Jai Lava Kusa
-
Balakrishna Vs Jr NTR: రక్తసంబంధాన్ని కూడా లెక్కచేయని బాలకృష్ణ.. ఎందుకీ చర్య..?
సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా మరోసారి జూ. ఎన్టీఆర్, నందమూరి ఫ్యామిలీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. నేడు తెల్లవారుజామున జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తారక్ బ్రదర్స్ అక్కడి నుంచి వెళ్లిపోయిన కొన్ని గంటల తర్వాత బాలకృష్ణ కూడా తన తండ్రికి నివాళి అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ తారక్, కల్యాణ్ రామ్‌లు ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని బాలకృష్ణ హుకుం జారీ చేశాడు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నేతలు వాటిని తొలగించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నందమూరి వంశంలో ఒంటరిగా మిగిలిన తారక్ ఈ క్రమంలో తారక్‌ను నందమూరి ఫ్యామిలీ ఒంటరిని చేసిందని సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబంలోని ఇతర సోదరులు, అక్కాచెల్లెళ్ల పిల్లలకు సీనియర్ ఎన్టీఆర్‌తో ఎలాంటి రక్తసంబంధం ఉందో అలాంటి వారసత్వపు హక్కు కూడా జూనియర్ ఎన్టీఆర్‌కు ఉంది. కానీ తన బావ చంద్రబాబు రాజకీయం కోసం, తన అల్లుడు లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం నెత్తుటి సంబంధాన్ని కూడా తెంచేందుకు బాలకృష్ణ అడుగులు వేశాడు. తారక్‌ను ఎప్పటికైనా ఒంటరిగానే మిగల్చాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలో బాలకృష్ణ పలుమార్లు భాగం పంచుకుంటూనే ఉన్నాడు. నాడు ఎన్టీఆర్ ఘాట్ పరిస్థితి ఎలా ఉండేది ..? విడ్డూరుం కాకపోతే.. ఎలాంటి విలువలు లేని పవన్ కల్యాణ్ కావాలి గానీ సొంత కుటుంబసభ్యుడు అయిన తారక్ మాత్రం పనికిరాకుండా పోయాడా..? తాతకు సిసలైన మనమడిగా మిగిలింది తారక్ మాత్రమే కదా..? అంటూ బాలయ్య తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. సుమారు 6 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఘాట్‌లో కనీసం పూలు అలంకరించడానికి కూడా ఎవరూ లేకపోతే, జూనియర్ ఎన్టీఆర్ ఆ బాధ్యత తీసుకొని తన వాళ్లతో జయంతికి, వర్ధంతికి అక్కడ అలంకరణ చేయిస్తున్నారు. అలాంటిది ఈరోజు ఆయన ఫ్లెక్సీలే అడ్డు అయిపోయాయని పీకి పారేస్తున్నారంటే ఎంతటి దుర్మార్గపు చర్య. తన తాత సమాధి వద్ద తారక్ ఫ్లెక్సీలు ఉంటే బాలయ్యకు వచ్చిన నష్టమేమిటి? జీఎచ్ఎంసీ సిబ్బంది మాదిరి ప్లెక్సీలు తొలగించమని ఆదేశించడం ఏంటి..? ఏ హక్కుతో వాటిని తొలగించారు..? అసలు ఎన్టీయార్ ఘాట్ వద్దకు ఎవరు రావాలి..? ఎవరు రాకూడదు..? అని చెప్పడానికి బాలకృష్ణ ఎవరు..? అక్కడ ఎవరి బ్యానర్లు ఉండాలని చెప్పడానికి బాలయ్యకు హక్కు ఎక్కడిది..? నందమూరి తారకరామారావు అనే వ్యక్తి అందరివాడు. ఆయన ఎవరి సొత్తు కాదు. ఎంటో బాలయ్య మాదిరే ఆయన మాటలు కూడా ఏ మాత్రం ఎవరికీ అర్థం కావు. ఏదేమైనా నందమూరి వంశంలో తారక్‌ను ఒంటరిని చేయాలనే చంద్రబాబు కుట్రకు విజయవంతంగా అడుగులు పడుతున్నాయి. అందుకే ఇంత జరిగినా తన రక్త సంబంధీకులు ఎవరూ నోరెత్తి కూడా తిరిగి మాట్లాడటం లేదు. కానీ తారక్ ఫ్యాన్స్ మాత్రం మేమున్నాం అంటూ #WeStandWithNTR అనే హ్యాష్ ట్యాగ్‌తో పాటు #EndOfTDP అంటూ వారు వైరల్ చేస్తున్నారు. జై లవకుశ చిత్రంలోని డైలాగ్స్ షేర్ చేస్తున్న ఫ్యాన్స్ జై లవకుశ చిత్రం నుంచి తారక్ చెప్పిన డైలాగ్స్‌ను కూడా వారు వైరల్ చేస్తున్నారు. అందులో 'మనం అనేది అబద్ధం.. నేను అనేది నిజం. ప్రేమను పగగా మార్చింది మీరే.. మీలో ఒక్కడిగా గుర్తిస్తారని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను' అనే డైలాగ్స్ గుర్తు చేస్తూనే.. గతంలో ఎన్నికల కోసం తారక్‌ను ఎడాపెడా వాడేసుకున్నారని చంద్రబాబు అండ్ తెలుగుదేశం బ్యాచ్‌పై తారక్ ఫ్యాన్స్ విరుచుకుపడపుతున్నారు. తారక్‌లో ఫైర్‌ను గుర్తించిన చంద్రబాబు తన కుమారుడికి ఎక్కడ అడ్డు వస్తాడో అని పక్కకు తప్పించే ఎత్తుగడ ఎప్పుడో వేశాడంటూ వారు గుర్తుచేస్తున్నారు. ఏ మాత్రం రాజకీయ జ్ఞానం లేని లోకేష్‌కు తారక్ ఎక్కడ పోటీ అవుతాడో అని చంద్రబాబులో భయం పట్టుకుంది. చంద్రబాబు కన్నింగ్ గేమ్‌ను అర్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ పార్టీని వదిలేశాడు. చివరకు తన సోదరి అయిన నందమూరి సుహాసినికి టీడీపీ టికెట్టు ఇచ్చి ఎన్నికల బరిలో నిల్చోబెట్టినా కూడా తను ప్రచారం చేయలేదు. అలా తన తాత పెట్టిన పార్టీకి తారక్ దూరం అయ్యాడు. లేని వారసత్వం కోసం లోకేష్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు పక్కా ప్లాన్‌తో రక్తసంబంధంలో చంద్రబాబు చిచ్చిపెట్టాడు. అందులో భాగంగానే తారక్ నందమూరి వంశంలో నేడు ఒంటరిగా మిగిలాడని చెప్పవచ్చు. Politics aside, extending our Support to @tarak9999 anna and his fans in this hour of need. 🙌🏻 Stay Strong! Shame on #Balakrishna And Yellow Media😒#WeStandWithNTR #NTR #JrNTR pic.twitter.com/lbTSOFY7vr — smily.chinnu❤️❤️ (@Ishwarya225) January 18, 2024 This is how TDP works CBN didn't support Jr.NTR in Politics. But they need his support in this phase. If they doesn't get any response they start abusing.#WeStandwithNTR in this struggle phase where TDP Leaders and Social Media wantedly targeting Stay Strong @tarak9999 Garu pic.twitter.com/TC0XD8pcSe — Møhámmêd Âfzál محمد افضل (@ShaikAfzal_YSJ) January 18, 2024 We Stand With You @tarak9999 Anna 🥹❤️#WeStandWithNTR #JrNTR #BalaKrishna #EndOfTDP pic.twitter.com/rroN9hSqjI — UrstrulyNani ™ (@Urstrulynanii_) January 18, 2024 -
రావణుడిపై జూ.ఎన్టీఆర్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ నటి కృతి సనన్ సీతగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. జూన్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో సినీ విమర్శలకు ఆగ్రహానికి గురైంది. ఈ చిత్రంలోని కొన్ని పాత్రలు, డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సినిమాలో రావణుడిని చూపించిన విధానంపై ఇప్పటికే పలువురు మండిపడ్డారు. రావణుడి విచిత్రమైన హెయిర్ స్టైయిల్‌తో పాటు రెండు వరుసలలో పది తలకాయలను చూపించడం.. ఇలా పలు విషయాలు భారీ వివాదాలకు దారి తీశాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు ఓం రౌత్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. (ఇదీ చదవండి: కేపీ చౌదరితో సురేఖా వాణి కూతురి ఫోటో వైరల్) అయితే జూ.ఎన్టీఆర్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జై లవకుశ సినిమా విడుదల సందర్భంగా జూ. ఎన్టీఆర్ రావణుడి పాత్ర వేసినప్పుడు రామాయణంతో పాటు రావణుడి గురించి ఎక్కడ సమాచారం సేకరించాడో తెలిపాడు. పౌరాణికానికి సంబంధించిని సినిమాలు చేస్తున్నప్పుడు అందులోని పాత్రల సమాచారం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ అందులోని విషయాన్ని పాడు చేయకుంటే చాలని ఎన్టీఆర్ ఇలా తెలిపాడు. 'జై లవకుశ' సినిమా ప్రారంభానికి ముందే రావణుడి గురించి తెలుసుకునేందుకు.. ఆనంద్ నీలకంఠ రాసిన 'అసుర' అనే పుస్తకాన్ని చదివాను. రావణుడు 18 లోకాలకు రాజు మాత్రమే కాదు అసురుల చక్రవర్తి కూడా.. అన్ని లోకాలకు అధిపతి అయ్యాడంటే అతడికి ఎంత నేర్పు ఉండాలి. అలాంటి వ్యక్తి కళ్లు ఎలా ఉండాలి. ఇవన్నీ రావణుడిలో కనిపించాలి. అందుకే రాముడు కూడా యుద్ధం సమయంలో రావణాసురుడు చూడగానే ఇంత గొప్ప వ్యక్తివా నువ్వు అని పద్యాన్ని అందుకున్నాడు. అలా రావణడు ఎక్కడైనా నిలబడితే శత్రువు సైతం అతడిని పొగిడేలా ఉండాలి. అలా ఆ పాత్ర చేసేటప్పుడు నేను కూడా ఎలా మాట్లాడాలి? అన్న విషయాలను తెలుసుకున్నాను.' అని చెబుతూనే ఆ పుస్తకం తనకు జై లవకుశ సినిమా కోసం సహాయపడిందని తెలిపాడు. (ఇదీ చదవండి: వ్యూహం టీజర్..ఒక్క డైలాగ్‌తో అంచనాలు పెంచేసిందిగా!) ఒక సినిమాలో కేవలం రావణుడి పాత్ర చేస్తున్న ఎన్టీఅరే తన క్యారెక్టర్ కోసం అంత పరిశోధన చేస్తే.. ఆదిపురుష్‌లో రావణుడి పాత్ర కోసం మూవీ మేకర్స్ ఎంతలా కసరత్తు చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు జైలవకుశ సమయంలో ఎన్టీఆర్ చేసిన కసరత్తుపై తన అభిమానులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా ద్వారా మెచ్చుకుంటున్నారు. @tarak9999 did research like this for a small character then how much research should be done to make Ravan's Character 🤷♂️#ManOfMassesNTR #Ntr30 #Devara #Ravana pic.twitter.com/9leIW2FQf3 — Narasimha (@NTRNarasimha_) June 19, 2023 -
అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు అన్న!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన సూపర్ హిట్ సినిమా జై లవ కుశ. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన రావణ్ మహరాజ్ పాత్రకు ఆ పాత్రలో ఎన్టీఆర్ పలికించిన హావభావాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే పేరుతో ఎన్టీఆర్ అన్న నందమూరి కల్యాణ్ రామ్ సినిమా చేయనున్నాడు. మల్లిడి వేణు దర్శకుడిగా కల్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ట్స్ బ్యానర్‌పై ఈసినిమాను తెరకెక్కించనున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్‌ను పరిశీలించినా ఫైనల్‌గా రావణ అయితే బాగుటుందని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ టైటిల్‌తో మోహన్‌బాబు ప్రధాన పాత్రలో 100 కోట్లతో పౌరాణిక చిత్రాన్ని ప్లాన్ చేశారు. మరి ఇప్పుడు అదే టైటిల్‌తో కల్యాణ్ రామ్ సినిమా అంటూ వార్తలు వస్తుండటంతో మంచు ఫ్యామిలీ స్పందన ఎలా ఉంటుందో అన్న చర్చ జరుగుతోంది. 118 హిట్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన కల్యాణ్ రామ్ ఆ జోష్‌ను కంటిన్యూ చేసేందుకు కష్టపడుతున్నాడు. మరి రావణ మరో హిట్ ఇస్తాడేమో చూడాలి. -
‘రావణసూరన్’గా ఎన్టీఆర్
తెలుగు హీరోలు ప్రస్తుతం తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ తెలుగులోనే కాకుండా మలయాళంలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. మిగతా టాలీవుడ్ హీరోలు కూడా తమ చిత్రాలను ఇతర భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం అదే కోవలో చేరారు. ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం మాలీవుడ్ లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గతేడాది బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జై లవ కుశ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ ఆర్ట్ ప్రొడక్షన్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభియానంతో ఆకట్టుకున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని మలయాళంలో రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ నటించిన మూడు పాత్రల్లోకెల్లా రావణ పాత్రకు విశేషమైన స్పందన రావడంతో నిర్మాత బి ఉన్ని కృష్ణన్ ఆ పేరు వచ్చేలాగా ‘రావణసూరన్’గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
ఎన్టీఆర్ సినిమాలో సీనియర్ హీరోయిన్
జై లవ కుశ సినిమాతో మంచి విజయం సాధించిన ఎన్టీఆర్ కొంత విరామం తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తొలి షెడ్యూల్లో యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించిన త్రివిక్రమ్, రెండో షెడ్యూల్లో ఫ్యామిలీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలక పాత్రకు సీనియర్‌ను హీరోయిన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన సీనియర్ హీరోయిన్లకు మంచి గుర్తింపు వచ్చింది. అత్తారింటికి దారేదిలో నదియా, సన్నాఫ్ సత్యమూర్తిలో స్నేహ, అజ్ఞాతవాసిలో ఖుష్బూలు కీలక పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం మరో సీనియర్ హీరోయిన్ రంభను తీసుకున్నాడట త్రివిక్రమ్. ఎన్టీఆర్ సరసన నాగ, యమదొంగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన రంభ ఇప్పుడు తన సినిమాలో కీలక పాత్రలో నటించనుంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. త్వరలోనే రంభ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో పాల్గొననుందన్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, జగపతిబాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
ఫ్యాక్షన్ జానర్లో ఎన్టీఆర్..!
జై లవ కుశ సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్ జానర్ లో రూపొందుతోందట. సీనియర్ నటులు నాగబాబు, జగపతి బాబు ప్రత్యర్థులైన ఫ్యాక్షన్ లీడర్లుగా కనిపిస్తారని తెలుస్తోంది. అజ్ఞాతవాసి లాంటి భారీ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ సరసన తొలిసారిగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ట్రయిన్ అయిన ఎన్టీఆర్ కొత్త లుక్‌లో డిఫరెంట్ మేకోవర్‌లో దర్శనమిస్తున్నాడు. -
కొత్త లుక్ కోసం తారక్...
జై లవ కుశ సినిమాతో ఆకట్టుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించేందుకు చాలా రోజులుగా జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కసరత్తులకు సంబంధించిన వీడియోలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన ఫొటో సామాజిక్ మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. కొత్త సినిమాలో విభిన్నంగా కనిపించేందుకు ఎన్టీఆర్ ఎంత కష్టపడుతున్నాడు ఈ ఫొటోలో తెలుస్తుంది. హాలీవుడ్ ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్న ఫొటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ లుక్ కోసం ఎంతో నొప్పిను బరిస్తూ ఎన్టీఆర్ కష్టపడుతున్నాడు. ఈ ఫొటో చూసిన జూనియర్ అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే, అను ఇమ్మాన్యూల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. -
నిర్మాతగా మారుతున్న యువ దర్శకుడు
పవర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు బాబీ(కె.యస్.రవీంద్ర). దర్శకుడిగా మూడు సినిమాలు మాత్రమే చేసిన ఈ యంగ్ టెక్నీషియన్ త్వరలో నిర్మాతగా మారనున్నాడు. రెండో సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్‌ను డైరెక్టర్ చేసి ఛాన్స్ కొట్టేసిన ఈ యువ దర్శకుడు సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచాడు. సర్థార్ ఫెయిల్యూర్ తో గ్యాప్ తీసుకున్న బాబీ, తరువాత ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ సినిమాను రూపొందించి మరోసారి సత్తా చాటాడు. ప్రస్తుతం వెంకటేష్, నాగచైతన్యల కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమాను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్న బాబీ, నిర్మాతగా తెరకెక్కించే సినిమా పనులు కూడా చక్కబెట్టేస్తున్నాడు. నిర్మాతగా తొలి సినిమాకు అరుణ్ పవార్‌ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు బాబీ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న ఓ యువ కథానాయకుడిని సంప్రదిస్తున్నారట. -
జెంటిల్మన్ బ్యూటీతో రోహిత్
జెంటిల్మన్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నటి నివేదా థామస్. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ సినిమాల ఎంపికలో చాలా సెలక్టివ్‌గా ఉంటుంది. జెంటిల్మన్ తరువాత నిన్నుకోరి, జై లవ కుశ సినిమాల్లో నటించింది ఈ భామ. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసిన తరువాత మరో సినిమా అంగీకరించేందుకు చాలా సమయం తీసుకుంది. తాజాగా ఈ భామ మరో తెలుగు సినిమాకు ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటున్న యువ నటుడు నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతన్న ‘శబ్దం’ సినిమాలో నివేదాను హీరోయిన్ గా ఫైనల్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నారా రోహిత్ మూగవాడిగా నటిస్తున్నాడు. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. -
ఎన్టీఆర్ న్యూ లుక్
-
న్యూ లుక్‌లో ఎన్టీఆర్
జై లవ కుశ సినిమాతో ఘనవిజయం సాధించిన ఎన్టీఆర్, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ న్యూ లుక్ లో కనిపించబోతున్నాడు. అందుకు తగ్గట్టుగా స్లిమ్ లుక్ లోకి మారిపోయేందుకు హాలీవుడ్ ఫిజికల్ ట్రైనర్ పర్యవేక్షణలో కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో కన్నా ఫిట్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. తాజాగా ఎన్టీఆర్ న్యూ లుక్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ స్లిమ్‌గా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శ్రద్ధా కపూర్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటించే అవకాశం ఉంది. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధకృష్ణ నిర్మిస్తున్నారు. -
ఎన్టీఆర్ ‘ఆన్ సైలెంట్ మోడ్’
జై లవ కుశ సినిమాతో ఘనవిజయం అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో దర్శనమివ్వనున్నాడట. అందుకోసం విదేశీ ట్రైనర్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించనున్న ఈ సినిమాకు అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అంతేకాదు ట్యాగ్ లైన్‌గా ‘ఆన్ సైలెంట్ మోడ్’ నే క్యాప్షన్‌ను ఇప్పటికే ఫిక్స్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 2019 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
చైతూతో ఎన్టీఆర్ డైరెక్టర్..?
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జై లవ కుశ సినిమాతో ఆకట్టుకున్న యువ దర్శకుడు బాబీ.. తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగచైతన్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే నాగచైతన్యకు కథ వినిపించిన బాబీ, ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో ‘శైలాజా రెడ్డి అల్లుడు’ సినిమాల్లో నటిస్తున్నాడు నాగచైతన్య ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ‘నిన్ను కోరి’ ఫేం శివా నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయితేగాని బాబీ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశం లేదు. మరి బాబీ అప్పటి వరకు వెయిట్ చేస్తాడో లేక ఈ లోపు మరో సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి. -
‘నేను త్రివిక్రమ్‌కు కథ ఇవ్వలేదు’
జై లవ కుశ సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. అయితే ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి కొద్ది రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రముఖ రచయిత మధుబాబు నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై రచయిత మధుబాబు క్లారిటీ ఇచ్చారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మధు బాబు స్పందించారు. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమాకు తాను కథ అందిస్తున్నట్టుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అసలు త్రివిక్రమ్ తనను కథ విషయంలో సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే అవకాశం వస్తే సినిమాలకు కథ అందించేందుకు సిద్ధమని మధుబాబు తెలిపారు. -
ప్రయోగాత్మక చిత్రంలో నందమూరి హీరో
ప్రస్తుతం పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఎమ్మెల్యే సినిమాతో పాటు రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న నా నువ్వే సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న ఈ రెండు సినిమాలను సమ్మర్ సీజన్లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తరువాత కళ్యాణ్ రామ్ ఓ ప్రయోగాత్మక చిత్రం చేయనున్నాడు. ఇప్పటి వరకు యాక్షన్, రొమాంటిక్ స్టోరీలు మాత్రమే చేసిన కళ్యాణ్ రామ్ త్వరలో థ్రిల్లర్ సినిమా చేసేందుకు అంగీకరించాడు. విజయ్ మద్దలను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో సినిమా చేసేందుకు కళ్యాణ్ రామ్ అంగీకరించాడట. దర్శకుడు కథ చెప్పిన విదానంతో పాటు కథలోని మలుపుకు కూడా నచ్చటంతో వెంటనే ఈ నందమూరి హీరో ఒకే చెప్పాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తయిన వెంటనే కొత్త సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు కళ్యాన్ రామ్. జై లవకుశ సినిమాతో నిర్మాతగా ఘనవిజయం సాధించిన ఈ నందమూరి హీరో కథ ఎంపికలో కొత్తదనం చూపిస్తున్నాడు. -
కళ్యాణ్ రామ్ ఎన్నికల ప్రచారం
జై లవ కుశ సినిమాతో నిర్మాతగా సూపర్ హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ త్వరలో హీరోగాను సక్సెస్ సాధించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పొలిటికల్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈసినిమాకు సంబధించిన ఆసక్తికరమైన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో కళ్యాణ్ రామ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టుగా కనిపించనున్నాడు. అందుకు సంబందించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పోస్టర్లో రాజకీయనాయకుడిలా అభివాదం చేస్తున్న కళ్యాణ్ రామ్ పక్కన ‘వీరభద్రాపురం నియోజకవర్గ ప్రజలు ట్యాప్ గుర్తుకే ఓట్లు వేసి అత్యధిక మెజారిటితో గెలిపించ ప్రార్థన మీ కళ్యాణ్’ అని ఉంది. అంటే సినిమా టైటిల్‌ను జెస్టిపై చేస్తూ ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యేగా కనిపిస్తాడని భావిస్తున్నారు ఫ్యాన్స్. -
ఎన్టీఆర్ ఆ ఇద్దరి పేర్లు ఎప్పుడు చెప్తాడో..!
జై లవ కుశ సినిమాతో మరోసారి ఘన విజయాన్ని అందుకున్నయంగ్ టైగర్ ఎన్టీఆర్, అభిమానులకు ఇచ్చిన ఒక మాటను మాత్రం మరిచిపోయాడు. జై లవ కుశ రిలీజ్‌కు ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఓ మాట ఇచ్చాడు. తాను జై లవ కుశ సినిమా అంగీకరించడానికి ఇద్దరు వ్యక్తులు కారణం అని, వారి పేర్లు సినిమా ఘనవిజయం సాధించిన తరువాత తెలియజేస్తానన్నాడు. జై లవ కుశ సూపర్ హిట్ అని కన్ఫమ్ అయిపోయింది. దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ఈవెన్ కూడా సాధించింది. మరి ఇంతవరకు ఎన్టీఆర్ ఆ ఇద్దరు ఎవరన్న విషయం మాత్రం బయట పెట్టలేదు. అభిమానులు ఆ ఇద్దరు ఎవరై ఉంటారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన జై లవ కుశలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయగా రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర కెరీర్లోనే బిగెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన జై లవ కుశ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. -
మెగా రికార్డును బద్దలు కొడతాడా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం జై లవ కుశ. తారక్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ డిసెంట్ కలెక్షన్లు సాదిస్తున్న జై లవ కుశ, త్వరలోనే మెగా రికార్డ్ ను బ్రేక్ చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. కలెక్షన్ల విషయంలో బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు తొలి రెండు స్థానాల్లో ఉండగా నాన్ బాహుబలి లిస్ట్ లో మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 టాప్ లో ఉంది. ఓవరాల్ గా 164 కోట్ల గ్రాస్ సాధించిన చిరంజీవి సినిమా మొత్తం మీద మూడో స్థానంలో నాన్ బాహుబలి లిస్ట్ లో టాప్ ఉంది. అయితే ఎన్టీఆర్ జై లవ కుశ ఇప్పటి వరకు 162 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా భావిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని సెంటర్లలో మంచి వసూళ్లు సాదిస్తుండటంతో బిజినెస్ ముగిసేనాటికి ఖైదీ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. కొంత మంది ఫ్యాన్స్ నుంచి ఇప్పటికే ఎన్టీఆర్ మెగా రికార్డ్ ను బీట్ చేశాడన్న వాదన కూడా వినిపిస్తోంది. అసలు లెక్క తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
దసరా బరిలో విజేత ఎవరు..?
ఈ దసరా సీజన్ లో తెలుగు తెరపై భారీ పోటి నెలకొంది. ఇద్దరు టాప్ హీరోలు వారం రోజుల గ్యాప్ లో తలపడటంతో థియేటర్లు కలకలలాడాయి. రెండూ భారీ బడ్జెట్ చిత్రాలు కావటంతో ప్రమోషన్, రిలీజ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతటి భారీ పోటీలో ఓ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో బరిలో దిగాడు శర్వానంద్. మరి ఈ ముగ్గురిలో దసరా విజేత ఎవరు..? దసరా బరిలో ముందుగా థియేటర్లలోకి వచ్చిన హీరో ఎన్టీఆర్. జై లవ కుశ సినిమాతో సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. కథలో కొత్తదనం లేకపోవటం లాంటి చిన్న చిన్న మైనస్ లు కనిపించినా.. లాంగ్ వీకెండ్ కలిసి రావటం వారం పాటు పోటి లేకపోవటంతో భారీ వసూళ్లనే సాధించి సత్తా చాటాడు. ఇప్పటికీ జై లవ కుశ మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. పర్ఫెక్ట్ దసరా సీజన్ లో సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. 120 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిన స్పైడర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ రావటం అభిమానులను నిరాశపరిచింది. కానీ టాక్ ప్రభావం కలెక్షన్ల మీద మాత్రం కనిపించటం లేదు. రెండు భాషల్లో కలిపి ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ కు చేరువైన స్పైడర్ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. దసరా సీజన్ లో చివరగా బరిలో దిగిన హీరో శర్వానంద్. పండుగ సీజన్ లో టాప్ స్టార్లతో పోటి పడి మంచి విజయాలు సాధించిన శర్వానంద్ మరోసారి అదే ఫీట్ రిపీట్ చేసేలాగే ఉన్నాడు. పండుగకు ఒక్క రోజు ముందు థియేటర్లలోకి వచ్చిన మహానుభావుడు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రొటీన్ టేకింగ్ తో తెరకెక్కిన సినిమానే అయినా.. కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాడు మహానుభావుడు. మరి ఈ ముగ్గురిలో ప్రేక్షకులు ఎవరికి విజయాన్ని అందిస్తారో చూడాలి. -
ఎన్టీఆర్ కు చరణ్ ట్రీట్
జై లవ కుశ సక్సెస్ తో ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన యంగ్ టైగర్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. దసర పండుగను ముందుగానే తీసుకువచ్చిన ఎన్టీఆర్, ఘనవిజయాన్ని అందుకున్నాడు. తన కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది జై లవ కుశ. కలెక్షన్లతో పాటు సినీ ప్రముఖుల నుంచి ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జై లవ కుశ సినిమా చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కు స్వయంగా ఫోన్ చేసి అభినందించారట. అంతేకాదు డిన్నర్ ఆహ్వానించి స్వయంగా కలిసి ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలిపాడు చెర్రీ. ఈ సందర్భంలో ఎన్టీఆర్, చరణ్ లు కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలోనూ పలు సందర్భాల్లో తన బెస్ట్ ఫ్రెండ్స్ లో ఎన్టీఆర్ పేరు చెప్పిన చరణ్ ఇప్పుడు స్వయంగా అభినందించటం పై ఇద్దరు హీరోల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. I'm really touched by the way the fans are reacting to a genuine gesture by Ramcharan.. Tarak also equally touched.. We are ONE .. TFI 👍 pic.twitter.com/FyVIohKoVG — kona venkat (@konavenkat99) 29 September 2017 -
జై లవకుశ టీమ్‌తో చిట్ చాట్
-
ఎన్టీఆర్ స్టామినా: రెండు రోజుల్లో 60 కోట్లు
జై లవ కుశ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సత్తా చాటాడు. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండటం, అందులో ఒకటి నెగెటివ్ రోల్ కూడా కావటంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా భారీగా రిలీజ్ అయిన ఈ సినిమాతో తొలిరోజే రికార్డ్ కలెక్షన్లు సాధించింది. గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్ సీస్ తో కలుపుకొని తొలిరోజే 49 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. రెండు రోజు కూడా అదే జోరు చూపించిన జై లవ కుశ చిత్రం రెండు రోజుల్లో 60 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంది. అంతేకాదు తొలి రెండు రోజుల్లోనే ఓవర్ సీస్ లో మిలియన్ మార్క్ ను కూడా అందుకొని ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. లాంగ్ వీకెండ్ కలిసి రావటంతో తొలి వారాంతానికి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతోంది జై లవ కుశ. #MillionDollarJaiLavaKusa .. #JaiLavaKusa has already crossed the 60Cr Gross mark (worldwide) by the end of second day 👍🏻💪🏻🤘🏻 pic.twitter.com/RJtDtTkSf7 — Mahesh S Koneru (@smkoneru) September 23, 2017 -
ఓవర్ సీస్ లో 'జై లవ కుశ' హవా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా విడుదలైన తాజా చిత్రం జై లవ కుశ. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు పవర్, సర్థార్ గబ్బర్ సింగ్ చిత్రాల దర్శకుడు బాబీ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో అదే స్థాయిలో భారీ వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా జై లవ కుశ రికార్డ్ సృష్టించింది. బుధవారం సాయంత్రమే మొదలైన ప్రీమియర్ షోస్ కు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. దీంతో ప్రీమియర్ షోస్ తోనే 5 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ జై లవ కుశ వసూళ్లను సంబంధించిన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రీమియర్ షోస్ తో 5,89,390 డాలర్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా గురువారం 1,44,894 డాలర్లను కలెక్ట్ చేసింది. మొత్తంగా 7,34,284 డాలర్ల కలెక్ట్ చేసినట్టుగా ప్రకటించారు. ఇంకా వీకెండ్ కి శుక్ర, శని, ఆది వారాలు మిగిలి ఉండటంతో తొలి వారాంతానికే సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చేస్తుందని భావిస్తున్నారు. Telugu film #JaiLavaKusa is racing towards $ 1 million in USA... Wed $ 589,390, Thu $ 144,894. Total: $ 734,284 [₹ 4.76 cr]. @Rentrak — taran adarsh (@taran_adarsh) 22 September 2017 -
'జై లవకుశ' మూవీ రివ్యూ
టైటిల్ : జై లవ కుశ జానర్ : యాక్షన్, రొమాన్స్, డ్రామా తారాగణం : ఎన్టీఆర్, రాశీఖన్నా, నివేదా థామస్, పోసాని కృష్ణమురళీ, బ్రహ్మాజీ, సాయికుమార్, ప్రదీప్ రావత్, జయప్రకాష్ రెడ్డి తదితరులు సంగీతం : దేవీశ్రీ ప్రసాద్ దర్శకత్వం : కే.ఎస్ రవీంద్ర(బాబీ) నిర్మాత : కళ్యాణ్ రామ్, హరికృష్ణ విడుదల తేదీ : 21-09-2017 టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌వంటి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలందుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజా సినిమా జైలవకుశ. భారీ అంచనాలతో గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిసారి కుటుంబ బ్యానర్లో నటించడంతోపాటు, ఏకంగా మూడు పాత్రల్లో అది కూడా తొలిసారి ఓ నెగేటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ నటించడంతో అభిమానులు మాత్రమే కాకుండా సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఈ సినిమా చూసేందుకు ఎదురుచూశారు. ముఖ్యంగా ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి పాత్రల పరిచయాలకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్ ఈ చిత్రంపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. ఆడియో సందర్బంలో కూడా ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ‘ఏం తీశార్రా అన్నదమ్ములు’ అని చెప్పుకునేలా చిత్రం ఉంటుందని ఎన్టీఆర్ చెప్పడం కూడా మరింత ఆసక్తిని రేకెత్తించింది. ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగానే జైలవకుశలు ఆకట్టుకున్నారో లేదో చూద్దాం. కథ జై లవకుశలు ఒకే తల్లి కడుపులో పుట్టిన ముగ్గురు కవల పిల్లలు. వారిలో జై పెద్దవాడు.. అతడికి నత్తి వైకల్యం ఉంటుంది. రూపంలో ముగ్గురు ఒకేలా ఉన్నప్ప టికీ వారితో నాటకాలు వేయించే మేనమామ(పోసాని కృష్ణమురళి) నత్తి కారణంగా జైపై వివక్ష చూపిస్తూ అతడికి అంతగా ప్రాధాన్యం లేని పాత్రలు ఇస్తూ, జైని ఎప్పుడూ తెరవెనుకే ఉంచుతూ లవకుశలకు మంచి పాత్రలు ఇస్తూ వారిని బాగా చూసుకుంటుంటాడు. దీంతో జై లోలోపల కుమిలిపోతుంటాడు. లవకుశలు కూడా జై గురించి పెద్దగా పట్టించుకోకపోవడంతో తన మనసులో వారిపై కాస్త ఈర్ష్య, కోప, పగ భావం పెంచుకుంటాడు. అదే సమయంలో నాటక రంగస్థలంపైనే జై ఓ ప్రమాదం సృష్టిస్తాడు. దాని కారణంగా వారు ముగ్గురు విడిపోతారు. ఒకరికొకరు తెలియకుండానే వేర్వేరుగా బతికేస్తున్న క్రమంలో లవ ఓ బ్యాంకు ఉద్యోగి అవుతాడు. అతడి మంచితనాన్ని అలుసుగా తీసుకొని అందరూ మోసం చేస్తుంటారు. అదే సమయంలో ప్రియ(రాశీ ఖన్నా)తో లవ ప్రేమలో కూడా పడతాడు. కుశ మాత్రం బాల నేరస్తుడిగా జైలుకు వెళ్లొచ్చి చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ అమెరికా వెళ్లాలని కలలు కంటుంటాడు. పెద్ద మొత్తంలో ఏదో ఒకలా డబ్బు పోగేసుకుని, ఆ డబ్బుకాస్త పెద్ద నోట్ల రద్దు కారణంగా చెల్లనిదై పోయి దీర్ఘ ఆలోచనలో ఉండగా అనూహ్యంగా లవను కలుస్తాడు. ఇక అదే సమయంలో మరోచోట పెరుగుతున్న జై మాత్రం పెద్ద డాన్‌గా మారతాడు. రావణాసూరుడి పాత్రకు ఆకర్షితుడై అతడి పేరును కూడా రావణ్ మహారాజ్‌గా మార్చుకొని ఒడిశాలోని బైరంపూర్ అనే ప్రాంతంలో హవా చూపిస్తుంటాడు. ఆ క్రమంలోనే జైకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యలో నుంచి బయటపడేందుకు జై లవకుశను తన వద్దకు ఎత్తుకెళుతాడు. వారు తాను చెప్పినట్లు వినేలాగా ప్రియను, కుశ దాచుకున్న సొమ్మును కూడా తీసుకెళతాడు. అయితే, అలా తీసుకెళ్లిన తన సోదరులపై జై కక్ష తీర్చుకుంటాడా? అలా అనూహ్యంగా జై వద్దకు వెళ్లిన లవకుశలు ఎలా స్పందిస్తారు? ఇంతకీ జైకి వచ్చిన సమస్య ఏమిటి? అందులోనుంచి లవకుశలు జైని బయటపడేశారా? లేదా లవకు ప్రియను జై ఇచ్చేస్తాడా? ముగ్గురు అన్నదమ్ములు తిరిగి మునుపటిలాగా కలుసుకుంటారా లేదా అనేది వెండితెర మీద చూడాల్సిందే. నటీనటులు ఇది కచ్చితంగా ఎన్టీఆర్ వన్ మేన్ షో అని చెప్పక తప్పదు. ముఖ్యంగా జై క్యారెక్టర్‌ను భద్రంగా మనసులోకి పెట్టుకొని ప్రేక్షకుడు బయటకు వస్తాడు. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఒదిగిపోయిన తీరు అద్భుతం. జై పాత్ర ద్వారా అసలైన రౌద్రాన్ని, లవ పాత్ర ద్వారా సున్నిత మనస్తత్వాన్ని, కుశుడి పాత్ర ద్వారా చలాకీతనాన్ని ఎన్టీఆర్ పండించాడు. కుశ పాత్ర ద్వారా కామెడీ కూడా ఇరగదీశాడు. పౌరాణిక పాత్రలకు సంబంధించిన డైలాగ్‌లతో కట్టిపడేశాడు. మాస్ ప్రేక్షకులను జై కట్టిపడేస్తే.. ఫ్యామిలీ కథా చిత్రాల ప్రేక్షకులను లవకుశ పాత్రలు మెప్పిస్తాయి. ఇక హీరోయిన్లుగా నటించిన రాశీ ఖన్నా, నివేదా థామస్‌ల యాక్షన్‌కు పెద్ద అవకాశం లేకపోయినా.. చిత్ర కథ ముందుకు వెళ్లడంలో వారి పాత్రలు కూడా కీలకమే. ఐటం సాంగ్‌లో నటించిన తమన్నా తన డ్యాన్స్, గ్లామర్ ఆరబోతతో ఆకట్టుకుంది. ప్రదీప్ రావత్లాంటి నటులు విలనిజంతో మెప్పించారు. సాంకేతిక వర్గం తెలిసిన కథే అయినప్పటికీ బాబీ అద్భుతంగా తెరకెక్కించారు. ఇదివరకు ఎవరూ తీసుకొని కోణంలో కథను రాసుకొని తను అనుకున్న దాన్ని తెరపై చూపించారు. ముఖ్యంగా జైలవకుశ పాత్రలను బ్యాలెన్స్ చేయడంలో సక్సెస్ అయ్యారు. తక్కువ సమయంలోనైనా మనసుపెట్టి ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. నిజానికి బాబీ ఈ చిత్రానికి ఎన్టీఆర్‌ను హీరోగా ఎంచుకోవడంతోనే తొలి విజయం సాధించినట్లు అనుకోవచ్చు. చోట కే నాయుడు కెమెరా పనితనం చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ను ఆయన పొదివి పట్టుకున్నారు. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దేవీశ్రీ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. ముఖ్యంగా సెంటిమెంట్ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. హైలెట్స్ ఎన్టీఆర్ నటన కథను కొత్తగా నడిపించిన తీరు పిల్లల పెంపకానికి సంబంధించిన పాయింట్‌ను కథగా ఎంచుకోవడం మైనస్ పాయింట్లు సెకండాఫ్‌లో కొంచెం స్లో నెరేషన్..! మొత్తంగా చెప్పాలంటే.. జైలవకుశలు ప్రేక్షకులను బాగా అలరిస్తారు - ఎం. నాగేశ్వరరావు, ఇంటర్నెట్ డెస్క్ -
నా గుండె గర్వంతో ఉప్పొంగుతోంది : ఎస్ఎస్ రాజమౌళి
సాక్షి, హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో తెరకెక్కిన తాజా సినిమా 'జై లవకుశ'.. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి మూడు విభిన్నమైన పాత్రలను పోషించాడు. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాపై నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్ వస్తోంది. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబర్చాడని, ముఖ్యంగా 'జై' పాత్రలో ఎన్టీఆర్ చక్కని వైవిధ్యాన్ని చూపించాడని ప్రేక్షకులు మెచ్చుకుంటున్న నేపథ్యంలో ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'జైలవకుశ' సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. 'తారక్.. నా గుండె గర్వంతో ఉప్పొంగుతోంది. మాటలు రావడం లేదు. జై.. జై.. జైలవకుశ' అంటూ జక్కన్న ట్వీట్ చేశారు. Tarak.. my heart is swelling with immense pride..words are just not enough..jai JAI.. -
'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్ రివ్యూ!
జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో తెరకెక్కిన తాజా సినిమా 'జై లవకుశ'.. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి మూడు విభిన్నమైన పాత్రలను పోషించాడు. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాపై నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్ వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులైతే ఈ సినిమా సూపర్‌హిట్ ఖాయమని ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి ఓవర్సీస్లో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ మౌత్‌టాక్‌తో, పాజిటివ్ రివ్యూలతో 'జైలవకుశ' సినిమా ప్రారంభం కావడం చిత్రయూనిట్లో సంతోషం నింపుతోంది. 'జైలవకుశ' ముగ్గురు అన్నదమ్ముల స్టోరీ. ఇందులో జై, లవ, కుశగా మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఎలాంటి డూప్ లేకుండా నటించాడు. చిన్నతనంలో కలిసి పెరిగిన ముగ్గురు అన్నదమ్ములు కొన్ని కారణాల వల్ల విడిపోతారు. అందులో లవ బ్యాంక్ మేనేజర్ అయితే, కుశ అల్లరిగా పెరిగి దొంగగా మారతాడు. ఇక సినిమాకు అత్యంత కీలకమైన 'జై' చిన్నప్పుడు తన సోదరుల నుంచే వేరు అయి.. ఉత్తరప్రదేశ్‌లో పేరుమోసిన రౌడీగా మారతాడు. ఈ ముగ్గురు తిరిగి ఎలా కలిశారు? రావణాసురుడిని ఇష్టపడే 'జై' ప్రతినాయకుడి స్వభావం నుంచి మారిపోతాడా? సోదరుల కోసం 'జై' చేసిన త్యాగమేమిటి? అన్నది తెరపై చూడాలంటున్నారు నెటిజన్లు. ఇక ఈ సినిమాకు ఉదయం నుంచే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దర్శకుడు కొరటాల శివ, రకుల్‌ప్రీత్‌సింగ్, వెన్నెల కిషోర్ తదితరులు 'జైలవకుశ' సూపర్‌హిట్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. ఎన్టీఆర్ నటన అద్భుతం.. సూపర్‌హిట్ ఖాయమంటూ ట్వీట్లు పెట్టారు.Wishing d entire team of #JaiLavaKusa all d best 4 tom 😀 my lovely @RaashiKhanna @i_nivethathomas n the most terrific actor @tarak9999 👍🏻— Rakul Preet (@Rakulpreet) 20 September 2017 ఇక నెటిజన్ల నుంచి 'జైలవకుశ'పై పాజిటివ్ రివ్యూలే పోటెత్తాయి. సినిమా బాగుందనే ట్వీట్లు ఉదయం నుంచి వస్తున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్టైన్మెంట్ ఉంటే.. సెకండ్ హాఫ్‌లో సెంటిమెంట్ బాగాపడిందని, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పర్ఫెర్మెన్స్ ఇచ్చారని నెటిజన్లు కితాబిస్తున్నారు. ఓవర్సీస్ నుంచి ఈ సినిమాపై టెర్రిఫిక్ రిపోర్టులు అందుతున్నాయని, జైలవకుశ పెద్ద విజయాన్ని సాధించబోతున్నదని సినీ మార్కెటింగ్ నిపుణుడు మహేశ్ ఎస్ కోనేరు ట్వీట్ చేశారు.#JaiLavaKusa review rendu mukkalo : @tarak9999 NATAVISWAROOPAMHats of @tarak9999 Sir— yashwanth choudary (@yash_choudary) 21 September 2017Excellent reports from the Overseas & early morning shows in India. #JaiLavaKusa pic.twitter.com/vJTSH2eXhO— Vamsi Kaka (@vamsikaka) 21 September 2017Tarak @tarak9999 master class in acting .. what an emotional high the climax gives ! Don’t miss #JaiLavaKusa . Complete family entertainer— Mahesh S Koneru (@smkoneru) 21 September 2017#JaiLavaKusa review 3.5 /5 : Climax - Emotional high.. Touching & tear jerker... Jr. #NTR with 3 diff body languages rocked the show pic.twitter.com/VOMwsFdA2c— j (@JEYMJKRISHNA) 21 September 2017 -
తొలిరివ్యూ: రావణుడిగా ఎన్టీఆర్ దుమ్మురేపాడా!
'జై లవకుశ' ఫీవర్.. టాలీవుడ్‌ను, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఊపేస్తోంది. తొలిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో తెరపై దుమ్మురేపడానికి సిద్ధమవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో సోదరుడు కల్యాణ్ రాం తెరకెక్కించిన ఈ సినిమాలో జై, లవ, కుశగా మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ అలరించబోతున్నాడు. ఈ సినిమా కథ ఏమిటనేది ట్రైలర్ ద్వారా.. ఎన్టీఆర్ తాను ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా చూచాయగా చెప్పేశారు. రామలక్ష్మణుల్లా పెరగాల్సిన ముగ్గురు అన్నదమ్ములు రావణ, రామ-లక్ష్మణులుగా మారడమే ఇందులోని కథ. ఇందులో జై పాత్ర రావణుడి ఛాయలతో సాగుతోంది. నాటకాలు అధికంగా ఇష్టపడే జై.. రావణుడిలా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. రావణుడిని అభిమానించే 'జై' పాత్రపై ఇప్పటికే విశేషమైన క్రేజ్ ఏర్పడింది. ప్రతినాయకుడిగా తొలిసారి నటించిన ఎన్టీఆర్.. 'జై' పాత్రలో వీరోచితమైన అభినయాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తోంది. 'జై' పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌కు, 'జైలవకుశ' ట్రైలర్‌కు ఆన్లైన్లో విశేషమైన స్పందన లభించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు కూడా బాగున్నాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా 'జై రావణ' పాట శ్రోతలను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో 'జైలవకుశ' ఎలా ఉండబోతుంది? అసలు కథలో ట్విస్టేమిటి? జై పాత్ర అంచనాలను అందుకుంటుందా? మరికాసేట్లో తేలనుంది. ఇప్పటికే తారస్థాయి అంచనాలు ఉన్న ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. 'జైలవకుశ' సినిమాను డైరెక్టర్ బాబీ అద్భుతంగా తెరకెక్కించారని, యంగ్‌టైగర్ ఎన్టీర్ మైండ్‌బ్లోయింగ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడని దేవీ ట్వీట్ చేశాడు. రావణా అంటూ 'జై' పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టినట్టు హింట్ ఇచ్చారు. Get ready guys 4 JLK tmorow.. Brilliant Making by @dirbobby and Mindblowing Performance by Young Tiger Dear @tarak9999 !! RAAVANAAA !!😁🎹🕺🕶 — DEVI SRI PRASAD (@ThisIsDSP) 20 September 2017 #JaiLavaKusa has Potential to break All Non Baahubali Records ! Full on Mass Masala Entertainer with #JrNTR Star Power & Racy Screenplay ! 👏 pic.twitter.com/Ab5WSRPrky — Umair Sandhu (@sandhumerry) 20 September 2017 #JrNTR gave Career Best Performance ever in #JaiLavaKusa. Best Tollywood Male Performance of the Year by so far ! Hatsoff to him 👍👏 3.5*/5* pic.twitter.com/ZVDhlUrcqj — Umair Sandhu (@sandhumerry) 20 September 2017 My Review of #JrNTR #JaiLavaKusa is Trending all over the World ! Thank you Telugu Media ! SUPERHIT #OverseasTopCritic #UmairSandhu 🙏😊 pic.twitter.com/pudNmhVfcz — Umair Sandhu (@sandhumerry) 20 September 2017 ఇక, ఏసియన్ మూవీస్ మార్కెటింగ్ నిపుణుడైన ఉమైర్ సంధు 'జైలవకుశ' మీద తొలిరివ్యూను ప్రకటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని కితాబిచ్చాడు. 'బాహుబలి' యేతర రికార్డులన్నీ ఈ సినిమా బద్దలుకొట్టవచ్చునని విశ్లేషించాడు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని పేర్కొంటూ.. 3.5/5 రేటింగ్ ఇచ్చాడు. ఈ రివ్యూతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఏదిఏమైనా 'జైలవకుశ' సినిమా ఎలా ఉందో తెలియాలంటే రేపటివరకు ప్రేక్షకులు ఆగాల్సిందే. -
ఇంతటి విజయాన్ని ఉహించలేదు
-
ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్
సాక్షి, హైదరాబాద్ : యంగ్‌టైగర్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నగరంలో సందడి చేసారు. ఆదివారం ఇమామీ సంస్థ పార్క్ హోటల్లో నిర్వహించిన ‘జూనియర్ ఎన్టీఆర్‌తో మీరు’ పోటీ విజేతలతో ఆయన సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఆయన తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన మూవీ జై లవ కుశ. అందులో తనకు జై పాత్ర అంటే చాలా ఇష్టమని ఎన్టీఆర్ చెప్పారు. మరిన్ని విశేషాలు తారక్ మాటల్లోనే.. ‘ఈ వారంలో విడుదల కానున్న ‘జై లవకుశ’ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. తుంటరితనం, మంచితనం, రాక్షసత్వం కలగలిపిన మూడు పాత్రలు ఈ చిత్రంలో పోషించా. అందులో జై పాత్ర అంటే చాలా ఇష్టం. ఈ చిత్రం నా తల్లిదండ్రులకు, అభిమానులకు సంతోషం పంచడానికే చేశా. సినిమా ఫలితం ఎలా ఉన్నా మా అన్నదమ్ముల అనుబంధంలో ఎలాంటి తేడా ఉండదు. సోషల్ మీడియా ఓ ఉబి లాంటిది. ఇతరులు మన జీవితంలోకి తొంగిచూసే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. నేను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అతిపెద్ద తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ అనుకున్నదానికంటే ఘన విజయం సాధించింది. ఇంతటి విజయాన్ని నేను కూడా ఉహించలేదు. హిందీషోతో పోలిస్తే మన తెలుగులో ఎలాంటి గొడవలు, కలహాలు లేకుండా సాఫీగా సాగుతంది. అసలు సహనం అనేది మన రక్తంలోనే ఉంది. షోలో పార్టిసిపెంట్లు అందరూ నా ఫేవరెట్లే. వీరిని షో నుంచి బయటకు పంపడంలో నా సొంత నిర్ణయం ఏం ఉండదు. అంతా ఓటింగ్ ద్వారా జరుగుతుంది’ అంటూ ఎన్టీఆర్ పలు విషయాలను షేర్ చేసుకున్నారు. -
బిగ్‌బాస్: ఫైనల్‌కు ఆదర్శ్, హరితేజ
సాక్షి, హైదరాబాద్: తెలుగు బిగ్‌బాస్ షో చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకున్న పదో వారంలోకి అడుగుపెట్టబోతోంది. టైటిల్ పోరులో కంటెస్టంట్లు అందరూ నువ్వా నేనా అనే రేంజ్లో పోటీపడుతున్నారు. గతవారంలో ఎలిమినేషన్స్‌కి నామినేట్ అయిన ఆదర్శ్, హరితేజ, అర్చన, దీక్షలలో ఆదర్శ్, హరితేజలు సేఫ్ జోన్లో ఉన్నారంటూ బిగ్‌బాస్ వాళ్లకు రిలీఫ్ ఇచ్చారు. దీంతో వారు వారిద్దరూ ఫైనల్‌కి చేరారు. ఇక మిగిలిన అర్చన, దీక్షలలో ఎవరు ఫైనల్‌కు చేరేది ఆదివారం ఎపిసోడ్లో తేలనుంది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో ‘జై లవకుశ’ హీరోయిన్లు నివేదా థామస్, రాశీఖన్నాలు సందడి చేశారు. బ్యూటీ నివేదా థామస్ శివబాలాజీ తో ఆమ్లెట్ చేయించుకుంది. ఇది ఇలా ఉండగా నందమూరి కళ్యాణ్ రామ్ సర్ప్రైస్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రావడంతోటే నాక్కూడా ఆమ్లెట్ కావాలంటూ రుచి చూసి సూపర్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేశారు. బిగ్‌బాస్ సీజన్ 1 టైటిల్‌ను శివబాలాజీ, హరితేజ, నవదీప్‌లలో ఎవరో ఒకరు టైటిల్ విన్నర్ అవుతారని అర్చన తెలిపింది. అనంతరం ఎన్టీఆర్కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఫుల్ జోష్ ఫుల్ గా మారింది. ఎన్టీఆర్ వచ్చీ రావడంతోటే పంచ్‌లు పేలుస్తూ హౌస్ మేట్స్ కోసం ‘జై లవ కుశ’ అనే వెరైటీ టాస్క్ ఇచ్చారు. కంటెస్టంట్లతో పాటు నివేదా థామస్, రాశీఖన్నాలు కూడా ఈ టాస్క్‌లో పాల్గొన్నారు. టాస్క్ ముగిసిన తరువాత గెస్ట్ లుగా వచ్చిన కళ్యాణ్ రామ్, నివేదా, రాశీ ఖన్నాలు కంటెస్టంట్ల ఫెర్ఫామెన్స్‌ని బట్టి మార్క్ కేటాయించారు. ఇందులో అత్యధికంగా ఆమ్లెట్ వేసి ‘జై’ క్యారెక్టర్ చేసిన శివబాలాజీ ఎక్కువ పాయింట్స్ రాగా.. అర్చన అందరికంటే లీస్ట్ ప్లేస్‌లో నిలిచింది. -
బిగ్ బాస్ హౌస్‌లోకి మరో ఇద్దరు..!
-
బిగ్ బాస్ హౌస్‌లోకి మరో ఇద్దరు..!
ఇటీవల రిలీజ్ అవుతున్న ప్రతీ సినిమా ప్రమోషన్ కు బిగ్ బాస్ హౌస్ వేదికవుతోంది. ఇప్పటికే పలువురు హీరోలు బిగ్ బాస్ హౌస్ లో కొంత సమయం గడిపి తమ సినిమాలకు కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్నారు. అదే బాటలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నడవబోతున్నాడు. ఇప్పటికే ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జూనియర్, తన సినిమా ప్రమోషన్లో భాగంగా ఇద్దరు హీరోయిన్లను బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతున్నాడు. జై లవ కుశ సినిమాలోఎన్టీఆర్ కు జోడిగా నటించిన రాశీ ఖన్నా, నివేదా థామస్ లు శనివారం బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం షూటింగ్ కూడా పూర్తయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో సమయం గడపటం ఎందో ఆనందంగా ఉందంటూ తన సోషల్ మీడియా పేజ్ లో ట్వీట్ చేసింది రాశీఖన్నా. జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండగా.. పవర్ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. Such a lovely experience inside the #bigboss house! @tarak9999 @i_nivethathomas @NANDAMURIKALYAN pic.twitter.com/9TDdH6WYKh — Raashi Khanna (@RaashiKhanna) 16 September 2017 -
'దర్శకుడి కోసం ఫ్రీగా చేశా'
టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటిస్తూ స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న బ్యూటీ రాశీఖన్నా. త్వరలో ఎన్టీఆర్ సరసన నటించిన జై లవ కుశ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న రాశీ.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. సాధారణంగా ఫాంలో ఉన్న హీరోయిన్లు ఎంత చిన్న క్యారెక్టర్లో నటించినా.. ఓపెనింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నా భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు. అలాంటి రాశీ ఓ స్పెషల్ సాంగ్ ను ఫ్రీగా చేసిందట. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రాజా ది గ్రేట్ సినిమాలో రాశీ ఖన్నా స్పెషల్ సాంగ్ లో నటించింది. అయితే ఆ చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడితో ఉన్న స్నేహం కారణంగా ఆ పాటలో ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించిందట రాశీ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
'జై లవ కుశ' తమన్నా స్పెషల్ సాంగ్ టీజర్
-
హాట్ హాట్‌గా మిల్కీ బ్యూటీ
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో జై లవ కుశ యూనిట్ ప్రొమోషన్ జోరు పెంచింది. ఇప్పటికే టీజర్ ట్రైలర్ లతో ఆడియో కూడా విడుదల చేసిన చిత్రయూనిట్, మరో స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ పాటలో ఎన్టీఆర్ సరసన మిల్కీ బ్యూటీ ఆడిపాడనుంది. పక్కా మాస్ బీట్ తో సాగే ఈ పాటు ఆడియోతో పాటు రిలీజ్ చేయకుండా కాస్త ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈసాంగ్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పాట కోసం గతంలో ఎన్నడూ లేనంత గ్లామరస్ గా తమన్నా లుక్ ను డిజైన్ చేశారు. అంతేకాదు ఈ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయని ఆడియో రిలీజ్ వేదిక మీదే ప్రకటించారు. ఈ పాటను ఈ రోజు సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా రిలీజ్ అవుతున్న స్పెషల్ సాంగ్ టీజర్ తో ఆ అంచనాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న జై లవ కుశ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా జై లవ కుశ. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా బుధవారం (13-09-2017) సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. 2 గంటల 35 నిమిషాల నిడివితో రిలీజ్ అవుతున్న జై లవ కుశ ఎన్టీఆర్ అభిమానులను ఖుషీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియోకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
కొత్త లుక్ లో జూనియర్..!
జై లవ కుశ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఎన్టీఆర్, ఈ సినిమా రిలీజ్ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. అయితే జై లవ కుశ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కావటంలో కాస్త చబ్బీ చబ్బీగా కనిపిస్తున్న జూనియర్, త్రివిక్రమ్ సినిమా కోసం న్యూ లుక్ ట్రై చేసే ఆలోచనలో ఉన్నాడు. స్టైలిష్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న నెక్ట్స్ సినిమాలో ఎన్టీఆర్ స్లిమ్ లుక్ లో అలరించనున్నాడట. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ ఈ నెల 21 రిలీజ్ అవుతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. -
రికార్డులు తిరగరాస్తోన్న ‘జై లవ కుశ’
సాక్షి, హైదరాబాద్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న మూవీ ‘జై లవ కుశ’. ఈ మూవీ ట్రైలర్ టాలీవుడ్లో రికార్డులు సృష్టిస్తోంది. ఆదివారం విడుదలైన జై లవ కుశ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 7.24 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత వేగంగా ఎక్కువగా వ్యూస్ దక్కించుకున్న రెండో చిత్ర ట్రైలర్ గా ఈ మూవీ నిలిచింది. టాలీవుడ్లో ఓవరాల్‌గా దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీ ట్రైలర్ తొలి స్థానంలో ఉందని సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా పేర్కొన్నారు. తమ మూవీకి రికార్డు స్థాయిలో వ్యూస్ రావడంపై ఎన్టీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీ అందరికీ నచ్చే సినిమాలు చేస్తాను.. అందుకు ఎంతగానైనా కష్టపడతానని ఎన్టీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఏ తల్లికైనా ముగ్గురు పిల్లలు పుడితే రామ, లక్ష్మణ, భరతులు అవ్వాలని కోరుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తూ ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ, రామ, లక్ష్మణులు అయ్యారు అంటూ ట్రైలర్ ప్రారంభమైన ట్రైలర్ లో మూడు పాత్రలు కనిపించడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రాశీ ఖన్నా, నివేధా థామస్ నటించారు. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. విజయ దశమి కానుకగా సెప్టెంబర్ 21న విడుదలవుతోంది. -
ఘట్టమేదైనా పాత్రేదైనా నేను రెఢీ
-
‘కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా’
సాక్షి, హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'జై లవ కుశ'. ఇటీవల వినాయక చవితి కానుకగా లవ కుమార్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్, ఫస్ట్ రిలీజ్ చేసిన జై టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీలో మూడోపాత్ర కుశ టీజర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. కుశ పాత్రలో ఎన్టీఆర్ మాస్ లుక్‌లో అభిమానుల అంచనాలు అందుకునేలా కనిపిస్తున్నారు. 42 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్లో 'కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా' అంటూ ఎన్టీఆర్ ఎంతో ఉద్వేగంతో చెప్పిన డైలాగ్ ఆ పాత్రపై ఆసక్తిని పెంచుతోంది. దాన్ని ఆధార్ కార్డ్ అనరమ్మ.. గ్రీన్ కార్డ్ అంటారని ఎన్టీఆర్ కు అతని ఫ్రెండ్స్ చెప్పడం ఎంతో ఫన్నీగా ఉంది. పవర్, సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాల తీసిన బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. 'జై లవ కుశ' చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 21న విడుదలకు సిద్ధంగా ఉంది. -
‘కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా’
-
మాట మార్చిన మిల్కీబ్యూటీ
సాక్షి, చెన్నై: సమయానికి తగు మాటలాడే అన్న పదం ఊరికే వాడుకలోకి రాలేదు. ఇవాళ మాటకు కట్టుబడే వారిని వెతికి పట్టుకోవలసిని పరిస్థితి. ఇక సినీ రంగంలో అయితే సరే సరి. అదే కథానాయికల్లో అయితే మరీనూ. బహు భాషా తారలు అవసరాన్ని బట్టి మాట్లాడేసి ఆ తరువాత వివాదాస్పదంగా మారడంతో తూచ్ తానలా అనలేదు అని మాట మార్చేయడం మామూలైపోయింది. ఆ మధ్య నటి తమన్నా బాహుబలి చిత్రంతో వెలిగిపోయింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి– 2 చిత్రంలో మాత్రం ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడం ఆమెను చాలా నిరాశపరచింది. ఆ తరువాత దక్షిణాదిలో అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో బాలీవుడ్లో మకాం పెట్టాలని ఆశతో అక్కడ ఇకపై హిందీ చిత్రాల్లోనే నటిస్తానని, దక్షిణాదిలో అవకాశాలు వస్తే ఆలోచిస్తానని అనేసింది. ఇలాంటి లూజ్ టాక్ తమన్నాను వివాదాల్లోకి లాగింది. ఇక్కడ వచ్చే అవకాశాలు కూడా వెనక్కి పోయాయట. దీంతో చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో పడ్డ ఈ అమ్మడు దక్షిణాదిలో అవకాశాలు రావడం లేదని, బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తానని తానెప్పుడూ అనలేదని ప్లేట్ ఫిరాయించింది. తమన్నా మాట మార్చినా అది మంచి ఫలితాన్నే ఇచ్చింది. ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుందని సమాచారం. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్‌తో ఐటమ్ సాంగ్‌లో లెగ్ షేక్ చేయడానికి తమన్నా రెడీ అవుతోంది. ఇందుకు భారీ పారితోషికాన్నే పుచ్చుకుంటోందన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. తమిళంలో మాత్రం విక్రమ్‌కు జంటగా స్కెచ్ అనే ఒకే ఒక్క చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళంలో నయనతార నటిస్తున్న కొలైయూర్ కాలం హిందీ రీమేక్‌లో తమన్నా నటిస్తోంది. -
జై లవ కుశ.. ఆడియో వేడుక లేదట..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జై లవ కుశ. తొలిసారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు టీజర్లు సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేశాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ను సెప్టెంబర్ 3న ఘనంగా నిర్వహించాలని భావించిన చిత్రయూనిట్ ఇప్పుడు ఆ ప్రయత్నాల్ని విరమించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోగణేష్ నవరాత్రుల సందడి నెలకొని ఉండటంతో ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. భారీ వర్షాలతో పాటు గణేష్ నిమజ్జనం కూడా ఉండటంతో ఆడియోను డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే అభిమానుల కోసం సెప్టెంబర్ 10న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహించనున్నారు. అదే రోజు జై లవ కుశ టైలర్ కూడా రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. #JaiLavaKusa Audio will be out into the market on September 3rd. We hope you'll love this peppy and energetic album from @ThisIsDSP (1/3) — NTR Arts (@NTRArtsOfficial) 30 August 2017 A grand audio launch was planned.Due to heavy rains & ganesh nimajjanam,we are avoiding audio event in the interest of public safety (2/3) — NTR Arts (@NTRArtsOfficial) 30 August 2017 A grand public event for fans will be held on September 10th in Hyderabad, where #JaiLavaKusaTrailer will be released (3/3) — NTR Arts (@NTRArtsOfficial) 30 August 2017 -
ఎన్టీఆర్ తరువాత బన్నీతో..!
పవర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన దర్శకుడు బాబీ తొలి సినిమాతోనే కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావటంతో బాబీ స్టార్ డైరెక్టర్ అవుతాడని భావించారు. అయితే పవన్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సర్థార్ గబ్బర్ సింగ్ కు డిజాస్టర్ టాక్ రావటంతో సీన్ రివర్స్ అయ్యింది. అయితే అందరిని ఆశ్చర్యపరుస్తూ ఎన్టీఆర్ హీరోగా సినిమా ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు బాబీ. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ సినిమా తెరకెక్కిస్తున్న ఈ యువ దర్శకుడు, మరో స్టార్ హీరోను లైన్ లో పెట్టాడన్న ప్రచారం జరుగుతోంది. జై లవ కుశ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు బాబీ. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ.. జై లవ కుశ రిజల్ట్ చూసిన తరువాత బాబీ సినిమాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
జై లవ కుశలో తమన్నా...?
ఎన్టీఆర్, బాబి కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ జై లవ కుశ. ఈ సినిమాతో ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండటంతో సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అంతేకాదు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ కూడా సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఎన్టీఆర్ గత చిత్రం జనతా గ్యారేజ్ లో కాజల్ చేసిన స్పెషల్ సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో జై లవ కుశలో కూడా ఓ స్టార్ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ చేయించాలని ఫిక్స్ అయ్యారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సాంగ్ కోసం ఎన్టీఆర్ ఎనర్జీని మ్యాచ్ చేయగలిగే తమన్నాను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో అలరించిన మిల్కీ బ్యూటి.. మరోసారి ఆకట్టుకుంటుదేమో చూడాలి. -
జై లవ కుశ : ఎన్టీఆర్ మూడో లుక్
వినాయక చవితికి ఒక రోజు ముందుగానే లవ టీజర్‌తో ఆకట్టుకున్న ఎన్టీఆర్. వినాయక చవితి రోజు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు. యంగ్ టైగర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండగా ఇప్పటికే జై, లవ పాత్రలకు సంబంధించిన లుక్స్ టీజర్స్ బయటకు వచ్చేశాయి. తాజాగా మూడో పాత్ర కుశ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్ లో ఎన్టీఆర్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ట్రెండీగా కనిపిస్తున్నాడు. ఈ నెలాఖరున కుశ టీజర్ ను కూడా రిలీజ్ చేసి సెప్టెంబర్ 3న అభిమానుల సమక్షంలో ఆడియో రిలీజ్ ను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. -
ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ చవితి కానుక
సాక్షి, హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'జై లవ కుశ'. లవ టీజర్ నేడు విడుదల చేసి నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ చవితి కానుక అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన జై టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావటంతో వినాయక చవితి పండుగ సందర్భంగా గురువారం సాయంత్రం లవ టీజర్ ను రిలీజ్ చేశారు. లవ పాత్రలో ఎన్టీఆర్ చాలా క్లాస్‌గా కనిపిస్తున్నాడు. 47 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్లో 'మంచితనం పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది. మనలో ఉంటే గుణపాఠం అవుతుంది. అదే నా జీవితాన్ని తలకిందులు చేసిందని' ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్‌గా డైలాగ్ చెప్పడం ఆ పాత్రపై ఆసక్తిని పెంచుతోంది. పవర్, సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన సెట్స్ షూటింగ్ జరుపుకుంటోంది. -
ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ చవితి కానుక
-
స్పీడు పెంచిన 'జై లవ కుశ'
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం జై లవ కుశ. పవర్, సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన సెట్స్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన జై టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావటంతో వినాయక చవితి సందర్భంగా ఈ 24న లవ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు నెలాఖరుకల్లా కుశ టీజర్ ను కూడా రిలీజ్ చేసి ఆడియో రిలీజ్ కు రెడీ అయ్యే ప్లాన్ లో ఉంది యూనిట్. సెప్టెంబర్ 21న రిలీజ్ చేయాలని భావిస్తున్న ఈ సినిమా ఆడియో వేడుకను సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు థియేట్రికల్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ సరసన నివేదా థామస్, రాశీఖన్నాలు హీరోయిన్లు గా నటిస్తున్నారు. -
సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కొత్త ట్రెండ్..!
జై లవ కుశ సినిమాను ప్రతీష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్, ప్రమోషన్ పద్ధతుల్లోనూ సరికొత్త పంథాను అనుసరిస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమా రానా ఓ కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఓ కొత్త పంథాను పరిచయం చేస్తున్నాడు. ఇటీవల ట్యూబ్ లైట్ సినిమా రిలీజ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన ఫోటోనే ఎమోజీగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసి సరికొత్త ట్రెండ్ కు నాంది పలికాడు. తాజాగా సౌత్ స్టార్ విజయ్ తన కొత్త మెర్సల్ (తెలుగులో అదిరింది) స్టిల్ ను కూడా ఎమోజీగా రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ కూడా ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాడు. జై లవ కుశ సినిమాలోని మూడు క్యారెక్టర్లకు సంబంధించిన మూడు ఎమోజీ ఐకాన్స్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం సుమారు 50 లక్షల దాకా ఖర్చు అయ్యిందనే సమాచారం. ఏది ఏమైనా టాలీవుడ్ లో ఈ తరహా ప్రమోషన్ ఏ మేర వర్కవుట్ అవుతుందో చూడాలి. -
జై లవ కుశ : రెండో టీజర్ రెడీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జై లవ కుశ. పవర్, సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ బయటకు వచ్చాయి. ముఖ్యం గా జై పాత్రకు సంబంధించిన టీజర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా సినిమాలో రెండో పాత్ర లవ కుమార్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 25న వినాయక చవితి సందర్భంగా లవ కుమార్ టీజర్ రిలీజ్ కానుంది. తొలి టీజర్ లో ఎన్టీఆర్ లుక్స్, డైలాగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మరి రెండో టీజర్ మరోసారి అదే హైప్ తీసుకురావటంలో చిత్రయూనిట్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. -
ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా..?
ఒకప్పుడు మూస సినిమాలతో బోర్ కొట్టించిన ఎన్టీఆర్ ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేస్తున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న యంగ్ టైగర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు జూనియర్. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లలో ఒకరితో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఉంటుందన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. అయితే అందరికీ షాక్ ఇస్తూ మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమర్షియల్ గా ప్రూవ్ చేసుకోలేకపోయిన చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందట. ఇటీవల మనమంతా సినిమాతో ఆకట్టుకున్న చంద్రశేఖర్ చెప్పిన లైన్ ఎన్టీఆర్ కు నచ్చటంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇంత వరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేని చంద్రశేఖర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ లాంటి కమర్షియల్ హీరో నటిస్తాడా..? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
తప్పు.. తప్పు.. మార్పుల్లేవ్
తప్పు.. తప్పు.. ‘జై లవకుశ’ విడుదల ఆలస్యమవుతోందని వచ్చిన వార్తలన్నీ తప్పే అంటోంది నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థ. ముందుగా ప్రకటించిన ప్లానులో మార్పుల్లేవ్ అని ప్రకటించింది. ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సినిమా ‘జై లవకుశ’. ప్రస్తుతం పూణెలో చిత్రీకరణ జరుగుతోందట. అయితే... చిత్రీకరణ నెమ్మదిగా జరుగుతున్న కారణంగా సినిమా విడుదలను వాయిదా వేయాలనుకుంటున్నారని కొన్ని వార్తలొచ్చాయి. వీటిని నిర్మాణ సంస్థ ఖండించింది. ముందుగా ప్రకటించినట్టుగా సెప్టెంబర్ 21నే సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు పాత్రల్లో ఒకటైన ‘జై’ లుక్, టీజర్ కొన్నాళ్ల క్రితమే విడుదల చేశారు. రీసెంట్గా రెండో క్యారెక్టర్ లవకుమార్ లుక్ విడుదల చేశారు. త్వరలో లవకుమార్ టీజర్ విడుదల చేయాలనుకుంటున్నారు. రాశీ ఖన్నా, నివేథా థామస్, నందిత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. -
కూల్ అండ్ క్లాస్ లవ కుమార్ : జై లవ కుశ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జై లవ కుశ. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ఇప్పటికే మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా జై క్యారెక్టర్ కు సంబంధించిన తొలి టీజర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేసింది. తాజాగా సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న మరో క్యారెక్టర్ లవ కుమార్ కు సంబంధించిన లుక్ ను రాఖీ సందర్భంగా ఈ రోజు (సోమవారం) రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ కూల్ అండ్ క్లాస్ గా కనిపిస్తున్న ఈ లుక్ చూస్తుంటే ఇదే హీరో క్యారెక్టర్ అని అర్థమవుతోంది. జై క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్ లో రావణుడిగా కనిపిస్తే, లవ కుమార్ క్యారెక్టర్ సెటిల్డ్ గా రాముడిలా కనిపిస్తొంది. త్వరలో మరో క్యారెక్టర్ కుశ కుమార్ సంబంధించిన లుక్ ను రిలీజ్ చేయనున్నారు. -
లవ టీజర్‌కి ముహూర్తం ఫిక్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తొలిసారిగా ట్రిపుల్ రోల్ లో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇటీవల రిలీజ్ అయిన జై టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో ఇప్పుడు మరో క్యారెక్టర్ ను పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ లవ క్యారెక్టర్ లో క్లాస్ లుక్ లో సందడి కనిపించనున్నాడు. లవ టీజర్ ను రాఖీ సందర్భంగా ఆగస్టు 7 ఉదయం 10.35 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఎన్టీఆర్ సరసన నివేథా థామస్, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నానితో నందమూరి హీరో..?
హీరోగా సక్సెస్ సాధించేందుకు కష్టపడుతున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అదే సమయంలో నిర్మాతగానూ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు తాను హీరోగా చేస్తున్న సినిమాలను మాత్రమే నిర్మిస్తూ వచ్చిన కళ్యాణ్ రామ్ కిక్ 2తో తొలిసారిగా ఓ బయటి హీరోతో సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈసినిమా రిజల్ట్ కళ్యాణ్ రామ్‌ను కష్టాల్లో పడేసిందే. కొంత గ్యాప్ తరువాత ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాను నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాతో నిర్మాతగానూ సక్సెస్ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. అంతేకాదు నిర్మాతగా ఇతర హీరోలతో వరుస సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా వరుస సక్సెస్ లతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నానితో సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు నాని. దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్న ఎమ్సీఏ తో పాటు హను రాఘవపూడి, మేర్లపాక గాంధీ లాంటి దర్శకులతో సినిమాలకు అంగీకరించాడు. ఇవన్నీ పూర్తయి కళ్యాణ్ రామ్ బ్యానర్ సినిమా పట్టాలెక్కాలంటే చాలా సమయమే పడుతుంది. మరి ఈసినిమాకు దర్శకుడిగా ఎవరి ఫైనల్ చేస్తాడో చూడాలి. -
జై లవ కుశ ఆడియో రిలీజ్ డేట్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా శరవేగంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన తొలి టీజర్ కు మంచి రెస్పాన్స్ రావటంతో ఇప్పుడు అభిమానులు ఆడియో రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోను ఆగస్టు 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం పూణెలోని ఓ భారీ భవంతిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. గతంలో బాలీవుడ్ మూవీ రామ్ లీలాను షూట్ చేసిన భవంతిలో విలన్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆగస్టు లోనే షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సమ సమాజ్ పార్టీలో ఎన్టీఆర్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తారక్, జై పాత్రలో ఆకట్టుకున్నాడు. నెగెటివ్ షేడ్స్ ఈ క్యారెక్టర్ ఎన్టీఆర్ లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఫుల్ మాస్ యాక్షన్ అవతార్ లో కనిపిస్తున్న జూనియర్ ఈ సినిమాలో రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. సమ సమాజ్ పార్టీ నాయకుడిగా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇటీవల బయటకు వచ్చిన వర్కింగ్ స్టిల్స్ లో ఎన్టీఆర్ ఫోటోతో ఉన్న సమ సమాజ్ పార్టీ జెండాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆ జెండాలు కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే ఉండటంతో కథ ఉత్తరాధికి సంబంధించినదని భావిస్తున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్ కు రెడీ అవుతోంది. -
రెండు షూట్లతో ఎన్టీఆర్ బిజీ
బుల్లితెర అరంగేట్రం చేసిన ఎన్టీఆర్, తన తాజా చిత్రం షూటింగ్ కు కూడా ఎలాంటి బ్రేక్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ బిగ్ బాస్ టెలివిజన్ షో తో పాటు తాను జై లవ కుశ సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. ఈ రెండు షూటింగ్ లు పూణే పరిసరాల్లో జరుగుతున్నాయి. బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ కనిపించేది కేవలం వారంతం ఎపిసోడ్స్ లోనే కావటంతో ఎక్కువగా జై లవ కుశ కోసమే టైం కేటాయిస్తున్నాడు జూనియర్. ప్రస్తుతం పూణే జరుగుతున్న షూట్ కి సంబంధించిన అప్ డేట్ ను తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు ఎన్టీఆర్. 'జై లవ కుశ షూట్ లో సమర్ధులైన టెక్నీషియన్స్‌తో వేగంగా జరుగుతోంది' అని ట్వీట్ చేశాడు. JLK shoot in Pune in a super speed mode with a very focused and efficient crew. pic.twitter.com/EdUTGXeBs5 — Jr NTR (@tarak9999) 19 July 2017 -
ఈ నెలాఖరున మరో టీజర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పూర్తి స్థాయి నెగెటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రలో నటిస్తుండటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచనాలను మరింతగా పెంచేస్తూ ఇటీవల విడుదలైన జై టీజర్ ఆకట్టుకుంది. అభినవ రావణుడిగా ఎన్టీఆర్ లుక్స్, డైలాగ్ డెలివరీ సూపర్బ్. ముఖ్యంగా నత్తితో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్‌కు టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పటికే ఈ టీజర్ యూట్యూబ్ రికార్డ్స్ బద్ధలు కొడుతూ దూసుకుపోతుంది. ఈ అంచనాలను మరింత పెంచుతూ మరో టీజర్ ను రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటికే జై పాత్రతో వావ్ అనిపించిన జూనియర్ ఈ సారి లవ క్యారెక్టర్ ను పరిచయం చేయబోతున్నాడు. జై రావణుడైతే. లవ క్యారెక్టర్ రాముడిలా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. తొలి టీజర్ ను మించే స్థాయి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో సెకండ్ టీజర్ ను రెడీ చేస్తున్నారు. ఈ నెలాఖరున లవ టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు. -
ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ కాపీ చేశాడా..?
ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు వివాదాస్పదమవుతున్నాయి. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలో ఏదో ఒక కారణంతో చిక్కుల్లో పడుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ సినిమాపై ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా విషయంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అసంతృప్తి వ్యక్తం చేశాడట. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. టెంపర్ సినిమా సక్సెస్ తరువాత ఎన్టీఆర్‌తో మరో సినిమా చేయాలని భావించిన పూరి, ఓ క్యారెక్టర్‌ను ఎన్టీఆర్‌కు వినిపించాడట. అయితే అప్పట్లో పూరి సినిమాకు నో చెప్పిన ఎన్టీఆర్.. అదే క్యారెక్టర్‌ను జై లవ కుశ సినిమా కోసం కాపీ చేశాడన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన జై టీజర్ చూసిన పూరి, ఇది తాను సృష్టించిన క్యారెక్టర్ అని తన పర్మిషన్ లేకుండా ఆ క్యారెక్టరైజేషన్ కాపీ చేశాడని ఫీల్ అవుతున్నాడట. మరి ఈ వార్తలపై జై లవ కుశ టీం ఎలా స్పంధిస్తుందో చూడాలి. -
రాజమౌళి నెక్ట్స్ అతనితోనే..!
బాహుబలి సినిమాతో సంచలనాలు సృష్టించిన దర్శకధీరుడు రాజమౌళి నెక్ట్స్ ఏ హీరోతో వర్క్ చేయబోతున్నాడన్న చర్చ జరుగుతోంది. స్టార్ హీరోలందరూ రాజమౌళితో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నా.. రాజమౌళి మనసులో ఎవరున్నారో మాత్రం ఇంత వరకు వెల్లడించలేదు. బాలీవుడ్ సినిమా చేస్తాడంటూ, అల్లు అర్జున్‌తో చర్చలు జరుగుతున్నాయని, నానితో ఈగ 2 మొదలవుతుందని రకరకాల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ సక్సెస్‌లు సాధించిన కాంబినేషన్‌కే జక్కన్న మొగ్గుచూపుతున్నాడట. స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ సినిమాలతో సూపర్ హిట్లు సాధించిన ఎన్టీఆర్‌తో మరోసారి కలిసి పనిచేసేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాతో పాటు బిగ్ బాస్ టీవీ షోలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరో రెండు నెలల్లో ఖాళీ కానున్నాడు. తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తాడన్న టాక్ వినిపించినా.. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు. దీంతో జక్కన్నతోనే నెక్ట్స్ సినిమా ఉంటుందని భావిస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా రాజమౌళి, ఎన్టీఆర్‌ల మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత ఎన్టీఆర్ రాజమౌళి ఓటేస్తున్నాడట. అయితే ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఈ రావణున్ని చంపాలంటే..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెంచేశాయి. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా తొలి టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. సినిమాలోని జై క్యారెక్టర్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఎన్టీఆర్ మాస్ లుక్ లో నెగెటివ్ షేడ్స్ లో అదరగొట్టాడు. రావణుడిగా ఎన్టీఆర్ సూపర్బ్ అనిపించాడు.. ఆ రావణున్ని దాటాలంటే సముద్రం దాటాలా.. ఈ రావణున్ని చంపాలంటే సముద్రమంతా ధైర్యముండాలా.. అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానులను ఖుషీ చేస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈసినిమాలో నివేథా థామస్, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఎన్టీఆర్ ట్రిపుల్ ధమాకా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్‌ను రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఈ లోగా టీజర్ రఫ్ కట్ ఆన్లైన్లో లీక్ అవ్వటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు చిత్ర నిర్మాతలు. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకే ఆ మూడు పాత్రలకు సంబంధించిన మూడు వేరు వేరు టీజర్లను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా జూలై 6 సాయంత్ర 5 గంటల 22 నిమిషాలకు జై పాత్రకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. మిగతా రెండు టీజర్లను త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Jai. Lava. Kusha. 3 Unique Characters that deserve their own unique teasers. You saw Jai. Now get ready for #JaiTeaser on July 6th at 5:22pm pic.twitter.com/MBLg1FL1oi — NTR Arts (@NTRArtsOfficial) 1 July 2017 -
లీకైన జై లవ కుశ స్టిల్స్
భారీ చిత్రాలకు లీకుల బెడద తప్పటం లేదు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జై లవ కుశ కూడా లీకు వీరుల బారిన పడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ ఫోటోలు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కు సంబంధించినవిగా తెలుస్తున్నాయి. రావణ దహనం బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ పై తెరకెక్కించిన ఫైట్ సీన్ కు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ స్టిల్స్ కువైట్ నుంచి లీక్ అయినట్టుగా భావిస్తున్నారు. ఈ సినిమాకు ఆన్ లైన్ ఎడిటర్ పనిచేస్తున్న గణేష్ అనే వ్యక్తి లీక్ చేశాడని అనుమానిస్తున్నారు. గణేష్ తన ఫ్రెండ్స్ ద్వారా కువైట్ నుంచి ఈ ఫోటోలు పోస్ట్ చేయించాడు. ఇప్పటికే చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గణేష్ ను అరెస్ట్ చేశారు.కేవలం స్టిల్స్ మాత్రమే లీక్ అయ్యాయా.. లేక సీన్స్ కూడా ఏమైన లీక్ అయ్యాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మహేష్ మూవీ టీం షాకింగ్ డెసిషన్..!
సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ కొత్త సినిమా స్పైడర్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా రిలీజ్ ఆలస్య కావటంతో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు వారం ముందు సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జై లవ కుశ రిలీజ్ అవుతోంది. దీంతో రెండు సినిమాల కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే చాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవ కుశపై కూడా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో పోటి రసవత్తరంగా మారుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా.. వంద కోట్లకు పైగా బడ్జెట్‌తో ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు నిర్మిస్తున్నారు. -
బుల్లితెరపై ఎన్టీఆర్ : బిగ్ బాస్ ఫస్ట్ లుక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాప్ స్టార్స్ నాగార్జున, చిరంజీవి బుల్లితెరపై వ్యాఖ్యతలుగా వ్యవహరించగా.. త్వరలో యంగ్ హీరో ఎన్టీఆర్ కూడా ఈ లిస్ట్‌లో చేరబోతున్నాడు. నార్త్‌లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షోను త్వరలో సౌత్‌ను లాంచ్ చేస్తోంది స్టార్ నెట్వర్క్. ఈ కార్యక్రమానికి తమిళ వ్యాఖ్యతగా కమల్ హాసన్‌ను తీసుకోగా తెలుగు వర్షన్‌కు ఎన్టీఆర్‌ను తీసుకున్నారు. ఈ షోలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోందో ఫస్ట్ లుక్‌ను స్టార్ నెట్వర్క్ రిలీజ్ చేసింది. సూట్లో స్టైలిష్‌గా కనిపిస్తున్న ఎన్టీఆర్ వ్యాఖ్యతగానూ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఆ సినిమా పూర్తయిన తరువాత బిగ్ బాస్ షో షూటింగ్లో పాల్గొననున్నాడు. తొలి సారిగా బుల్లితెర మీద కనిపించేందుకు ఎన్టీఆర్ భారీ రెమ్యూనరేషన్ అందుకకుంటున్నాడన్న ప్రచారం జరుగుతోంది. I can see you #BiggBossTelugu pic.twitter.com/cpvsHvpWue — Jr NTR (@tarak9999) 13 June 2017 -
లవ్‌తో లవ్వాట!
‘లవ్’ ఎలా ఉంటాడో? అతడి లుక్ ఎలా ఉంటుందో? ఇంకా తెలీదు గానీ... ఇదిగో ఈ లవ్ లేడీ లుక్కు మాత్రం మీకోసం! అబ్బబ్బా... చీర కట్టి, ముత్యం లాంటి బొట్టు పెట్టి, అంతకంటే అందమైన క్యూట్ ఎక్స్ప్రెషన్ తో ప్రేక్షకులపై మన్మథబాణం వదిలినట్టుంది కదా రాశీ ఖన్నా లుక్కు! ఈ లుక్ చూసే ‘లవ్’ కూడా ఈమెతో లవ్వులో పడినట్టున్నాడు. ఇంతకీ, ఈ ‘లవ్’ ఎవరండీ? టాపిక్ స్టార్ట్ చేసినప్పట్నుంచి లవ్... లవ్... అంటూ డీటీఎస్లో మరీ చెబుతున్నారని అనుకుంటున్నారా? యంగ్ టైగర్ ఎన్టీఆరే లవ్. కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ‘జైలవకుశ’లో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముగ్గురిలో ఓ క్యారెక్టర్ పేరు లవ్ అలియాస్ ఎన్. లవకుమార్. అతడి ప్రేయసి పాత్రలో రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఎన్టీఆర్, రాశీలపై సీన్స్ తీస్తున్నప్పుడు సెట్స్‌లో తీసిన ఫొటోనే మీరు చూస్తున్నారు. జస్ట్... ఇది శాంపిల్ మాత్రమే. ఫుల్ పిక్చర్ బాకీ హై!! -
ఈద్‌కు జూనియర్ ట్రీట్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెంచేశాయి. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి కావటంతో టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లుక్ లో ఒక పాత్రకు సంబంధించిన లుక్ మాత్రమే రివీల్ కావటంతో మిగతా పాత్రలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది. ఈ ప్రశ్నలన్నింటికీ ఈద్ సందర్భంగా సమాధానం ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఈద్ కానుకగా సినిమా ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈసినిమాలో నివేథా థామస్, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నందమూరి హీరోకు జోడిగా..!
పటాస్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చినట్టుగానే కనిపించిన కళ్యాణ్ రామ్ తిరిగి వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డాడు. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేందుకు బ్రేక్ తీసుకున్న ఈయంగ్ హీరో ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ సినిమాను నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్.. త్వరలోనూ తాను హీరోగా సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఉపేంద్ర మాధవన్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు అంగీకరించాడు కళ్యాణ్ రామ్. మంచి లక్షణాలున్న అబ్బాయి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడిగా మనాలి రాథోడ్‌ను ఫైనల్ చేశారు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఫ్యాషన్ డిజైనర్ సినిమాలో ఒక హీరోయిన్గా నటిస్తున్న మనాలి, కళ్యాణ్ రామ్ లాంటి హీరో సరసన చాన్స్ రావటంతో తెగ సంబరపడిపోతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
నో ఈగోస్!
సడన్‌గా ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ సీకే మురళీధరన్ తప్పుకున్నారనే వార్త బయటకొచ్చింది. ఆయన ప్లేస్‌లో చోటా కె. నాయుడు వచ్చి చేరారు. ఇందులో వింతేముంది? సినిమా అన్నాక ఇలాంటివి కామనే కదా అనుకోవచ్చు. అయితే... ఇక్కడే ఉంది తిరకాసు. ఆల్మోస్ట్ వన్ మంత్ ఈ సినిమా షూటింగ్ జరిగిన తర్వాత సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడానికి రీజన్ ఏంటి చెప్మా? అని అభిమానులు ఆలోచిస్తున్న టైమ్‌లో ‘దర్శకుడితో ఈగో క్లాషెస్ అంట’ అని కొందరు వార్తలు వండేశారు. వీటిపై సినిమా టీమ్ త్వరగా స్పందించిందండోయ్! ‘‘ఈగో క్లాషెస్ గట్రా ఏం కాదు. ఆ వార్తల్లో నిజం లేదు. అంతకు ముందున్న కమిట్మెంట్స్ వల్ల మురళీధరన్ తప్పుకున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా 19నే సినిమాలో హీరో ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. -
జై లవకుశలో మరో సర్ప్రైజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జై లవకుశ. జనతా గ్యారేజ్ సినిమాతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ సాధించిన ఎన్టీఆర్.. బాబీ దర్శకత్వంలో ఈ సినిమాలో నటిస్తున్నాడు. తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న ఎన్టీఆర్, అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నాడట. స్వతహాగా కూచిపూడి డాన్సర్ అయిన ఎన్టీఆర్, ఇంత వరకు పూర్తి స్థాయి క్లాసికల్ డ్యాన్సర్‌గా తన టాలెంట్ చూపించలేదు. అయితే జై లవకుశ సినిమాలో ఆ అవకాశం వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఎన్టీఆర్ క్లాసికల్ డ్యాన్సర్‌గా కనిపించనున్నాడు. చిన్న వయసులో ఎన్నో స్టేజ్ షోస్ చేసిన ఎన్టీఆర్.. జై లవకుశ సినిమా కోసం తెరపై తొలిసారిగా పూర్తి స్థాయి క్లాసికల్ డ్యాన్సర్‌గా కనిపిస్తున్నాడన్న టాక్ టాలీవుడ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 19 సాయంత్రం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
భూత్ బంగ్లాలో బాదుడు!
‘అమ్మతోడు... అడ్డంగా నరికేస్తా’ వంటి డైలాగులు చెప్పడం లేదు. అడ్డొచ్చినోణ్ణి ఉతికారేస్తున్నారు ఎన్టీఆర్. ఎవడైతే తన దారికి అడ్డంగా నిలబడతాడో... వాళ్లను బాదుడే బాదుడు. మామూలు బాదుడు కాదది. ఓ రేంజ్లో బాదుతున్నాడు. మేటర్ ఏంటంటే... ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ ‘జై లవ కుశ’ అనే సినిమా నిర్మిస్తున్నారు కదా! దీని కోసం హైదరాబాద్‌లోని భూత్ బంగ్లాలో రావణాసురుడి సెట్ వేశారు. ఇప్పుడీ సెట్లో ఫైట్ తీస్తున్నారు. జస్ట్ ఫైవ్ డేస్‌లో కంప్లీట్ కానున్న ఈ ఫైట్ కోసమే సెట్ వేయడం స్పెషాలిటీ. ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ యాక్షన్ చేస్తున్నారు. ఆ పాత్రల పేర్లు జై, లవ, కుశ. మరి, ఏ ఎన్టీఆర్ ఫైట్ చేస్తున్నారనే డౌట్ వచ్చిందా? పెద్దోడు ‘జై’ చేస్తున్నాడు. ఇప్పటివరకు చేసిన షూటింగ్‌తో 40 శాతం సినిమా పూర్తయింది. ఇందులో రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా, నందిత ముఖ్య తారగా నటిస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే. ఆ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేయాలనుకుంటున్నారు. -
అభిమానులకు ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్
జనతా గ్యారేజ్ సినిమాతో కెరీర్లో బిగెస్ట్ హిట్ సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ లోగోకు మంచి రెస్పాన్స్ రావటంతో ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. చిత్రయూనిట్ ఆ అంచనాలు మరింత పెంచే విధంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రూపొందిస్తున్నారట. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్న మూడు గెటప్‌లను మిక్స్ చేసి డిఫరెంట్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ సరసన నివేదా థామస్, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. -
ఎవరి ప్లేస్ వాళ్లదే!
రన్నింగ్ రేసులో స్పీడుగా పరిగెడితే... మీకు గోల్డ్ మెడల్ వస్తుందని గ్యారెంటీ ఇవ్వొచ్చు. కానీ, సినిమా ఇండస్ట్రీ రేసులో మీరెంత పరుగు తీసినా గోల్డెన్ లెగ్ అనే పేరొస్తుందని గ్యారెంటీ ఇవ్వలేం! వర్క్‌తో పాటు లక్ కూడా కీ రోల్ ప్లే చేస్తుందని కొందరి అభిప్రాయం. రాశీఖన్నా మాత్రం ఇటువంటి మాటలను అస్సలు పట్టించుకోరట! ‘‘ఒక్కోసారి డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరక మంచి సినిమాలో నటించే ఛాన్స్ మరొకరికి వెళ్తుంది. అందులో ఆ అమ్మాయి నటించుంటేనా? స్టార్డమ్ మరింత పెరిగేది. పాపం... మంచి ఛాన్స్ మిస్ అయ్యిందనే మాటలు వినిపిస్తాయి. నా దృష్టిలో ఇక్కడ ప్రతి ఒక్కరూ పైకి ఎదగడానికి ఛాన్స్ ఉంది. కాస్త ముందూ వెనుకా అవుతుందంతే. ఎవరికి పేరొచ్చినా సంతోషించే మనస్తత్వం నాది. వేరొకరి ఉన్నతిని చూసి అసూయ చెందే రకం కాదు. ఎవరూ ఎవర్నీ తొక్కేయడానికి ప్రయత్నించరు. ఎవరి ప్లేస్ వాళ్లదే. నా ప్లేస్ నాదే’’ అన్నారు రాశీ ఖన్నా. తెలుగులో రకుల్, సమంత, లావణ్యా త్రిపాఠి, హిందీలో వాణీ కపూర్.. ఇలా సినిమా ఇండస్ట్రీలో రాశీ స్నేహితుల జాబితా పెద్దదే. వాళ్లతో ఈ బ్యూటీ తనను ఎప్పుడూ కంపేర్ చేసుకోరట! ఇక, సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం ఎన్టీఆర్ ‘జై లవకుశ’, రవితేజ ‘టచ్ చేసి చూడు’, గోపీచంద్ ‘ఆక్సిజన్’లలో రాశీ ఖన్నా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా నటించే సినిమాలోనూ ఛాన్స్ వచ్చింది. ఈ ఏడాది తమిళ, మలయాళ రంగాలకు కూడా రాశీ ఖన్నా పరిచయం కానున్నారు. ఎక్కడికెళ్లినా ముందుగా అవకాశం ఇచ్చిన తెలుగు పరిశ్రమ తనకెంతో స్పెషల్ అంటున్నారీ బ్యూటీ. సో.. స్వీట్ కదూ! -
ఎన్టీఆర్ సినిమాలో వివాదాస్పద నటుడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ కాస్టింగ్‌ను సెట్ చేస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్లుగా రాశీఖన్నా, నివేదా థామస్ లను ఫైనల్ చేయగా, అతిథి పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత కనిపించనుందన్న ప్రచారం జరుగుతోంది. విలన్ పాత్రకు కన్నడ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారు జై లవ కుశ యూనిట్. కన్నడ ఇండస్ట్రీలో వివాదాస్పద నటుడిగా పేరుతెచ్చుకొని, ప్రస్తుతం బ్యాన్ ఎదుర్కొంటున్న దునియా విజయ్.. జై లవ కుశ సినిమాలో విలన్‌గా నటించనున్నాడు. ఓ సినిమా షూటింగ్లో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఇద్దరు నటులు ప్రాణాలు కొల్పొవడానికి కారుకులైన దునియా విజయ్, ఆయన సినిమా యూనిట్‌పై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించింది. గతంలోనూ విజయ్ పలు వివాదాల్లో తలదూర్చాడు. ఇతర నటీనటులతో దురుసుగా మాట్లాడటం చేయి చేసుకోవటం లాంటి ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి. ఎన్టీఆర్‌కు కన్నడ ఇండస్ట్రీతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమాలో ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడాడు. అదే పరిచయాలతో దునియా విజయ్‌ని తన సినిమాలో విలన్‌గా నటింప చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కన్నడలో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ విలన్‌గా నటిస్తే జై లవ కుశకు సాండల్‌వుడ్ మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. -
అదే టైటిల్!
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 27వ చిత్రానికి ప్రచారంలో ఉన్న ‘జై లవకుశ’ పేరునే టైటిల్‌గా ఖరారు చేశారు. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేశారు. నందమూరి తారక రామారావు చేసిన ‘లవకుశ’ తెలుగు తెరపై చరిత్ర సృష్టించింది. రూపంలో, నటనలో తాతయ్యను గుర్తు చేస్తుంటారు మనవడు ఎన్టీఆర్. ‘లవకుశ’ పేరుకి ముందు ‘జై’ అక్షరాన్ని జోడించి మనవడు ఈ సినిమా చేస్తుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ఓ కథానాయికగా రాశీఖన్నా, ప్రత్యేక పాత్రలో హంసా నందిని నటిస్తున్నారు. ఇందులో మొత్తం ముగ్గురు కథానాయికలు ఉంటారట. ఇంకా ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
ఎన్టీఆర్‌కు నత్తి..?
ఈ జనరేషన్ హీరోలందరూ కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి ప్రయోగాల బాట పడుతున్నారు. ఇన్నాళ్లు మూస మాస్ కథలతో బోర్ కొట్టించిన స్టార్స్ ఇప్పుడు విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్నారు. అంతేకాదు ఇమేజ్ ను పక్కన పెట్టేసి చాలెజింగ్ రోల్స్‌ను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే రవితేజ, రాజ్ తరుణ్ లు అంధులుగా నటిస్తుండగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న యువకుడిగా నటిస్తున్నాడు. అదే బాటలో ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవ కుశలో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. జూనియర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఒక పాత్ర నత్తితో ఇబ్బంది పడే పాత్ర అని తెలుస్తోంది. ఈ పాత్రకు నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. అన్నదమ్ముల మధ్య జరిగే కథతో తెరకెక్కుతున్న జై లవ కుశ సినిమాకు బాబీ దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. -
ఎన్టీఆర్ 'జై లవ కుశ' ఫస్ట్ లుక్
జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జై లవ కుశ. యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒకటి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అన్న ప్రచారం జరుగుతోంది. జూనియర్ సోదరుడు, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ లుక్ విషయంలో సస్పెన్స్‌ను కంటిన్యూ చేస్తూ ఫస్ట్ లుక్‌లో కేవలం టైటిల్ లోగోను మాత్రమే రివీల్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
ఎన్టీఆర్ 'జై లవ కుశ' ఫస్ట్ లుక్