ఆపేది లేదు! | Intense workout for perfect body | Sakshi
Sakshi News home page

ఆపేది లేదు!

Published Sat, Apr 7 2018 1:14 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

Intense workout for perfect body - Sakshi

త్రివిక్రమ్, ఎన్టీఆర్, తమన్, జిమ్‌లో లాయిడ్‌తో ఎన్టీఆర్, ఎన్టీఆర్, ప్రణతి

ఘట్టం ఏదైనా... పాత్ర ఏదైనా... ఎన్టీఆర్‌ రెడీ. అందుకు ఆయన ఎంతైనా కష్టపడతారు. థియేటర్‌లో ప్రేక్షకులను ఖుషీ చేస్తారు. ఈసారి ఆడియన్స్‌కు డబుల్‌ ఫన్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఎన్టీఆర్‌. తివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా  హారికా హాసిని  క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మాణంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. పూజాహెగ్డేను కథానాయికగా ఎంపిక చేశారు. తమన్‌ స్వరకర్త.  ఈ సినిమాలోని కొత్త లుక్‌ కోసం హాలీవుడ్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ నేతృత్వంలో జిమ్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు ఎన్టీఆర్‌.

ఈ సినిమా కోసం ఆల్రెడీ ఆయన 20 కేజీల బరువు తగ్గారు. పక్కన ఉన్న ఫొటోలో చూశారుగా..ఎన్టీఆర్‌ కష్టాన్ని కూడా ఇష్టంగా ఫీలై ఎలా వర్కౌట్స్‌ చేస్తున్నారో. ‘‘ట్రైనర్‌ అండ్‌ క్లైంట్‌ గుడ్‌ రిజల్ట్‌ కావాలనుకున్నప్పుడు కాంప్రమైజ్‌ అవ్వకూడదు. అనుకున్న రిజల్ట్‌ వచ్చేవరకూ ఆపేది లేదు’’ అన్నారు లాయిడ్‌. ఎన్టీఆర్‌ కొత్త లుక్‌ చూసి అందరూ ఇంప్రెస్‌ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 12న స్టార్ట్‌ కానుందని టాక్‌.

మరోవైపు సాంగ్స్‌ వర్క్‌ను ఆల్రెడీ స్టార్ట్‌ చేసేశారు తమన్‌. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో కథనం సాగుతుందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఫ్యామిలీ డ్రామా అంటున్నారు. మరి.. ఈ విషయంపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. ఎన్టీఆర్‌ పర్సనల్‌ లైఫ్‌ విషయానికొస్తే.. ఆయన మరోసారి తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. అంటే బుల్లి అభిరామ్‌కు తమ్ముడో.. చెల్లాయో రాబోతున్నారు. మేలో ప్రణతి డెలివరీ. రీసెంట్‌గా ఎన్టీఆర్, ప్రణతి కలిసి దిగిన ఫొటోను పైన చూడొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement