Thaman
-
'గేమ్ ఛేంజర్' పాటల ఫెయిల్యూర్.. తప్పు వాళ్లదే: తమన్
ఈ సంక్రాంతికి రిలీజైన 'గేమ్ ఛేంజర్'.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. కర్ణుడు చావుకి వంద కారణాలు అన్నట్లు ఈ మూవీ ఫ్లాప్ కావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. కంటెంట్ దగ్గర పాటల వరకు ప్రతి దానిపై ట్రోల్స్ వచ్చాయి. ఇవన్నీ సంగీత దర్శకుడు తమన్ వరకు చేరినట్లున్నాయి. తాజాగా ఆడియో ఫెయిల్యూర్ పై ఓ ఇంటర్వ్యూలో తానే వివరణ ఇచ్చాడు.(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?)'గేమ్ ఛేంజర్ లో సరైన హుక్ స్టెప్ లేదు. అందుకే యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ రాలేదు. గతంలో నేను మ్యూజిక్ ఇచ్చిన 'అల వైకుంఠపురములో' పాటల్లో ప్రతిదానిలో హుక్ స్టెప్ ఉంటుంది. సంగీత దర్శకుడిగా ఒక్కో పాటకు 25-50 మిలియన్ల వ్యూస్ నేను తీసుకురాగలను. మంచి మెలోడీ అయితే 100 మిలియన్ వ్యూస్ కూడా వస్తాయి. దానికి మించి వ్యూస్ రావాలంటే మాత్రం కొరియోగ్రాఫర్, నటుడిపై ఆధారపడి ఉంటుంది' అని తమన్ చెప్పుకొచ్చాడు.'గేమ్ ఛేంజర్' పాటల్లో రా మచ్చా, దోప్, జరగండి, నానా హైరానా.. ఇలా సాంగ్స్ అన్నీ పెద్దగా ఇంప్రెసివ్ గా అనిపించలేదు. ఒకవేళ పాటలతో హైప్ క్రియేట్ అయ్యింటే సినిమాపై కాస్తంత బజ్ అయినా పెరిగేదేమో! తమన్ చెప్పినట్లు హుక్ స్టెప్ కూడా లేకపోవడం మైనస్ అయిందేమో!(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్' పాటల్నిమూల పడేసిన తమన్) -
ప్రభాస్ 'రాజాసాబ్' పాటల్ని పక్కనపడేసిన తమన్
ప్రస్తుతం ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్(Thaman) ఒకడు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా తేడా లేకుండా దాదాపు చాలా భాషల సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇతడు ప్రభాస్ 'రాజాసాబ్' (The Rajasaab Movie) కోసం కూడా పనిచేస్తున్నాడు. కానీ ఇప్పటివరకు ఈ మూవీ కోసం చేసిన సాంగ్స్ అన్నీ పక్కనపడేశానని, కొత్తగా మళ్లీ చేస్తున్నానని అన్నాడు. ఇంతకీ ఏమైంది?(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి సింగర్ మంగ్లీ.. ఫొటోలు వైరల్)ఓ ఇంగ్లీష్ ఎంటర్ టైన్ మెంట్ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో తమన్ చాలా విషయాలు మాట్లాడాడు. కానీ 'రాజాసాబ్' పాటల్ని డస్ట్ బిన్ లో వేశానని చెప్పడం చర్చనీయాంశమైంది. 'రాజాసాబ్'కి పాటలు కంపోజ్ చేయడం ఇప్పుడే మొదలుపెట్టా. షూటింగ్ అంతా దాదాపు పూర్తయిపోయింది. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత సాంగ్స్ చేయడం మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ సర్.. చాలా కాలం తర్వాత కమర్షియల్ పాటలతో వస్తున్నారు''ఈ సినిమాలో ఇంట్రో, మెలోడీ, ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. ఓ పాటలో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ క్రేజీ డ్యాన్స్ చేయబోతున్నారు. రాబోయే ఐదు నెలలో సాంగ్స్ షూటింగ్ పూర్తవుతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక్కో పాట చేస్తున్నాం. నిజానికి 'రాజాసాబ్' కోసం చాలా పాటలు చేశారు. కానీ నాకెందుకో మార్చేద్దాం అనిపించింది. ఎప్పుడో ట్యూన్స్ చేసిచ్చా. వాళ్లు షూటింగ్ మొదలుపెట్టలేదు. దీంతో ఇవన్నీ డస్ట్ బిన్ లో పడేశా. కొత్తగా సాంగ్స్ కంపోజ్ చేస్తున్నా. డైరెక్టర్ కి కూడా ఇదంతా చెప్పా. ఇవి ఇప్పుడు వర్కౌట్ కావు. నేను నా మ్యూజిక్ ని చీట్ చేయలేను. ఇలా ఉండటమే కరెక్ట్' అని తమన్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?) -
సిద్దార్థ్‌కు, నాకు పడేది కాదు.. 'బాయ్స్'లో నాకే ఎక్కువ పారితోషికం: తమన్
తెలుగు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman S) ఒకప్పుడు సినిమాలోనూ యాక్ట్ చేశాడు. సిద్దార్థ్‌తో కలిసి బాయ్స్ మూవీ (Boys Movie)లో నటించాడు. అయితే తనకు, సిద్దూకు అస్సలు పడేది కాదంటున్నాడు తమన్. అరివళగన్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్ధం సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ మూవీ ఫిబ్రవరి 28న విడుదల కానుంది.బాయ్స్ సినిమాలో నా రచ్చ అంతా ఇంతా కాదు!ఈ సినిమా ప్రమోషన్స్‌లో తమన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. బాయ్స్ సినిమాలో ఎక్కువ పారితోషికం అందుకుంది నేనే! సిద్దార్థ్(Siddharth)కు, నాకు అస్సలు పడేది కాదు. వాడు నేనే హీరో అంటే.. నువ్వు హీరో అయితే ఏంటి? హీరోయిన్ అయితే నాకేంటి? ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటోంది నేను.. అనేవాడిని. చాలా టార్చర్ పెట్టేవాడిని. సినిమా షూటింగ్లో ఓసారి సిద్దార్థ్‌కు నైకీ సాక్స్ ఇచ్చి నాకు ఏదో మామూలు సాక్స్ ఇచ్చారు. నేనది తీసుకెళ్లి రత్నంగారి ముందు పడేశాను. సిద్దార్థ్‌కు నైకీ ఇచ్చి, నాకు నైలాన్ సాక్స్ ఇస్తే ఎలా? అని అడిగాను. ఇలాంటి చీప్ కొట్లాటలు చాలానే ఉన్నాయి. నాకది క్రేజీ ఎక్స్పీరియన్స్.చాలా పెంట చేశా..బాయ్స్ సినిమాకు అరివళగన్.. శంకర్ దగ్గర అసోసియేటివ్‌గా పని చేశాడు. నన్ను చూసుకోవడమే ఆయన పనైపోయింది. బాయ్స్ సెట్లో ఎవరి మాటా వినకుండా అందరినీ టార్చర్ పెట్టేవాడిని. క్యారవాన్‌లో ప్లగ్ తీసేసి కరెంట్ ఆపేవాడిని. బాత్రూమ్కు వెళ్లే నీళ్ల పైప్ కూడా కట్ చేసేవాడిని. ఇలా చాలా పెంటలు చేశాను. ఇవన్నీ అరివళగన్ కంట్రోల్ చేసేవాడు. సినిమా డైరెక్షన్ నేర్చుకోవడానికి వచ్చి నన్ను చూసుకునే పనిలో పడ్డాడు అని తమన్ నవ్వుతూ సరదాగా చెప్పుకొచ్చాడు.చదవండి: నాది రంగుల జీవితం కాదు.. ఎన్నో అవమానాలు..: హీరోయిన్ -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు (ఫోటోలు)
-
తమన్‌కి ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇచ్చిన బాలయ్య.. ధర ఎంతంటే?
మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి హీరో బాలకృష్ణ(Balakrishna) ఖరీదైన కారుని బహుమతి ఇచ్చాడు. న్యూ బ్రాండెండ్ పోర్స్చే కారుని బాలయ్య స్వయంగా కొని, రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు . దీని విలువ మార్కెట్లో కోటిన్నర వరకు ఉంటుంది. ప్రీమియంది అయితే దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందట. ఓ సంగీత దర్శకుడికి బాలయ్య ఇంత ఖరీదైన బహుమతి ఇవ్వడం ఇదే మొదటి సారి. కొత్త కారుతో బాలయ్య, తమన్ దిగిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.తమన్ రెచ్చిపోతాడుబాలయ్య సినిమాకు సంగీతం అందించే అవకాశం వస్తే చాలు తమన్(Thaman) రెచ్చిపోతాడు. ఎంతలా అంటే ఆయన ఇచ్చే బీజీఎంకి థియేటర్స్‌లో బాక్సులు బద్దలైపోయేలా. అఖండ సినిమా భారీ విజయం సాధించడంలో తమనే కీలక పాత్ర పోషించాడు. అదిరిపోయే పాటలతో పాటు అద్భుతమైన బీజీఎం అందించాడు. ఆ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరీ చిత్రాలకు కూడా అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. వీరసింహారెడ్డి బీజీఎం ఇప్పటికీ ఫ్యాన్స్ ఫేవరేట్. సోషల్ మీడియాలో బాలయ్య ఎలివేషన్ వీడియోలన్నింటికి ఈ మూవీ బీజీఎంనే వాడుతారు. ఇక ఇటీవల రిలీజైన డాకు మహారాజ్‌కు కూడా తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. అందుకే బాలయ్యకు తమన్ అంటే విపరీతమైన ప్రేమ. ముద్దుగా తమ్ముడు అని పిలుచుకుంటాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో ‘అఖండ 2’ చిత్రం తెరకెక్కుతుంది. -
కొందరిని నమ్మితే మోసం చేశారు: ఎస్ఎస్ తమన్
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తమన్ తన కెరీర్ గురించి మాట్లాడారు. కొందరిని నమ్మి తాను కూడా మోసపోయానని వెల్లడించారు. తన సినీ కెరీర్లో ఇప్పటి వరకు చాలా విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు. మన జీవితంలో చాలామందిని నమ్ముతామని.. కానీ ఏదో ఒక సమయంలో మోసపోతామని తెలిపారు. నా జీవితంలో కూడా అలాంటి అనుభవం ఎదురైందని అన్నారు. చాలావరకు డబ్బులు పోగొట్టుకున్నానని తమన్ వెల్లడించారు.తమన్ మాట్లాడుతూ.. ' నా కెరీర్ నాకు జీవిత పాఠాలు చాలా నేర్పింది. కొందరిని నమ్మి చాలా డబ్బులు కూజా పొగొట్టుకున్నా. నేను నమ్మడం వల్లే నన్ను మోసం చేశారు. మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పనిలో ఒత్తిడికి గురైనప్పుడు వెంటనే గ్రౌండ్లోకి అడుగుపెడతా. మాకంటూ ఒక స్పెషల్ టీమ్ ఉండాలని భావించేవాడిని. స్టార్ క్రికెటర్లు ఆడిన మైదానంలో ఆడాలనేది నా కోరిక. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగం కావడంతో ఆ బాధ కూడా తీరిపోయింది' అని అన్నారు. కాగా.. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌కు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
హీరోగా నటించనున్న తమన్? 22 ఏళ్ల తర్వాత..!
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman S) మళ్లీ కెమెరా ముందుకు రానున్నాడు. ఈయన తొలిసారి నటుడిగా యాక్ట్ చేసిన చిత్రం బాయ్స్. సిద్దార్థ్, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2003లో రిలీజై సక్సెస్ సాధించింది. ఈ మూవీలో తమన్.. మ్యూజికల్ బ్యాండ్‌లో ఒకరిగా నటించాడు. తర్వాత మాత్రం అతడు నటనపై కాకుండా సంగీతంపైనే దృష్టి పెట్టాడు. మిస్టర్ మజ్ను, బేబీ జాన్ సినిమాల్లో కేవలం ఏదో ఒక సీన్/పాటలో అలా కనిపించి ఇలా వెళ్లిపోయాడు. అయితే ఈసారి పూర్తి స్థాయిలో హీరోగా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడట! హీరో అధర్వతో కలిసి తమిళంలో ఓ మూవీ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని మల్టీస్టారర్‌గా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!(చదవండి: కుటుంబంలో విషాదం.. పాడె మోసిన హీరో రానా)సంగీత దర్శకుడిగా..తమన్ తండ్రి అశోక్ డ్రమ్మర్, తల్లి సావిత్రి సింగర్. ఇంట్లో సంగీత నేపథ్యం వల్ల చిన్న వయసులోనే డ్రమ్స్ వాయించేవాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా మారడానికి ముందు దాదాపు 900 సినిమాలకు డ్రమ్మర్‌గా పని చేశాడు. బాయ్స్ మూవీలోనూ డ్రమ్స్ వాయించే కుర్రాడిగా కనిపించాడు. మళ్లీ మళ్లీ చిత్రంతో టాలీవుడ్‌కు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు తమన్. కిక్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అలా తెలుగు, తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు. హిందీలోనూ రెండు చిత్రాలకు పని చేశాడు. వివిధ భాషల్లో కలుపుకుని వందకు పైగా చిత్రాలకు సంగీతం అందించాడు. తెలుగు, తమిళంలో పలు పాటలు ఆలపించాడు. అల వైకుంఠపురములో సినిమాకుగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇటీవల డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ చిత్రాలకు పని చేశాడు.చదవండి: చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు వదిలేసిన నటుడు సాక్షి రంగారావు -
ట్రోలర్స్‌పై తమన్ ఆవేదన.. చిరంజీవి కామెంట్స్
డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్ (Thaman) చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినిమాను ట్రోల్ చేస్తున్న వారిని చూస్తుంటే భయంతో పాటు సిగ్గుగా ఉందని ఆయన అన్నారు. ట్రోల్స్ చేసుకుంటూ మన సినిమాను మనమే చంపేస్తున్నామని తమన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా సోషల్ మీడియా వేదికగా తమన్ కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యారు.'డియర్ తమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అనిపించింది. (ఇదీ చదవండి: కలిసి మాట్లాడుకుందాం.. నేను ఒంటరిగానే వస్తా: మనోజ్)విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఉచితమే, ఒక్కోసారి ఆ మాటలు కొందరికి స్ఫూర్తిగా నిలిస్తే.. మరొకరిని నాశనం చేస్తాయి. అయితే, ఆ మాటల ఎంపిక మాత్రం మనపైనే ఆధారపడి ఉంటుంది. మనం పాజిటివ్‌గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది' అని చిరు అన్నారు. ట్రోలర్స్‌పై తమన్ వ్యాఖ్యలుసినిమాలపై ట్రోలింగ్ గురించి తమన్ ఇంకా ఏమన్నారంటే.. జీవితంలో విజయం చాలా గొప్పది. అది లేకపోతే మనుషుల్ని తక్కువ చేసి చూస్తారు. మేమంతా కూడా ఆ విజయం కోసం పోరాడుతుంటాం. జీవితం ముందుకు సాగడానికి విజయం దోహదపడుతుంది. ప్రస్తుతం ఒక నిర్మాత విజయాన్ని అందుకుంటే దాని గురించి బహిరంగంగా మాట్లాడటం కష్టంగా మారింది. నిర్మాతలు మనకు దేవుళ్లతో సమానం. కాబట్టి హీరోలతో పాటు ఫ్యాన్స్, చిత్ర పరిశ్రమలో ఉన్న అందరూ వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతోంది. అలాంటి వాటి వల్ల సినిమా చాలా నష్టపోతుంది. నేను బాలీవుడ్, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలకు వెళ్ళినప్పుడు అక్కడివారు ఏదైనా మంచి తెలుగు సినిమా చేయాలని ఉందని నాతో అంటూ ఉంటారు. కానీ, మనవాళ్లు తెలుగు సినిమాలను చులకనగా చూస్తున్నారు. ఇది ఎంతో దారుణమైన విషయం. మనమే మన సినిమాని చంపేస్తుంటే ఎలా..? ఒక సినిమా విజయం గురించి కూడా బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. మీకేవైనా ఇబ్బందులు ఉంటే.. వ్యక్తిగతంగా మీరు మీరు తిట్టుకోండి. కానీ, సినిమాను మాత్రం చంపొద్దు' అని అన్నారు.Dear @MusicThaman నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 18, 2025"ఏం బతుకు బతుకుతున్నామో అర్థంకావట్లేదు... మనమే మన సినిమాని చంపేస్తున్నాం..." - Thaman pic.twitter.com/wmNpyakIf1— Aryan (@chinchat09) January 18, 2025 -
‘గేమ్ ఛేంజర్’ మూవీ HD స్టిల్స్
-
ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు..తమన్ మ్యూజిక్ షో అదుర్స్ (ఫొటోలు)
-
'పుష్ప 2'.. తమన్‌ని సైడ్ చేసేశారా?
మరో ఒకటి రెండు రోజుల్లో 'పుష్ప 2' థియేటర్లలోకి రాబోతుంది. రిలీజయ్యేంత వరకు అంతా టెన్షన్ టెన్షనే. ఫైనల్ మిక్స్ ఇప్పుడు పూర్తయినట్లు చెప్పారు. కొన్నిరోజుల క్రితం 'పుష్ప 2' బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఎంతలా రూమర్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ విషయమై షాకింగ్ విషయం ఒకటి వైరల్ అవుతోంది.'పుష్ప' సినిమాలకు మ్యూజిక్ అంతా దేవిశ్రీ ప్రసాదే. అయితే పార్ట్-2 విషయంలో టైమ్ దగ్గర పడుతుండేసరికి తమన్, అజనీష్ లోక్‌నాథ్, శామ్ సీఎస్ తదితరులు కూడా పనిచేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. కొన్నిరోజుల క్రితం బాలకృష్ణ 'డాకు మహరాజ్' టీజర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన తమన్.. తాను కూడా 'పుష్ప 2' కోసం పనిచేస్తున్నట్లు చెప్పాడు.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)కానీ ఇప్పుడు 'పుష్ప 2' ఫైనల్ మిక్సింగ్ అంతా పూర్తయిన తర్వతా ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. సినిమా కోసం కేవలం దేవి, శామ్ సీఎస్ మాత్రమే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారని, మిగిలిన వాళ్లిచ్చిన ఔట్పుట్ ఉపయోగించుకోలేదని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఎందుకంటే సినిమా టైటిల్ కార్డ్స్‌లో పేర్లు పడతాయిగా!హైదరాబాద్‌లో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. దాదాపు అందరూ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించే ప్రస్తావించారు తప్పితే మరో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడొస్తున్న రూమర్స్ చూస్తే బహుశా నిజమే అనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'బ్లాక్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
విజయ్ కుమారుడు జేసన్ ఫస్ట్ సినిమా ప్రకటన.. హీరో ఎవరంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా తన మొదటి సినిమాను అధికారికంగా ప్రకటించాడు. తన ఫస్ట్ సినిమాను టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తో ఆయన చేయనున్నారు. ఈమేరకు తాజాగా మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ సినిమా తమిళ్, తెలుగులో మాత్రమే విడుదల కానుంది. సందీప్ కిషన్‌కు తెలుగుతో పాటు కోలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌కు మంచి ప్లస్ కానుంది. రీసెంట్గా రాయన్ చిత్రంలో తనదైన స్టైల్లో సందీప్ కిషన్ మెప్పించారు. సంగీతం థమన్ అందిస్తున్నారు.ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ జికెఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ ‘‘ప్రారంభం నుంచి మంచి కథకులను ప్రోత్సహించడానికి మా సంస్థ ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే జాసన్ సంజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఆయన తెరకెక్కించబోతున్న కథ, ఆయన నెరేషన్ విన్నప్పుడు డిఫరెంట్‌గా అనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా, పాన్-ఇండియా దృష్టిని ఆకర్షించే ప్రధానమైన పాయింట్ ఉంది. మనం ఎక్కడా పొగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అనటాన్ని మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. కానీ దాని కోసం మనం ఏం వెచ్చిస్తామనేదే ప్రధాన పాయింట్‌గా సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులకు సుపరిచితుడైన సందీప్ కిషన్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సరికొత్త కాంబో ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నిస్తుందని మేం భావిస్తున్నాం' అన్నారు. సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుతూ 'తమన్ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నారు. ఇంకా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే వారి వివరాలను తెలియజేస్తాం. 2025 జనవరి నుంచి సినిమా షూటింగ్‌ను ప్రారంభించబోతున్నాం.' అని తెలిపారు. -
నా కల నెరవేరింది: తమన్
‘‘బాయ్స్’ (2003) సినిమా సమయంలో శంకర్‌గారు నాలో యాక్టర్‌ని చూశారు. నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్ని అని ఆయన గుర్తించేందుకు ఇన్నేళ్లు పట్టింది. శంకర్‌గారి సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలనేది నా కల. అది ‘గేమ్ చేంజర్’ సినిమాతో నెరవేరింది’’ అని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. నేడు (నవంబరు 16) ఆయన పుట్టినరోజు.ఈ సందర్భంగా శుక్రవారం తమన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఒకప్పుడు రొటీన్ చిత్రాలు వచ్చేవి. కానీ ఇప్పుడు డిఫరెంట్ కథలు వస్తున్నాయి కాబట్టి డిఫరెంట్ మ్యూజిక్ ఇస్తున్నాను. సినిమాలో భావోద్వేగం లేకపోతే నేను ఎంత మ్యూజిక్ కొట్టినా వేస్ట్. కథకు తగ్గట్టుగా, దర్శకుడు తీసిన దానికి అనుగుణంగా సంగీతం ఇస్తాను. కొన్ని చిత్రాలకు వాయిస్ ఎక్కువగా వినిపించాలి. ఇంకొన్నింటికి పరికరాల సౌండ్ ఎక్కువగా వినిపించాలి.తెలుగులో ప్రస్తుతం నేను చేస్తున్న ‘తెలుసు కదా, ఓజీ, గేమ్ చేంజర్, డాకు మహారాజ్’ వంటి సినిమాలు దేనికవే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నేపథ్య సంగీతంలో మణిశర్మగారి తర్వాత నేనో ట్రెండ్ క్రియేట్ చేయాలని చూస్తున్నాను. ‘పుష్ప: ది రూల్’కి 15 రోజుల్లో నేపథ్య సంగీతం పూర్తి చేయమన్నారు. అది సాధ్యం కాదు. అందుకే నాకున్న టైమ్‌లో ఫస్ట్ హాఫ్‌ను దాదాపుగా పూర్తి చేసి ఇచ్చాను. ప్రభాస్‌గారి ‘రాజా సాబ్’లో ఆరు పాటలుంటాయి. ఇతరుల సినిమాల నుంచి ట్యూన్స్‌ని కాపీ కొట్టేంత తెలివి నాకు లేదు. అందుకే వెంటనే దొరికిపోతాను (నవ్వుతూ). ‘అఖండ 2’కి ఇప్పటికే ఒక పాట అయిపోయింది. హీరో అల్లు అర్జున్–డైరెక్టర్ త్రివిక్రమ్‌ల ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను. ఓ ప్రపంచ స్థాయి మ్యూజికల్ స్కూల్ నెలకొల్పి, ఆర్థికంగా వెనకబడిన వారికి ఉచితంగా సంగీతం నేర్పించాలనుకుంటున్నాను’’ అని చె΄్పారు. -
పుష్ప రాజ్ కి తమన్ హెల్ప్ చేస్తున్నాడా
-
'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?
'పుష్ప 2' మూవీ మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. లెక్క ప్రకారం చూసుకుంటే ఈ పాటికే పనులన్నీ పూర్తయిపోవాలి. కానీ ఐటమ్ సాంగ్ షూటింగ్ పెండింగ్ ఉంది. దీనికోసం సమంత, శ్రీలీల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో దీని చిత్రీకరణ ఉండనుందని. ఇదలా ఉండగానే ఇప్పుడు మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ మూవీ కోసం పనిచేస్తున్నారనే టాక్ బయటకొచ్చింది.'పుష్ప' సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. తొలి పార్ట్‌లోని పాటలు ఎంత హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం అప్పట్లో కంప్లైంట్స్ వచ్చాయి. ఓవరాల్ సక్సెస్ వల్ల దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఆ తప్పు జరగకూడదనో ఏమో గానీ తమన్, అజనీష్ లోక్‌నాథ్‌ని బ్యాక్ గ్రౌండ్ కంపోజ్ చేసేందుకు తీసుకున్నారట.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)తమన్ గురించి తెలుగోళ్లకు తెలుసు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే రెచ్చిపోతాడు. ఇక అజనీష్ విషయానికొస్తే 'కాంతార', 'మంగళవారం' లాంటి సినిమాలతో మనోళ్లు కాస్త పరిచయమే. వీళ్లిద్దరూ తోడయితే 'పుష్ప 2'కి ప్లస్ అనే చెప్పాలి. కానీ దేవి శ్రీ ప్రసాద్ ఉండగా కొత్తగా వీళ్లిద్దరిని ఎందుకు తీసుకున్నారా అనేది అభిమానుల్ని కాస్త కంగారు పెడుతోంది. బహుశా దేవిశ్రీ ప్రసాద్‌కి వర్క్ లోడ్ ఎక్కువ కావడం ఇలా చేశారేమో?డిసెంబరు 5న 'పుష్ప 2' మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే సౌత్, నార్త్‌లో ఈ సినిమాపై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్ దాటేస్తుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: అప్పుడు 'దసరా'.. ఇప్పుడు 'ది ప్యారడైజ్') -
తమన్‌కి ఏడాదికో ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్న అనుష్క
సినిమా హిట్ అయితే డైరెక్టర్, హీరోకి నిర్మాత కారు లేదా విలువైన వస్తువులు గిఫ్ట్ ఇవ్వడం కామన్. కానీ ఓ హీరోయిన్ ప్రతి ఏడాది మ్యూజిక్ డైరెక్టర్‌కి బహుమతి ఇవ్వడం అంటే స్పెషలే కదా! స్వీటీ అనుష్క శెట్టి ఇలానే ప్రతి ఏటా మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి గిఫ్ట్ ఇస్తోంది. తాజాగా ఈ విషయాన్ని తమన్ బయటపెట్టాడు.'రాజా సాబ్', 'గేమ్ ఛేంజర్' లాంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండే తమన్.. 'తెలుగు ఇండియన్ ఐడల్' పాటల పోటీకి జడ్జిగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో మాట్లాడుతూ అనుష్కని తెగ పొగిడేశాడు. తనకు 'భాగమతి' షూటింగ్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ ప్రతి ఏడాది ఓ ఐఫోన్ బహుమతిగా ఇస్తుందని చెప్పాడు.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)'అనుష్క హీరోయిన్ అని కాదు గానీ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆమె మనసు బంగారం, అందం గురించి పక్కనబెడితే ఎంతో మంచి వ్యక్తి. ఇన్సైడ్ బ్యూటిఫుల్. నాకు ఇచ్చిన మాట ప్రకారం అనుష్క నుంచి ప్రతి సెప్టెంబరులో నాకు ఓ ఐఫోన్ గిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు వాడుతున్న ఫోన్ కూడా అదే. 'భాగమతి' షూటింగ్ టైంలో నాకు ఐఫోన్ అంటే ఇష్టమని అనుష్కతో చెప్పాను. మూవీ హిట్ అయితే ఇవ్వాలని అన్నాను. అలా ఐఫోన్ నాకు గిఫ్ట్‌గా వస్తుంటుంది. యూవీ ఆఫీస్ నుంచి అనుష్క ద్వారా నా దగ్గరకు ఐఫోన్ వస్తుంది. అలానే అనుష్క అంటే నాకు ఇష్టం. తనే నా జీవితం. నేను ఇంతవరకు చూసిన బెస్ట్ హ్యుమన్ అనుష్క' అని తమన్ చెప్పుకొచ్చాడు.చివరగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలో కనిపించిన అనుష్క.. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. మరోవైపు తమన్ చెప్పినట్లు 'భాగమతి 2' కోసం రెడీ అవుతోంది. ఇందుకోసం ఫిట్‌గా మారే పనిలో ఉంది. అందుకే బయట కనిపించట్లేదు. సరే ఇవన్నీ పక్కనబెడితే అప్పుడెప్పుడో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఏడాది ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వడం విశేషమనే చెప్పాలి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్)#AnushkaShetty is My Life, She is Gold, Very Lovely Human.We are Working on #Bhaagamathie 2 🔥She is Fantastic Character, Beauty is Inside. She is Most Sweetest. Every Year September, I Get an IPhone from Her as She Promised.- @MusicThaman 😍❤️🔥 pic.twitter.com/GhK73j2Z2I— Sweety Cults ❤️ (@AnushkaCults) September 15, 2024 -
శ్రీలీల బుగ్గ గిల్లిన తమన్.. అంత పని చేశాడేంటి?
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. పెళ్లిసందడి మూవీతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ తర్వాత ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం లాంటి చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె నితిన్ సరసన రాబిన్ హుడ్ చిత్రంలో కనిపించనున్నారు. అంతేకాకుండా రవితేజతో మరోసారి జతకట్టేందుకు సిద్ధమైంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తాజాగా హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే అదే సమయంలో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న శ్రీలీలను అప్యాయంగా పలకరించారు. సరదాగా ఆమె బుగ్గలు గిల్లి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. శ్రీలీల నటించిన స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలకి తమన్ సంగీతమందించారు.திருப்பதியில் நடிகை ஸ்ரீலீலா..கூட்டத்தில் சிக்கிய நடிகை..பதறி போன பௌன்சர்ஸ்..! #thirupathi #sreeleela #thanthitv pic.twitter.com/SoCnn3jCE8— Thanthi TV (@ThanthiTV) June 25, 2024 -
డల్లాస్‌లో తమన్ భారీ మ్యూజికల్ ఈవెంట్.. ఎప్పుడో తెలుసా?
ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పలు పాన్ ఇండియన్ సినిమాలతో ఇతడు బిజీగా ఉన్నాడు. తమిళ, తెలుగు అనే తేడా లేకుండా ప్రతిచోట తమన్ పాటలు అదరగొట్టేస్తున్నాయి. ఎప్పుడు ఎంతో బిజీగా ఉండే ఇతడితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఓ మ్యూజికల్ ఈవెంట్ ప్లాన్ చేసింది.(ఇదీ చదవండి: పాయల్ రాజ్‌పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!)అమెరికాలోని డల్లాస్‌లో తమన్ అతి పెద్ద మ్యూజికల్ ఈవెంట్ చేయబోతున్నాడు. స్పైస్ టూర్ పేరుతో జరిగే ఈ కార్యక్రమం జూన్ 1న ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలో గుంటూరు కారం నుంచి 'దమ్ మసాలా' అంటూ తమన్ చేసిన హంగామాని చూపించారు. ఇప్పటివరకు డల్లాస్ లో జరగనంత భారీ ఎత్తున ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.(ఇదీ చదవండి: నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్) -
'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
'గుంటూరు కారం' నుంచి తాజాగా ఓ మాస్ పాట ప్రోమోని రిలీజ్ చేశారు. అభిమానులకు సాంగ్ నచ్చడం సంగతి పక్కనబెడితే ఊహించని విధంగా ఈ గీతం.. కాంట్రవర్సీకి కేరాఫ్ అయిపోయింది. అసలు ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న మహేశ్ బాబు.. ఇలాంటి పాటని ఎలా అంగీకరించాడా అని మాట్లాడుకుంటున్నారు. ఇదే టైంలో పాట ఓనర్ కుర్చీ తాత గురించి, పాట కోసం అతడికిచ్చిన రెమ్యునరేషన్ గురించి కూడా డిస్కషన్ చేస్తున్నారు. మహేశ్ బాబు కొత్త సినిమా 'గుంటూరు కారం'. దర్శకుడు త్రివిక్రమ్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే రెండు పాటలు రాగా అందులో 'దమ్ మసాలా' శ్రోతల్ని ఆకట్టుకోగా.. 'ఓ మై బేబీ' పాటపై ఓ రేంజులో ట్రోలింగ్ జరిగింది. తాజాగా మాస్ గీతం అని చెప్పి 'కుర్చీ మడతపెట్టి' అని సాగే ఓ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్-శ్రీలీల స్టెప్పులు బాగానే వేసినప్పటికీ లిరిక్స్‌పై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: 'సలార్' రూట్లోనే 'గుంటూరు కారం'.. ప్లాన్ బాగుంది కానీ?) హైదరాబాద్‌లోని కాలా పాషా అనే ఓ తాత.. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి చెబుతూ 'కుర్చీ మడతపెట్టి..' అని బూతు పదంతో కూడిన లైన్ వాడాడు. ఇది సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. ఇతడు కుర్చీ తాతగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడు మాటల్ని తమన్ పాటగా మార్చేశాడు. అయితే ఇందుకోసం కుర్చీతాతకు దాదాపు రూ.5 వేల ఇచ్చాడు తమన్. ఈ విషయాన్ని స్వయంగా సదరు ముసలాయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రోమోకే ఈ రేంజు ట్రోలింగ్ ఫేస్ చేస్తున్న 'గుంటూరు కారం' టీమ్.. జనవరి 12న సినిమా రిలీజయ్యేలోపే ఇంకెన్ని విమర్శలు ఎదుర్కొంటుందో ఏంటో? మహేశ్-శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమాని తల్లి-కొడుకు సెంటిమెంట్ ప్లస్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రీసెంట్‌గానే షూటింగ్ పూర్తి చేసుకుంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
గుంటూరు కారం తమన్ సాంగ్స్ పై మహేష్ బాబు సీరియస్!
-
శబ్దంతో థ్రిల్
దాదాపు పదిహేనేళ్లకు హీరో ఆది పినిశెట్టి–డైరెక్టర్ అరివళగన్–మ్యూజిక్ డైరెక్టర్ తమన్ల కాంబినేషన్ కుదిరింది. గతంలో ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఈరమ్’ (2009) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ‘వైశాలి’గా విడుదలైంది. ఇక తాజాగా వీరి కాంబోలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ‘శబ్దం’ తెరకెక్కుతోంది. ఇది కూడా సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం. 7ఎ ఫిలింస్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని హీరో నాని విడదల చేశారు. ‘‘ఈ ‘శబ్దం’లో శబ్దానికి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు ఉంటాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసమే రూ. 2 కోట్లతో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించాం. ఈ సినిమా కోసం తమన్ ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ చేయడానికి హంగేరీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ పద్మనాభన్, సహనిర్మాత: భానుప్రియ శివ, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: ఆర్. బాలకుమార్. -
Happy Birthday S Thaman: హ్యాపీ బర్త్‌డే సంగీత దర్శకుడు ఎస్ తమన్ (ఫోటోలు)
-
'శపథం' పూర్తి చేసిన స్టార్ హీరో
రంగస్థలం, నిన్నుకోరి తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటుడు ఆది పినిశెట్టి. ఇతడు హీరోగా నటించిన కొత్త మూవీ శపథం. అరివళగన్ దర్శకుడు. ఇంతకుముందు వీళ్ల కాంబోలో 'ఈరం' చిత్రాన్ని తీశారు. అది హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని తెలుగులో 'శబ్దం' పేరుతో రిలీజ్ చేయనున్నారు. (ఇదీ చదవండి: ‘పెదకాపు 1’ మూవీ రివ్యూ) హరర్, థ్రిల్లర్ సినిమాలతో తీయడంలో ఎక్స్పర్ట్ అయిన అరివళగన్.. అదే తరహా నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. సిమ్రాన్, లైలా, లక్ష్మీమేనన్, రెడిన్ కింగ్స్లీ తదితరులు నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతమందించాడు. కాగా శపథం షూటింగ్ పూర్తయినట్లు దర్శకుడు ప్రకటించాడు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. త్వరలో ఫస్ట్‌లుక్, ట్రైలర్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: రామ్ పోతినేని స్కంద.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?) -
మొదటిసారి తన ఫ్యామిలీ గురించి చెప్పిన తమన్
-
కొన్ని కారణాల వల్ల యాక్టర్ అవ్వలేకపోయాను లేదంటే..!
-
#RC15 లో నా మ్యూజికన్ను ఎవరూ అంచనావేయలేరు..!
-
మహేష్ త్రివిక్రమ్ సినిమా కు బ్రేక్?
-
తమన్ ట్యూన్స్ ప్రిన్స్ కు నచ్చడం లేదా?
-
మళ్లీ అడ్డంగా దొరికిపోయిన తమన్.. ట్రోలింగ్‌తో ఆడేసుకుంటున్నారు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్‌ఫాదర్. నిన్న(సోమవారం)చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా మ్యూజిక్‌పై ట్రోలింగ్ నడుస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా బీజీఎమ్ అచ్చం వరుణ్ తేజ్ గని టైటిల్ సాంగ్లా ఉందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తీరు మార్చుకోకుండా మక్కీకి మక్కీ దించేశాడంటూ తమన్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. మెగాస్టార్ సినిమాకు కూడా ఇలా కాపీ కొడతావా అంటూ నెటిజన్లు తమన్‌పై మండిపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను నెట్టింట వైరల్ చేస్తూ తమన్ తీరును ఎండగడుతున్నారు. కాగా గని సినిమాకు కూడా మ్యూజిక్ ఇచ్చింది తమనే కావడం విశేషం. Super @MusicThaman 👏 pic.twitter.com/AJeoHAyGDl — ʌınɐʎ (@CooIestVinaay) August 21, 2022 #GodFatherTeaser lone dorikipoyav ga ra #Thaman 🙄 pic.twitter.com/ND61touLV5 — ❄sesh💥 (@syam__SVS) August 21, 2022 -
ఆటా వేడుకలు: ముచ్చటగా మూడు రోజులు సందడే సందడి
వాషింగ్టన్ డీసీ వేదికగా జరగబోతున్న 17వ అమెరికన్ తెలుగు అసొసియేషన్ మహాసభలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు తన వేడుకలకు రంగం చేసింది. మొత్తం మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఏ రోజు ప్రత్యేకత దానికే ఉంది. ఆ వివరాలు.. జులై 1 మొదటి రోజు కన్వెన్షన్ సెంటర్లోని గ్రాండ్ లాబీలో వెల్కం రిసెప్షన్‌తో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ స్వరపరిచిన ప్రారంభోత్సవ గీతాన్ని గాయకులు కొమాండూరి రామాచారి ఆలపిస్తారు. అదే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేర్వేరు రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన తెలుగు ప్రముఖులకు అమెరికన్ తెలుగు అసొసియేషన్ అవార్డులందించనుంది. బాంకెట్ వేడుకల్లో సింగర్ రామ్ మిరియాల స్పెషల్ మ్యూజిక్ నైట్‌తో అలరించబోతున్నారు. జులై 2 రెండో రోజు ఉదయం నుంచే ఆటా పరేడ్ ప్రారంభం అవుతుంది. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. ఇదే రోజు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, యోగా గురు పద్మ విభూషణ్ సద్గురు జగ్గీ వాసుదేవన్ అతిథులతో మాట్లాడనున్నారు. అలాగే ఆటా కన్వెన్షన్‌లో భాగంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ రామచంద్రమిషన్ వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 75 ఏళ్లు పూర్తి చేసుకున్న రామచంద్రమిషన్ డైమండ్ జూబ్లీ సెలబ్రెషన్స్ నిర్వహిస్తారు. రెండో రోజు సాయంత్రం సంగీత దర్శకులు ఎస్.థమన్ నేతృత్వంలో విభావరి ఏర్పాటు చేశారు. జులై 3 మూడో రోజు ఉదయం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి కళ్యాణం నిర్వహించనున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అమెరికా చేరుకున్నారు. శ్రీనివాసుడి కళ్యాణంలో భాగంగా ప్రముఖ నేపథ్య గాయకులు పద్మశ్రీ శోభారాజు, నిహాల్ కొండూరి ఆధ్యాత్మిక సంగీతంతో ఆహూతులను భక్తి పరవశ్యంలోకి తీసుకెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం గ్రాండ్ ఫినాలేలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఇళయరాజా తన 32 మంది ట్రూప్‌తో అతిథులను అలరించనున్నారు. దీంతో పాటు ఆహుతుల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు, వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆటా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చిన అతిథులు.. ఎప్పటికీ మరిచిపోలేని విధంగా వేడుకలను డిజైన్ చేశారు. ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, ప్రజా సంబంధాలు, సెమినార్లు, వివాహా వేదికలు, మాటా ముచ్చట్లు.. చెప్పుకుంటూ పోతే.. మూడు రోజులు వాషింగ్టన్ డిసిలో పండగ వాతావరణం ఏర్పాటు కానుంది. ఆటా వేదికగా ఆట-పాట భారతీయులకు క్రికెట్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలుసు. అందుకే ఆటా నిర్వాహకులు ఇద్దరు లెజెండ్ క్రికెట్ క్రీడాకారులను ఈ కన్వెన్షన్‌కు తీసుకొస్తున్నారు. టాప్ క్లాస్‌తో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన సునీల్ గవాస్కర్, సిక్సర్ల మెరుపులతో అలరించే వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్.. యూత్ క్రికెట్ సరదాగా ఆడబోతున్నారు. అలాగే మరో లెజెండరీ ఆటగాడు కపిల్ దేవ్ కూడా కనువిందు చేయబోతున్నాడు. ఆటా సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో భాగంగా కపిల్ దేవ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, అమెరికన్ ప్రొఫెషనల్ గోల్ఫర్ సాహిత్ రెడ్డి తీగల ఆటా వేడుకల్లో సందడి చేయనున్నారు. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినీతారలు విచ్చేస్తున్నారు. హీరోలు అడవి శేషు, డైరెక్టర్లు శేఖర్ కమ్ముల, అర్జున్‌రెడ్డి ఫేం సందీప్ వంగా, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, నివేదా థామస్, డాన్స్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్, వీజే సన్నీ, సింగర్ రాం మిరియాల, సింగర్ మంగ్లీ.. ఇంకా పలువురు ప్రముఖులు వేడుకలకు వస్తున్నారు. సాహితీ వేత్తలు జొన్నవిత్తుల రాంజోగయ్య శాస్త్రి, సీనియర్ నటులు తనికెళ్ల భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అష్టవధానంతో అలరించబోతున్నారు. - వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
Mahesh Babu: రిపీట్ ఆడియన్స్ ఉంటారు.. రాసి పెట్టుకోండి
‘‘సర్కారువారి పాట’లో నా పాత్రని ఎక్స్ట్రార్డినరీగా తీర్చిదిద్దిన పరశురాంగారికి థ్యాంక్స్.. నాకు ఇష్టమైన పాత్రల్లో ఇదొకటి. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.. కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ‘పోకిరి’ రోజులు గుర్తొచ్చాయి’’ అని మహేశ్‌బాబు అన్నారు. పరశురాం దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వ హించిన ప్రీ రిలీజ్ వేడు కలో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘పరశురాంగారి కథ విని ఓకే చెప్పాను. ఆయన ఇంటికెళ్లిన తర్వాత.. ‘‘థ్యాంక్యూ సార్.. ‘ఒక్కడు’ చూసి డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చాను.. మీతో సినిమా చేసే అవకాశం ఇచ్చారు.. చూడండి ‘సర్కారు వారి పాట’ని ఎలా తీస్తానో.. ఇరగదీస్తాను’’ అని మెసేజ్ పెట్టారు. ‘థ్యాంక్యూ సార్. ఈరోజు మా నాన్నగారు (కృష్ణ), నా అభిమానులకు మీరు వన్నాఫ్ ది ఫేవరెట్ డైరెక్టర్స్. ఈ సినిమాలో చాలా హైలెట్స్ ఉంటాయి. వాటిలో హీరో హీరోయిన్ ట్రాక్ ఒకటి. ఈ ట్రాక్ కోసమే రిపీట్ ఆడియన్స్ ఉంటారు.. కచ్చితంగా.. రాసిపెట్టుకోండి. తమన్ నేపథ్య సంగీతానికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ బెస్ట్ వర్క్ ఇచ్చారు. ‘సర్కారువారి పాట’ సినిమా ‘పోకిరి’ని దాటుతుందని ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్‌గారు అనేవారు. ‘శ్రీమంతుడు’ సినిమాని ఎంత బాగా తీశారో ఈ సినిమాని అంతకంటే బాగా తీసిన కెమెరామేన్ మదిగారికి థ్యాంక్స్. ‘శ్రీమంతుడు, దూకుడు’ లాంటి బ్లాక్బ్లస్టర్స్ ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్.. మన కాంబినేషన్లో ‘సర్కారువారి పాట’ ఇంకో మరచిపోలేని బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నిర్మాత జి. ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ– ‘‘సర్కారువారి పాట’ పాటలు విడుదల కాగానే మూవీకి గుడ్ ఫీల్ వచ్చింది. ఏ సినిమా అయినా సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఫీల్ బాగుండాలి. రిలీజ్‌కి ముందే బాక్సాఫీస్ హిట్ అని ముద్ర వేసుకుంటున్న సినిమా ఇది’’ అన్నారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘మైత్రీ మూవీస్‌లో మహేశ్‌గారు ‘శ్రీమంతుడు’ చేశారు. అప్పుటికి మాకు అనుభవం లేకపోయినా మమ్మల్ని నమ్మి, సినిమా చేసి బ్లాక్‌బస్టర్ ఇచ్చి మాకు ఇండస్ట్రీలోకి పాజిటివ్ ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి మంచి సినిమా మాతో చేసిన పరశురాంకి థ్యాంక్స్. మే 12న మా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతోంది’’ అన్నారు. మనం సూపర్‌స్టార్‌ని (మహేశ్‌బాబు) ఎలా చూద్దామనుకుంటున్నామో పరశురాంగారు ఆ పాత్రని అలాగే డిజైన్ చేశారు. మే 12న మాకు డబుల్ బ్లాక్ బస్టర్’’ అన్నారు గోపీ ఆచంట. ‘‘నాకొక బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్నారు మహేశ్‌గారు. ఈ సినిమాతో మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు పరశురాం. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘మ మ మహేశ..’ పాట చూశా. ఈ పాట థియేటర్లో దద్దరిల్లిపోతుందని మాట ఇస్తున్నా. పరశురాం అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు.. తన డైలాగ్స్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడున్న బెస్ట్ మాటల రచయితల్లో తను ఒక్కడు. ‘గీత గోవిందం’ చూస్తే అంత సెన్సిటివ్‌గా చెప్పే ఆర్ట్ ఉంది. అలాంటి డైరెక్టర్ ఒక మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ‘సర్కారువారి పాట’లో చూస్తారు. ‘1 నేనొక్కడినే’ అప్పుడు మహేశ్‌గారు ఎంత సపోర్ట్ ఇచ్చారో నాకు తెలుసు. ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ సెట్లో కింగ్‌లా ఉంటాడు. డైరెక్టర్స్‌కి అంత నమ్మకాన్ని ఇస్తారు’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘మహేశ్‌గారికి బెస్ట్ మెలోడీ పాటలు ఇచ్చేందుకు ఎప్పుడూ ప్రయత్నించాను. ఫస్ట్ టైమ్ క్లాసికల్‌గా ‘కళావతి..’ పాట వినిపించినప్పుడు నాకు వందకు రెండొందల మార్కులు వేశారు’’ అన్నారు. మైత్రీ మూవీస్ సీఈఓ చెర్రీ, డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, మెహర్ రమేశ్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రెండేళ్లల్లో చాలా జరిగాయి.. చాలా మారాయి. నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు (చెమర్చిన కళ్లతో).. కానీ ఏది జరిగినా, ఏది మారినా మీ (ఫ్యాన్స్) అభిమానం మాత్రం మారలేదు.. అలానే ఉంది. ఇది చాలు ధైర్యంగా ముందుకెళ్లి పోవడానికి. ఈ 12న మీ అందరికీ నచ్చే సినిమా (సర్కారువారి పాట) రాబోతోంది.. మళ్లీ మనందరికీ పండగే. – మహేశ్‌బాబు -
తమన్ తొలి సంపాదన ఎంతో తెలుసా?
సంగీత దర్శకుడు తమన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఏ స్టార్ హీరో సినిమా అయిన దానికి సంగీత దర్శకుడు ఎవరు అంటూ తమన్ పేరే వినిపిస్తోంది. అంతేకాదు హీరోలు, డైరెక్టర్లు కూడా తమన్‌తోనే పని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతగా ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ మ్యూజిక్ సన్సెషన్ ఈ స్థాయికి ఊరికే రాలేదని, దాని వెనక ఎంతో కష్టం ఉందని చెప్పాడు. ఇటీవల ఓ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్య్వూలో తమన్ మాట్లాడుతూ ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: సుకుమార్‌పై నెటిజన్లు ఫైర్, ఆ వెబ్ సిరీస్‌ను కాపీ కొట్టాడా? ఈ క్రమంలో తన తొలి సంపాదన 30 రూపాయలని చెప్పాడు. ఈ మేరకు తమన్.. ‘మా నాన్న డ్రమ్స్ చాలా బాగా వాయించేవారు.. ఆయన చాలా సినిమాలకి పనిచేశారు. అందువలన సహజంగానే నాకు డ్రమ్స్ వాయించడం పట్ల ఆసక్తి పెరుగుతూ పోయింది. ఒకసారి మేమంతా ఢిల్లీలోని మా అత్తయ్య ఇంటికి వెళ్లి ట్రైన్ లో వస్తుండగా, మా నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది. ట్రీట్మెంట్ ఆలస్యం కావడంతో ఆయన చనిపోయారు. నాన్న చనిపోవడంతో ఆయన ఎల్ఐసి పాలసీకి సంబంధించి 60 వేల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బును ఇంట్లో వాడకుండా మా అమ్మ నాకు డ్రమ్స్ కొనిపెట్టింది. ఆ డ్రమ్స్‌తో నేను సాధన చేస్తూ డ్రమ్మర్‌గా ముందుకు వెళ్లాను. చదవండి: Pushpa Movie: అల్లు అర్జున్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు ఈ క్రమంలో నేను డ్రమ్మర్‌గా పనిచేసిన తొలి చిత్రం ‘భైరవద్వీపం’. ఆ సినిమాకి పని చేసినందుకు నాకు 30 రూపాయలు పారితోషికంగా ఇచ్చారు. అలా డ్రమ్మర్‌గా నా తొలి సంపాదనగా 30 రూపాయలు సంపాదించాను’ అని చెప్పుకొచ్చాడు. కాగా అఖండ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ ఎంత సన్సెషన్ అయ్యిందో తెలిసిందే. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మాస్ బీజీయంకు ఆమెరిక బాక్సాఫీసు సైతం దద్దరిల్లింది. కాగా ప్రస్తుతం తమన్ ‘భీమ్లా నాయక్’ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’, వరుణ్ తేజ్ ‘గని’, అఖిల్ ‘ఏజెంట్’తో పాటు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాకు కూడా తమన్ స్వరాలు అందిస్తున్నాడు. -
భీమ్లా నాయక్: కొత్త స్టిల్ అదిరిందిగా!
సాక్షి, హైదరాబాద్: మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘భీమ్లా నాయక్’ కు సంబంధించి ఒక ఫోటో వైరలవుతోంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్ తరువాత పవన్, రానా ఫోటోను ‘అన్‌వైండింగ్ ఆఫ్ ది కెమెరా’ అంటూ చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కోసం విడుదల చేసింది. ఛాతీ మీద గాయంతో నులకమంచం మీద పవన్ పడుకుని ఉంటే.. రఫ్ లుక్‌లో రానా ఎడ్లబండి మీద వయ్యారంగా పడుకున్న స్టిల్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. పవర్ వెర్సెస్ బీస్ట్ అని కమెంట్ చేస్తున్నారు. అలసిపోయి, షూటింగ్ దుస్తుల్లోనే అలా సేద తీరుతున్న దృశ్యాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో భాగంగా ఈ ఫోటోను క్లిక్ చేస్తున్నట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్న 'భీమ్లా నాయక్' సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దు కుంటోంది. పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమా టైటిల్ సాంగ్,టీజర్‌కు భారీ క్రేజ్ రాగా, ఇక నిత్యమీనన్ 'అంత ఇష్టం ఏందయ్యా' అంటూ సాగే సెకండ్ సాంగ్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి స్క్రీన్ ప్లే త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశి. పవన్ జోడీగా నిత్యా, రానాకి భార్యగా నటి సంయుక్త మీనన్ కనిపించనున్నారు. Unwinding off the camera #BheemlaNayak & #DanielShekar ♥️💥@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/JfPeOq21ai — Sithara Entertainments (@SitharaEnts) October 21, 2021 -
లేట్‌గా లేటెస్ట్గా దుమ్మురేపుతున్న బుట్టబొమ్మ
హైదరాబాద్ : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలోని పాటలు సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందు సామజవరగమన, రాములో రాములా సాంగ్ సన్సేషన్ క్రియేట్ చేయగా.. సినిమా విడుదలయ్యాక బుట్టబొమ్మ వీడియో సాంగ్ దుమ్ము రేపుతోంది. ఇటీవల ఈ సాంగ్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా చిందులేశాడంటే ఈ సాంగ్‌కు క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బుట్టబొమ్మ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్ ట్విటర్లో వెల్లడించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను.. అర్మాన్ మాలిక్ పాడారు. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించగా.. బన్నీ, పూజా హెగ్డే వేసిన స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడంలో అందులోని పాటలు కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. #200millionforbuttabomma #ButtaBomma #Unstoppableavpl #AlaVaikunthapurramuloo album ♥️🎬🎛 My love @alluarjun gaaru my respect to #trivikram gaaru ♥️ It’s the love & trust of them @ramjowrites @haarikahassine @vamsi84 @GeethaArts 🎧✊⭐️⭐️⭐️⭐️⭐️ pic.twitter.com/kAPxY6SgOc — thaman S (@MusicThaman) May 31, 2020 -
150 మిలియన్ మార్క్ దాటిన ‘బుట్టబొమ్మ’
‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలోని బుట్టబొమ్మ పాట విడుదలైనప్పటి నుంచి సెన్సేషన్స్ క్రియోట్ చేస్తూ కొత్త రికార్డులను బద్దలు కొడుతుంది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్‌లో 150 మిలియన్ వ్యూస్ మార్క్‌ని దాటేసింది. అతి తక్కువ సమయంలో ఈ రికార్డును సంపాదించిన మొదటి సౌత్ ఇండియన్ సాంగ్‌గా అరుదైన ఘనతను నమోదుచేసింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరి నోళ్లలో అలవోకగా నానుతూ బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అందరిచేతా స్టెప్పులేయించింది ఈ పాట. (ఈ క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా లేదు! ) రామజోగయ్య శాస్ర్తి రచించిన ఈ పాటకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. అల్లు అర్జున్ , పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్పులు ఎంతో ఆకట్టుకున్నాయి. బుట్టబొమ్మ పాట క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మొన్న బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఈ పాటకు చిందులేయగా, తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి సాంగ్‌కు స్టెప్పులేసి బుట్టబుమ్మ పాట సరిహద్దులు దాటేసింది అని నిరూపించారు. బుట్టబొమ్మ పాట ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. (వార్నర్‌కు థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్) -
సామజవరగమన పాటకు కేటీఆర్ ఫిదా
సామజవరగమన.. ఈ పాట కొన్ని కోట్ల మందిని ఆగం చేసింది. రింగ్ టోన్, కాలర్ ట్యూన్ ఇలా ఎక్కడ చూసినా ఇదే పాట. ప్రతి ఒక్కరికీ మత్తులా ఎక్కేసిన ఈ పాటకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనలో ఉన్న ఆయన తనను మైమరపింపజేసిన సామజవరగమన.. పాటను ప్రశంసిస్తూ మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. ‘విమానం కాస్త ఆలస్యమైంది. అప్పుడు స్విట్జర్లాండ్‌లో ఉదయం 3.30 అవుతోంది. ఆ సమయంలో సామజవరగమన పాట విన్నాను. నాకు మంచి కంపెనీ ఇచ్చిందీ సాంగ్. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ పాట వెంటనే నా ప్లేలిస్ట్‌లో చేరిపోయింది. థమన్.. ఈ సాంగ్‌తో మిమ్మల్ని మీరే మించిపోయారు’ అని పేర్కొన్నారు. దీనికి సంగీత దర్శకుడు ఎస్.థమన్ స్పందిస్తూ మీ నుంచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉందంటూ కేటీఆర్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు. మీ వల్ల సామజవరగమన పాట మరింత సెన్సేషనల్ అవుతుందని ట్వీట్ చేశాడు. కాగా అల వైకుంఠపురం సినిమాలోని ప్రతి పాట ప్రేక్షకుల చేత సూపర్ హిట్ అనిపించుకున్న విషయం తెలిసిందే. ఇక జనవరి 12న విడుదలై సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం గత చిత్రాల రికార్డులను తుడిచిపెట్టుకుపోతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. Sirrrrrrrr coming this from the man I look upto ♥️ @KTRTRS u have made our song more sensational ✊More power & more love to U sir ✨Happy to knw tat our #sensationalsamajavaragamana is making ur day 🥁🥁🥁We have got the best now 💿💿💿💿#godbless https://t.co/MUtOtGVKP4— thaman S (@MusicThaman) January 21, 2020 చదవండి: సైరా రికార్డును తుడిచేసిన అల వైజాగ్‌లో సినీ పరిశ్రమ నెలకొల్పాలి కష్టాన్నంతా మరచిపోయాం – తమన్ -
‘రాములో రాములా..నన్నాగం చేసిందిరో’
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అల వైకుంఠపురములో..’. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఎంతటి హిట్ టాక్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోసారి వీరిద్దరూ కలిసి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని బన్నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్, బన్నీ డైలగ్, ఫస్ట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాట టీజర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. పూర్తి సాంగ్‌ను దీపావళి కానుకగా ఈ నెల 26న విడుదల చేయనున్నారు. ‘రాములో..రాములా నన్నాగం చేసిందిరో’అని సాగే పాటకు తమన్ సంగీతం అందించగా అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఇక ఈ పాట కూడా అభిమానులను ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా’అని సాగే సాంగ్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు ఏడు లక్షల లైక్‌లు సాధించిన తొలి తెలుగు పాటగా ‘సామజవరగమన’చరిత్ర సృష్టించింది. ఇక తాజాగా విడుదల చేసిన పాట ఇదే ఊపులో భారీ హిట్ సాధించే అవకాశం ఉంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’సినిమా ఫలితం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ త్రివిక్రమ్ సినిమాతో భారీ హిట్ కొట్టి అభిమానులకు కానుకగా ఇవ్వాలని ఆరాటపడుతున్నాడు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టబు, జయరామ్, సుశాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. -
రేపే ‘సామజవరగమన’
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. వీరి కాంబినేషన్లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సూపర్ హిట్ చిత్రాలు రాగా.. మరోసారి ప్రేక్షకులకు ఆ మ్యాజిక్ చూపించేందుకు సిద్దమయ్యారు. అల వైకుంఠపురంలో అంటూ విడుదలైన చేసిన టీజర్, టైటిల్, అల్లు అర్జున్ లుక్ ఇలా అన్నింటిపైనా.. పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక తాజాగా ఈ మూవీలోని పాటలు రిలీజ్ చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. ఇందులో భాగంగా.. సామజవరగమన అనే పాటను రేపు (సెప్టెంబర్ 28) ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సాంగ్ ప్రోమోకు విపరీతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. గీతాఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నాడు. The most awaited first single & an enchanting melody from our album, #AlaVaikunthapurramuloo, #Samajavaragamana will be out tomorrow at 10:00am! Lyrics: Seetharama Sastry garu Singer: @sidsriram A @musicthaman Musical!@alluarjun #Trivikram @hegdepooja pic.twitter.com/xIbjn967n2 — Geetha Arts (@GeethaArts) September 27, 2019 -
బన్నీ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురంలో అంటూ రిలీజ్ చేసిన పోస్టర్, అల్లు అర్జున్ డైలాగ్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. నా పేరు సూర్య తరువాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ.. తనపై వచ్చే ప్రశ్నలన్నీంటికి ఒక్క డైలాగ్‌తో పంచ్ వేసినట్టు ఫుల్ ఫేమస్ అయింది. ఫుల్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సాంగ్స్‌ను విడుదల చేసేందకు రంగం సిద్దమైనట్లు కనిపిస్తోంది. మామూలుగా అయితే వీరి కాంబినేషన్లో సినిమా అంటే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తాడని అందరూ అనుకుంటారు. కానీ, ఈ చిత్రానికి థమన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకున్నారు. ఈ మూవీలోని పాటలు విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీగా ఉందని తెలుస్తోంది. పూజా హెగ్డే, టబు, నవదీప్, సుశాంత్, సునీల్ లాంటి తారాగణం నటిస్తున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్,హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. A hush hush surprise for all the Stylish Star @alluarjun fans from #AlaVaikunthapurramuloo! A @musicthaman Musical! Coming Soon... 🎶🎹 pic.twitter.com/K9zMrgJVjj — Geetha Arts (@GeethaArts) September 23, 2019 -
సరిగమల సమావేశం
అనుకున్న సమయానికి చిత్రీకరణను పూర్తి చేయాలని అల్లుఅర్జున్ అండ్ టీమ్ నాన్‌స్టాప్‌గా వర్క్ చేస్తున్నట్లున్నారు. అటు సన్నివేశం.. ఇటు పాటలను ఒకేసారి కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. అల్లుఅర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, నివేతాపేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. టబు, సుశాంత్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు తెలిసింది. హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు అల్లుఅర్జున్, త్రివిక్రమ్‌లతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేశారు తమన్. అక్కడి ఫొటోను షేర్ చేస్తూ– ‘‘మా సినిమా మ్యూజిక్ మంచి ప్రాసెస్‌లో, స్పీడ్ ప్రోగ్రెస్‌లో ఉంది’’ అని తమన్ పేర్కొన్నారు. మరి... వీరి సరిగమల సమావేశం శ్రోతలను ఎంతలా ఆకట్టుకుంటాయో చూడాలంటే కాస్త ఓపికపట్టాల్సిందే. -
మ్యూజిక్ సిట్టింగ్‌లో బిజీగా తమన్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు బాగానే శృతి కుదిరినట్టు కనిపిస్తోంది. వీరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత భారీ హిట్‌ను సాధించడమే కాకుండా మ్యూజికల్‌గానూ వర్కౌట్ అయింది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్‌కు కూడా తమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అందులో సంగీత దర్శకుడు కచ్చితంగా దేవీ శ్రీ ప్రసాద్ అనే అనుకుంటారు అభిమానులు. అయితే ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ.. ప్రస్తుతం బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతోన్న మూవీకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న విషయం తెలిసిందే. అల్లుఅర్జున్-త్రివిక్రమ్-తమన్ మొదటిసారి కలిసి పనిచేస్తుండటంతో అంచనాలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే మ్యూజిక్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని తమన్ ట్విటర్ ద్వారా తెలిపాడు. మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతున్నాయని అదే ప్రాసెస్‌లో ఉన్నామని ట్వీట్ చేశాడు. #AA19 And we r on process with our music 🎶 The master of writing ✍️ #trivikram sir & our #stylishstar @alluarjun ♥️#AATT 🎵 pic.twitter.com/KB4MXtnqV4 — thaman S (@MusicThaman) June 23, 2019 -
మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీ బిజీ
‘నా పేరు సూర్య’ ఇచ్చిన షాక్‌తో దాదాపు ఏడాది పాటు ఏ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పని స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన కొత్త ప్రాజెక్ట్‌ల వివరాలను ప్రకటించారు. ఏకంగా మూడు సినిమాలకు ఓకే చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మొదటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో.. కలిసి సినిమా చేయనున్న బన్నీ.. తరువాత సుకుమార్, వేణు శ్రీరామ్‌తో కలిసి పనిచేయనున్నాడు. త్రివిక్రమ్‌తో చేయబోయే మూవీ షూటింగ్ ఈ నెల 24నుంచి ప్రారంభం కానుంది. ఈలోపే మ్యూజిక్ సిట్టింగ్‌కు స్టార్ట్ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్, సిరివెన్నెలతో కలిసి ఉన్న ఫోటోను థమన్ షేర్ చేశారు. ఈ చిత్రంలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటించనున్నారు. -
తమన్ సెంచరీ కొట్టేశాడు!
టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ దూసుకుపోతున్నాడు. కొత్తదనం లోపిస్తుందని, కాపీ క్యాట్ అని థమన్ సంగీతంపై విమర్శలు వినిపిస్తున్నా.. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏమాత్రం జోరు తగ్గడం లేదు. తాజాగా ‘అరవింద సమేత’తో మరో హిట్‌ను కొట్టాడు. థమన్ సంగీతం గురించి చెపుతూ.. అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లు థమన్‌ను ఆకాశానికెత్తేశారు. సినిమా సక్సెస్ కావడంలో తమన్ అందించిన బ్యాగ్రౌండ్ కూడా కీలకపాత్ర పోషించిందని అందరూ ప్రశంసించారు. అయితే ఈ సినిమా తనకు వందో చిత్రమని థమన్ ట్వీట్ చేశాడు. తన వందో సినిమాగా అరవింద సమేత చేసినందుకు చాలా సంతోషంగా ఉందని థమన్ తెలిపాడు. Super Stoked on my #100th -#AravindaSametha Thnks for making me the #centurion !! Extremely blessed to have #blockbusteraravindhasametha as my 💯Th movie !! 🎥#Trivikram sir @tarak9999 @haarikahassine pic.twitter.com/7SK2SXS2To — thaman S (@MusicThaman) November 1, 2018 -
కూల్‌గా కూర్చున్న మాటల మాంత్రికుడు!
అరవింద సమేత అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు త్రివిక్రమ్. గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తోన్న మాటల మాంత్రికుడు ప్రస్తుతం కూల్‌గా కూర్చున్నాడు. అజ్ఞాతవాసి పరాజయం తరువాత ఎన్టీఆర్‌తో చేస్తున్న ఈ సినిమాపై త్రివిక్రమ్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ కూల్‌గా కూర్చున్న ఫోటోను తమన్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఫోటోతో పాటు.. ‘ మనతో పని చేసే డైరెక్టర్ కూల్‌గా మనతో ఉంటే.. మంచి కూల్ ట్రాక్స్ వస్తాయి.. నాకు ఆయనతో ప్రతిరోజూ కూల్‌గానే ఉంటుంది.. పాటలు పూర్తికావొస్తున్నాయి’ అంటూ పోస్ట్ చేశాడు. When ur director is super cool at work !! Tat awesome feel u get to compose some super cool tracks !! ♥️ Every day with him is a new cool daY . #trivikram sir #AravindhaSametha #compositions nearing completion 💪🏼🎶 pic.twitter.com/RFlmNIteAE — thaman S (@MusicThaman) July 15, 2018 -
మొదలైన అఖిల్ మూడో సినిమా!
‘అఖిల్’ సినిమాతో అక్కినేని అఖిల్‌కు దారుణమైన పరాజయం ఎదురైంది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ‘హలో’ సినిమా చేశాడు. ఈ సినిమా విజయవంతమైనా.. కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. అయితే ప్రస్తుతం అఖిల్ తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. మొదటి చాన్స్‌లోనే ‘తొలిప్రేమ’ లాంటి సినిమాను తీసి డైరెక్టర్‌గా తన టాలెంట్ చూపారు వెంకీ అట్లూరి. తన రెండో చిత్రంగా అఖిల్‌తో ఓ సినిమాను చేయబోతోన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వీరి కాంబినేషన్లో రాబోతోన్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు (జూన్ 21) ప్రారంభమైనట్లు చిత్ర నిర్మాత ప్రకటించారు. ఈ సినిమాను ఎస్వీసీసీ క్రియేషన్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా, తమన్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటించనుంది. #Akhil3 starts rolling today. Directed by @dirvenky_atluri. A @MusicThaman musical.@George_DOP handles the camera.@AkhilAkkineni8 #SVCC25 pic.twitter.com/F60LN1IAwY — SVCC (@SVCCofficial) June 21, 2018 -
పెళ్లి కుదిరాక...
‘‘పెళ్లి కుదిరిన రోజు నుంచి పెళ్లి జరిగే వరకూ రెండు కుటుంబాల మనసుల్లో ఏం జరుగుతుందో మా సినిమాలో చూపించాం’’ అంటున్నారు ‘హ్యాపి వెడ్డింగ్’ చిత్రబృందం. సుమంత్ అశ్విన్, నిహారికా జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా నిర్మిస్తున్న చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు తమన్ రీ–రీకార్డింగ్ చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూవీ క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌తో కలసి ఈ సినిమా చేస్తున్నాం. లక్ష్మణ్ విజన్ ఉన్న దర్శకుడు. ఇప్పుడీ ప్రాజెక్ట్‌లోకి తమన్ ఎంటర్ అయ్యారు. తనదైన రీ–రికార్డింగ్‌తో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నారు. త్వరలోనే సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
ఆపేది లేదు!
ఘట్టం ఏదైనా... పాత్ర ఏదైనా... ఎన్టీఆర్ రెడీ. అందుకు ఆయన ఎంతైనా కష్టపడతారు. థియేటర్లో ప్రేక్షకులను ఖుషీ చేస్తారు. ఈసారి ఆడియన్స్‌కు డబుల్ ఫన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. తివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మాణంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. పూజాహెగ్డేను కథానాయికగా ఎంపిక చేశారు. తమన్ స్వరకర్త. ఈ సినిమాలోని కొత్త లుక్ కోసం హాలీవుడ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ నేతృత్వంలో జిమ్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా కోసం ఆల్రెడీ ఆయన 20 కేజీల బరువు తగ్గారు. పక్కన ఉన్న ఫొటోలో చూశారుగా..ఎన్టీఆర్ కష్టాన్ని కూడా ఇష్టంగా ఫీలై ఎలా వర్కౌట్స్ చేస్తున్నారో. ‘‘ట్రైనర్ అండ్ క్లైంట్ గుడ్ రిజల్ట్ కావాలనుకున్నప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు. అనుకున్న రిజల్ట్ వచ్చేవరకూ ఆపేది లేదు’’ అన్నారు లాయిడ్. ఎన్టీఆర్ కొత్త లుక్ చూసి అందరూ ఇంప్రెస్ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 12న స్టార్ట్ కానుందని టాక్. మరోవైపు సాంగ్స్ వర్క్‌ను ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు తమన్. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో కథనం సాగుతుందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఫ్యామిలీ డ్రామా అంటున్నారు. మరి.. ఈ విషయంపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయన మరోసారి తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. అంటే బుల్లి అభిరామ్‌కు తమ్ముడో.. చెల్లాయో రాబోతున్నారు. మేలో ప్రణతి డెలివరీ. రీసెంట్గా ఎన్టీఆర్, ప్రణతి కలిసి దిగిన ఫొటోను పైన చూడొచ్చు. -
ఇక షురూ!
ఈ ఏడాది ఉగాది రోజున స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు యంగ్ హీరో అఖిల్. తన తర్వాతి చిత్రాన్ని ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయబోతున్నట్లు వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎన్ఎస్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ సినిమా వర్క్ షురూ అయ్యింది. ‘‘న్యూ బిగినింగ్స్. ఫ్రెండ్స్ వెంకీ అట్లూరి, తమన్‌ని కలిశాను. వాళ్ల గురించి పూర్తిగా తెలసుకుంటాను. మేమంతా మంచి టీమ్ వర్క్ చేసి బెస్ట్ అవుట్‌పుట్ రావడానికి కష్టపడతాం’’ అన్నారు అఖిల్. ‘‘మంచి ఎనర్జీతో, మంచి ఆలోచనలతో కొత్త సినిమా పని ప్రారంభించాం’’ అన్నారు వెంకీ అట్లూరి. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం బ్యాంకాంక్‌లో జరుగుతుందని సమాచారం. -
గోల్మాల్ చేస్తున్న తమన్
అవునండీ... నిజమే తమన్ గోల్‌మాల్‌తో బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని అయనే స్వయంగా చెప్పారు. గోల్మాల్ అంటే ఏదో జిమ్మిక్ అనుకునేరు. స్రై్టట్గా చెప్పాలంటే బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించనున్న ‘గోల్మాల్ ఎగైన్’ చిత్రానికి తమన్ సంగీత దర్శకునిగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్, పరిణితి చోప్రా జంటగా నటిస్తున్నారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘సింగమ్ రిటర్న్స్’, ‘దిల్వాలే’ వంటి హిట్ చిత్రాలతోపాటు, బంపర్‌హిట్ ‘గోల్మాల్’ సిరీస్‌కు రోహిత్ శెట్టినే డైరెక్టర్. 2008లో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన తమన్ మాస్ బీట్స్‌తో సౌత్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. ‘గోల్మాల్ ఎగైన్’తో నార్త్‌లో కూడా నిరూపించుకుని, ఎగైన్ అండ్ ఎగైన్ అవకాశాలు తెచ్చుకుంటారేమో చూడాలి. -
మెగా 151పై మరో అప్డేట్..!
ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ సినిమా మరింత భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. మరోసారి రామ్ చరణ్ నిర్మాణంలోనే సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఇప్పటికే మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఓకె చేశాడన్న ప్రచారం జరుగుతుంది. యూనిట్ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్ రిజిస్టర్ చేయించడంతో మెగా 151 సినిమా ఇదే అన్న టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా ధృవ లాంటి క్లాస్ హిట్ ను అందించిన సురేందర్ రెడ్డి మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పటికే మెగా 151 పనుల్లో బిజీ అయిన సూరి, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభించాడన్న టాక్ వినిపిస్తోంది. సంగీత దర్శకుడు తమన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి దిగిన సెల్ఫీని ట్వీట్ చేసిన తమన్, 'నా కిక్.. నా రేసుగుర్రం.. మరి ఇప్పుడు..???' అంటూ కామెంట్ చేశాడు. దీంతో అభిమానులు తమన్, మెగా మూవీపై హింట్ ఇచ్చాడని సంబరపడిపోతున్నారు. With my very own sensation my kick my racegurram and now .??? ♥️♥️♥️♥️♥️♥️ pic.twitter.com/qkasUZesTD — thaman S (@MusicThaman) 8 April 2017 -
అమ్మ దర్శకత్వంలో జేడీ
కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకునిగా మారి ‘రణం’ వంటి హిట్ చిత్రం తీసిన విషయం తెలిసిందే. తాజాగా జేడీ చక్రవర్తి హీరోగా నక్షత్ర మీడియా పతాకంపై నక్షత్ర రాజశేఖర్ నిర్మాణ సారధ్యంలో ‘అమ్మ’ రాజశేఖర్ ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ‘‘నేను గురువుగా భావించే వ్యక్తి జేడీగారు. ఆయన్ను డైరెక్ట్ చేయడం సంతోషంగా ఉంది. తమన్ సంగీతం, అంజి కెమేరా, గౌతంరాజు ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు. -
సూపర్ స్టార్‌తో మరో సినిమా
సూపర్ స్టార్ మహేష్ బాబు, తన సినిమాలకు ఎప్పుడు సాంకేతిక నిపుణులుగా ఒకే టీంను కంటిన్యూ చేస్తుంటాడు. అప్పటికే స్టార్ ఇమేజ్ ఉన్న టెక్నిషియన్స్తోనే కలిసి పనిచేసేందుకు ఇష్టపడే మహేష్, ఎక్కువగా తన సినిమాలకు మణిశర్మతో మ్యూజిక్ చేయించుకున్నాడు. ఆ తరువాత దేవీ శ్రీ ప్రసాద్ టాప్ పొజిషన్‌కు రావటంతో తనతో మ్యూజిక్ చేయించుకున్నాడు. కానీ థమన్ విషయంలో మాత్రం ముందే స్పందించాడు. తమన్ కెరీర్ స్టార్టింగ్‌లోనే దూకుడు సినిమా ఇచ్చిన మహేష్, తరువాత బిజినెస్‌మేన్, ఆగడు సినిమాలకు కూడా థమన్‌తో కలిసి పనిచేశాడు. అయితే తాజాగా మరోసారి థమన్, మహేష్ బాబు సినిమాకు సంగీతం అందిస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన థమన్, ఏ సినిమాకు మహేష్‌తో కలిసి పనిచేయబోయేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం మహేష్, మురుగదాస్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత పీవీపీ బ్యానర్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు మహేష్. అయితే ఈ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు గోపిసుందర్ మ్యూజిక్ చేస్తాడన్న టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం ప్రకటించిన సినిమాలకు సంగీత దర్శకుడు దాదాపుగా ఫిక్స్ అయిపోయారు, మరి థమన్ సంగీతం అందించే సినిమా ఎవరితో ఉంటుందో చూడాలి. -
గాయకుడిగా మారిన అల్లు శిరీష్
సౌత్ హీరోలు గాయకులుగా కూడా సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా తమన్ సంగీత సారధ్యంలో చాల మంది హీరోలు తమ గొంతును సవరించుకుంటున్నారు. సింగర్ వాయిస్‌తో సంబందం లేకుండా టెక్నాలజీని ఉపయోగించి ప్రతీ ఒక్కరినీ గాయకులుగా మార్చేస్తున్నాడు తమన్. ఇప్పటికే ఎన్టీఆర్, రవితేజలతో పాటు ధనుష్, శింబు లాంటి తమిళ స్టార్లతో కూడా తెలుగు పాటలు పాడించాడు తమన్. అదే బాటలో మరో యంగ్ హీరోను సింగర్‌గా మార్చేశాడు. ఇటీవల శ్రీరస్తు శుభమస్తు సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన అల్లు వారబ్బాయి శిరీష్‌తో ఓ పాట పాడించాడు తమన్. అయితే ఈ పాటను సినిమాలో యాడ్ చేయకపోయినా యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన తమన్, ఈ గాయకుడు ఎవరో గుర్తుపట్టమంటూ పజిల్ విసిరాడు. అయితే పాట పాడుతున్నప్పుడు అర్థం కాకపోయినా మధ్యలో వచ్చిన డైలాగ్స్‌లో మాత్రం అది శిరీష్ వాయిసే అని అర్ధమైపోతోంది. ఇదే జోష్‌లో తన నెక్ట్స్ సినిమాలో కూడా శిరీష్ పాటపాడేస్తాడేమో చూడాలి. So! It was me who sang the cover version of 'Anu Anu' song. Here's the full version. Lemme know what you felt. https://t.co/vwfc76MUOo — Allu Sirish (@AlluSirish) 17 August 2016 -
చిరు సినిమాకు తమన్ మ్యూజిక్
తెలుగు సినీ రంగంలో పనిచేస్తున్న ప్రతీ సాంకేతిక నిపుణుడు ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయాలనుకుంటారు. ఇక యంగ్ జనరేషన్ టెక్నిషియన్స్ అయితే చిరు చాన్స్ ఇస్తే చాలని ఎదురుచూస్తుంటారు. అలాంటి గోల్డెన్ ఛాన్స్.., మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తలుపు తట్టింది. స్వయంగా చిరంజీవే తన నెక్ట్స్ సినిమాకు.. తమన్ సంగీత దర్శకుడంటూ ప్రకటించాడు. అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన శ్రీరస్తు శుభమస్తు ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీరస్తు శుభమస్తు పాటలు చాలా బాగున్నాయన్న చిరు, తన నెక్ట్స్ సినిమాకు తమన్ సంగీతమందిస్తాడంటూ సభాముఖంగా ప్రకటించాడు. ఇప్పటికే అందరు అగ్రహీరోలతో కలిసి పనిచేసిన తమన్, చిరు సినిమాకు కూడా మ్యూజిక్ చేస్తే ఇక అందరు హీరోలను కవర్ చేసినట్టే. ప్రస్తుతం తన 150 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ఇన్నాళ్లు హీరోయిన్ ఫైనల్ కాకపోవటంతో కాస్త స్లోగా నటించిన షూటింగ్ పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి. అనుకున్నట్టుగా జనవరి నాటికి సినిమాను సిద్ధం రెడీ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. వెంటనే తన 151వ సినిమాను కూడా మొదలెట్టే ఆలోచనలో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. -
రచయితగా మారిన స్టైలిస్ట్
నీరజ కోన.. సినీ ఇండస్ట్రీతో పరిచయం ఉన్న వారికి సుపరిచితమైన పేరు. ప్రముఖ రచయిత కోన వెంకట్ సోదరిగానే కాక, టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌కు స్టైలిస్ట్‌గా కూడా నీరజ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే నీరజ ఇప్పుడు తన లోని మరో టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. ఇప్పటి వరకు ఫ్యాషన్ డిజైనర్‌గా మాత్రమే తెలిసిన ఈమె, ఇప్పుడు అన్న బాటలో అడుగులు వేస్తూ కలం పట్టుకుంది. సాయి ధరమ్ తేజ్ హీరో సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తిక్క సినిమా కోసం ఓ పాట రాసింది. ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్ తో ఉన్న స్నేహం కారణంగా పాట రాసేందుకు అంగీకరించిన నీరజ, తమన్‌తో పాటు హీరో, దర్శకనిర్మాతలను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో వెళ్లిపోకే అని పాట రాసిన నీరజ ఇక ముందు కూడా గేయ రచయిత్రిగా కొనసాగుతుందేమో చూడాలి. -
మెగా హీరో తిక్క చూపిస్తున్నాడు
రేయ్ సినిమా నుంచి సుప్రీమ్ వరకు తన ఇమేజ్ను మార్కెట్ రేంజ్‌ను అంచలంచెలుగా పెంచుకుంటూ వస్తున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చినా, తన మార్క్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తిక్క సినిమాలో నటిస్తున్నాడు సాయి. ఈ సినిమాలో ఫుల్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్న సాయి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. కలర్ ఫుల్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్లో గుర్రమీద కూర్చున్న సాయి, ఒక చేత్తో బేబి ట్రంపెట్‌ను వాయిస్తూ మరో చేత్తో బీర్ బాటిల్‌ను పట్టుకున్నాడు. టైటిల్‌కు తగ్గట్టుగానే పోస్టర్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు చిత్రయూనిట్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మాత. -
బాలయ్య 'డిక్టేటర్' ఆలస్యం అవుతుందా..?
తమిళనాట సామాన్య ప్రజానీకంతో పాటు సినీ రంగాన్ని కూడా వరదలు ఇబ్బందులకు గురిచేశాయి. ముఖ్యంగా సినీరంగానికి సంబంధించిన ఎడిటింగ్, మిక్సింగ్, రీ రికార్డింగ్ స్టూడియోలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందులు తెలుగు ఇండస్ట్రీకి కూడా తప్పటం లేదు. తెలుగు సినిమాలకు పనిచేసే చాలా మంది సాంకేతిక నిపుణులకు చెన్నైలో స్టూడియోలు ఉన్నాయి. ఇప్పుడు అదే సమస్యగా మారింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ డిక్టేటర్. బాలయ్య 99వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ స్టూడియో చెన్నై వరదల్లో పూర్తిగా దెబ్బతింది. దీంతో డిక్టేటర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇంజనీర్లు తమన్ స్టూడియోను బాగుచేసే పనిలో ఉన్నా ఆ పనులు పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుంది అన్న విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. తమన్ స్టూడియో అందుబాటులోకి రాని పక్షంలో మణిశర్మ లేదా చిన్నాతో రీ రికార్డింగ్, డిటియస్ వర్క్స్ పూర్తి చేయించాలని భావిస్తున్నాడు దర్శకుడు శ్రీవాస్. వీటిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న మరికొంత సమయం పడుతుంది కాబట్టి అనుకున్నట్టుగా డిక్టేటర్ సంక్రాంతి రిలీజ్ చేయటం వీలౌతుందా..లేదా..? అనే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. -
సేవతో తృప్తి
‘సేవా కార్యక్రమాలకు చేయూతని అందించడం ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుంది’ అన్నారు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్. గతంలో హుద్ హుద్ బాధితుల కోసం హార్డ్‌రాక్ కెఫెలో మ్యూజిక్ షో నిర్వహించి, రూ.6లక్షలు అందించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అదే విధంగా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం కోసం ఈ నెల 28న శిల్పకళావేదికలో సాయంత్రం 6గంటల నుంచి సంగీత ప్రదర్శన నిర్వహించనున్నామన్నారు. తన ట్రూప్‌తో పాటు పలువురు ప్రసిద్ధ గాయనీ గాయకులు పాల్గొంటారని, వేరే ఎటువంటి ప్రసంగాలు, ప్రదర్శనలు లేకుండా నిర్విరామంగా రెండున్నర గంటల పాటు సంగీత సందడి కొనసాగుతుందని చెప్పారు. -
తెరకు అందాన్నిచ్చే హీరో మహేశ్ : శంకర్
‘‘మహేశ్ సినిమాలు మొదట్లో పెద్దగా చూడలేదు. ‘ఒక్కడు’ నుంచి రెగ్యులర్‌గా చూడ్డం మొదలుపెట్టాను. అతని సినిమాల్లో ‘దూకుడు’ నా ఫేవరెట్ మూవీ. తెరకు అందాన్నిచ్చే హీరో మహేశ్. ఎమోషన్, రొమాన్స్, కామెడీ.. ఇలా ఏ రసాన్నయినా కొలత ప్రకారం చేయడం మహేశ్‌లోని ప్రత్యేకత’’ అని ప్రముఖ దర్శకుడు శంకర్ అన్నారు. మహేశ్ కథానాయకునిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘ఆగడు’. సంగీత దర్శకునిగా తమన్ 50వ చిత్రమిది. ఈ సినిమా పాటలను శనివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. శంకర్ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని మహేశ్‌కి అందించారు. శంకర్ ఇంకా మాట్లాడుతూ -‘‘తమన్ మంచి డ్రమ్మర్. ‘బాయ్స్’ సినిమా ఆడిషన్స్ టైమ్‌లో డ్రమ్స్ ప్లే చేస్తుండేవాడు. ట్యూన్స్ వినిపిస్తుండేవాడు. అతను ఈ రోజు ఈ స్థాయికి రావడం గర్వంగా ఉంది. అతని ఆల్బమ్స్‌లో ‘దూకుడు’ నా ఫేవరెట్. ఒక సినిమాను కమర్షియల్ ప్యాక్‌లా చేయడం తేలికైన విషయం కాదు. ఈ విషయంలో శ్రీను వైట్లను అభినందించాలి. బ్రహ్మానందంకి గొప్ప ఫ్యాన్‌ని. ఈ కాంబినేషన్ మళ్లీ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘చెన్నైలో ఉన్నప్పుడు శంకర్‌గారి సినిమాలు విడుదలవగానే, తొలిరోజు బ్లాక్ టికెట్ కొని మరీ చూసేవాణ్ణి. ఈ రోజు ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. 50 సినిమాల సంగీత దర్శకుడైన తమన్‌కి శుభాకాంక్షలు. టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. ఈ సినిమా నిర్మాతలకు సినిమాపై ఉన్నంత పిచ్చి ప్రేమ ఎవరికీ ఉండదు. వీళ్లతో ఇలాంటి సూపర్హిట్లు మళ్లీ మళ్లీ చేయాలనుంది. శ్రీను వైట్లతో వర్క్‌ను ఎంజాయ్ చేస్తాను. ‘దూకుడు’ షూటింగ్ టైమ్‌లోనే ‘మన నెక్ట్స్ సినిమా పేరు ‘ఆగడు’’ అని చెప్పేశాడు. అప్పుడు, ఇప్పుడు శ్రీను వైట్ల చెప్పింది చెప్పినట్లు చేశాను. సెప్టెంబర్ 19న సినిమా విడుదల కానుంది. దసరా పండగను రెండు వారాల ముందే జరుపుకుందాం’’అని మహేశ్ అన్నారు. శ్రీనుై వెట్ల చెబుతూ -‘‘తమన్ ఈ ఆల్బమ్ కోసం ఏడాది కష్టపడ్డాడు. కథ అడిగింది ఇచ్చే నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర. ఇలాంటి నిర్మాతలు గతంలో నా సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం కావడం ఆనందంగా ఉంది. ‘దూకుడు’లో మహేశ్ పవర్‌ని పది శాతమే చూశారు. ‘ఆగడు’లో వంద శాతం చూస్తారు’’ అన్నారు. నాజర్, బ్రహ్మానందం, సుకుమార్, సుధీర్‌బాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కోటి పరుచూరి, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. -
అందుకే రవితేజ మాస్ మహరాజా : రాక్‌లైన్ వెంకటేశ్
‘‘తమన్, నేనూ కలిసి పనిచేసిన సినిమాల్లో హిట్లు, సూపర్హిట్లు, యావరేజ్‌లు, ఫ్లాపులు ఉన్నాయి. అయితే... తమన్ సంగీతం మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు. ప్రతి సినిమాకూ అద్భుతమైన బాణీలు అందిస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో కూడా నాతో పాడించి మరోసారి ప్రయోగం చేశాడు. ఈ చిత్రం మా కెరీర్లో మరో సూపర్‌హిట్’’ అని రవితేజ అన్నారు. ఆయన హీరోగా రచయిత కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబీ)ని దర్శకునిగా పరిచయం చేస్తూ, రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘పవర్’. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని వి.వి.వినాయక్ ఆవిష్కరించి, కన్నడ నిర్మాత మునిరత్నంకి అందించారు. రవితేజ ఇంకా మాట్లాడుతూ- ‘‘జయనన్ విన్సెంట్, గౌతంరాజు, మనోజ్ పరమహంస, తమన్, రామ్‌లక్ష్మణ్... ఈ ప్రాజెక్ట్ ఇంత గొప్పగా రావడానికి కారణం వీరే. భారీతనానికి పర్యాయపదం రాక్‌లైన్ వెంకటేశ్. ఆయన పేరులోనే ఏదో తెలీని ‘పవర్’ ఉంది. తెలుగుతెరకు బాబీ రూపంలో మరో మంచి దర్శకుడు దొరికాడు. ఈ సినిమాతో తను కచ్చితంగా స్టార్ డెరైక్టర్‌గా మారతాడు’’ అన్నారు. ‘‘తెలుగులో ఓ చిత్రాన్ని నిర్మించాలని నాలుగైదేళ్లుగా ఉండేది. అప్పట్నుంచీ రవితేజను అడుగుతూనే ఉన్నాను. ఇన్నాళ్లకు ఆయన నుంచి పిలుపు వచ్చింది. బాబీ కథ చెప్పిన తీరుకే ఫిదా అయిపోయాను. అద్భుతంగా ఈ కథను మలిచిన బాబీ టీమ్‌కి నా ధన్యవాదాలు. అందరి అభిమానులూ రవితేజ సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. అందుకే... ఆయన్ను అందరూ మాస్ మహరాజా అంటారు. కొండంత ఎనర్జీ రవితేజ సొంతం’’ అని రాక్‌లైన్ వెంకటేశ్ అన్నారు. బాబీ మాట్లాడుతూ - ‘‘‘బలుపు’ చిత్రం చేస్తున్నప్పుడు రవితేజకు ఈ కథ చెప్పాను. ఇంటర్వెల్ వరకూ విని, చేద్దాం అన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకు సెల్యూట్. రవితేజలాంటి హీరోలు పరిశ్రమకు అవసరం. దర్శకులు కావాలనే కలతో వచ్చే సహాయ దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. అందుకు గట్స్ కావాలి. అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. ఈ వేడుకలో ‘దిల్’ రాజు, కోన వెంకట్, అజయ్, సునిల్ తదితరులతో పాటు పలువురు కన్నడ చిత్రరంగ ప్రముఖులు పాల్గొన్నారు. -
కాపీ క్యాట్‌గా మారిన తమన్..?
-
ధీరుడు రెడీ
విశాల్ హీరోగా రూపొందిన చిత్రం ‘ధీరుడు’. ఈ సినిమా ద్వారా నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య కథానాయికగా పరిచయం అవుతున్నారు. భూపతి ప్యాండన్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని విశాల్ నిర్మించారు. ఈ 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ -‘‘యాక్షన్, లవ్, కామెడీ సమాహారంతో రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. కథ, కథనం ప్రధాన బలాలు కాగా, అనల్ అరసు సమకూర్చిన ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. థమన్ స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఓ మంచి మ్యూజికల్ హిట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. అన్ని వర్గాలవారిని మెప్పించే ఈ చిత్రం విశాల్‌కి మరింత మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం: వడ్డీ రామానుజం. -
పాత్రకు తగిన నాయకి ముఖ్యం
కథాపాత్రలకు తగిన నాయకా నాయకిలు ముఖ్యం అంటున్నారు దర్శకుడు కేబుల్ శంకర్. ఈయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం తొట్టాల్ తొడరుం. తమన్, అరుంధతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది యాక్షన్ సన్నివేశాలతో కూడిన ప్రేమకథా చిత్రం అని తెలిపారు. వినోదంపాళ్లు ఎక్కువగానే ఉంటుందన్నారు. చిత్రంలో కీలకంగాఉన్న హీరోయిన్ పాత్ర నటి అరుంధతిని ఎంపిక చేయాలని భావించిన ప్పుడు ఆమెతో ప్రత్యేకంగా ఫొటో షూట్ చేయాలని నిర్ణయించామన్నారు. దాన్ని బట్టి ఆ పాత్రకు ఆ హీరోయిన్ కరెక్టా కదా అని నిర్ణయిస్తామని చెప్పారు. అలా అన్ని విధాలుగా తొట్టాల్ తొడరుం చిత్రంలోని హీరోయిన్ పాత్రకు సరిగ్గా సరిపోతుందని నిర్ణరుుంచుకున్న తరువాతనే ఆమెను ఎంపిక చేశామని తెలిపారు. చిత్రంలో చాలా కాలం తరువాత విన్సెంట్ అశోకన్ విలన్‌గా ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. ఇది మీడియం బడ్జెట్ చిత్రం అయినా నిర్మాత తువర్ చంద్రశేఖర్ ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడలేదన్నారు. భారీ చిత్రాలకు ఉపయోగించే హెలికామ్ కెమెరా అవసరం అవడంతో విదేశాల నుంచి రప్పించారని, ఈ కెమెరాలో చిత్రంలోని పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు దర్శకుడు వెల్లడించారు. -
వారం తర్వాత ‘ఆగడు’
మహేష్‌బాబుతో చేయబోయే ‘ఆగడు’ చిత్రంలో రియల్‌స్టార్ శ్రీహరి కోసం ఓ అద్భుతమైన పాత్రను దర్శకుడు శ్రీను వైట్ల డిజైన్ చేశారట. గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఢీ, కింగ్ చిత్రాల్లో శ్రీహరి పాత్రలు ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించాయో తెలిసిందే. వాటిని తలదన్నే పాత్రను శ్రీహరికోసం శ్రీను వైట్ల సిద్ధం చేశారట. కానీ దేవుడు మరోలా తలచాడు. శ్రీహరి హఠాన్మరణం చెందకపోతే... మహేష్, శ్రీహరి కలిసి నటించే తొలి సినిమా ‘ఆగడు’ అయ్యేది. ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసేది. నిజానికి ‘ఆగడు’ ప్రారంభోత్సవం ఈ నెల 11న గానీ, 14న గానీ నిర్వహించాలని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర భావించారు. అయితే... శ్రీహరి కన్ను మూయ డంతో ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఓ వారానికి పోస్ట్‌పోన్ చేశారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం శ్రీహరి స్థానంలో నటించే నటుడి అన్వేషణలో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు తెలిసింది. కచ్చితంగా శ్రీహరి స్థాయి నటుణ్ణే ఎంపిక చేయాలనే కృతనిశ్చయంతో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో తమన్నాను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలిసింది. అదే నిజమైతే... మహేష్, తమన్నా కలిసి నటించే తొలి సినిమా ఇదే అవుతుంది. -
‘రామయ్యా వస్తావయ్యా’ మూవీ స్టిల్స్
ఎన్టీఆర్. హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్, సమంత, శ్రుతిహాసన్ కాంబినేషన్లో ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’. తమన్ పాటలు స్వరపరిచారు. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం పాటల సీడీని వీవీ వినాయక్ ఆవిష్కరించి, రాజమౌళికి ఇచ్చారు.