
జై లవ కుశలో తమన్నా...?
ఎన్టీఆర్, బాబి కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ జై లవ కుశ.
ఎన్టీఆర్, బాబి కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ జై లవ కుశ. ఈ సినిమాతో ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండటంతో సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అంతేకాదు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ కూడా సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్.
ఎన్టీఆర్ గత చిత్రం జనతా గ్యారేజ్ లో కాజల్ చేసిన స్పెషల్ సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో జై లవ కుశలో కూడా ఓ స్టార్ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ చేయించాలని ఫిక్స్ అయ్యారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సాంగ్ కోసం ఎన్టీఆర్ ఎనర్జీని మ్యాచ్ చేయగలిగే తమన్నాను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో అలరించిన మిల్కీ బ్యూటి.. మరోసారి ఆకట్టుకుంటుదేమో చూడాలి.