రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో జై లవ కుశ యూనిట్ ప్రొమోషన్ జోరు పెంచింది. ఇప్పటికే టీజర్ ట్రైలర్ లతో ఆడియో కూడా విడుదల చేసిన చిత్రయూనిట్, మరో స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ పాటలో ఎన్టీఆర్ సరసన మిల్కీ బ్యూటీ ఆడిపాడనుంది. పక్కా మాస్ బీట్ తో సాగే ఈ పాటు ఆడియోతో పాటు రిలీజ్ చేయకుండా కాస్త ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా ఈసాంగ్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పాట కోసం గతంలో ఎన్నడూ లేనంత గ్లామరస్ గా తమన్నా లుక్ ను డిజైన్ చేశారు. అంతేకాదు ఈ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయని ఆడియో రిలీజ్ వేదిక మీదే ప్రకటించారు. ఈ పాటను ఈ రోజు సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా రిలీజ్ అవుతున్న స్పెషల్ సాంగ్ టీజర్ తో ఆ అంచనాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు.