
ఎన్టీఆర్
కంటబడితే కనికరిస్తానేమో కానీ ఎంటబడితే నరికేస్తా వోబా... అంటూ వీర రాఘవ రెడ్డి ప్రతాపాన్ని టీజర్ ద్వారా ఆడియన్స్‌కు చూపించారు ఎన్టీఆర్. ఇప్పుడు ఫుల్ మూవీతో ఆడియన్స్‌కు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారాయన. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’.
యస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా గుమ్మడికాయ కొట్టే డేట్‌ను సెప్టెంబర్ 14కి ఫిక్స్ చేశారు చిత్రబృందం. సెప్టెంబర్ వరకూ ఏకధాటిగా ఒకటే షెడ్యూల్‌లో సినిమాని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తారట. సెప్టెంబర్ 1న పాటల చిత్రీకరణ కోసం ఫారిన్ వెళ్లనున్నారు. జగపతిబాబు, నాగబాబు, ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment