంటెడ్‌గా సాగనుందట. ఇందులో దీపికా పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే ఓ హాలీవుడ్ మూవీలో ఏజెంట్‌గా కనిపించనున్నారట దీపిక. ఈ చిత్రంలోనూ ఆమె యాక్షన్ సీన్స్ చేయనున్నారని భోగట్టా. ఇలా బాలీవుడ్ టు హాలీవుడ్ యాక్షన్ రోల్స్ సైన్ చేసి జోరుగా దూçసుకెళుతున్నారు దీపికా పదుకోన్. టైగర్‌తో యాక్షన్ సల్మాన్ ఖాన్‌కి సమానంగా కాకపోయినా తనదైన శైలిలో ఫైట్స్ చేశారు కత్రినా కైఫ్. ‘టైగర్’ ఫ్రాంచైజీలో భాగంగా సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో దర్శకుడు మనీష్ శర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘టైగర్ 3’. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్. హీరో హీరోయిన్లు ఇద్దరూ గూఢ చారుల పాత్రల్లో నటిస్తున్నారట. ఐఎస్ఐ ఏజెంట్ జోయా పాత్రలో కత్రినా కనిపించనున్నారని సమాచారం. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో జోయాగా కత్రినా చేసిన ఫైట్స్ హైలైట్‌గా ఉంటాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ ఫైట్స్ కోసం ప్రత్యేకించి సౌత్ కొరియాకు చెందిన స్టంట్ మాస్టర్ల దగ్గర 14 రోజులు శిక్షణ తీసుకున్నారట కత్రినా. ఈ చిత్రం నవంబర్ 10న రిలీజ్ కానుంది. యుద్ధ విమానం ఎక్కి.. దాదాపు లేడీ ఓరియంటెండ్ సినిమాలకే పరిమితమయ్యారు కంగనా రనౌత్. సర్వేష్ మేవారా దర్శకత్వంలో ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘తేజస్’. ఈ చిత్రంలో ఆమె యుద్ధ విమానాలు నడిపే పైలెట్ పాత్ర చేశారు. కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్‌గా రూపొందిన ఈ చిత్రం కోసం పలు యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నారు కంగన. ఇందుకోసం దాదాపు నాలుగు నెలల పాటు ఆమె శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంచితే.. కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ చిత్రం నిర్మించారు. భారత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ (1975–1977) ఎందుకు విధించారు? ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అనే అంశంతో ‘ఎమర్జెన్సీ’ని తెరకెక్కించారు. ఇందిరా గాంధీగా కంగన నటించిన ఈ చిత్రం నవంబరు 24న విడుదల కానుంది. అలాగే పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా కంగన టైటిల్ రోల్లో రూపొందిన ‘చంద్రముఖి 2’ సెప్టెంబరు 19న విడుదల కానుంది. హాలీవుడ్లో యాక్షన్ అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ ఆలియా భట్ కూడా యాక్షన్‌కి సై అన్నారు. టామ్ హార్పర్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో ఆలియా కీలక పాత్ర చేశారు. స్పై యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు ఆలియా భట్. ఈ నెల 11న ఈ సినిమా విడుదల కానుంది. బైక్‌పై దూసుకెళుతూ... ఇటీవల విడుదలైన ‘ఆది పురుష్’లో సుకుమారి సీతగా కనిపించిన కృతీ సనన్ ఇప్పుడు అందుకు పూర్తి విభిన్నంగా రూడ్‌గా మారిపోయారు. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ‘గణ్పథ్: పార్ట్ 1’లో ఆమె పవర్ఫుల్ రోల్ చేశారు. ఈ సినిమా కోసం కృతి అద్భుతమైన బైక్ స్టంట్స్ చేశారు. ఇందుకోసం బైక్ స్టంట్స్ నేర్చుకున్నారామె. అమితాబ్ బచ్చన్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కానుంది. ఇంతేనా.. ఇంకొందరు కథానాయికలు యాక్షన్ రోల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తామేంటో నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నారు. వెబ్‌లో యాక్షన్ కొందరు కథానాయికలు వెండితెరపై యాక్షన్ రోల్స్ చేస్తుంటే త్రిష, సమంత వంటి తారలు వెబ్ సిరీస్‌లో ఈ తరహా పాత్రలు చేస్తున్నారు. రెండు దశాబ్దాల కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించిన త్రిష తొలిసారి ‘బృందా’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. సూర్య వంగల్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో త్రిష ఓ పవర్ పోలీసాఫీసర్ పాత్ర చేశారు. త్రిషలోని మాస్ ఇమేజ్‌ని బలంగా చూపించే పాత్ర ఇది. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఆ మధ్య వరుసగా హీరోల సరసన నటించిన సమంత ఇటీవల లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ బ్యూటీ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్ 2’. దర్శక ద్వయం రాజ్–డీకే తెరకెక్కించిన ఈ సిరీస్‌లో సమంత యాక్షన్ రోల్లో అదరగొట్టారు. ప్రస్తుతం సమంతతోనే ఈ దర్శక–ద్వయం ‘సిటాడెల్’ అనే మరో వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ప్రియాంకా చో్రపా నటించిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హిట్ డ్రామా ‘సిటాడెల్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. గూఢచారి సాహసాల నేపథ్యంలో పూర్తి స్థాయి యాక్షన్ సిరీస్‌గా రూపొందుతోంది. ఇందులో సమంత యాక్షన్ సీన్స్‌లో అలరించనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. -
సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ లిస్ట్‌లో నెంబర్ వన్ ప్లేస్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు విరామం ప్రకటించిన భామ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక చింతనపై దృష్టి సారించింది. ఇటీవల కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ నిర్వహించిన యోగా శిబిరంలో సామాన్యురాలిగా కనిపించింది. అయితే మయోసైటిస్ నుంచి నుంచి పూర్తిగా కోలుకోవడానికే త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆల్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్ల జాబితాలో ఏకంగా మొదటిస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: బాలీవుడ్లోనే కాదు, సౌత్‌లో కూడా.. కాంప్రమైజ్ అడిగారు: సీరియల్ నటి) బాలీవుడ్ తారలను వెనక్కి నెట్టి సమంత అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సమంత ఏకంగా ఎనిమిదోసారి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో పాటు సమంత అద్భుత నటనతో ప్రేక్షకాదరణ పొందింది. ఆర్మాక్స్ సంస్థ స్టార్స్ ఆఫ్ ఇండియా లవ్స్ పేరిట రిలీజ్ చేసిన జాబితాలో జూన్ 2023కు కానూ అత్యంత ఆదరణ కలిగిన హీరోయిన్గా సమంత స్థానం దక్కించుకుంది. కాగా.. ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషీ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో పాటు బాలీవుడ్ వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్లో కనిపించనుంది. (ఇది చదవండి: ఆ విషయంలో తప్పు నాదే.. బేబీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!) -
ఫిల్మ్మేకర్లుగా మారిన హీరోయిన్లు ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
హీరోయిన్స్‌గా రాణిస్తున్న స్టార్ హీరోల కూతుళ్లు (ఫోటోలు)
-
నాన్న పాటలు మాటలు
అంతర్జాల ప్రపంచంలో ‘ఫాదర్స్ డే’ సందడి మూడు నాలుగు రోజుల క్రితమే మొదలైంది. ‘ఫాదర్స్ డే రోజు వినాల్సిన బాలీవుడ్ ఫేమస్ పాటలు’ ‘తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్న కథానాయికలు’ ‘ఫాదర్స్ డే రోజు తండ్రితో కలిసి చూడాల్సిన సినిమాలు’... ఇలా ఎన్నో విషయాలపై నెటిజనుల పోస్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో కొన్ని... ‘ఫాదర్స్ డే’ రోజు వినాల్సిన పాటల విషయానికి వస్తే... అమీర్‌ఖాన్ సినిమా ‘ఖయామత్ సే ఖయామత్’లోని ‘పప్పా కెహ్తహై’... అక్షయ్ కుమార్ ‘బాస్’ సినిమాలోని ‘పితా సే హై నామ్ తేరా’ ‘యారా దిల్ దారా’ సినిమాలోని ‘హమారా పప్పా ఔర్ హమ్’... ఆలియాభట్ ‘రాజీ’ సినిమాలోని ‘దిల్బరో’... ఇలా ఎన్నో పాటలు ఉన్నాయి. ఇక తెలుగు పాటల విషయానికి వస్తే ‘నాన్నా నీ మనసే వెన్నా’ ఆల్‌టైమ్ ఫేవరెట్. జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో...’ పాట, చిరంజీవి ‘డాడీ’ సినిమాలోని ‘గుమ్మాడి గుమ్మాడీ’, విక్రమ్ ‘నాన్న’ సినిమాలో ‘పప్పా పప్పా’ కమల్‌హాసన్ ‘ఇంద్రుడు–చంద్రుడు’లో ‘లాలిజో లాలీజో చెప్పవే పాపాయి’... మొదలైన పాటలు ‘ఫాదర్స్ డే’ రోజు వినిపించే పాటలు. తండ్రీ కూతుళ్లు బంధాన్ని ప్రతిబింబించే ‘దంగల్’ ‘అంగ్రేజీ మీడియం’ ‘పికు’ ‘తప్పడ్’... మొదలైన బాలీవుడ్ సినిమాల గురించి కొందరు పోస్ట్‌లు పెట్టారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న అందాల కథానాయికలు శ్రద్ధా కపూర్, అనన్య పాండే, కరీనా కపూర్, ఆలియాభట్, సోనాక్షి సిన్హా, సోనాల్ కపూర్... మొదలైన వారి గురించి ప్రశంసాపూర్వకంగా రాశారు. నాన్న నాకు ప్రపంచంలోని అత్యంత విలువైన కానుక ఇచ్చాడు. ఆ కానుక పేరు... ప్రేమ. – సోనాల్ కపూర్ నువ్వు ఎంచుకున్న మార్గం, నువ్వు ఏర్పర్చుకున్న అభిప్రాయం సరిౖయెనది అనిపిస్తే ఎప్పుడూ వెనకడుగు వేయవద్దు... అని నాన్న చెప్పే మాట నాకు చాలా ఇష్టం. – సోనాక్షి సిన్హా స్కూల్లో డ్రాప్ చేసిన, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు మెచ్చుకున్న, సరదాగా నాతో ఆడుకున్న నాన్నతో నా ప్రతీ జ్ఞాపకం అపురూపం. – సుహానా ఖాన్ బాగా కష్టడాలి. మంచి ఫలితాన్ని ఆశించాలి. ఓటమికి చేరువ అవుతున్నాను... అనే భయంలోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు... అని నాన్న తరచు చెప్పేవారు. – అనన్య పాండే నాకు నచ్చిన ఇద్దరు పిల్లలు... మా నాన్న రణŠ ధీర్కపూర్, మా అబ్బాయి జె అలీఖాన్! – కరీనా కపూర్ మా నాన్న చాలా భిన్నంగా ఆలోచిస్తారు. వాటిని అర్థం చేసుకుంటే జీవితం లోతుపాతులు అర్థం అవుతాయి. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది తెలుస్తుంది. పిల్లలను సినిమాలు, పార్క్‌లకు తీసుకెళ్లడమే తండ్రి బాధ్యత అని ఆయన అనుకోలేదు. చిన్న చిన్న మాటలతోనే గొప్ప విషయాలు చెప్పడం ఆయన ప్రత్యేకత. ‘యూ మస్ట్ ఫెయిల్’ అని ఏ తండ్రి అయినా అంటాడా? మా నాన్న అనేవాడు! ఒక్క ఫెయిల్యూర్ ఎన్ని పాఠాలు నేర్పుతుంది!! – ఆలియా భట్ -
పెళ్లి తరువాత కరియర్‌కు గుడ్‌బై చెప్పిన బ్యూటీస్
-
హీరోలకు కెరీర్ బెస్ట్ ఇస్తున్న..గోల్డెన్ లెగ్ బ్యూటీస్
-
ఈ గ్లామర్ ముంబై ఫ్లేవర్
తెలుగు తెరపై ముంబై హీరోయిన్లు మెరవడం అనేది కొత్తేం కాదు. ఈ ముంబై గ్లామర్ ఫ్లేవర్ ఈ ఏడాది బాగానే కనిపిస్తోంది. మరి.. బాలీవుడ్లో సినిమాలు చేస్తూటాలీవుడ్ స్క్రీ న్ పై మెరవనున్న ఆ కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. ప్రాజెక్ట్ కె పిలిచింది బాలీవుడ్ టాప్ హీరోయి న్స్ లో ఒకరైన దీపికా పదుకో న్ ఇండస్ట్రీకి వచ్చిన పదిహేనేళ్ల తర్వాత తొలి తెలుగు సినిమాకు గ్రీ న్ సిగ్నల్ ఇచ్చారు. ఆమెను టాలీవుడ్‌కు పిలిచిన కథ ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాలో దీపికా పాత్రకు యాక్ష న్ సీ న్స్ కూడా ఉంటాయన్నది ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సై న్స్ ఫిక్ష న్ మూవీకి నాగ్ అశ్వి న్ దర్శకత్వం వహిస్తున్నారు. యాభై శాతానికి పైగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను ముందు ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ నెల 12న లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఆస్కార్ అవార్డుల వేడుకలో దీపికా పదుకో న్ ఓ ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో పాల్గొనడానికి శుక్రవారం దీపికా ముంబై నుంచి లాస్ ఏంజిల్స్ ప్రయాణమయ్యారు. జాన్వీ ఎంట్రీ షురూ తెలుగు ప్రేక్షకులకు దివంగత ప్రముఖ నటి శ్రీదేవితో ప్రత్యేకమైన ఎమోషనల్ బాండింగ్ ఉంటుందనడంలో సందేహం లేదు. తెలుగు ప్రేక్షకుల నుంచి అంత గొప్ప ప్రేమను పొందారామె. మరి.. అలాంటి శ్రీదేవి కుమార్తె అయిన జాన్వీ కపూర్ (ఇద్దరు కమార్తెలు జాన్వీ కపూర్, చిన్న కుమార్తె ఖుషీ కపూర్) హీరోయి న్ గా కెరీర్‌ను ఆరంభించినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆమె రాక కోసం ఎదురు చూడకుండా ఉంటారా? ఆ ఎదురు చూపుల నిరీక్షణ ఐదేళ్లకు ఫలించింది. 2018లో వచ్చిన హిందీ చిత్రం ‘ధడక్’తో హీరోయి న్ గా పరిచయమైన జాన్వీ కపూర్ ఐదేళ్ల తర్వాత తొలి తెలుగు సినిమాకు సై న్ చేశారు. ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేష న్ లో రూపొందనున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయి న్ గా నటించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 18న జరుగుతుందని, నెలాఖర్లో షూటింగ్‌ను ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఆల్రెడీ ప్రకటించింది. ఢిల్లీ టు హైదరాబాద్ ఒకే సినిమాతో ఇద్దరు ఢిల్లీ బ్యూటీలు తెలుగుకు వస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రవితేజ టైటిల్ రోల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయి న్ గా నటిస్తున్నారు నూపుర్ సన న్ . అలాగే మరో ఢిల్లీ బ్యూటీ గాయత్రీ భరద్వాజ్ కూడా ఇదే సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. తెలుగులో మహేశ్‌బాబు ‘వ న్ : నేనొక్కడినే’, నాగచైతన్య ‘దోచేయ్’ చిత్రాల్లో నటించిన కృతీ సన న్ తాజాగా ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’లో హీరోయి న్ గా నటించారు. కృతీ చెల్లెలే నూపుర్. ప్రపంచ సుందరికి స్వాగతం ఐదేళ్ల క్రితం.. అంటే 2017లో మిస్ వరల్డ్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు మానుషీ చిల్లర్. గతంలో మిస్ వరల్డ్‌గా నిలిచి, సినిమాల్లోకి వచ్చిన లారా దత్తా, ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్, ప్రియాంకా చోప్రా తదితరుల మాదిరిగానే మానుషీ చిల్లర్ కూడా నటనను ఓ వృత్తిగా తీసుకున్నారు. హిందీలో అక్షయ్ కుమార్ నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ హీరోయి న్ గా మానుషీ చిల్లర్‌కు తొలి సినిమా. ఇక ఈ బ్యూటీ రీసెంట్గా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఓ సినిమాకు గ్రీ న్ సిగ్నల్ ఇచ్చారు. వరుణ్ తేజ్ హీరోగా హిందీకి పరిచయం అవుతున్న ఈ సినిమాతో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా తొలిసారి మెగాఫో న్ పట్టారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రంలో ఇండియ న్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్, రాడార్ కమ్యూనికేష న్స్ ఆఫీసర్‌గా మానుషీ చిల్లర్ నటిస్తున్నారు. మోడల్ టు యాక్టర్ మోడల్‌గా కెరీర్ ఆరంభించి, ఆ తర్వాత హీరోయి న్ గా సెటిలైన బాలీవుడ్ అమ్మాయిల జాబితా చాలానే ఉంది. ఈ లిస్ట్‌లో తాజాగా సాక్షీ వైద్య చేరారు. అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమాతో సాక్షీ వైద్య హీరోయి న్ గా తెలుగుకు పరిచయం అవుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నట్లుగా తెలిసింది. అఖిల్, సాక్షీలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారట. ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. వీరితోపాటు మరికొంతమంది హిందీ తారలు తెలుగు తెరకు పరిచయం కానున్నారు. -
'అదే వారి బలం.. అందుకే ప్రాణాంతకమైనా జయించారు'
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సినీరంగంలో రాణించడమంటే మాటలు కాదు. పైగా హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం అంతా ఈజీ కాదు. ఎంత టాలెంట్ ఉన్న కూడా అదృష్టం కలిసి రాకపోతే ఈ రంగంలో గుర్తింపు దక్కడం కష్టమే. అంతే కాకుండా కెరీర్ సాఫీగా సాగుతుందనుకునేలోపే ఊహించని సంఘటనలు మరింత వెనక్కి లాక్కెళ్తాయి. అవకాశాలు అందే సమయంలో అనుకోని పరిణామాలతో దాదాపు కెరీర్ ముగిసేంతా పరిస్థితి ఎదురవుతుంది. కానీ అలాంటి సమయంలోనే మనం పట్టుదలగా ఉండాలి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోకూడదు. అలా ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కోలుకున్న హీరోయిన్ల పేర్లు ఇట్టే వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. జీవితంలో అత్యంత గడ్డుకాలాన్ని అధిగమించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్లు కొందరే ఉన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా విజయం సాధించిన ఆ తారలపై ప్రత్యేక కథనం. మయోసైటిస్‌ను జయించిన సమంత సమంత సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు. గతంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సామ్ ఆ తర్వాత కోలుకుని కెరీర్లో మళ్లీ బిజీ అయిపోయింది. మయోసైటిస్ బారిన పడిన సమయంలో అత్యంత క్లిష్ట పరిస్థితులను అనుభవించింది. మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు సమంత. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకినా.. ధైర్యంగా నిలబడి ఎదుర్కొంది. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌ను సెట్స్ మీదకు తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్‌దేవరకొండ ‘ఖుషీ’ చిత్రంలోనూ సామ్ నటించనుంది. గతంలో మయోసైటిస్ గురించి సామ్ మాట్లాడుతూ.. 'ఎదుటి వాళ్లు ఎంతగా కష్టపడుతున్నారు.. జీవితంలో ఎంత పోరాడుతున్నారు.. అనేది మీకు ఎప్పటికీ తెలియదు.. అందుకే కాస్త దయతో మెలగండి’అని సామ్ చెప్పుకొచ్చింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోందంటూ ఎమోషనలైంది సామ్. అందువల్లే బయటపడ్డా: సుస్మితాసేన్ ఇటీవల మాజీ మిస్‌వరల్డ్, నటి సుస్మితాసేన్ ఇటీవల తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆమెకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి, స్టంట్ వేశారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నారు. ఇటీవలే ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు సుస్మితాసేన్. ఆమె మాట్లాడూతూ.. 'ఇటీవల నేను తీవ్ర గుండెపోటుకు గురయ్యా. ప్రధాన రక్తనాళం 95 శాతం మూసుకుపోయింది. వైద్యులు నా కోసం ఎంతో శ్రమించారు. నా కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇటీవల ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదు కావడాన్ని గమనిస్తున్నాం. దయచేసి వ్యాయామాలు చేయండి. నా విషయంలో వ్యాయామాలు చేయడం ఉపయోగపడింది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. నీ హృదయాన్ని ఎప్పుడూ సంతోషంగా, ధైర్యంగా ఉంచు. కష్టకాలంలో అది నీకు అండగా నిలుస్తుంది. మా నాన్న సుబీర్సేన్ నాకు చెప్పిన ఈ మాటలే నాకు స్ఫూర్తి' అంటూ చెప్పుకొచ్చింది సుస్మితా సేన్. ఆత్మవిశ్వాసంతో గెలిచా: హంసా నందిని అత్తారింటికి దారేది, ఈగ, మిర్చి సినిమాల్లో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి హంసానందిని. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఏడాదిన్నర పాటు క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. గతంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. క్యాన్సర్ నుంచి కోలుకున్న హంసానందిని ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయింది. గతంలో హంసా మాట్లాడుతూ..' వైద్య పరీక్షల్లో నాకు వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్ ఉందని తేలింది. జన్యు పరివర్తన కారణంగా భవిష్యత్తులో మళ్లీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు చెప్పారు. అయినా కూడా నేను అధైర్యపడలేదు. ఆత్మవిశ్వాసంతోనే ఆ మహమ్మారిని గెలిచా.' అంటూ చెప్పుకొచ్చింది. క్యాన్సర్‌తో పోరాడిన సోనాలిబింద్రే ‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’ వంటి పలు తెలుగు హిట్ చిత్రాల్లో నటించిన భామ సోనాలి బింద్రే. సోనాలిబింద్రే క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచింది. అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని మళ్లీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ కష్టం సమయంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించింది. మనిషి తన జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుందని.. క్యాన్సర్‌తో పోరాడి దాని నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉన్నా.' అంటూ చెప్పుకొచ్చింది. రెండుసార్లు జయించిన మమతా మోహన్‌దాస్ రెండు సార్లు(2010, 2013) కేన్సర్ బారిన పడి నటి మమత మోహన్ దాస్. ధైర్యంగా,ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకొని కోలుకుంది. ఇటీవలే మరో అరుదైన చర్మ వ్యాధి బారిన పడినట్లు వెల్లడించింది. ‘విటిలిగో(బొల్లి)’ వ్యాధి సోకిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. క్యాన్సర్ సమయంలో తాను పడిన కష్టాలను గతంలో ఆమె వివరించింది. క్యాన్సర్‌కు గురికావడంతో నా కలలన్నీ చెదిరిపోయాయని వెల్లడించింది. ఏడేళ్లు పోరాడి ఆ మహమ్మారిని జయించానని తెలిపింది. అమ్మానాన్నలు,స్నేహితుల ధైర్యంతోనే క్యాన్సర్‌పై గెలిచానని చెప్పుకొచ్చింది. అలాగే గతంలో సీనియర్ హీరోయిన్లు మనీషా కొయిరాల, గౌతమి కూడా క్యాన్సర్‌ను జయించిన వారిలో ఉన్నారు.