తమిళసినిమా: సినిమా రంగంలో హీరోయిన్లకు సరైన గుర్తింపు దక్కడం లేదని మిల్కీబ్యూటీ తమన్నా వాపోతోంది. హీరోలను ప్రేమించే క్యారెక్టర్లుగానే ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ కథానాయికగా రాణించిన ఈమెకు ప్రస్తుతం క్రేజ్ తగ్గిందని చెప్పాలి. ముఖ్యంగా తమిళంలో విశాల్‌కు జంటగా నటించిన యాక్షన్ చిత్రం తరువాత మళ్లీ ఇక్కడ కనిపించలేదు. ఇలాంటి నటీమణులను కదిలిస్తే చిత్ర పరిశ్రమలో తమ అనుభవాల గురించి కథలు, కథలుగా చెప్పేస్తారు. వాటిలో చేదు అనుభవాలే ఎక్కువగా ఉంటాయి.
ఇలాంటి వాటిని కెరీర్ ప్రారంభంలో చెప్పడానికి వెనుకాడే నటీమణులు ఒక స్టేజ్ వచ్చాక అది అవకాశాలు తగ్గిన తరువాత ఏకరువు పెడుతుంటారు. ఇటీవల మిల్కీ బ్యూటీ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ.. చిత్ర పరిశ్రమలో చాలా అసమానతలు జరుగుతుంటాయని తెలిపింది. వీటి గురించి మహిళలు సీరియస్‌గా తీసుకోవడం లేదని చెప్పింది. తాను పని చేసిన చిత్రాలల్లో ఏ అంశం గురించి అయినా మాట్లాడితే దానిని వారు తీసుకునేవారు కాదని పేర్కొంది. ఆ తరువాత తన అభిప్రాయం సరైందేనా? కాదా? అన్న విషయం గురించి తానే పునఃపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేదని తెలిపింది.
చదవండి: (అన్నకు నమ్మకం.. తమ్ముడికి ధైర్యం)
మహిళలకు సినిమా రంగంలో మర్యాద లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక సమయంలో తాను హీరోలను ప్రేమించే పాత్రలకే పరిమితమయ్యారని చెప్పింది అయితే ప్రస్తుతం పరిస్థితి మారుతోందని, కథా పాత్రలు తనను వెతుక్కుంటూ వస్తున్నాయని వెల్లడించింది. హీరోలకే అధికంగా పారితోషికం ఇస్తున్నారని, హీరోయిన్లకు ఇవ్వడం లేదని అన్నారు. నిర్మాత నుంచి ఎలాగోల పారితోషికాన్ని పొందవచ్చునని, అయితే తగిన గుర్తింపు మాత్రం లభించడం లేదని వాపోయింది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోలు పాల్గొనకపోయినా పెద్దగా ఎవరూ పట్టించుకోరని, అదే హీరోయిన్లు పాల్గొనకపోతే వెంటనే వారికి దర్శక, నిర్మాతలతో సమస్యలు, విభేదాలు అంటూ ప్రచారం జరుగుతోందని వివరించింది. ప్రస్తుతం తాను రెండు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment