ar murugadoss
-
'సికందర్' ట్విటర్ రివ్యూ.. ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడం బెటర్ అంటూ..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) , రష్మికా మందన్నా(Rashmika ) జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సికందర్' సినిమా థియేటర్స్‌లోకి వచ్చేసింది. రంజాన్ కానుకగా మార్చి 30న విడుదలైన ఈ చిత్రాన్ని సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. రజనీకాంత్ దర్బార్ (2020) సినిమా తర్వాత ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన చిత్రం కావడంతో సికిందర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు నటించారు. ఇప్పటికే పలుచోట్ల సినిమా చూసిన నెటిజన్లు సికిందర్‌పై తమ ఎక్స్ పేజీలలో ఇలా చెప్పుకుంటున్నారు.సికిందర్ అందరికి షాక్ ఇచ్చాడు అంటూ నెటిజన్లు పంచులు వేస్తున్నారు. సినిమా ఏమాత్రం అంచనాలకు కనీసం దగ్గర్లో కూడా లేదని చెబుతున్నారు. అవుట్ డేటెడ్ కథను ఎన్నిసార్లు మాకు చూపుతారంటూ చెబుతున్నారు. ఇందులో ఒక సాంగ్ మినహా సంగీతం చాలా దారుణంగా ఉందని చెబుతున్నారు. సినిమా చూసి ఎంజాయ్ చేయాడానికి అందులో ఏమీ లేదని చెబుతున్నారు. సల్మాన్ , AR మురుగదాస్ కాంబోకి సికిందర్ సినిమా అతిపెద్ద డిజాస్టర్ అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయం తెలుపుతున్నారు.సల్మాన్ ఖాన్ ఎంట్రీ సీన్ చాలా హైప్లో ఉంటుందని అభిమానులు సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సల్మాన్ నటించిన గత సినిమాలకు సికందర్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది అందుకే ప్రేక్షకులకు నచ్చలేదని అభిమానులు తెలుపుతున్నారు. ఇందులో యాక్షన్, ఎమోషన్స్, పాటలు అన్నీ కూడా చాలా బాగున్నాయంటున్నారు. కానీ, సాధారణ ప్రేక్షకుల మాత్రం ఇదేం సినిమా అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి కథ పట్టుకుని సల్మాన్‌ను మురగదాస్ ఎలా ఒప్పించాడు అంటూ సెటైర్స్ వేస్తున్నారు. సినిమాపై డివైడ్ టాక్ భారీగా వస్తున్నా సల్లూ భాయ్ ఫ్యాన్స్ మాత్రం సికిందర్‌ను బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు.పైసా వసూల్ బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు చెబుతున్నప్పటికీ కామన్ ఆడియెన్స్ నుంచి మాత్రం చెత్త సినిమా అంటూ రివ్యూలు ఇస్తున్నారు. మురుగదాస్ ఇకనైన సినిమాల నుంచి రిటైర్ అయిపోవడం మంచిదని తెలుపుతున్నారు. కాజల్ అగర్వాల్ పాత్రపై కూడా విమర్శలు వస్తున్నాయి. విలన్‌గా సత్యరాజ్ కూడా సెట్ కాలేదని తెలుపుతున్నారు. సల్మాన్ కనిపిస్తే చాలు బీజీఎమ్‌తో సంతోష్ నారయణ బాగా ఇబ్బంది పెట్టాడని ఒకరు కామెంట్ చేశారు. ఫస్టాఫ్ ఏదో కాస్త ఓకే అనుకుంటే సెంకండాఫ్లో స్టోరీ మరింత ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. ఫైనల్‌గా సల్మాన్‌కు సికిందర్ బిగ్ డిజాస్టర్‌గా మిగిలిపోతుందని ఎక్కువమంది ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. #Sikandar is a dull action drama with a lifeless story that fails to engage. The background music is very bad, and except for a few decent action scenes, there’s nothing to enjoy. Biggest disaster for Salman and AR Murugadoss combo.— LetsCinema (@letscinema) March 29, 2025#Sikandar Public reviews are coming out and it’s disappointing .. Another mess by salman khan on eid 😢#SikandarReview pic.twitter.com/JPZkestxMs— Cheemrag (@itxcheemrag) March 30, 2025Crowd goes crazy on Megastar #SalmanKhan entry scene in #Sikandar movie.Theatre Turn Into Stadium 🔥🔥🔥 @BeingSalmanKhan #SalmanKhan #SikandarReview #Sikandar pic.twitter.com/ytTrI7CQaO— Filmy_Duniya (@FMovie82325) March 30, 2025@ARMurugadoss pls get retire.#Sikandar #SalmanKhan We appreciate your contributions to the film industry with your successful movies. However, we kindly request that you refrain from directing any further films.. Heart-full Request.— Daino (@ursrokk) March 30, 2025The audience is showering love on #Sikandar. Another blockbuster loading for @iamRashmika and @BeingSalmanKhan. 🔥🔥#RashmikaMandanna ❤️#SalmanKhan #Sikandar 🔥 pic.twitter.com/xywPwUnhFA— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) March 30, 2025Sikandar Review ⭐️⭐️⭐️⭐️⭐Blockbuster, Blockbuster, Blockbuster......Just Saw sikandar- #Sikandar is the best #SalmanKhan film after Bajrangi Bhaijaan, Yes even better than Sultan and TZH.Even I cry after Watching it, Too emotional and Action packedMany goosebump moments. pic.twitter.com/QPqlNohEGG— taran adarsh (@taran_adarsh76) March 29, 2025 -
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్స్‌పై 'సల్మాన్ ఖాన్' రియాక్షన్
తనకు వస్తున్న హత్య బెదిరింపుల గురించి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) స్పందించారు. తను నటించిన కొత్త సినిమా సికిందర్ (Sikandar) ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొంత కాలంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi ) నుంచి చంపేస్తామని సల్మాన్‌కు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇంటి ముందు వారు కాల్పులు కూడా జరిపారు. ఎదోరోజు ఆయనపై తప్పకుండా పగ తీర్చుకుంటామని వారు గట్టిగానే హెచ్చిరించారు. అయితే, తాజాగా ఈ బెదిరింపులపై సల్మాన్ స్పందించారు.సినిమా షూటింగ్స్ వల్ల ఎప్పుడూ కూడా సల్మాన్ చాలా ప్రయాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయనకు ప్రభుత్వం కూడా గట్టిగానే భద్రత కల్పించింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలపై ఆయన ఇలా స్పందించారు. 'నేను ఎక్కువగా దేవుడిని నమ్ముతాను. నా జీవితం ఆయన చేతుల్లోనే ఉంది. ఆయుష్షు ఎంత వరకు ఆ దేవుడు ఇచ్చాడో అంత వరకు మాత్రమే జీవిస్తాను. ఇదంతా దేవుడి ఇష్టం. గట్టి భద్రత కల్పించారు. ఒక్కోసారి ఇది కూడా పెను సవాలుగా అనిపిస్తుంది. ఏదేమైనా ఆందోళనగా ఉన్నప్పటికీ మన చేతిలో ఏమీ ఉండదు.' అని ఆయన అన్నారు.సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో సికిందర్ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) తెరకెక్కించారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. రంజాన్, ఉగాది సందర్భంగా మార్చి 30న థియేటర్స్‌లోకి రానుంది. 2023లో విడుదలైన ‘టైగర్ 3’ తర్వాత సల్మాన్ నటించిన సినిమా ఇదే కావడంతో ఆయన ఫ్యాన్స్ సికిందర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తోన్న తరుణంలో సికిందర్ పబ్లిక్ ఈవెంట్స్‌లలో ఆయన పాల్గొనడం లేదు. -
సల్మాన్, శివకార్తికేయన్ పై మురుగదాస్ భారీ ఆశలు...
-
శివకార్తికేయన్ కొత్త సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్
శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్ ప్రకటనతో పాటు అదిరిపోయే గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. మావీరన్, అయలాన్, అమరన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన శివ కార్తికేయన్. ఇప్పుడు మరో భారీ విజయంపై కన్నేశాడు. తన కెరీర్లో 23వ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రానికి మదరాసి అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ కూడా పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌లతో ఉంది.మదరాసి చిత్రంలో శివ కార్తికేయన్ పవర్‌పుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు తెలిసింది. కాగా నటి రుక్మిణి వసంత్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. శ్రీ లక్ష్మి మూవీస్ బ్యానర్‌పై శ్రీ లక్ష్మి ప్రసాద్, సుందర్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
సల్మాన్ ఖాన్, మురుగదాస్ యాక్షన్ టీజర్ విడుదల
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సికందర్’. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు కానుకగా ఆ చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ ప్రాజెక్ట్‌లో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనుంది. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2025 రంజాన్ కానుకగా విడుదల కానుంది. యానిమల్, పుష్ప వంటి చిత్రాలతో రష్మికకు బాలీవుడ్లో క్రేజ్ పెరిగింది. ఇప్పుడు సికందర్ మూవీ ఆమెకు మరింత పాపులరాటిని తీసుకురావచ్చని చెప్పవచ్చు. -
శివకార్తికేయన్ కొత్త సినిమా విడుదల ఎప్పుడంటే..?
మావీరన్, అయలాన్, అమరన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన నటుడు శివకార్తికేయన్. అయితే, తాజాగా విడుదలైన అమరన్ మంచి విజయాన్ని సాధించడంతో పాటు, సినీ విమర్శకుల ప్రశంసలను పొందడం విశేషం. కాగా ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న శివకార్తికేయన్ ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఈయన నటిస్తున్న 23వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో ఆయన పవర్‌పుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు తెలిసింది. కాగా నటి రుక్మిణి వసంత్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి అయ్యిందని ఇటీవల ఓ భేటీలో నటుడు శివకార్తికేయన్ తెలిపారు. కాగా ఈ చిత్రంతో పాటు దర్శకుడు ఏఆర్.మురుగదాస్ హిందీలో సల్మాన్‌ఖాన్ హీరోగా ఒక చిత్రం చేస్తున్నారు. అయితే శివకార్తికేయన్ చిత్రాన్ని ముందుగా పూర్తి చేసి ఆ తరువాత హిందీ చిత్రాన్ని పూర్తి చేయాలని భావించినట్లు తాజా సమాచారం. ఆ విధంగా ఇంకా పేరు నిర్ణయించని శివకార్తికేయన్ చిత్రానికి సింగనై అనే టైటిల్ పేరు ప్రచారంలో ఉంది. కాగా ఈ యాక్షన్ ఎంటర్టెయిన్ కథా చిత్రాన్ని 2025 మే నెలలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా తెలిసింది. కాగా ఈ చిత్రం తరువాత శివకార్తికేయన్ సిబి.చక్రవర్తి దర్శకత్వంలో ఓ చిత్రం, సుధా కొంగర దర్శకత్వంలో పురనానూరు చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. -
సికందర్‌కు సాయం
‘సికందర్’కు సాయం చేయనున్నారట హీరోయిన్ కాజల్ అగర్వాల్. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సినిమా ‘సికందర్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ . సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కాజల్ కూడా ఓ కీలకపాత్రలో నటించనున్నారట. త్వరలోనే ‘సికందర్’ షూటింగ్లో ఆమెపాల్గొంటారని బాలీవుడ్ టాక్. కథ రీత్యా ఈ చిత్రంలో సల్మాన్ కు సాయం చేసేపాత్రలో కాజల్ నటిస్తారట. మరి.. ‘సికందర్’లో కాజల్ భాగమైనట్లేనా? అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. ముంబైలోని ఓ స్టూడియోలో నిర్మించిన భారీ సెట్లో ప్రస్తుతం ‘సికందర్’ చిత్రీకరణ జరుగుతోంది. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. -
సౌత్ సినిమాలో సల్మాన్ !.. ఏ హీరో సినిమాలో అంటే ?
-
సౌత్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్న సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ ప్రముఖ నటీనటులు ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి సారిస్తున్నారు. జాకీష్రాఫ్, సంజయ్‌దత్, బాబీ డియోల్ వంటి స్టార్ నటులు దక్షిణాదిలో విలన్‌గా లేదంటే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా దక్షిణాది తెరపై మెరవబోతున్నట్లు ఓవార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ తమిళ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు టాక్.దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ తన 23వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు బిజుమీనన్, తుపాకీ చిత్రం ఫేమ్ విద్యుత్ జమ్వాల్ ముఖ్యపాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ అతిథి పాత్రలో మెరిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఏఆర్.మురుగదాస్ హిందీలో సల్మాన్‌ఖాన్ హీరోగా సిఖిందర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ పరిచయంతోనే సల్లూభాయ్‌ను తమిళంలో శివకార్తికేయన్‌తో చేస్తున్న చిత్రంలో అతిథి పాత్రలో నటింపజేస్తున్నట్లు టాక్. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.చదవండి: ‘సత్యభామ’ మూవీ రివ్యూ -
Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
‘పుష్ప’ చిత్రంలో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది రష్మిక. ఆ తర్వాత తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. మిషన్ మజ్ను, గుడ్‌బై లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ యానిమల్ మూవీ రష్మికకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అందులో ప్రేమతో హింసించే భర్తకు భార్యగా రష్మిక అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలు పొందింది. యానిమల్ తర్వాత రష్మికకు బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం సొంతం చేసుకుంది ఈ నేషనల్ క్రష్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది.‘మీరు ఎన్నో రోజులుగా నా సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీకోసమే ఈ సర్ప్రైజ్. ‘సికందర్’తో మీ ముందుకు వస్తున్నాను. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉంది’ అని రష్మిక తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో రాసుకొచ్చింది. ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ‘కుబేర’, ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన పుష్ప 2 చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సల్మాన్ ఖాన్ సికందర్
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘సికందర్’ టైటిల్ ఖరారైంది. గురువారం (ఏప్రిల్ 11) ఈద్ సందర్భంగా ‘సికందర్’ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించి, టైటిల్ లోగోను కూడా విడుదల చేశారు మేకర్స్. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్‌కు రిలీజ్ కానుంది. ‘‘ఈ ఈద్‌కు ‘బడే మియా చోటే మియా’, ‘మైదాన్’ సినిమాలను థియేటర్స్‌లో చూడండి. వచ్చే ఈద్‌కు ‘సికందర్’ వస్తాడు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు సల్మాన్ ఖాన్. -
స్టార్ హీరోతో మురగదాస్ సినిమా.. అధికారికంగా ప్రకటన
సౌత్ ఇండియా టాప్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చాలా రోజుల తర్వాత కొత్త సినిమాను ప్రకటించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తను ఒక చిత్రం నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గజిని, స్టాలిన్, తుపాకి, 7th సెన్స్, స్పైడర్, కత్తి వంటి చిత్రాల ద్వారా సౌత్ ఇండియాలో అగ్రగామి దర్శకుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చాయి. బాలీవుడ్లో ఇప్పటికే అమీర్ ఖాన్‌తో గజనీ చిత్రాన్ని రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఆపై సోనాక్షి సిన్హాతో "అకీరా" చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. గతంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లు అందుకున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఆయన నుంచి పెద్దగా సినిమాలు రాలేదు. కానీ కోలీవుడ్ హీరో విజయ్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో మురగదాస్ సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి వర్కౌట్ కాలేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో సినిమా చేసే చాన్స్ ఆయనకు దక్కింది. ఈ యాక్షన్ చిత్రం కోసం ఎఆర్ మురుగదాస్ చాలా కాలంగా స్క్రీన్ ప్లేపై వర్క్ చేస్తున్నారు. దీని ద్వారా ఏఆర్ మురుగదాస్ కమ్ బ్యాక్ ఇస్తాడని అంతా అనుకుంటున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా సాజిద్ నడియాద్వాలా ఉన్నారు. 2025 రంజాన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే అజిత్ కుమార్ హీరోగా బిల్లా, ఆరంభం చిత్రాలకు దర్శకత్వం వహించిన విష్ణు వర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ది బుల్ చిత్రంలో కనిపించనున్నాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మళ్లీ తమిళ దర్శకుడి సినిమాకు ఓకే చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. Glad to join forces with the exceptionally talented, @ARMurugadoss and my friend, #SajidNadiadwala for a very exciting film !! This collaboration is special, and I look forward to this journey with your love and blessings. Releasing EID 2025.@NGEMovies @WardaNadiadwala pic.twitter.com/dv00nbEBU1 — Salman Khan (@BeingSalmanKhan) March 12, 2024 -
మృణాల్ అనుకుంటే రుక్మిణి బంపరాఫర్ పట్టేసింది!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరి దశ తిరుగుతుందో అస్సలు చెప్పలేం. అలా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ లక్ మారేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె ప్లానింగ్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. తాజాగా ఓ క్రేజీ డైరెక్టర్-హీరో కాంబోతో కలిసి నటించేందుకు ఓకే చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) 'సప్త సాగరాలు దాటి' సినిమాతో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన భామ రుక్మిణి వసంత్. గతేడాది రెండు పార్టులుగా రిలీజైన ఈ సినిమాలో రుక్మిణి యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఆ వెంటనే తెలుగు నుంచి కూడా బోలెడన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ వేటికి ఓకే చెప్పకుండా ఒక్కో అడుగు ఆచితూచి వేస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా శివకార్తికేయన్ కొత్త మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే తొలుత ఈ సినిమాలో పూజాహెగ్డే లేదా మృణాల్ ఠాకుర్ హీరోయిన్లుగా నటిస్తారనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా రుక్మిణి బంపరాఫర్ కొట్టేసింది. ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఈ బ్యూటీ ఓ సినిమా చేస్తోంది. తెలుగు నుంచి ఆఫర్స్ వస్తున్నా సరే ఏ మాత్రం తొందరపడకుండా మూవీస్ చేయాలని చూస్తోంది. ఈమె ప్లానింగ్ చూస్తున్న నెటిజన్స్.. మరో రష్మిక అవుతుందని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ) -
మురుగదాస్ ను పిలిచి సినిమా ఆఫర్ ఇచ్చిన సల్మాన్..?
-
ఖరీదైన కారు కొన్న స్టార్ డైరెక్టర్.. ఏకంగా అన్ని కోట్లా?
స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. గత మూడు నాలుగేళ్లలో దర్శకుడిగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా తీయని ఇతడు.. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా ఓ మూవీ తీస్తున్నారు. ఇది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అది అలా ఉండగా ఇప్పుడు ఓ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అలానే ఈ ఖరు ధర తెలిసి అందరూ షాకవుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. అక్కడ మాత్రం ఇంకా పెండింగ్‌లోనే) స్టాలిన్, గజిని, తుపాకీ, కత్తి లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో యమ క్రేజ్ తెచ్చుకున్న మురుగదాస్.. 2020లో రజనీకాంత్‌తో 'దర్బార్' మూవీ తీశాడు. అది ఘోరంగా ఫెయిల్ కావడంతో పూర్తిగా డైరెక్షన్ పక్కనబెట్టేశాడు. నిర్మాతగా రెండు సినిమాలు తీశాడు అవి కూడా ఏమంత పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో అలరించలేకపోయాయి. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇది ఈ ఏడాది రిలీజ్ కావొచ్చు. ఇకపోతే తాజాగా దాదాపు రూ.1.30 కోట్ల విలువ చేసే బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 7 (BMW X7) కారుని కొనుగోలు చేశాడు. షోరూంలో మురుగదాస్ ఫ్యామిలీ అంతా కలిసి తీసుకున్న పిక్స్ వైరల్ అయ్యాయి. అదే టైంలో ఈ కారు ఏకంగా రూ.కోటి కంటే ఎక్కువ కాస్ట్ అని తెలిసి షాకవుతున్నారు. దర్శకుడిగా ఫామ్‌లో లేనప్పటికీ కాస్ట్ లీ కారు కొన్నాడని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'గుంటూరు కారం'.. అదే ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?) -
చిరంజీవికి హిట్ అందించిన డైరెక్టర్.. కానీ ఇప్పుడేమో!
ఏ రంగంలోనైనా విజయం ఎంత ప్రభావం చూపుతుందో.. అపజయం కూడా అంతే ప్రభావం చూపుతుంది. దీనికి చిన్న ఉదాహరణే దర్శకుడు ఏఆర్ మురుగదాస్. తొలి చిత్రం నుంచి సర్కార్ వరకు వరుసగా ఒకదానికి మించిన ఒకటి హిట్స్ ఇచ్చిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. గజిని చిత్రంతో బాలీవుడ్‌లోనూ హిట్ కొట్టారు. తెలుగులోనూ చిరంజీవితో స్టాలిన్, మహేష్ బాబుతో స్పైడర్ చిత్రాలు చేశారు. ఇక తమిళంలో రజనీకాంత్ హీరోగా రూపొందించిన దర్బార్ భారీ అంచనాల మధ్య విడుదలైన అపజయం మూటగట్టుకుంది. ఆ చిత్రం ప్లాప్ కావడం ఏఆర్ మురుగదాస్‌పై గట్టిగానే ప్రభావం చూపింది. ఎంతగా అంటే ఆ తర్వాత ఆయన మరో చిత్రం చేయలేక పోయారు. నటుడు విజయ్‌కి తుపాకీ, సర్కార్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఏఆర్ మురుగదాస్ ఆయనతో మరో చిత్రం చేయాల్సి ఉండగా విజయ్ ఆసక్తి చూపించలేదు. ఇక ఏఆర్ మురుగదాస్ నిర్మాతగా చేసిన చిత్రాలు తీవ్ర నిరాశ పరిచాయి. దీంతో ఎలాగైనా సక్సెస్ కొట్టి పూర్వ వైభవాన్ని చాటుకోవాలనే పట్టుదలతో దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు. శివకార్తీకేయన్ హీరోగా చిత్రం చేయడానికి ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే కోలీవుడ్‌లో ఏఆర్ మురుగదాస్‌కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. వారితో ఇటీవల ఇన్‌స్ట్రాగామ్‌లో ఏఆర్ మురుగదాస్ ముచ్చటించారు. ఈ సందర్భంగా మీ కొత్త చిత్రం ఎప్పుడు అన్న అభిమాని ప్రశ్నకు ఒక్క నెల ఓపిక పట్టండి బాస్ అని బదులిచ్చారు. అంటే ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించనున్న చిత్రం ప్రారంభం కానుందని హింట్ ఇచ్చారని భావిస్తున్నారు. -
స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన సీతారామం బ్యూటీ..!
సీతారామం సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్. ఇటీవల తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్-2లోనూ మెరిసింది. అయితే ప్రస్తుతం తమిళ స్టార్ హీరోతో ఆమె జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మావీరన్(మహావీరుడు) చిత్రంతో హిట్ కొట్టిన శివ కార్తికేయన్‌కు జంటగా నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. (ఇది చదవండి: నా రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్) మావీరన్ సక్సెస్ తర్వాత శివ కార్తికేయన్ మరో చిత్రానికి ఓకే చెప్పేశారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈయన నటించనున్నారు. ఈ చిత్రంలో అతని సరసన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే శివ కార్తికేయన్ ప్రస్తుతం రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమలహాసన్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా కనిపించనుంది. దీనికి రాజ్‌కుమార్ పెరియ సామి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో మేజర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ మరోసారి పోలీస్ అధికారిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన ఇంతకుముందు కాక్కీసట్టై చిత్రంలో పోలీస్ అధికారిగా నటించారు. అదేవిధంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం దర్బార్. ఇందులో రజినీకాంత్ పోలీస్ అధికారిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. (ఇది చదవండి: ఫోటోపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్.. వెంటనే తొలగించేసిన రాఘవేంద్ర రావు) ఆ తర్వాత ఏఆర్.మురుగదాస్ చాలా గ్యాప్ తీసుకుని శివ కార్తికేయన్ హీరోగా మరోసారి పోలీస్ కథనే నమ్ముకుని చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈ చిత్రాన్ని స్పైడర్ చిత్ర నిర్మాతలు నిర్మించనున్నట్లు తెలిసింది. దీనికి అనిరుధ్ సంగీతం అందించినట్లు, షూటింగ్ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
టాప్ డైరెక్టర్‌తో శివకార్తికేయన్.. హీరోయిన్గా సీతారామం బ్యూటీ!
కోలీవుడ్‌లో వేగంగా ఎదిగిన హీరో శివకార్తికేయన్. ప్రారంభంలో కీర్తిసురేష్, ఆనంది వంటి వర్తమాన నటీమణులతో నటించిన ఈయన ఆ తర్వాత హన్సిక, నయనతార వంటి క్రేజీ హీరోయిన్లతో నటించే స్థాయికి ఎదిగారు. అదేవిధంగా శివకార్తికేయన్ ఇప్పటికి హీరోగా 19 చిత్రాలు చేశారు. వాటిలో అధిక భాగం హిట్ చిత్రాలే. ఆ మధ్య డాక్టర్, డాన్ వంటి చిత్రాలు వరుసగా సూపర్ హిట్ అయినా, ఆ తర్వాత వచ్చిన ప్రిన్స్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. ప్రస్తుతం అశ్విన్ మడోనా దర్శకత్వంలో మావీరన్ చిత్రంలో నటిస్తున్నారు. అదితిశంకర్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంపై శివకార్తికేయన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. తాజాగా కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో సాయిపల్లవి నాయకిగా నటించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. అయితే శివకార్తికేయన్ మరో చిత్రానికి కమిట్ అయినట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన దర్బార్ చిత్రం తర్వాత ఈ దర్శకుడు మరో చిత్రం చేయలేదు. అదేవిధంగా శివకార్తికేయన్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. దానికి ఇప్పుడు టైమ్ వచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీలో శివకార్తికేయన్‌కు జంటగా మృణాల్ ఠాకూర్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమ్మడు తెలుగులో నటించిన సీతారామం చిత్రంతో బాగా పాపులర్ అయిందన్న విషయం తెలిసిందే. ఈమె శివకార్తికేయన్‌తో జతకట్టే విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చదవండి: మెగా ప్రిన్సెస్‌కు ఘనస్వాగతం.. ఫోటో షేర్ చేసిన ఉపాసన -
అందుకే దర్బార్ ఫ్లాప్ అయింది: ఏఆర్ మురుగదాస్
కోలీవుడ్ టాప్ దర్శకుల్లో ఏఆర్ మురుగదాస్ ఒకరు. అజిత్ కథానాయకుడిగా దీనా చిత్రంతో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆయన వరుసగా పలు చిత్రాలతో విజయపథంలో కొనసాగుతూ వచ్చారు. అయితే ఏఆర్ మురుగదాస్‌ను ఒకసారిగా డౌన్ ఫాల్ చేసిన చిత్రం దర్బార్. ఆ చిత్ర కథానాయకుడు రజనీకాంత్. భారీ అంచనాల మధ్య విడుదలైన దర్బార్ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. దీంతో మూడేళ్లుగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మెగా ఫోన్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. దర్బార్ దెబ్బతో తదుపరి విజయ్ హీరోగా చేయాల్సిన చిత్రం వెనక్కి వెళ్లిపోయింది. కాగా ఇటీవల ఓ భేటీలో రజనీకాంత్ తో చేసిన దర్బార్ చిత్రం ఫ్లాప్ కావడానికి కారణాన్ని సుమారు మూడేళ్ల తర్వాత ఏఆర్ మురుగదాస్ బయటపెట్టారు. రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసే అవకాశం తనకు ఫిబ్రవరి నెలలో వచ్చిందనీ, జూన్ నెల ముంబాయిలో వర్షాల సీజన్ కావడంతో అలా చిత్ర షూటింగును హడావుడిగా పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ఎందుకంటే ఆగస్టులో రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు చెప్పారన్నారు. తాను రజనీకాంత్‌కు వీరాభిమానిని. దీంతో ఆయనతో చిత్రాలు చేసే అవకాశాన్ని ఏ కారణంగాను వదులుకోకూడదని భావించానన్నారు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవడంతో ఆ సమయంలో దర్బారే ఆయన చివరి చిత్రం అనే ప్రచారం జరిగిందన్నారు. దీంతో ఫిబ్రవరిలో రజనీకాంత్ చిత్రాన్ని దర్శకత్వం వహించే అవకాశం రావడం మార్చి నెలలో షూటింగ్ ప్రారంభించి జూన్ నెలకంతా చిత్రాన్ని పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ఎలాగైనా రజనీకాంత్ చిత్రం చేసి హిట్ కొట్టాలని భావించానని, అయితే సరైన ప్రణాళిక లేకపోవడంతో దర్బార్ చిత్రం ఫ్లాప్ అయ్యిందని చెప్పారు. సాధారణంగా షూటింగ్‌కు ముందు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు చాలా సమయం అవసరం అవుతుందన్నారు. అది దర్బార్ చిత్రానికి లేకపోయిందని మురుగదాస్ పేర్కొన్నారు. -
పుష్ప-2 తర్వాత ఆ స్టార్ డైరెక్టర్‌తోనే బన్నీ సినిమా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నెక్ట్స్ చేయబోయే సినిమాలు ఏంటన్న దానిపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్‌తో బన్నీ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరగుతున్నా అధికారికంగా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న మురగదాస్ ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఒక డైరెక్టర్ చాలామంది హీరోలతో చర్చలు జరుపుతుంటారు. అలాగే హీరోలు కూడా. ప్రారంభ దశల్లొ ఉన్న ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే ప్రకటించలేము. అన్నీ అనుకున్నట్లు జరిగితే తప్పకుండా చెబుతాను' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. -
August 16 1947: ఇది చాలా స్పెషల్ మూవీ
‘‘1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని మనందరికీ తెలుసు. కానీ అడవి మధ్యలో ఉండే ఓ కొండ ప్రాంతంలోని ఓ ఊరు ప్రజలకు ఈ విషయాన్ని ఓ కారణం చేత బ్రిటిష్ అధికారులు చెప్పరు. దీంతో అక్కడి ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే ఉంటారు. వ్యక్తిగతంగా వారందరికీ ఆగస్టు 16న స్వాతంత్య్రం. అయితే 1947 ఆగస్టు 14, 15, 16.. ఈ మూడు రోజుల్లో ఆ ఊళ్లో ఏం జరిగింది? అనే విషయం ఆసక్తికరం. ఇది చాలా స్పెషల్ మూవీ’’ అన్నారు దర్శక–నిర్మాత ఏఆర్ మురుగదాస్. గౌతమ్ కార్తీక్ హీరోగా ఎన్.ఎస్. పొన్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ ఫిల్మ్ ‘ఆగస్టు 16, 1947’. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, ఓం ప్రకాష్ భట్, నర్సిరామ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 14న నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ‘‘ఎప్పటికీ గుర్తుండిపోయే కథ ఇది’’ అన్నారు గౌతమ్ కార్తీక్. ‘‘ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి’’ అన్నారు పొన్‌కుమార్. ‘‘ఆగస్టు 16, 1947’ ప్రత్యేకంగా ఉంటుంది. క్లయిమాక్స్ అద్భుతంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత ‘ఠాగూర్’ మధు. -
నా నటనలో రజినీకాంత్ ఛాయలుంటాయి
తమిళ సినిమా: యువ నటుడు గౌతమ్ కార్తీక్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఆగస్టు 16, 1947. ఈ చిత్రం ద్వారా నటి రేవతి కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఏఆర్ మురుగదాస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓం ప్రకాష్ బట్, నర్శీరామ్ చౌదరితో కలిసి దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మించిన చిత్రం ఇది. ఏఆర్ మురుగదాస్ శిష్యుడు ఎన్ఎస్ పొన్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక రాయపేటలోని సత్యం థియేటరో సోమవారం రాత్రి నిర్వహించారు. ఇందులో ముఖ్యఅతిథిగా నటుడు శివకార్తికేయన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... తనకు సీనియర్ నటుడు కార్తీక్ అంటే చాలా ఇష్టం అని, ఆయన చాలా స్వీటెస్ట్ పర్సన్ అని పేర్కొన్నారు. అదేవిధంగా గౌతమ్ కార్తీక్‌ను కలిసిన చాలా కాలం తర్వాత తాను కార్తీక్‌ను కలిశానని, ఆయన చాలా అందగాడని పేర్కొన్నారు. ఆయన నటనలో ఇతర ఏ నటుల ఛాయలు ఉండవని, అయితే తన నటనలో మాత్రం రజనీకాంత్ చాయలు ఉంటాయని శివకార్తికేయన్ పేర్కొన్నారు. కాగా తన పయనం దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రంతోనే మొదలైంది అన్నారు. అది ఏఆర్ మురుగదాస్‌కు నిర్మాతగా తొలి చిత్రమని తెలిపారు. ఆ చిత్ర ప్రారంభోత్సవానికి తాను వ్యాఖ్యాతగా వ్యవహరించానన్నారు. ఆ తర్వాత ఆయన నిర్మించిన మాన్ కరాటే చిత్రంలో తాను కథానాయకుడిగా నటించానని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన నిర్మించిన ఈ చిత్రానికి తాను అతిథిగా విచ్చేశానని అదేవిధంగా త్వరలో మరో ఇంపార్టెంట్ స్టెప్పును వేయబోతున్నట్లు చెప్పారు. అది త్వరలోనే జరుగుతుందని అన్నారు. కాగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ భారీ చిత్రం తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. -
శివ కార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో సినిమా?
తమిళ సినిమా: ఏ రంగంలోనైనా, ఎవరికైనా గ్యాప్ రావడం అనేది సహజం. అలాంటి వారు మళ్లీ టైం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. తొలి చిత్రంతో మంచి విజయం సాధించిన ఈ దర్శకుడు ఆ తర్వాత విజయకాంత్‌తో రమణ, సూర్య కథానాయకుడిగా గజిని వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందారు. విజయ్ హీరోగా కత్తి, తుపాకీ, సర్కార్ వంటి విజయవంతమైన చిత్రాలకీ దర్శకత్వం వహాంచిన మురుగదాస్ చివరిగా రజనీకాంత్ కథానాయకుడిగా దర్బార్ చిత్రం చేశారు. అది ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతే మురుగదాస్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. విజయ్ 65వ చిత్రానికి ఈయన దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే ఏమైనా అది జరగలేదు దర్బార్ తర్వాత మురుగదాస్ ఇప్పటి వరకు ఏ చిత్రం చేయలేదు. ఇటీవల త్రిష కథానాయక నటించిన రాంకీ చిత్రానికి కథను అందించారు. ఈయన మళ్లీ ఎప్పుడు దర్శకత్వం వహిస్తారా..? అన్న ప్రశ్నకు తాజాగా సమాధానం వచ్చినట్లు కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం. ఏఆర్ మురుగదాస్ నటుడు శివ కార్తికేయన్ కాంబోలో ఒక చిత్రం తెరకెక్కనుందనే ప్రచారం సాగుతోంది. దీన్ని లైట్ హౌస్ మూవీస్ సంస్థ నిర్మించినట్లు టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలుపడాల్సి ఉంది. కాగా ప్రస్తుతం అయిలాన్ చిత్రాన్ని పూరి చేసి మావీరన్ చిత్రంలో నటిస్తున్నారు. -
రిలీజ్‌కు రెడీ అయిన త్రిష లేడీ ఓరియెంటెండ్ సినిమా
తమిళసినిమా: నటి త్రిష నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం రాంగీ. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథను అందించిన ఈ చిత్రానికి ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం ఫేమ్ ఎం.శరవణన్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి సి.సత్య సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రాంగీ చిత్రం ఈనెల 30వ తేదీ తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. నిజానికి ఈ చిత్రం గత ఏడాదే తెరపైకి రావాల్సి ఉంది. సెన్సార్ సమస్యల కారణంగా చిత్రం విడుదల వాయిదా పడింది. మొత్తం మీద రివైజింగ్ కమిటీకి వెళ్లి సుమారు 30కి పైగా కట్స్‌తో బయటపడి ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. చిత్ర వివరాలు దర్శకుడు తెలుపుతూ నటి త్రిషను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఇది అని చెప్పారు. కథ నచ్చడంతో త్రిష ఇందులో నటించడానికి అంగీకరించారని తెలిపారు. ఇది యాక్షన్‌తో కూడిన విభిన్న కథా చిత్రం అని పేర్కొన్నారు. ఫ్యామిలీ, కామెడీ, సెంటిమెంట్ యాక్షన్ వంటి అంశాలతో కూడిన మాస్ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలిపారు. త్రిష యాక్షన్ సన్నివేశాల్లో నటించారని చెప్పారు. ఒక విలేకరి అయిన ఆమె తన అన్నయ్య కూతురికి ఏర్పడిన సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగుతుందన్నారు. ఆ సమస్య పరిష్కారం అయిన రాంగి చిత్ర కథ విదేశాల వరకు వెళుతుందన్నారు. దీంతో చిత్రం సగభాగం ఉజ్బెకిస్తాన్‌లో చిత్రీకరింనట్లు చెప్పారు. చిత్ర విడుదల ఆలస్యం అవుతుండడంతో సెన్సార్ బోర్డ్ సభ్యులు అడిగిన కట్స్‌కు ఓకే చెప్పినట్లు తెలిపారు. చిత్రంలో పార్లర్గా కుటుంబ కథా సన్నివేశాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నటి త్రిష చిత్రాన్ని చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారని తెలిపారు. -
సూర్య గజిని సీక్వెల్‌కు సిద్ధం?
తమిళ సినిమా: నటుడు సూర్య దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం గజిని. 2008లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అంతేకాకుండా సూర్య కెరియర్లో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని ఏఆర్ మురుదాస్ అమీర్ ఖాన్ హీరోగా హిందీలోనూ తెరకెక్కించి హిట్ కొట్టారు. ఆ తర్వాత సూర్య, ఏఆర్. మురుగదాస్‌లో కాంబినేషన్లో రూపొందిన ఏళామ్ అరివు చిత్రం 2011లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్! ఆ తర్వాత వీరి కాంబినేషన్లో చిత్రం రాలేదు. ఏఆర్ ముగురుదాస్ చివరిగా రజనీకాంత్ కథానాయకుడిగా దర్బార్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత విజయ్ కథానాయకుడిగా తుపాకీ- 2 చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ తెర్కెక్కించబోతున్నట్టు ప్రచారం జరిగినా అది ఆచరణలోకి రాలేదు. దీంతో ఏఆర్.మురుగదాస్ తదుపరి చిత్రం ఏమిటి అన్నది ఆసక్తిగా మారింది. ఈయన చిత్రం చేసి చాలా కాలమే అయ్యింది. చదవండి: ‘గాడ్‌ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే కాగా తాజాగా సూర్యతో మరోసారి సినిమా చేయడానికి ఈయన సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. వీరిద్దరి కాంబినేషన్లో ఘనవిజయం సాధించిన గజిని చిత్రానికి సీక్వెల్ కోసం మురుగదాస్ కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. అలాగే ఇందులో నటించే విషయమై సూర్యతో సంప్రదింపులు జరుపుతున్న ట్లు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక నటుడు సూర్య చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. -
'కడలి' హీరోతో మురగదాస్ సినిమా.. టీజర్ విడుదల
ఏఆర్ మురుగదాస్‌కు దర్శకుడిగా చిన్న గ్యాప్ వచ్చింది. రజనీకాంత్ హీరోగా ఈయన చేసిన దర్బార్ చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. విజయ్‌తో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత బాలీవుడ్ చిత్రం చేయబోతున్నట్లు గుసగుసలు వినిపించాయి. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏఆర్ మురుగదాస్ చిత్ర నిర్మాణాన్ని పునః ప్రారంభించారు. పీపుల్ బుల్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి 1947 ఆగస్టు 16 అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. గౌతమ్ కార్తీక్, రేవతి జంటగా నటిస్తున్న ఈ చిత్రం స్వాతంత్య్ర పోరాట కాలంలో ఒక గ్రామీణ యువకుడు బ్రిటీష సైన్యంతో పోరాడే ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం అని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. భావోద్వేగాలతో కూడిన సంఘటనలతో, ప్రేమను కలిపిన ఎంటర్టైన్మెంట్ కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సలహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
27 ఏళ్ల తర్వాత పూర్తి పాత్రల్లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ !..
ఖాన్ త్రయం (సల్మాన్, షారుక్, ఆమిర్) కలిసి సినిమా చేస్తే.. ఫ్యాన్స్ తీన్ మార్ డ్యాన్స్ వేయడం ఖాయం. అలాంటి ఓ ప్రాజెక్ట్‌కి సన్నాహాలు జరుగుతున్నాయట. ఖాన్ త్రయం కాంబినేషన్లో సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురుగ దాస్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఆ విశేషాల్లోకి వెళదాం. గజిని, తుపాకీ, కత్తి, సర్కార్.. ఇలా తమిళంలో మురుగదాస్ భారీ చిత్రాలనే తెరకెక్కించారు. ఆయన ఇచ్చిన భారీ హిట్స్‌లో ఈ నాలుగుతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. ‘గజిని’ చిత్రాన్ని హిందీలో ఆమిర్ ఖాన్‌తో తెరకెక్కించి, బాలీవుడ్‌లోనూ హిట్ సాధించారు మురుగదాస్. ఆ తర్వాత హిందీలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా సల్మాన్, షారుక్‌లతో ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారట. ‘గజిని’ ద్వారా ఆమిర్‌తో ఏర్పడిన అనుబంధంతో ఈ విషయాన్ని ఆయనకు చెప్పారట మురుగదాస్. దాంతో షారుక్, సల్మాన్‌లను మురుగదాస్ కలిసే ఏర్పాటు ఆమిర్ చేశారని బాలీవుడ్ టాక్. ఇద్దరు ఖాన్లకు మురుగదాస్ స్టోరీ లైన్ చెబితే, నచ్చి, కథ డెవలప్ చేయమన్నారని భోగట్టా.. 27 ఏళ్ల తర్వాత.. 1995లో వచ్చిన ‘కరణ్ – అర్జున్’లో సల్మాన్, షారుక్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అలరించింది. అప్పటినుంచి ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేస్తే బాగుండు అని కోరుకుంటున్నవాళ్లు లేకపోలేదు. అయితే మధ్యలో మనస్పర్థల వల్ల ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తొలగిపోయి, ఒకరి సినిమాలో మరొకరు అతిథి పాత్రలు చేస్తున్నారు. సెట్స్‌లో ఉన్న సల్మాన్ ‘టైగర్ 3’లో షారుక్ అతిథిగా, షారుక్ ‘పఠాన్’లో సల్మాన్ గెస్ట్‌గా కనిపించనున్నారు. అయితే ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో సినిమా అంటే ఫ్యాన్స్‌కి పండగే. ‘కరణ్ – అర్జున్’ రిలీజైన 27 ఏళ్లకు సల్మాన్, షారుక్ చేసే సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఆమిర్ ఖాన్‌కి ఈ చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్ర రాస్తున్నారట మురుగదాస్. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా ఆరంభమవుతుందని బాలీవుడ్ అంటోంది. -
బాలీవుడ్ స్టార్ హీరోలతో మురుగదాస్ కొత్త చిత్రం?
స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రజినీకాంత్‌తో చేసిన దర్బార్ చిత్రం నిరాశపరచింది. దీంతో ఆయనకు అవకాశాలు సన్నగిల్లాయి. ఆ మధ్య విజయ్ హీరోగా చిత్రం చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే విజయ్ ఆయనకు చాన్స్ ఇవ్వడానికి సముఖంగా లేరని తెలిసింది. అదే విధంగా తెలుగులో ఒకరిద్దరు హీరోలతో చిత్రాలు చేయన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇవి కార్యరూపం దాల్చలేదు. ఈనేపథ్యంలో మురుగదాస్ తదుపరి చిత్రం ఏమిటనేది..? సినీ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈయన బాలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోలతో చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏఆర్ మురుగదాస్ ఇంతకుముందే గజిని చిత్రంతో బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. కాగా తాజాగా సల్మాన్‌ఖాన్, షారూక్‌ఖాన్ హీరోలుగా హిందీలో మల్టీస్టార్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 1995లో కరణ్ అర్జున్ అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రలో మెరిశారు. అయితే పూర్తిస్థాయి చిత్రాన్ని మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. దీంతో మురుగదాస్ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. -
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్.. ఇప్పుడు ఏ హీరో డేట్స్ ఇవ్వడం లేదు!
ఒకప్పుడు సౌత్ లోనే టాప్ డైరెక్టర్ మురుగదాస్.ఆ మాటకు వస్తే బాలీవుడ్ లోనూ అతని పేరు బాగా వినిపించింది. సోషల్ ఇష్యూస్ ను తనదైన పంధా డీల్ చేస్తూ, మురుగదాస్ తీసే సినిమాలు అతన్ని ప్రత్యేకమైన దర్శకుడిగా నిలబెట్టాయి.కాని ఇదంతా గతం.ఇప్పుడు మురుగదాస్ చేతిలో సినిమాలే లేవు. రెండేళ్ల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తెరకెక్కించిన దర్బార్ ప్లాఫ్ అవ్వడంతో మురుగదాస్‌కు అవకాశాలు దగ్గాయి. ఇతనితో సినిమాలు చేసేందుకుహీరోలెవరూ ముందుకు రావడం లేదట. దర్బార్ తర్వాత విజయ్ తో సినిమా తీయాల్సింది. కానీ దర్బార్ రిజల్ట్ చూసిన తర్వాత విజయ్ ఈ డైరెక్టర్ ను దూరం పెట్టాడు. దాంతో మురగదాస్ ఆ తర్వాత బన్ని కోసం స్టోరీ రాస్తున్నాడని టాక్ వినిపిచింది. కాని ఐకాన్ స్టార్ పుష్ప సిరీస్ తో బిజీ కావడంతో ఇప్పుడు మురుగదాస్ మరో హీరో డేట్స్ కోసం ట్రై చేయడం మొదలుపెట్టాడు. రెండేళ్ల తర్వాత మురగదాస్ ను నమ్మి సినిమా చేసేందుకు ఓ స్టార్ హీరో డేట్స్ ఇచ్చాడట. ఆ హీరో మరెవరోకాదు చియాన్ విక్రమ్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాను నిర్మించేందుకు సన్ పిక్చర్స్ ప్రయత్నిస్తోందట. రీసెంట్ గా ప్రైమ్ లో రిలీజైన మహాన్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు చియాన్.మురుగదాస్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకోవాలనుకుంటున్నాడట.ఈ చిత్రంతోనైనా మురుగదాస్ గతవైభవాన్ని అందుకుంటాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. (చదవండి: జోరు మీదున్న హీరోలు, రీమేక్ అంటే మరింత హుషారు) -
మహేశ్-కమల్‌తో క్రియేటివ్ డైరెక్టర్ భారీ ప్రాజెక్ట్!
ఈ మధ్యకాలంలో పరిశ్రమతో సంబంధంగా లేకుండా స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోల కాంబినేషన్లు సెట్ అవుతున్నాయి. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రభాస్‌తో సలార్ మూవీ తెరకెక్కిస్తుండగా, ఇక సెన్సెషనల్ దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ పాన్ ఇండియా మూవీ తీయబోతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, విలక్షణ నటుడు కమల్ హాసన్‌లతో క్రియేటివ్ డైరెక్టర్ ఏఆర్ మురుగుదాస్ ఓ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి స్టోరీ లైన్ కూడా సిద్ధమైందని సమాచారం. మహేశ్ ఇందులో సీబీఐ ఆఫీసర్‌గా కనిపించబోతుండగా, కమల్ హాసన్ ఓ యువతి తండ్రి పాత్రలో కనిపిస్తాడని వినికిడి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాలి అంటే దీనిపై డైరెక్టర్ స్పందించేవరకు వేచి చూడాలి. కాగా ఇప్పటికే మురుగుదాస్ గతంలో మహేశ్‌తో స్పైడర్ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కమర్షియల్స్‌గా అంతగా సక్సెస్ అందుకోలేదు. -
కాంబినేషన్ కుదిరేనా?
ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా చేయనున్న దర్శకుడి పేరు ఇదేనంటూ ఇప్పటికే కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రశాంత్ నీల్, అనిల్æరావిపూడి వంటి దర్శకుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కాంబినేషన్ దాదాపు కుదిరినట్లేనని టాక్. ఇదిలా ఉంటే.. దర్శకుడు వేణు శ్రీరామ్‌తో అల్లు అర్జున్ ‘ఐకాన్: కనపడుటలేదు’ సినిమా కమిటయ్యారు. అలాగే కొరటాల శివతో ఓ సినిమా ఫిక్స్ అయింది. మరి... ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేస్తారో చూడాలి. -
మురుగదాస్ పాన్ ఇండియా మూవీ టెటిల్ ఇదే
సామాజిక అంశాలతో కూడిన సినిమాలను తీసేందుకు ఏఆర్ మురుగదాస్ రెడీగా ఉంటారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘స్టాలిన్ , తుపాకి, కత్తి, సర్కార్’ వంటి సినిమాలే ఇందుకు నిదర్శనం. తాజాగా ‘1947’ అనే టైటిల్‌తో సినిమాను ప్రకటించారు మురుగదాస్. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని హిందీ నిర్మాత ఓం ప్రకాశ్భట్ నిర్మిస్తారు. ఇప్పటివరకు అయితే ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ ఏంటి? నటీనటులు ఎవరు? అనే అంశాలపై స్పష్టత రాలేదు. అయితే టైటిల్‌ను బట్టి ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో ఉంటుందని ఊహించవచ్చు. -
పదేళ్లకు జోడీ కుదిరింది
పదేళ్ల క్రితం విజయ్–తమన్నా జంటగా ‘సుర’ అనే తమిళ చిత్రంలో నటించారు. మంచి మాస్ మసాలా ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ జంటగా సినిమా చేయలేదు. పదేళ్ల తర్వాత ఈ జోడీ ఒక సినిమాకి కుదిరిందని సమాచారం. హీరో విజయ్‌కి ‘తుపాకి’, ‘కత్తి’, ‘సర్కార్’ వంటి హ్యాట్రిక్ విజయాలను అందించిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇది విజయ్‌కి 65వ సినిమా కావడం, మురుగదాస్–విజయ్ కాంబినేషన్లో రూపొందే చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోనే విజయ్ సరసన తమన్నా కథానాయికగా నటించనున్నారని తెలిసింది. ‘సర్కార్’ సినిమాను తెరకెక్కించిన సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: సంతోష్ శివన్. -
ఆ దర్శకుడితో విజయ్ నాలుగో సినిమా!
చెన్నై : తమిళ హీరో దళపతి విజయ్.. దర్శకుడు మురుగదాస్ కలిసి మరో సినిమా చేయనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్.. లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్న మాస్టర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్‌కు 64వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదలవ్వాల్సి ఉంది. కాగా మాస్టర్ తర్వాత విజయ్ ఎవరి దర్శకత్వంలో నటించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తొలుత సుధా కొంగర, అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రచారాలు జరిగాయి. (ఆ స్టార్ ప్రేమజంట పెళ్లి వాయిదా!) తాజా వివరాల ప్రకారం.. విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఏఆర్ మురుగదాస్ దర్వకత్వంలో చేయనున్నారని తెలుస్తోంది. అంతేగాక ఇది 2012లో వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమాకు సినిమాకు సీక్వెల్‌గా తీయనున్నట్లు సమాచారం. ఇక తుపాకీలో హీరోయిన్ పాత్ర పోషించిన కాజల్ అగర్వాల్‌నే ఈ సినిమాలోనూ తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. ఆగష్టులో సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇటీవలే మురుగదాస్ రెండు కథలతో విజయ్ను సంప్రదించినట్లు, అందులో ఒకటి తుపాకీ సీక్వెల్ అవ్వగా.. విజయ్ దీనికే మొగ్గు చూపినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్పి ఉంది. కాగా విజయ్, మురుగదాస్ దర్వకత్వంలో ఇప్పటికే మూడు సినిమాలు(తుపాకీ,కత్తి, సర్కార్) విడుదలయ్యాయి. (దర్శకుడి ఇంట్లోకి వారసుడు.. పేరేంటో తెలుసా!) నమస్కారం చేద్దాం: చిరంజీవి -
నాలుగోసారి...
కొన్ని కాంబినేషన్స్ చాలా క్రేజీగా ఉంటాయి. అలాంటి కాంబినేషన్స్‌లో సినిమాలు మళ్లీ మళ్లీ రావాలనుకుంటారు ప్రేక్షకులు. తమిళ హీరో విజయ్–దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్‌లది అలాంటి కాంబినేషనే. ఈ ఇద్దరి కాంబోలో ‘తుపాకి’, ‘కత్తి’, ‘సర్కార్’ సినిమాలు విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు నమోదు చేశాయి. ఈ మూడూ పక్కా కమర్షియల్ సినిమాలు. కానీ సందేశం కూడా ఉండేట్లుగా చూసుకున్నారు విజయ్, మురుగదాస్. ఈ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా రానుందట. ‘సర్కార్’ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. విజయ్ నటించనున్న 65వ చిత్రమిది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ చిత్రం ఆడియో వేడుకను చిత్రబృందం సమక్షంలో జరపాలనుకుంటున్నారు. కరోనా కారణంగా భారీ వేడుక రిస్క్ అని యూనిట్ భావించింది. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతానికి సినిమా థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్‌లు ఆగాయి. ఏప్రిల్‌నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో? మరి ‘మాస్టర్’ చెప్పిన ప్రకారం ఏప్రిల్ 9న వస్తాడా? వాయిదా పడతాడా? చూడాలి. -
‘దర్బార్’ డిస్ట్రిబ్యూటర్ల నిరాహార దీక్ష!
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ సినిమాతో దాదాపు రూ.70 కోట్లు నష్టపోయామని పంపిణీదారులు తెలిపారు. దీంతో ఈ చిత్ర పంపిణీదారులు హీరో రజనీకాంత్‌ను కలవడానికి చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆయనను కలవకుండా వారిని అడ్డుకోవడంతో నిరాహార దీక్ష చేయాలని పంపిణీదారులు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత శనివారం తాము రజనీకాంత్‌ను కలిసేందుకు చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లామని చెప్పారు. ఇంటి సమీపంలోకి వెళ్లగానే పోలీసులు లోపలికి వెళ్లకుండా తమను అడ్డుకున్నారని, రజనీకాంత్ కూడా తమను కలవడాని ఇష్టపడలేదని చెప్పారు. దీంతో తాము నిరాశకు గురయ్యామన్నారు. ఈ క్రమంలో నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు పంపిణీదారులు తెలిపారు. కాగా గతంలో రజనీ నటించిన లింగా చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా రజనీ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. దర్బార్ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టమా? కాగా రూ. 200 కోట్లతో నిర్మించిన దర్బార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్లు వసూలు చేసినప్పటికీ భారీ డిజాస్టర్‌గా నిలిచి పంపిణి దారులకు నష్టాన్నిచ్చింది. అయితే ఈ సినిమాకు రజనీ రూ. 108 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. దర్శకుడు ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించారు. ఇక గజిని, కత్తి వంటి సూపర్ హిట్లను అందించిన మురుగుదాస్.. రజనీతో తీసిన మొదటి సినిమా ఇది. -
దర్బార్ చిత్రంలో నయనతార పాత్ర దారుణం
అగ్రనటి నయనతార మరోసారి వార్తల్లోకెక్కింది. సంచలన నటిగానే కాదు లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నటి నయనతార. లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తూ వాటి భారాన్నంతా తన భుజాలపైనే వేసుకుని విజయాల తీరం చేర్చుతున్న సత్తా కలిగిన నటి ఈ బ్యూటీ. అలాగని స్టార్ హీరోల చిత్రాలను పక్కన పెట్టడం లేదు. అయితే ఇలాంటి చిత్రాలతోనే ఈ అమ్మడు అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. మొన్న విజయ్‌తో, అటు మొన్న తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాల్లోనూ నయనతార పాత్ర నామమాత్రంగానే ఉందనే విమర్శలు వచ్చాయి. ఇకపోతే ఇటీవల రజనీకాంత్‌కు జంటగా నటించిన దర్బార్ చిత్రంలో నయనతార పాత్ర ఇంకా దారుణం అనే విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అందులో రజనీకాంత్‌కు కూతురుగా నటించిన నివేదా థామస్‌కు ఉన్న ప్రాముఖ్యతను కూడా నయనతారకు ఇవ్వలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు దర్బార్ చిత్రంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్‌లా చూపించారనే ఆరోపణలు ఎక్కు పెడుతున్నారు. హీరోయిన్ సెంట్రిక్ కథా పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్న నయనతార అసలు ఇలాంటి చిత్రాలను ఎందుకు ఒప్పుకోవాలనే ప్రశ్నలను అభిమానులు సంధిస్తున్నారు. ఇవి నయనతార దృష్టికి వచ్చింది. చదవండి: విఘ్నేశ్‌తో నయన్ తెగతెంపులు? ఇప్పటికే దర్బార్ చిత్రంలో ఆ చిత్ర దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తన పాత్రకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఆసంతృప్తితో ఉన్న నయనతార ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అభిమానుల విమర్శలకు మరింత అశాంతికి గురవుతున్నట్లు సమాచారం. నిజానికి దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌తో నయనతారకు చాలా కాలంగా కోల్డ్ వార్ జరుగుతోంది. గజని చిత్ర సమయంలోనే తన పాత్రను కట్ చేసి నటి ఆసిన్‌కు ప్రాధాన్యతనిచ్చారని విమర్శించింది. అంతే కాదు తాను చేసిన పెద్ద తప్పు గజని చిత్రంలో నటించడమేనని ఆ మధ్య పేర్కొంది. అలాంటిది దాదాపు 12 ఏళ్ల తరువాత ఇటీవల ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలోనూ నయనతారకు అన్యాయం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి నయనతార ఏఆర్.మురుగదాస్‌పై అసంతృప్తితో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు మూక్కూత్తి అమ్మన్, నెట్రికన్ చిత్రాల్లో నటిస్తోంది.ఈ రెండు చిత్రాలు కథానాయకికి ప్రాముఖ్యత కలిగిన కథా చిత్రాలే అన్నది గమనార్హం. -
దుమ్ము దులుపుతున్న ‘దర్బార్’
రజనీకాంత్ సినిమా అంటేనే అటు సినీ ఇండీస్ట్రీకి ఇటు ఆయన ఫ్యాన్స్‌కు పెద్ద పండగ. రజనీ సినిమా ప్రారంభం నుంచి విడుదలైన తర్వాత వచ్చే టాక్ వరకూ తలైవా ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక సినిమాపై కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా వాళ్ల జోరు మామూలుగా ఉండదు. అలాంటిది హిట్ టాక్ వస్తే ఇక ఏ రేంజ్లో వారి ఆనందం ఉంటుందో ఊహించుకోగలరు. ప్రస్తుతం ‘దర్బార్’ఫలితంతో ఆయన ఫ్యాన్స్ రెండు పండుగలు చేసుకుంటున్నారు. రజనీకాంత్ హీరోగా కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’ . సంక్రాంతి కానుకగా ఈ నెల 9న(గురువారం) విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకపోతోంది. అంతేకాకుండా వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చాలాకాలం తర్వాత పోలీస్ గెటప్‌లో కనిసిస్తుండటం, మురగదాస్ దర్శకత్వం వహిస్తుండటం, టీజర్, ట్రైలర్, పాటలు ఓ రెంజ్లో ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ భారీ అంచానల నడుమ విడుదలై ఈ సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మొదటి రోజే ఏకంగా రూ. 36 కోట్ల వరకు వసూలు చేసింది. కేవలం తమిళనాటనే దాదాపు రూ. 19 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసిందంటే కోలీవుడ్‌లో రజనీ స్టామినా ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. ఇక కేవలం దక్షిణాదినే కాకుండా బాలీవుడ్, ఓవర్సీస్లోనూ రజనీకి మంచి పట్టు ఉండటంతో అక్కడ కూడా ‘దర్బార్’భారీ వసూళ్లు రాబడుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే ‘దర్బార్’ రూ. 50 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం రెండో రోజు కూడా తన జోరును కొనసాగించింది. బాలీవుడ్లో తానాజీ, ఛపాక్ చిత్రాలు విడుదలైనప్పటికీ ‘దర్బార్’జోరు, హుషారు ఏమాత్రం తగ్గలేదు. ఆ చిత్రాలకు ధీటుగా పోటీనిస్తూ కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగించింది. అదేవిధంగా శుక్రవారం తెలుగులో మరే సినిమా లేకపోవడం దర్బార్‌కు మరింత కలిసొచ్చింది. రెండో రోజు కూడా దాదాపు రూ. 50 కోట్ల పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఓవరాల్‌గా సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రజనీ దర్బార్ రూ. 100 కోట్ల మార్క్ దాటిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఏదేమైనప్పటికీ ‘రజనీ దర్బార్’బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేయబోతోందని అతడి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. నయనతార, నివేదా థామస్, సునీల్ శెట్టి, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతమందించాడు. చదవండి: దర్బార్ : మూవీ రివ్యూ అమితాబ్ సూచనను పాటించలేకపోతున్నా -
దర్బార్ : మూవీ రివ్యూ
టైటిల్: దర్బార్ జానర్: యాక్షన్ ఎంటర్టైనర్ నటీనటులు: రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, యోగిబాబు, సునీల్ శెట్టి, సంగీతం: అనిరుద్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్ బ్యానర్: లైకా ప్రొడక్షన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తనదైన స్టైల్లో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సంబరాలను ప్రారంభించాడు. దర్బార్ సినిమాతో బాక్సాఫీస్ బరిలో పందెంకోడిలా దూకాడు. ఇది డబ్బింగ్ సినిమా అయినా.. తెలుగులో రజనీకాంత్‌కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే పెద్ద సినిమాగానే పరిగణించాలి. గతంలో కబాలి, కాలా, 2.0, పెట్టా వంటి సినిమాలతో తెలుగువారిని పలుకరించిన ఈ సూపర్‌స్టార్ తన స్టామినాకు తగ్గ హిట్‌ను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో స్టార్ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తొలిసారి రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడం.. సంక్రాంతి బరిలో దిగుతుండటంతో ‘దర్బార్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు రజనీ సరసన నయనతార నటిస్తుండటం.. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లో ఆదిత్య అరుణాచలంగా రజనీ తనదైన లుక్స్‌తో మెస్మరైజ్ చేయడం సినిమాపై అంచనాలను పెంచింది. సంక్రాంత్రి కానుకగా తాజాగా ప్రేక్షకుల ముందుకు ‘దర్బార్’ ఏమేరకు ప్రేక్షకుల మెప్పించిందో తెలుసుకుందాం పదండి... కథ: ముంబై పోలీసు కమిషనర్ అయిన ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్) ఒక్కసారిగా ఆవేశానికిలోనై.. రౌడీలను, గ్యాంగ్స్టర్లను విచ్చలవిడిగా కాల్చిచంపుతుంటాడు. అతని ఎన్కౌంటర్లపై విచారణ జరపడానికి వచ్చిన మానవహక్కుల కమిషన్ సభ్యులను కూడా బెదిరిస్తాడు. ఏదైనా పని చేపడితే.. దానిని కంప్లీట్‌గా క్లీన్ చేసే వరకు వదిలిపెట్టని ఆదిత్య అరుణాచలం ముంబైలో డ్రగ్స్, హ్యుమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌లను ఏరివేసే క్రమంలో కిరాతకుడైన విక్కీ మల్హోత్రా కొడుకు అజయ్ మల్హోత్రాను అరెస్టు చేస్తాడు. ఆదిత్య అరుణాచలం వ్యూహాలతో అనూహ్య పరిస్థితుల నడుమ జైల్లోనే అజయ్ హతమవ్వాల్సి వస్తోంది. దీంతో డ్రగ్‌లార్డ్, మొబ్స్టర్ అయిన హరిచోప్రా (సునీల్ శెట్టి) ప్రతీకారానికి తెగబడతాడు. ఆదిత్య కూతురితోపాటు విక్కీని కూడా చంపుతాడు. అతనెందుకు ఈ హత్యలు చేశాడు. గతంలో పోలీసులను సజీవదహనం చేసి ముంబై పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసిన హరిచోప్రా అసలు ఎవరు? ఈ చిక్కుముడులను ఆదిత్య అరుణాచలం ఎలా విప్పాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ.. నటీనటులు: దక్షిణాది వెండితెరపై ఇప్పటికీ తిరుగులేని సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయనకు వయస్సు పెరుగుతున్నా.. రోజురోజుకు స్టామినా మాత్రం తగ్గడం లేదు. తనదైన స్టైల్, గ్లామర్, యాక్టింగ్, పంచ్ డైలాగులతో రజనీ ఇప్పటికీ వెండితెరమీద ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు. తాజా సినిమా ‘దర్బార్’ కూడా పూర్తిగా రజనీ స్టైల్, మ్యానరిజమ్స్, పంచ్ డైలాగుల మీద ఆధారపడింది. ముంబై పోలీసు కమిషనర్‌గా రజనీ లుక్, స్టైల్, మ్యానరిజమ్స్ ఫ్యాన్స్‌తో అదరహో అనిపిస్తాయి. పోలీసు కమిషనర్‌గా రౌడీ మూకలను రప్ఫాడిస్తూనే.. ఇటు నయనతారతో మనస్సు గెలిచేందుకు ప్రయత్నించే పాత్రలో రజనీ అదరగొట్టాడు. తన ఏజ్‌కు తగ్గట్టు నడి వయస్సు పాత్ర పోషించిన రజనీ.. నయనతారతో మాట్లాడేందుకు, ఆమె ప్రేమ గెలిచేందుకు పడే పాట్లు ప్రేక్షకులను నవిస్తాయి. ఇక, హీరోయిన్గా నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇది ప్రధానంగా తండ్రీ-కూతురు మధ్య సెంటిమెంట్ కథ. తండ్రిగా రజనీ, కూతురిగా నివేదా థామస్ తెరపై అద్భుతంగా ఒదిగిపోయారు. స్నేహితుల్లా ఉండే తండ్రీ-కూతురు మధ్య సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. సెంకడాఫ్‌లో ఇద్దరి పాత్రలు, అభినయం ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుంది. ఇక, విలన్‌గా సునిల్ శెట్టి ఓ మోస్తరుగా నటించాడు. రజనీ స్థాయికి తగ్గ విలన్ అయితే కాదు. యోగిబాబు కామెడీ అంతంతమాత్రమే ఉండగా.. ముంబై నేపథ్యం కావడంతో ఎక్కువశాతం నటులు కొత్తవాళ్లు, బాలీవుడ్ వాళ్లు సినిమాలో కనిపిస్తారు. విశ్లేషణ: రజనీకాంత్‌ను మరోసారి తెరమీద పోలీసు ఆఫీసర్‌గా చూపిస్తూ మురగదాస్ తీసుకొచ్చిన ‘దర్బార్’ సినిమాలో కథ అంత బలంగా కనిపించదు. ఇలాంటి రివేంజ్ డ్రామా కథలతో ఇప్పటివరకు చాలా సినిమాలే వచ్చాయి. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏమిటంటే అది కచ్చితంగా రజనీకాంత్. ప్రతి ఫ్రేములోనూ రజనీని స్టైలిష్‌గా చూపించడంలో, రజనీ స్టైల్స్, మ్యానరిజమ్స్ ఉపయోగించుకోవడం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ, కథ కొత్తది కాకపోవడం, క్లైమాక్స్ రోటిన్‌గా ఉండటంతో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా కొంత బోర్ కొట్టవచ్చు. ఇక, సెకండాఫ్‌లో కథ కొంచెం నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా బాగున్నా.. క్లైమాక్స్ రోటిన్‌గానే అనిపిస్తుంది. ఈ సినిమాకు ప్రధాన బలం అనిరుద్ అందించిన నేపథ్య సంగీతం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో చాలా సీన్లను అనిరుద్ ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ముఖ్యంగా రైల్వేస్టేషన్లో వచ్చే ఫైట్ సీన్లో ఫైట్ స్టైలిష్‌గా ఉండటంతోపాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్బ్‌గా అనిపిస్తుంది. అయితే, డబ్బింగ్ సినిమా కావడంతో పాటలు చాలావరకు రణగొణధ్వనుల్లా అనిపిస్తాయి. ఇక, సినిమాటోగ్రఫి బాగుంది. సినిమా నిర్మాణ విలువలూ రిచ్‌గా ఉన్నాయి. మొత్తానికీ ఈ సినిమా రజనీ ఫ్యాన్స్‌కు పండుగే అని చెప్పవచ్చు. బలాలు రజనీకాంత్ స్టైలిష్ లుక్, మ్యానరిజమ్ కూతురిగా నివేదా థామస్ నటన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బలహీనతలు రజనీ స్థాయికి తగ్గట్టు కథ బలంగా లేకపోవడం ఒకింత రోటిన్ కథ కావడం, రోటిన్ క్లైమాక్స్ - శ్రీకాంత్ కాంటేకర్ -
దర్బార్: ట్విటర్లో ఏమంటున్నారంటే?
సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయి. అంతేకాకుండా చాలా కాలం తర్వాత తలైవా పోలీస్ గెటప్‌లో కనిపిస్తుండటంతో థియేటర్లో రచ్చరచ్చే అని ఫ్యాన్స్ ఆనందపడ్డారు. ఇక సంక్రాంతి కానుకగా నేడు(గురువారం) ‘దర్బార్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ‘దర్బార్’ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విటర్లో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. రజనీ వన్ మ్యాన్ షోతో అదరగొట్టారని.. ఈ సినిమాతో అలనాటి తలైవాను మళ్లీ చూశామని తమిళ తంబిలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో రచ్చరచ్చ చేశాడంట. అదేవిధంగా ఇంటర్వెల్ సీన్ అదిరిపోయిందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే రేసు గుర్రం పరిగెట్టినట్టు పరిగెత్తిందని అందరూ చెబుతున్న కామన్ పాయింట్. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టకుండా ఉందట. ఇక సెకండాఫ్‌లో డైరెక్టర్ తన క్రియేటివిటీని ప్రదర్శించాడని అంటున్నారు. దీంతో బొమ్మ బ్లాక్‌బస్టర్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘జెట్ స్పీడ్ స్క్రీన్ ప్లే, ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. కామెడీ, రొమాంటిక్, యాక్షన్స్ సీన్స్‌లో తలైవా అదరగొట్టాడు. విలన్ ఇంటర్వెల్‌కు ముందు రావడంతో అసల ఆట ఆరంభవుతుంది’అంటూ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘ఈ సినిమా రూ.400-500 కోట్లు వసూలు చేయకపోతే సినీ అభిమానులకు టేస్ట్ లేదని అర్థం’, ‘తలైవా వన్ మ్యాన్ షో. రజనీ ఎనర్జీ, స్టైల్, చరిష్మా అందరినీ ఇన్స్పైర్ చేసేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రజనీని చాలా కొత్తగా చూపించారు. ఘనవిజయాన్ని అందుకున్న ‘దర్బార్’ టీంకు శుభాకాంక్షలు’, ‘బొమ్మ బ్లాక్‌బస్టర్ హిట్’, అంటూ పలువురు నెటజన్లు ట్విటర్లో కామెంట్ చేస్తున్నారు. Hats off to Thalaivar and ARM. #Darbar Every minute enjoyable. No doubt , #Darbar going to be industrial hit and massive blockbuster. Only one super star and thalaivar. No one can stand in front of thalaivar. #DarbarThiruvizha#DarbarFDFS #DarbarThiruvizha — looking for good leader (@suchi2019) January 9, 2020 #Darbar 1st half - It's a complete Vishwaroopam of #SuperstarRajinikanth's charisma, energy & screen presence🙏👑 #Thalaivar pinni pedal edukaraaru. Ageless!#TharamMaaraSingle la avar panra dance, settai (enjoying Mahanadhi Kamal sir's kiss scene) etc vera ragam👌😎 Delightful — Kaushik LM (@LMKMovieManiac) January 9, 2020 -
రవితేజ టీంకు మురుగదాస్ విషెస్
సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దిట్ట. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘దర్బార్’. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. చాలా కాలం తర్వాత రజనీ పోలీస్ గెటప్‌లో అభిమానులను కనువిందు చేయనున్నాడు. ఇక చిత్ర ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజనీ, దర్బార్ టీంతో పాటు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అయితే ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లోనే ఉన్న డైరెక్టర్ ఏఆర్ మురగదాస్.. రవితేజ తాజా చిత్రం ’క్రాక్’ సెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన విషయాలను తెలుసుకున్న మురుగదాస్ అనంతరం డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి చిత్ర సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఏఆర్ మురుగదాస్ క్రాక్ సెట్‌ను సందర్శించిన ఫోటోను గోపిచంద్ మలినేని తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. కాగా, డాన్ శీను, బలుపు వంటి చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా పేరొందిన గోపీచంద్ మలినేని తాజాగా రవితేజతో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో టెంపర్ పోలీసాపీసర్‌గా రవితేజ కనిపించునున్నాడు. ఇప్పటికే న్యూఇయర్ కానుకగా విడుదలై ‘క్రాక్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. సమ్మర్లో విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండగా సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘డిస్కో రాజా’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు
‘‘రజనీకాంత్‌గారితో సినిమా చేయాలని 15 ఏళ్లగా అనుకుంటున్నా. కానీ కుదర్లేదు. ఫైనల్‌గా ఆయనతో సినిమాకి కాల్ వచ్చింది. ఆ న్యూస్ బయటకు వచ్చేసింది. నా మిత్రులందరూ ఫోన్ చేసి అభినందించారు. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. తుది నరేషన్‌లోనూ సినిమా కుదరకపోవచ్చు. అలా జరగకూడదనుకున్నాను. అందుకే ఏ మార్పు సూచించినా నాలుగైదు ఆపషన్స్ ఉండేట్టు కథ తయారు చేసుకుని రజనీసార్ దగ్గరకు వెళ్లాను’’ అని దర్శకుడు మురుగదాస్ అన్నారు. రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ తెలుగులో ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మురుగదాస్ మీడియాతో మాట్లాడారు. ► చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో మా స్వగ్రామం. అక్కడ కేవలం 2 థియేటర్స్ ఉండేవి. చిన్నప్పుడు అమ్మతో కలసి రజనీగారి సినిమా చూశాను. రజనీగారిది ఈ ఊరే. థియేటర్లో ఉంటారు అనుకునేవాణ్ణి. ఓసారి అక్క వాళ్ల ఇంటికి వెళ్తే ఆ ఊరి థియేటర్లోనూ ఉన్నారు. రజనీగారిది మన ఊరు కదా ఇక్కడికి ఎలా వచ్చారు అని నాకు డౌట్ వచ్చింది. అది సినిమా, ఆయన నటుడు అని వివరించి చెప్పారు మా అక్క. నా 5వ తరగతిలో చెన్నై టూర్ వెళ్లాను. చెన్నైలో రజనీసార్ ఎక్కడ అని చూస్తూ ఉండేవాణ్ణి. ఆ తర్వాత అసిస్టెంట్ దర్శకుడిగా ఉన్నప్పుడు రజనీగారిని దూరంగా చూశాను. ‘గజిని’ అప్పుడు డైరెక్ట్‌గా కలిసే అవకాశం వచ్చింది. ► తమిళ ‘గజిని’ రిలీజ్ అయ్యాక రజనీగారు ఫోన్ చేశారు. తమిళంలో మంచి సినిమా రిలీజ్ అయితే అభినందించడం ఆయనకు అలవాటు. ఆ టీమ్‌తో సంభాషిస్తారు. ‘గజని’ అప్పుడు నాకు ఆ అవకాçశం కలిగింది. ఆయన ‘శివాజీ’ చేస్తున్న సమయంలో మేం కలిసి సినిమా చేయాలనుకున్నాం. అప్పుడు ‘గజిని’ హిందీ రీమేక్‌తో నేను, ‘రోబో’తో ఆయన బిజీగా ఉన్నాం. ఏడాదిన్నర క్రితం మళ్లీ సినిమా చేయాలనుకున్నాం. ఈసారి అవకాశం మిస్ అవ్వకూడదు అనుకున్నాను. ► రజనీకాంత్ గారిని నేను ఎలా చూడాలనుకుంటున్నానో, ఆయన్ను స్క్రీన్ మీద చూసి ఎలా ఎంజాయ్ చేశానో అది ఈ జనరేషన్ వాళ్లకు కూడా కనెక్ట్ అయ్యేలా ‘దర్బార్’లో చూపించాను. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే పోలీస్ కథ ఇది. సమాజంలో జరిగే అన్యాయాలకు తనదైన శైలిలో న్యాయం చేసే పోలీస్ కథ. ఇందులో ఫ్యాన్స్ ఆయన్నుంచి ఆశించే మేనరిజమ్స్, స్టయిల్స్ అన్నీ ఉంటాయి. రజనీగారితో ఈ ప్రయాణంలో చాలా తెలుసుకున్నాను. దేవుడి గురించి ఆయన చాలా విషయాలు చెప్పారు. నాకో పుస్తకం కూడా ఇచ్చారు. ► సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా. సినిమా కేవలం వినోదంగానే ఉండకూడదని నా అభిప్రాయం. అందుకే సందేశం ఇవ్వాలనుకుంటాను. ఆ సందేశం వల్ల ఒక్క రాత్రిలో జనాలు మారిపోతారని కాదు. కానీ ఓ ఆలోచన కలుగుతుంది. మెల్లిగా తెలుసుకుంటారు. కమర్షియల్ సినిమాలో, పెద్ద హీరోల సినిమాల్లో సందేశం జోడిస్తే ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది. ► రజనీకాంత్‌గారు మేకప్ వేసుకొని కేరవేన్ నుంచి బయటకు వచ్చాక మళ్లీ లంచ్ బ్రేక్, షూటింగ్ ప్యాకప్ అప్పుడే లోపలికి వెళ్తారు. షూటింగ్ లేట్ అయినా సహకరిస్తారు. ► మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్‌గా ఎదిగిన అమ్మాయి నయనతార. ఆమె ఎదుగుదలను మనం గౌరవించాలి. చాలా గ్యాప్ తర్వాత నయనతార, రజనీసార్ కలసి యాక్ట్ చేశారు. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ఎన్వీ ప్రసాద్‌గారితో ఎప్పటి నుంచో నాకు పరిచయం ఉంది. ఆయన నిర్మాతలా కాకుండా ఫ్యామిలీ మెంబర్లా ఉంటారు. నా తదుపరి చిత్రం గురించి నిర్ణయించుకోలేదు. ‘తుపాకీ’ సీక్వెల్ ఆలోచన ఉంది. ► ఈ సినిమాలో హీరో పాత్రకు ఓ పవర్ఫుల్ పేరు పెట్టాలి. ఏం పెట్టాలా అని ఆలోచించాను. షూటింగ్లో ఆలోచిద్దామనుకున్నా. హీరో వేసుకునే పోలీస్ యూనిఫామ్ మీద నేమ్‌ప్లేట్ తయారు చేయాలని ముందే అడిగేసరికి మా నాన్న పేరు (అరుణాచలం) మా అబ్బాయి (ఆదిత్య) పేర్లు కలిపి ఆదిత్యాఅరుణాచలం అని పెట్టా. ► ప్రస్తుతం కొత్త కొత్త దర్శకులు కొత్త కొత్త ఆలోచనలతో సినిమాలు తీస్తున్నారు. నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా డైరెక్టర్స్ అవుతున్నారు. నేను ఇచ్చిన కథతో శరవణన్ అనే అతను ‘రాంగీ’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిష కథానాయిక. ► తెలుగులో స్ట్రయిట్‌గా నేను తీసిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. స్టార్‌డమ్‌ను అంచనా వేయడంలోనో ఇంకేదో విషయంలోనో మిస్ అయ్యాను. మహేశ్‌బాబు లాంటి సూపర్‌స్టార్, కష్టపడే హీరోకు హిట్ ఇవ్వలేదని బాధపడ్డాను. సినిమా రిలీజ్ అయిన 10 రోజుల తర్వాత కూడా నన్ను ప్రోత్సహించేలా మెసేజ్‌లు పంపారు మహేశ్‌గారు. ఆయన చర్మం రంగు కంటే ఆయన మనసు ఇంకా తెలుపు. సినిమాను ఇంతలా ప్రేమించే హీరోకు హిట్ ఇవ్వలేకపోయాననే బాధ ఎప్పటికీ ఉంటుంది. -
‘దర్బార్’ ప్రీ రిలీజ్ వేడుక
-
తక్కువగా ఆశ పడితే సంతోషంగా ఉంటాం
‘‘1976లో తెలుగులో నా ‘అంతులేని కథ’ సినిమా విడుదలైంది.. ఇçక్కడున్న వారిలో 99శాతం మంది అప్పుడు పుట్టి ఉండరు. తమిళ ప్రేక్షకులు నన్ను ఎంతగా ప్రేమిస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ప్రేమించడం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు రజనీకాంత్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్, నయనతార జంటగా రూపొందిన చిత్రం ‘దర్బార్’. ఎ. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఈ నెల 9న ‘దర్బార్’ విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఎన్వీ ప్రసాద్‌గారు నాకు 20ఏళ్లుగా తెలుసు.. సినిమా ఆడినా, ఆడకున్నా ఒకేలా ఉంటారాయన. మామూలుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌ను ఆయన కొంచెం లో ప్రొఫైల్‌లో చేసేవారు. కానీ ‘దర్బార్’ సినిమా హిట్ అని తెలిసిపోయినట్టుంది ఆయనకు.. అందుకే ఇంత భారీ వేడుక ప్లాన్ చేశారు. నా వయసు 70 ఏళ్లు.. ఇంకా నేను హీరోగా నటిస్తున్నానంటే ప్రేక్షకుల అభిమానం, ప్రోత్సాహమే కారణం.. అవే నా ఎనర్జీ. ఈ వయసులోనూ మీరు ఇంత సంతోషంగా, ఉత్సాహంగా ఎలా ఉన్నారని కొందరు అడుగుతారు.. నేను వారికి చెప్పేది ఒక్కటే. తక్కువగా ఆశ పడండి.. తక్కువ ఆలోచనలు పెట్టుకోండి.. తక్కువగా భోజనం చేయండి, తక్కువగా నిద్రపోండి.. తక్కువగా వ్యాయామాలు చేయండి.. ఇవన్నీ చేస్తే సంతోషంగా ఉంటాం (నవ్వుతూ). తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ‘పెదరాయుడు, బాషా, నరసింహా, చంద్రముఖి, రోబో’ వంటి సినిమాలు రజనీ ఉన్నాడని బాగా ఆడలేదు.. ఆ సినిమాలు బాగున్నాయి.. వాటిల్లో రజనీ ఉన్నాడంతే. అందరూ సక్సెస్ఫుల్ సినిమా తీయాలి, బాగా ఆడాలని తీస్తారు. సినిమా తీసేటప్పుడు ఓ మ్యాజిక్ జరుగుతుంది, ఆ సినిమా బాగా వస్తుంది. అయితే అది మన చేతుల్లో ఉండదు. ‘దర్బార్’ చేసేటప్పుడు ఆ మ్యాజిక్ మాకు తెలిసిపోయింది. మురుగదాస్‌గారితో పని చేయాలని 15ఏళ్లుగా చూశాను కానీ కుదర్లేదు.. ఇప్పుడు కుదిరింది. సుభాస్కరన్‌గారు పెద్ద వ్యాపారవేత్త. సినిమాలంటే ఇష్టంతో తీస్తున్నారు.. ఇప్పుడు మన ‘బాహుబలి’లాగా ‘పొన్నియిన్ సెల్వన్’ అనే ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ తీస్తున్నారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్ చివరలో రజనీసార్ నడుచుకుంటూ వచ్చే షాట్‌కి నేను ఫిదా అయిపోయా. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఇరగదీస్తున్న మురుగదాస్‌గారికి సెల్యూట్. రజనీ సార్ ‘జీవన పోరాటం’ సినిమా టైమ్‌లో నేను పిల్లాణ్ణి.. ఆ సినిమాలో ఆయన స్టైల్ చూసి, అలా చేయాలని ప్రయత్నించా. కానీ, రాలేదు’’ అన్నారు. మురుగదాస్ మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో ఇది చాలా ముఖ్యమైన సినిమా.. ఎందుకంటే రజనీగారితో నేను చేసిన తొలి మూవీ. అలాగే నేను తీసిన తొలి పోలీస్ స్టోరీ. పదిహేనేళ్ల క్రితం రజనీగారిని ప్రేక్షకులు ఎలా చూశారో ఆ స్టైల్, ఆ మాస్ అంశాలన్నీ ‘దర్బార్’లో ఉన్నాయి. ఇలాంటి ప్యాన్ ఇండియన్ సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ సార్‌కి ధన్యవాదాలు. సుభాస్కరన్‌గారు నిజమైన హీరో. భవిష్యత్‌లో ఆయన లైఫ్ స్టోరీ ఒక బయోపిక్‌గా రావొచ్చు. అంత మంచి లైఫ్ స్టోరీ ఆయనది. రజనీగారికి ప్రత్యర్థిగా ఉండే బలమైన పాత్రని సునీల్శెట్టిగారు బ్యాలెన్స్ చేశారు’’ అన్నారు. నివేదా థామస్ మాట్లాడుతూ– ‘‘ఇంత పెద్ద సినిమాలో ఈ పాత్రకి నేను సరిపోతానని అవకాశం ఇచ్చిన మురుగదాస్‌గారికి చాలా థ్యాంక్స్. షూటింగ్లో రజనీ సార్ ఎలా మాట్లాడుతున్నారు? ఎలా నటిస్తున్నారని చూస్తూనే ఉండేదాన్ని. విజయ్, అజిత్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, నాని.. ఇలా అందర్నీ మనం అభిమానిస్తాం. వాళ్లందరికీ కామన్‌గా నచ్చే ఒక యాక్టర్ రజనీ సార్’’ అన్నారు. పాటల రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి ‘2.ఓ’కి ఓ పాట, ‘పేట’కి ఓ పాట రాసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ‘దర్బార్’లో రెండు పాటలు రాశా’’ అన్నారు. సంగీత దర్శకుడు అనిరుద్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా నాకు ప్రత్యేకం.. ఎందుకంటే నా మనసుకు బాగా దగ్గరైన చిత్రమిది. ఈ అవకాశం ఇచ్చిన రజనీసార్‌కి, తన కలల చిత్రంలో చాన్స్ ఇచ్చిన మురుగదాస్‌కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘రజనీగారిని అందరూ సూపర్‌స్టార్ అని పిలుస్తారు. కానీ, నా వరకు ఆయన గాడ్ ఆఫ్ సినిమా. ఆయన నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. సెట్లో మురుగదాస్‌గారు మా అందరికీ గురువు’’ అన్నారు బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి. ‘‘రజనీకాంత్‌గారితో తొలిసారి ‘దళపతి’ సినిమాకు చేశాను. ఆయన ఎనర్జీలో మార్పు లేదు’’ అన్నారు కెమెరామేన్ సంతోష్ శివన్. ఈ వేడుకలో నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, కేకే రాధామోహన్, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, పాటల రచయిత కృష్ణకాంత్, గాయకుడు శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈ స్టార్ హీరోను కొత్తగా చూపించాలనుకున్నా’
రాజకీయాలకనుగుణంగా దర్బార్ చిత్రంలో రజనీకాంత్ పాత్రను రూపొందించలేదని ఈ చిత్ర దర్శకుడు ఏఆర్.మురుగదాస్ పేర్కొన్నా రు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా దర్బార్ ఫీవర్ నడు స్తోంది. ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించిన చర్చే. అందుకు కారణం చిత్ర కథానాయకుడు సూపర్‌స్టార్ కావడమే. దీనికి దర్శకుడు ఏఆర్.మురుగదాస్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రం దర్బార్ కావడం ఈ క్రేజ్‌కు మరో కారణం. ఇక అగ్రనటి నయనతార నాలుగోసారి రజనీకాంత్‌తో జత కట్టడం, యువ సంగీతతెరంగం అనిరుద్ సంగీతాన్ని అందించడం, లైకా సంస్థ రాజీలేని నిర్మాణం వెరసి దర్బార్ అంచనాలను పైపైకి పెంచేస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే సుమారు 10 ఏళ్ల తరువాత రజనీకాంత్ పోలీస్ అధికారిగా నటించడం కూడా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రజనీ దర్బార్ 2020 జనవరి 9వ తేదీన ఒక ప్రభంజనం సృష్టించడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు ఏఆర్.మురుగదాస్ శనివారం ఉదయం స్థానిక టీ.నగర్‌లోని లైకా సంస్థ కార్యాలయంలో మీడియాను కలిశారు. దర్బార్ అంటే? దర్బార్ అంటే రూలింగ్ చేసే స్థలం అనవచ్చు. దర్బార్ చిత్రం గురించి చెప్పండి? చిత్ర కథ గురించి ఇప్పుడే రివీల్ చేయలేను గా నీ, ఇది పూర్తిగా ముంబైలో చిత్రీకరించిన చిత్రం. రజనీకాంత్ పోలీస్‌కమిషనర్‌గా నటించారు. ఈ చిత్ర కథకు ఎక్కడ బీజం పడింది? ఒకసారి రజనీకాంత్‌ను కలవడానికి కారులో వెళుతున్నాం. నిర్మాత థానునే రజనీకాంత్‌కు నన్ను పరిచయం చేశారు. అలా కారులో పయనిస్తుండగానే కథ గురించి ఆలోచించాను. రజనీకాంత్ గత పదేళ్లుగా చేస్తున్నవేంటి? చేయని విషయాలు ఏంటి. అన్న దాని గురించి బేరీజు వేసుకున్నాను. రజనీకాంత్‌ను ప్రస్తుతం చేస్తున్న చిత్రాలకు భిన్నంగా చూపించాలన్న విషయంలో చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను. పదేళ్లుగా ఆయన నటించిన చిత్రాలకు భిన్నంగా, కొత్తగా రజనీకాంత్‌ను చూపించాలనుకున్నాను. అలాగని కోట్లకు పడగలెత్తిన రజనీకాంత్ మోసానికి గురై ఆస్తులు పోగొట్టుకుని తిరిగి సంపాందించుకోవడం లాంటి కథను, డాన్ ఇతివృత్తంతో కూడిన కథను ఆయనతో చేయాలనిపించలేదు. మరో విషయం ఏమిటంటే తుపాకీ చిత్రం షూటింగ్ సమయంలో మిలటరీ నేపథ్యంలో చిత్రం చేస్తే, హర్బర్‌లో షూటింగ్ చేస్తే ఆ చిత్రాలు ఆడవు అని అర్థం చేసుకున్నాను. అలాంటి ఆలోచనలోంచి పుట్టిందే పోలీస్అధికారి పాత్ర. రజనీకాంత్‌ను కలిసినప్పుడు యూండ్రుముఖం చిత్రంలో అలెక్స్ పాండియన్‌ను పూర్తి స్థాయిలో చూపించాలనుకుంటున్నట్లు చెప్పారు. అది విన్న ఆయన బాగుంది చేద్దాం అని చెప్పారు. రజనీకాంత్‌ను పోలీస్ గెటప్‌లో మీసం, గెడ్డంతో చూపించడానికి కారణం? నిజానికి పోలీసులకు గడ్డం ఉండదు. అలా ఉండాలంటే రీజన్ ఉండాలి. గెడ్డం లేకపోతే ముఖానికి అలెర్జీ వస్తుందనో, ఏదైనా మొక్కుబడి లాంటి రీజన్లతో పై అధికారి వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఒక పోలీస్అధికారి సూచనలను తీసుకున్నాం. అలా ఒక రీజన్‌తో దర్బార్ చిత్రంలో రజనీకాంత్‌కు గడ్డెం, మీసం పెట్టాం. మహిళల రక్షణ గురించి ఏమైనా చెప్పారా? అలాంటి చిన్న చిన్న అంశాలు ఉంటాయి. అవి రియలిస్టిక్‌గా ఉంటాయి. నిజానికి మహిళా రక్షణ చట్టాలు ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో చాలా బాగా అమలవుతున్నాయి. తమిళనాడులో కూడా అలాంటి చట్టాలు అమలయితే బాగుంటుంది. దర్బార్ చిత్ర ట్రైయిలర్ చూస్తుంటే రక్తపాతం అధికంగా ఉన్నట్లు తెలుస్తోందే? దీన్ని పాన్ ఇండియా చిత్రంగా ఉండాలని భా వించాం. తమిళం, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ రూపొందించ తలపెట్టాం. బాలీవుడ్ చిత్రా ల్లో కాస్త వైలెన్స్ అధికంగా ఉంటేనే అక్కడ ప్రేక్షకులు చూస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫాన్ ఇండియా చిత్రంగా దర్బార్‌ను తెరకెక్కించాం. ఈ చిత్ర షూటింగ్లో రజనీకాంత్‌ను చాలా దగ్గరుండి చూశారు. ఆయన గురించి? రజనీకాంత్ చాలా ఆశ్యర్యకరమైన వ్యక్తి. షూ టింగ్ ముగిసిన తరువాత ఆయన్ని చూడడానికి వేలాది మంది అభిమానులు ఎదురుచూస్తుంటా రు. ఒక సూపర్‌స్టార్, త్వరలో రాజకీయరంగ ప్ర వేశం చేయబోతున్న వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రజనీకాంత్ అలాంటివేవీ లేకుండా చాలా సహజంగా అందరిని పలకరిస్తూ, వారితో ఫొటోలు దిగుతూ ఎంతో నిరాడంబరతను ప్రదర్శిస్తారు. అంతే కాదు నేను ఏ ప్రశ్ర అడిగినా, అది వ్యక్తిగతం అయినా, రాజకీయపరమైనదైనా, ఆధ్యాత్మికపరమై నది అయినా అన్నింటికీ బదులిచ్చేవారు. ముఖ్యంగా నటనపై ఆయనకు ఉన్న తపన నన్ను ఎంతగానో ఆశ్చర్యచకితుడిని చేసింది. ప్రతి సన్నివేశం గురించి బాగుందా? అని అడుగుతారు. అంత డెడికేషన్స్ ఈ తరం నటుల్లో చాలా తక్కువే ఉంటుంది. రజనీకాంత్ త్వరలో రాజకీయరంగప్రవేశం చేయనున్నారు.ఈ చిత్రం ఆయన రాజకీయాలకు ఎంత వరకూ ఉపయోగపడుతుంది? నిజం చెప్పాలంటే రజనీకాంత్ రాజకీయాలకు ఉ పయోగపడేలా దర్బార్ చిత్ర కథను తయారు చేయలేదు. అలాంటి వాటిని అవైడ్ చేశాం. అయితే చిత్రంలో చిన్న చిన్న సన్నివేశాలు అలాంటివి ఉంటాయి. ఎంజీఆర్ రాజకీయ రంగప్రవేశానికి ముందు ఉలగం చుట్రుం వాలిబర్ చిత్రం చేశారు. ఆ చిత్రం ఆయన రాజకీయా రంగప్రవేశానికి తోడ్పడింది? నిజమే. అయితే ఎంజీఆర్ నటించిన ఉలగం చుట్రుం వాలిబర్ చిత్రం వేరు. రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్ర కథ వేరు. ఎంజీఆర్ ఉలగం చుట్రుం వాలిబర్ జేమ్స్‌బాండ్ తరహా కథతో కూడినది. దర్బార్ ఒక పవర్ఫుల్ పోలీస్అధికారి ఇతి వృత్తంతో కూడిన చిత్రం. రజనీకాంత్ ఆలోచనలు చాలా యంగ్‌గా ఉంటాయి. ఆయనలో ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. 40 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తారు. రజనీ రాజకీయ ప్రవేశం గురించి? ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పేటంతటి వాడిని కాదు. అయితే ఆయనలో ప్రజలకు మంచి చేయాలన్న తపన మాత్రం ఉంది. చదవండి: అమితాబ్ సూచనను పాటించలేకపోతున్నా ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించాలని ఉంది -
దుమ్మురేపుతున్న ‘డుమ్ డుమ్’ పాట
రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ తెలుగులో రిలీజ్ చేయనున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ సాంగ్ 'దుమ్ము ధూళి' విడుదలైంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకువెళుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యం అందిచగా, ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. 'డుమ్ డుమ్' అంటూ సాగే ఈ పాట రజనీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. పెళ్లికి ముందు, తర్వాత భార్యభర్తలు ఎలా ఉండాలి అనే అంశాన్ని పాట రూపంలో చక్కగా తెలియజేశారు. పెళ్లి నేపథ్యంలో వచ్చే ఈ ఎనర్జిటిక్ సాంగ్‌కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, మకాష్ అజీజ్ ఆలపించాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
డబ్బే నాకు సామర్థ్యాన్ని ఇచ్చింది..
తమిళనాడు, పెరంబూరు: నటనలో నేను సాధించానని అనుకోవడం లేదు అని సూపర్‌స్టార్ రజనీకాంత్ పేర్కొన్నారు. దక్షిణాది సూపర్‌స్టార్‌గా కొనియాడబడుతున్న ఈయన తాజాగా నటించిన చిత్రం దర్బార్. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో లైకా సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుంది. కాగా దర్బార్ హిందీలోనూ విడుదల కానుండడంతో ఇటీవల చిత్ర యూనిట్ ముంబైలోనూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు రజనీకాంత్ ఇచ్చిన సమాధానాలను చూద్దాం. ప్ర: నటనలో మీకింత సామర్థ్యం ఎక్కడ నుంచి వచ్చింది? జ: నిజం చెప్పాలంటే డబ్బే నాకు సామర్థ్యాన్ని ఇచ్చింది. తీసుకున్న పారితోషికానికి తగ్గట్టుగా నేను ఆ పాత్రలకు న్యాయం చేయాలి. ఇక నటించడం అన్నది నాకు చాలా ఆసక్తి. కెమెరా ముందుకు రావడం, వెలుగులో ఉండడం నాకు ఇష్టం. అదే నాకు సమర్థతను కలిగిస్తుంది. ప్ర: నటుడిగా ఎంత వరకూ ఎదిగానని అనుకుంటున్నారు? జ: వాస్తవంగా చెప్పాలంటే నేను నటుడిగా ఎదగలేదనే భావిస్తాను.ఆరంభంలో కొంచెం బిడియంగానూ, బెదురుగానూ ఉండేది. నటించగా నటించగా ఆత్మవిశ్వాసం పెరిగింది. మరో విషయం ఏమిటంటే నేను దర్శకుల నటుడిని. నటన అనేది నాకిచ్చిన పాత్రల పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎలానో ప్రేక్షకులకు నేను నచ్చేశాను. అంతే కానీ నటనలో నేనే ఎదిగానని భావించడం లేదు.అప్పుడు ఇప్పుడు ఓకే రజనీకాంత్ ప్ర: గత 8 నుంచి 12 ఏళ్లలో అమితాబ్ నటించిన చిత్రాల్లో ఏ చిత్రానైనా రీమేక్ చేయాలనిపించిన చిత్రం ఉందా? జ: షమితాబ్ చిత్రం ప్ర: మీకు ప్రపంచ వ్యాప్తంగా అబిమానులు ఉన్నారు. అయినా ఒకే ఒక్క హాలీవుడ్లో మాత్రమే నటించారే? జ: మంచి కథ, అవకాశాలు రాలేదు. అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తాను. ప్ర:ముంబైలో మీకు నచ్చింది? జ: ఒకటని కాదు ముంబై అంటేనే చాలా ఇష్టం, ప్ర:మీ చిత్రంలో నటించిన సునిల్‌శెట్టి గురించి? జ: ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ముఖ్యంగా వరుసగా చిత్రాలు చేస్తున్న సునిల్‌శెట్టి ఆయన తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోతే నటనను దూరంగా పెట్టి ఆయనకు వైద్యం చేయించడానికే సమయాన్ని కేటాయించారు. అలా నాలుగేళ్ల విరామం తరువాత ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు సునిల్‌శెట్టి. -
అదిరిపోయిన ‘దర్బార్’ ట్రైలర్
-
అదిరిపోయిన ‘దర్బార్’ ట్రైలర్
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. ఈ చిత్రం ట్రైలర్ సోమవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.‘ వాడు పోలీసాఫీసరా సర్..హంతకుడు’, ‘ఆదిత్యా అరుణాచలం కమిషనర్ ఆఫ్ ముంబై’ అనే డైలాగులతో షురూ అయ్యే ట్రైలర్ రజనీ అభిమానులను అలరించేలా ఉంది. ‘ఆ చూపేంటి..ఒరిజిల్ గానే విలనమ్మా..ఇదేలా ఉంది’, ‘ ఐయామ్ ఏ బ్యాడ్ కోప్’ అంటూ రజనీకాంత్ చెప్పే సంభాషణలు హైలెట్‌గా నిలిచాయి. దర్భార్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. రజనీకాంత్ ఇందులో పోలీస్ అధికారి ఆదిత్యా అరుణాచలం పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
‘ఫుల్ యాక్షన్ ట్రైలర్‌కు సిద్దంగా ఉండండి’
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్’. చాలా కాలం తర్వాత రజనీ పోలీస్ గెటప్‌లో అలరించనుండటంతో ఈ చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. అంతేకాకుండా విభిన్న కథలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల ఎక్స్‌పర్ట్‌గా పేరుగాంచిన మురుగదాస్ డైరెక్ట్ చేస్తుండటం ఈ సినిమాకు డబుల్ ప్లస్ కానుంది. కాగా ఇప్పటికే విడుదలైన రజనీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, పాటలు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. తాజాగా రజనీ ఫ్యాన్స్‌కు హుషారు కలిగించే వార్తను ‘దర్బార్’టీమ్ ప్రకటించింది. ‘దర్బార్’మూవీ ట్రైలర్‌ను డిసెంబర్ 16(సోమవారం) సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘హలో ఫ్రెండ్స్. ఈ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు చిత్ర ట్రైలర్ విడుదల కాబోతుంది. దర్బార్ యాక్షన్ ట్రైలర్‌తో ఎంజాయ్ చేయడానికి సిద్దంగా ఉండండి’అంటూ మురుగదాస్ ట్వీట్ చేశాడు. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అంతేకాకుండా మూవీ ప్రమోషన్స్ కూడా భారీగా నిర్వహిస్తున్నాయి సినిమా యూనిట్. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా నివేదా థామస్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు. -
దుమ్ము ధూళి దుమ్ము రేపుతోంది
రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ లె లుగులో రిలీజ్ చేయనున్నారు. ‘దర్బార్’లోని తొలి పాట ‘దుమ్ము ధూళి..’ ని ఇటీవల విడుదల చేశారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ‘‘దుమ్ము ధూళి’ పాట ఇంటర్నెట్లో దుమ్ము రేపుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ పాటకు ఇప్పటికి 8 మిలియన్ వ్యూస్ వచ్చాయి’’అని చిత్రబృందం పేర్కొంది. అనంత శ్రీరామ్ మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి సినిమా మొదటి పాటకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ పాటను రాసే అదృష్టం ‘పేట’ చిత్రానికి(మరణం మాస్ మరణం..) దక్కింది. ఇప్పుడు ‘దర్బార్’ చిత్రంలో ‘దుమ్ము ధూళి’ అన్నే పాటను రాశాను. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు పాడారు. రజనీకాంత్‌గారి ‘కథానాయకుడు’ చిత్రానికి తొలిసారి పాట రాశా. ఆ తర్వాత ‘విక్రమసింహా’, ‘2.0’, ‘పేట’, ఇప్పుడు ‘దర్బార్’ చిత్రాలకు పాటలు అందించాను’’ అన్నారు. -
దూసుకెళ్తున్న రజినీ ‘దుమ్ము.. దూళి’
రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన దర్బార్.. ఫస్ట్ సాంగ్‌ను చిత్ర బృందం బుధవారం యూట్యూబ్‌లో విడుదల చేసింది. తమిళ్‌తో పాటు, తెలుగు, హిందీలో కూడా ఈ సాంగ్ విడుదల అయింది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు తెలుగులో అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశారు. తెలుగులో ‘దుమ్ము.. దూళి’ అని సాగే ఈ పాట.. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీంతో రజినీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్.. ఐపీఎస్ ఆఫీసర్ ఆదిత్య అరుణాచలంగా కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత రజినీ పోలీసు అధికారిగా కనిపిస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించారు. రజనీకాంత్ కూతురిగా నివేథా దామస్ నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘దర్బార్’ చిత్రం జనవరి 9న విడుదల కానుంది. -
వారికంటే ముందే రానున్న రజనీ!
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్లో వస్తున్న సెన్సేషనల్ మూవీ ‘దర్బార్’. చాలా కాలం తర్వాత రజనీ పోలీస్ గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా వెరైటీ కథలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల ఎక్స్‌పర్ట్‌గా పేరుగాంచిన మురుగదాస్ డైరెక్ట్ చేస్తుండటం ఈ సినిమాకు డబుల్ ప్లస్ కానుంది. కాగా ఇప్పటికే విడుదలైన రజనీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్ర విడుదల తేదీపై గందరగోళం నెలకొంది. సినిమా ప్రారంభం నుంచే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. అయితే సంక్రాంతి బరిలో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’వంటి భారీ చిత్రాలు వస్తుండటంతో తెలుగులో దర్బార్‌కు థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో చిత్ర నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. మహేశ్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు జనవరి 12న వచ్చే అవకాశం ఉండటంతో.. దర్బార్‌ను జనవరి 12 న కాకుండా 15న విడుదల చేయాలని నిర్మాతలు తొలుత భావించారు. అయితే వారి నిర్ణయాన్ని మరోసారి మార్చుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా లైకా ప్రొడక్షన్స్ తన అధికారిక వెబ్సైట్లో దర్బార్ విడుదల తేదీ జనవరి 9వ తేదీ అని పేర్కొంది. దీంతో సంక్రాంతి బరిలో మహేశ్ బాబు, అల్లు అర్జున్‌ల కంటే ముందే రజనీ థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది. ఆ రెండు భారీ చిత్రాల విడుదలకు మూడు రోజుల ముందు అన్ని థియేటర్లలో విడుదల చేసి అధిక లాభం పొందేందుకు లైకా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల టాక్ ఇక డిసెంబర్ 12న రజనీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే ఆ రోజు కుదరకపోతే డిసెంబర్ 7న నిర్వహించాలని భావిస్తోంది. ఇక లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా నివేదా థామస్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు. -
రజనీ అభిమానులకు మరో పండుగ
తమిళ సినిమా: సూపర్‌స్టార్ ఈ ఒక్క పేరు చాలు అభిమానులు సంతోషంలో మునిగితేలడానికి. అవును రజినీకాంత్ అభిమానులకు సూపర్‌స్టార్ అన్నది ప్రాణవాయువు లాంటిదేనని చెప్పవచ్చు. తలైవా (నాయకుడు) అన్నది ఆ తరువాతనే. అందుకే సూపర్‌స్టార్ పట్టాన్ని అంత సులభంగా వదులుకోవడానికి రజనీకాంత్ సిద్ధంగా లేరని చెప్పవచ్చు. సినిమాలకు దూరమై రాజకీయల్లోకి ప్రవేశిస్తే సూపర్‌స్టార్ పట్టాన్ని మరో హీరో తన్నుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే రజనీకాంత్ వరుసగా చిత్రాలను చేసుకుంటూ పోతున్నారనిపిస్తోంది. ఈయన ప్రస్తుతం దర్బార్ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇందులో అగ్రనటి నయనతార నాయకిగా నటించింది. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. చిత్ర మోషన్ పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు. తమిళ వెర్షన్‌ను రజనీకాంత్ మిత్రుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ ఆన్లైన్లో ఆవిష్కరించగా, హిందీ వెర్షన్‌ను సల్మాన్‌ఖాన్, తెలుగు వెర్షన్‌ను మహేశ్‌బాబు, మలయాళ వెర్షన్‌ను మోహన్‌లాల్ వంటి స్టార్ నటులు ఆవిష్కరించి సూపర్ పబ్లిసిటీని అందించారు. చాలా కాలం తరువాత ఆయన పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం దర్బార్. చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా రజనీకాంత్‌కు డిసెంబర్ 12న పుట్టిన రోజు. అది అభిమానులకు పండుగరోజు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అంతకు ముందు అంటే డిసెంబర్ 7న వారికి మరో పండుగరోజు కాబోతోంది. అవును ఆ రోజున దర్బార్ చిత్ర ఆడియో ఆష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ వేడుకను చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. అయితే చిత్ర కథానాయకి నయనతార ఇందులో పాల్గొంటుందా అన్నది ఆసక్తిగా మారింది. -
డబ్బింగ్ షురూ
‘దర్బార్’లో ఆదిత్య అరుణాచలం మాటల తూటాలు పేలుతున్నాయి. మరి.. ఈ దర్బార్ డైలాగ్స్ ప్రేక్షకులకు ఎంత కిక్ ఇస్తాయో తెలిసేది మాత్రం సంక్రాంతి పండక్కే. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. ఇందులో నయతార కథానాయికగా నటించారు. నివేదాథామస్ కీలక పాత్రధారి. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించారు రజనీకాంత్. ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైనట్లు గురువారం చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ వెల్లడించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
అరుణాచలం దర్బార్
రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘అరుణాచలం’ చిత్రం ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సుందర్ సి. దర్శకత్వంలో 1997లో విడుదలైన ఈ సినిమాలో అరుణాచలంగా అలరించిన రజినీ మరోసారి ‘దర్బార్’ చిత్రంలో అరుణాచలం పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ‘దర్బార్’ సినిమా తెలుగు మోషన్ పోస్టర్ని గురువారం హీరో మహేశ్‌బాబు విడుదల చేశారు. ‘‘రజనీకాంత్ సార్ నటించిన ‘దర్బార్’ మోషన్ పోస్టర్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. మీపై ఈ ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. మురుగదాస్ సార్, చిత్రబృందానికి నా అభినందనలు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహేశ్‌బాబు. పవర్ఫుల్ పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలంగా కొత్త లుక్‌లో రజనీని చూసి, ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘దర్బార్’ మోషన్ పోస్టర్ని తమిళ్లో కమల్‌హాసన్, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో మోహన్‌లాల్ విడుదల చేశారు. ‘‘అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందుతోంది. అన్ని రకాల వాణిజ్య హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే విడుదలైన రజనీ పోస్టర్స్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. 2020 సంక్రాంతి కానుకగా ‘దర్బార్’ సినిమా విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అందులోనూ క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, రజనీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం అంటూ అంచనాలు పీక్స్‌లో ఉండటం ఖాయం. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దర్బార్’. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో రజనీ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం భారీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా దర్బార్ మూవీ మోషన్ పోస్టర్‌ను గ్రాండ్‌గా విడుదల చేసింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా ‘దర్బార్’ చిత్ర తమిళ, మలయాల, హిందీ, తెలుగు మోషన్ పోస్టర్లను కమల్ హాసన్, మోహన్ లాల్, సల్మాన్ ఖాన్, మహేశ్ బాబు వంటి స్టార్ల చేతుల మీదుగా విడుదల చేయించింది. ప్రస్తుతం రజనీ దర్బార్ మూవీ మోషన్ పోస్టర్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ‘ఆదిత్య అరుణాచలం’గా రజనీ విలన్లు రఫ్పాడించనున్నాడు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే తలైవా పదాలతో పాటు, రజనీ అడుగుల చప్పుడు హార్ట్ బీట్‌ను పెంచేస్తున్నాయి. దీంతో ‘దర్బార్’ బాక్సాపీస్ వద్ద దంచికొట్టడం ఖాయమని రజనీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, నివేధా థామస్, మరియు సునీల్ షెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం సంక్రాతికి విడుదల కానుంది. -
దుమ్ములేపుతున్న ‘దర్బార్’ మోషన్ పోస్టర్
-
మురుగదాస్‌పై నయనతార ఫైర్
సినిమా: జీవితంలో తాను చేసిన అతి పెద్ద తప్పు అదే అని సంచలన వ్యాఖ్యలు చేసింది నటి నయనతార. ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ కలకలం సృష్టిస్తోంది. ఇంతకీ ఈ అమ్మడు ఏమనందనేగా మీ ఆసక్తి. ఈలేడీ సూపర్ స్టార్ నట జీవితమే కాదు, వ్యక్తిగత జీవితం సంచలనమే. ఎందుకంటే అన్ని సంఘటనలు తన జీవితంలో జరిగాయి. తన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగా ఉంటుంది. అలాంటిది ఈ మధ్య ఒక ఆంగ్ల పత్రికకు భేటీ ఇచ్చింది. అది సంచలనంగా మారింది. తాజాగా ఒక ఎఫ్ఎం రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇంకా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇందులో తన ప్రేమ వ్యవహారంతో సహా పలు విషయాల గురించి మాట్లాడింది. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ సంచలన నటి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్‌కు జంటగా దర్బార్ చిత్రంలో నటించింది. 11 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో గజిని చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో దర్శకుడు తనకు చెప్పిన కథాపాత్ర వేరని, చిత్రంలో చూపించింది వేరని, తనను ఆ చిత్రంలో డమ్మీని చేశారని ఆరోపణలు చేసింది. తాను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు గజని చిత్రంలో నటించడం అని సంచలన వ్యాఖ్యలు చేసింది. గజిని తర్వాత నయనతార ఇప్పటివరకు మురుగదాస్ దర్శకత్వంలో నటించలేదు. మళ్లీ ఇప్పుడు రజనీకాంత్‌కు జంటగా దర్బార్ చిత్రంలో నటించింది. మురుగదాస్‌పై మళ్లీ ఆగ్రహించడానికి కారణం దర్బార్ చిత్ర పారితోషికమే కారణం అని సమాచారం. ఈ చిత్రంలో నటించినందుకు నయనతారకు పారితోషికం బాకీ ఉందట. దీంతో ఒక రోజు షూటింగ్‌కు కూడా రాకపోవడంతో హీరో రజనీకాంత్ కూడా ఎదురుచూడాల్సి వచ్చిందట. దర్శకుడు మురుగదాస్ కల్పించుకుని సమాధాన పరిచి నయనతారను నటింపజేసినట్లు టాక్. పారితోషికం చెల్లిస్తేనే నటిస్తానన్న వార్తలు తను ఇమేజ్ను డామేజ్ చేస్తాయని నయనతార భావించినట్లుంది. ఈ కారణంగానే నయనతార తన ఇంటర్వ్యూలో మురుగదాస్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. దర్బార్ చిత్రంలోనూ నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో గజనీ చిత్రంతోనే మోసపోయాననుకుంటే మళ్లీ అదే మోసమా అన్న ఆగ్రహంతోనే తాజాగా నయనతార మరోసారి మురుగదాస్‌పై ఆగ్రహించినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీని గురించి దర్శకుడు మురుగదాస్ ఎలా స్పందిస్తారో, దర్బార్ చిత్ర వర్గాల రియాక్షన్ ఎలా ఉండబోతోందో చూడాలి. -
మరింత యవ్వనంగా..
వయసు పెరుగుతున్న కొద్దీ రజనీకాంత్‌లో ఎనర్జీ, స్టయిల్, చరిష్మా కూడా పెరుగుతున్నాయి. సినిమా సినిమాకు మరింత ఫ్రెష్ లుక్‌లోకి మారిపోతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. నయనతార కథానాయిక. లైకా సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ సెకండ్ లుక్‌ను ఓనమ్ సందర్భంగా బుధవారం రిలీజ్ చేశారు. ఫైట్‌కు రెడీ అవుతున్నట్టు గుర్రుగా చూస్తున్నారు రజనీ. ‘మరింత యవ్వనంగా, అందంగా, తెలివిగా, కఠినంగా రజనీకాంత్‌ను చూపించబోతున్నాం’ అని మురుగదాస్ పేర్కొన్నారు. ఇందులో పోలీస్ అధికారి పాత్రలో రజనీ కనిపిస్తారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘దర్బార్’ రిలీజ్ కానుంది. -
చలో జైపూర్
కేసులు, నేరస్థులు, తుపాకులు, పరిశోధనలు.. వీటికి బ్రేక్ ఇచ్చారు రజనీకాంత్. కాస్త రిలీఫ్ కోసం ప్రేయసితో కలిసి డ్యూయెట్ పాడటానికి రెడీ అయిపోయారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘దర్బార్’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్‌లో ఆరంభం కానుంది. ఈ కొత్త షెడ్యూల్ ఆదివారం ప్రారంభం అవుతుంది. ఇందుకోసం నయనతార, రజనీ తదితరులు జైపూర్ ప్రయాణమయ్యారు. ఈ చిత్రంలో రజనీ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన షెడ్యూల్స్‌లో పరిశోధనలు, ఫైట్లు.. వీటికి సంబంధించిన సీన్స్ తీశారు. జైపూర్‌లో సాంగ్‌తో పాటు, కీలక సన్నివేశాల చిత్రీకరణకు ప్లాన్ చేశారు. -
అభిమానులూ రెడీయా!
సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కాకముందే తమ అభిమాన హీరో లుక్స్ కొన్నింటిని ఫ్యాన్స్ రెడీ చేసి సంబరపడుతుంటారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి సందడి చేస్తుంటారు. ఈ విషయం గురించి ఆలోచించినట్లున్నారు ‘దర్బార్’ చిత్రబృందం. అందుకే కొన్ని పోస్టర్స్‌ను డిజైన్ చేసే అవకాశాన్ని ఫ్యాన్స్‌కే వదిలేశారు. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. ఇందులో ఐïపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు రజనీ. ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్టు చేసినప్పటికీ ఈ సినిమా లొకేషన్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటితో కొన్ని ఫ్యాన్‌మేడ్ పోస్టర్స్ రెడీ అవుతున్నాయి. దీంతో చిత్రబృందమే రెండు హై క్వాలిటీ ఫొటోస్‌తో పాటు తమిళ, ఇంగ్లీష్ వెర్షన్ టైటిల్స్ లోగోలను రిలీజ్ చేసింది. వాటితో క్రియేటివ్ పోస్టర్ డిజైన్ చేయమనే బంపర్ ఆఫర్ ఫ్యాన్స్‌కి ఇచ్చారు. నచ్చిన పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేస్తామని ఏఆర్ మురుగదాస్ వెల్లడించారు. అభిమానులూ.. రెడీయా! -
వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్బార్. పేట సినిమాతో సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రజనీ ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార రజనీ సరసన కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ లోకేషన్స్‌లో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా రజనీ పోలీస్ గెటప్‌కు సంబంధించిన లుక్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్‌స్టార్ లుక్ సూపర్బ్ అనిపించేలా ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ స్టిల్స్‌లో రజనీ వయస్సు 20 ఏళ్లు తక్కువగా కనిపిస్తుందని సంబరపడిపోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈసినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుథ్ సంగీతమందిస్తున్నాడు. -
ఆగస్ట్‌లో గుమ్మడికాయ
ఓ అమ్మాయితో కలిసి రైల్వేస్టేషన్లో వెయిట్ చేస్తున్నారు ఓ పోలీసాఫీసర్. ఆ పోలీసాఫీసర్ ఎవరంటే రజనీకాంత్. అమ్మాయేమో నివేథా థామస్. రజనీకాంత్ హీరోగా ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దర్బార్’లో నివేథా కీలకపాత్ర చేస్తున్నారు. ఇందులో నయనతార కథా నాయికగా నటిస్తున్నారు. సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ నటిస్తున్నారు. చెన్నైలో వేసిన రైల్వేస్టేషన్ సెట్లో ఇటీవల రజనీకాంత్, నివేదాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ జూలైకల్లా పూర్తవుతుందనే ప్రచారం జరిగింది. ఈ వార్తను మురుగదాస్ ఖండించారు. ‘దర్బార్’ షూటింగ్ ఆగస్టు వరకు జరుగుతుందని వెల్లడించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
ఆ తరహా సినిమాలో త్రిష రాణించేనా!
చెన్నై : దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరు నటి త్రిష. అందం, అభినయాలతో ఈ స్థాయికి చేరుకున్న ఈ అమ్మడికి చాలా కాలంగా రజనీకాంత్‌తో నటించాన్న కోరిక ఇటీవల పేట చిత్రంతో నెరవేరింది. తన సహ నటీమణులు నయనతార, అనుష్కలా కుటుంబకథా చిత్రాలు, రొమాంటిక్ ప్రేమ కథా చిత్రాల్లో నటించి సక్సెస్ అయిన ఈ బ్యూటీకి హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటించి రాణించాలన్న ఆశ మాత్రం ఇంకా నెరవేరలేదు. ఆ ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేకపోయింది. తను ఎంతో ఇష్టపడి నటించిన నాయకి చిత్రం త్రిషను నిరాశ పరిచింది. ఆ తరువాత నటించిన మోహిని చిత్రం అదే బాటలో నడిచింది. ప్రస్తుతం ఆ తరహాలో గర్జన, 1818, పరమపదం విళైయాట్టు వంటి చిత్రాల్లో నటిస్తున్నా, వాటి నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరుగుతోంది. తాజాగా నటిస్తున్న చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో కూడినదే కావడం విశేషం. దీనికి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ కథ, సంభాషణలను అందించారు. ఇంతకుముందు ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన శరవణన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రారంభమై తొలిషెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ త్వరలో విదేశాలకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. దీనికి రాంగీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. తాజా షెడ్యూల్‌ను ఉజ్బెకిస్తాన్‌లో చిత్రీకరించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ షెడ్యూల్లో ఎక్కువగా నటి త్రిషకు సంబంధించిన పోరాట దృశ్యాలనే చిత్రీకరించనున్నారట. ఈ చిత్రంతోనైనా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో సక్సెస్ కావాలన్న త్రిష ఆశ నెరవేరేనా? అన్న ఆసక్తి నెలకొంది. ఇంతకుముందు గర్జన చిత్రంలోనూ త్రిష పోరాట సన్నివేశాల్లో నటించింది. అయితే ఆ చిత్ర నిర్మాణం ఆలస్యం అవుతోంది. దీంతో రాంగీ చిత్రం పైనే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం త్రిష టైమ్ బాగుందనే చెప్పవచ్చు. తన నటించిన 96, పేట చిత్రాలు విజయం సాధించాయి. అదే సక్సెస్ రాంగీ చిత్రానికీ కొనసాగుతుందనే నమ్మకంతో త్రిష ఉందట. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజనీ
ముంబైలోని మాఫియాను గడగడలాడించడానికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా మారారు రజనీకాంత్. ప్రజలను భయపెడుతున్న గ్యాంగ్‌స్టర్స్‌కు తూటాతో సమాధానం చెబుతున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత రజనీకాంత్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అందులోనూ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించబోతున్నారట రజనీ. అలాగే ఈ సినిమాలో ఆయన రెండు పాత్రలు చేస్తున్నారని ప్రచారం జరగుతోంది. ఇటీవల ముంబైలో మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ముఖ్యంగా ముంబైలోని ఓ కాలేజీలో వేసిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ రూమ్ సెట్లో రజనీకాంత్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలిసింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ 29న స్టార్ట్ చెన్నైలో మొదలవుతుందని తెలిసింది. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ ‘దర్బార్’లో ఓ విలన్‌గా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. -
‘దర్బార్’ సెట్లో ఆంక్షలు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్బార్. పేట సినిమాతో సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రజనీ ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార రజనీ సరసన కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాపై లీకు వీరులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఇప్పటికే రజనీ లుక్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా రజనీతో పాటు నయనతార ఉన్న ఫొటో ఒకటి నెట్లో హల్చల్ చేస్తోంది. దీంతో చిత్రయూనిట్ లీకులను ఆపేందుకు చర్యలు తీసుకుంటోంది. సెట్లోకి విజిటర్స్ రాకుండా నిషేదం విదించటంతో పాటు సెల్ఫొన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌ల వాడకం పై ఆంక్షలు విదిస్తున్నారు. మరి ఈ చర్యలతో అయిన లీకులు ఆగుతాయేమో చూడాలి. -
దర్బార్‌లోకి ఎంట్రీ
‘దర్బార్’లో ప్లేస్ కన్ఫార్మ్ చేసుకున్నారు హీరోయిన్ నివేదా థామస్. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఐపీఎస్ పోలీసాఫీసర్ పాత్రలో రజనీకాంత్ నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా షూట్‌లోకి జాయిన్ అయ్యారు నయనతార. ఆమెతోపాటు నివేదా థామస్, కమెడియన్ యోగిబాబు కూడా ఈ ముంబై సెట్లో జాయిన్ అయ్యారు. లొకేషన్లో రజనీకాంత్, నివేదా, యోగిబాబు ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో రజనీకాంత్ కూతురి పాత్రలో నివేదా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ‘పాపనాశనం’ సినిమాలో కమల్‌హాసన్ కూతురిగా నటించారు నివేదా. ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
ఆమె లవ్ లాకప్‌లో ఖైదీ అయ్యాడా!
ముంబై గ్యాంగ్స్టర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్. అతని హృదయంలో ప్రేమ పుట్టించడానికి ఓ అందమైన అమ్మాయి మంగళవారం ముంబై వెళ్లింది. మరి.. ఆ పోలీసాఫీసర్ మనసుకు ఎలా బేడీలు పడ్డాయి? ఆమె లవ్ లాకప్‌లో ఖైదీ అయ్యాడా? అన్న విషయాలను మాత్రం ‘దర్బార్’ చిత్రంలో చూడాల్సిందే. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రజనీకాంత్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్లో మంగళవారం నయనతార జాయిన్ అయ్యారు. ఇంతకుముందు ‘చంద్రముఖి’(2005)లో రజనీ సరసన నటించిన నయనతార ఆయన హీరోగా నటించిన ‘కథానాయకుడు’ (2008)లో స్పెషల్‌సాంగ్ చేశారు. అలాగే ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో నయనతార దాదాపు 14 ఏళ్ల తర్వాత నటిస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘గజినీ’ సినిమాలో ఓ కీలక పాత్ర చేశారు నయనతార. ‘‘నయనతారతో కలిసి మళ్లీ వర్క్ చేయడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు మురుగదాస్. ఈ చిత్రాన్ని అనిరు«థ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ‘దర్బార్’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. -
సయ్యాటలు కాదా? జగడమేనా!
సినిమా: కోలీవుడ్‌లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాక్‌గా మారిన చిత్రం దర్బార్. కారణం టాప్ స్టార్స్ కలయికలో రూపొందుతుండడమే కాదు. చాలా ఆసక్తికరమైన అంశాలను చోటుచేసుకున్న చిత్రం దర్బార్. ప్రధాన అంశం ఇది సూపర్‌స్టార్ దర్బార్ కావడం. రెండో అంశం లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించడం. మూడోది సంచలన దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దర్శకుడు కావడం. ఇవి చాలవా? దర్బార్ ప్రత్యేకతకు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ క్రేజీ చిత్రానికి యువ సంగీతదర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండడం మరో విశేషం. ఇటీవలే దర్బార్ చిత్ర షూటింగ్‌ను ముంబైలో ప్రారంభించారు.ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచా రం ఒక పక్క జరుగుతున్నా, ఆయన చాలా కాలం తరువాత ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారన్న ప్రచారం మరో పక్క జరుగుతోంది. కాగా చంద్రముఖి, కుశేలన్ చిత్రాల తరువాత రజనీకాంత్, నయనతార కలిసి నటిస్తున్న చిత్రం దర్బార్. దీంతో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారని అనుకుంటున్న తరుణంలో జంటగా కాదు మరోలా నటిస్తున్నారనే టాక్ తాజాగా స్ప్రెడ్ అయ్యింది. వేరేలా అంటే అసలు ఇందలో రజనీకాంత్‌కు జోడీనే లేదని, తండ్రీ, కూతుళ్ల మధ్య ప్రేమానుబంధాలను ఆవిష్కరించే ఈ చిత్రంలో రజనీకాంత్‌కు కూతురిగా నటి నివేదా థామస్ నటించబోతోందని సమాచారం. మరి నయనతార పాత్రేంటి అనే ఆసక్తి కలగవచ్చు. దర్బార్‌లో రజనీకాంత్, నయనతారల మధ్య సరసాలు ఉండవట. జగడమేనట. అంటే ఇందులో నయనతార ప్రతికథానాయకి పాత్రలో నటిస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతో నటించడానికి అంగీకరించిందని, అంతే కాకుండా ఈ చిత్రం కోసం సంచలన నటి నయతార ఏకంగా 60 రోజులు కాల్షీట్స్ కేటాయించిందని సమాచారం. ఈ బ్యూటీ చిత్రం అంతా కనిపిస్తుందట. దర్బార్ టైటిల్ విడుదలతోనూ చిత్రంపై హైప్ పెరిగిపోయింది. ఇప్పుడు నయనతార విలనీయం అనగానే దర్బార్ చిత్రంపై మరింత ఆసక్తి కలుగుతోంది కదూ! అయితే ఈ విషయం గురించి స్పష్టమైన ప్రకటన చిత్ర వర్గాల నుంచి రావలసి ఉందన్నది గమనార్హం. -
డైరీలో ఖాళీ ఇల్లే!
వేగం పెంచారు రజనీకాంత్. అరవైలలో ఇరవైల దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒక సినిమా పూర్తి కావడం ఆలస్యం మరో సినిమా సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘దర్బార్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. అప్పుడే ఈ ప్రాజెక్ట్ తర్వాత చేయబోయే రెండు సినిమాలకు డేట్స్ ఇచ్చేశారట రజనీ. తనకు ‘ముత్తు, నరసింహ’ వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు కేయస్ రవికుమార్ డైరెక్షన్లో ఓ మూవీ, ‘చతురంగవైటై్ట, ఖాకీ’ వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు హెచ్. వినోద్‌తో మరో సినిమా అంగీకరించారట. ఈ మూడు సినిమాలతో రజనీ డైరీ 2021 వరకూ ఖాళీ ఇల్లే (లేదు). ఈ సినిమాలు పూర్తయిన తర్వాత 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మీద పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే ఆలోచనలో రజనీ ఉన్నట్టు తమిళనాడు టాక్. ‘దర్బార్’ 2020 సంక్రాంతికి రిలీజ్. -
రజినీ ‘దర్బార్’ ప్రారంభం
-
రజనీ దర్బార్
లాఠీ పట్టి నేరగాళ్ల భరతం పట్టడానికి రజనీకాంత్ ఖాకీ డ్రెస్ వేసి పోలీస్‌గా మారారు. రజనీకాంత్ హీరోగా ‘గజిని, తుపాకి, కత్తి’ చిత్రాల ఫేమ్ ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘దర్బార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కెరీర్లో తొలిసారి రజనీకాంత్‌తో కలిసి వర్క్ చేస్తున్నారు మురుగదాస్. ఇందులో నయనతార కథానాయికగా నటించనున్నారు. ఇంతకుముందు ‘చంద్రముఖి (2005), కథానాయకుడు (2008)’ సినిమాల్లో రజనీకాంత్‌తో కలిసి సిల్వర్‌స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు నయనతార. ఇక ‘దర్బార్’ ఫస్ట్ లుక్‌ను బట్టి ఈ సినిమాలో రజనీ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఇరవైఏళ్ల తర్వాత పోలీస్ పాత్రలో నటిస్తున్నారట రజనీ. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ బ్యాగ్రౌండ్లో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ కనిపిస్తోంది. సో.. ఇది ముంబై నేపథ్యంలో సాగే కథాంశమని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. మురుగదాస్ ‘తుపాకీ’, రజనీకాంత్ ఇటీవలి ‘కాలా’ చిత్రాలు ముంబై నేపథ్యంలోనే సాగాయన్న సంగతి తెలిసిందే. ‘దర్బార్’ చిత్రానికి అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సంతోష్ శివన్ ఛాయాగ్రాహకులు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. రజనీకాంత్ గత చిత్రం ‘పేట’ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై, హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. -
సూపర్ స్టార్ ‘దర్బార్’
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల పేటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీ మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రజనీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దర్బార్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. టైటిల్ లోగోతో పాటు సినిమాలో రజనీ లుక్‌ను కూడా రివీల్ చేశారు చిత్రయూనిట్. రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్న ఈ మూవీ 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.స్వరాలందించనున్నాడు. -
జోడీ రిపీట్?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జోడీ కట్టే హీరోయిన్ ఎవరో తెలిసిపోయిందోచ్ అంటున్నాయి చెన్నై కోడంబాక్కం వర్గాలు. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొన్ని రోజులుగా పలువురి పేర్లను పరిశీలించింది చిత్రబృందం. ఇటీవల కీర్తీ సురేష్, కాజల్ అగర్వాల్ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా నయనతార పేరు వినిపిస్తోంది. ఆల్రెడీ నయనతారకు కథ వినిపించారట మురుగదాస్. కథానాయిక నయనే అని కోలీవుడ్ అంటోంది. నయనతార ఈ చిత్రానికి ఊ కొడితే ‘చంద్రముఖి’ చిత్రం తర్వాత రజనీకాంత్, నయనతార జోడీగా మళ్లీ వెండితెరపై కనిపిస్తారు. అంటే.. 14 ఏళ్ల తర్వాత జంటగా నటించనున్నారన్న మాట. రజనీ ‘శివాజీ’లో ఓ స్పెషల్ సాంగ్, ‘కథానాయకుడు’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు నయనతార. రజనీ తాజా చిత్రం షూటింగ్ మార్చిలో ఆరంభం కానుంది. రజనీ, నయన జోడీ రిపీట్ అవుతుందో లేదో వచ్చే నెలలో తెలిసిపోతుంది. -
దళపతి తర్వాత మరోసారి
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేసే సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ పెంచారు దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు కూడా. తాజాగా సంతోష్ శివన్ ఈ సినిమాకు కెమెరామేన్‌గా ఫిక్స్ అయ్యారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ కెమెరామేన్స్‌లో సంతోష్ శివన్ ముందు వరుసలో ఉంటారు. ‘దళపతి, రోజా, ఇద్దరు, దిల్సే’ వంటి గుర్తుండిపోయే సినిమాలకు కెమెరా వర్క్‌ను అందించారు సంతోష్. ‘‘రజనీసార్‌తో ‘దళపతి’ చిత్రం తర్వాత మళ్లీ కలసి పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాపై చాలా ఎగై్జటింగ్‌గా ఉన్నాను’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు సంతోష్. 28 ఏళ్ల తర్వాత రజనీ, సంతోష్ కలసి పని చేయడం విశేషం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చిలో స్టార్ట్ కానుంది. -
మురుగదాస్ దర్శకత్వంలో బన్నీ!
హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధించే స్టామినా ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్. ఇటీవల నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో నిరాశపరిచిన ఈ స్టైలిష్ స్టార్.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాతో పాటు బన్నీ మరో రెండు సినిమాలకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయనున్నాడట. అంతేకాదు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు బన్నీ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించనున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌ను 2019 చివర్లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరో కొత్త దర్శకుడితోనూ బన్నీ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. -
జెట్ స్పీడ్!
సినిమా సినిమాకు మధ్యలో గ్యాప్ ఇవ్వడం లేదు. నాలుగైదు నెలల గ్యాప్‌లోనే స్క్రీన్‌పై కనిపిస్తున్నారు రజనీకాంత్. ‘కాలా, 2.0, పేట్టా’ మూడు చిత్రాలు ఏడు నెలల గ్యాప్‌లో రిలీజŒ అయ్యాయి. ఈ స్పీడ్ చూసి ఆశ్చర్యపడకమానలేం. సంక్రాంతికి కొత్త సినిమా ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’)తో బరిలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి నెలలో మురుగదాస్‌తో చేయనున్న ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్లు కోలీవుడ్ సమాచారం. ఇది పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా, రజనీను ఆయన ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఉండబోతోందని ఆ మధ్య ఓ ఫంక్షన్లో పేర్కొన్నారు మురగదాస్. ఆల్రెడీ మురుగదాస్‌తో ‘సర్కార్’, రజనీతో ‘పేట్టా’ సినిమాలను నిర్మించిన సన్ నెట్వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రజనీకాంత్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ప్రవేశించాక సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టొచ్చనే టాక్ కూడా తమిళనాడులో ఉంది. అందుకోసమే ఇలా గ్యాప్ లేకుండా జెట్ స్పీడ్‌తో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నారా? -
‘సర్కార్’లో విజయ్ చెప్పినట్టే చేస్తున్నాం..!!
-
‘సర్కార్’లో విజయ్ చెప్పినట్టే చేస్తున్నాం..!!
సాక్షి, చెన్నై : ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘సర్కార్’ సినిమా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమిళనాడు దిగవంత సీఎం జయలలితను తప్పుగా చూపించారంటూ అన్నాడీఎంకే మంత్రులు మండిపడుతున్నారు. అలాగే, ఆమె ప్రవేశపెట్టిన ఉచిత పథకాలపై విమర్శనాత్మకంగా ఉన్న కొన్ని సీన్లను తొలగించాలని తమిళనాడు మంత్రులతో పాటు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ సీన్లను తొలగించకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సినిమాలోని అభ్యంతకరమైన సీన్లను తొలగించేందుకు నిర్మాతలు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. (‘సర్కార్’పై ఏమిటీ అరాచకం!) అయితే, తమ అభిమాన హీరో సినిమాపట్ల అన్నాడీఎంకే నేతలు వ్యవహరించిన తీరుపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. హీరో విజయ్ చెప్పింది నిజమేనంటూ ‘సర్కార్’ సినిమాలో చూపిన విధంగా.. జయలలిత హయాంలో ఇచ్చిన ఉచిత కంప్యూటర్లు, గ్రైండర్లు, మిక్సీలు, టేబుల్ ఫ్యాన్లు, ఇతర వస్తులవులను మంటల్లో వేసి బూడిద చేశారు. ఇప్పుడీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో ‘మహానటి’ ఫేం కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించారు. (వంద కోట్లు కొల్లగొట్టిన ‘సర్కార్’!) (చదవండి : ప్రభుత్వం అంత బలహీనమా?) (చదవండి : హై డ్రామా) -
మురుగదాస్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, చెన్నై: సర్కార్ మూవీ తమిళనాట పలు వివాదాలకు కేంద్రబిందువవుతోంది. ఈ సినిమాలోని కొన్ని డైలాగులు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని పాలక ఏఐఏడీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈనెల 27 వరకూ సర్కార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌ను అరెస్ట్ చేయవద్దని మద్రాస్ హైకోర్ట్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐఏడీఎంకే నేతలు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చేపట్టిన నిరసనలకు తలొగ్గిన చిత్ర మేకర్లు వివాదాస్పద సంభాషణలను తొలగించేందుకు అంగీకరించారు. చిత్ర దర్శకుడు మురుగదాస్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఏ ఒక్కరినీ బాధపెట్టాలన్నది తన ఉద్దేశం కాదని మురుగదాస్ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా మురుగదాస్‌ను అరెస్ట్ చేసేందుకు చెన్నై పోలీసులు సిద్ధమయ్యారని గురువారం రాత్రి చిత్ర నిర్మాతలు సన్ పిక్చర్స్ ట్వీట్ చేయగా, పోలీసు అధికారులు దీన్ని తోసిపుచ్చారు. రొటీన్ గస్తీలో భాగంగా ఆ ప్రాంతంలో పోలీస్ బృందం పహారాలో ఉందని వివరణ ఇచ్చారు. మరోవైపు గత రాత్రి పోలీసులు తమ ఇంటికి వచ్చి తన తలుపు తట్టారని, ఆ సమయంలో తాను ఇంట్లో లేకపోవడంతో వారు వెనుదిరిగారని, ప్రస్తుతం తన ఇంటి వద్ద పోలీసులు ఎవరూ లేరని తనకు తెలిసిందని దర్శకుడు మురుగదాస్ ఆ తర్వాత ట్వీట్ చేశారు. సర్కార్ మూవీకి నిరసనల సెగతో రజనీకాంత్, కమల్‌హాసన్ చిత్ర బృందానికి బాసటగా నిలిచారు. ఒత్తిడి పెంచేందుకు ఇలాంటి చర్యలను ఎంచుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. కాగా సర్కార్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు.విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలైన రెండు రోజులకే రూ 100 కోట్ల క్లబ్లో చేరింది. -
వంద కోట్లు కొల్లగొట్టిన ‘సర్కార్’!
ఇళయ దళపతి విజయ్ సినిమా అంటేనే బాక్సాఫీస్‌లు బయపడుతుంటాయి. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా రికార్డులను వేటాడేస్తుంది. ఇంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ ఈ మంగళవారం ‘సర్కార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్ హిట్లను తన అభిమానులకు అందించిన విజయ్.. ఈ సారి సర్కార్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా మొదటిరోజే కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఒక్క మొదటిరోజే తమిళనాడులో దాదాపు ముప్పై కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2.32కోట్లు, కేరళలో దాదాపు 6కోట్లను కలెక్ట్ చేసి.. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికాల్లో ఈ సినిమా దూసుకెళ్తోంది. ఈ మూవీ రెండు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను దాదాపు 3400 స్ర్కీన్స్‌పై విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం మెర్సెల్ రికార్డులను అధిగమించేట్టుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. #Sarkar100CrIn2Days According to Team #Sarkar , the movie has crossed 100 Crs gross WW in 2 Days.. pic.twitter.com/HlrRPftudJ — Ramesh Bala (@rameshlaus) November 8, 2018 -
గూగుల్ సర్చ్‌లో ఇప్పుడు అదే టాప్!
మనకు ఏ విషయం గురించి తెలియకపోయినా.. వెంటనే చేసే పని గూగుల్‌లో వెతకడం. గూగుల్‌లో ఎప్పుడు ఏదీ ఎలా ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టమే. రోజుకు కొన్ని కోట్ల మంది గూగుల్‌లో ఏదో ఒక విషయం గురించి సర్చ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఇలా ఎక్కువమంది టాపిక్ ఏంటో తెలుసా?. విజయ్ నటించిన సర్కార్ మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో దొంగ ఓట్ల నేపథ్యంలో తెరకెక్కించగా.. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే ఈ సినిమాలో సెక్షన్ 49పి అనే టాపిక్ హైలెట్‌గా మారింది. కథ అంతా ఈ సెక్షన్ చుట్టూనే తిరుగుతుంది. ఈ సెక్షన్ ప్రకారం పోలింగ్ సమయంలో తన ఓటును ఎవరైనా వేసినట్టు ఓటరు గుర్తిస్తే వెంటనే ఆ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమనీ, మళ్లీ తన ఓటు తాను వేసుకునే వీలు కల్పించమని అడిగే హక్కు ఓటరుకు ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి సెక్షన్ ఒకటి ఉందని తెలియని నెటిజన్లు దీని గురించి గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారట. -
‘సర్కార్’పై వివాదం.. సన్నివేశాలు తొలగించాలని డిమాండ్!
తమిళనాట విజయ్ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తుంటారో తెలిసిందే. అయితే ఆయన సినిమాలను వివాదాల్లోకి లాగడానికి కూడా ఎదురుచూసేవాళ్లు ఉంటారు. ఈయన చిత్రాలు వివాదాలు సృష్టించడం కొత్తేంకాదు. ఈయన గత చిత్రం మెర్సెల్‌లో జీఎస్టీ, భారత ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలపై చిత్రీకరించిన సన్నివేశాలను తొలగించాల్సిందిగా కొంతమంది నానారచ్చ చేశారు. చివరగా వాటికి సంబంధించిన సన్నివేశాల్లో మాటలను కట్ చేశారు. వివాదాలతోనే ఈయన సినిమాలు మరింత దూసుకెళ్తున్నాయి. మెర్సెల్ అంతగా విజయం సాధించడానికి అది కూడా ఒక కారణమే. అయితే రీసెంట్గా విడుదలైన సర్కార్... కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా కూడా రాజకీయ వ్యవస్థపైనే చిత్రీకరించారు. ఇందులో జయలలితను తప్పుగా చూపించారంటూ అన్నాడీఎంకే మంత్రులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి ఇంతకి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. -
మహేష్‌కు నచ్చడం చాలా సంతోషం!
ఏఆర్ మురుగదాస్, విజయ్ కాంబినేషన్లో వచ్చిన ‘సర్కార్’ రికార్డులను బ్రేక్ చేస్తోంది. విజయ్ సినిమాలు అంటేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంటాయి. విజయ్ గత చిత్రం మెర్సల్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తే.. తాజా చిత్రం ‘సర్కార్’ వాటిని బ్రేక్ చేసేట్టుందని ట్రేడ్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే సర్కార్‌పై కొంత నెగెటివ్ టాక్ వచ్చినా వసూళ్లలో మాత్రం దూసుకుపోతోంది. ఈ చిత్రంపై సూపర్‌స్టార్ మహేష్ బాబు స్పందించాడు. ‘ఇది ఏఆర్ మురుగుదాస్ ట్రేడ్‌మార్క్ చిత్రం. ఈ పొలిటికల్ డ్రామాను ఎంజాయ్ చేశాను. చిత్రయూనిట్‌కు కంగ్రాట్స్’ అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘ సర్ థ్యాంక్యూ.. సో మచ్. మీకు ఈ చిత్రం నచ్చినందుకు సంతోషం. ఇది నాకు చాలా పెద్ద విషయం’ అంటూ బదులిచ్చాడు. Sirrrrr..... thank you so much 😊 I’m glad you liked it 🙏 it means a lot 🤗🤗 https://t.co/yrAQdGtxPq — A.R.Murugadoss (@ARMurugadoss) November 7, 2018 -
బాక్సాఫీస్‌పై ‘సర్కార్’ దాడి
ఇళయ దళపతి విజయ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ సినిమా రిలీజ్ అవుతుంటే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. మెర్సల్ (తెలుగులో ‘అదిరింది’) చిత్రంతో బాక్సాఫీస్ రికార్డును క్రియేట్ చేసిన విజయ్.. తాజాగా సర్కార్‌తో మరోసారి తన హవాను చూపిస్తున్నాడు. మంగళవారం రిలీజ్ అయిన సర్కార్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. చెన్నైలో దాదాపు 70 స్ర్కీన్‌లో విడుదల చేయగా, 2.41కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఓవర్సిస్లో సైతం సర్కార్ సునామిని సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రిలీజ్చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటిరోజు 2.32కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. కేవలం చెన్నైలోనే కాకుండా తమిళనాడు వ్యాప్తంగా ఈ చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. కొంత నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ.. అవేవి ఈ సినిమాపై ప్రభావాన్ని చూపెట్టలేకపోతున్నాయి. కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. -
అందులో మార్పు లేదు
‘సర్కార్’ కథ కాపీ చేశారని దర్శకుడు మురుగదాస్ మీద పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆరోపించిన రచయిత వరుణ్‌కి, ‘సర్కార్’ టీమ్‌కు సంధి కుదిరిందట. ఈ విషయం గురించి మురుగదాస్ తన ట్వీటర్లో ఖాతాలో పేర్కొన్నారు. ‘‘ఎప్పటిలానే బోలెడన్ని వదంతులు ప్రచారం అవుతున్నాయి. ఒకతను వేయాల్సిన ఓటును, దొంగతనంగా వేరే వాళ్లు వేసేస్తారు అనే కాన్సెప్ట్‌తో కూడుకున్న కథను పదేళ్ల క్రితమే ఓ వ్యక్తి రాసుకున్నారు అని దర్శకుడు భాగ్యరాజాగారు నాతో అన్నారు. ఆ పాయింట్ తప్ప మా కథకు వాళ్ల కథకూ ఎటువంటి సంబంధమూ లేదు. కానీ, మనకన్నా ముందు ఒక సహాయ దర్శకుడు ఈ కథను రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి అతడిని ఉత్సాహపరచడం కోసం టైటిల్స్‌లో అతని పేరు వేస్తే బాగుంటుందని భాగ్యరాజాగారు అన్నారు. దానికి సరే అని ఒప్పుకున్నాను. అంతే.. ‘సర్కార్’ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏ ఆర్ మురుగదాస్. ఇందులో ఎటువంటి మార్పు లేదు’’ అనే వీడియోను పోస్ట్ చేశారు. -
‘సర్కార్’ హైదరాబాద్‌కు వస్తున్నాడా?
ఇళయ దళపతి విజయ్ హైదరాబాద్‌కు విచ్చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్, విజయ్ కాంబినేషన్లో సర్కార్ సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. ఇటీవలె విడుదల చేసిన సర్కార్ టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అక్టోబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు , ఈ వేడుకకు విజయ్ హాజరుకానున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ విజయ్ పీఆర్ టీమ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దంటూ అభిమానులకు సూచించింది. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. .. The news spreading in social media abt #ThalapathyVIJAY visit to hyd for #SarkarTelugu event is false .. kindly ignore this baseless news spreading @actorvijay @ARMurugadoss @KeerthyOfficial @sunpictures @varusarath @Jagadishbliss @BussyAnand https://t.co/GgTtp7FJEe — RIAZ K AHMED (@RIAZtheboss) 22 October 2018 -
సర్కార్ టీజర్.. సూపర్!
విజయ్-మురుగదాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సర్కార్’ తమిళ సినిమా టీజర్ శుక్రవారం సాయంత్రం విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే టీజర్ ఉంది. అభిమానులను అలరించే అన్ని అంశాలను ఇందులో మేళవించినట్టుగా కనబడుతోంది. విజయ్ తనదైన శైలిలో డైలాగులు, డాన్సులు, ఫైట్స్ తెరపై ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్పొరేట్ క్రిమినల్ పాత్రలో విజయ్ కనిపించనున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించారు. వరలక్ష్మి శరత్‌కుమార్, రాధా రవి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. నిర్మాత అశోక్ వల్లభనేని ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సొంతం చేసుకున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నేనే సీఎం అయితే..
నిజంగా ముఖ్యమంత్రిని అయితే నటించను అని అన్నారు నటుడు విజయ్. ఈ స్టార్ నటుడికి రాజకీయాల్లోకి రావాలన్న ఆశ బలీయంగా ఉందన్న విషయం తెలిసిందే. అందుకుచాలా కాలం క్రితమే తన సైన్యాన్ని (అభిమానుల్ని) బరిలోకి దింపారు. సామాజిక సేవ పేరిట సమావేశాలను నిర్వహించారు. ఆ తరువాత తన చిత్రాల విడుదల సమయంలో ఏర్పడ్డ అడ్డంకులు ఆయన రాజకీయ ఆశలపై నీళ్లు చల్లాయనే చెబుతారు. సాక్షి, చెన్నై: ముఖ్యమంత్రి అవ్వాలన్న తన కోరికను నటుడు విజయ్ మంగళవారం మరోసారి చెప్పకనే చెప్పారు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం సర్కార్ ఆడియో ఆవిష్కరణ మంగళవారం చెన్నై, తాంబరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన చిత్రం పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా వెల్లడించారు. ఆడియో ఆవిష్కరణ సందర్భంగా అందరి ప్రసంగం విజయ్ గురించి, రాజకీయాలపైనే సాగడం విశేషం. చివరకు విజయ్ కూడా రాజకీయాల గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈయన ఏమన్నారో చూద్దాం. ‘అభిమానుల ఆదరణకు కృతజ్ఞతలు. ఈ వేడుకకు నాయకుడు ఏఆర్ రెహ్మాన్. ఆయన సంగీతం అందించడం ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించినట్లే. నేను, దర్శకుడు మురుగదాస్ కలిసి చేస్తే అది హిట్ చిత్రం అవుతుంది. సర్కార్ చిత్రంలో ప్రత్యేకత ఏమిటంటే మెర్శల్ చిత్రంలో కొంచెం రాజకీయం చోటుచేసుకుంది. ఇందులో రాజకీయం దుమ్మురేపుతుంది. సినిమాల్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ ఉత్తమ నటనను ప్రదర్శించారు. ఆమెకు అభినందనలు. నటి వరలక్ష్మి వద్దు అని ఎవరు అనలేని విధంగా ఈ చిత్రంలో ఆమె నటించారు. విజయం కోసం ఎంతగానైనా కష్టపడవచ్చు. అయితే మా చిత్రం విజయం సాధించకూడదని ఒక వర్గం త్రీవంగా శ్రమిస్తోంది. జీవితం అనే ఆటను చూసి ఆడండి. అసహ్యించుకునే వారిపై ఉమ్మేయండి. విసిగించేవారి వద్ద మౌనంగా ఉండండి. జీవితాన్ని జామ్‌జామ్‌గా గడిపేద్దాం అని అన్నది ఎవరో తెలియదు గానీ, ఆ వ్యాఖ్యలను నేను అనుసరిస్తున్నాను. మీరు అనుసరించండి. సర్కార్‌ను ఏర్పాటు చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయనున్నాం. నేను చిత్రం గురించి చెబుతున్నాను. నచ్చితే ఈ చిత్రానికి ఓటేయండి. సర్కార్ చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించలేదు. ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రిని అయితే నటించను’ అని నటుడు విజయ్ వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లోనే రాజకీయాలపై ఉన్న ఆసక్తి తెలిసిపోతుంది కదూ! రాజకీయ ప్రకంపనలు సర్కార్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొందరు నాయకులు స్వాగతిస్తున్నా, మరి కొందరు, ముఖ్యంగా అధికార పక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ స్పందిస్తూ విజయ్, అజిత్ లాంటి ప్రముఖ నటులు రాజకీయాల్లోకి రావాలన్నారు. రాష్ట్ర మంత్రి ఉదయకుమార్ స్పందిస్తూ సర్కార్ సినిమాను సర్కస్‌తో పోల్చారు. విజయ్ చిత్రాలు చేసుకోవడమే మంచిదని, రాజకీయాల్లో ఆయన రాణించలేరని ఎద్దేవా చేశారు. -
అదే కొత్త సినిమా... అదే చివరి సినిమా?
ఇది గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా? అనే కన్ఫ్యూజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌కు స్టార్ట్ అయ్యింది. ఇంతకీ ఈ న్యూస్ ఏంటో తెలుసుకోవాలంటే ఇది మొత్తం చదవాల్సిందే. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ వార్తలు బాగా ఊపందుకున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘పేట్టా’ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తి కావొస్తుండటం, విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్కార్’ సినిమా విడుదలకు రెడీ అవ్వడమే ఇందుకు కారణాలని ఊహించవచ్చు. అంతేకాదు ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో స్టార్ట్ అవుతుందని టాక్. ‘పేట్టా, సర్కార్’ చిత్రాల నిర్మాణ బాధ్యతలను స్వీకరించిన సన్ పిక్చర్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుందట. అయితే మురుగదాస్ దర్శకత్వంలో నటించిన తర్వాత రజనీకాంత్ సినిమాలకు బై బై చెబుతారని, ఈ సినిమా స్క్రిప్ట్ కూడా రాజకీయాలకు దగ్గరగా ఉంటుందని కొందరి అంచనా. ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే లెక్కల పరంగా రజనీ కెరీర్లో ఇది 166వ సినిమా. అభిమాన హీరో ఎప్పటికీ సినిమాలు చేస్తుండాలని అభిమానులు కోరుకుంటారు. అందుకే కొత్త సినిమా గురించి వార్త వస్తే ఆనందపడతారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓకే అయిందని ఆనందపడాలో, ఇదే రజనీకాంత్‌కి చివరి సినిమా అవుతుందనే వార్తలకు బాధపడాలో తెలియని అయోమయంలో పడిపోయారట ఫ్యాన్స్. ఇక కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రజనీ తాజా చిత్రం ‘పేటా’్టలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, సిమ్రాన్, త్రిష తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరు«ద్ స్వరకర్త. మరోవైపు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా రూపొందిన ‘యందిరిన్’ (తెలుగులో ‘రోబో’) సీక్వెల్ 2.0 ఈ నవంబర్ 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
‘ఐరన్ లేడి’గా వస్తున్న అమ్మ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత... అటు వెండితెరపైనే కాకుండా.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తమిళ ప్రజలకు అమ్మగా.. కోట్లాది ప్రజలకు దేవతగా... జయలలిత చేసిన సేవలను ఎన్నటికీ తమిళనాట చెరగని ముద్రనే. జయ జీవితం పూలపాన్పేమీ కాదు. ఎన్నో ఒడిదుడుకులను ఆమె ఎదుర్కొన్నారు. ప్రస్తుతం జయలలిత జీవితాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఆమె జీవితాన్ని బయోపిక్‌గా తీసుకురావడానికి సుమారు ఐదుగురు డైరెక్టర్లు ముందుకు వచ్చారు. వారిలో ఒకరు ప్రియదర్శిని. ప్రియదర్శిని డైరెక్ట్ చేయబోయే అమ్మ బయోపిక్ టైటిల్ పేరును, ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఆవిష్కరించారు. ‘జయలలిత బయోపిక్ ‘ది ఐరన్ లేడి’ టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా, ఉత్తేజితంగా ఉంది. ప్రియదర్శిని, టీమ్ గ్రాండ్ సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నా’ అంటూ ఏఆర్ మురుగదాస్ ట్వీట్ చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా త్వరలోనే చాలా గ్రాండ్‌గా జరగనుందని కూడా ప్రకటించారు. ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించబోతున్నారు. కోట్లాది ప్రజల హృదయాల్లో ఇప్పటికీ సజీవంగా నిలిచిన అమ్మ చిత్రం ‘ది ఐరన్ లేడి’ గురించి గత నాలుగు నెలలుగా చర్చిస్తూనే ఉన్నామని ప్రియదర్శిని తెలిపారు. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల ప్రజలకు చేరేలా ఈ సినిమాను తీయాలని ప్లాన్ చేశామని చెప్పారు. ఈ సినిమా అమ్మకు నివాళిగా సమర్పించనున్నామన్నారు. జయలలిత పుట్టిన రోజు ఫిబ్రవరి 24 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, జయలలిత సినిమా తీద్దామనుకున్న మరో లెజెండ్ డైరెక్టర్ దాసరి నారాయణ రావు. అమ్మ బయోపిక్ తీయాలని కోరిక నెరవేరకుండా దాసరి నారాయణ రావు కన్నుమూశారు. Extremely happy and excited to launch the Title poster of #Jayalalithaabiopic #THEIRONLADY I wish @priyadhaarshini and team for a grand success.. pic.twitter.com/4c87Xxks74 — A.R.Murugadoss (@ARMurugadoss) September 20, 2018 -
విజయ్ దేవరకొండ సినిమాలో టాప్ డైరెక్టర్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. టాక్సీవాలా చిత్రాన్ని ఇప్పటికే పూర్తి చేసిన విజయ్.. బైలింగ్యువల్ సినిమాగా తెరకెక్కుతున్న నోటాతో పాటు డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న నోటాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌కు సూపర్బ్ రెస్సాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో దర్శకుడు మురుగదాస్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నోటా దర్శకుడు ఆనంద్ శంకర్.. మురుగదాస్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేశారు. ఇప్పుడు తన గురువునే డైరెక్ట్ చేస్తుండటంపై ఆనంద్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ పొలిటికల్ లీడర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
‘సర్కార్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సర్కార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా లాస్ వేగాస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. హీరో పరిచయ గీతంతో పాటు పలు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా మరో కీలక పాత్రలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు. షూటింగ్ ప్రారంభమైన రోజే రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్రయూనట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పక్కా ప్లాన్ చేస్తున్నారు. చిత్ర టీజర్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న విజయ్ సర్కార్ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. -
లీకైన స్టార్ హీరో సాంగ్ క్లిప్
సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను లీకులు ఇబ్బంది పెడుతున్నాయి. గీత గోవిందం సినిమా వార్తలు మరువక ముందే మరో భారీ చిత్రానికి సంబంధించిన సీన్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సర్కార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో ఇంట్రో సాంగ్‌కు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా లాస్ వేగాస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. భారీగా వేగాస్ వీదుల్లో విజయ్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. శోభి మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తున్న ఈ పాటలో విజయ్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఆ క్లిప్ వైరల్ అయ్యింది. సన్ పిక్చర్స్ సంస్థభారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా దీపాకళికి రిలీజ్ కానుంది. చదవండి : సోషల్ మీడియాలో లీకైన గీత గోవిందం సీన్స్ ‘గీత గోవిందం’ సినిమా లీక్‌పై విజయ్ స్పందన! తెలిసి చేసినా తెలియక చేసినా నేరమే పైరసీ కోరల్లో భారీ చిత్రం : అల్లు అరవింద్ -
విజయ్‌తో రొమాన్స్‌కు సై
తమిళసినిమా: విజయ్‌తో రొమాన్స్‌కు మహేశ్‌బాబు హీరోయిన్ రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం సర్కార్. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం సర్కార్. విజయ్ తన తాజా చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఇంతకు ముందు ఆయనకు తెరి, మెర్షల్ వంటి సంచలన విజయాలను అందించిన యువ దర్శకుడు అట్లీతో ముచ్చటగా మూడోసారి కలవనున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. సంగీత మాంత్రికుడు సంగీత బాణీలను కట్టనున్నారన్న విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇతర తారాగణం ఎంపికపై దృష్టిసారించారు. ఇందులో కైరా అద్వాని రొమాన్స్ చేయనున్నట్లు తాజా సమాచారం. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇంతకు ముందు భారత క్రికెట్ క్రీడ కెప్టెన్ ఎంఎస్.ధోని బయోపిక్‌లో నటించింది. ఆ చిత్రం విశేష ప్రేక్షకాదరణను అందుకుంది. ఆ తరువాత తెలుగులో మహేశ్‌బాబుకు జంటగా భరత్ అనే నేను చిత్రంలో నటించింది. ఆ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఇలా లక్కీ హీరోయిన్గా ముద్ర వేసుకున్న కైరా అద్వాని తాజగా విజయ్‌కు జంటగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోందన్నమాట. -
వివాదాస్పదంగా విజయ్ సర్కార్ ఫస్ట్‌లుక్..
-
విజయ్ ఫస్ట్‌లుక్.. వివాదాస్పదం
ఇళయదళపతి విజయ్ పుట్టినరోజు(జూన్ 22) కానుకగా గురువారం సాయంత్రం కొత్త సినిమా టైటిల్‌ను, విజయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కళ్ల జోడుతో, సిగరెట్ తాగుతూ ఉన్న విజయ్ మాస్‌లుక్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ప్రస్తుతం విజయ్ ఫొటోపై ‘తమిళనాడు ఫోరం ఫర్ టొబాకో కంట్రోల్’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పొగాకు నిషేధ చట్టాన్ని ఉల్లంఘించారని ప్రకటన విడుదల చేసింది. ప్రముఖ హీరో అయి ఉండి ఇటువంటి దురలవాట్లను ఎలా ప్రోత్సహిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. టొబాకో ఫోరం సభ్యులు మాట్లాడుతూ.. ‘ప్రముఖ హీరో విజయ్ ‘సర్కార్’ ఫస్ట్ లుక్ చూశాం. సిగరెట్, పొగాకు ఉత్పత్తుల చట్టం ప్రకారం(కోప్టా).. ధూమపానానికి సంబంధించిన ఫొటోలు పోస్టర్లలో, ప్రచార కార్యక్రమాల్లో ప్రచురించడం నిషేధం. గతంలో కూడా విజయ్ ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఆ సమయంలో విజయ్, సంబంధిత మూవీ టీమ్ క్షమాపణలు చెప్పారు. కానీ మళ్లీ అదే తప్పును పునరావృతం చేశారు. ప్రస్తుతం విజయ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా సీబీఎఫ్సీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్)కు ఫిర్యాదు చేయబోతున్నాం. యువతను ప్రభావితం చేసే సినిమా వంటి మాధ్యమాల్లో ఇటువంటి దురలవాట్లను ప్రోత్సహించవద్దని తమిళ సినిమా పరిశ్రమను కోరాం. కానీ వారి నుంచి స్పందన కరువైందని’ ఆవేదన వ్యక్తం చేశారు. -
విజయ్ ‘సర్కార్’ ఫస్ట్ లుక్!
ఇళయ దళపతిగా తమిళనాట తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్. సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాత అంతటి ఫాలోయింగ్ ఉన్న విజయ్ మాస్ హీరోగా కెరీర్లో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు. మురుగదాస్, విజయ్ కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. తుపాకీ, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ విజయాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. తాజాగా వీరిద్దరు మరో సినిమాతో హ్యాట్రిక్ హిట్‌ను అందుకునేందుకు రెడీ అవుతున్నారు. విజయ్ పుట్టినరోజు(జూన్ 22) కానుకగా గురువారం(జూన్ 21) సాయంత్రం ఈ సినిమా టైటిల్‌ను, విజయ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. కళ్ల జోడుతో, సిగరెట్ తాగుతూ మాస్‌లుక్‌లో ఉన్న విజయ్.. తన అభిమానులకు అదిరిపోయే కానుకను ఇచ్చారు. ‘సర్కార్’ అని టైటిల్ పెట్టడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంటోంది. విజయ్‌కు ఇది 62వ చిత్రం. స్వర మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇళయ దళపతి పుట్టిన రోజు కానుకగా! Here is the First Look of Thalapathy Vijay’s SARKAR.#Thalapathy62isSARKAR@actorvijay @ARMurugadoss @arrahman pic.twitter.com/7tBNQkhBz5 — Sun Pictures (@sunpictures) June 21, 2018 -
ఇళయ దళపతి పుట్టిన రోజు కానుకగా!
‘మెర్సల్’ సినిమాతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం మురగుదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు సూపర్ హిట్ కావటంతో హ్యాట్రిక్ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. సినిమాలో విజయ్ లుక్కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ రిలీజ్‌కు చిత్రయూనిట్ ముహూర్తం ఫిక్స్ చేశారు. విజయ్ పుట్టిన రోజు(జూన్ 22) సందర్భంగా జూన్ 21 సాయంత్రం 6 గంటలకు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపాకిళి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజయ్ ‘సర్కార్’ ఫస్ట్ లుక్! The First Look and Movie Title of #Thalapathy62WithSunPictures will be revealed on @SunTV at 6pm on June 21st.#Thalapathy62FirstLookon21st@actorvijay @ARMurugadoss @arrahman pic.twitter.com/vIZcckui1n — Sun Pictures (@sunpictures) 18 June 2018 -
డిజాస్టర్ రీమేక్‌తో బాలీవుడ్‌కు మహేష్..?
భరత్ అనే నేను సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న సూపర్ స్టార్ అభిమానులు అవాక్కయ్యే వార్త ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మహేష్ బాబు కెరీర్లోనే బిగెస్ట్ డిజాస్టర్లలో ఒకటైన స్పైడర్ సినిమా రీమేక్ లో మహేష్ నటించనున్నారట. తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతోనే మహేష్ కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచిన స్పైడర్ తమిళ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు మురుగదాస్. ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడిన మురుగదా ఈ విషయాన్ని ధృవీకరించారు. స్పైడర్ సినిమా రీమేక్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని వెల్లడించిన మురుగదాస్.. హీరో ఎవరన్నది కన్ఫామ్ చేయలేదు. దీంతో తెలుగు, తమిళ భాషల్లో మీరోగా నటించిన మహేషే, రీమేక్‌లోనూ నటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో అనుపమా చోప్రాకు ఇచ్చిన ఇంటర్య్వూలో బాలీవుడ్ ఎంట్రీపై స్పందించిన మహేష్, మంచి కథ దొరికితే హిందీ సినిమాకు రెడీ అన్నారు. దీంతో స్పైడర్ సినిమాతోనే మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలపై మహేష్ స్పందించాల్సి ఉంది. -
అమెరికాకు ఇళయదళపతి
తమిళసినిమా: విజయ్, ఏఆర్.మురుగదాస్‌ల టీమ్‌కు అమెరికాకు బయలదేరనుందన్న తాజా సమాచారం. ఇళయదళపతి విజయ్ 62వ చిత్రం షూటిం గ్ వడివడిగా పూర్తి చేసుకుంటోంది. తుపాకీ, కత్తి చిత్రాల తరువాత విజయ్, దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఇందులో నటి కీర్తీసురేశ్ కథానాయకిగానూ, వరలక్ష్మీశరత్‌కుమార్ ప్రతినాయకి పాత్రలోనూ నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నటుడు రాధారవి, పళ.కరుప్పయ్య రాజకీయవాదులుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల చెన్నైలో జరిగింది. చిత్ర షూటింగ్ ఇప్పటికి 70 శాతం పూర్తి చేసుకున్నట్లు సమాచారం. జూలైలోపు చిత్ర షూటింగ్‌ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. తదుపరి షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించారు. త్వరలోనే చిత్ర యూనిట్ అమెరికాకు పయనం కానుంది. ఈ నెల 22న విజయ్ పుట్టినరోజు. అయితే ఆ రోజు ఆయన అమెరికాలో ఉంటారు. పుట్టిన రోజు వేడుకలు రద్దు విజయ్ పట్టిన రోజు అంటే ఆయన అభిమానులకు పండగ రోజే. ఆ రోజు విజయ్ పేరుతో ఆలయాల్లో పూజలు, వాడవాడలా పోస్టర్లు, పలు సామాజిక సేవా కార్యక్రమాలు అంటూ హంగామా చేస్తారు. అయితే ఈ సారి అలాంటివేమీ వద్దని విజయ్ తన అభిమానులకు చెప్పినట్లు సమాచారం. కారణం ఇటీవల తూత్తుకుడి కాల్పుల సంఘటనేనట. అదే విధంగా పుట్టిన రోజున తాను అమెరికాలో షూటింగ్లో ఉంటాను కాబట్టి అభిమానులెవరూ తనను కలవడానికి చెన్నైకి రావద్దని, అయితే ప్రశాంతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా విజయ్ తన అభిమానులకు పిలుపునిచ్చినట్లు తెలిసింది. దీని గురించి ఆయన త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
బ్రేక్‌లో బటర్ చికెన్
షూటింగ్‌కు హాలీడేనో లేక స్వయంపాకం తినాలనుకున్నారో కానీ హీరోయిన్ హాన్సిక గెరిట పట్టి చెఫ్‌గా మారిపోయారు. కిచెన్‌లోకి వెళ్లి వంట వండారు. ఇంతకీ ఏం చేశారనుకున్నారు?! బటర్ చికెన్! టేస్ట్ గురించి అడక్కండి. ఎందుకంటే అది హాన్సికకు మాత్రమే తెలుసు. ఖాళీ టైమ్‌లో కిచెన్‌లోకి వెళుతున్నారు సరే. మరి..లొకేషన్లో కెమెరా ముందుకు వెళ్లడం లేదా అంటే.. ఎందుకు లేదూ? ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మరికొన్ని సినిమాల కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఆథర్వ హీరోగా హాన్సిక కథానాయికగా నటిస్తోన్న సినిమాకు ‘100’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ మురగదాస్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరో ఆథర్వ పోలీసాఫీసర్ రోల్ చేస్తున్నారు. -
ఏప్రిల్ 25న రీస్టార్ట్
తమిళ సినిమా: ఎన్నడూ లేనట్లుగా చిత్రపరిశ్రమ 48 రోజుల పాటు నిరవధిక సమ్మె. తమిళ సినీ పరిశ్రమ స్తంభించిందనే చెప్పాలి. ఎక్కడ షూటింగ్‌లు అక్కడ ఆగిపోయాయి. నటీనటుల నుంచి ఇతర సాంకేతిక వర్గం ఇళ్లకే పరిమితమైపోయారు. ముఖ్యంగా సినీ కార్మికులు చాలా ఆర్థికసమస్యలను ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితికి పుల్‌స్టాప్ పడడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న సినీ వర్గాలు శుక్రవారం నుంచి అందరూ తమ తమ విధులకు రెడీ అవుతున్నారు. అలా నటుడు విజయ్ చిత్ర బృందం ఏకంగా విదేశాలకే పయనం అవ్వడానికి సన్నద్ధం అవుతోంది. విజయ్ నటిస్తున్న తాజా చిత్రానికి ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. నటి కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ రాజకీయనాయకురాలిగా ప్రతినాయకి ఛాయలున్న పాత్రను పోషిస్తున్నారు. ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్న ఈ భారీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. ఈ నెల 25వ తేదీన విజయ్ చిత్రం యూనిట్ విదేశాలకు పయనం కానుందని సమాచారం. అక్కడ విజయ్, కీర్తీసురేశ్‌ల యువళ గీతాలను, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేసుకున్నారట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది సమాజానికి సంబంధించిన ఒక ముఖ్య అంశాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. -
హిట్ కాంబినేషన్ రిపీట్ కానుందా?
తమిళ సినిమా : హీరో, దర్శకుల హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే ఆ చిత్రానికి ఉండే క్రేజే వేరు. అలాంటి కాంబినేషన్లో ఒక భారీ చిత్రం తెరకెక్కడానికి రంగం సిద్ధం అవుతోందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఆయన 62వ చిత్రం అవుతుంది. ఇందులో కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్నారు. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ తదుపరి చిత్రానికి దర్శకుడెవరన్న ప్రశ్న చాలా కాలంగానే ఆసక్తిగా మారింది. ఈ లిస్ట్‌లో పలు దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. చతురంగవేట్టై చిత్రం ఫేమ్ హెచ్.వినోద్ విజయ్ తదుపరి చిత్రానికి పని చేయనున్నారనే ప్రచారం జరిగింది. దర్శకుడు అట్లీ కూడా విజయ్ కోసం కథను రెడీ చేశారనే ప్రచారం తెరపైకి వచ్చినా, ఆయన తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ఇటీవలే వెల్లడించారు. తాజాగా దర్శకుడు మోహన్‌రాజా పేరు వైరల్ అవుతోంది. తనీఒరువన్, వూలైక్కారన్ వంటి సంచలన విజయాలను సాధించిన చిత్రాల దర్శకుడు మోహన్‌రాజా విజయ్ కోసం ఒక బలమైన ఇతివృత్తంతో కూడిన కథను రెడీ చేశారని టాక్. విజయ్ 63వ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టు తాజా సమాచారం. విజయ్, మోహన్‌రాజా కాంబినేషన్లో ఇంతకుముందు తెరకెక్కిన వేలా యుధం సూపర్‌హిట్ అయ్యింది. -
ఊర మాస్‌గా విజయ్
తమిళసినిమా: విజయ్ అంటేనే మాస్, మాస్ అంటేనే విజయ్ అన్నంతగా ఆయన చిత్రాలు ఉంటాయి. అభిమానుల నాడిని బట్టే స్టార్ హీరోలు కథలను ఎంచుకుంటారు. ఇక విజయ్ అభిమానులు ఆయన్ని మాస్ హీరోగానే చూడటానికి ఇష్టపడతారు. విజయ్ ఈ మధ్య నటించిన తుపాకీ, జిల్లా, కత్తి, తెరి, మెర్శల్ చిత్రాలన్నీ ఈ తరహా కథా చిత్రాలే. మెర్శల్ చిత్రంలో మూడు పాత్రల్లో ముగ్గురు కథానాయికలతో దుమ్మురేపారు. శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఆ సంస్థలో 100వ చిత్రంగా నమోదైంది. తాజాగా విజయ్ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తన 62వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కీర్తీసురేశ్ నాయకి. మురుగదాస్, విజయ్‌ల కాంబినేషన్ అంటేనే ఒక స్పెషల్. వీరి కలయికలో తెరకెక్కిన తుపాకీ, కత్తి చిత్రాలు విశేష ప్రేక్షకాదరణను పొందాయన్నది గమనార్హం. విజయ్ 62వ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే తదుపరి చిత్రానికి పచ్చజెండా ఊపారన్నది తాజా సమాచారం. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్‌లో విజయ్ తన 63వ చిత్రాన్ని చేయనున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉన్నా, ఇది సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థకు 100వ చిత్రం కావడం మరో విశేషం. అయితే ఇందులో విజయ్ ఊర మాస్ పాత్రలో నటించనున్నారని సమాచారం. ఇక ఆయన అభిమానులకు పండగేనని వేరే చెప్పాలా! -
హ్యాట్రిక్ కాంబినేషన్
తుపాకీ, కత్తి లాంటి ఘనవిజయాలు సాధించిన విజయ్, మురగదాస్‌ల కాంబినేషన్లో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ మొదలైంది. మరోసారి ఓ సామాజిక సమస్య నేపథ్యంలో విజయ్ హీరోగా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందిస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇప్పుడు సినిమా సెట్స్ మీదకు రావటంతో ఇళయదళపతి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం సినిమా ఓపెనింగ్ విషయంలో హింట్ ఇస్తూ దర్శకుడు మురుగదాస్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ‘హ్యాపీ దీపావళి గైస్’ అంటూ మురుగదాస్ ట్వీట్ చేసిన వెంటనే ఇది విజయ్ సినిమా ఓపెనింగ్ గురించి చేసిన ట్వీట్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టారు. అభిమానుల అంచనాలను నిజం చేస్తూ విజయ్, కీర్తి సురేష్‌లు హీరోహీరోయిన్లుగా కొత్త సినిమాను ప్రారంభించాడు మురుగదాస్. ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. -
రకుల్‌కు కలిసిరాని కోలీవుడ్
సాక్షి, సినిమా : నటి రకుల్ ప్రీత్‌సింగ్‌కు కోలీవుడ్ అచ్చిరాలేదా? అంటే అవుననే అంటున్నాయి పరిస్థితులు. అనుష్క నుంచి తమన్నా, కాజల్ లాంటి చాలా మందిని కోలీవుడ్ తొలుత నిరాకరించింది. వారందరు టాలీవుడ్‌కు వెళ్లి అక్కడ అదృష్టాన్ని పరిక్షించుకుని నిలదొక్కుకున్న తరువాత కోలీవుడ్‌కు మళ్లీ స్వాగతించారు. రకుల్ అదే విధంగా కోలీవుడ్‌లో పుత్తగం, తడయార తాక్క, ఎన్నమో ఏదో వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌కు మకాం మార్చింది. ఆమె అక్కడ వరుస అవకాశాలతో స్టార్ హీరోలతో నటించి క్రేజీ నాయకిగా పేరు తెచ్చుకుంది. దీంతో కోలీవుడ్ దృష్టి మళ్లీ రకుల్‌ప్రీత్ సింగ్‌పై పడింది. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌కు జంటగా నటించడంతోనే కోలీవుడ్‌లో అవకాశాలు రావడం మొదలుపట్టాయి. దీంతో రకుల్ కోలీవుడ్‌లో ఒక రౌండ్ కొట్టొచ్చని కలలు కంది. అంతే కాదు దర్శకుడు ఏఆర్.మురుగదాస్ విజయ్ హీరోగా చేయబోయే తన తదుపరి చిత్రంలో రకుల్‌కు అవకాశం కల్సించినట్లు ప్రచారం జరిగింది. అదే విధంగా సూర్యకు జంటగా నటించే అవకాశాన్ని రకుల్ అందుకుంది. అయితే తను నటించిన స్పైడర్ చిత్రం హిట్ కాకపోవడం ఆమెకు శాపంగా మారిందనే చెప్పాలి. సూర్యతో నటించే అవకాశాన్ని, విజయ్‌తో నటించే అవకాశాన్ని రకుల్‌ప్రీత్ సింగ్ కోల్పోయింది. కారణాలేమైనా ఇప్పుడు ఆ రెండు అవకాశాలను నటి కీర్తీపురేశ్ తన్నుకు పోయింది. అలా ఇంతకు ముందు హీరోయిన్ల సెంటిమెంట్ రకుల్‌కు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ పెద్దగా చిత్రాలు లేవు. అంతగా వెలిగిన రకుల్ ఒక్కసారిగా పడిపోయింది. టైమ్ అంటే ఇదేనేమో! -
స్టైల్ అదిరిందా?
తమిళసినిమా: ఎలా ఉంది నా గెటప్? స్టైలిష్‌గా ఉందా? అదిరిందా? ఇళయదళపతి విజయ్ ఇలా అడుగుతున్నట్లుంది కదూ! ఇంతకీ ఈ గెటప్ ఏ చిత్రం కోసం? అనే ఆసక్తి కలిగే అవకాశం లేకపోలేదు. మెర్శల్ చిత్రంతో కలెక్షన్లను కుమ్మేసిన విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అయిపోయారు. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తన 62వ చిత్రాన్ని చేయడానికి రంగం సిద్ధమైంది.ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను చిత్ర వర్గాలు వెల్లడించారు. తుపాకీ, కత్తి చిత్రాల తరువాత విజయ్ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ సంస్థ నిర్మించనుంది. విశేషం ఏమిటంటే ఎందిరన్ వంటి బ్రహ్మాండ చిత్రం తరువాత ఈ సంస్థ చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ విజయ్ చిత్రంతో రీఎంట్రీ అవుతోంది.ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాగా మెర్శల్ చిత్రం తరువాత సంగీత మాత్రికుడు ఏఆర్.రెహ్మాన్ విజయ్‌తో కలిసి ఈ చిత్రానికి పనిచేయనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించనున్నారు. గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అందించనున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో నటి రకుల్ ప్రీత్‌సింగ్ నాయకిగా నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే చిత్ర యూనిట్ ఆ అవకాశాన్ని కీర్తీసురేశ్‌కే అందించారు. అవును విజయ్ 62వ చిత్రంలో కీర్తీసురేశ్ కథానాయకిగా నటించనున్నారని నిర్మాతల వర్గం అధికారికంగా ప్రకటించారు. భైరవ చిత్రం తరువాత విజయ్‌తో కీర్తి రెండవ సారి రొమాన్స్ చేయనున్నారన్న మాట. ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో హీరో గెటప్ కోసం మంగళవారం స్థానిక సాలిగ్రామంలోని ఏవీఎం.స్టూడియోలో ఫొటో షూట్ నిర్వహించారు. అందులో షూటు బూటూ, చేతిలో షూట్కేస్ పక్కన ఖరీదైన కారుతో స్టైలిష్‌గా విజయ్ను వివిధ బంగిమల్లో షూట్ చేశారు. ఈ అదిరిపోయే విజయ్ గెటప్ స్టిల్స్ సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి.ఇవి చూసి విజయ్ అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. ఇక విజయ్, ఏఆర్.మురుగదాస్, ఏఆర్.రెహ్మాన్, సన్ పిక్చర్స్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయికే చేరుకున్నాయి. -
అలా కసి తీర్చుకుంటోందా?
తమిళసినిమా: కొన్ని సంఘటనలు మనసులో బలంగా నాటుకు పోతాయి. వాటి నుంచి అంత తొందరగా బయటపడడడం కష్టం. ఇంకా చెప్పాలంటే శత్రువుకు శత్రువు మిత్రుడన్న సామెత ఉంది. నటి నయనతార ఇప్పుడు దాన్ని ఫాలో అవుతోందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాస్త వివరంగా చెప్పాలంటే నటి నయనతార ఇప్పటి లెవలే వేరు. అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈ సంచలన నటి ఇప్పుడు శాసించే స్థాయిలో ఉంది. కథానాయకికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్న నయనతార ఎక్కవగా వర్ధమాన దర్శకుల చిత్రాల్లో నటించడం విశేషమే. అయితే ఇందుకో కారణం ఉందంటోంది కోలీవుడ్. నయనతార నటించిన తాజా చిత్రం అరమ్ శుక్రవారం తెరపైకి రానుంది. తన కలెక్టర్‌గా నటించిన ఈ చిత్రాన్ని నవ దర్శకుడు గోపీనయినార్ తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో నయనతార నటించడానికి కారణం ఇంతకు ముందు గోపీనయినార్ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన కత్తి చిత్ర కథ తనదంటూ కోర్టు వరకూ వెళ్లి ఆయన్ని రచ్చలోకి లాగాడు. ఏఆర్.మురుగదాస్‌కు నటి నయనతారకు మధ్య చాలా కాలంగా కోల్డ్‌వార్ జరుగుతోందనే ప్రచారం ఉంది. అందుకు కారణం గజని చిత్రంలో తన పాత్రను తగ్గించి, నటి అసిన్‌కు అధిక ప్రాముఖ్యంనివ్వడమేనన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆ కసి తీసుకోవడానికే ఆయన్ని ఢీకున్న గోపి నయినార్కు నయనతార అవకాశం ఇచ్చిందంటున్నారు. ఇక తాజాగా నయనతార కోకో అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకుడు. ఈయనకు నయనతార అవకాశం ఇవ్వ డం వెనుక ఒక కథ ఉందట.దర్శకుడు నెల్సన్ ఇంత కు ముందు శింబు హీరోగా వేట్టైమన్నన్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే ఆ చిత్రాన్ని శింబు మధ్యలోనే నిలిపేశారు. ఇక శింబుకు నటి నయనతారకు మధ్య సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి మధ్య డీప్ లవ్ చివరికి ఎలా ఫెయిల్ అయ్యిందో తెలిసిందే. శింబుపై ఆ కసి తీర్చుకోవడానికే దర్శకుడు నెల్సన్‌కు కోకో చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కల్పించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తోంది. -
ఆయనతో మళ్లీ చేయాలని ఉంది
తమిళసినిమా: ఇళయదళపతితో మరోసారి నటించాలని ఉందన్న కోరికను వ్యక్తం చేసింది బాలీవుడ్ క్రేజీ నటి. ఎవరా బ్యూటీ గెస్ చేయగలరా? బాలీవుడ్ నుంచి ఈ మధ్యనే హాలీవుడ్‌ను చుట్టొచ్చిన ఈ భామ ఇంతకు ముందే కోలీవుడ్‌లోనూ ఒక చిత్రంలో నటించింది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు నటి ప్రియాంక చోప్రా. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్న ఈమె చాలా కాలం ముందే తమిళన్ అనే చిత్రంలో విజయ్‌కు జంటగా నటించి కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తరువాత చాలా మంది ప్రియాంక చోప్రాను తమిళ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నాలు చేసినా ఆమె అంగీకరించలేదు. ఇటీవల కూడా ప్రియాంకచోప్రా కోలీవుడ్‌కు రీఎంట్రీ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఈ అమ్మడు ఇటీవల ఒక భేటీలో నటుడు విజయ్ అంటే తనకు చాలా ఇష్టమని తాను ఆయనకు వీరాభిమానినని పేర్కొన్నారు. అంతే కాదు మరోసారి విజయ్‌తో కలిసి నటించాలని కోరుకుంటున్నానని చెప్పారు. కాగా విజయ్ తదుపరి ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తన 62వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ను కథానాయకిగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరగుతోంది. ఈ చిత్రంలో ప్రియాంకచోప్రా నటించే అవకాశం లేదనే చెప్పాలి. మరి అలాంటిది ఈ అమ్మడికి ఇళయదళపతితో నటించే అవకాశం ఎప్పుడొస్తుందో చూడాలి. అయితే కోలీవుడ్ దర్శక నిర్మాతలకు ఒక హింట్ ఇచ్చారు కాబట్టి అలాంటి ప్రయత్నాలు జరిగే అవకాశం లేకపోలేదు. -
స్పై టీం
-
'మహేశ్‌దీ, నాదీ సేమ్ టేస్ట్!'
‘‘కమర్షియల్ సినిమాల్లో కూడా అంతర్లీనంగా ఓ సందేశం ఇస్తే ప్రేక్షకులకు తప్పకుండా చేరుతుంది. అదే సందేశం మాత్రమే ఇవ్వాలని సినిమా తీస్తే ప్రయోజనం ఉండదు. ఓ పెద్ద హీరో సినిమా ద్వారా సందేశం ఇస్తే ప్రేక్షకులందరికీ సులభంగా చేరుతుంది’’ అన్నారు ఏఆర్ మురుగదాస్. మహేశ్‌బాబు హీరోగా ఆయన దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘స్పైడర్’ ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మురుగదాస్ చెప్పిన ముచ్చట్లు... ♦ ఒకప్పుడు దేవుడంటే భయపడేవాళ్లు... ఇప్పుడు సీక్రెట్ కెమెరా అంటే భయపడుతున్నారు. మన లైఫ్‌లో సీక్రెట్ అనేది ఏదీ ఉండడం లేదు. ఏదైనా మర్డర్ జరిగితే సీక్రెట్ కెమెరాతో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో కనిపెట్టొచ్చు. ఐబి (ఇంటిలిజెన్స్ బ్యూరో) వాళ్లు చేసేదదే! దానిపైనే ‘స్పైడర్’ సినిమా ఉంటుంది. ∙ ♦ 20 ఏళ్ల క్రితం ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే అందరూ హెల్ప్ చేయడానికి ముందుకొచ్చేవారు. ఇప్పుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటున్నారు. మానవత్వం ఎక్కడా కనిపించడం లేదు. పెద్ద విపత్తులు, ఘోరాలు (డిజాస్టర్స్) జరిగినప్పుడు మాత్రమే మానవత్వం అనేది బయటకొస్తుంది. విపత్తుల కోసం మనం వెయిట్ చేయకూడదు, అందరికీ హెల్ప్ చేయాలనే సందేశాన్ని అంతర్లీనంగా ‘స్పైడర్’లో చెప్పా. ♦ ఇందులో మహేశ్ ఐబి ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఆయన సూపర్‌హిట్ సిన్మాలన్నీ చూశా. స్క్రిప్ట్‌కి, క్యారెక్టర్‌కి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్‌లో 100 పర్సెంట్ డిఫరెన్స్ చూపిస్తారు. ‘స్పైడర్’లో సరికొత్త మహేశ్‌ని చూస్తారు. ఇంతకు ముందు ఆయన ఇలాంటి పాత్ర చేయలేదు. హీరో బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీక్వెన్స్ తదితర అంశాల్లో మహేశ్‌దీ, నాదీ సేమ్ టేస్ట్. ఫైట్స్ అనగానే గాల్లో ఎగరకూడదు, సహజత్వంగా ఉండాలనేది మా ఫీలింగ్. ఈ ‘స్పైడర్’ కూడా సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమా. ♦ తెలుగుతో పాటు తమిళ్ వెర్షన్లోనూ సినిమా కథంతా హైదరాబాద్ నేపథ్యంలోనే సాగుతుంది. కథలో జాగ్రఫీకి ఇంపార్టెన్స్ ఉంది. తెలుగు, తమిళ్ వెర్షన్స్‌కి రీ–రికార్డింగ్‌లో కొంచెం తేడా ఉంటుందంతే. ఇక్కడ మహేశ్ సూపర్‌స్టార్ కాబట్టి ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగా, తమిళంలో కొత్త హీరో కాబట్టి, ఆ అంశాన్ని దృష్టిల్లో పెట్టుకుని రీ–రికార్డింగ్ చేశాం. ∙ ♦ భారతంలో శకునిలా, హీరోని సైకలాజికల్‌గా దెబ్బతీసే విలన్ పాత్రలో ఎస్.జె. సూర్య నటన సూపర్బ్. హీరోకి, విలన్‌కి మధ్య మైండ్‌గేమ్ ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా, ఫ్యామిలీ లేడీస్‌తో కలసి విలన్ని హీరో ఎలా పట్టుకున్నాడనే 20 మినిట్స్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. రాక్ ఎపిసోడ్ (పెద్ద బండరాయి దొర్లుతూ వచ్చే సీన్), రోలర్ కోస్టర్ ఫైట్ ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి. ♦ ప్రభాస్‌తో ఫ్రెండ్లీగా ఫోనులో మాట్లాడా తప్ప ఏ సినిమా గురించీ డిస్కస్ చేయలేదు. నేరుగా కలవలేదు. రజనీకాంత్‌గారిని రెండు మూడుసార్లు కలిసి, కథ చెప్పా. డేట్స్ కుదరలేదు. త్వరలో మా కాంబినేషన్లో సినిమా ఉండొచ్చు!! -
సినిమాను 150సార్లు చూశా : మహేశ్
‘‘సిన్మాలో చాలా ఎగ్జయిటింగ్ అంశాలున్నాయి. హైలైట్స్ ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని దాచిపెట్టాం!’’ అన్నారు మహేశ్‌బాబు. ఆయన హీరోగా ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘స్పైడర్’. ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. రేపు రిలీజవుతున్న ఈ సిన్మా గురించి మహేశ్ చెప్పిన ముచ్చట్లు... ► సిన్మాలో ఇంటిలిజెన్స్ బ్యూరోలో పనిచేసే ఆఫీసర్‌గా నటించా. టీజర్లో చూపించిన ‘స్పైడర్’ సిన్మాలో ఉండదు. హీరో క్యారెక్టర్ని పరిచయం చేయడం కోసం కాన్సెప్ట్ బేస్డ్గా టీజర్‌ను షూట్ చేశాం. ∙ ► ‘స్పైడర్’ తెలుగు, తమిళ్ వెర్షన్స్ వేర్వేరుగా ఉంటాయి. తెలుగుకి, తమిళ్‌కి కొందరు నటీనటులు మారతారు. అలాగే రెండు భాషలకు సంబంధించిన సీన్స్‌ని వెంట వెంటనే షూట్ చేయడంతో తెలుగు, తమిళ్ డైలాగ్స్ మాట్లాడేవాణ్ణి. అదో కొత్త ఎక్స్పీరియన్స్! అందుకే.. కొరటాల శివగారితో ప్రస్తుతం చేస్తున్న ‘భరత్ అనే నేను’ చాలా ఈజీగా ఉంది. జస్ట్ తెలుగులో డైలాగులు చెబితే చాలు.. సీన్ కంప్లీట్ అయిపోతోంది. ఇంతేనా అనిపిస్తోంది. ‘స్పైడర్’ అనేది హీరో–విలన్ కథ. సిన్మాకు విలన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మురుగదాస్‌గారు కథ చెప్పిన రెండు నెలల తర్వాత ‘మన సినిమాలో ఎస్.జె. సూర్య విలన్’ అన్నారు. ఫస్ట్... నాకేం అర్థం కాలేదు. దర్శకుడిగా అతను నాకు బాగా తెలుసు. రెండు రోజులు ఆలోచించాక అతనే విలన్‌గా పర్ఫెక్ట్ అనుకున్నా. ఎస్.జె. సూర్య నటించిన తమిళ సినిమాలు చూశా. బ్రిలియంట్ యాక్టర్! మురుగదాస్‌గారిపై గౌరవంతో తమిళ నటుడు భరత్ ఇంపార్టెంట్ రోల్ చేశారు. ► ‘స్పైడర్’లో డ్యూయల్ రోల్ చేశారట? అనడిగితే... అదే నిజమైతే ప్రోమో లో వేసేవాళ్లమన్నారు. మీరు, నమ్రతగారు ఈ సిన్మా చూశారా? అనడిగితే... ‘‘నమ్రత చూడలేదు. నేనిప్పటివరకూ 150సార్లు చూశా’’ అని మహేశ్ చమత్కరించారు. -
ఆయన దర్శకత్వంలో నటించడం మోస్ట్ మెమొరబుల్
తమిళసినిమా: ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడం అన్నది నా కెరీర్లోనే మోస్ట్ మెమొరబుల్‌గా భావిస్తున్నానని స్పైడర్ చిత్రంతో నేరుగా కోలీవుడ్‌కు రంగప్రవేశం చేస్తున్న టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పేర్కొన్నారు. టాగూర్ మధు సమర్పణలో ఎన్వీ.ప్రసాద్ నిర్మించిన భారీ ద్విభాషా చిత్రం స్పైడర్. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హారీష్‌జయరాజ్ సంగీతం అందించారు. మహేశ్‌బాబు సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ నటించిన ఇందులో ఎస్జే.సూర్య, భరత్ ప్రతినాయకులుగా నటించడం విశేషం. ఈ చిత్రాన్ని తమిళంలో లైకా సంస్థ విడుదల చేయనుంది. టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ భారీ అంచనాలు సంతరించు కున్న స్పైడర్ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం మద్యాహ్నం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మహేశ్‌బాబు సహకారంతోనే.. చిత్ర దర్శకుడు ఏఆర్.మురగదాస్ మాట్లాడుతూ తమిళం, తెలుగు అంటూ ద్విభాషా చిత్రం చేయడం తనకు పెద్ద సవాల్‌గా మారిందన్నారు. అలాంటిది ఈ చిత్ర కథానాయకుడు మహేశ్‌బాబు తన పూర్తి సహకారంతో చాలా సులభం చేశారని పేర్కొన్నారు. మరో నాలుగేళ్ల తరువాత కూడా చూసేలా చిత్రం ఉండాలని ఆయన తనతో అన్నారన్నారు. నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రీఎంట్రీ అవుతున్నారని అన్నారు. 10 రెట్లు అధికంగా గుండె కొట్టుకుంటోంది: మహేశ్‌బాబు మాట్లాడుతూ స్పైడర్ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోందని, అయితే ఇప్పటి నుంచే తన గుండె 10 రెట్లు అధికంగా కొట్టుకుంటోందని అన్నారు. తమిళంలో చిత్రం చేయాలన్న కోరిక చాలా కాలంగా ఉందని, దర్శకుడు ఏఆర్.మురుగదాస్ కలిసి స్పైడర్ కథ చెప్పడంతో దీన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ చేస్తే బాగుంటుందని భావించామని చెప్పా రు. మంచి కథ లభిస్తే మళ్లీ తమిళంలో నటిస్తానని మహేశ్‌బాబు అన్నారు. స్పైడర్ చిత్రం తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఈ చిత్రంలో తాను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందని నటి రకుల్‌ప్రీత్‌సింగ్ అన్నారు. స్పైడర్ చిత్రం మహేశ్‌బాబు కెరీర్లోనే దిబెస్ట్ చిత్రంగా నిలిచిపోతుందని నిర్మాత ఎన్వీ.ప్రసాద్ పేర్కొన్నారు. -
గూఢచారి రిటర్న్స్- ఎక్స్‌క్లూజివ్ ఇంటర్య్వూ
గూఢచారి 116... మన గుండెల్లో కట్టిన గూడు ఎప్పటికీ చెదరదు. ఆ గూటి నుంచే మళ్లీ గూఢచారి వచ్చాడు ది స్పై ఈజ్ బ్యాక్... విత్ న్యూ స్పైస్! గూఢచారి రిటర్న్స్‌తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం.. ఎంజాయ్ సండే. చెన్నైలో పుట్టి, అక్కడే చదువుకున్నారు. హీరో అయిన 17 ఏళ్లకు తమిళంలో సినిమా చేయడం ఎలా అనిపించింది? యాక్చువల్లీ మురుగదాస్‌తో సినిమా అనుకున్నప్పుడే తెలుగు, తమిళ భాషల్లో చేయాలనుకున్నాం. ఎందుకంటే ఈ కథకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది. రెండు భాషల్లో చేస్తే కవర్ అవుతుంది కదా. తమిళ్ నాకు బాగా వచ్చు. అందుకని ఈజీ అవుతుందనుకున్నా. అయితే రెండు భాషల్లో సినిమా ఈజీ కాదని అర్థమైంది (నవ్వుతూ). బిగ్ బడ్జెట్ మూవీస్‌ని ఎక్కువ భాషల్లో తీస్తేనే సేఫ్ కదా? అవును. ఇప్పుడు ‘బాహుబలి’లాంటి భారీ సినిమా ప్లాన్ చేసినప్పుడు ఎక్కువ భాషల్లోనే రిలీజ్ చేయాలి. అప్పుడే సేఫ్ కాగలుగుతాం. ఆ సినిమా అన్ని లాంగ్వేజెస్‌లోనూ బిగ్గెస్ట్ హిట్. ‘స్పైడర్’ బడ్జెట్ ఎక్కువ కాబట్టి, రెండు భాషల్లో తీస్తే సేఫ్ అనుకున్నాం. అయితే కథ రెండు భాషలకు తగ్గట్టుగా లేకపోతే కష్టం. అందుకే మురుగదాస్ ఇటు తెలుగు అటు తమిళ్‌కి తగ్గట్టుగా క£ý రాశారు. చెన్నైలో పెరిగారు కాబట్టి, హీరో అవ్వాలనుకున్నప్పుడు తమిళ సినిమాతో పరిచయమవ్వాలనుకోలేదా? నాన్నగారు తెలుగులో పెద్ద హీరో. అందుకని, తెలుగు సినిమా నాకు ప్రయార్టీ అయింది. ఇక్కడ సినిమాలు చేయడం మొదలుపెట్టాక తమిళ్ గురించి ఆలోచించే తీరిక లేకుండాపోయింది. ఒకట్రెండు సార్లు అనుకున్నా అవి కుదరలేదు. మురుగదాస్‌గారితో సినిమా చేయాలని ‘పోకిరి’ టైమ్‌లో అనుకున్నా. ఫైనల్లీ ‘స్పైడర్’తో కుదిరింది. నా డ్రీమ్ కాంబినేషన్ నిజమైంది. వెరీ వెరీ హ్యాపీ. తమిళ హీరో కార్తీ ఇంకా అక్కడ కొంతమంది ఆర్టిస్టులు మీ క్లాస్మేట్స్ అట.. ఏ స్కూల్, కాలేజీలో చదువుకున్నారు? సెయింట్ బెడెస్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నాను. కార్తీ నా క్లాస్‌మెట్. యువన్‌శంకర్ రాజా (సంగీత దర్శకుడు) కూడా మా క్లాసే. సూర్య కూడా ఆ స్కూల్ స్టూడెంటే. ఇంకా విజయ్ (తమిళ హీరో) నాకు మంచి ఫ్రెండ్. లయోలా కాలేజీలో చదువుకున్నాను. మేమంతా కాలేజీ గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాళ్లం. విజయ్‌తో మీరో సినిమా చేయాల్సింది కదా? విజయ్, నాతో మణిరత్నంగారు ఓ మూవీ తీయాలనుకున్నారు. ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవలను బేస్ చేసుకుని ఆ మూవీ ప్లాన్ చేశారు. అనుకోకుండా ఆగింది. విజయ్ కాంబినేషన్లో సినిమా చేసే ఛాన్స్ వస్తే చేస్తా. అయితే ఇద్దరి పాత్రలకూ సమాన ప్రాధాన్యం ఉండాలి. ఆ తరహా మల్టీస్టారర్ మూవీస్‌కి నేను రెడీ. హిందీ సినిమాలకు కూడా మీకు అవకాశం వచ్చింది. బహుశా ఆ లాంగ్వేజ్‌లో మీరు ఫ్లూయెంట్ కాదు కాబట్టి ఒప్పుకోలేదా? నేనెప్పుడూ హిందీ మాట్లాడటం ఇక్కడివాళ్లు చూడలేదు కాబట్టి, హిందీ రాదనుకుంటున్నారేమో. హిందీ బాగా మాట్లాడతాను. అయితే, తెలుగులో చేతి నిండా పని ఉన్నప్పుడు అక్కడికెందుకు వెళ్లడం అని నా ఫీలింగ్. బాగా ఎగ్జయిట్ చేసే ప్రాజెక్ట్ వస్తే అప్పుడు ఆలోచిస్తా. ‘స్పైడర్’లో స్పై జేమ్స్ బాండ్ స్టైల్లో ఉంటాడా? జేమ్స్‌బాండ్ స్టైల్ ఆఫ్ ‘స్పై’ కాదు. వేరే టైప్‌లో ఉంటుంది. బట్, అందరూ ఎంజాయ్ చేసేలా చాలా కొత్తగా ఉంటుంది. ఇంటిలిజెన్స్ బ్యూరోలో చేసే ఆఫీసర్, స్పై యాక్టివిటీస్... నుంచే కథ నడుస్తుంది. టోటల్‌గా జేమ్స్ బాండ్ స్టైల్ ఆఫ్ సినిమా కాదు. మన నేటివిటీకి దగ్గరగా, ప్రేక్షకులకు దగ్గరగా, ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న అంశాలకు దగ్గరగా ఉండే ఒక యాక్షన్ ఫిల్మ్. కృష్ణగారు చేసిన ‘గూఢచారి 116’ ఎవర్గ్రీన్. మిమ్మల్ని గూఢచారిగా చూడటం ఆయనకు ఆనందం కలిగించే విషయం. (నవ్వుతూ). అవును. మురుగదాస్‌లాంటి డైరెక్టర్‌తో సినిమా చేయడం ఆయనకు ఒక ఆనందం అయితే.. నేను తమిళ సినిమా చేయాలనే ఆయన కల నెరవేరడం మరో ఆనందం. నేను స్పైగా కనిపించనుండటం నాన్నగారిని థ్రిల్‌కి గురి చేసే విషయం. చిన్నపిల్లలకు నచ్చే క్యారెక్టర్స్‌లో ‘స్పైడర్ మేన్’ ఒకటి. మీరు ‘స్పైడర్’ టైటిల్‌తో సినిమా చేయడం మీ పిల్లలు గౌతమ్, సితారలకు బాగా నచ్చి ఉంటుందేమో... వాళ్లు నా ప్రతి సినిమాకీ థ్రిల్ అవుతారు. సితార ‘బూమ్... బూమ్...’ పాటను హుషారుగా పాడేస్తోంది. మీరన్నట్లు ‘స్పైడర్’ టైటిల్ కాబట్టి, ఈ సినిమాకి చాలా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నారు. పిల్లలు చదువుకోకపోయినా ఏమీ అనరని, మీరు ఫ్రెండ్లీ డాడ్ అని, ఆ మధ్య నమ్రతగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్నారు... కరెక్టే. నాకు దొరికేదే తక్కువ టైమ్. ఆ టైమ్‌లో ఏం చదువుతున్నారు? అంటూ పుస్తకాలన్నీ తిరగేస్తే ఇక పిల్లలతో నేనెప్పుడు ఆడుకోవాలి? అందుకే ఫ్రీ టైమ్ మొత్తం వాళ్లతో ఆడుకుంటా. చదువు గురించి పట్టించుకోవడానికి ఎలాగూ నమ్రత ఉంది కదా. తను మంచి హోమ్ మేకర్. షూటింగ్ వల్ల నాకు ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. పిల్లలే నా ‘స్ట్రెస్ బస్టర్స్’. పిల్లలతో ఎలాంటి ఆటలు ఆడుకుంటారు? ఇన్డోర్ అంటే వీడియో గేమ్స్ ఆడతాం. టీవీలో వచ్చే కార్టూన్ షోస్ చూస్తారు. వాళ్లతో పాటు నేనూ చూస్తుంటా. అందరికీ చిన్నప్పటి ఫేవరెట్ షోస్ అంటే అవే కదా. అప్పట్లో నేను, ఇప్పుడు నా పిల్లలు చూస్తున్నారు. ఫారిన్ ట్రిప్స్ వెళ్లినప్పుడు సైక్లింగ్, స్విమ్మింగ్.. ఇలా ఏది అనిపిస్తే అది. అక్కడ ఫేవరెట్ రెస్టారెంట్స్‌కి వెళ్లి ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. ‘స్పైడర్’ రిలీజ్‌కి ముందే ‘భరత్ అనే నేను’ స్టార్ట్ చేసేశారు. జనరల్‌గా రిలీజ్ తర్వాత ఫ్యామిలీతో హాలిడే ట్రిప్ వెళతారు కదా.. ఒక సినిమా ఫినిషింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇంకో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం నాకే కొత్తగా ఉంది. ఈ మధ్యకాలంలో ఇలా చేయలేదు. ‘స్పైడర్’ క్లైమాక్స్‌ని చెన్నైలో రాత్రి పూర్తి చేసి, మర్నాడు ఉదయం హైదరాబాద్‌లో ‘భరత్ అనే నేను’ స్టార్ట్ చేశా. ఇంత బిజీగా పని చేయడం బాగానే ఉంది. స్ట్రెస్ పోవడానికి ఎలాగూ నా ‘స్ట్రెస్ బస్టర్స్’ ఉన్నారు కదా. ఒక లాంగ్వేజ్‌లో తీసిన సీన్‌ని వెంటనే మరో లాంగ్వేజ్‌లో తీయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుందేమో? చాలా కష్టమనిపించింది! ఫర్ ఎగ్జాంపుల్.. తెలుగులో ఒకే టేక్‌లో ఓకే అయిన సీన్ తమిళంలోకి వచ్చేసరికి ఐదారు టేక్స్ అయ్యేది. అలా ఎందుకంటే తెలుగు, తమిళ్‌కి డైలాగ్స్ మారతాయి. మ్యాడులేషన్ మారుతుంది. ఆర్టిస్టులూ మారతారు. రెండు సినిమాలకు చేసినంత పని అన్నమాట. ఒక్కోసారి మైండ్ బ్లాంక్ అయిపోయేది. కానీ, మురుగదాస్‌గారు తన ఎనర్జీతో అందర్నీ ముందుకు నడిపించారు. అలా టీమ్ మొత్తాన్ని ఉత్సాహంగా ఉంచడం కేవలం గొప్ప దర్శకుల వల్లే సాధ్యమవుతుంది. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్‌తో సినిమా చేయాలనే మీ కోరిక తీరింది. మీతో సినిమా చేయాలనే రకుల్ కలను కూడా ఈ సినిమా నెరవేర్చింది? (నవ్వేస్తూ). వేరే హీరోయిన్ అయితే బైలింగ్వల్ను రకుల్లా హ్యాండిల్ చేసేది కాదేమో అనిపించింది. అంత హార్డ్‌వర్క్ చేసింది. రకుల్ తమిళ్‌ని కూడా ఈజీగా అడాప్ట్ చేసేసుకుంది. ఎప్పుడు డేట్స్ అడిగినా కాదనుకుండా ఇచ్చింది. ఆ అమ్మాయికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇక, నా విషయానికొస్తే.. చిన్నప్పుడు నేను ‘దళపతి, రోజా’ చూసినప్పుడు సంతోష్ శివన్‌గారితో ఎలాగైనా పని చేయాలని కోరుకునేవాణ్ణి. చాలాసార్లు ట్రై చేశా. ఈ సినిమాతో కుదిరింది. వెరీ వెరీ హ్యాపీ. టిక్కెట్ రేటుకి రెండింతలు ఎంటర్టైన్మెంట్ ఇస్తే, ఆడియన్స్ దిల్ ఖుష్ అవుతుంది. ‘స్పైడర్’ అలానే ఉంటుందా? యస్.. మీరు (ప్రేక్షకులు) కొన్న టిక్కెట్ డబ్బుల కన్నా ఎక్కువ వేల్యూ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అంత స్ట్రాంగ్ కంటెంట్. అలాగే, యాక్షన్ ఎపిసోడ్స్ ఇన్ ద ‘స్పైడర్’ విల్బి థ్రిల్లింగ్! కథతో పాటే యాక్షన్ ఉంటుంది. అలా ఉంటేనే థ్రిల్ ఉంటుందని, అప్పుడే క్లిక్ అవుతుందని నా ఫీలింగ్. ‘స్పైడర్’ అనేది ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్. ఫైనల్లీ... ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు? కొరటాల శివతో ‘భరత్ అనే నేను’ చేస్తున్నా. నెక్ట్స్ వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నా. నాకు కథ నచ్చితే చాలు.. వరుసగా సినిమాలు ఒప్పేసుకుంటా. చెన్నైలో ఆడియో ఫంక్షన్లో ‘ఈ జన్మకు తెలుగు ఫ్యాన్స్ చాలు’ అని, హైదరాబాద్‌లో జరిగిన ఫంక్షన్లోనూ ఎమోషనల్‌గా మాట్లాడారు.. నేనెవరితో మాట్లాడాలన్నా అప్పటికప్పుడు నాకేం అనిపిస్తే అది మాట్లాడేస్తాను. ముందే ప్రిపేర్ అయి మాట్లాడే అలవాటు లేదు. ఆ రెండు ఫంక్షన్స్‌లో నేను మాట్లాడిన స్పీచ్ రెడీమేడ్ కాదు. ఆ వేదిక మీద హార్ట్‌లో ఏది ఉందో అది బయటకు వచ్చేసింది. యస్.. ‘ఇట్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్’. ఈ సినిమాలో రిస్కీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయట.. ముఖ్యంగా ఓ యాక్షన్ సీక్వెన్స్‌కి చాలా కష్టపడ్డారట? రెండువేల మంది జూనిమర్ ఆర్టిస్టులు, మేం ఇంపార్టెంట్ ఆర్టిస్టులం పాల్గొనగా ఓ యాక్షన్ ఎపిసోడ్ తీశాం. పీటర్ హెయిన్ ఆ ఫైట్‌ని డిజైన్ చేశారు. ఏ మాత్రం పొరపాటు జరిగినా ఎవరో ఒకరికి దెబ్బలు తగలడం ఖాయం. జూనియర్ ఆర్టిస్టుల్లో చాలామంది లేడీస్ ఉన్నారు. వాళ్లెలా చేస్తున్నారా? అనిపించేది. హ్యాట్సాఫ్ టు దెమ్. మహేశ్... వెరీ కూల్ - దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మహశ్బాబుతో సినిమా చేయాలని ఎప్పుడో అనుకున్నారు. అప్పుడే ఆయన కోసం స్టోరీ అనుకున్నారా? ‘తుపాకీ’ కథ మహేశ్ కోసం అనుకున్నదే. కుదరలేదు. రెండేళ్ల క్రితం ‘స్పైడర్’ స్టోరీ లైన్ అనుకున్నాను. కథ నచ్చి, మహేశ్‌తో ఎంతో నమ్మకంతో చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టాననుకుంటున్నా. హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది? కూల్‌గా, సీరియస్‌గా ఉంటాడు. అందరూ సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తి. మనకు తెలియని వ్యక్తులు కూడా హ్యాపీగా ఉండాలనుకుంటాడు. ఇతరుల ఆనందం కోసం ఏమేనా చేసే టైప్. నిజజీవితంలో ఇలాంటి క్యారెక్టర్స్‌ని మీరు చూశారా? ఒకటీ రెండు రూపాయలకే వైద్యం చేసి, ఆనందపడే డాక్టర్లను చూశాను. సామాజిక సేవతో సంతృప్తి పొందేవాళ్లను చూశా. వాళ్లల్లో ఉన్న మానవత్వం నాకు నచ్చింది. ఈ స్టోరీ రాయడానికి అదో రీజన్. ఈ సినిమా ద్వారా మీరివ్వబోయే సందేశం ‘మానవత్వం’ అయ్యుంటుందనుకోవచ్చా? అవును. ఇప్పుడంతా వేగం. ఇన్స్టంట్ కాఫీ, టూ మినిట్స్‌లో వండే న్యూడుల్స్. రెడీమేడ్ మసాలాలు. చివరికి దేవుణ్ణి కూడా వేగంగానే ప్రార్థిస్తున్నారు. రోడ్డు మీద వెళుతూ బయట నుంచే దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. పక్కవాళ్ల గురించి పట్టించుకునే తీరిక కూడా ఉండడం లేదు. ఏ విషయంలో అయినా వేగంగా ఉండొచ్చు కానీ, అమ్మానాన్న, స్నేహితులు, బంధువులను ప్రేమించలేనంత తీరిక లేకుండా ఉండకూడదు. రాను రాను మానవత్వం అనేది తగ్గిపోతోంది. ఫాస్ట్ యుగంలో ఫాస్ట్‌గా దూసుకెళ్లాలి కానీ, మానవత్వాన్ని మరచిపోవద్దని చెబుతున్నాం. చాలా టేక్స్ తీసుకున్న సీన్ ఏది? ఒక ఐజీ ఆఫీసులో మహేశ్, మరో నటుడి కాంబినేషన్లో సీన్ తీశాం. అది త్వరగా కంప్లీట్ అవుతుందనుకున్నా. కానీ, ఆ ఆర్టిస్ట్ సరిగ్గా డైలాగ్ చెప్పకపోవడంతో ఆ ఒక్క సీన్‌కి సగం రోజు పట్టింది. అయినా మహేశ్‌బాబు చాలా ఓపికగా చేశారు. షూటింగ్ డేస్ ఎక్కువ కావడంతో మహేశ్ కొంచెం చిరాకుపడ్డారనే టాక్ వినిపించింది? అవేవీ నిజం కాదు. ఇంకో రెండు రోజులు షూటింగ్ ఉందని ఇప్పటికిప్పుడు చెప్పినా, ‘ఓకే’ అంటారు. టేక్స్ మీద టేక్స్ తీసుకున్న ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లను కోప్పడితే భయపడతారని మహేశ్ కూల్‌గా ఉండేవారు. ఆయన ఓపిక చూసి, ఆశ్చర్యం అనిపించింది. మహేశ్‌లాంటి హీరోతో సినిమా చేయడం నాకో మంచి ఎక్స్పీరియన్స్. నాలుగైదు నెలల్లో సినిమా తీసేద్దామనుకున్నాం. కానీ, మరో నాలుగు నెలలైంది. ఆల్మోస్ట్ రెండు సినిమాలు తీసినట్లయింది. అందరూ పారితోషికం గురించి ఆలోచించకుండా ఈ సినిమా చేయడం ద్వారా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లొచ్చు అనే ప్రేమతో చేశారు. - డి.జి. భవాని -
గాల్లో కన్నై గస్తీ కాసే గూఢచారి!
విధ్వంసం సృష్టించడానికి శత్రువులు స్కెచ్ వేశారు. కానీ, ఎగ్జిక్యూట్ చేసే లోపే ఆ స్కెచ్‌ని ఒక స్పై (గూఢచారి) కనిపెట్టి, ప్లాన్‌ని విఫలం చేస్తాడు. ఈసారి శత్రువులు మరొకటి ప్లాన్ చేయాలనుకున్నారు. ఈసారి వాళ్లే విఫలమైపోతారు. ఇప్పుడు అర్థమైంది కదా... ఈ స్పై ఎలాంటోడో... గాల్లో కన్నై గస్తీ కాస్తాడు. జరిగిన తప్పును, వచ్చే ముప్పును చేధిస్తాడు. అచ్చు ఇలాంటి స్పై రోల్లోనే మహేశ్‌బాబు హీరోగా ఏ.ఆర్. మురగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘స్పైడర్’ చిత్రం రూపొందింది. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. హ్యారీశ్ జయరాజ్ స్వరకర్త. ఈ చిత్రంలో ‘బూమ్.. బూమ్...’ పాటను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పాటలో ‘గాల్లో కన్నై గస్తీ కాస్తాడు...’ అంటూ హీరో రోల్ ఎంత పవర్ఫుల్లో చెప్పారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీఆర్ సినిమా, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను ఈ 15న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరపనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. -
బాసూ... దాసూ... ఇది నిజమేనా?
బాసు అండ్ దాసు కలసి సినిమా చేస్తున్నారటగా!?... హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ అండ్ చెన్నై కోడంబాక్కమ్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. అసలు ఈ ఇద్దరూ కలసి సినిమా చేస్తే, రిజల్ట్ ఎలా ఉంటుంది? ఇంకోసారి ఇండియన్ బాక్సాఫీస్ షేకవడం ఖాయమేనంటూ కొందరు లెక్కలు కూడా వేస్తున్నారు. ఎందుకంటే... ఇద్దరికీ దేశవ్యాప్తంగా మంచి క్రేజ్, మార్కెట్ ఉన్నాయి. ఇంతకీ, ఇక్కడ బాసు అంటే ఎవరో తెలుసా? ‘బాహుబలి’తో ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలను తిరగరాసిన ప్రభాస్. దాసు అంటే... కమర్షియల్ సిన్మాలకు కంటెంట్ కమ్ మెసేజ్‌తో కొత్త లెక్కలు చెబుతున్న తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్. వీళ్లిద్దరూ సినిమా చేయనున్నారనేది తాజా ఖబర్. ఈ సినిమా 2019లో సెట్స్‌పైకి వెళ్తుందట! ఆల్రెడీ ప్రభాస్, మురుగదాస్‌లు ఓసారి కలసి సినిమా గురించి డిస్కస్ చేశారట. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ చేస్తున్నారు. దీని తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. ఈ నెల 27న విడుదలవుతోన్న ‘స్పైడర్’ తర్వాత తమిళంలో విజయ్ హీరోగా సినిమా చేయనున్నారు మురుగదాస్. ఆ తర్వాతే ఇద్దరి కలయికలో సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈలోపు కథాకమామీషు కరెక్టుగా సెట్ కావాలి. ఈ వార్త నిజమో? కాదో? బాసు అండ్ దాసులే చెప్పాలి!! -
మహేశ్‌ని ఎవరితోనూ పోల్చలేను..ఎందుకంటే?
- మురుగదాస్ ‘‘హీరో మందు తాగి ఫ్రెండ్స్‌తో సరదాగా అమ్మాయిలను ఏడిపిస్తే... సినిమాలో కామెడీగా ఉండొచ్చు. కానీ, రియల్ లైఫ్‌లో అలా చేస్తే ట్రాజెడీగా ఉంటుంది. విలన్ అలాంటి పనులు చేస్తే నెగిటివ్ షేడ్స్ అంటారు. మరి, హీరో చేస్తే ఓకేనా? అందుకే నా సినిమాల్లో అలాంటి సీన్స్ అవాయిడ్ చేస్తున్నా. పెద్ద హీరోలకు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే... కోట్లాదిమంది వాళ్లను గుడ్డిగా అనుసరిస్తున్నారు. అమ్మను ప్రేమించాలి, మహిళలను గౌరవించాలి... వంటి అంశాలను సినిమాల్లో చూపిస్తే ప్రేక్షకులు ప్రభావితమవుతారు. క్రియేటర్లుగా దర్శకులు, హీరోలు బాధ్యతగా నడుచుకోవాలి’’ అన్నారు ఏఆర్ మురుగదాస్. మహేశ్‌బాబు హీరోగా ఆయన దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘స్పైడర్’. ఈ సినిమా, మహేశ్ గురించి మురుగదాస్‌తో ఇంటర్వ్యూ.. ∙‘స్టాలిన్’ తర్వాత పదేళ్లకు తెలుగులో మీరు చేస్తున్న మూవీ ‘స్పైడర్’... ‘స్టాలిన్’ టైమ్‌లో పరుచూరి వెంకటేశ్వరరావుగారు నన్ను మహేశ్‌కు పరిచయం చేశారు. అప్పటికే మహేశ్ ‘ఒక్కడు’ చూశా. సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశారు. ఆయన్ను కలసినప్పుడు మీతో సినిమా చేయాలనుందన్నా. సరే అన్నారు. ఇప్పుటికి కుదిరింది. తెలుగులో సూపర్‌స్టార్ అయిన మహేశ్‌ను తమిళ్‌కు పరిచయం చేస్తున్నాననే ఒత్తిడేమైనా? డబ్బింగ్ సినిమాలు, ఇంటర్నెట్ వల్ల మహేశ్ తమిళ ప్రేక్షకులకూ తెలుసు. తమిళంలో మహేశ్‌కు ఇది మొదటి సినిమా కాబట్టి క్యారెక్టర్ బ్యాలెన్సింగ్‌గా ఉండాలనుకున్నా. తెలుగు, తమిళ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని మోడ్రన్ స్క్రిప్ట్ రెడీ చేశా. అలాగే, మహేశ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆశించే హీరోయిజమ్, కమర్షియల్ అంశాలతో స్క్రిప్ట్ రాశా. తమిళంలో మహేశే డబ్బింగ్ చెప్పారు. టీజర్లో డబ్బింగ్ బాగుందంటూ మెసేజ్‌లొస్తున్నాయి. ‘సినిమాకు కథే కావాలి. సందేశాలు అవసరం లేదు’ అని ఓ స్టేట్మెంట్ ఇచ్చారు! కానీ, మీ సిన్మాల్లో ఏదొక సందేశం ఉంటుంది కదా! ఈ ‘స్పైడర్’లోనూ మెసేజ్ ఉందా? ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్... ఎక్కడ చూసినా సందేశాలే. ప్రతి రోజూ ఎవరొకరు ఎక్కడొక చోట సందేశం ఇస్తున్నారు. నేను కూడా మెసేజ్ అంటే ప్రేక్షకులంతా ‘ఇంకో సందేశమా?’ అనుకుంటారు. మనం మెసేజ్ ఇవ్వకున్నా ఫర్వాలేదు. కానీ, డ్రింకింగ్, స్మోకింగ్ వంటి చెడు సందేశాలను పంపకూడదు. మహేశ్‌లాంటి స్టార్ స్క్రీన్‌పై సిగరెట్ తాగితే ఆయన్ను గుడ్డిగా ఫాలో అయ్యే వీరాభిమానులు టెమ్ట్ అవుతారు. అందుకే, నేను అలాంటివి అవాయిడ్ చేస్తున్నా. ‘స్పైడర్’లో మానవత్వం గురించి చెప్పా. ఈ రోజుల్లో ప్రజలంతా త్వరగా ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను హీరోని చేసి, సడన్‌గా జోకర్‌ను చేస్తారు. అన్నా హజారేను హీరో చేస్తారు. ఆ తర్వాత ఆయన సభలో జనాలు కనిపించరు. ఎంత త్వరగా ఇష్టపడుతున్నారో అంతే త్వరగా అయిష్టం పెంచుకుంటున్నారు. మానవత్వం లేనిచోట, ఇతరుల్ని ప్రేమించలేని పరిస్థితుల్లో తీవ్రవాదం, అవినీతి పెరుగుతాయి ఇందులో అలాంటి మెసేజ్ ఇచ్చా. సినిమాను ఆలస్యంగా తీసినట్టున్నారు? బైలింగ్వల్ అంటే... ‘వన్ మోర్ టేక్’ చేయడమే అనుకున్నా. తెలుగులో ఓ సీన్ తీశాక, వెంటనే తమిళ సీన్ పూర్తవుతుందనుకున్నా. కానీ, స్టార్ట్ చేశాక ‘వన్ మోర్ టేక్’ కాకుండా ‘వన్ మోర్ ఫిల్మ్’ అయ్యింది. డైలాగులు ఉన్నా లేకున్నా ప్రతి ఫ్రేమ్, షాట్‌ను రెండు భాషల్లో తీశాం. దాంతో ఆలస్యమైంది. ∙లేటవుతోంటే మహేశ్ ఏం అనలేదా? ఒక్క మాట కూడా అనలేదు. ‘మీరు 5 సీన్లు తీసేసి, మరో 5 సీన్లు కలుపుదామంటే రెడీ. డేట్స్ ఇస్తా. ఈ షూటింగ్ పూర్తయితేనే నెక్ట్స్ సిన్మాకు వెళ్తా’ అనేవారు. సూపర్‌స్టార్స్ అందరితో వర్క్ చేశా. మహేశ్‌ను ఎవరితోనూ పోల్చలేను. దర్శకులందరూ మహేశ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలనేది నా కోరిక. నేనింతవరకు ఆయనలాంటి హీరోను చూడలేదు. మహేశ్ దర్శకుల నటుడు. స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే గురించి చెప్పాక నా వర్క్‌లో ఇన్వాల్వ్ కాలేదు. ఇండియాలో మిగతా హీరోలెవరూ ఇంత కోపరేట్ చేస్తారనుకోవడం లేదు. మహేశ్ లేకుండా మరో హీరోతో ‘స్పైడర్’ను ఊహించుకోలేను. ఈ సిన్మా వస్తుందని కూడా అనుకోలేను. మరి, నిర్మాతలు ఏమనేవారు? ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు... డబ్బులు పెట్టడం మాత్రమే కాకుండా సినిమాను ప్రేమించే నిర్మాతలు. నాకు మధుగారు 12 ఏళ్లుగా తెలుసు. ఓసారి మహేశ్‌గారు ‘మధు, ‘తిరుపతి’ ప్రసాద్ (ఎన్వీ ప్రసాద్) అయితే మీకు హ్యాపీనా?’ అనడిగారు. ‘నాకు వాళ్లు ఎన్నో ఏళ్లుగా తెలుసు. నో ప్రాబ్లమ్’ అన్నా. ముందు అనుకున్న దానికంటే సినిమా గ్రాండ్‌నెస్ పెరిగింది. క్లైమాక్స్‌తో పాటు కొన్ని సీన్లు బెటర్‌గా చేశా. నిర్మాతలు ఫుల్ సపోర్ట్ చేశారు. తెలుగు లిరిక్స్ విషయంలో ఎంతో హెల్ప్ చేశారు. ష్... భయపెట్టడం మాకూ తెలుసు! గ్లింప్స్ ఆఫ్ స్పైడర్: మే 31న (కృష్ణ బర్త్‌డే సందర్భంగా) విడుదల చేశారు. ∙సుమారు కోటిన్నరకు పైగా (యూట్యూబ్‌లో) చూశారు. హైలైట్: సింగిల్ డైలాగ్ లేదు. సినిమా థీమ్‌ను పరిచయం చేసేలా ఓ ఎలక్ట్రానిక్ స్పైడర్‌ను చూపించారు. మహేశ్ ‘ష్...’ అనడం నచ్చింది. స్పైడర్ ఫస్ట్ సింగిల్–‘బూమ్ బూమ్’: ఆగస్టు 2న విడుదల చేశారు. తెలుగు–తమిళ భాషల్లో కలిపి సుమారు 50 లక్షలమంది చూశారు. ∙హైలైట్: హ్యారీస్ జయరాజ్ స్వరపరిచిన పెప్పీ అండ్ మోడ్రన్ ట్యూన్, ‘స్పై..’ అంటూ సాగే లిరిక్స్ జనాలకు నచ్చాయి. ముఖ్యంగా మహేశ్ కుమార్తె సితార ఈ పాట పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. స్పైడర్ టీజర్: ఆగస్టు 8న విడుదల చేశారు. ∙తెలుగులో 80 లక్షలు, తమిళంలో సుమారు 30 లక్షలకు పైగా (యూట్యూబ్‌లో) చూశారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్... డిజిటల్ ఫ్లాట్ఫార్మ్స్తో కలుపుకుంటే 15 మిలియన్ (కోటిన్నర) వ్యూస్ వచ్చాయి. హైలైట్: ‘పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేసేందుకు గవర్నమెంట్, భూకంపం, సునామి, నేనూ ఒక భాగమే’ అని డైలాగ్ చెబుతున్న ముసుగు విలన్‌ను పరిచయం చేశారు. అతడికి కౌంటర్‌గా ‘నీలాంటి వాడు ఉన్న ఒక ఊరిలోనే ఇలాంటోడు ఒకడుంటాడు’ అని మహేశ్‌ను గూఢచారిగా పరిచయం చేశారు. ‘భయపెట్టడం మాకూ తెలుసు’ అని మహేశ్ చెప్పిన డైలాగ్, స్టైలిష్ మేకింగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. ‘‘తెలుగు, తమిళ భాషల్లో తీసిన ‘స్పైడర్’ను మలయాళంలో, అరబిక్‌లో అనువదిస్తున్నాం. సెప్టెంబర్ 27నే గల్ఫ్ కంట్రీస్‌లో అరబిక్ భాషలో, కేరళలో మలయాళంలో విడుదలవుతుంది’’ -
అవునా... ఇది నిజమేనా?
...ఇప్పుడు తెలుగు, తమిళ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో గాసిప్పురాయుళ్లు ఓ వార్త చెప్పుకుని ఇలానే అనుకుంటున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందన్నది ఆ వార్త సారాంశం. ఈ వార్తలో వాస్తవం ఎంత ఉందనేది నిలకడగా తెలుస్తుంది. కానీ, ఈ వార్త నిజం అనడానికి కొంతమంది కొన్ని నిదర్శనాలు చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య చిరంజీవి ‘స్పైడర్’ సెట్‌కి వెళ్లడమే. మహేశ్‌బాబు హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడనే విషయం తెలిసిందే. మురుగదాస్‌ని కలవడానికే చిరు వెళ్లారన్నది కొందరి ఊహ. చిరు వెళ్లడం వెనక ఆంతర్యం ఏదైనా.. కుమారుడు రామ్‌చరణ్ సినిమా కోసమే అన్నది బలమైన ఊహ. 2006లో ‘స్టాలిన్’ తీయకముందు నుంచే చిరంజీవితో మురుగదాస్‌కు అనుబంధం ఉంది. తమిళంలో మురుగదాస్ తీసిన ‘రమణ’ చిత్రం తెలుగు రీమేక్ ‘ఠాగూర్’లో చిరంజీవి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అప్పుడు చిరంజీవి–మురుగదాస్ కలిశారు. ఇటీవల మురుగదాస్ ‘కత్తి’ని ‘ఖైదీ నంబర్ 150’గా చిరు చేసిన విషయం తెలిసిందే. సో.. తనయుడు రామ్‌చరణ్ కూడా మురుగదాస్ డైరెక్షన్లో చేసే ఛాన్స్ లేకపోలేదు. -
మరో తెలుగు హీరోతో మురుగదాస్..?
ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమాను తెరకెక్కిస్తున్న మురుగదాస్, త్వరలో మరో టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో సినిమా ప్లాన్ చేస్తున్న కోలీవుడ్ బడానిర్మాతలు. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. ఈ కాంబినేషన్‌పై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు చేస్తున్న రామ్ చరణ్, మురుగదాస్ దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్టైనర్ చేసేందుకు ఓకె చెప్తాడని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేలా ఉంది. స్పైడర్ పూర్తయిన తరువాత కోలీవుడ్ టాప్ హీరో విజయ్‌తో సినిమా చేయనున్నాడు మురుగదాస్. ఆ సినిమా పూర్తయితే గాని రామ్ చరణ్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఈ క్రేజీ కాంబినేషన్‌ను రోబో సీక్వల్‌ను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ నిర్మించేందుకు ప్రయత్నిస్తుంది. -
స్పై సెప్టెంబర్!
వెయిటింగ్... వెయిటింగ్... మహేశ్‌బాబు అభిమానులు ఎప్పట్నుంచో ‘స్పైడర్’ను ఎప్పుడు విడుదల చేస్తారోనని వెయిట్ చేస్తున్నారు. వాళ్ల వెయిటింగ్‌కి తగ్గట్టు మహేశ్ బర్త్‌డే (ఆగస్టు 9) కానుకగా ఆగస్టు సెకండ్ వీక్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారనే వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. కట్ చేస్తే... అభిమానులకు చిన్న షాక్! చిత్రనిర్మాతలు ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు ‘స్పైడర్’ను సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. కారణం ఏంటంటే... ప్రస్తుతం చెన్నైలో క్లైమాక్స్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీతో క్లైమాక్స్ షెడ్యూల్ ముగుస్తుంది. తర్వాత బ్యాలెన్స్ రెండు సాంగ్స్ షూట్ చేయడం కోసం ఫారిన్ వెళతారు. షూటింగ్ ఫాస్ట్‌గా పూర్తయినా... పోస్ట్ ప్రొడక్షన్ అండ్ గ్రాఫిక్ వర్క్స్‌కి ఎక్కువ టైమ్ కావాలని దర్శకుడు ఏఆర్ మురుగుదాస్ అడిగారట! అదీ మేటర్. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ స్వరకర్త. -
విజయ్‌కు అంత సీన్ లేదా?
ఇలయదళపతి విజయ్ను వసూళ్లరాజా అని కూడా అంటారు. ఆయన నటించిన చిత్రాలు సక్సెస్ టార్గెట్‌ను చేరుకోకపోయినా వ్యాపారపరంగా నిర్మాతలకు గానీ, బయ్యర్లకు గానీ చేతులు కాలవనే అంటారు. కాగా విజయ్ ప్రస్తుతం తన 61వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌అగర్వాల్, సమంత, నిత్యామీనన్ నాయికలుగా నటిస్తున్నారు. ఆ చిత్ర శాటిలైట్ హక్కులే సుమారు రూ.11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తాజా సమాచారం. కాగా ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విజయ్ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. వీరి కాంబినేషన్లో ఇప్పటికే తుపాకి, కత్తి వంటి సూపర్‌హిట్ చిత్రాలు వచ్చాయి. కాగా విజయ్, ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తాజా చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ సంస్థ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 2.ఓ చిత్రం, ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా తాజాగా విజయ్‌తో నిర్మించనున్న చిత్రం నుంచి డ్రాప్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్.మురుగాదాస్ రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించడానికి ప్లాన్ చేశారట. రూ.100 కోట్ల బడ్జెట్ అంటే విజయ్ ప్రస్తుత బిజినెస్‌కు రెండింతలు వ్యాపారం జరగాలని, అది సాధ్యం కాదని భావించడంతోనే లైకా సంస్థ ఈ చిత్ర నిర్మాణం నుంచి తప్పుకున్నట్లు కోలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారం. -
సంగీత మాంత్రికుడి శుభాకాంక్షలు
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం కొనసాగుతోందని చెప్పవచ్చు. ఒకరిపై ఒకరు రాగధ్వేషాలు పెంచుకోకుండా స్నేహహస్తాన్నే అందిస్తున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి ఉండదనుకుంటా. ముఖ్యంగా కొత్తవారిని ప్రోత్సహించే సుహృద్భావన వాతావరణం ఇక్కడ కొనసాగుతోందనే అనాలి. ఇందుకు చిన్న ఉదాహరణ ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్. రెహ్మాన్. నవ సంగీత దర్శకుడు రామ్‌గోపాల్ కృష్ణన్ పరిచయం అవుతున్న చిత్రం లాలీ లాలీ ఆరారో. సినీయర్ నటుడు చరణ్‌రాజ్ వారసుడు తేజ్‌రాజ్ కథానాయకుడుగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి లింకన్ రాజాళీ దర్శకుడు. ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైంది. కాగా, సంగీత దర్శకుడు రామ్‌గోపాల్ కృష్ణన్ సోమవారం సంగీత మాంత్రికుడు ఏఆర్. రెహ్మాన్‌ను కలిసి తన తొలి చిత్ర సంగీత ఆల్బం వినిపించారు. పాటలు విన్న ఏఆర్. రెహ్మాన్ చాలా బాగున్నాయంటూ రామ్‌గోపాల్ కృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తెలుపుతూ సంతోషంతో ఉప్పొంగిపోయారు. మరో విషయం ఏమిటంటే సంగీతజ్ఞాని ఇళయరాజా గురువు టీవీ. గోపాలకృష్ణన్ కుమారుడే రామ్‌గోపాల్ కృష్ణన్ అన్నది గమనార్హం. లాలీ లాలీ ఆరారో చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్ర ఆడియోను సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆవిష్కరించడం మరో విశేషం. -
ఫ్యాన్స్‌కి మహేష్ బర్త్ డే గిఫ్ట్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఏడాది తన పుట్టిన రోజు అభిమానులకు భారీ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాడు. మహేస్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను ముందుగా జూన్ 23న రిలీజ్ చేయాలని భావించారు. అయితే ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావేమో అన్న ఆలోచనతో చిత్రయూనిట్ సినిమా విడుదల వాయిదా వేశారు. ఇంత వరకు అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా.. మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ఆగస్టు 9న స్పైడర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ్లోనూ అదే రోజు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో ఎస్ జె సూర్య విలన్‌గా అలరించనున్నాడు. -
అభిమానులకు స్పైడర్ గిఫ్ట్
ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టినరోజు. అభిమానులకు ఆ రోజు పెద్ద పండగే. ఈ ఏడాది పండక్కి వాళ్లకు పెద్ద బహుమతి ఇవ్వడానికి మహేశ్ సిద్ధమవుతున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘స్పైడర్’. మొదట ఈ సినిమాను జూన్ 23న విడుదల చేయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు విడుదల తేదీ మారింది. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ‘స్పైడర్’ను విడుదల చేయాలని దర్శక–నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్న మాట. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణను వచ్చే నెల 2 నుంచి హైదరాబాద్‌లో జరపనున్నారు. మే నెలాఖరుకు చిత్రీకరణ అంతా పూర్తవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే... ఇటీవల విడుదల చేసిన మహేశ్ ఫస్ట్ లుక్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి సంగీతం: హ్యారీస్ జయరాజ్. -
క్లాస్.. మాస్... స్పైడరే
చూపుల్లో బుల్లెట్ కంటే పవరూ... యాటిట్యూడ్‌లో ఇతరులకు అంతు చిక్కని ఆలోచనలూ... ఈ రెండిటికీ మించి సూపర్ స్టైలూ... మహేశ్‌బాబు కొత్త లుక్ అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది. మహేశ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘స్పైడర్’ను టైటిల్‌గా ఖరారు చేశారు. బుధవారం టైటిల్‌తో పాటు సినిమాలో మహేశ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. గన్ పట్టుకోవడం, ఇన్‌షర్ట్ చేసుకోవడం మహేశ్‌కు కొత్త కాదు. కానీ, మాస్లో క్లాస్... క్లాస్‌లో మాస్.... మిక్స్ చేసిన ఈ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. మహేశ్ జేమ్స్ బాండ్లా ఉన్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీఆర్ సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. క్లైమాక్స్, రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. జూన్ 23న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు ఎస్.జె. సూర్య, తమిళ నటుడు భరత్ తదితరులు నటిసున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిన్ సుచక్, ఫైట్స్: పీటర్ హెయిన్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్, సంగీతం: హ్యారీస్ జయరాజ్. -
రెండు రోజుల్లో మహేష్ ఫస్ట్ లుక్
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఫస్ట్‌లుక్ త్వరలోనే వచ్చేస్తోంది. ఇప్పటికి చాలాసార్లు వాయిదాపడిన ఈ లుక్‌ను ఇక రెండు రోజుల్లో విడుదల చేస్తున్నట్లు సినిమా నిర్మాణ సంస్థ ఎన్వీఆర్ సినిమాస్ ట్వీట్ చేసింది. దాన్ని మురుగదాస్ కూడా నిర్ధారించారు. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు మహేష్ బాబు 23వ సినిమా ఫస్ట్ లుక్ వస్తోందని, ఆ విషయాన్ని అభిమానులందరూ తమ తమ క్యాలెండర్లలో మార్క్ చేసుకుని ఉంచాలని తెలిపింది. కౌంట్ డౌన్ మొదలైపోయిందని కూడా చెప్పింది. వెంటనే మురుగదాస్ కూడా ఆన్ ద వే అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంతవరకు అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు. దాంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. జూన్ 23న ఈ సినిమా రిలీజ్ అవుతుందని దర్శకుడు మురుగదాస్ ఇప్పటికే ప్రకటించాడు. ఉగాది సందర్భంగా తప్పుకుండా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో అభిమానులను శాంతింపచేయడానికి మహేష్ బాబు స్వయంగా కలగజేసుకున్నాడు. మురుగదాస్ మూవీపై తన సోషల్ మీడియా పేజ్ లో స్పందించిన మహేష్, అభిమానులు ఇంకాస్త ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశాడు. అయితే ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ మీద మాత్రం మహేష్ ఇంకా స్పందించలేదు. The Countdown Begins!Mark your Calendar!!Set your Time!!#Mahesh23 #ARM11 #FirstLook12Apr17@5pm @ARMurugadoss @urstrulyMahesh — NVR Cinema (@NVRCinema) 10 April 2017 On the way https://t.co/yvI192f67O — A.R.Murugadoss (@ARMurugadoss) 10 April 2017 -
స్పైడర్
స్పైడర్ అంటే.... సాలీడు. అది కట్టిన సాలెగూడులో ఎవరైనా పడాల్సిందే. ఈ హీరో కట్టిన స్పైడర్ వెబ్‌లో దొంగల్, దుర్మార్గుల్, రాస్కెల్, క్రిమినల్ అండ్ అదర్స్ ప...డ...క... మానుతారా! మహేశ్‌బాబు సినిమా కథ కోసం ‘స్పైడర్’ అన్న టైటిల్ రిజిస్టర్ అయ్యిందనీ, మా మాటే రైట్ అనీ... అందరూ బూజు దులుపుతున్నారు. బూజు దులుపుతున్నవాళ్లు కొత్త కథల గూళ్లను కూడా కడుతున్నారు. నిజానికి, ఈ రోజుల్లో కథకులు, దర్శకుల కంటే రెండు గూళ్లు ఎక్కువే చదివారు ప్రేక్షకులు. వాళ్లు చెప్పే కథ ప్రకారం... ‘స్పైడర్’లో మన హీరో మహేశ్ ఓ ‘స్పై’ అట. సూపర్‌స్టార్ ‘గూఢచారి 116’ తర్వాత ఇండస్ట్రీ రికార్డుల గూళ్లను బద్దలుగొట్టే ‘స్పై’ ఇతనేననీ, మఫ్టీలో తిరిగే మస్త్ భాయ్ అనీ టాక్. మఫ్టీలో క్రిమినల్స్‌నే కాదు... హీరోయిన్లను కూడా గిరికీలు తిప్పి తన హార్ట్ వెబ్‌లో తీసుకుంటాడట. రొమాన్స్ అదిరిందట! సెంటిమెంట్ చిక్కగా ఉందట! ఫైట్స్ బాండ్‌ను తలదన్నేలా ఉన్నాయట! సినిమా కథ నిజంగా ఏమై ఉంటుందో మాకు తెలీదు గానీ... కొత్తగా గూఢచర్యం చేస్తే ‘స్పైడర్’ గూడు చెదిరింది. సరదాగా చదువుకున్నోళ్లకు బోరింగ్ లైఫ్‌లో బూజు కొంచెం వదిలింది. ఏమంటారు...! ఇంతకు ముందు ఈ సినిమాకు ‘ఏజెంట్ శివ’, ‘సంభవామి’, ‘మర్మం’ ఇలా పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. చివరకు, హీరో మహేశ్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ‘ఠాగూర్’ మధులు ‘స్పైడర్’ను ఫిక్స్ చేశారట. ‘ఎన్వీఆర్ సినిమా’ సంస్థ ఫిల్మ్ చాంబర్లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించింది. త్వరలో ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేస్తారట! -
విజయ్ చిత్రానికి శింబు సంగీత బాణీలు
సంచలన నటుడు శింబు నటుడు అజిత్‌కు వీరాభిమాని అన్నది తెలిసిందే. ఒక స్టార్ హీరోగా ఉండి అజిత్ చిత్రాన్ని తొలిరోజు తొలి ఆటనే చూసేంత అభిమానం ఆయనది. ఈ మధ్య శింబు చిత్రం వాలు విడుదల సమయంలో సమస్యలను ఎదుర్కొనగా నటుడు విజయ్ కల్పించుకుని ఆ సమస్యను పరిష్కరించి వాలు చిత్ర విడుదలకు కారణం అయ్యారు. అప్పటి నుంచి విజయ్, శింబుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇక అజిత్‌పై అభిమానం తగ్గినట్టేనా అన్న ప్రశ్నకు విజయ్ తనకు అన్నయ్య లాంటివాడని అజిత్‌కి తానెప్పుడూ అభిమానినేనని బదులిచ్చారు శింబు. అలాంటి శింబు త్వరలో విజయ్‌తో చేతులు కలపడానికి సిద్ధం అవుతున్నారన్న ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 61వ చిత్రాన్ని చేస్తున్నారు. సమంత, కాజల్, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దళపతి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. విజయ్ తదుపరి ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి నటుడు శింబు సంగీతబాణీలు కట్టబోతున్నట్లు తాజాగా కోలీవుడ్ వర్గాల బోగట్టా. శింబులో ఒక్క నటుడే కాకుండా గీతరచయిత, గాయకుడు ఉన్నారు. తాజాగా సంతానం కథానాయకుడిగా నటిస్తున్న ఓడి ఓడి ఉళక్కునుమ్ చిత్రం ద్వారా సంగీతదర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం విడుదల కాకుండానే విజయ్ 62వ చిత్రానికి బాణీలు కట్టడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.అయితే ఇందులో వాస్తవమెంత అన్నది మరికొన్ని రోజులు ఆగితేగానీ తెలియదు. -
ఒక్క ఫైట్... మూడు కోట్లు!
మరో నాలుగు రోజులు మహేశ్‌బాబు నిద్రలేని రాత్రులు గడపనున్నారు. డే టైమ్‌లో మాత్రం నిద్రపోతారు. ఎందుకలా అనుకుంటున్నారా? మరేం లేదు. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన ఓ భారీ ఫైట్‌ను రాత్రిపూట చిత్రీకరించనున్నారు. దీనికోసం ఈ చిత్రబృందం వియత్నాం వెళ్లింది. అక్కడి హో చో మిన్, హనోయ్ నగరాల్లో నాలుగు రోజుల పాటు ఈ ఫైట్‌ను చిత్రీకరించనున్నారు. సినిమాలో ఉన్న ఫైట్స్ అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయట. ముఖ్యంగా ఈ ఫైట్‌కి భారీగా ఖర్చుపెడుతున్నారని సమాచారం. దాదాపు మూడు కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించే ఈ ఫైట్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుందట. వియత్నాం షెడ్యూల్‌తో క్లైమ్యాక్స్, రెండు పాటలు మినహా సినిమా పూర్తవుతుంది. బ్యాలెన్స్ చిత్రీకరణ వచ్చే నెల మొదటివారానికల్లా పూర్తయిపోతుందట. ఫస్ట్ లుక్‌ను ఆ తర్వాత విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలు. జూన్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
కోలీవుడ్‌కు రకుల్ రీఎంట్రీ
టీనగర్: కోలీవుడ్ చిత్రసీమకు నటి రకుల్ ప్రీత్‌సింగ్ రీ ఎంట్రీ కానున్నారు. 2014లో ఎన్నమో ఏదో చిత్రంలో నటించిన రకుల్ ప్రీత్‌సింగ్‌కు తమిళంలో అవకాశాలు లభించకపోవడంతో తెలుగు చిత్రరంగం వైపు మొగ్గు చూపారు. మూడేళ్లుగా కోలీవుడ్‌పై కన్నెత్తి చూడని రకుల్ తనకంటూ విభిన్న తరహా పాత్ర కోసం వేచి చూశారు. మంచి స్క్రిప్ట్, పేరున్న దర్శకుడు, పెద్ద నటుడితో చిత్రం వస్తేనే తమిళంలో రీ ఎంట్రీ అవుదామని ఎదురుచూశారు. కొన్ని నెలల క్రితం మిష్కిన్ దర్శకత్వంలో విశాల్ నటించే తుప్పరివాలన్ చిత్రంలో నటించేందుకు అవకాశం లభించింది. మొదట్లో నటించడానికి అంగీకారం తెలిపిన రకుల్ తర్వాత ఆ చిత్రం నుంచి వైదొలిగారు. అదే సమయంలో తమిళం, తెలుగులో కార్తి నటనలో రూపొందుతున్న ధీరన్ అ«ధికారం ఒన్రు చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ముందుగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న తమిళ, తెలుగు వెర్షన్లలో రూపొందే సంభవి చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న సెల్వరాఘవన్ దర్శకత్వంలోని కొత్త చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారు. మూడేళ్లుగా తమిళంలో అవకాశాలు రాకపోగా, ప్రస్తుతం ఒకే ఏడాదిలో మూడు చిత్రాలకు ఒప్పందం కుదరడంతో కోలీవుడ్ హీరోయిన్లను కలవరపెడుతోంది. -
ముంబయ్‌లో మహేశ్.. అదే లొకేషన్!
సండే హాలిడే! షూటింగులకూ సెలవే. స్నేహితులతో కలసి హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో మహేశ్‌బాబు ఇంటి దగ్గరకు వెళితే.. ఆయన్ను చూసే అవకాశం దక్కుతుందేమో అనుకుంటున్నారా? మహేశ్ హైదరాబాద్‌లో ఎక్కడున్నారండీ బాబూ! ఆయన ముంబయ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ షూటింగ్ ఎక్కడ చేస్తున్నారో తెలుసా? విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘తుపాకీ’ సినిమా గుర్తుందా? ఆ సిన్మాలో ఎక్కువ సీన్లు ముంబయ్‌లోనే తీశారు. ఇప్పుడు సరిగ్గా అక్కడే, అవే లొకేషన్లలో మహేశ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. అన్నట్టు... ఈ సినిమా ‘తుపాకీ’ సీక్వెల్ తరహాలో ఉంటుందని ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వార్తకు తగ్గట్టు ఇందులో మహేశ్‌బాబు ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు ముంబయ్‌లో భారీ ఎత్తున మహేశ్‌బాబు ఇంట్రడక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత పాటల చిత్రీకరణకు ఫారిన్ వెళతారట! (కెమేరామేన్ సంతోష్‌శివన్) -
అవకాశమొస్తే ఆయనతో చేస్తా!
ఆ కథానాయకుడితో నటించడానికి ఏ మాత్రం సందేహించను అంటున్నారు నటి సోనాక్షిసిన్హా. దక్షిణాది భామలు బాలీవుడ్ మోహంలో పడుతుంటే. అక్కడి బ్యూటీస్ దక్షిణాది చిత్రాలపై ఆసక్తి చూపుతుండడం విశేషం. నటి దీపికాపదుకునే, సోనాక్షి సిన్హా, ప్రియాంకాచోప్రా, కంగనారావత్ వంటి బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఇప్పటికే కోలీవుడ్ చిత్రాల్లో నటించారన్నది తెలిసిందే. వీరంతా మళ్లీ తమిళ చిత్రాల్లో నటించాలని ఆశపడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా వారసురాలైన సోనాక్షి సిన్హా సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా లింగా చిత్రంలో నటించారు. ఇక దీపికాపదుకోనే కోచ్చడైయాన్ చిత్రంలో సూపర్‌స్టార్‌తో రొమాన్స్ చేశారు. వీరిద్దరిని మళ్లీ మళ్లీ కోలీవుడ్ చిత్రాల్లో నటించాలని ఇక్కడి దర్శక నిర్మాతలు కోరుకుంటున్నారు. ఇప్పటికే సంఘమిత్ర అనే భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో జయంరవి, ఆర్యలకు జంటగా నటించజేయడానికి దర్శకుడు సుందర్.సీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నటి సోనాక్షిసిన్హాను ఇళయదళపతి విజయ్ సరసన నటింపజేసే ఆలోచనలో దర్శకుడు ఏఆర్.మురుగదాస్ ఉన్నట్లు తాజాసమచారం. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఆయన 61వ చిత్రం. దీని తరువాత ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇందులో సోనాక్షిసిన్హాను నాయకిగా ఎంపక చేసే పనిలో యూనిట్ వర్గాలు ఉన్నట్లు సమాచారం. దీని గురించి ఇటీవల చెన్నైకి వచ్చిన సోనాక్షిసిన్హాను అడగ్గా విజయ్‌కు జంటగా నటించడానికి తాను ఏ మాత్రం సంశయించను అన్నారు. అదీ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడం అంటే చాలా ఇష్టం అన్నారు. ఆయన దర్శకత్వంలో ఇప్పటికే హిందీలో అకిరా, హాలీడే చిత్రాల్లో నటించాను. తనను హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటింపజేసిన దర్శకుడాయన. ఇంకా చెప్పాలంటే తనకు తమిళ చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి చాలా ఉందన్నారు. తమిళంలో తింగా చిత్రంలో నటించానని, ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడం వల్ల తాను బాధ పడడం లేదని అన్నారు. కారణం అందులో కొందరు అద్భుత వ్యక్తులతో పని చేసే అవకాశం కలిగిందని అన్నారు. రజనీకాంత్‌తో నటించడం చాలా గొప్ప అనుభూతిగా పేర్కొన్నారు. రజనీకాంత్, ఏఆర్,.మురుగదాస్ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే వదులుకోనని అన్నారు. తాను విజయ్ నటించిన తుపాకీ, కత్తి చిత్రాలను చూశానన్నారు. విజయ్ ఉత్తమ నటుడని పొగడ్తల్లో ముంచెత్తారు.ఆయనతో నటించే అవకాశం వస్తే ఏ మాత్రం సందేహించకుండా అంగీకరిస్తానని సోనాక్షిసిన్హా పేర్కొన్నారు. -
అమీర్‌పేట్‌లో మహేశ్...
జనవరి చివరి వారంలో అభిమానులకు ఓ బహుమతి ఇవ్వడానికి మహేశ్‌బాబు సిద్ధమవుతున్నారు. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న తెలుగు, తమిళ సినిమా ఫస్ట్ లుక్‌ని ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ కూడా ప్రకటిస్తారని వినికిడి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో గల ఓ భవంతిలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. మహేశ్, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ముంబై, పూణెలలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఫిబ్రవరిలో పాటల చిత్రీకరణకు విదేశాలు వెళ్తారట! ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్య, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ విలన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సంభవామి’ టైటిల్ పరిశీలనలో ఉంది. దీంతో పాటు మరికొన్ని టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారు. చివరకి, ఏ టైటిల్ కన్ఫర్మ్ చేస్తారనేది నెలాఖరుకి తెలుస్తుంది. -
ఓ చిన్ని బ్రేక్
కుదిరితే ఓసారి... వీలైతే రెండు మూడుసార్లు... ప్రతి ఏడాది ఫ్యామిలీతో మహేశ్‌బాబు విహార యాత్రలకు వెళతారు. ఇప్పుడు కూడా ఆయన విదేశాల్లోనే ఉన్నారట. షూటింగ్‌కి చిన్ని బ్రేక్ చెప్పి, భార్యాపిల్లలు నమ్రతా శిరోద్కర్, గౌతమ్, సితారలతో పాటు బావ గల్లా జయదేవ్ తదితర కుటుంబ సభ్యులతో స్విట్జర్లాండ్‌లోని జురిచ్ నగరంలో క్రిస్మస్ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. కొత్త సంవత్సర వేడుకలనూ మహేశ్ ఫ్యామిలీ విదేశాల్లోనే జరుపుకోనున్నారని సమాచారం. ఈ సెలవులు పూర్తయిన తర్వాత జనవరి మొదటివారంలో మహేశ్‌బాబు హైదరాబాద్ రానున్నారట. ఆ తర్వాత ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేశ్ ఇంటిలిజెంట్ బ్యూరో ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ జరిపిన షూటింగ్‌తో 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 7న హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరిలో పాటల చిత్రీకరణకు విదేశాలు వెళ్లాలనుకుంటున్నారు. మధ్యలో ముంబయ్, పూణెలలోనూ కొన్ని రోజులు షూటింగ్ చేయనున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘సంభవామి’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. జనవరిలో టైటిల్ ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. -
కోలీవుడ్ హీరోకి మహేష్ లైఫ్ ఇస్తున్నాడా?
-
దుష్ట శిక్షణకుసంభవామి
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే – ‘‘సత్పురుషుల సంరక్షణకూ, దుష్టజన శిక్షణకూ, ధర్మ సంస్థాపన కోసం... ప్రతి యుగంలో నేను అవతరిస్తూనే ఉంటాను’’ అనేది ‘భగవద్గీత’లోని ఈ శ్లోకం తాత్పర్యం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే... మహేశ్‌బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘సంభవామి’ అనే టైటిల్ ఖరారు చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ అహ్మదాబాద్‌లో జరుగుతోంది. ఈ నెల 24 వరకూ మహేశ్, ఇతర నటీనటులపై సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ చిత్రానికి ‘ఏజెంట్ శివ’తో పాటు పలు టైటిల్స్ వినిపించాయి. అయితే.. ధర్మసంస్థాపన కోసం దుష్టులను శిక్షించే ఓ పోలీసాఫీసర్ కథతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘సంభవామి’ టైటిల్ పర్ఫెక్ట్గా ఉంటుందని చిత్ర బృందం భావించారట! రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను న్యూ ఇయర్ గిఫ్ట్‌గా డిసెంబర్ 31న విడుదల చేస్తారని టాక్. -
దేని దారి దానిదే!
మాంచి ఘుమఘుమలాడే భోజనం ముందుంటే... లొట్టలేసుకుంటూ తినేస్తారు తప్ప ఎవరూ చూస్తూ కూర్చోరు కదా! కానీ, హీరోయిన్ల పరిస్థితి ఇందుకు భిన్నమనే చెప్పాలి. ముందున్న ప్లేటులో ఫుడ్ నోరూరిస్తున్నా.. ఇది తింటే కొవ్వు పెరుగుతుందేమో? ఇందులో కేలరీలు ఎన్నున్నాయో? రేపు జిమ్‌లో ఎంతసేపు ఎక్స్ట్రా వర్కౌట్స్ చేయాలో? అని సవాలక్ష ప్రశ్నలతో తినడానికి భయపడతారు. కానీ, రకుల్‌ప్రీత్ సింగ్ అలాంటి భయాలేవీ పెట్టుకోకుండా గుజరాతీ ఫుడ్‌ను ఫుల్లుగా లాగించేశారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబుకు జోడీగా నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం రకుల్ అహ్మదాబాద్ వెళ్లారు. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేసిన వెంటనే... వ్యక్తిగత సహాయక బృందంతో కలసి దగ్గరలోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. సంప్రదాయ గుజరాతీ వంటకాలు బాగున్నాయని ఫుల్‌గా తినేశారు. మరి, వర్కౌట్స్ సంగతేంటి? ఆల్రెడీ జిమ్‌లో ఉన్నారా! ఏంటి? అనడిగితే... రకుల్ గట్టిగా నవ్వేశారు. ‘‘ఓ పక్క ఫుడ్ దారి ఫుడ్‌ది. మరోపక్క వర్కౌట్స్ దారి వర్కౌట్స్‌ది’’ అన్నారు. ఏం తిన్నా, ఎంత తిన్నా వెయిట్ పెరగని రకుల్ స్లిమ్ బ్యూటీ వెనుక సీక్రెట్ ఇదన్నమాట! -
అవకాయ సాంబార్
కొన్ని కొన్ని ‘అప్పడి నడక్కుమ్’! ‘మనకు కథ ఇంపార్టెంటప్పా... డెరైక్టర్ లాంగ్వేజ్ ఏదైతే ఏంటి?’ అనుకుంటారు పవన్ కల్యాణ్. అందుకే ఇప్పటికే ఎస్.జె. సూర్య, ధరణి, కరుణాకరన్, విష్ణువర్ధన్ వంటి తమిళ దర్శకులతో సినిమాలు చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆర్.టి. నేసన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. విశేషం ఏంటంటే.. వీళ్లల్లో సూర్య, ధరణి, నేసన్లు తమిళ హీరో విజయ్‌తో సినిమాలు చేసినవాళ్లే. అలాగే వీళ్ల సినిమాలను నిర్మించింది తెలుగు వారైన ఎ.యం.రత్నం. ఇప్పుడు నేసన్-పవన్ సినిమాకి నిర్మాత కూడా ఆయనే. కొన్ని కొన్ని అప్పడి నడక్కుమ్ (అలా జరిగిపోతాయ్). అంతే. ‘ఒరు కల్లుల.. రెండు మాంగా..’ మహేశ్‌బాబు చెన్నైలో చదువుకున్నారు. తమిళ్ బాగా వచ్చు. ఇప్పుడా యన ‘ఒరు కల్లుల.. రెండు మాంగా’ దక్కించుకున్నారు. అంటే.. ఒక్క రాయి (దెబ్బ)కి రెండు మామిడికాయలు అని అర్థం. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో ద్విభాషా చిత్రం చేస్తున్నారు. మహేశ్‌కి రెండో తమిళ దర్శకుడీయన. ఆల్రెడీ ఎస్.జె. సూర్యతో ‘నాని’ సినిమా చేశారు. తంబీ (తమ్ముడూ) ఇక్కడ విశేషం ఏంటంటే... మణిరత్నం, శంకర్, లింగుస్వామి వంటి పేరున్న దర్శకులు మహేశ్‌తో సినిమా తీయాలనుకున్నారు. అవేవీ ముడియల (కుదరలేదు). ఇప్పుడు మురుగదాస్‌తో ముడింజిచ్చు (కుదిరింది). మరి.. మిగతా తమిళ దర్శకులతో ‘ఎప్ప పణ్ణువారో?’ (ఎప్పుడు చేస్తారో). ఆ.. అన్నట్లు.. నితిన్ ‘ఇష్క్’, అక్కినేని కుటుంబంతో ‘మనం’ చిత్రాలు తీసిన మలయాళీ విక్రమ్ కె. కుమార్ చెప్పిన లైన్‌కి మహేశ్ ఓకే చెప్పారు. కానీ, ఆ చిత్రం సెట్స్‌కి వెళ్లడానికి ఇంకా బోలెడంత సమయం పట్టేట్లు కనిపిస్తోంది. మల్లు అర్జున్... కోలీ అర్జున్ ‘ఆగువారా’? మన తెలుగు అల్లు అర్జున్ మలయాళంలో ఎంత అభిమానం సంపాదించుకున్నారంటే అక్కడివాళ్లంతా ‘మల్లు’ అర్జున్ అంటారు. ఇప్పుడు తమిళ దర్శకుడు లింగుస్వామితో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు భాషలవాళ్లను మెప్పించిన బన్నీకి కోలీవుడ్ వాళ్లను ఆకట్టుకోవడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. త్వరలోనే... కోలీ అర్జున్ కూడా ఆగువారా? (అవుతారా?) వెయిట్ చేద్దాం. మనం బెస్టప్పా! ‘మనం’లో అఖిల్ ఎంట్రీ షార్ట్ అండ్ క్యూట్‌గా ఉంటుంది. జస్ట్ అలా చూపించి, ‘అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ డా’ అనిపించేశారు ఆ చిత్రదర్శకుడు విక్రమ్ కుమార్. శాంపిలే అదిరితే.. ఇక ఫుల్ లెంగ్త్‌లో చూపిస్తే.. ఏ రేంజ్లో ఉంటుందనుకున్నారేమో ‘అఖిల్’ తర్వాత హీరోగా తన రెండో సినిమాకి మలయాళీ విక్రమ్ కుమార్‌ని సెలక్ట్ చేసుకున్నారు. మనం బెస్టప్పా.. కలసి చేద్దాం అని మాట్లాడుకుని ఫిక్సయ్యారు. డిసెంబర్లో అఖిల్ పెళ్లి. ఆ వేడుక అయ్యాక రెండో సినిమా పట్టాలెక్కిస్తారని చెప్పొచ్చు. ‘యారుడా’ సందీప్ అంటారా? ‘యారుడా మహేశ్’ అనే సినిమాతో సందీప్ కిషన్ తమిళ తెరకు పరిచయమయ్యారు. ఆ ఒక్క సినిమాతో అక్కడ ఎంత పాపులార్టీ తెచ్చుకున్నారంటే ‘యారుడా సందీప్’ అని ఎవరూ అడగరు. యారుడా అంటే తమిళంలో ఎవర్రా అని అర్థం. ఇప్పుడు తమిళంలో అతను చేసిన ‘మాయవన్’, ‘మానగరమ్’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం తమిళ దర్శకుడు సుశీంద్రన్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలతో సందీప్ కెరీర్ తమిళంలో పీక్స్‌కి వెళుతుందా? చూద్దాం. ‘ఇప్ప’ బాహుబలి అసిస్టెంట్... తెలుగు, తమిళాల్లో తీస్తున్న ‘బాహుబలి’కి పళని అసిస్టెంట్ డెరైక్టర్. ఈ పక్కా తమిళ ‘పయ్య’ (కుర్రాడు) ‘ఇప్ప’(ఇప్పుడు) దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అదీ మన తెలుగు సినిమాతోనే. ‘వినవయ్యా రామయ్య’ ఫేమ్ నాగ అన్వేష్, ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ హెబ్బా పటేల్ జంటగా ‘ఏంజిల్’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు పళని. మొత్తానికి, ఇప్పుడు కృష్ణానగర్ మరో పాండీ బజార్లా మారింది. అవును... ఆవకాయ్ ఘాటుకు... సాంబార్ రుచి తగిలింది. సెట్స్‌లో... అరవ సందడి ‘రండి సార్.. రండి.. శ్రీదేవి ఇక్కడదా డ్రెస్సు ఎత్తింది... మీరు కూడా’... ఓ బట్టల దుకాణం ముందు అరుస్తున్నాడొకడు. మద్రాసు వెళ్లే తెలుగువాళ్లను ఎట్రాక్ట్ చేయడం కోసం షాపింగ్ సెంటర్స్‌లో ఒకప్పుడు జరిగిన తంతు ఇది. వచ్చీ రాని ఆ తమిళ - తెలుగుకు అర్థం... ‘అక్కడ బట్టలు కొంది’ అని. వచ్చీ రాని తెలుగులో అరవోళ్లు చేసే ఈ సందడి ఇప్పుడు మద్రాసు పాండీ బజారు నుంచి మన కృష్ణా నగర్‌కు తరలి వచ్చేసింది. ఇప్పుడు కొన్ని తెలుగు సినిమాల లొకేషన్స్‌లో ఇలాంటి వచ్చీ రాని తమిళ - తెలుగు పదాలు బోల్డన్ని వినబడుతున్నాయి. అవును మరి... మన సినిమాల్లో అరవ ‘ఇయక్కునర్’లు (దర్శకులు), ‘ఒళిప్పదివాళర్’లు (కెమేరామన్లు) అదరగొడుతున్నారు. ‘ఇదు నడక్కుమా?’ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులైన తమిళ దర్శకులు మణిరత్నం, గౌతమ్ మీనన్‌లతో రామ్‌చరణ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. మణిరత్నంతో ఈ హీరో రెండుసార్లు సమావేశయ్యారు కూడా. అప్పట్లో చిరంజీవి 150వ సినిమా కోసమే ఈ చర్చలు జరిగినట్టు వార్తలొచ్చాయి. కానీ, చరణ్‌తోనే మణిరత్నం సినిమా చేసే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య ‘ఏ మాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ చేశారు. అందులో రెండో సినిమా గత వారమే విడుదలైంది. చైతూ తండ్రి నాగార్జున కోసం ఈ దర్శకుడు ఓ కథ రెడీ చేశారట. నెగిటివ్ క్యారెక్టర్ చేస్తారా? అని అడిగితే నాగ్ ‘యస్’ అన్నారట. ‘గౌతమ్.. నీతో సినిమా చేయడానికి ఎదురు చూస్తున్నాను’ అని ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఆడియో వేడుకలో నాగ్ బహిరంగంగా అన్నారు. మరి.. ఇదు నడక్కుమా? (ఇది జరుగుతుందా?). వేచి చూడాలి. ఇవంగ ఎల్లామ్ ఎప్ప వరువాంగళో? ఆ తరంలో కె.బాలచందర్, భారతీరాజా వంటివారు, తర్వాతి తరంలో పి.వాసు, మణిరత్నం, ఈతరంలో గౌతమ్ మీనన్, మురుగదాస్, ఎస్.జె. సూర్య, విష్ణువర్థన్, కరుణాకరన్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, విక్రమ్ కుమార్ వంటి తమిళ దర్శకులు తెలుగులో సినిమాలు చేశారు. ఇప్పుడు మరికొంతమంది తమిళ దర్శకులు వస్తున్నారు. ఇక.. శంకర్, హరి వంటి తమిళ దర్శకులతో పని చేయడానికి పలువురు తెలుగు హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. మరి.. ఇవంగ ఎల్లామ్ ఎప్ప వరువాంగళో?.. అంటే.. వీళ్లంతా ఎప్పుడు వస్తారో? అని అర్థం. - డి.జి. భవాని -
మహేష్ మూవీ టైటిల్ అదేనా..?
బ్రహ్మోత్సవం సినిమా తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు జెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే చేస్తోన్న మహేష్, తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు టైటిల్‌గా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ముందుగా ఎనిమి అనే టైటిల్ దాదాపుగా ఫైనల్ అన్న టాక్ వినిపించింది. తరువాత చట్టంతో పోరాటం, వాస్కోడాగామ లాంటి పేర్లు తెర మీదకు వచ్చినా.. చిత్రయూనిట్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాకు అభిమన్యుడు అనే టైటిల్‌ను నిర్ణయించారన్న వార్త ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మహేష్ కూడా ఇదే టైటిల్‌కు మొగ్గుచూపుతున్నాడట. మరి ఈ టైటిల్ పై అయినా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. -
తెలుగు.. తమిళ్..మళ్లీ మహేశ్?!
ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత డీవీవీ దానయ్య నిర్మాణంలో దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండూ పూర్తయిన తర్వాత మరోసారి తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో మహేశ్ నటించే అవకాశాలున్నాయి. ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను మహేశ్ బాబు హీరోగా ద్విభాషా చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘రాజా రాణి’, విజయ్ ‘పోలీస్’ సినిమాల ఫేమ్ అట్లీ సహాయ దర్శకుడు బాస్కో మన ప్రిన్స్ మహేశ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ కథ రాసుకున్నారు. ప్రస్తుతం మురుగదాస్ సినిమా షూటింగ్ నిమిత్తం చెన్నైలో ఉన్న మహేశ్‌ను కలసి దర్శక-నిర్మాతలు చర్చించారట. కథపై డిస్కషన్స్ జరుగుతున్నాయని నిర్మాత సన్నిహిత వర్గాల సమాచారం. మహేశ్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే... రజనీకాంత్ ‘కబాలి’తో సహా తమిళంలో పలు భారీ సినిమాలు నిర్మించిన కలైపులి ఎస్.థాను నేరుగా తెలుగులో సినిమా తీస్తున్నట్లు అవుతుంది. విజయ్ ‘పోలీస్’ (తమిళంలో ‘తెరి’) నిర్మించింది కూడా థానూనే. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లోనే అట్లీ అసోసియేట్ బాస్కోపై నిర్మాతకు నమ్మకం కలిగిందట. ఇటీవల ఓ ఆడియో వేడుకలో నా అసోసియేట్‌తో థానుగారు సినిమా నిర్మిస్తానని చెప్పారని అట్లీ వ్యాఖ్యానించారు. -
మహేశ్‌కి ఇద్దరు కాదు!
క్లారిటీ ఇచ్చిన మురుగదాస్ మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. ఈ చిత్రంలో మహేశ్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. దర్శకుడు ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా చేస్తున్నారు. కాగా, ఇందులో ఉన్న ఓ కీలక పాత్రకు నయనతారను ఎంపిక చేశారనే వార్త రెండు రోజులుగా హల్చల్ చేస్తోంది. ఈ విషయం గురించి మురుగదాస్ క్లారిటీ ఇచ్చేశారు. ‘‘ఈ చిత్రంలో మహేశ్‌బాబు సరసన ఒకే ఒక్క కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. దీన్నిబట్టి ఇందులో రెండో కథానాయిక పాత్ర లేదనీ, కీలక పాత్ర అసలే లేదని స్పష్టమైంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. అక్కడ ముఖ్యమైన సన్నివేశాలతో పాటు ఓ పాట కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. డ్యాన్స్ డెరైక్టర్ శోభి ఆధ్వర్యంలో ఈ పాటను చిత్రీకరించనున్నారు. -
సూపర్‌స్టార్‌కు జంటగా
సూపర్‌స్టార్‌కు జంటగా లేడీ సూపర్‌స్టార్ నటించనున్నారన్న ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. లేడీ సూపర్‌స్టార్ అంటే ఈ పాటికే అందరికీ అర్థమయిపోయి ఉంటుంది. ఎస్.అది నయనతారనే. ఈ సంచలన నటి గురించి ఈ మధ్య వారానికో కొత్త చిత్రం గురించి వార్త ప్రచారం జరుగుతోందనవచ్చు. నానుమ్ రౌడీదాన్ చిత్రం నుంచి ఇటీవల తెరపైకి వచ్చిన ఇరుముగన్ వరకూ వరస విజయాలను కైవసం చేసుకుంటున్న నయనతార ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. కార్తీతో నటిస్తున్న కాష్మోరా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. శివకార్తీకేయన్‌తో ఒక చిత్రం, హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం దొర, మింజూర్ గోపి దర్శకత్వంలో మరో లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంతో పాటు నటుడు అధర్వ, జ్ఞానముత్తుల కలయికలో రూపొందనున్న చిత్రంలో ప్రముఖ పాత్ర, తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో సూర్యకు జంటగా మరో సారి నటించడానికి రెడీ అవుతున్నారు. వీటితో పాటు తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది కోలీవుడ్టాక్. అదే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో నటించనున్నారని సమాచారం. మహేశ్‌బాబు తాజాగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్ నాయకిగా నటిస్తున్నారు. ఇందులో నయనతార ఒక ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు టాక్. విశేషం ఏమిటంటే ఇంతకు ముందు ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సూర్యకు జంటగా గజనీ చిత్రంలో నయనతార నటించారు. ఇక తాజా సమాచారం నిజమైతే గజనీ చిత్రం విడుదలై సుమారు 11 ఏళ్లు అవుతోంది. ఆ తరువాత మళ్లీ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రంలో నటించ నున్నారన్నమాట. -
న్యూ లుక్‌లో టాలీవుడ్ ప్రిన్స్
చెన్నై : టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్‌లో ఫ్యాన్స్‌ను అలరించబోతున్నారట. పోకిరి, దూకుడు వంటి సినిమాల్లో పోలీసు గెటప్‌తో ప్రేక్షకులను అలరించిన మహేష్ ఏఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న తమిళ-తెలుగు ద్విభాషా ప్రాజెక్టులో నటించనున్నారట. అయితే ఈ ప్రాజెక్టులో అలాంటి ఇలాంటి రెగ్యులర్ పోలీస్‌గా కాకుండా ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా మహేష్ కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ షూటింగ్లో మహేష్ బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తాడని, ఇప్పటికే పోలీసు గెటప్‌తో ప్రేక్షకులకు సుపరిచితమైన మహేష్‌ను విభిన్న అవతారంలో మురుగదాస్ చిత్రీకరించబోతున్నారని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. అయితే మురుగదాస్, మహేష్ కాంబినేషన్లో వస్తున్న మొదటి ఫిల్మ్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం చెన్నైలోని ఈవీపీ వరల్డ్ పార్క్‌లో ఈ ప్రాజెక్టు షూటింగ్ జరుగుతోందని చిత్ర యూనిట్ వెల్లడిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు టైటిల్‌ను మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ఈ సినిమాలో రకుల్ ప్రీతీ సింగ్, ఎస్.జే సూర్య నటిస్తున్నారని తెలుస్తోంది. -
రెండో రోజు కాస్త పెరిగిన కలెక్షన్లు
తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన అకీరా సినిమా కలెక్షన్లు రెండో రోజు కొంచెం పెరిగాయి. అకీరా విడుదలైన తొలిరోజు శుక్రవారం 5.15 కోట్ల రూపాయల వసూళ్లు రాగా, శనివారం 5.30 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ సినిమా తొలి రెండు రోజుల్లో కలిపి మొత్తం 10.45 కోట్లు రూపాయలు రాబట్టింది. ఆదివారంతో పాటు సోమవారం వినాయకచవితి పండగ సెలవు కావడంతో మరో రెండు రోజులు ఇదే తరహాలో కలెక్షన్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. మురుగదాస్ బాలీవుడ్లో గజని, హాలిడే వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు. అయితే ఆయన తాజా చిత్రం అకీరాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ భారీ యాక్షన్ డ్రామా సినిమాను దాదాపు 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. అకీరాలో సోనాక్షి ప్రధాన పాత్ర పోషించగా, అనురాగ్ కశ్యప్, కొంకనా సేన్ శర్మ ఇతర పాత్రల్లో నటించారు. -
నిరాశపరిచిన తొలిరోజు కలెక్షన్లు
తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన అకీరా సినిమాకు తొలిరోజు బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. మురుగదాస్ బాలీవుడ్లో గజని, హాలిడే వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు. అయితే ఆయన తాజా చిత్రం అకీరాకు మిశ్రమ స్పందన వచ్చింది. అకీరా విడుదలైన తొలిరోజు శుక్రవారం 5.15 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించాడు. తొలిరెండు షోలకు కలెక్షన్లు తక్కువగా రాగా, సాయంత్రానికి కాస్త పుంజుకున్నాయని ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కాగా వినాయకచవితి పండగ రావడంతో లాంగ్ వీకెండ్ కారణంగా సోమవారం నాటికి కలెక్షన్లు పెరగవచ్చని భావిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ డ్రామా సినిమాను దాదాపు 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. అకీరాలో సోనాక్షి ప్రధాన పాత్ర పోషించగా, అనురాగ్ కశ్యప్, కొంకనా సేన్ శర్మ ఇతర పాత్రల్లో నటించారు. మురుగదాస్ మహిళ ప్రధాన పాత్రగా సినిమా తీయడం ఇదే తొలిసారి. -
చెన్నైలో సండే నుంచి షురూ!
మహేశ్‌బాబుకి మాస్.. క్లాస్.. తేడా లేదు. ప్రతి సినిమాలోనూ ఫర్ఫెక్షన్ చూపించడానికి ప్రయత్నిస్తారు. క్లాసులో మాస్‌నీ, మాసులో క్లాస్‌నీ మిక్స్ చేసి కమర్షియల్ పంథాలో సందేశాత్మక సినిమాలు తీసే దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెల్సిందే. ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఆదివారం చెన్నైలో ప్రారంభం కానుంది. ఇటీవల హైదరాబాద్‌లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌తో పాటు ఫైట్ సీక్వెన్స్‌లో కొంత పార్ట్ షూట్ చేశారు. చెన్నైలో తీయనున్న సన్నివేశాల కోసం స్పెషల్ సెట్ రెడీ చేశారట. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. మహేశ్, రకుల్ కలసి నటిస్తున్న తొలి సినిమా ఇది. ఇందులో మహేశ్‌బాబు ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సంతోష్ శివన్, సంగీతం: హారీస్ జయరాజ్. -
మహేష్ కు నిద్రలేని రాత్రులు..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దానికి కారణం టాప్ డైరెక్టర్ మురుగదాస్. మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో ఓ క్రేజీ ప్రాజెక్టు పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వరుసగా రాత్రివేళల్లోనే జరుగుతున్నట్లు సమాచారం. వారం రోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ అనంతరం ముంబై, గుజరాత్, పూణె, చెన్నై తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాలో మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని టాక్. మురుగదాస్ ముందు సినిమాల మాదిరిగానే సామాజికపరమైన అంశాలతో కూడుకున్న కథనంగా తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాను హిందీలో కూడా డబ్ చేసే అవకాశాలున్నాయి. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. -
ప్రేమ పాట పాడిన నాగ్
‘కొత్త కొత్త భాష.. కొత్త ప్రేమభాష...’ అంటూ పన్నెండేళ్ల పిల్లాడు అమీన్ పాడిన పాట అక్కినేని నాగార్జునకు విపరీతంగా నచ్చేసింది. ఈ అమీన్ ఎవరో కాదు.. ఎ.ఆర్. రహమాన్ తనయుడు. ‘నిర్మల కాన్వెంట్’ కోసం అమీన్ పాడిన ఈ ప్రేమ పాటను ఆ చిత్రనిర్మాత నాగార్జున విన్నారు. ప్రేమను వర్ణిస్తూ సాగే ఈ పాటను మళ్లీ మళ్లీ విన్నారు. వినడం మాత్రమే కాదు.. వెంటనే ఈ పాట పాడాలని నిర్ణయించుకున్నారు. ‘సీతారామరాజు’లో ‘చీపుగా చూడకు పొరపాటు.. చిరాకు పడదా సిగరెట్టు..’ అనే పాట పాడిన నాగర్జున, పదిహేనేళ్ల తర్వాత మరోసారి ఈ పాటతో ప్రేక్షకులకు వీనుల విందు చేశారు. తాజా పాటను శనివారం యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘‘హృదయానికి హత్తుకునే ఈ అందమైన ప్రేమ పాట ప్రేక్షకులకూ, ఫ్యాన్స్‌కూ నచ్చుతుందని ఆశిస్తున్నా. నేను చాలా ఇష్టపడి పాడాను’’ అని నాగార్జున పేరొన్నారు. ఈ పాటను ప్రముఖ సంగీతదర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి స్వరపరిచారు. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రేయా శర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వం వహించారు. నాగర్జున సమర్పణలో మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు చిత్రాన్ని నిర్మించాయి.