ఎన్టీఆర్‌ ‘ఆన్‌ సైలెంట్‌ మోడ్‌’ | Ntr and trivikram Srinivas movie title on silent mode | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 22 2018 10:42 AM | Last Updated on Thu, Feb 22 2018 1:43 PM

Trivikram Srinivas, NTR - Sakshi

త్రివిక్రమ్ శ్రీనివాస్‌, ఎన్టీఆర్‌

జై లవ కుశ సినిమాతో ఘనవిజయం అందుకున్న యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ డిఫరెంట్‌ లుక్‌ లో దర్శనమివ్వనున్నాడట. అందుకోసం విదేశీ ట్రైనర్‌ పర్యవేక్షణలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించనున్న ఈ సినిమాకు అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అంతేకాదు ట్యాగ్ లైన్‌గా ‘ఆన్‌ సైలెంట్‌ మోడ్‌’ నే క్యాప్షన్‌ను ఇప్పటికే ఫిక్స్‌ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 2019 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement