హిట్ హీరో.. ఫ్లాపుల డైరెక్టర్.. రిలీజ్ డేట్ ఫిక్స్ | Madharasi Movie Release Date Latest | Sakshi
Sakshi News home page

Madharasi Movie: శివకార్తికేయన్ కొత్త మూవీ విడుదల ఎప్పుడంటే?

Apr 14 2025 5:39 PM | Updated on Apr 14 2025 5:39 PM

Madharasi Movie Release Date Latest

మొన్నీమధ్య సల్మాన్ ఖాన్ 'సికిందర్' వచ్చింది. ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ అయింది. దీంతో ఈ చిత్రం తీసిన దర్శకుడు ఏఆర్ మురగదాస్(A.R.Murugadoss)పై గట్టిగానే విమర్శలు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు మరో మూవీని సిద్ధం చేశాడు. తాజాగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)

గత కొన్నాళ్లుగా సరైన సినిమాలు చేయక బాగా వెనకబడిన డైరెక్టర్ మురగదాస్.. వరస హిట్స్ కొడుతున్న తమిళ హీరో శివకార్తికేయన్ తో చేసిన మూవీ 'మదరాసి'(Madharasi Movie). దీన్ని ఈ సెప్టెంబరు 5న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.

ఓవైపు మురగదాస్ పై నమ్మకం లేనప్పటికీ.. శివకార్తికేయన్(Siva Karthikeyan) వల్ల ఈ సినిమాపై బజ్ ఏర్పడొచ్చు. సెప్టెంబరు 5న అంటే ఇప్పటివరకు తెలుగు సినిమాలేవి డేట్ ఫిక్స్ చేయలేదు. కాబట్టి మూవీ బాగుంటే ఇక్కడా కూడా అడ్వాంటేజ్ ఉండొచ్చు.

(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement