tamannaah
-
ఓదెల 2లో తమన్నా శివతాండవం..
-
మహా కుంభమేళాను వదిలిపెట్టని యాంకర్ సుమ! అక్కడ కూడా.. (ఫోటోలు)
-
త్వరలో పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్న బ్యూటీస్ విల్లే
-
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్‌లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్‌ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్‌ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్‌చరణ్ లుక్‌ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్‌గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్‌లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
ఏంటి బాబోయ్ ఈ అందం..చూపులతోనే కట్టిపడేస్తున్న తమన్నా (ఫొటోలు)
-
అందుకే మా కెమిస్ట్రీ కుదిరింది!: తమన్నా
‘‘ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు వారి నటన విషయంలో పోలికలు రావొచ్చు. కొందరు పోటీలు పెట్టి మాట్లాడుతుంటారు. నేను ఈ పోటీని ఆహ్లాదకరంగానే తీసుకుంటాను’’ అంటున్నారు హీరోయిన్ తమన్నా. ఈ బ్యూటీ ఇలా అనడానికి కారణం ఉంది. తమన్నా, రాశీ ఖన్నా, సుందర్. సి లీడ్ రోల్స్‌లో నటించిన తమిళ చిత్రం ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘బాకు’) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రాశీ ఖన్నాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి తమన్నా ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడారు. ‘‘ఇండస్ట్రీలో పోటీ ఉండొచ్చు. అయితే మనం మనలా పెర్ఫార్మ్ చేయగలిగితే చాలు. ‘అరణ్మణై 4’ సినిమా కోసం నేను, రాశీ ఓ పాట చేశాం. ఇద్దరం ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చాం. అప్పుడు మేం మా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ పైనే ఫోకస్ పెట్టాం. సాంగ్ బాగా రావడానికి రాశీ ఖన్నా తన వంతు కృషి చేసింది. మేం ఇద్దరం ఒకరికొకరం సపోర్ట్ చేసుకోవడం వల్లే మా కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఓ కో స్టార్‌గా రాశీ బాగా సపోర్ట్ చేసిందని నాకనిపించింది. ఇలా పోటీ ఆహ్లాదకరంగా ఉంటే మంచిదే’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. -
ఓటీటీలో రూ. 100 కోట్ల హారర్ మూవీ.. అఫీషియల్ ఫ్రకటన
కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నటుడు సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం 'బాక్'. తమిళ్లో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ 'అరణ్మనై 4' నుంచి వచ్చిన 4వ చిత్రమిది. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. మే 3న విడుదలైన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. ఇదే విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.తమిళ్లో 'అరణ్మనై 4' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 'బాక్' టైటిల్‌తో విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే, ఈ సినిమా త్వరలో హాట్‌స్టార్‌లో విడుదల కానుందని ఆ సంస్థ ప్రకటించింది. విడుదల తేదీ ప్రకటించకుండా త్వరలో రిలీజ్ చేస్తామని హాట్‌స్టార్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. விரைவில் 🔥Aranmanai 4 Coming Soon On Disney + Hotstar#Aranmanai4 #ComingSoon #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/DsYnNrZ3d2— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 2, 2024 కానీ, జూన్ 7న బాక్ విడుదల కానున్నట్లు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు,తమిళ్, కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. -
అదరగొడుతున్న హారర్ మూవీ.. ఏకంగా వంద కోట్లు..
హారర్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఏకంగా వంద కోట్లు రాబట్టింది. ఆ సినిమా మరేదో కాదు అరణ్మనై 4. సుందర్, తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మే 3న తమిళనాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో బాక్ పేరిట విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టింది. ఈ ఏడాది సెంచరీ కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.సెంచరీ..ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అరణ్మనై వంద కోట్లు వసూలు చేసిందంటూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. అరణ్మనై ఫ్రాంచైజీలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. అవన్నీ విజయం సాధించగా ఈసారి నాలుగో పార్ట్ తీశారు. గత చిత్రాలన్నింటికంటే అరణ్మనై 4 అద్భుత విజయం సాధించింది. నాలుగో పార్ట్‌లో మెయిన్ లీడ్..ఇక గత మూడు చిత్రాల్లో సహాయక పాత్రల్లో కనిపించిన ఈ సినిమా డైరెక్టర్ సుందర్ నాలుగో పార్ట్‌లో మాత్రం ప్రధాన పాత్రలో నటించడం విశేషం. కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్‌కుమార్‌కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో యోగిబాబు, కోవై సరళ, రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్ సహాయక పాత్రల్లో నటించారు. హిప్హాప్ ఆది సంగీతం అందించాడు. A celebration in theaters 🥳 A phenomenon at the box office 🔥 The 1st Tamil movie of 2024 to gross 100 crores worldwide 😍❤🔥And it's all from the love you've given us ✨ #Aranmanai4BlockbusterHitA #SundarC unstoppable blockbuster entertainer🥳A @hiphoptamizha… pic.twitter.com/VvrcKGT63g— KhushbuSundar (Modi ka Parivaar) (@khushsundar) May 22, 2024 చదవండి: పవిత్ర-చందు మరణం.. నటుడు నరేశ్ కీలక వ్యాఖ్యలు -
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
‘‘బాక్’ మూవీ ట్రైలర్ చూస్తే సుందర్‌గారు ఎంత ప్రతిభ ఉన్న డైరెక్టరో తెలుస్తుంది. షూటింగ్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది’’ అని హీరోయిన్ తమన్నా అన్నారు. సుందర్ .సి కీలక పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘అరణ్మనై 4’. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అవ్ని సినిమాక్స్పై ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీని ‘బాక్’ పేరుతో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ తెలుగులో మే 3న రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఖుష్బూ సుందర్ మాట్లాడుతూ– ‘‘దక్షిణాదిలో నా సినిమా జర్నీ సురేష్ ప్రోడక్షన్ నుంచే మొదలైంది. ‘బాక్’ని తెలుగులో విడుదల చేస్తున్న సురేష్‌గారికి, జాన్వీకి థ్యాంక్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం థియేటర్స్‌లో అదరగొడుతుంది’’ అన్నారు. ‘‘బాక్’లో హారర్, గ్లామర్, థ్రిల్, కామెడీ.. ఇలా అన్నీ ఉన్నాయి’’ అన్నారు రాశీ ఖన్నా. ‘‘ఈ మూవీని థియేటర్స్‌లో చూడండి.. ఎంజాయ్ చేస్తారు ’’అన్నారు జాన్వీ నారంగ్. ‘‘చాలా కాలం తర్వాత ‘బాక్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం హ్యాపీ’’ అన్నారు కోవై సరళ. -
చెడుపై గెలుపు
అహీరోయిన్ తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఫేమ్ అశోక్ తేజ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తన ప్రజలను రక్షించడానికి దేవుడు ప్రతి యుగంలో చెడుని ఎలా గెలుస్తాడో చూపించే కథాంశంతో ఈ మూవీ ఉంటుంది.హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో జరుపుతున్న రెండో షెడ్యూల్ 25 రోజుల పాటు సాగుతుంది. సినిమాలోని ప్రధాన తారాగణంతో పాటు ఇతర నటీనటులతో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహ, మురళీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సౌందర్ రాజన్ .ఎస్, క్రియేటెడ్ బై: సంపత్ నంది. -
నవ్వు... భయం
తమన్నా, సుందర్ సి, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బాక్’. సుందర్ సి. దర్శకత్వం వహించారు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తమిళ్, తెలుగులో ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీగా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో శివానీ పాత్రలో తమన్నా, శివ శంకర్‌గా సుందర్ సి. నటించారు. వారి పాత్రలను పరిచయం చేస్తూ లుక్స్ రిలీజ్ చేశారు. ‘‘హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బాక్’’ అన్నారు మేకర్స్. -
గ్లామర్‌కే ఓటేస్తున్న తమన్నా.. కారణం ఇదేనట!
గ్లామరస్‌గా నటించాలంటే నేటి కథానాయికల్లో తమన్నా తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. సుమారు 20 ఏళ్ల క్రితం చాంద్ సా రోషన్ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తరువాత దక్షిణాది చిత్రాలపై దృష్టి పెట్టారు. హిందీలో పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయినా, తెలుగు, తమిళం భాషల్లో అగ్రనటిగా రాణిస్తున్నారు. అయితే ఆది నుంచి తమన్నా గ్లామర్‌నే నమ్ముకున్నారని చెప్పవచ్చు. నువ్వు కావాలయ్యా.. అలాగని ఈ అమ్మడిలో నటించే సత్తా లేదని చెప్పలేం. బాహుబలి వంటి చిత్రాల్లో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. అయినా గ్లామర్ క్వీన్‌గానే ముద్ర వేసుకున్నారు. ఇటీవల జైలర్ చిత్రంలో నువ్వు కావాలయ్యా పాటలో తనదైన స్టైల్లో అందాలను ఆరబోసారు. ఈ పాట ఇప్పటికీ వాడవాడల్లో మారు మోగుతోందంటే అతిశయోక్తి కాదు. తమన్నా తమిళంలో నటించిన తాజా చిత్రం అరణ్మణై –4. ఇందులో అభినయం, అందాలతో ప్రేక్షకులను అలరించడానికి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మైండ్‌సెట్ మారాలి ఈ సందర్బంగా ఈ చిత్రంలో ఎక్కువ గ్లామరస్‌గా నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. దీనిపై మిల్కీ బ్యూటీ స్పందిస్తూ.. గ్లామర్‌ను ప్రదర్శించడం, అలాంటి పాటల్లో నటించడం అనేది ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమేనన్నారు. ఇంకా చెప్పాలంటే పాటల్లో గ్లామర్‌ను ప్రదర్శించడం తప్పేమీ కాదన్నారు. ఈ విషయంలో ప్రేక్షకుల మైండ్‌సెట్ మారాలన్నారు. జైలర్ చిత్రంలో కావాలయ్యా పాటను చూసిన కొందరు చాలా దారుణంగా కామెంట్స్ చేశారని, అది తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు. చదవండి: అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ.. దక్కించుకున్నది ఎవరంటే? -
జైలర్ హిట్ అయ్యింది నావల్లే.. తమన్నా సంచలనం
-
తమన్నా బ్యూటీ క్లినిక్‌లో సందడి చేసిన పేజ్–3 సెలబ్రిటీలు... (ఫొటోలు)
-
ఘనంగా తమన్నా మేకప్ అకాడమీ కాన్వకేషన్ (ఫొటోలు)
-
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా మోడ్రన్ డ్రెస్‌లలో అదరహో (ఫోటోలు)
-
తమన్నా ఆస్తి ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు, ఎక్కడా తగ్గట్లేదుగా!
ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో మారుమోగుతున్న పేరు తమన్నా భాటియా. రజనీకాంత్ కథానాయకుడిగా నటింన జైలర్ సినిమాలోని నువ్వు కావాలయ్యా అనే ఒక్క పాటతో రిలీజ్‌కు ముందే ఆ చిత్రానికి వీరలెవల్లో పబ్లిసిటీ తెచ్చి పెట్టింది. 2005లో వెండితెరపై రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ గత 17 ఏళ్లుగా పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. తమిళంలో ఈమె నటించిన తొలి సినిమా కేడి. ఈ మూవీ నిరాశపర్చినప్పటికీ ఆ తర్వాత నటించిన కల్లూరి చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఏడాదికి రూ.12 కోట్ల పైచిలుకు సంపాదన ఆ తర్వాత వరుసగా కోలీవుడ్ ధనుష్, విజయ్, అజిత్.. తెలుగులో దాదాపు అందరు హీరోలతోనూ నటించి అగ్ర హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా జైలర్ చిత్రంలో ఒక పాట, రెండు మూడు సన్నివేశాల్లో మాత్రమే నటించినప్పటికీ సినిమా సక్సెస్‌లో క్రెడిట్ కొట్టేసింది. ఐటమ్ సాంగ్స్‌లోను నటించడానికి వెనుకాడని తమన్నా కళ్లు చెదిరే ఆస్తులను కూడబెట్టిందంటూ తాజాగా ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ఈ మిల్కీబ్యూటీ ఏడాదికి రూ.12 కోట్ల పైచిలుకు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా ఈమె ఒక్క సినిమాకు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు పుచ్చుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా ఐటెం సాంగ్ కోసం రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల దాకా డిమాండ్ చేస్తున్నట్లు టాక్. సినిమాలతో పాటు ఇతర వాణిజ్య సంస్థలకు అంబాసిడర్‌గా ఉంటూ మరిన్ని కోట్లు పోగేస్తున్నట్లు తెలుస్తోంది. 2018లో ఐపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 10 నిమిషాల పాటు తళుక్కుమని మెరిసినందుకుగానూ రూ.50 లక్షల దాకా డబ్బు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. తమన్నా ముంబైలో నివసిస్తున్న అపార్డుమెంట్ ఖరీదు రూ.16 కోట్లు అని సమాచారం. అదేవిధంగా లేడ్రోవర్ డిస్కవరీ స్పోర్ట్, బీఎండబ్యూ సహా నాలుగు ఖరీదైన కార్లను తమన్నా వాడుతోంది. అంతేకాకుండా ఈమె సొంతంగా ఒక బంగారు నగల షాపును నిర్వహిస్తోంది. మొత్తం మీద తమన్నా ప్రస్తుతం రూ.120 కోట్లకు అధిపతి అని ప్రచారం జరుగుతోంది.. చదవండి: చెప్పులేసుకుని జెండా ఎగరేసిన హీరోయిన్.. బుద్ధుండక్కర్లా? అంటూ ట్రోలింగ్.. -
ఈ సినిమాతో నాకో మంచి ఫ్రెండ్ దొరికారు: కీర్తీ సురేష్
‘‘నాకు ఒక సిస్టర్ ఉంది. బ్రదర్‌లాంటి ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. ‘భోళా శంకర్’ చేశాక మెహర్ రమేష్‌లాంటి అన్నయ్య దొరికారు’’ అన్నారు కీర్తీ సురేష్. చిరంజీవి టైటిల్ రోల్లో మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘భోళా శంకర్’. చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రను కీర్తీ సురేష్ చేశారు. ఈ నెల11న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా కీర్తీ సురేష్ చెప్పిన విశేషాలు. ► ‘భోళా శంకర్’లో చిరంజీవిగారి చెల్లెలి ఆఫర్ వచ్చినప్పుడు రజనీకాంత్‌గారి చెల్లెలిగా చేసిన ‘అన్నాత్తే’ (‘పెద్దన్న’) పూర్తి చేశాను. అందుకే వెంటనే చెల్లెలిగా అంటే ఫర్వాలేదా? అని మెహర్ రమేష్గారితో అన్నాను. అయినప్పటికీ సూపర్ స్టార్ రజనీకాంత్‌గారికి చెల్లెలిగా నటించిన వెంటనే మెగాస్టార్ చిరంజీవిగారి చెల్లెలిగా అంటే ఇంకేం కావాలి? అనిపించింది. దాంతో పాటు చిరంజీవిగారితో ఒక్క ఫ్రేమ్‌లో అయినా డ్యాన్స్ చేయాలనుకున్న నాకు రెండు పాటలు చేసే చాన్స్ స్క్రిప్ట్‌లో ఉంది. మెహర్ రమేష్‌గారు నా క్యారెక్టర్ని కూడా బాగా డిజైన్ చేశారు. ► మా అమ్మ (మేనక) గతంలో చిరంజీవిగారి సరసన ‘పున్నమి నాగు’లో నటించారు. అప్పుడు చిరంజీవిగారు తీసుకున్న కేర్, ఆయన ఇచ్చిన సలహాల గురించి అమ్మ ఇప్పుడు నాతో చెప్పారు. అవి చిరూగారితో చెబితే.. ‘ఈ సలహాలు కూడా ఇచ్చాను’ అంటూ అమ్మ చెప్పనివి కూడా చెప్పారు. ఇన్నేళ్లయినా ఆయన గుర్తుంచుకోవడం ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు నా విషయంలోనూ కేర్ తీసుకున్నారు. అయితే ‘మీ అమ్మలా నువ్వు అమ్మాయకురాలివి కాదు... చాలా స్మార్ట్’ అని నవ్వుతూ అన్నారు. ఆయన ఇంటి నుంచే నాకు ఫుడ్ వచ్చేది. ఈ సినిమా రూపంలో నాకో మంచి ఫ్రెండ్ (చిరంజీవిని ఉద్దేశించి) దొరికారు. ► రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్గా, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో లీడ్‌గా, చెల్లెలి క్యారెక్టర్లు.. ఇలా పలు వేరియేషన్స్ ఉన్నవి చేస్తున్నాను. ఇలా చేయడం అంత ఈజీ కాదు. అయితే ఓ పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఇలాంటివిæ చేయలేదే అని ఫీల్ కాకూడదు. అందుకే అన్ని రకాల సినిమాలు చేస్తున్నాను. -
మారకపోతే ఆగిపోతాం.. పెళ్లి ప్లాన్ ఇప్పటికైతే లేదు: –తమన్నా
‘నువ్వు కావాలయ్య...’ అంటూ ‘జైలర్’లో హుషారుగా స్టెప్పులేశారు తమన్నా. ఈ బ్యూటీ కూడా సినిమా ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్. అందుకే దాదాపు 20 ఏళ్లయినా ఇంకా ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళంలో ‘అరణ్మణై’, మలయాళంలో తొలి చిత్రం ‘బాంద్రా’, ఓ టీవీ షోతో బిజీగా ఉన్నారామె. చిరంజీవి సరసన తమన్నా నటించిన ‘భోళా శంకర్’ ఈ 11న విడుదల కానుంది. అంతకు ఒక్కరోజు ముందు రజనీకాంత్ ‘జైలర్’తో థియేటర్లకు వస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ‘భోళా శంకర్’ని నిర్మించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ రూపొందింది. రెండు చిత్రాలతో థియేటర్లకు రానుండటం, ఇతర విశేషాలు తమన్నాతో జరిపిన ఇంటర్వ్యూలో ఈ విధంగా... ► ఈ నెల 10న ‘జైలర్’, 11న ‘భోళా శంకర్’ సినిమాలతో వస్తున్నారు. సో.. వచ్చే వారం మీకు స్పెషల్ అనొచ్చు... విషయం ఏంటంటే.. ఒకటి తమిళ సినిమా, మరొకటి తెలుగు సినిమా అయినా రెండు సినిమాలూ అన్ని భాషల్లో థియేటర్లకు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవిగారు, సూపర్ స్టార్ రజనీకాంత్‌గారు.. ఇద్దరూ దేశంలో పెద్ద స్టార్స్. ఇలా ఒక్క రోజు గ్యాప్‌లో ఇద్దరు స్టార్స్‌తో సినిమా అంటే కల నెరవేరినట్లు ఉంది. ఈ రెండు మాత్రమే కాదు.. నేను చేసిన ఇంకో సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అదొక మంచి ఫీలింగ్. ► చిరంజీవి డ్యాన్స్ మామూలుగా ఉండదు... మీరు డ్యాన్స్‌లో బెస్ట్. అయితే మీ ఇద్దరికీ ‘సైరా’లో డ్యాన్స్ చేసే చాన్స్ రాలేదు.. ‘భోళా శంకర్’లో మీ కాంబో డ్యాన్స్ గురించి... ‘మిల్కీ బ్యూటీ...’ మంచి రొమాంటిక్ మెలోడి సాంగ్. ఈ పాటలో ఒక హుక్ స్టెప్ ఉంటుంది. మిగతా స్టెప్స్ కూడా గ్రేస్‌ఫుల్‌గా ఉంటాయి. చిరంజీవిగారి డ్యాన్స్ చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే మిగతావారికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. పైగా శేఖర్ మాస్టర్ మంచి స్టెప్స్ డిజైన్ చేశారు. స్విట్జర్లాండ్‌లో ఈ పాట షూట్ జరిగింది. పెద్దగా రిహార్సల్స్ చేయలేదు. అక్కడికి అక్కడే నేర్చుకుని చేసేశాం. అలాగే ఇదే సినిమాలో ‘జామ్ జామ్...’ పాట కూడా నాకు చాలా ఇష్టం. ► సీనియర్ హీరోలతో సినిమాలు చేసినప్పుడు... అంత సీనియర్స్‌తో ఎందుకు? అనే ప్రశ్న ఎదురవుతుంటుంది కదా... ఇప్పుడు నా కెరీర్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అన్ని రకాల యాక్టర్స్‌తో నటిస్తున్నాను. నాకన్నా చిన్నవాళ్లకు జోడీగా, నాకు సమానమైన ఏజ్ ఉన్నవాళ్లతో, సీనియర్లతో సినిమాలు చేస్తున్నాను. ఓటీటీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాను. నా కెరీర్లో నేనెప్పుడూ ఏజ్ గురించి పట్టించుకోలేదు. నేను యాక్టర్లను యాక్టర్లగా చూస్తాను. నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తాను. నా క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా అన్నదే నాకు ముఖ్యం. ఏజ్ వల్ల ఈక్వేషన్ ఏం మారదు. ► దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నారు. ఇంకా బిజీ బిజీగా సినిమాలు చేస్తూ రేస్‌లో దూసుకెళ్లడానికి కారణం? అస్సలు నేను ఇది రేస్ అనుకోను. చాలా చిన్న వయసులో కెరీర్ స్టార్ట్ చేశాను. జయాపజయాలనేవి మన చేతుల్లో ఉండవు. టీమ్ వర్క్ ముఖ్యం. ఒక్కోసారి కొన్ని విజయాలకు నేనూ కారణం అవుతాను. ఆ సంగతి పక్కనపెడితే.. కెరీర్లో ముందుకు వెళ్లాలంటే నిరంతరం హార్డ్‌వర్క్ చేయాలి. ఆ ఫోకస్‌తోనే వెళుతున్నాను. ► ఈ మధ్య కొన్ని హద్దులను దాటి, బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు.. ఈ మార్పు గురించి? మారకపోతే నేనెక్కడ మొదలయ్యానో అక్కడే ఆగిపోయినట్లే.. అలా ఆగిపోవాలని ఎవరూ అనుకోరు. ఎవరైనా కెరీర్లో ఎదగాలనే అనుకుంటారు. ప్రతీ జాబ్‌లో ప్రమోషన్ ఉన్నట్లే మా జాబ్ కూడా. ప్రమోషన్ కోసం కొంచెం బ్రాడ్‌గా ఆలోచించాలి.. కొత్త ప్రయత్నాలు చేయాలి. అప్పుడు జర్నీ ఇంకా లాంగ్గా, బెటర్‌గా ఉంటుంది. ► ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్‌లో నటించిన అనుభవం గురించి? మన చుట్టూ ఇప్పుడు రకరకాల మాటలు దొర్లుతుంటాయి. వాటిలో ఏది మంచో.. చెడో తెలుసుకోలేం. అందుకే ‘లస్ట్ స్టోరీస్ 2’ గురించి నాతో అభిమానులు, ఇంకా వేరేవాళ్లు బాగుందని అన్నప్పుడు కొత్త ప్రయత్నం రీచ్ అయిందనే ఆనందం కలిగింది. ముఖ్యంగా ఉమన్ వచ్చి బాగుందని అభినందించడంతో చాలా హ్యాపీ ఫీలయ్యాను. ► ఇన్నేళ్లల్లో మీ గురించి రానటువంటి వార్తలు ఇప్పుడు వస్తున్నాయి.. ఫర్ ఎగ్జాంపుల్ నటుడు విజయ్ వర్మ, మీ గురించి ఎక్కువ ప్రచారమవుతోంది... ఎవరో ఏదో మాట్లాడతారు. కానీ నేను ఎప్పుడు మీడియాతో మాట్లాడినా హానెస్ట్‌గానే మాట్లాడాను. ఇక ఎవరెవరో రూమర్స్ క్రియేట్ చేస్తే నేనేం చేయలేను. ► పెళ్లి ప్లాన్ ఏమైనా? ఇప్పటికైతే లేదు. ప్లాన్ చేసుకున్నప్పుడు కచ్చితంగా చెబుతాను. -
రజినీకాంత్ 'జైలర్' మూవీ స్టిల్స్
-
'భోళా శంకర్'.. అదే అతి పెద్ద సవాల్!
‘‘ఓ భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే.. ఒరిజినల్ని మ్యాచ్ చేస్తే సరి΄ోదు.. దానికంటే ప్రతి విషయంలోనూ ఒక అడుగు బెటర్‌గా ఉండాలి.. అది పెద్ద సవాల్. అందుకే ‘భోళా శంకర్’ విజువల్స్ విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. ఒరిజినల్ ఫిల్మ్ ‘వేదాలం’ కంటే ‘భోళా శంకర్’ ఇంకా బాగుంటుంది’’ అని కెమెరామేన్ డడ్లీ(రాజేంద్ర) అన్నారు. చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కెమెరామేన్ డడ్లీ మాట్లాడుతూ– ‘‘నా అసలు పేరు రాజేంద్ర. డడ్లీ నా ముద్దు పేరు. తమిళనాడులోని ఊటీ నా స్వస్థలం. తమిళనాడులో ఫిలిం టెక్నాలజీ చదువుకున్న తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యాను. మెహర్ రమేష్, నేను పదేళ్లుగా స్నేహితులం. తనే ‘భోళా శంకర్’ అవకాశం ఇచ్చాడు. తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఫుల్ ΄ప్యాకేజ్ ఆఫ్ మాస్ ఎంటర్టైనర్గా ఉంటుంది. చిరంజీవిగారు పెర్ఫెక్షనిస్ట్, చాలా పంక్చువల్. ఈ రెండు విషయాలు ఆయన్నుంచి నేర్చుకున్నాను. ‘భోళా శంకర్’లో ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో వచ్చే పెద్ద యాక్షన్ సీన్ తీయడం చాలా కష్టంగా అనిపించింది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా అన్నీ సమకూర్చారు’’ అన్నారు. -
'భోళాశంకర్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..
చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘భోళాశంకర్’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27న ట్రైలర్ విడుదలకానుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్స్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. కాగా ‘భోళాశంకర్’ ట్రైలర్‌ను ఈ నెల 27న(గురువారం) విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఆదివారం అధికారికంగా ప్రకటించి, చిరంజీవి లుక్‌ని రిలీజ్ చేసింది. చేతిలో కత్తి పట్టుకుని సీరియస్ లుక్‌లో నడిచి వస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాలో సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, ‘వెన్నెల’ కిషోర్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, కెమెరా: డడ్లీ, లైన్ ప్రొడక్షన్: మెహర్ మూవీస్. -
డబ్బింగ్ డన్
‘భోళా శంకర్’కు సొంత డబ్బింగ్ చెప్పారు తమన్నా. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’.ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. కాగా ఈ సినిమాలో తమన్నా డబ్బింగ్ వర్క్ పూర్తయింది. తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారామె. అనిల్ సుంకర సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. -
మిల్కీ బ్యూటీ... నువ్వే నా స్వీటీ
‘అచ్చ తెలుగు పచ్చి మిర్చి మగాడు వీడే.. బొంబాటు ఘాటు హాటు హాటుగున్నాడే.. కల్లోకి వచ్చేసి కన్నెగుండెల్లో సూది గుచ్చి పిల్లా నీ ముచ్చటేంది అన్నాడే...’ అంటూ రొమాంటిక్ మోడ్‌లోకి వెళ్లిపోయారు హీరోయిన్ తమన్నా. చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను విజయ్ ప్రకాష్, సంజన కల్మంజేతో కలసి ఈ చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వర సాగర్ ఆలపించారు. -
జాన్వీ కొత్త మూవీ బవాల్ స్క్రీనింగ్‌లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
చిరంజీవి 'జామ్ జామ్ జజ్జనక' కోసం రెడీగా ఉండండి
‘జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక.. తెల్లార్లు ఆడుదాం తైతక్క..’ అంటూ చిందేశారు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ మూవీలో తమన్నా కథానాయికగా నటించారు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘జామ్ జామ్ జజ్జనక...’ అంటూ సాగే రెండో పాట ప్రోమోని ఆదివారం విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో చిరంజీవి సంప్రదాయ దుస్తులు ధరించి సూపర్ కూల్‌గా కనిపిస్తున్నారు. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘భోళా మానియా...’ అనే మొదటి పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ‘జామ్ జామ్ జజ్జనక...’ అంటూ సాగే పూర్తి పాటని ఈ నెల 11 విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. కీర్తీ సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, కెమెరా: డడ్లీ, లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్. -
నువ్వు కావాలయ్యా అంటూ దుమ్ములేపిన తమన్నా
కొంచెం ఆట కావాలా? కొంచెం పాట కావాలా? అంటూ ఊర మాస్ స్టెప్పులతో తమన్నా అదరగొట్టారు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’లోని ‘నువ్వు కావాలయ్యా..’ అంటూ సాగే పాట ఇది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ‘జైలర్’ చిత్రం ఆగస్టు 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘రా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. రజనీకాంత్, తమన్నా మధ్య ఈ పాట సాగుతుంది. అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరచిన ఈ పాటకు అరుణ్ రాజా కామరాజ్ సాహిత్యం అందించగా శిల్పా రావు, అనిరుధ్ పాడారు. జానీ మాస్టర్ ఈ పాటకు నృత్య రీతులు సమకూర్చారు. ‘జైలర్’లో శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. -
మీ క్యాలెండర్లో ఇది మార్క్ చేసుకోండి: చిరంజీవి
‘భోళా శంకర్’ సినిమాలోని తన పాత్ర డబ్బింగ్‌ని పూర్తి చేశారు హీరో చిరంజీవి. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ‘‘భోళా శంకర్’ రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫైర్ మాస్ ఎంటర్టైనర్ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మీ క్యాలెండర్లను మార్క్ చేసుకోండి. థియేటర్స్‌లో కలుద్దాం.. భోళా శంకర్ ఆగస్టు 11’’ అంటూ డబ్బింగ్ చెబుతున్న ఓ ఫొటోని షేర్ చేశారు చిరంజీవి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కీర్తీ సురేష్, సుశాంత్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: డడ్లీ. -
విజయ్ మామూలోడు కాదు... లస్ట్ స్టోరీస్ 2 సీన్స్ పై తమన్నా కామెంట్స్
-
నా ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు
నటుడు విజయ్ వర్మ, హీరోయిన్ తమన్నా ప్రేమలో ఉన్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడారు. ‘‘కో యాక్టర్‌తో కలిసి యాక్ట్ చేసినంత మాత్రాన అతనిపై ఆకర్షణ ఏర్పడుతుందంటే నేను నమ్మను. అలా అనుకుంటే నేను చాలామంది యాక్టర్స్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఏదైనా మనం వ్యక్తిగతంగా ఫీలవ్వాలి. మన మనసుకు అనిపించాలి. ఇక విజయ్ వర్మతో నా బాండింగ్ చాలా సహజంగా మొదలైంది. ఇలాంటి వ్యక్తి కోసమే నేను ఎదురు చూశాను. జీవితంలో చాలా సాధించిన నాలాంటి వారికి ప్రతిదానికీ చాలా కష్టపడాలనే ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి కోసం భారతీయ స్త్రీలు తమ జీవితం మొత్తం మార్చుకోవాలనే ఒక ఆలోచన ఉంటుంది. జీవిత భాగస్వామిని పొందాలంటే అతను ఉన్న చోటుకి వెళ్లాలి.. లేదా అతన్ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా మసులుకోవాలి. కానీ నేను నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. నేనేం చేయకుండానే ఆ ప్రపంచాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి (విజయ్ వర్మను ఉద్దేశించి).. చాలా కేర్ తీసుకునే వ్యక్తి. అతను ఉన్న చోటు నాకు ఆనందంగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. దీంతో విజయ్ వర్మతో ప్రేమను తమన్నా పరోక్షంగా కన్ఫార్మ్ చేశారని నెటిజన్లు అంటున్నారు. ఇక తమన్నా నటించిన లేటెస్ట్ వెబ్ ఆంథాలజీ ‘లస్ట్ స్టోరీస్ 2’లో విజయ్ వర్మ నటించారు. ఈ ఆంథాలజీ షూటింగ్ సమయంలోనే విజయ్, తమన్నా ప్రేమలో పడి ఉంటారనే ఊహాగానాలు ఉన్నాయి. -
సమంత నవ్వులు.. మృణాల్ బోల్డ్ క్యాప్షన్
►ఈ రోజు తన మూడ్ ఇలా ఉందంటూ సోఫాపై నవ్వులు చిందుస్తున్న ఫోటోని షేర్ చేసింది సమంత ►యషికా ఆనంద్ తన ఐదు స్టిల్స్‌ని పోస్ట్ చేసింది. వాటిల్లో ఏది నచ్చిందో చెప్పమని అభిమానులను అడిగింది ►బ్లాక్ కలర్ డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్ ఫోటో షూట్ చేసింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..‘బ్లాక్ అండ్ బోల్డ్’ అని కాప్షన్ ఇచ్చింది. ఇలా నేడు సోషల్ మీడియాలో తారలు పంచుకున్న మరిన్ని విశేషాలు.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Olivia (@oliviakmorris) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
మాస్ డ్యాన్స్ చేసేద్దాం...
శంకర్ మంచి జోష్ మీద ఉన్నాడు. అందుకే జోరుగా స్టెప్పులు వేస్తున్నాడు. ఒక్కడే కాదు.. ప్రేయసితో, చెల్లెలితో, ఇంకా చాలామందితో కలిసి మాస్ డ్యాన్స్ చేసేద్దాం అంటూ రెచ్చిపోతున్నాడు. చిరంజీవి టైటిల్ రోల్లో రూపొందుతున్న ‘భోళా శంకర్’లోని పాట గురించే చెబుతున్నాం. ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా, చెల్లెలి పాత్రను కీర్తీ సురేశ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురితో పాటు చిత్రంలోని ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా హైదరాబాద్‌లో ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం భారీ సెట్‌ని రూపొందించారు. చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వర సాగర్ స్వరపరచిన ఈ మాస్ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఆగస్టు 11న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి. -
ఆవారా సీక్వెల్.. తెరపైకి కార్తీ పేరు
మళ్లీ ఆవారాగా కనిపించనున్నారట కార్తీ. లింగుసామి దర్శకత్వంలో కార్తీ, తమన్నా హీరో హీరోయిన్లుగా వచ్చిన తమిళ చిత్రం ‘పయ్యా’ (తెలుగులో ‘ఆవారా’). 2010లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చెప్పుకోదగ్గ ఆదరణ లభించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని కొంత కాలంగా లింగుసామి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రెండో భాగంలో ఆర్య హీరోగా చేస్తారనే వార్తలు వచ్చాయి. తాజాగా మళ్లీ కార్తీ పేరే తెరపైకి వచ్చింది. కార్తీ నటించే చాన్స్ ఎక్కువగా ఉందని కోలీవుడ్ అంటోంది. -
కథకు కీ ఇస్తారు!
ఓ కీ ఇచ్చి కథను కీలక మలుపు తిప్పే కీలక పాత్రలు ఉంటాయి. అలాంటి ‘కీ’ రోల్స్ నిడివి తక్కువైనా గుర్తింపు ఎక్కువ ఉంటుంది కాబట్టి హీరో.. హీరోయిన్లు అప్పుడప్పుడూ ‘కీ’ రోల్స్ ఒప్పుకుంటుంటారు. ఇప్పుడు కథకు ‘కీ’ ఇచ్చే పాత్రలు చేస్తున్న కొందరు కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సిస్టర్ ఆఫ్ శంకర్ కమర్షియల్ మూవీస్‌లో హీరోయిన్గా, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో లీడ్ రోల్ చేయడం మాత్రమే కాదు... వీలైనప్పుడుల్లా అతిథిగా, కీలక పాత్రధారిగా కూడా నటిస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘సీమరాజా’, ‘మన్మథుడు 2’, ‘జాతిరత్నాలు’ వంటి సినిమాల్లో గెస్ట్ రోల్ చేశారు కీర్తి. ఇక మోహన్‌లాల్ ‘మరక్కార్: అరభికడలింటే సింహమ్’, రజనీకాంత్ ‘అన్నాత్తే’(తెలుగులో ‘పెద్దన్న’) చిత్రాల్లో కీర్తీ సురేష్ కథలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘భోళా శంకర్’ చిత్రంలో కీ రోల్ చేస్తున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, చిరంజీవి చెల్లెలుగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. తొలి అడుగు ప్రత్యేక పాత్రల పరంగా తొలి అడుగు వేశారు హీరోయిన్ శ్రుతీహాసన్. నాని హీరోగా శౌర్యవ్ దర్శకుడిగా పరిచయం అవుతూ ‘హాయ్ నాన్న’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కథలో కీలకమైన ఓ ప్రత్యేక పాత్రలో హీరోయిన్ శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ఆమె ప్రత్యేక పాత్రలో నటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూనూర్‌లో జరుగుతోంది. చెరుకూరి మోహన్, విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 21న విడుదల కానుంది. డాటర్ ఆఫ్ భగవత్ అరడజనుకుపైగా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ, టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోయిన్గా ఉంటున్న శ్రీలీల ‘భగవత్ కేసరి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో కీలక పాత్ర చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, బాలకృష్ణ హీరోగా టైటిల్ రోల్ చేస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరులో రిలీజ్ కానుంది. ఇక శ్రీలీల ఓ కథానాయికగా నటిస్తున్న చిత్రాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. ఇందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్. కేరాఫ్ జైలర్ టాలీవుడ్లో ‘క్రేజీ ఫెలో’, ‘ఉగ్రం’ సినిమాల్లో నటించి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మిర్నా మీనన్. ఈ బ్యూటీ ఇప్పుడు ‘జైలర్’ సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా, రమ్యకృష్ణ, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ కుమార్తెగా మిర్నా మీనన్ కనిపిస్తారట. ఈ షూటింగ్లో మిర్నా దాదాపు 40 రోజులు పాల్గొన్నారు. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది. వెల్కమ్ టు టాలీవుడ్ వజ్రకాళేశ్వరి దేవిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు హీరోయిన్ అపర్ణా దాస్. మల యాళంలో ‘మనోహరం’, తమిళంలో ‘బీస్ట్’ వంటి చిత్రాల్లో నటించిన అపర్ణా దాస్‌కు తెలుగులో తొలి చిత్రం ‘ఆదికేశవ’. వైష్ణవ్‌తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఇందులో కీలకమైన వజ్రకాళేశ్వరి దేవి పాత్రను అపర్ణా దాస్ పోషిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం జూలైలో విడుదల కానుంది. వీరే కాదు... కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’లో రకుల్‌ప్రీత్ సింగ్, ప్రభాస్ ‘ఆదిపురుష్’లో సోనాల్ చౌహాన్, ‘ప్రాజెక్ట్ కె’లో దిశా పటానీ, రాఘవా లారెన్స్ ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్.. ఇలా మరికొందరు హీరోయిన్లు ఆయా చిత్రాల కథలకు ‘కీ’గా నిలుస్తున్నారు. -
త్వరలో భోళా మానియా
‘భోళా శంకర్’ ఆగస్ట్ 11న థియేటర్‌కి రానున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గరపడే సమయానికి ప్రమోషన్స్ ఆరంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ముందుగా మ్యూజికల్ జర్నీప్రా రంభిస్తారు. ఆ విషయాన్ని తెలియజేసి, ‘భోళా మానియా త్వరలోప్రా రంభమవుతుంది’ అంటూ, చిత్రకథానాయకుడు చిరంజీవి రెండు చేతులను వెనక జేబులో పెట్టుకొని ఉన్న డ్యాన్స్ మూమెంట్ లుక్‌ని రిలీజ్ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిపొంస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా, ఆయన సోదరి పాత్రలో కీర్తీ సురేష్ కనిపిస్తారు. ‘‘మాసివ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘భోళా శంకర్’. కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్, భారీ సెట్ సాంగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. జూన్ నెలాఖరకు షూటింగ్ పూర్తవుతుంది. పోస్ట్‌ప్రొడక్షన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి మంచి పాటలు ఇచ్చారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
తమన్నా నా చెంప పగలగొడుతుందేమో!: బాలీవుడ్ నటుడు
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో పడిందా? ఈ ప్రశ్నకు ఆవిడే సమాధానం చెప్పాలి. కానీ అంతవరకు ఆగలేని జనాలు సోషల్ మీడియాలో తమన్నా, విజయ్ వర్మతో క్లోజ్‌గా కనిపించడంతో ఆవిడ లవ్‌లో మునిగి తేలుతోందని ఫిక్సయ్యారు. ఇంతలో విజయ్ వర్మ స్నేహితుడు గుల్షన్ దేవయ్య.. నా తమన్నాతో తిరుగుతున్నావంటూ విజయ్ను ఆటపట్టించడంతో ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. తాజాగా తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చాడు గుల్షన్. బర్త్‌డేకు గోల్డ్ గిఫ్ట్.. 'ద గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్'తో సినీ కెరీర్‌ను ప్రారంభించిన గుల్షన్ దేవయ్య ఆదివారం(మే 28) 45వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన గురించి విజయ్-తమన్నాల రహస్య రిలేషన్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'బర్త్‌డే అంటే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ఏమీ ఉండదు. హాయిగా రోజంతా నిద్రపోతే బాగుండనిపిస్తుంది. కానీ బోలెడన్ని మెసేజ్‌లు వస్తుండటంతో వాటన్నింటికీ రిప్లై ఇవ్వాల్సి వస్తోంది. కొందరైతే బంగారు, వజ్రాభరణాలు సైతం పంపిస్తుంటారు. ఈసారి మాత్రం నా మాజీ భార్య కలిరోయ్ జియాఫెటా నా పుట్టినరోజును సెలబ్రేట్ చేసింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమె నన్ను కొడుతుందేమో! విజయ్ వర్మ, తమన్నా రిలేషన్పిల్లో ఉన్నారా? లేదా? అనేది నాకు తెలియదు. వారిద్దరూ కలిసున్న రెండు,మూడు ఫోటోలు చూశాను. ఆమెను నేనెప్పుడూ కలవలేదు, కనీసం తనెవరో కూడా తెలియదు. నేను వాగింది చూసి ఆమె నన్ను కొట్టినా కొడుతుందేమో! నా గురించి నోటికొచ్చింది వాగుతున్నావేంటి? అని నా చెంప చెళ్లుమనిపిస్తుందేమో(నవ్వుతూ)! ఇప్పటికే ఆమె ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేశారనుకోండి. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి నీకెంత ధైర్యం అని తమన్నా అభిమానులు తిట్టారు. సీరియస్‌గా చెప్పాలంటే వారి మధ్య ఏం జరుగుతుందో నాకు ఏం తెలియదు. అది వారి పర్సనల్ లైఫ్. విజయ్ను ఏడిపించడానికి ఆ సందర్భాన్ని వాడుకున్నానంతే! ఇకపోతే సౌత్‌లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలుగుతున్న సాయిపల్లవి నా క్రష్' అని చెప్పుకొచ్చాడు గుల్షన్. View this post on Instagram A post shared by : ̶G̶u̶l̶s̶h̶a̶n̶ ̶D̶e̶v̶a̶i̶a̶h̶ (@gulshandevaiah78) చదవండి: పవన్ కల్యాణ్ సినిమా సెట్లో అగ్నిప్రమాదం -
అందులో నిజం లేదు, ఆ రూమర్స్ నన్నెంతో బాధపెట్టాయి : తమన్నా
మిల్క్ బ్యూటీ తమన్నా కొంతకాలంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలె ఆమె బాలకృష్ణ సినిమాలో ఐటెంసాంగ్ చేస్తుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎన్బీకే 108' ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను సంప్రదించగా, కోటిన్నర డిమాండ్ చేసిందని, దీంతో తమన్నాను తప్పించినట్లు వార్తలు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్స్‌పై ఘాటుగానే స్పందించింది తమన్నా. 'అనిల్ రావిపూడితో కలిసి వర్క్ చేయడాన్ని నేను ఎంతో ఇష్టపడతాను. అలాగే బాలకృష్ణ సార్ అంటే కూడా నాకు ఎంతో గౌరవం ఉంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నేను స్పెషల్ సాంగ్ చేస్తున్నాను అంటూ నా గురించి వార్తలు రాస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నా గురించి ఇలా రాయడం నన్నెంతో బాధించింది. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'విరూపాక్ష' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసేముందు దయచేసి రీసెర్చ్ చేసి తెలుసుకోండి' అంటూ తమన్నా ట్వీట్ చేసింది. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. గతంలో అనిల్ రావిపూడితో కలిసి ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమాల్లో నటించింది తమన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. I have always enjoyed working with @AnilRavipudi sir. I have huge respect for both him and Nandamuri Balakrishna sir. So reading these baseless news articles about me and a song in their new film, is very upsetting. Please do your research before you make baseless allegations. — Tamannaah Bhatia (@tamannaahspeaks) May 20, 2023 -
స్విస్‌లో సాంగ్
అసలే ఎండాకాలం.. పైగా కొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి టైమ్‌లో కూల్ కూల్‌గా ఉండేప్రాంతానికి వెళ్లే చాన్స్ వస్తే.. హాయి హాయిగా ఉంటుంది. ప్రస్తుతం ‘భోళా శంకర్’ టీమ్ ఆ హాయినే అనుభవిస్తోంది. ఇటీవల స్విట్జర్లాండ్‌లో ల్యాండ్ అయ్యాడు ‘భోళా శంకర్’. అక్కడి కూల్ కూల్ క్లైమేట్లో ప్రేయసితో ఫుల్ స్వింగ్‌లో స్ప్రింగ్‌లాంటి స్టెప్పులేస్తున్నాడట. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన చెల్లెలి పాత్రలో హీరోయిన్ కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్విట్జర్లాండ్లోప్రారంభమైంది. చిరంజీవి, తమన్నాలపై సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను కూడా ప్లాన్ చేశారు. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ స్వరకర్త. ‘భోళా శంకర్’ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. -
అటు యాక్షన్.. ఇటు డబ్బింగ్
హీరో చిరంజీవి బరిలోకి దిగి, విలన్లను రఫ్ఫాడిస్తున్నారు. ఇదంతా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’ కోసమే. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనుండగా, నటుడు సుశాంత్ లవర్ బాయ్ పాత్ర చేస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర ‘భోళా శంకర్’ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరణను హైదరాబాద్లోప్రారంభించింది యూనిట్. చిరంజీవి, షావర్ అలీ, వజ్ర అండ్ ఫైటర్స్, ఇతర ప్రముఖ తారాగణంపై ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. మరోవైపు డబ్బింగ్ పనులకు కూడా గురువారమే శ్రీకారం చుట్టారు. ‘‘భోళా శంకర్’ ‘కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్‌తో పాటు ఐఫీస్ట్ అనిపించే పాటలు ఉంటాయి. చిరంజీవిని స్టైలిష్ మాస్ అవతార్‌లో చూపిస్తున్నారు మెహర్ రమేశ్. జూన్‌లో షూటింగ్ పూర్తవుతుంది. ఆగస్టు 11న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
200 మంది డ్యాన్సర్ల మధ్య చిరు, కీర్తి స్టెప్పులు
అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ చేస్తున్నారు శంకర్. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘బోళా శంకర్’. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తుండగా, ఆయనకు జోడీగా తమన్నా నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సెట్లో చిరంజీవి, కీర్తీ సురేష్‌లతో పాటు 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటుండగా, ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నారు. సత్యానంద్ కథా పర్యవేక్షణ చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: డడ్లీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి. -
Movie News: మాలీ కాలింగ్
తెలుగులో తెలుగు అమ్మాయిలు తప్ప ఇతర భాషల బ్యూటీలు ఎక్కువగా సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా అటు ముంబై ఇటు కేరళ భామల హవా ఎక్కువగా ఉంటుంది. అయితే తెలుగులో బాగా పాపులార్టీ తెచ్చుకున్న నాయికలు ఇప్పుడు మలయాళంకి వెళుతున్నారు. ఇద్దరు సీనియర్ హీరోయిన్లకు, ఒక యువ హీరోయిన్‌కు మాలీవుడ్ నుంచి కాల్ వెళ్లింది. మలయాళంలో ఈ ముగ్గురి తొలి చిత్రం గురించి తెలుసుకుందాం. ఇండస్ట్రీకి వచ్చి పదిహేను సంవత్సరాలు దాటినా ఇంకా అగ్రకథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నారు తమన్నా. ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన తమన్నా వీలైనప్పుడు కన్నడ తెరపైనా మెరిశారు. అయితే మలయాళ వెండితెరపై మాత్రం కనిపించలేదు. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్ల తర్వాత తమన్నా ఫస్ట్ టైమ్ ఓ మాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దిలీప్ హీరోగా అరుణ్ గోపీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాంద్రా’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారామె. ఈ సినిమాలో తమన్నా మహారాణి పాత్రలో కనిపించనున్నారట. సో.. మాలీవుడ్‌కి రాణిలా ఎంటర్ అవుతున్నారన్న మాట. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. కాగా దిలీప్ హీరోగా నటిస్తున్న మరో సినిమాతో టాలీవుడ్ బాపు బొమ్మగా ప్రేక్షకులు చెప్పుకునే కన్నడ భామ ప్రణీత కూడా మాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాకు రతీష్ రఘునందన్ దర్శకుడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్ పాత్రల్లోనే కనిపించిన ప్రణీత ఈ సినిమాలో మాత్రం కాస్త మాస్‌గా కనిపించనున్నారట. క్యారెక్టర్ దృష్ట్యా ప్రణీత పాత్రకు కాస్త అహంకారం ఉంటుందట. సో.. ప్రణీత మాలీవుడ్ ఎంట్రీ మమమ్మాస్ అన్నమాట. ఈ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక ఓ బిడ్డకు (కుమార్తె ఆర్నా) జన్మనిచ్చిన తర్వాత ప్రణీత ఒప్పుకున్న తొలి సినిమా ఇదే. మరోవైపు టాలీవుడ్ బేబమ్మ (‘ఉప్పెన’లో కృతీ శెట్టి పేరు), యంగ్ బ్యూటీ కృతీ శెట్టికి కూడా మాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా మూవీ ‘అజయంటే రందం మోషణం’లో కృతీ శెట్టి ఓ హీరోయిన్గా నటిస్తుండగా, ఐశ్వర్యా రాజేష్, సురభి లక్ష్మీ కూడా హీరోయిన్లుగా చేస్తున్నారు. మూడు యుగాల కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. -
జమున బయోపిక్‌లో స్టార్ హీరోయిన్!
దివంగత ప్రఖ్యాత నటీమణి జమున బయోపిక్‌లో మిల్కీబ్యూటీ తమన్న నటించనున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్‌లో అలాంటి అవకాశం ఉందనే సమాధానం వస్తోంది. ప్రఖ్యాత నటీమణుల జీవిత చరిత్రతో చిత్రాలు తెరకెక్కించడం సాధారణ విషయమే. ఇంతకుముందు నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన మహానటి చిత్రంలో కీర్తిసురేశ్ టైటిల్ పాత్రను పోషించారు. సావిత్రి పాత్ర పోషించిన కీర్తీసురేశ్‌కు సినీ ప్రముఖుల అభినందనలు దక్కడంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. అదేవిధంగా ప్రముఖ శృంగార తార సిల్క్‌స్మిత బయోపిక్ హిందీలో ది డర్టీ పిక్చర్స్ పేరుతో రూపొందించారు. సిల్క్‌స్మిత పాత్రలో విద్యాబాలన్ నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇకపోతే ప్రఖ్యాత నటి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందిన తలైవి చిత్రంలో బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ టైటిల్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రఖ్యాత నటీమణి జమున జీవిత చరిత్రను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. నటి జమున తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో 190 చిత్రాలకు పైగా నటించారు. ఈ బయోపిక్‌లో హీరోయిన్ తమన్నా జమున పాత్రను పోషించనుందట. కథ విన్న వెంటనే ఆమె అంగీకరించినట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకున్న జమున -
తమన్నా- విజయ్ డేటింగ్.. తొలిసారి స్పందించిన నటుడు
విజయ్ వర్మ, తమన్నా భాటియా వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఏ ఈవెంట్లో చూసినా వీరిద్దరు జంటగా కనిపించడంతో రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా ముద్దు పెడుతున్న వీడియో వైరలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ జంట ముంబయి ఎయిర్‌పోర్ట్‌లోనూ దర్శనమిచ్చింది. ఇటీవల ఓ అవార్డ్ ఫంక్షన్లో ఇద్దరూ కలిసి సందడి చేయడంతో మరోసారి రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై నటుడు విజయ్ వర్మ స్పందించారు. తన రాబోయే ప్రాజెక్ట్ 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' డైరెక్టర్ సుజోయ్ ఘోష్‌తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే నా అసలు లంచ్ డేట్ అంటూ పోస్ట్ చేశారు. దీనిపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజయ్, తమన్నా డేటింగ్ వార్తలను ఇప్పటి వరకు ధృవీకరించలేదు. My lunch date🤷🏻♂️@sujoy_g https://t.co/I9jT7gupzV pic.twitter.com/nKKW8S0vkH — Vijay Varma (@MrVijayVarma) January 17, 2023 -
Tamannaah: రొమాంటిక్ సన్నివేశాల్లో హీరోయిన్ల కంటే హీరోలకే వణుకు
నటి తమన్నా మరోసారి వార్తల్లోకెక్కింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ అమ్మడి పేరే మారుమోగుతోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ఆ తర్వాత కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన తమన్నా భాటియా ఈ రెండు భాషల్లోనూ స్టార్ హీరోలతో జతకట్టి క్రేజీ నటి అయ్యింది. అయితే తెలుగులో కొంచెం ఎక్కువగా పేరు తెచ్చుకుంది. మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఈ మిల్కీబ్యూటీ తర్వాత అభినయానికి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించి తానేంటో నిరూపించుకుంది. అయితే బాహుబలి, సైరా వంటి కొన్ని చిత్రాలు ఈమె నటన సత్తాను చాటిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకు ఉదాహరణ హిందీలో నటించిన బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి వంటి చిత్రాలే. అయితే ఈమె అందాల ఆరబోసిన చిత్రాలు మాత్రం బాగానే సక్సెస్ అయ్యాయి. ఇక ఐటెం సాంగ్స్‌లో తమన్నా ఇరగదీసింది. హీరోలతో సన్నిహితంగా నటించడం గురించి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ పేర్కొంటూ ఇప్పుడు చిత్రాల్లో అంతరంగిక సన్నివేశాలను ఎవరు ఇష్టపడడం లేదని చెప్పుకొచ్చింది. అయినా నిజం చెప్పాలంటే సన్నిహిత సన్నివేశాల్లో నటించేటప్పుడు హీరోయిన్ల కంటే హీరోలకే వణుకు పుడుతుందని, ఈ విషయాన్ని తాను చాలాసార్లు గమనించానని పేర్కొంది. అమ్మాయిలతో అలా నటిస్తున్నామని భావించడమే వారిలో దడకు కారణం కావచ్చునంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో చిరంజీవికి జంటగా భోళాశంకర్‌తో పాటు హిందీలో ఒక చిత్రం చేస్తోంది. ఆ మధ్య రజనీకాంత్ సరసన జైలర్ చిత్రంలో నటించనుందనే ప్రచారం జరిగినా అది వాస్తవం కాలేదు. కాగా ప్రస్తుతం ఈమె తన బాయ్‌ఫ్రెండ్ విజయవర్మతో షికార్లు కొడుతోంది. ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు ప్రచారం జోరుగానే సాగుతోంది. చదవండి: (పులి కడుపున పులిబిడ్డే పుడుతుంది.. ఆ కుటుంబం విషయంలో ఇది అక్షరసత్యం) -
తమన్నా ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. న్యూ ఇయర్ ఈవెంట్లో నటుడు విజయ వర్మను హగ్ చేసుకుని ముద్దు పెట్టిన వీడియో బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సింగిల్‌గా ఉంటూ ఇప్పటివరకు రూమర్లకు దూరంగా ఉన్న తమన్నా తాజాగా విజయ్ వర్మతో డేటింగ్ గాసిప్స్‌తో వార్తల్లోకెక్కింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి తమన్నాపై పడింది. ఈ వార్తల్లో నిజమెంతుంది, తమన్నా నిజంగానే విజయ్ వర్మతో రిలేషన్లో ఉందా? అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో తమన్నాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం చర్చనీయాంశమైంది. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటిగా ఆమె సంపాదించిన ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. దశాబ్ద కాలంపైనే సినీ రంగంలో స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె 2007లో హ్యాపీడేస్ మూవీతో తొలి సక్సెస్‌ను అందుకుంది. ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే.. ఇటివల ముంబైలో ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిందట. దానికి విలువ దాదాపు రూ. 16 కోట్లు ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఆమె పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన విషయం తెలిసిందే. పలు శారీ షోరూంలతో పాటు ఫాంటా, ఫ్రూటీ, సెల్కాన్ వంటి పలు బ్రాండ్లకు ఆమె ప్రచారం చేస్తుంది. ఈ ప్రకటనల ద్వారా ఆమె ఏడాది మొత్తం రూ. 12 కోట్లు అర్జీస్తుందట. ఈ లెక్కన నెలకు తమన్నా ఒక కోటి సంపాదిస్తుందన్నమాట. ఇలా ఇప్పటి వరకు తమన్నా సంపాదించిన మొత్తం ఆస్తి విలువ రూ. 110 కోట్లుపైనే ఉంటుందని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె ఒక్క చిత్రానికి రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది. ఇక స్పెషల్ సాంగ్స్‌కు అయితే రూ. 50 లక్షలు నుంచి కోటి వరకు డిమాండ్ చేస్తుందట. ఇదిలా ఉంటే తమన్నా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తోంది. 2015లో వైట్ అండ్ గోల్డ్ పేరిట ఒక డైమండ్ జువెల్లరి బ్రాండ్‌ను ప్రారంభించింది. అలాగే తమన్నా వద్ద రూ. 2 కోట్లు విలువ చేసిన అరుదైన వజ్రం ఉందట. దానిని మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల సైరా నరసింహా రెడ్డి మూవీ సమయంలో తమన్నాకు బహుమతిగా ఇచ్చింది. అది ప్రపంచంలోనే 5వ అతి పెద్ద డైమండ్ అని వినికిడి. దీని బరువు సుమారుగా 62.4 గ్రాములు ఉంటుందట. వీటితో పాటు ఆమె గ్యారేజిలో విలువైన కార్ల కలెక్షన్స్ కూడా ఉన్నాయట. అందులో లాండ్ రోవర్ డిస్కవరీ, బీఎమ్‌డబ్య్లూ 5 సిరీస్, బెంజ్ కార్లు ఉన్నాయి. ఇక తమన్నా వాడే హ్యాండ్ బ్యాగ్ ఖరీదు రూ. 3 లక్షలు పైచిలుకు ఉంటుందని తెలుస్తోంది. ఇలా తమన్నా భారీగానే ఆస్తులు వెనకేసుకుంది. చదవండి: నేను కోరుకుంది ఇదే.. చాలా సంతోషంగా ఉంది: తమన్నా వీడియోతో ట్రోలర్స్ నోరు మూయించిన హీరోయిన్ -
త్వరలో వివాహబంధంలోకి మిల్కీ బ్యూటీ.. వరుడు ఎవరో తెలుసా?
మిల్కీ బ్యూటీ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు తమన్నా. అభిమానుల్లో అంతలా పేరు సంపాదించుకుంది ఈ భామ. శ్రీ మూవీతో తెలుగు తెరపై మెరిసిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ముద్ర వేసిన తమన్నాపై ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ముంబై ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే తమన్నా చేసుకోబోయే వ్యక్తి ఎవరన్నా దానిపైనే నెట్టింట్లో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. (చదవండి: తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్న ప్రభాస్, వైరల్‌గా త్రోబ్యాక్ వీడియో) తమన్నా భాటియా త్వరలో ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయడం లేదని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ వార్తలను ఆమె ఇప్పటివరకు ఖండించకపోవడంతో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తన తల్లిదండ్రులే నిర్ణయిస్తారని చెబుతూ వస్తోంది మిల్క్ బ్యూటీ. ముంబైకి చెందిన తమన్నా భాటియా.. దక్షిణ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె టాలీవుడ్లో నటించిన చిత్రాల్లో అనేక సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఆమె కెరీర్లో భారీహిట్‌గా నిలిచిన చిత్రం 'బాహుబలి'. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా భాటియా పెళ్లికి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. ఆమె 14 ఏళ్ల వయస్సులోనే సినిమాల్లో నటించడం ప్రారంభించింది. కాగా.. తమన్నా ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తోంది. మరోవైపు ఓ తమిళ చిత్రంలోనూ కనిపించనుంది. -
పెళ్లికి వ్యతిరేకిని కాను..!.. త్వరలోనే పిల్లల్ని కనాలనుకుంటున్నా!
పెళ్లెందుకు? మగ తోడు లేకుంటే బతకలేమా? అంతగా కావాలంటే ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాంలే. ఇలాంటి మాటలు కొందరు టాప్ హీరోయిన్ల నుంచి వింటునే ఉన్నాం. ఉదాహరణకు నటి శృతిహాసన్ తీసుకుంటే తాను పెళ్లి చేసుకోను అని ఒక సందర్భంలో ఖరాఖండిగా చెప్పారు. ఆ తరువాత బాయ్‌ఫ్రెండ్‌తో బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరిగి పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పారు. అయితే అది కూడా జరగలేదు. ఇక నటి తమన్నా విషయానికొస్తే ఈమె కూడా ఇప్పటి వరకు పెళ్లి ఊసే ఎత్తలేదు. ఇక నటిగా అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అందాల ఆరబోతకు కేరాఫ్‌గా ముద్ర వేసుకున్న తమన్నా ఇటీవల నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో నటించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈమె అలా నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం బబ్లీ బౌన్సర్. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ హిందీ చిత్రం ఆ మధ్య విడుదలై నిరాశనే మిగిల్చింది. అదే విధంగా తెలుగులోనూ హిట్ చూసి చాలా కాలమే అయ్యింది. ఇక తమిళంలో చాలా గ్యాప్ తరువాత ఓ చిత్రంలో నటిస్తోంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న జైలర్ చిత్రంలో ఈ భామ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇది ఈమెకు ఇక్కడ రీ ఎంట్రీ చిత్రమే అని చెప్పాలి. ఒక పక్క అవకాశాలు తగ్గుముఖం పట్టడం, మరోపక్క పెళ్లి వయస్సు కూడా దాటిపోతోందని గ్రహించినట్లు ఉంది. తాజాగా ఆమె పేర్కొంటూ.. ఇన్నాళ్లూ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల పెళ్లి గురించి ఆలోచించే సమయం లేకపోయిందని, అంతేగానీ పెళ్లికి వ్యతిరేకిని కాదని చెప్పుకొచ్చింది. త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనుకుంటున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో కాబోయే జీవిత భాగస్వామిని సెట్ చేసుకునే ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు వస్తుందనుకుంటున్నా : తమన్నా
తమిళసినిమా: గ్లామరస్ పాత్రలతో తన సినీ కెరీర్‌ను ప్రారంభింన తమన్నా భాటియా ఆ తర్వాత బాహుబలి వంటి పలు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఐటెం సాంగ్స్‌లోనూ తన ప్రతిభ చాటుకుంది. నటిగా రెండు దశబ్దాలు పూర్తి చేసుకోనున్న తమన్నా ఇప్పటికీ అవకాశాలను పొందడంలో తగ్గేదే లేదన్నట్టుగా ఉంటుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగానే ఉంది. అయితే ఆదిలో ఈ అమ్మని పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ ఇప్పుడు మళ్లీ అక్కున చేర్చుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఈమె ఇప్పుడు హిందీలో ఏకంగా మూడు చిత్రాలను పూర్తి చేసింది. అందులో ఒకటి బబ్లీ బౌన్సర్. ఈ చిత్రం ద్వారా తన కెరీర్లో తొలిసారి జాతీయ అవార్డు వస్తుందని గట్టిగా నమ్ముతోంది. దీని గురించి ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మదుర్ బండార్కర్ దర్శకత్వం వహింన ఈ చిత్రానికి కచ్చితంగా తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. తాను ఇందులో హర్యానాకు చెందిన యువతిగా నటించానని తెలిపింది. మొట్టమొదటిసారిగా లేడీ బౌన్సర్ ఇతివృత్తంతో రూపొందింన కథా చిత్రం ఇదని చెప్పింది. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని పేర్కొంది. తన సినీ జీవితంలో ఉత్తమ చిత్రం అని చెప్పింది. ఇంతకు ముందు మదుర బండార్కర్ దర్శకత్వంలో నటింన హీరోయిన్లకు ఉత్తమ అవార్డులు లభించాయని, ఈ చిత్రంతో తనకు కూడా ఉత్తమ జాతీయ నటి అవార్డు లభిస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది. ఈ అవార్డు రావాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొంది. అయితే ఈ చిత్రం థియేటర్లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోండటం గమనార్హం. కాగా చిన్న గ్యాప్ తరువాత ఈమె కోలీవుడ్‌లో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తోంది. -
బబ్లీ చాన్స్ రావడం నా అదృష్టం
‘‘తెలుగు సినిమా అంటే గర్వంగా ఫీలవుతాను. ఎందుకంటే నా ప్రయాణం తెలుగు నుంచే మొదలైంది. రాజమౌళి, సుకుమార్‌గార్లతో పాటు చాలామంది దర్శకులు మన భారతీయ మూలాలకు చెందిన కథలనే తీసుకుంటుంటారు. ఇప్పటికీ మన భారతీయ సినిమాను ఎమోషన్సే నడిపిస్తున్నాయి’’ అన్నారు తమన్నా. మధూర్ భండార్కర్ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బబ్లీ బౌన్సర్’. స్టార్ స్టూడియోస్, జంగిలీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో తమన్నా మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో హరియానాకు చెందిన యువతిగా నటించాను. తొలిసారి లేడీ బౌన్సర్ కాన్సెప్ట్‌తో ఉన్న ఈ సినిమా చేసే చాన్స్ నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్లో ఇది బెస్ట్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మధూర్ బండార్కర్ చిత్రాల్లో నటించిన హీరోయిన్లకు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఉత్తరాదిలో కొంతమంది లేడీ బౌన్సర్స్ స్ఫూర్తితో ఈ సినిమా కథ రాసుకున్నాను. లేడీ బౌన్సర్‌గా తమన్నా ది బెస్ట్ అనిపించింది’’ అన్నారు మధూర్ భండార్కర్. -
'త్వరగా పూర్తి చేయండి ప్లీజ్'.. తమన్నా రిక్వెస్ట్ సోషల్ మీడియాలో వైరల్
కొన్ని పాటలు కొందరికే యాప్ట్‌గా ఉంటాయి. అలా గ్లామర్ పాత్రలకైనా పాటలకైనా పర్ఫెక్ట్ నటి అంటే తమన్నానే అనడంలో అతిశయోక్తి ఉండదేమో. ‘అందం తిన్నానండి.. అందుకే ఇలా ఉన్నానండి’ అంటూ పాడుతూ యువతను ఉర్రూతలూగిస్తున్న ఈ మిల్కీ బ్యూటీకి ఇటీవల చిన్న గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. దీంతో ఆమె టైం అయిపోయిందని ప్రచారం జోరుగా సాగింది. అయితే అలాంటి పసలేని ప్రచారాలను తొక్కేస్తూ తాజాగా మళ్లీ కథానాయికగా పుంజుకుంటున్నారు. హిందీలో మూడు చిత్రాలు, తెలుగులో మూడు చిత్రాలు, మలయళంలో ఒక చిత్రం ఇలా అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటిలో తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటిస్తున్న భోళా శంకర్, తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటిస్తున్న భారీ చిత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా మరిన్ని అవకాశాలు ఈ అమ్మడి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. దీంతో తమన్నా జైలర్ చిత్ర దర్శకుడు నిల్సన్‌కు ఒక విజ్ఞప్తి చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అవుతోంది. అదేంటంటే తన పోర్షన్ షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని కోరిందట. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలతో పాటు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు ఆమె నిల్సన్‌కు వివరించినట్లు సమాచారం. కాగా ఈ బ్యూటీ హిందీలో నటించిన బబ్లీ బౌన్సర్ చిత్రంలో ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించిన ఈ చిత్రంపై తమన్నా చాలా ఆశలు పెట్టుకున్నట్లు టాక్. ఇది థియేటర్లో విడుదల కాకపోవడంతో నిరాశకు గురైందట. మరి నెట్టింట్లో ఈ చిత్రాన్ని వీక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. చదవండి: (ఆహాలో హన్సిక మహ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
సత్యదేవ్, తమన్నా.. ‘గుర్తుందా.. శీతాకాలం’.. కొత్త తేదీ ఖరారు
సత్యదేవ్, తమన్నా జంటగా మేఘా ఆకాష్, కావ్యా శెట్టి, ప్రియదర్శి ముఖ్య తారలుగా నాగశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుర్తుందా...శీతాకాలం’. ఎమ్ఎస్ రెడ్డి, చినబాబు సమర్పణలో భావనా రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కావాల్సింది. అయితే తాజాగా కొత్త తేదీని ఖరారు చేశారు. ఈ సినిమాను సెప్టెంబరు 23న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ మంగళవారం ప్రకటించింది. ‘‘ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లోని టీనేజ్, కాలేజ్ లైఫ్ సంఘటనలను అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ విషయాలనే ఈ సినిమాలో చూపించాం. కన్నడ హిట్ ఫిల్మ్ ‘లవ్ మాక్‌టైల్’కు తెలుగు రీమేక్‌గా ‘గుర్తుందా.. శీతాకాలం’ రూపొందింది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ రెడ్డి. -
Tamannaah Bhatia: మాలీవుడ్‌కు మిల్కీ బ్యూటీ
తమన్నా భాటియా మాలీవుడ్ ఎంట్రీ షురూ అయింది. బాలీవుడ్లో కథానాయికగా పరిచయం అయిన ఈ ఉత్తరాది భామకు అక్కడ ఆశించిన అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇక్కడ కేడీ చిత్రంతో రంగప్రవేశం చేసింది. ఆ చిత్రం కూడా తమన్నాను నిరాశపరిచింది. అలాంటి సమయంలో తెలుగులో హ్యాపీడేస్ చిత్రంలో నటించే అవకాశం ఈ అమ్మడిని వరించింది. ఆ సినిమా సక్సెస్ ఆమె దశను మార్చేసింది. అదే సమయంలో తమిళ్లో సైతం కల్లూరి చిత్రం మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలోనూ ప్రవేశించింది. ఇలా నాలుగు భాషల్లో కథానాయకగా నటిస్తూ అదే సమయంలో ఐటమ్ సాంగ్లోను ఇరగదీస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. 17 ఏళ్ల సినీ కెరియర్లో తమన్నా ఇన్నాళ్లకి మాలీవుడ్ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతోంది. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ మలయాళంలో తొలిసారిగా అరుణ్ గోపి దర్శకత్వంలో దిలీప్ జంటగా నటించబోతున్నట్లు పేర్కొంది. నటనకు అవకాశం ఉన్న పాత్ర ద్వారా పరిచయం కావడం సంతోషంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ చిత్రం ద్వారా మలయాళ సినీ ప్రేక్షకుల అభినందనలు పొందే ప్రయత్నం చేస్తానని తమన్నా పేర్కొంది. కాగా ప్రస్తుతం తెలుగులో గుర్తుందా శీతాకాలం, చిరంజీవితో భోళాశంకర్, హిందీలో బబ్లీ బౌన్సర్ చిత్రాల్లో నటిస్తోంది. వీటితోపాటు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్న తమన్న తాజాగా తమిళంలో రజినీకాంత్ కథానాయకుడుగా నటిస్తున్న జైలర్ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తోంది.సిద్ధమవుతోంది. చదవండి: (గ్యాంగ్‌స్టర్‌గా విజయ్.. ఆమెతో ముచ్చటగా మూడోసారి?) -
‘జైలర్’లో తమన్నా పాత్ర అలా ఉంటుంది!
ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట జైలర్. అన్నాత్తే తరువాత రజనీకాంత్ నటిస్తున్న చిత్రమిది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. బీస్ట్ చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. బీస్ట్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో జైలర్ చిత్రం రజనీకాంత్ అభిమానులను కాస్త సంకటంలో పడేయటానికి కారణం ఇదేనని ప్రచారం జరుగుతోంది. చదవండి: పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్‌ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్ అయితే తలైవా ఈసారి పక్కా మాస్ చూపించబోతున్నారని, చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ చూసిన తరువాత ఆ నమ్మకం కలుగుతోందని అభిమానులు చెబుతున్నారు. చిత్ర షూటింగ్ ఇప్పుడే మొదలైంది. చిత్రంలో రజనీకాంత్‌తో పాటు ఐశ్వర్యారాయ్, తమన్నా, ప్రియాంక మోహన్, శాండల్ ఉడ్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ప్రముఖులు నటిస్తున్నారు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఇందులో ఆయన రెండు పాత్రలను దర్శకుడు కొత్తగా డిజైన్ చేసినట్లు సమాచారం. చదవండి: లైగర్ మూవీ ఫ్లాప్ అయితే? విలేకరి ప్రశ్నకు విజయ్ షాకింగ్ రియాక్షన్ లేకపోతే ఇందులో రజనీకాంత్ సరసన ఎవరు నటిస్తున్నారు? అన్నది ఆసక్తిగా మారింది. చిత్రంలో తమన్నా నటిస్తున్న పాత్ర చిన్న పాత్రేనని తాజా సమాచారం. ఇంకా చెప్పాలంటే పేట చిత్రంలో త్రిష పాత్ర మాదిరి జైలర్ చిత్రంలో తమన్నా అప్పుడప్పుడు వచ్చి కనిపించి మెరిపిస్తుందట. ఇందులో నిజం ఎంత అనేది పక్కన పెడితే చాలా గ్యాప్ తరువాత తమ అభిమాన నటిని చూడబోతున్నామని సంబరం పడే తమన్నా అభిమానులకు మాత్రం ఇది నిరాశపరిచే అంశం అవుతుంది. -
Tamannaah: తమన్నా ఆవేదన.. హీరోలను ప్రేమించే క్యారెక్టర్లుగానే..
తమిళసినిమా: సినిమా రంగంలో హీరోయిన్లకు సరైన గుర్తింపు దక్కడం లేదని మిల్కీబ్యూటీ తమన్నా వాపోతోంది. హీరోలను ప్రేమించే క్యారెక్టర్లుగానే ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ కథానాయికగా రాణించిన ఈమెకు ప్రస్తుతం క్రేజ్ తగ్గిందని చెప్పాలి. ముఖ్యంగా తమిళంలో విశాల్‌కు జంటగా నటించిన యాక్షన్ చిత్రం తరువాత మళ్లీ ఇక్కడ కనిపించలేదు. ఇలాంటి నటీమణులను కదిలిస్తే చిత్ర పరిశ్రమలో తమ అనుభవాల గురించి కథలు, కథలుగా చెప్పేస్తారు. వాటిలో చేదు అనుభవాలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని కెరీర్ ప్రారంభంలో చెప్పడానికి వెనుకాడే నటీమణులు ఒక స్టేజ్ వచ్చాక అది అవకాశాలు తగ్గిన తరువాత ఏకరువు పెడుతుంటారు. ఇటీవల మిల్కీ బ్యూటీ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ.. చిత్ర పరిశ్రమలో చాలా అసమానతలు జరుగుతుంటాయని తెలిపింది. వీటి గురించి మహిళలు సీరియస్‌గా తీసుకోవడం లేదని చెప్పింది. తాను పని చేసిన చిత్రాలల్లో ఏ అంశం గురించి అయినా మాట్లాడితే దానిని వారు తీసుకునేవారు కాదని పేర్కొంది. ఆ తరువాత తన అభిప్రాయం సరైందేనా? కాదా? అన్న విషయం గురించి తానే పునఃపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేదని తెలిపింది. చదవండి: (అన్నకు నమ్మకం.. తమ్ముడికి ధైర్యం) మహిళలకు సినిమా రంగంలో మర్యాద లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక సమయంలో తాను హీరోలను ప్రేమించే పాత్రలకే పరిమితమయ్యారని చెప్పింది అయితే ప్రస్తుతం పరిస్థితి మారుతోందని, కథా పాత్రలు తనను వెతుక్కుంటూ వస్తున్నాయని వెల్లడించింది. హీరోలకే అధికంగా పారితోషికం ఇస్తున్నారని, హీరోయిన్లకు ఇవ్వడం లేదని అన్నారు. నిర్మాత నుంచి ఎలాగోల పారితోషికాన్ని పొందవచ్చునని, అయితే తగిన గుర్తింపు మాత్రం లభించడం లేదని వాపోయింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోలు పాల్గొనకపోయినా పెద్దగా ఎవరూ పట్టించుకోరని, అదే హీరోయిన్లు పాల్గొనకపోతే వెంటనే వారికి దర్శక, నిర్మాతలతో సమస్యలు, విభేదాలు అంటూ ప్రచారం జరుగుతోందని వివరించింది. ప్రస్తుతం తాను రెండు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించింది. -
కోటీశ్వరుడికి ‘బబ్లీ బౌన్సర్’గా తమన్నా..
తమిళసినిమా: అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ తమన్నా. ఈ మాటను ఎవరైనా చెబుతారు. అయితే తనలో అద్భుతమైన నటి ఉందన్న విషయాన్ని బాహుబలి చిత్రంతో ఈ మిల్కీబ్యూటీ నిరూపించుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయికగా నటించిన ఈమె ఇప్పటికీ మోస్ట్ బ్యాచిలర్ నటిగానే కొనసాగుతున్నారు. అయితే పూజా హెగ్డే, రష్మిక వంటి నటీమణులు దూసుకు రావడంతో తమన్నాకు అవకాశాలు తగ్గాయని చెప్పాలి. అదే విధంగా నయనతార, అనుష్క, త్రిష, తాప్సీ వంటి నటీమణుల తరహాలో తమన్నా హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించిన దాఖలాలు లేవనే చెప్పాలి. కాగా తాజాగా ఈమె నటించిన హిందీ చిత్రం బబ్లీ బౌన్సర్. త్వరలో తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలకు సిద్ధమవుతోంది. విశేషమేమిటంటే ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా ఉంటుంది. మధూర్ మధు బండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా లేడీ బౌన్సర్‌గా నటించారు. ఒక కోటీశ్వరునికి లేడీ డాన్సర్‌గా నియమితురాలైన యువతి కథ బబ్లీ బౌన్సర్. ఇది కామెడీతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ మూవీ నేరుగా ఓటీటీ విడుదల చస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సెప్టంబర్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోందని తెలిపారు. -
ప్రపంచంలోనే ఖరీదైన వజ్రం తమన్నా సొంతం.. కోట్లలో ఆస్తులు..
Tamannaah Bhatia Has Expensive Diamond: 'హ్యపీ డేస్' సినిమాతో తెలుగు తెర ప్రేక్షకుల మనసు దోచుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ సినిమాలో తన అందం, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15 ఏళ్ల అవుతున్నా ఈ ముంబై భామ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే 'ఎఫ్-3' మూవీతో సూపర్ హిట్ కొట్టింది. త్వరలో 'గుర్తుందా శీతకాలం'తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే చిరంజీవి సరసన 'భోళా శంకర్' చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు 50కిపైగా చిత్రాల్లో నటించిన తమన్నా పర్సనల్ లైఫ్‌ను కూడా లగ్జరీతో ఎంజాయ్ చేస్తోంది. సుమారు రూ. 150 కోట్లకుపైగా ఆస్తిని కూడగట్టిన ఈ మిల్కీ బ్యూటీ వద్ద ఖరీదైన కార్లు, ఇళ్లు, ఆభరణాలు వంటి తదితర విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి. అయితే తమన్నా వద్ద ఉన్న ఒక వస్తువు గురించి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచంలేనే 5వ అతిపెద్ద వజ్రం తమన్నా దగ్గర ఉండటం. సుమారు రూ. 2 కోట్ల విలువైన ఈ వజ్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తనకు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతోంది. చదవండి: ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ? ఇదిలా ఉంటే తమన్నా ఆస్తుల విషయానికొస్తే.. ఈ ముద్దుగుమ్మకు ముంబైలోని అత్యంత ఖరీదైన జుహూ ప్రాంతంలో రూ. 16.60 కోట్ల అపార్ట్మెంట్ ఉందట. దీని విస్తీర్ణం 80, 778 చదరపు అడుగులు ఉంటుందని టాక్. రూ. 1.02 కోట్ల మెర్సిడెస్ బెంజ్ జి ఎల్, రూ. 75.59 లక్షల ఖరీదుగల ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్, రూ. 43.50 లక్షల బీఎండబ్ల్యూ 320 ఐ, , రూ. 29.96 లక్షల మిత్సుబిషి పేజర్ స్పోర్ట్స్ కార్లు ఉన్నాయని సమాచారం. -
మరోసారి జంటలుగా రానున్న హీరో-హీరోయిన్లు..
హీరో-హీరోయిన్ జోడీ రిపీట్ కావడం కామన్. అయితే ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఒకేసారి పది జంటలు రిపీట్ అవుతున్నాయి. అన్నీ భారీ చిత్రాలే. బోలెడన్ని అంచనాలున్న సినిమాలే. ఇక రిపీట్ అవుతున్న జోడీ నటిస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. చిరంజీవి-తమన్నా మళ్లీ ఆన్‌స్క్రీన్ లవర్స్‌గా కనిపించనున్నారు. ‘సైరా’లో ఈ ఇద్దరూ ప్రేమికులుగా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘బోళా శంకర్’లో జంటగా నటిస్తున్నారు. తమిళ ‘వేదాళం’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. తమిళ కథ ప్రకారం ముందు హీరోని చంపాలనుకుంటుంది హీరోయిన్. ఆ తర్వాత అతనితో ప్రేమలో పడుతుంది. తెలుగు రీమేక్‌లోనూ ఇలానే ఉంటుందని అనుకోవచ్చు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీ సురేష్ కనిపిస్తారు. ఇక ‘మహర్షి’లో రిషీ కుమార్ (మహేశ్‌బాబు), పూజ (పూజా హెగ్డే)ల చిన్ని చిన్ని అలకలు, ప్రేమ, దూరం కావడం, మళ్లీ దగ్గరవడం చూశాం. తాజాగా త్రివిక్రమ్ సినిమా కోసం ఇద్దరూ మళ్లీ జత కట్టారు. మహేశ్-పూజ జతకట్టిన రెండో సినిమా ఇది. అయితే త్రివిక్రమ్‌తో ఈ ఇద్దరికీ మూడో సినిమా కావడం విశేషం. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్-మహేశ్, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్-పూజా హెగ్డే కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందనుంది. మరోవైపు రామ్ చరణ్-కియారా అద్వానీ కూడా మళ్లీ జతకట్టారు. ‘వినయ విధేయ రామ’లో తొలిసారి ఈ జంట కనిపించింది. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్నారు. శంకర్ డైరెక్ట్‌గా తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ఇదే. ఇక ఈ సంక్రాంతికి క్యూట్ లవర్స్‌గా ‘బంగార్రాజు’లో కనిపించిన నాగచైతన్య, కృతీ శెట్టి మరో సినిమాలో హీరో హీరోయిన్గా కనిపించనున్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. కోలీవుడ్‌కి చైతూ ఎంట్రీ ఈ సినిమాతోనే జరుగుతోంది. కాగా ఆల్రెడీ రామ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘ది వారియర్’ ద్వారా కోలీవుడ్‌కి పరిచయం కానున్నారు కృతి. చైతూ, రాశీ ఖన్నాల జోడీ కూడా మళ్లీ కనిపించనుంది. ‘వెంకీ మామ’లో జంటగా నటించిన నాగచైతన్య-రాశీ ఖన్నా తాజాగా ‘థ్యాంక్యూ’లో హీరో, హీరోయిన్గా నటించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 22న విడుదల కానుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత నాని-కీర్తీ సురేష్ జోడీ రిపీట్ కానుంది. ఈ ఇద్దరూ ‘నేను లోకల్’లో తొలిసారి జంటగా నటించారు. తాజాగా ‘దసరా’లో నటిస్తున్నారు. తెలంగాణలోని గోదావరి ఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఇంకోవైపు ఇంకోసారి ఖుషీగా జోడీ కట్టారు విజయ్ దేవరకొండ-సమంత. ‘మహానటి’లో ఈ ఇద్దరూ జంటగా నటించారు. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖుషి’లో నటిస్తున్నారు. వీళ్లే కాదు.. రెండోసారి జంటగా కనిపించనున్న హీరో-హీరోయిన్లు ఇంకా ఉన్నారు. -
రామ్ చరణ్, తలపతి విజయ్ సినిమాలపై దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
-
తమన్నాకి అనిల్ రావిపూడి మధ్య గొడవ?
-
తమన్నా 'కొడ్తే' ఫుల్ సాంగ్ వచ్చేసింది
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయూ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసిన విషయం తెలిసిందే! 'అల్లుడు శీను', 'స్పీడున్నోడు', 'జాగ్వార్', 'జై లవకుశ', 'కేజీఎఫ్: చాప్టర్ వన్', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల్లో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గనిలో ఆమె డ్యాన్స్ చేసిన కొడ్తే ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'రింగారే రింగా రింగా .. రింగా రింగా' అంటూ సాగే ఈ పాటలో బాక్సింగ్ రింగ్‌లోకి దిగిన తమన్నా స్టెప్పులతో రఫ్ఫాడిచ్చింది. తమన్ మ్యాజిక్, తమన్నా ఫిజిక్ మామూలుగా లేవంటూ యూట్యూబ్‌లో కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. హారిక నారాయణ్ ఆలపించింది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మించారు. చదవండి: అభిమానంతో థియేటర్ మొత్తం బుక్ చేసిన పాకిస్తాన్ మోడల్ -
స్క్రీన్ ప్లేలో 'ప్లే'.. మరింతగా ఆడనున్న సినిమాలు
సినిమాకి ఓ కథ ఉంటుంది. ఆ కథకు ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అదే స్క్రీన్ పై ఓ ‘ప్లే’ ఉంటే... స్క్రీన్ పై ఆట ఆడేవారికి ఓ కిక్కు.. చూసేవారికి మరింత కిక్కు. అలాంటి కిక్ ఇవ్వడానికి తెలుగు స్పోర్ట్స్ మూవీస్ కొన్ని రెడీ అవుతున్నాయి. ఆ చిత్రాల విశేషాలేంటో ఓసారి చదివేద్దాం. ప్రొఫెషనల్ బాక్సర్‌గా.. ఇప్పటివరకూ లవర్ బాయ్‌గా కనిపించిన విజయ్ దేవరకొండ వెండితెరపై తన పంచ్ పవరేంటో చూపించేందుకు ‘లైగర్’లో బాక్సర్‌గా మారారు. హీరోలను తనదైన శైలిలో పవర్‌ఫుల్‌గా చూపించే పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమాలో ప్రొఫెషనల్ బాక్సర్‌లా కనిపించేందుకు విజయ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రముఖ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్‌తో ఈ సినిమాలో ఢీ కొట్టారు విజయ్. టైసన్ నటించిన తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. థాయిల్యాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేశారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇటు సినీ లవర్స్ అటు బాక్సింగ్ లవర్స్ ఈ స్క్రీన్ ప్లేని ఆగస్ట్ 25న చూడనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఏప్రిల్‌లో గని పంచ్ వేసవిలో తన పంచ్ పవర్ చూపించడానికి రెడీ అయ్యాడు గని. బాక్సర్ గని పాత్రలో వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘గని’. ఇప్పటివరకూ లవ్‌స్టోరీలు, ఫ్యామిలీ మూవీస్ చేసిన వరుణ్ ‘గని’లోని పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్. ‘గని’ పంచ్ పవర్ ఎలా ఉంటుందో చూడాలంటే ఏప్రిల్ 8 వరకూ ఆగాల్సిందే. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఇందులో సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రధారులు. ఈసారి గోల్‌పై గురి ‘మజిలీ’లో క్రికెటర్‌గా కనిపించి, మంచి కలెక్షన్ల స్కోర్ తెచ్చుకున్న నాగచైతన్య తన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’లో గోల్‌పై గురి పెట్టారు. ఈ చిత్రంలో హాకీ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నారు. ‘మనం’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఇది. రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చైతూ మూడు విభిన్న పాత్రల్లో అలరించనున్నారని టాక్. వాటిల్లో ఒకటి హాకీ ప్లేయర్ అని తెలుస్తోంది. నాగచైతన్య హాకీ ఆడుతున్న సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అయింది కూడా. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మిల్కీ బ్యూటీ.. బబ్లీ బౌన్సర్ ఓ వైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు తమన్నా. ఈ మిల్కీ బ్యూటీ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘బబ్లీ బౌన్సర్’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ ఒకటి. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో తమన్నా బౌన్సర్ పాత్రలో కనిపిస్తారు. అయితే బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందని టాక్. బౌన్సర్ నుంచి బాక్సర్‌గా మారే క్యారెక్టర్లో తమన్నా కనిపిస్తారని సమాచారం. తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది. బ్యాడ్మింటన్ నేపథ్యంలో.. సుధీర్‌బాబు డ్రీమ్ ప్రాజెక్ట్‌లలో ప్రముఖ బ్యాడ్మింటన్ చాంపియన్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఒకటి. సుధీర్–గోపీచంద్ ఇద్దరూ కలిసి బ్యాడ్మింటన్ ఆడారనే విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్ నుంచి సినిమాల్లోకి వచ్చారు సుధీర్. ఇక పుల్లెల బయోపిక్‌ని ఎప్పుడో ప్రకటించినా ఇంకా పట్టాలెక్కలేదు. అయితే సుధీర్ బ్యాడ్మింటన్ రాకెట్‌తో షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టే సమయం దగ్గర్లోనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. -
‘గని’ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చూశారా? అదరగొట్టేసిందిగా..
Tamannaah Special Song Released From Ghani Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘గని’. అల్లు బాబీ - సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మించారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీతోనే ఆమె తెలుగు తెరకి పరిచయం కాబోతోంది. కాగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట చిత్రీకరణ పూర్తి కాగా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు. చదవండి: తొలి రోజు ‘బంగార్రాజు’ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. 'రింగారే రింగా రింగా .. రింగా రింగా' అంటూ సాగే ఈ పాటకు తమన్ సంగీతం అందించాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. హారిక నారాయణ్ ఈ పాటను ఆలపించింది. కాగా ఈ పాటలో తమన్నా తన స్టెప్పులతో అదరిగొట్టింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా బాక్సింగ్ నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్గా దూపొందించిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: గుర్రంతో డ్యాన్స్ చేయించిన బాలయ్య.. వీడియో వైరల్ -
వెబ్ సిరీస్‌లలోకి అడుగు పెట్టిన హీరోయిన్లు వీళ్లే..
Heroines Who Has Entry In Web Series: కరోనా కారణంగా స్టార్స్‌కి వెబ్ వరల్డ్ మంచి హబ్ అయింది. బిగ్స్క్రీన్పై తారలు కనిపించని లోటుని వెబ్ సిరీస్‌లు కొంతవరకు తీర్చాయి. ఈ ఏడాది కొందరు స్టార్ హీరోయిన్లు తొలిసారి ఓటీటీలో సందడి చేశారు. హబ్బ్బబ్బా.. వెబ్బ్బబ్బా.. మన తారలను చూసే అవకాశం దొరికిందబ్బా అంటూ అభిమానులు ఆనందపడ్డారు. కరోనా కారణంగా థియేటర్లు మూతబడినప్పుడు ఈ వెబ్ సిరీస్‌లే ఓ ఎంటర్టైన్మెంట్. పైగా స్టార్స్ చేయడంవల్ల ఈ సిరీస్‌లు బోలెడంత క్రేజ్ కూడా తెచ్చుకోగలిగాయి. ఆ క్రేజ్‌ని స్టార్స్ బాగానే క్యాష్ చేసుకున్నారు. మరి.. వెబ్ ఉండగానే హౌస్‌ని చక్కబెట్టుకోవాలి కదా. అలా చక్కదిద్దుకున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా ! కాలేజీ అమ్మాయి, ఉద్యోగిని, భార్య.. ఇలా ఎన్నో రకాల పాత్రల్లో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పించింది సమంత. ఇటీవల ‘పుష్ప’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లోనూ మెరిసింది. సిల్వర్ స్క్రీన్ సమంతలోని పాజిటివ్ యాంగిల్‌ని చూపిస్తే డిజిటల్ వరల్డ్ నెగెటివ్ యాంగిల్‌ని బయటికి తీసింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్‌లో నెగెటివ్ షేడ్‌లో కనిపించింది సమంత. వెబ్ ఎంట్రీతోనే ఎల్టీటీఈకి పనిచేసే రాజ్యలక్ష్మీ పాత్రను ధైర్యంగా ఒప్పుకున్నారామె. అయితే ఈ పాత్ర కొంచెం వివాదంగా మారింది. కానీ ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యాక రాజ్యలక్ష్మీగా సమంత నటన అందర్నీ మెప్పించింది. సమంత పాత్రను చుట్టుముట్టిన వివాదాలు సిరీస్ విడుదలయ్యాక సమసిపోయి ప్రసంశలుగా మారాయి. ఇక మరో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘లైవ్ టెలీక్యాస్ట్’పై అప్పట్లో వెబ్ వ్యూయర్స్ ఆసక్తి కనబరిచారు. కానీ వీరి అంచనాలను ఈ సిరీస్ అందుకోలేకపోయింది. ఇందులో జెన్నీఫర్ మాథ్యూ పాత్రలో కనిపిస్తుంది కాజల్. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ ‘లైవ్ టెలీకాస్ట్’కు సరైన వ్యూయర్షిప్ లభించలేదు. ఈ వెబ్ సిరీస్ ఎగ్జిక్యూషన్లో ఏవో పొరపాట్లు చోటు చేసుకోవడం వల్లే ఇలా జరిగిందన్నట్లుగా కాజల్ ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా తెలిపింది. మరో స్టార్ తమన్నా అయితే ఈ ఏడాది రెండు వెబ్ సిరీస్‌లు ‘లెవన్త్ అవర్’, ‘నవంబరు స్టోరీస్’ చేసింది. కేవలం వెబ్ సిరీస్‌ల్లో మాత్రమే కాదు.. తెలుగు బుల్లితెరపై తొలిసారి హోస్ట్‌గా కనిపించింది తమన్నా. ఓ ప్రముఖ చానెల్లో ప్రసారం అవుతున్న ‘మాస్టర్ చెఫ్’ షోకు తమన్నా హోస్ట్‌గా కనిపించింది. అయితే అనుకోని కారణాల వల్ల తమన్నా ఈ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగు వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’తో ఈ ఏడాది వెబ్‌లోకి తొంగిచూశారు పాయల్ రాజ్‌పుత్, పూర్ణ, ఈషా రెబ్బా. ఇదే ఏడాది వచ్చిన ‘పిట్టకథలు’ ఆంథాలజీలోనూ ఈషా రెబ్బా మెరిసింది. ఇక ఇదే ‘పిట్టకథలు’లోని ఓ కథలో కనిపించిన అమలా పాల్ ఆ తర్వాత తెలుగు వెబ్ సిరీస్ ‘కుడి ఎడమైతే’తో ఆకట్టుకుంది. ఇదే ఆంథాలజీలో మెరిసిన టాప్ హీరోయిన్ శ్రుతీహాసన్ ఇటీవల ఓ హిందీ వెబ్ సిరీస్‌కు సైన్ చేసిందట. కాగా మణిరత్నం నిర్మించిన ఆంథాలజీ ‘నవరస’లో ఓ రోల్ చేసింది అంజలి. వీరితోపాటు మరికొందరు హీరోయిన్లు వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టారు. సమంత, కాజల్, తమన్నాల కన్నా కాస్త లేట్‌గా వెబ్‌లోకి ఎంటరయింది త్రిష. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘బ్రిందా’కు సైన్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇక ఆల్రెడీ ఒకేసారి రెండు వెబ్ సిరీస్‌లను పూర్తి చేసిన మరో హీరోయిన్ రాశీ ఖన్నా. అజయ్ దేవగన్ ‘రుద్ర’, షాహిద్ కపూర్ ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) వెబ్ సిరీస్‌లలో తన వంతు షూటింగ్‌ను రాశీ ఖన్నా పూర్తి చేసింది. హిందీ వెబ్ వరల్డ్‌లో హీరోయిన్ రెజీనా చేసిన తొలి సిరీస్ ‘రాకెట్ బాయ్స్’. ఇందులో మృణాళినీ సారాభాయ్‌గా కనిపిస్తుంది రెజీనా. ఇటు ‘సన్నీ’ వెబ్ సిరీస్‌లోనూ రెజీనా ఓ లీడ్ చేసింది. హీరో నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహిస్తున్న ‘మీట్ క్యూట్’ ఆంథాలజీలో అదా శర్మ, ఆకాంక్షా సింగ్, రుహానీ శర్మ నటిస్తున్నారు. ఇదీ చదవండి: మాస్ సాంగ్‌తో 'బంగార్రాజు' షూటింగ్ పూర్తి.. నాగార్జున ట్వీట్ -
'ఇండియన్ 2' హీరోయిన్ కోసం అన్వేషణ.. మిల్క్ బ్యూటీ పక్కానా ?
Indian 2 Movie Team Approach Tamanna For Doing Heroine Role: లోక నాయకుడు కమల్‌హాసన్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఇండియన్ 2' (భారతీయుడు 2). సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పటినుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. దీంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అనేక వివాదాలతో లైకా ప్రొడక్షన్స్, దర్శకుడు శంకర్ కోర్టును ఆశ్రయించారు. అనంతరం ఆ వివాదాలన్ని సద్దుమణిగాయి. ఇక షూటింగ్ ప్రారంభిద్దాం అని అనుకునే సరికి కమల్‌హాసన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవలే ఆయన కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు ఈ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ రూపంలో సమస్య వచ్చింది. 'ఇండియన్ 2' చిత్రం నుంచి చందమామ కాజల్ అగర్వాల్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రెగ్నెంట్ అని, అందుకే సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. కాజల్ స్థానాన్ని బర్తీ చేయడానికి చిత్రబృందం అన్వేషణలో పడింది. మొదటగా కాజల్ స్థానంలో త్రిషను తీసుకోడానికి ఆమెను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా పేరు తెరపైకి వచ్చింది. 'ఇండియన్ 2'లో హీరోయిన్గా, వయసు మళ్లిన పాత్రలో కనిపించాల్సి ఉంది. తమన్నా ఈ రెండు పాత్రలకు న్యాయం చేస్తారని చిత్ర బృందం భావించదట. తమ్ము బేబీకి కూడా పాత్ర నచ్చడంతో హీరోయిన్గా చేసేందుకు అంగీకరంచిందని టాక్ వినిపిస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నాయి కోలీవుడ్ వార్గాలు. ఇదీ చదవండి: ఇండియన్ 2 నుంచి కాజల్ ఔట్.. మరో స్టార్ హీరోయిన్‌కు ఛాన్స్? -
నేను చేసిన తప్పు అదేనేమో!
‘‘ఓ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను. ఈ కారణంగా నా ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి’’ అని ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు తమన్నా. ‘‘కొన్నేళ్ల క్రితం సరైన ఆహారపు అలవాట్లనే ఫాలో అయ్యాను. ఆ తర్వాత డిఫరెంట్ లుక్స్ కోసం ఎక్కువగా వర్కౌట్స్ చేశాను. దీంతో నాకు ఓ ఆరోగ్య సమస్య వచ్చింది. ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడేందుకు కేవలం సేంద్రీయ ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుంటున్నాను. వ్యాయామ నిపుణల సలహాల ప్రకారమే వర్కౌట్స్ చేస్తున్నాను. స్లిమ్‌గా, ఫిట్‌గా కనిపించేందుకు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాను. నా కెరీర్ ఆరంభంలోనే ఓ మంచి డైటీషియన్‌ను నియమించుకోకపోవడమే నేను చేసిన ఓ తప్పుగా భావిస్తున్నాను’’ అని తమన్నా చెప్పుకొచ్చారని నెటింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే... తెలుగులో తమన్నా చేస్తున్న ‘ఎఫ్ 3’, ‘గుర్తుందా..శీతాకాలం’ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. -
ఉన్నది ఉన్నట్లు చూపిస్తే కాపీ అంటారు!
‘‘రీమేక్ సినిమాకి పోలికలు పెడతారు. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే కాపీ, పేస్ట్ అని ఆరోపిస్తారు. మార్పులు చేస్తే ఒరిజినల్ ఫిల్మ్ సోల్‌ను చెడగొట్టారని విమర్శిస్తారు. రీమేక్స్‌కి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అందుకే ఇకపై రీమేక్స్ చేయాలనుకోవడం లేదు’’ అన్నారు మేర్లపాక గాంధీ. నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాస్ట్రో’. హిందీ ‘అంధా ధున్’కి రీమేక్‌గా రూపొందిన ‘మాస్ట్రో’కు మేర్లపాక గాంధీ దర్శకుడు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ చెప్పిన విశేషాలు. ►‘అంధా ధున్’లోని థ్రిల్లింగ్, డార్క్ హ్యూమర్ అంశాలు నచ్చి, రీమేక్ చేయాలనుకున్నాను. ఆ తర్వాత నితిన్, సుధాకర్ రెడ్డిగార్లు ఈ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదించారు. మన నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేశాం. ముఖ్యంగా లవ్‌స్టోరీని మార్చాం. ఒరిజినల్ సినిమాలోని కొన్ని ఫ్రేమ్స్‌ను అలాగే వాడాం. ‘మాస్ట్రో’లో నితిన్ అంధుడిగా బాగా నటించారు. హిందీలో టబు చేసిన రోల్‌కు తమన్నాను తీసుకోవాలన్నది నా ఆలోచనే. ►ఒక స్క్రిప్ట్ అనుకుని డెవలప్ చేస్తూ, కొన్ని నెలలు ట్రావెల్ చేశాక ఎగై్జటింగ్‌గా అనిపించకపోతే ఇంకో కొత్త స్క్రిప్ట్‌ను స్టార్ట్ చేస్తా. అందుకే నా సినిమాల మధ్య గ్యాప్ వస్తోంది. సినిమాలను ఫాస్ట్‌గా తీస్తాను కానీ కథలు రాయడంలో మాత్రం కాస్త లేట్. మా నాన్న (రచయిత మేర్లపాక మురళి)గారు నావెల్స్ రాస్తుంటారు.‘ఏక్ మినీ కథ’ సినిమా కథ నాదే. నాన్నగారు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ సినిమా నచ్చుతుందనుకుని చేశాను. పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. -
‘సీటీమార్’మూవీ రివ్యూ
టైటిల్ : సీటీమార్ నటీనటులు : గోపిచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని, రావు రమేష్, రెహమాన్, తరుణ్ అరోరా తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాతలు : శ్రీనివాస చిట్టూరి దర్శకుడు: సంపత్ నంది సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : సౌందర్ రాజన్ విడుదల తేది : సెప్టెంబర్ 10,2021 గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ హీరోల్లో మ్యాచోస్టార్ గోపిచంద్ ఒకరు. ఒకప్పుడు వైవిధ్యమైన చిత్రాలు చేసి ఆకట్టుకున్న గోపిచంద్.. ఇటీవల కాలంలో రొటీన్ సినిమాలను చేస్తూ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తొలిసారి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ‘సీటీమార్’అని టైటిల్ పెట్టడం, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఆ అంచనాలను గోపిచంద్ అందుకున్నాడా? ‘సీటీమార్’సినిమాకు ప్రేక్షకులు సీటీలు కొట్టారా లేదా? రివ్యూలో చూద్దాం. ‘సీటీమార్’ కథేంటంటే..? ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్తీక్ సుబ్రహ్మణ్యం(గోపిచంద్) స్పోర్ట్స్ కోటాలో బ్యాంకు ఉద్యోగం పొందుతాడు. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే తన గ్రామంలోని ఆడపిల్లలకు కబడ్డీ కోచింగ్ ఇస్తుంటాడు. వారిని ఎలాగైనా నేషనల్ పోటీల్లో గెలిపించాలని తపన పడతాడు. కప్పు కొట్టి గ్రామంలోని పాఠశాలను మూతపడకుండా చేయాలనేది అతని లక్ష్యం. అనుకున్నట్లే కార్తీక్ టీమ్ నేషనల్ పోటీలకు ఎంపికవుతుంది. కట్‌చేస్తే..గేమ్ కోసం ఢిల్లీకి వెళ్లిన కార్తీక్ టీమ్‌లోని ఆడపిల్లలు కిడ్నాప్‌నకు గురవుతారు. వారిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ క్రమంలో తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి కార్తీక్‌కి ఎలాంటి సాయం చేసింది. నేషనల్ కప్పు కొట్టి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలన్న కార్తీక్ ఆశయం నెరవేరిందా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? కబడ్డీ కోచ్‌గా గోపిచంద్ అదరగొట్టేశాడు. తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమా మొత్తాన్ని తన భూజాన వేసుకొని నడిపించాడు. ఫైట్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. ఇక తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి పాత్రలో తమన్నా మెప్పించింది. హీరోని అభిమానించే లోకల్ న్యూస్ ఛానెల్ యాంకర్‌గా దిగంగన సూర్యవంశీ చక్కగా నటించింది. విలన్ పాత్రలో తరుణ్ అరోరా జీవించేశాడు. తెరపై చాలా క్రూరంగా కనిపించాడు. హీరో అక్కగా భూమిక, పోలీసు అధికారిగా రెహమాన్ ఫర్వాలేదనిపించారు. గ్రామ ప్రెసిడెంట్‌గా రావురమేశ్ మరోసారి తనదైన పంచులతో ఆకట్టుకున్నాడు. ఆయన చేసే సీరియస్ కామెడీకి, పంచులకు థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. మిగిలిన నటీ,నటులు తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఎలా ఉందంటే.. గోపిచంద్ తొలిసారి క్రీడా నేపథ్యంలో నటించిన చిత్రం‘సీటీమార్’. అయితే దీన్ని ఓ స్పోర్ట్స్ డ్రామాగా మలిచి వదిలేకుండా, దానికి పోలీస్ కథను మిళితం చేసి సినిమాపై ఆసక్తిని పెంచేలా చేశాడు దర్శకుడు సంపత్ నంది. ఫస్టాఫ్ అంతా కామెడీ ప్రధానంగా తెరకెక్కించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా మలిచాడు. కార్తీక్ కు అతని అక్క, బావలకు ఉండే అనుబంధాన్ని చూపిస్తూనే, కబడ్డి పోటీ కోసం ఢిల్లీ వెళ్ళిన అమ్మాయిలు కిడ్నాప్ కావడం, దానికి పోలీస్ ఆఫీసర్ అయిన అతని బావ గతంతో ముడిపెట్టడం చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రథమార్థంలో ప్రగతి, అన్నపూర్ణమ్మల గ్యాంగ్.. టీవీ యాంకర్ దిగంగన పెళ్లిని చెడగొట్టే సీన్ అయితే థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా అన్నపూర్ణమ్మ పంచ్ డైలాగ్స్‌కి నవ్వని ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే సెకండాఫ్‌లో ఇలాంటి కామెడీ లేకపోవడం, కొన్నిచోట్ల పాత్రలు అతిగా ప్రవర్తించడం, యాక్షన్ సీక్వెన్స్ కూడా రోటీన్‌గా ఉండడం సినిమాకు మైనస్. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని పాత్రలకు ప్రాణం పోశాడు. సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ కర్రీ అంటే మస్త్ ఇష్టం: తమన్నా
సాక్షి, హైదరాబాద్: మిల్కీబ్యూటీ తమన్నా తళుక్కుమంది. శుక్రవారం మాదాపూర్‌లోని వెస్టిన్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. తెలుగు వంటకాలంటే తనకెంతో ఇష్టమంది. ప్రత్యేకంగా చేసే రసం, చేపల పులుసును మస్తు లాగిస్తానంది. వంటకాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయని చెప్పింది. ‘మాస్టర్ చెఫ్’ కార్యక్రమంతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడం ఆనందంగా ఉంది అని పేర్కొంది. కార్యక్రమంలో నటుడు అల్లు శిరీష్, ఇన్నోవేటివ్ ఫిలిం అకాడమీ ఫౌండర్ శ్రావణ ప్రసాద్, ప్రముఖ చెఫ్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
అలా నా ఎనర్జీ లెవల్స్ పెరిగాయి..తమన్నా
పన్నెండు గంటల గ్యాప్‌తో ఆహారం తీసుకోవడం వల్ల తనకు ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నట్లుగా హీరోయిన్ తమన్నా చెబుతున్నారు. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘నేను చాలా రకాల డైట్స్‌ను ఫాలో అయ్యాను. కానీ పెద్దగా ఫలితం లేకపోయింది. కానీ డిన్నర్‌కి, నెక్ట్స్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్య పన్నెండుగంటల గ్యాప్ ఉన్నప్పుడు నాకు మంచి ఫలితాలు కనిపించాయి. ఉదాహరణకు నేను ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు నా లాస్ట్ మీల్ చేస్తే... మర్నాడు ఉదయం 6 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేసేదాన్ని. ఇలా చేయడం వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. మునుపటి కన్నా నా ఎనర్జీ లెవల్స్ పెరిగాయి. అయితే నాకు బాగుందని అందర్నీ పన్నెండు గంటల గ్యాప్‌ని ఫాలో అవ్వమని చెప్పడంలేదు. ఎందుకంటే వారి వారి ఆరోగ్య స్థితి, వారి సామర్థ్యాలను బట్టి డైట్ టైమింగ్‌ని ఫాలో అవ్వడం ఉత్తమం’’ అని పేర్కొన్నారు. కాగా ఓ ప్రముఖ చానెల్లో తమన్నా చేస్తున్న కుకింగ్ షో ‘మాస్టర్ చెఫ్’ త్వరలో ప్రసారం కానుంది. సినిమాల విషయానికి వస్తే... తమన్నా నటించిన ‘మ్యాస్ట్రో’, ‘సీటీమార్’, ‘గుర్తుందా..శీతాకాలం’ రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. -
Tamannaah: మీసంతో తమన్నా, వీడియో వైరల్
మిల్కీ బ్యూటీ తమన్నాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. షూటింగ్ సెట్లో సరదాగా ఖాళీ సమయంలో తీసుకున్న ఓ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఈ వీడియోలో మూతికి మీసం పెట్టుకుని తమన్నా పాట పాడుతున్న వీడియో నెట్టింటా నవ్వులు పూయిస్తోంది. దీనికి ‘టాకింగ్ మాణిక్కం, వాకింగ్ మాణిక్కం, సింగింగ్ మాణిక్కం’ అంటూ సరదాగా షేర్ చేసింది ఆమె. ఇది చూసిన ఆమె ఫాలోవర్స్, అభిమానులు తమన్నాకు ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ‘వావ్ తమన్నా ఎంత ముద్దుగా ఉందో’, ‘మీసంతో అచ్చం మిక్కిమౌజ్లా ఉంది’, అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం తమన్నా అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’తో పాటు ‘సత్యదేవ్’,‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలతో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) చదవండి: తమన్నా ఇల్లు చూశారా..?, దాని కోసం ఎన్ని కోట్లు వెచ్చించిందో! విషాదం: ‘వేదం’ నటుడు నాగయ్య మృతి -
తెలంగాణ యాసలో తమ్మన్నా డబ్బింగ్!
తమన్నా తెలంగాణ యాసలో మాట్లాడారు. ఎలా మాట్లాడారో వినాలంటే ఏప్రిల్ 2 వరకూ ఆగాల్సిందే. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకానుంది. ఈ సినిమాలో తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసిన తమన్నా మాట్లాడుతూ –‘‘నన్ను నమ్మి ‘సీటీమార్’లో జ్వాలారెడ్డి పాత్రకు అవకాశం ఇచ్చినందుకు సంపత్‌కి థ్యాంక్స్. ఇందులో నా పాత్ర తెలంగాణ యాస మాట్లాడుతుంది’’ అన్నారు. డబ్బింగ్ పూర్తయిందోచ్ అంటూ ఫుల్ జోష్‌గా ఉన్న ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. -
ఎఫ్3 రిలీజ్ కూడా వచ్చేసింది.. ఎప్పుడంటే
విక్టరీ వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఎఫ్3’. గతేడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఎఫ్2’కి ఇది సీక్వెల్‌గా రూపొందుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ‘ఎఫ్2’ లో భార్యల మనస్తత్వం వల్ల కుటుంబంలో గొడవలు జరిగితే, ‘ఎఫ్ 3’లో డబ్బు వల్ల కుటుంబాల్లో ఎలాంటి మార్పులు జరిగాయనేది చూపించబోతున్నారు. కాన్సెప్ట్ పోస్టర్లోనూ ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా చెప్పేశాడు దర్శకుడు. తాజాగా ఎఫ్ 3 విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. చదవండి: వరుణ్‌తేజ్ రింగులోకి దిగేది అప్పుడే! గత రెండు మూడు రోజుల నుంచి ముఖ్యంగా ఈరోజు(గురువారం) టాలీవుడ్లో బోలేడు సినిమాలు వరుస పెట్టి రిలీజ్ డేట్లను అనౌన్స్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎఫ్3 సినిమా యూనిట్ కూడా తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ సినిమా ఆగష్టు 27న థియేటర్లలో నవ్వులు పూయించనుందని పేర్కొంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. వీలైనంత త్వరలో సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. కాగా ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి రామ్ చరణతో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: అమెజాన్ చేతికి 'ఎఫ్ 3' డిజిటల్ రైట్స్ -
నవంబర్ కథేంటి?
‘నవంబర్ స్టోరీ’ సిరీస్‌తో వెబ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు తమన్నా. ఈ సిరీస్ చిత్రీకరణ ఇటీవలే ముగిసింది. తండ్రీ–కూతురు చుట్టూ తిరిగే ఎమోషనల్ థ్రిల్లర్ ఇది. చేయని తప్పుకు శిక్ష అనుభవించే తండ్రి, అతన్ని కాపాడుకునే కూతురిగా తమన్నా కనిపించనున్నారు. నూతన దర్శకుడు రామ్ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ‘‘నేను చేసిన ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్స్‌లో ‘నవంబర్ స్టోరీ’ ఒకటి. మీ అందరికీ ఈ సిరీస్‌ను త్వరగా చూపించాలని ఉంది. ఇలాంటి అద్భుతమైన కథలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది’’ అని ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తి చేసిన సందర్భంగా తమన్నా అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది. -
నవ్వులకు క్లాప్
వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఎఫ్3’. గతేడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఎఫ్2’కి ఇది సీక్వెల్. గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ‘ఎఫ్3’ని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ఫైనాన్షియర్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ‘దిల్’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా ‘ఎఫ్2’ చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. అన్నీ కుదిరితే ‘ఎఫ్3’ చిత్రాన్ని రూపొందిస్తామని అప్పుడే చెప్పాం. అప్పటినుండి దర్శకుడు అనిల్ ఈ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. డిసెంబర్ 23న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం’’ అన్నారు. అనిల్ మాట్లాడుతూ– ‘‘ఎఫ్2’కి మరింత వినోదాన్ని జోడించి ‘ఎఫ్3’ని రూపొందిస్తున్నాం. అద్భుతమైన కథ కుదిరింది. మా ఆర్టిస్టులు మరిన్ని నవ్వుల్లో ప్రేక్షకులను ముంచెత్తుతారు. రాజుగారి బ్యానర్లో మరోసారి వర్క్ చేయటం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహనిర్మాత: హర్షిత్ రెడ్డి. -
డోస్ డబుల్ అట!
‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ (ఎఫ్ 2) అంటూ వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్‌లు పంచిన నవ్వులు అన్నీ ఇన్నీ కావు. దర్శకుడు అనిల్ రావిపూడి సృష్టించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ‘దిల్’ రాజు నిర్మించారు. దీనికి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ కథను సిద్ధం చేశారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘ఎఫ్2’లో కనిపించిన స్టార్సే ఈ సీక్వెల్లోనూ కనిపిస్తారు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే డేట్ ఫిక్సయిందని సమాచారం. డిసెంబర్ 14 నుంచి ‘ఎఫ్ 3’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిసింది. ఈ సీక్వెల్లో ఫన్, ఫ్రస్ట్రేషన్ రెండింతలు ఉంటుందట. కామెడీ డోస్ డబుల్ ఉంటుందని టాక్. వచ్చే ఏడాది సమ్మర్‌కి థియేటర్స్‌లోకి ‘ఎఫ్ 3’ను తీసుకురావాలన్నది చిత్రబృందం ప్లాన్. -
మంచి నటి అనిపించుకుంటాను
‘‘అల్లు అరవింద్‌గారి సినిమాల వల్ల నేను యాక్టర్ నుండి స్టార్ అయ్యాను. ఇప్పుడు చేస్తున్న ‘లెవెన్త్ అవర్’ సిరీస్ వల్ల ఓ స్టార్ నుండి మంచి నటిగా పేరు తెచ్చుకుంటానని భావిస్తున్నాను. ఓ నటిగా తెలుగు సినిమాలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. తెలుగు కంటెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది’’ అన్నారు హీరోయిన్ తమన్నా. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో ‘లెవెన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది. త్వరలో ‘ఆహా’లో ప్రసారం కానున్న ఈ సిరీస్ టైటిల్, పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘కొన్ని గంటల్లో నడిచే కథ ‘లెవెన్త్ అవర్’. ప్రవీణ్ సత్తారు కథ నచ్చితేనే చేస్తాడు. ఈ సబ్జెక్ట్ బావుందని అన్నారు. ప్రదీప్‌గారు నిర్మాతే కాదు.. అద్భుతమైన రైటర్ కూడా. అందుకనే మా కోసం ఆయన్ని మరో వెబ్ సిరీస్ చేయమని అడిగాను’’ అన్నారు. ‘‘8 అవర్స్’ అనే బుక్ నుండి హక్కులు కొని ‘లెవెన్త్ అవర్’ కథ తయారు చేశాను’’ అన్నారు రచయిత, నిర్మాత ప్రదీప్. ‘‘ఓ సిరీస్‌కు కావాల్సిన అన్ని అంశాలు మా ‘లెవన్త్ అవర్’లో ఉన్నాయి. ఒక రాత్రిలో జరిగే కథ’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. -
నలభై టు నాలుగు!
తమన్నా ఫిట్నెస్ మీద ఎంత దృష్టిపెడుతుంటారో తెలిసిందే. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తూ ఫిట్‌గా ఉంటారు. షూటింగ్స్‌తో సంబంధం లేకుండా ఆమె డైలీ రొటీన్లో వర్కౌట్స్ ఓ భాగం. లాక్‌డౌన్‌లోనూ వ్యాయామం చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ని కూడా ఫిట్నెస్ మీద దృష్టిపెట్టమంటూ పోస్ట్స్ చేస్తుండేవారు. అయితే ఇటీవల తమన్నా కోవిడ్ బారినపడ్డ సంగతి తెలిసిందే. దాంతో వర్కౌట్స్‌కి చిన్న బ్రేక్ ఇచ్చారామె. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వర్కౌట్స్ మొదలెట్టారు. అయితే ఆమె గ్రాఫ్ నలభై నుంచి నాలుగుకి పడిపోయిందట. ‘‘కోవిడ్‌కి ముందు ఈజీగా 40 పుష్ అప్స్ చేసేదాన్ని. కోవిడ్ తర్వాత జస్ట్ నాలుగంటే నాలుగు చేయడం కూడా కష్టంగా అనిపించింది. కానీ మెల్లిగా మళ్లీ పికప్ అయ్యాను. కోవిడ్ వల్ల నీరసించిపోతాం. అయినా మన స్టామినాని మళ్లీ తిరిగి తెచ్చుకోవడం ముఖ్యం’’ అన్నారు తమన్నా. -
మాతృభాష నేర్చుకుంటున్నా!
షూటింగ్స్ లేని ఈ లాక్డౌన్ వేళ తన మాతృభాష సింధీ నేర్చుకుంటున్నానని చెబుతున్నారు హీరోయిన్ తమన్నా. ఈ లాక్డౌన్ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే– ‘‘ఎక్కువగా దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నందువల్ల తెలుగు, తమిⶠభాషలను బాగానే మాట్లాడగలుగుతున్నాను. హిందీ కూడా వచ్చు. కొన్ని కారణాల వల్ల నా మాతృభాష సింధీపై ఇప్పటివరకు సరైన పట్టు సాధించలేకపోయాను. ఈ లాక్డౌన్ సమయంలో సింధీ భాషను నేర్చుకుంటున్నాను. మా అమ్మగారితో ప్రస్తుతం ఆ భాషలోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. సాంప్రదాయ వంటకాలను నేర్చుకుంటున్నాను. అలాగే మా అమ్మగారి సాయంతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన పెంచుకుంటున్నాను. వృత్తిపరంగా బిజీగా ఉండటం వల్ల నేనెక్కువగా ఇంట్లో ఉండలేదు. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉండటం నాకు కాస్త కొత్తగా ఉంది. మా తమ్ముడు (ఆనంద్) న్యూయార్క్‌లో ఉండిపోయాడు. తను కూడా మాతో ఉండి ఉంటే మరింత బాగుండేదనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు తమన్నా. -
గోపీచంద్ సీటీమార్
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘సీటీమార్’ అనే టైటిల్‌ను ఖరారు చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రంలో కథానాయికలుగా తమన్నా, దిగంగనా సూర్యవంశీ నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా నిరి్మస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతోందని తెలిసింది. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆంధ్ర మహిళల జట్టు కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ మహిళల జట్టు కోచ్‌గా తమన్నా నటిస్తున్నారని సమాచారం. రాజమండ్రి షెడ్యూల్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను చిత్రబృందం ఢిల్లీలో ప్లాన్ చేసిందట. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
వేసవి బరిలో.. .
‘గౌతమ్‌నంద’ చిత్రం తర్వాత గోపీచంద్– సంపత్ నంది కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమన్నా, దిగంగనా సూర్యవంశీ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ‘‘హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది. తొలి షెడ్యూల్లో భాగంగా అజీజ్ నగర్లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభిస్తాం. వేసవికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. భూమిక, రావురమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ, సమర్పణ: పవన్‌కుమార్.