భమ్ చికి చికి భమ్‌చికి భమ్ భమ్ చికి చికి భమ్‌బాంబేకి వెళ్లారు సౌత్ బాలికలు కళ ఉంటేనే కదా బాలికలకు బాలీవుడ్ ఎంట్రీ దొరికింది అందుకే మన హీరోయిన్లు బాలికలు కాదు బాలికళు.
బాలీవుడ్‌లో చక్రం తిప్పాలని చాలామంది కథానాయికలు కోరుకుంటారు. అప్పట్లో దక్షిణాది నుంచివెళ్లిన హేమ మాలిని, శ్రీదేవి, జయప్రద వంటివారు బాలీవుడ్‌వారిని ఆకట్టుకోగలిగారు. ఆ తర్వాత మలయాళీ బ్యూటీ విద్యాబాల గురించి చెప్పక్కర్లేదు.మంచి మంచి సినిమాలు చేస్తూ హిందీలోనే సెటిలయ్యారు.ఇక ఇప్పుడు కొత్తగా వస్తున్న సౌత్ కథానాయికల్లో కొందరు ‘అప్నా టైమ్ ఆగయా’ అంటూ హిందీలో తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు.
డబుల్ ధమాకా
సౌత్‌లో నిత్యామీన కి సూపర్ పేరుంది. అద్భుతమైన నటి. దాదాపు పదేళ్లుగా సౌత్‌కే పరిమితమైన ఈ మలయాళ బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్ నుంచి కబురొచ్చింది. ప్రస్తుతం ‘మిష మంగళ్’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు నిత్యామీన . ఇస్రో మార్స్ మిష సక్సెస్ కావడానికి కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, తాప్సీ, సోనాక్షి సిన్హా ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమాలో వర్ష అనే శాస్త్రవేత్తగా నటిస్తున్నారు నిత్యా. మరోవైపు ఆమె ‘బ్రీత్’ వెబ్ సిరీస్ సెకండ్ పార్ట్‌లో అభిషేక్ బచ్చ సరసన కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌లో మాధవ నటించారు. ఇలా హిందీ సినిమా, వెబ్ సిరీస్‌లతో ఒకేసారి నిత్యామీన డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారు.
ఇప్పుడుకథానాయికగా...
‘అర్జు రెడ్డి’ సినిమాతో నటిగా మంచి మార్కులు వేయించుకున్నారు కథానాయిక షాలినీ పాండే. ఆ తర్వాత తమిళ, తెలుగు సినిమాలతో ఆమె డైరీ బాగానే ఫుల్ అవుతోంది. ఈ టైమ్‌లోనే ఆమె కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కేలా బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు పరేష్ రావల్ కుమారుడు ఆదిత్యా రావల్ హీరోగా ‘బాంఫాడ్’ అనే చిత్రం రూపొందనుంది. ఇందులో కథానాయికగా నటించనున్నారు షాలినీ పాండే. దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మించనున్నారు. రంజన్ చంఢీలా అనే రచయిత ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం కానున్నారు. ఇంతకుముందు ఓ రెండు హిందీ సినిమాల్లో షాలినీ కనిపించారు కానీ కథానాయికగా ఆమెకు చా రావడం ఇదే తొలిసారి. ఇక కల్యాణ్‌రామ్‌తో కలిసి ఆమె నటించిన తెలుగు చిత్రం ‘118’ మంచి విజయాన్ని అందుకుంది
రెండుభాషలకు హాయ్
‘యుటర్న్’ సినిమాలో అద్భుతంగా నటించి ఆడియ ్స దృష్టిని తనవైపు తిప్పుకున్నారు కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్. ప్రస్తుతం తెలుగులో నాని హీరోగా రూపొందుతున్న ‘జెర్సీ’ చిత్రంలో హీరోయి గా నటిస్తున్నారామె. అలాగే బాలీవుడ్ హిట్ ‘పింక్’ తమిళ రీమేక్‌కు సై చేశారు శ్రద్ధా. సౌత్‌లో ఇంత బిజీగా ఉన్న ఈ కన్నడ భామ బాలీవుడ్‌లో కూడా బిజీ కావాలని బాలీవుడ్ వైపు టర్న్ తీసుకున్నారు. తిగ్‌మాన్షు ధూలియా దర్శకత్వంలో ‘మిలా టాకీస్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అలీ ఫజల్ హీరోగా నటిస్తున్నారు. ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్‌కి, ‘మిలా టాకీస్’తో బాలీవుడ్‌కి ఒకేసారి హాయ్ చెప్పారన్న మాట ఈ కన్నడ బ్యూటీ.
తిరుగులేని తాప్సీ
సౌత్‌లో కథానాయికగా నిరూపించుకున్నాక బాలీవుడ్ వెళ్లారు తాప్సీ. ఆమె నటించిన చిత్రాల్లో ‘పింక్’ తాప్సీకి మంచి పేరు తెచ్చింది. అంతే.. హిందీలో తాప్సీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. బాలీవుడ్‌లో ఇప్పుడు ఆమె వన్నాఫ్‌ది బిజియస్ట్ హీరోయి . ‘పింక్’ తర్వాత ఆమె పది బాలీవుడ్ సినిమాలు చేశారంటే ఆమెకు ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు హిందీలో బిజీగా ఉన్నా సౌత్‌ని కూడా వదలడంలేదు తాప్సీ. ‘ఘాజీ, ఆనందోబ్రహ్మా, నీవెవరో’ సినిమాలు చేశారు. లేటెస్ట్‌గా ఆమె చేసిన తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ‘గేమ్‌ఓవర్’ రిలీజ్‌కు రెడీగా ఉంది. హిందీలో ‘బద్లా’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ‘మిషన్ మంగళ్’ ఆన్ సెట్స్‌లో ఉంది. ఇది కాకుండా హిందీలో మరో చిత్రం అంగీకరించారు.
బోల్డ్ ఎంట్రీ
తమిళ, తెలుగు భాషల్లోని సూపర్ హిట్ సినిమాల్లో భాగమయ్యారు రెజీనా. గతేడాది ‘ఆంఖే 2’ చిత్రంతో ఆమెబాలీవుడ్ తెరపై కనిపించాల్సింది కానీ కుదర్లేదు. ఈ ఏడాదికుదిరింది. ఈ నెల విడుదలైన ‘ఏక్ లడ్‌ఖీ కో దేఖా తోఏసా లగా’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు రెజీనా. అనిల్ కపూర్, సోనమ్ కపూర్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాలో లెస్బియ గా బోల్డ్ క్యారెక్టర్ చేశారామె. రెజీనా యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. మరి.. రెజీనాకు మరిన్ని బాలీవుడ్ అవకాశాలు వస్తాయా? వేచి చూద్దాం.
బాణంబాలీవుడ్ వైపు
‘ముని, విజయదశమి, బాణం’ వంటి తెలుగు చిత్రాల్లో కథానాయికగా నటించారు వేదిక ముఖ్యంగా ‘ముని’, ‘బాణం’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు హిందీ చిత్రపరిశ్రమకు కథానాయికగా బాణం వేస్తున్నారు. మలయాళ దర్శకుడు ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో హిందీలో ‘ది బాడీ’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఇమ్రా హష్మి హీరోగా నటిస్తున్నారు. ఇందులోనే కథానాయికగా నటిస్తున్నారు వేదిక. స్పానిష్ ఫిల్మ్ ‘ది బాడీ’ చిత్రానికిది హిందీ రీమేక్. ఇక సౌత్‌లో ‘ముని’ ఫోర్త్ పార్ట్ ‘కాంచన 3’లో ఒక హీరోయి గా నటించారు వేదిక. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది.
రూల్ బ్రేక్
సౌత్ కథానాయికలకు హిందీ సినిమాల్లో అవకాశం రావాలంటే ఆల్రెడీ దక్షిణాదిన కొన్ని సినిమాలు చేసి, ప్రూవ్ చేసుకోవాలనే నియమాన్ని బ్రేక్ చేశారు మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. హీరోయి గా ఆమె నటించిన ఒక్క సినిమా కూడా తెరపైకి రాకుండానే బాలీవుడ్ వైపు అడుగులు వేశారు. ‘శ్రీదేవి బంగ్లా’ అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారామె. ప్రశాంత్ మాబుల్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇది నటి శ్రీదేవి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా అని ’శ్రీదేవి బంగ్లా’ హెడ్ లై నిలిచింది. శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఈ చిత్రనిర్మాతలకు నోటీసులు కూడా పంపారు.
కానీ చిత్రబృందం బెదరలేదు. శ్రీదేవికి, ఈ సినిమాకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇంతకీ సౌత్‌లో ప్రియా ప్రకాశ్ ఒక్క సినిమాలో కనిపించక ముందే నార్త్‌లో ఎలా చా స కొట్టేయగలిగారంటే.. అంతా ‘కన్ను మహిమ’. తొలి సినిమా మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’. (‘లవర్స్ డే’ పేరుతో తెలుగులో విడుదలైంది) టీజర్‌లో జస్ట్ కన్ను కొట్టే సీ తో సోషల్ మీడియా సపోర్ట్‌తో స్టార్ అయిపోయారామె. ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలీవుడ్ ఆమెను పిలిచింది. ఇప్పుడు ‘శ్రీదేవి బంగ్లా’ టీజర్‌తో మరోసారి హైలైట్ అయ్యారు. ఇలా టీజర్లతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారనిపిస్తోంది. అన్నట్లు టీజర్‌తో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ‘ఒరు అదార్ లవ్’ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మరి.. ‘శ్రీదేవి బంగ్లా’ అయినా ప్రియాకి సక్సెస్ రుచిని చూపిస్తుందా?
నచ్చినకథతో ఎంట్రీ
రిజల్ట్, రిలీజ్‌లు పక్కనపెడితే సౌత్‌లో రెండేళ్లలో అరడజను సినిమాలు చేశారు మేఘా ఆకాష్. ఆమె తెలుగులో నటించిన ‘లై, ఛల్‌మోహ రంగ’ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట్టా’లో మేఘాకు మంచి రోల్ దక్కింది. ఆమెకు బాలీవుడ్ నుంచి చాలా పిలుపులొచ్చాయి కానీ నచ్చిన స్క్రిప్ట్‌తో కబురు రాలేదట. ఈ మధ్య విన్నవాటిలో ‘శాటిలైట్ శంకర్’ కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇర్ఫా కమల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూరజ్ పాంచోలి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను జులైలో విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈసారి ప్రొఫెషనల్ ట్రిప్
సౌత్‌లో కథానాయికగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు నటి అమలాపాల్. అటు హీరోయిన్‌గా గ్లామర్ పాత్రలే కాదు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. రీసెంట్‌గా తమిళ మూవీ ‘రాక్షసన్’ అనే సినిమాతో మంచి హిట్ సాధించారామె. ఇప్పుడు బాలీవుడ్ వైపు కన్నేశారు. అర్జు రామ్‌పాల్ హీరోగా హిందీలో రూపొందనున్న ఓ థ్రిల్లర్ సినిమాలో అమలాపాల్ హీరోయిన్‌గా నటించనున్నారు. నరేశ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తారు. ఖాళీ టైమ్ దొరికినప్పుడల్లా హిమాలయాల్లో గడపడం అమలాపాల్‌కు అలవాటు. ఈ సినిమాలో ఒక షెడ్యూల్ అక్కడ ప్లాన్ చేశారు. ప్రొఫెషనల్‌గానూ హిమాలయాలకు వెళ్లే అవకాశం రావడంతో ఆమె చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నారట. అంతేకాదు కొంతకాలం అమలా పాల్ ఢిల్లీలో ఉన్నారు. సో.. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా లేదు.
Comments
Please login to add a commentAdd a comment