'శపథం' పూర్తి చేసిన స్టార్ హీరో | Aadhi Pinisetty Saptham Movie Shoot Completed | Sakshi
Sakshi News home page

Aadhi Pinisetty: ఆది పినిశెట్టి 'శపథం'.. త్వరలో ఆ డీటైల్స్

Published Fri, Sep 29 2023 4:06 PM | Last Updated on Fri, Sep 29 2023 4:16 PM

Aadhi Pinisetty Saptham Movie Shoot Completed - Sakshi

రంగస్థలం, నిన్నుకోరి తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటుడు ఆది పినిశెట్టి. ఇతడు హీరోగా నటించిన కొత్త మూవీ శపథం. అరివళగన్‌ దర్శకుడు. ఇంతకుముందు వీళ్ల కాంబోలో 'ఈరం' చిత్రాన్ని తీశారు. అది హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని తెలుగులో 'శబ్దం' పేరుతో రిలీజ్ చేయనున్నారు.

(ఇదీ చదవండి: ‘పెదకాపు 1’ మూవీ రివ్యూ)

హరర్, థ్రిల్లర్‌ సినిమాలతో తీయడంలో ఎక్స్‌పర్ట్ అయిన అరివళగన్.. అదే తరహా నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. సిమ్రాన్‌, లైలా, లక్ష్మీమేనన్‌, రెడిన్‌ కింగ్స్‌లీ తదితరులు నటించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందించాడు. కాగా శపథం షూటింగ్‌ పూర్తయినట్లు దర్శకుడు ప్రకటించాడు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. త్వరలో ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌ విడుదల చేస్తామని పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: రామ్ పోతినేని స్కంద.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement