అదే కొత్త సినిమా... అదే చివరి సినిమా? | AR Murugadoss to team up with Rajinikanth after Sarkar | Sakshi
Sakshi News home page

అదే కొత్త సినిమా... అదే చివరి సినిమా?

Published Sun, Sep 23 2018 2:15 AM | Last Updated on Sun, Sep 23 2018 11:45 AM

AR Murugadoss to team up with Rajinikanth after Sarkar - Sakshi

రజనీకాంత్‌

ఇది గుడ్‌ న్యూసా? బ్యాడ్‌ న్యూసా? అనే కన్‌ఫ్యూజన్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఫ్యాన్స్‌కు స్టార్ట్‌ అయ్యింది. ఇంతకీ ఈ న్యూస్‌ ఏంటో తెలుసుకోవాలంటే ఇది మొత్తం చదవాల్సిందే. రజనీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ వార్తలు బాగా ఊపందుకున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ‘పేట్టా’ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తి కావొస్తుండటం, విజయ్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సర్కార్‌’ సినిమా విడుదలకు రెడీ అవ్వడమే ఇందుకు కారణాలని ఊహించవచ్చు.

అంతేకాదు ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో స్టార్ట్‌ అవుతుందని టాక్‌.  ‘పేట్టా, సర్కార్‌’ చిత్రాల నిర్మాణ బాధ్యతలను స్వీకరించిన సన్‌ పిక్చర్స్‌ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుందట. అయితే మురుగదాస్‌ దర్శకత్వంలో నటించిన తర్వాత రజనీకాంత్‌ సినిమాలకు బై బై చెబుతారని, ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా రాజకీయాలకు దగ్గరగా ఉంటుందని కొందరి అంచనా.  ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే లెక్కల పరంగా రజనీ కెరీర్‌లో ఇది 166వ సినిమా. అభిమాన హీరో ఎప్పటికీ సినిమాలు చేస్తుండాలని అభిమానులు కోరుకుంటారు.

అందుకే కొత్త సినిమా గురించి వార్త వస్తే ఆనందపడతారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓకే అయిందని ఆనందపడాలో, ఇదే రజనీకాంత్‌కి చివరి సినిమా అవుతుందనే వార్తలకు బాధపడాలో తెలియని అయోమయంలో పడిపోయారట ఫ్యాన్స్‌. ఇక కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రజనీ తాజా చిత్రం ‘పేటా’్టలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, విజయ్‌ సేతుపతి, బాబీ సింహా, సిమ్రాన్, త్రిష తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరు«ద్‌ స్వరకర్త. మరోవైపు శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌ కుమార్, అమీ జాక్సన్‌ ముఖ్య తారలుగా రూపొందిన ‘యందిరిన్‌’ (తెలుగులో ‘రోబో’) సీక్వెల్‌ 2.0 ఈ నవంబర్‌ 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement