sarkar
-
కేసీఆర్ సర్కార్ పాలనకు చరమగీతం పాడాలి
నిజామాబాద్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని, సీఎం కేసీఆర్ సర్కార్ పాలనకు చరమగీతం పాడాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకు లభిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసేలా ప్రజ లు ముందుకు రావాలని కోరారు. కల్వకుంట్ల కుటుంబానికి ముందుంది ముసళ్ల పండుగ అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అసలైన కథ ఇప్పుడే మొదలైందన్నారు. కేసీఆర్‌ను మించిన అబద్ధాలకోరు రాష్ట్రంలో మరొకరు లేరని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. పసుపు బోర్డు ఇస్తే అభ్యర్థి ని పెట్టబోనని చెప్పిన బీఆర్ఎస్ ఏం ముఖం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందో చెప్పాలన్నారు. పసుపు రైతుల దశాబ్దాల కల ప్రధాని మోదీ నెరవేర్చారని బీజేపీ జాతీయ ఉ పాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాలను సమాధి చేయాలని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్‌రావు పిలుపునిచ్చారు. పసుపు బోర్డు వచ్చినందుకు రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎం.రవీంద్రనాయక్, జి.విజయ రామారావు, రమేశ్ రాథోడ్, గరికపాటి మోహన్‌రావు, బూర నర్సయ్యగౌడ్, డి.ప్రదీప్‌రావు తదితరులు పాల్గొన్నారు. అరుణతార వందన సమర్పణ చేశారు. సభ ముగిశాక వేదికపైనే బండి సంజయ్, ఈటల రాజేందర్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ప్రధాని భుజం తట్టి అభినందించారు. కొన్నేళ్లుగా చెప్పులు కూడా ధరించకుండా పోరాడుతున్న పసుపు బోర్డు ఉద్యమ నాయకుడు మనోహర్‌రెడ్డి గురించి సంజయ్‌ని అడిగి తెలుసుకున్నారు. బీజేపీలో జోష్ మోదీ బహిరంగసభ విజయవంతం కావడంతో కాషాయదళంలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అంచనాలకు మించి భారీగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరుకావడం, ప్రధాని ప్రసంగానికి జనాల్లో బాగా స్పందన కనిపించడంపై పార్టీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, అవినీతి అంశాలను మోదీ ప్రస్తావించినప్పుడల్లా కేకలు, ఈలలు, చప్పట్లతో సభికు లు మద్దతు ప్రకటించారు. తెలుగులో నా కుటుంబ సభ్యులారా.. అని అనగానే హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రసంగం మధ్యలో మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. -
ఆ భూములకు మార్కెట్ ధర నిర్ణయించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయించాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. జీవో 571 ప్రకారం మార్కెట్ ధరను అంచనా వేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న గత ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉంటే అవి తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఖానామెట్‌లో కమ్మ, వెలమ కుల సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం మరోసారి సోమవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కుల సంఘాలకు భూకేటాయింపు అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. 2012, సెప్టెంబర్ 14 నాటి జీవో 571 మేరకు ప్రభుత్వం ఈ సంఘాలకు ఇచ్చిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయిస్తామని, ఇందుకు అనుమతించాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని ఆమోదించవద్దని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
బియ్యం అమ్మకం..రూ.4 వేల కోట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నిధుల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టి.. కస్టమ్‌మిల్లర్ల నోట్లో మట్టికొట్టే పనిచేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకు కిలో నాలుగైదు రూపాయల తక్కువకు అమ్మాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. ఒక్క ఆక్షన్‌కి రూ.1000 కోట్ల స్కామ్.. కోటిటన్నులు అమ్ముకునే ప్రణాళిక బీఆర్ఎస్ సర్కారుదని ఆరోపించారు. ఈ విధంగా వచ్చే రూ.4 వేల కోట్ల అవినీతి సొమ్ము 100 నియోజకవర్గాల్లో..ఒక్కో సెగ్మెంట్లో రూ.40 కోట్లు ఖర్చు చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు సంధించారు. శనివారం అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ బియ్యం అమ్ముకుంటామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, దీనికి వెనుక అసలు ఉద్దేశం అదేనని ఆరోపించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని వేలం వేసేందుకు వెయ్యికోట్ల టర్నోవర్, రూ.100 కోట్ల ప్రాఫిట్ ఉండాలనే నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. మొదటిదశలో రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారని, టెండర్లో పాల్గొనేందుకు పౌరసరఫరాలశాఖ నిర్ణయించిన విధివిధానాలతో రైస్ మిల్లర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎంఎస్పీకి బియ్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో మిల్లర్లు సిద్ధంగా ఉన్నా, టెండర్ల ద్వారా తమ మిల్లు సామర్థ్యం మేరకు ధాన్యం దక్కించుకుందామనుకున్న మధ్యతరగతి మిల్లర్లకు అసలు అందులో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలతో రైస్‌మిల్లర్లు బియ్యం ఆక్షన్‌లో కొనలేరన్నారు. రైస్‌మిల్లర్ల వ్యాపారం బంద్ అయితే రైతులు రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా కల్వకుంట్ల కవిత పోటీచేస్తే మూడో స్థానానికి పరిమితం అవుతుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తాను ఎంపీగా పోటీలో ఉండడం ఖాయమని ప్రకటించారు. -
అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ఈ ప్రభుత్వం లాక్కుంటోందని సీఎల్పి నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గ్రామాల్లో శ్మశానవాటికలు, ఇతర అవసరాలకు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫార్మాసిటీ, పారిశ్రామికవాడల నిర్మాణం కోసం వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం అరకొర పరిహారం చెల్లించి తీసుకుందని ఆరోపించారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోనే 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం సేకరించిందన్నారు. ఈ ప్రాంతంలో ఎకరా రూ.4–5 కోట్ల విలువ చేస్తుందన్నారు. బుద్వేల్‌లో 164 ఎకరాల అసైన్డ్ భూములు సేకరించిన ప్రభుత్వం ప్లాట్లు వేసి అమ్ముతోందని ఆరోపించారు. అసైన్డ్ భూములు అసైనీల వద్దే ఉండనీయాలని, ధరణిలో వారికి హక్కులు కల్పిం చాలని కోరారు. తెలంగాణ ప్రగతిపై ఆదివారం శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. పీపుల్స్ మార్చ్ పేరుతో ఇటీవల నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం లక్షల మంది ప్రజలు నిరీక్షిస్తున్నారని, ప్రతి గ్రామంలో భూములను సేకరించి ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని అన్నారు. అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులందరికీ పోడు పట్టాలు అందలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. దీనిపై అధికార బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఉద్యోగాలు లేక కష్టాల్లో యువత.. ఎమ్మెస్సీ, ఎంఏ, బీఈడీ వంటి ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాలు లభించక గ్రామాల్లో ఇస్త్రీ షాపులు, సోడా దుకాణాలు నడుపుకుంటూ తీవ్ర ఆవేదనలో ఉన్నారని భట్టి విక్రమార్క పేర్కొనగా, మళ్లీ బీఆర్ఎస్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్పీకర్ పోచారం కలగజేసుకుని.. ‘భట్టి గారూ..మీరు ఆరు మాసాల పాదయాత్ర మొత్తం చెప్పడానికి సమయం సరిపోదు’అని సూచన చేశారు. అనంతరం భట్టి ప్రసంగం కొనసాగిస్తూ.. వర్సిటీల్లో అధ్యాపకులను భర్తీ చేయాలని, ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. ఉపాధ్యాయులు లేక బడులు మూతబడుతున్నాయని, తక్షణమే డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సరే.. కాల్వలు ఏవీ? రాష్ట్రంలో వివిధ కొత్త ప్రాజెక్టులను నిర్మించిన ప్రభుత్వం వాటి కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకపోవడంతో నీళ్లు ఉన్నా ఆయకట్టుకు సరఫరా కావడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. కాళేశ్వరం కింద కాల్వలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కడెం వంటి పాత ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ముంపునకు గురి అవుతున్న చెన్నూరు, భూపాలపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల ప్రజలకు పునరావాసం కల్పిం చి, పరిహారం చెల్లించాలని కోరారు. గిరిజనబంధు, బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి.. గిరిజనబంధుతో పాటు బీసీలకు సబ్‌ప్లాన్, మైనారిటీలకు సచార్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్‌కి 15 కేజీల వరకు తరుగు తీస్తున్నారని, పంట రుణమాఫీ సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను మూసివేయించాలని డిమాండ్ చేశారు. -
బహ్మరెడ్డి... ఓ ‘సర్కార్’!
సాక్షి, హైదరాబాద్: విజయ్ కథానాయకుడిగా వచ్చిన సర్కార్ సినిమా గుర్తుందా..? అందులో ఎన్నారై, బడా వ్యాపారవేత్త అయిన కథానాయకుడు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి వస్తాడు. అప్పటికే ఆ ఓటు ఎవరో వేసేశారని తెలుసుకుని న్యాయపోరాటం చేస్తాడు. దాదాపు ఇలాంటి ఉదంతమే నగరంలో చోటు చేసుకుంది. సినిమాలో ఓటు అంశం సాధారణ ఎన్నికలకు సంబంధించినదైతే... ఇక్కడ మాత్రం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎల్రక్టానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ గవర్నింగ్ కౌన్సిల్ది. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం... ఖైరతాబాద్‌లోని ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) తెలంగాణ స్టేట్ సెంటర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న బి.బ్రహ్మరెడ్డి న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్‌కు (ఐఈటీఈ) కార్పొరేట్ మెంబర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఈయనకు ఓటుహక్కు ఉంది. దీనికి సంబంధించిన ఎన్నికలు ఈ ఏడాది జూన్‌లో జరిగాయి. ఆ నెల 30వ తేదీ రాత్రి 11.59 నిమిషాల వరకు ఆన్లైన్లో ఓటు వేసుకునేందుకు అర్హులకు అవకాశం ఇచ్చారు. ఈ ఆన్లైన్ ఓటింగ్ కోసం అర్హులైన ఐఈటీఈ ఓటర్లు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ లేదా ఫోన్‌కు వచ్చే ఓటీపీ సహాయంతో అధికారిక వెబ్‌సైట్‌లోని ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఆపై అక్కడ ఉన్న ఆప్షన్స్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఐఈటీఈ ఓటర్లు అంతా ఇలానే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్రహ్మారెడ్డి జూన్ 30 మధ్యాహ్నం 2.10 గంటలకు ఓటు వేయడం కోసం అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యారు. అయితే అప్పటికే ఈ ఓటు వేరే వాళ్లు వేసినట్లు అందులో కనిపించింది. తన ఈ–మెయిల్ ఐడీ, యూజర్ ఐడీ తదతరాలను హ్యాక్ చేసిన దుండగులు ఇలా చేశారని ఆయన అనుమానించారు. దీంతో ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతిక దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్ ఓటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సిందిగా కోరుతూ ఐఈటీఈకి లేఖ రాశారు. ఆ ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన వాళ్లు గెలిచారని, తన ఓటు కూడా ఆ రాష్ట్రంలోని అమరావతి నుంచే వేసినట్లు తెలుస్తోందని బ్రహ్మరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని సైతం పరిగణలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. (చదవండి: వచ్చేస్తున్నాయ్ వందేభారత్ రైళ్లు) -
‘సర్కార్’ చిత్రం తరహాలో చాలెంజ్ ఓట్లు
పెరంబూరు: సర్కార్ చిత్రం తరహాలో లోక్‌సభ ఎన్నికల్లో చాలెంజ్ ఓట్లు పోలవ్వడం విశేషం. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటుడు విజయ్ నటించిన చిత్రం సర్కార్. గత ఏడాది తెరపైకి వచ్చిన ఈ చిత్రం విజయం సాధించినా, పెద్ద వివాదానికి తెరలేపింది. అందులో నటుడు విజయ్ విదేశం నుంచి ఓటు హక్కును వినియోగించుకోవడానికి చెన్నైకి వస్తారు. అయితే ఆయన ఓటును ఎవరో వేస్తారు. దీంతో విజయ్ తన ఓటు కోసం పోరాడి 49పీ చట్టం ప్రకారం ఓటు వేస్తారు. అదే తరహాలో గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కొందరి ఓట్లును వేరొకరు వేయడంతో వారు పోరాడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలా స్థానిక చెన్నై, తాంబరం సమీపంలోని ముడిచూర్‌కు చెందిన ఒక ప్రైవేట్ కళాశాల అసిస్టెంట్ ఫ్రొపెసర్ గోపీనాధ్ ముడిచూర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వెళ్లారు. అప్పటికే ఆయన ఓటును వేరెవరో వేశారు. దీంతో ఆయన ఎన్నికల నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు సర్కార్ చిత్రంలో మాదిరిగా 49పీ చట్టం ప్రకారం 17పీ ఫారం ద్వారా ఓటు వేశారు. అదే విధంగా అదే ప్రాంతానికి చెందిన రాజాజీ, కడలూరు జిల్లా, చిదంబరం ప్రాంతానికి చెందిన పరువ తరాజ్ అనే వ్యక్తి, కుమరి జిల్లా, పద్మనాభపురానికి చెందిన అజిన్, షాజీరాజేశ్ అనే వ్యక్తులు చాలెంజ్ ఓట్లను వేశారు. నెల్లై జిల్లాలోని నెల్లై పేట, కేఓపీ వీధికి చెందిన జాబర్‌సాధిక్, ఆయన భార్య ఆయిషా సిద్ధిక 49పీ చట్టం ప్రకారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా మరి కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు నకిలీ ఓట్లకు గురైన వారికి చాలెంజ్ ఓట్లకు అవకాశం కల్పించారు. ఇలా విజయ్ నటించిన సర్కార్ చిత్రం వారికి స్ఫూర్తిగా నిలిచిందన్నమాట. -
విజయ రహస్యాన్ని బయటపెట్టి కీర్తీ సురేష్
ఎవరికైనా కెరీర్లో కొన్ని చిత్రాలు మైలురాయిగా నిలిచిపోతాయి. అలా కీర్తీసురేశ్ ఎన్ని కమర్శియల్ చిత్రాల్లో నటించినా మహానటి (తమిళంలో నడిగైయార్ తిలగం) ఆమె సినీ జీవితంలో మరపురాని మధురమైన చిత్రంగా నిలిచిపోతుంది. కీర్తీ నటన గురించి ఎవరు మాట్లాడినా మహానటి చిత్ర ప్రస్తావన రాకుండా ఉండదు. ఆ చిత్రం తరువాత కొన్ని కమర్శియల్ చిత్రాల్లో కీర్తి నటించినా ప్రస్తుతం తన నట జీవితం నిదానంగానే నడుస్తోంది. మలయాళం, తెలుగు భాషల్లో ఒక్కో చిత్రం మాత్రమే చేస్తోంది. ఇక తమిళంలో సర్కార్ చిత్రం తరువాత మరో చిత్రం ఈ బ్యూటీ చేతిలో లేదు. ఇదే విషయాన్ని కీర్తీసురేశ్ ముందుంచితే దక్షిణాదిలో తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. ఇది సంతోషకరమైన విషయమేనని అంది. ప్రతీ చిత్రానికి ఎదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నట్లు పేర్కొంది. షూటింగ్ సెట్లో 100 మందిని మనం గురువులుగా చూడవచ్చునని అంది. వారు చేసే పనిలో నైపుణ్యం, లైట్‌మెన్ నుంచి దర్శకుడి వరకూ వృత్తిపై చూపే శ్రద్ధ, అంకితభావం తనను చాలా ఆకట్టుకుంటుందని చెప్పింది. ఇక నటీనటులు వారు ఎంచుకునే కథలపైనే వారి మనుగడ ఆధారపడి ఉంటుందని అంది. కొందరు నటీమణులు పాత్రల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, అలాంటి వారు ఎంచుకుని నటించే చిత్రాలపై ఆసక్తి అధికం అవుతుందని అంది. నడిగైయార్ (మహానటి) చిత్రం తరువాత తన పరిస్థితి అదేనని చెప్పింది. తానిప్పుడు ఏ చిత్రంలో నటించినా వాటిపై ప్రేక్షకుల మధ్య అంచనాలు పెరిగిపోతున్నాయని చెప్పింది. అయితే మంచి నిర్ణయాలు తీసుకోవడం అన్నది తనకు చిన్నతనం నుంచే ఉందని అంది. అందుకే కథల ఎంపికలో చాలా తెలివిగా ఉన్నానని చెప్పింది. కథలో ఎంపికలో తొందర పడదలుచుకోలేదని తెలిపింది. తన విజయ రహస్యం ఇదేనని కీర్తీసురేశ్ చెప్పుకొచ్చింది. -
సూపర్ స్టార్ మరో సినిమాకు ఓకె చెప్పాడా..?
2.ఓ సినిమాతో సంచనాలు నమోదు చేస్తున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పేట్ట షూటింగ్ పూర్తి చేసిన రజనీ, మరో సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీ 166వ చిత్రం తెరకెక్కనుంది. విజయ్ హీరోగా సర్కార్ సినిమాతో కమర్షియల్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న మురుగదాస్ తొలిసారిగా రజనీ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న రజనీ, సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు చేసే మురుగదాస్ తోడైతే రజనీ పొలిటికల్ ఎంట్రీకి కూడా ప్లస్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. -
విజయ్‌కు జోడిగా నయన్!
సర్కార్ సినిమాతో బాక్సాఫీస్‌పై దండెత్తిన ఇళయ దళపతి విజయ్.. తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. మెర్సెల్, సర్కార్ లాంటి బిగ్గెస్ట్ హిట్స్ తరువాత విజయ్ చేయబోయే ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇప్పటికీ సర్కార్ హవా కొనసాగుతూనే ఉంది. వివాదాల మధ్య ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ.. మెర్సెస్ రికార్డులను బద్దలుకొట్టింది. విజయ్ తన 63వ చిత్రాన్ని అట్లీ డైరెక్షన్లో చేయబోతున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన ‘తేరి’, ‘మెర్సెల్’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరు హ్యాట్రిక్ కొట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్గా నటించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు, సినిమా టైటిల్ తదితర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. A heroine needs to be Strong, Smart and add Strength to the Story AGS is super happy to announce that our very own #Nayan has come on board #Thalapathy63 Like all fans I am super excited to see our #Thalapathy #Nayan combo on screen after a longtime @Atlee_dir #Ags pic.twitter.com/krrla9cBuU — Archana Kalpathi (@archanakalpathi) 25 November 2018 -
‘రంగస్థలం’ రికార్డ్ బ్రేక్ చేసిన ‘సర్కార్’
కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కార్. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతూ వస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ను సాధించి రికార్డ్ సృష్టించిన సర్కార్ ప్రస్తుతం ఈ ఏడాది సౌత్‌లోనే హైయ్యస్ట్ గ్రాసర్‌గా రికార్డ్‌ను సొంతం చేసుకుంది. రెండు వారాల్లో సర్కార్ 225 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 2018లో సౌత్‌లో అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇన్నాళ్లు ఈ రికార్డ్ టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ రంగస్థలం పేరిట ఉంది. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం 218 కోట్లతో సర్కార్ రిలీజ్ కు ముందు వరకు టాప్ ప్లేస్‌లో ఉంది. విజయ్ సర్కార్ ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ఫుల్ రన్ మరిన్ని రికార్డ్‌లు సాధించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. -
అలాంటి చిత్రాల్లో నటించడం చాలా అవసరం
తమిళసినిమా: అలాంటి చిత్రాల్లో నటించడం హీరోయిన్లకు చాలా అవసరం అంటోంది నటి కీర్తీసురేశ్. తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న నటి ఈ బ్యూటీ. నాన్న మలయాళం, అమ్మ తమిళం కావడంతో తాను ఆడా ఉంటా.. ఈడా ఉంటానంటూ మలయాళం, తమిళ్, తెలుగు భాషల్లో నటిస్తున్న కీర్తీసురేశ్‌ను కోలీవుడ్ ఎక్కువగా ఓన్ చేసుకుందని చెప్పవచ్చు. ఇక్కడ విజయ్, విశాల్, విక్రమ్, ధనుష్, శివకార్తీకేయన్, విక్రమ్‌ప్రభు అంటూ వరుసగా స్టార్ హీరోలతో నటించేసింది. విశేషం ఏమిటంటే విక్రమ్, విశాల్‌లతో సీక్వెల్ చిత్రాల్లో కీర్తీ నటించడం. ఇక విజయ్‌తో నటించిన సర్కార్ ఇటీవల పలు వివాదాల మధ్య తెరపైకి వచ్చి వసూళ్ల పరంగా కుమ్మేస్తోంది. ఈ సందర్భంగా కీర్తీసురేశ్‌తో చిన్న భేటీ. ప్ర: సర్కార్, సండైకోళి చిత్రాల్లో నటి వరలక్ష్మీతో కలిసి నటించడం గురించి? జ: ఆ రెండు చిత్రాల్లో వరలక్ష్మి, నేను నటించినా, ఏ చిత్రంలోనూ మేమిద్దరం కలిసి నటించే సన్నివేశాలు లేవు. అయితే మా ఇద్దరి మధ్య ఎలాంటి ఈగో సమస్యలు లేవు. మంచి స్నేహమే ఉంది. ప్ర: మహానటి చిత్రం మాదిరి మరో బయోపిక్‌లో నటించే అవకాశం ఉందా? జ: లేదు లేదు. సావిత్రి జీవిత చరిత్ర చిత్రంలో నటించడం మంచి అనుభవాన్ని, పరిపక్వతను, సంతోషాన్ని కలిగించింది. మరోసారి అలా నేను నటించగలనా? అన్నది సందేహమే. అంతగా ఆ చిత్రం వచ్చింది. అది ఒక మ్యాజిక్. అదే విధంగా తరచూ అలాంటి పాత్రల్లో నటించడం కూడా సరి కాదు. భారీ కమర్షియల్ చిత్రాల్లోనూ నటించడం హీరోయిన్లకు చాలా అవసరం. ప్ర: జయలలిత పాత్రలో నటించే అవకాశం వస్తే నటిస్తారా? జ: ప్రస్తుతానికి ఎవరి బయోపిక్‌లోనూ నటించాలనుకోవడం లేదు. సావిత్రి పాత్రలో నటించడమే చాలా సంతృప్తి కలిగించింది. ప్ర: నటనకు గ్యాప్ ఇస్తున్నారటగా? జ: అవును. నటిగా పరిచయం అయినప్పటి నుంచే తీరిక లేకుండా చాలా బిజీగా నటిస్తున్నాను. అందుకే కొన్ని నెలలు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. 20కి పైగా కథలు విన్నాను. త్వరలోనే నూతనోత్తేజంతో నటించడానికి సిద్ధం అవుతా. ప్ర: మహానటి చిత్రం తరువాత పారితోషికం పెంచినట్లు జరుగుతున్న ప్రచారం గురించి? జ: అసలు కొత్తగా చిత్రాలే అంగీకరించలేదు. పారితోషికం పెంచానన్న ప్రచారంలో అర్ధం లేదు. ప్ర: ఏ నటుడితో నటించాలని కోరుకుంటున్నారు? జ: కోలీవుడ్‌లో విజయ్, సూర్య, విశాల్, విక్రమ్ వంటి ప్రముఖ హీరోలతో నటించాను. నటుడు అజిత్‌తో నటించాలని ఆశగా ఉంది. ప్ర: తొడరి లాంటి చిత్రాల అపజయం బాధించిందా? జ: లేదు. నిజం చెప్పాలంటే జయాపజయాలను నేను ఒకేలా చూస్తాను. అన్నీ నచ్చి చేసిన చిత్రాలే. అలాంటి చిత్రాల నుంచి చాలా నేర్చుకుంటాను. -
కోమలవళ్లి అంటేనే కోపం వస్తుంది
కోమలవళ్లి పేరు ఎవరు చెప్పినా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇప్పుడు సర్కార్ చిత్రం రచ్చకు ప్రధాన కారణం ఈ పేరే. విజయ్ నటించిన చిత్రం సర్కార్ చిత్రంతో ఎంత వివాదం జరిగిందో తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ నేతల ఆరోపణలు, కార్యకర్తల ఆందోళనలకు సర్కార్ చిత్ర యానిట్ తలొగ్గి చిత్రంలోని వివాదాస్పద సన్నివేశాలను కట్ చేసింది. ముఖ్యంగా చిత్రంలో ప్రతినాయకి పాత్రకు కోమలవళ్లి అనే పేరు పెట్టడం సమస్యకు ప్రధాన కారణం. కారణం ఆ పేరు దివంగత ముఖ్యమంత్రి అసలుపేరు కావడమే.ఎట్టకేలకు సర్కార్ చిత్ర సమస్య సమసినా, రచ్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. కోమలవళ్లి పేరు ఇప్పుడు సినిమా రంగంలో రచ్చకు కారణమైంది కానీ, చాలా కాలం క్రితమే రాజకీయపరంగా ఆగ్రహా జ్వాలలు పుట్టించింది. ఆ కథేంటే ఒక్క సారి చూద్దాం. 2002లో కాంగ్రెస్, తమిళ కాంగ్రెస్ పార్టీల కూటమి మదురైలో సమావే«శాన్ని ఏర్పాటు చేశాయి. ఆ సభలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రసంగిస్తూ జయలలిత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన అంటూ ఘాటుగా ఆరోపిస్తూ, ఇకపై ఎప్పుడూ అన్నాడీఎంకేతో పొత్తు ఉండదని వెల్లడించారు. సోనియా వ్యాఖ్యలు జయలలితకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. దీంతో ఆమెకు సవాల్ విసిరేలా వెంటనే ఢిల్లీ వెళ్లి బీజేపీ సీనియర్ నేత వాజ్‌పేయిని కలిశారు. అనంతరం ప్రతికా సమావేశంలో ప్రధానమంత్రి కావాలని ఆరాట పడుతున్నారు అడ్వేగే అంథోనియ మయినో అంటూ సోనియాగాంధీ అసలు పేరుతో దుయ్యబట్టారు. దీంతో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్. ఇళంగోవన్ సత్యమూర్తి భవన్లో అత్యవసర విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జయలలిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అప్పుడాయన కోమలవల్లి, అమ్ము, జయలలిత అంటూ జయలలిత పేర్లను ప్రస్తవిస్తూ విమర్శించారు. అలా విమర్శల దాడిలో ఆ రాజకీయ నాయకుల అసలు పేరు బయట పడి చాలా మందికి తెలిసేలా చేసినా, మరో పక్క రాజకీయ ప్రకంపనలు పుట్టించాయనే చెప్పాలి. 16 ఏళ్ల అయిన తరువాత మళ్లీ ఇప్పుడు సర్కార్ చిత్రంతో కోమలవళ్లి పేరు ఆగ్రహజ్వాలలకు కారణమైంది. దినకరన్ కూడా అమ్మకు అలాంటి పేరు లేదని అంటున్నారు. అదే నిజమైతే కోమలవళ్లి పేరు ఎందకింత కలకలానికి దారి తీస్తోందన్నదే అంతు చిక్కని ప్రశ్న. -
సినిమా కష్టాలు!
-
‘సర్కార్’లో విజయ్ చెప్పినట్టే చేస్తున్నాం..!!
-
‘సర్కార్’లో విజయ్ చెప్పినట్టే చేస్తున్నాం..!!
సాక్షి, చెన్నై : ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘సర్కార్’ సినిమా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమిళనాడు దిగవంత సీఎం జయలలితను తప్పుగా చూపించారంటూ అన్నాడీఎంకే మంత్రులు మండిపడుతున్నారు. అలాగే, ఆమె ప్రవేశపెట్టిన ఉచిత పథకాలపై విమర్శనాత్మకంగా ఉన్న కొన్ని సీన్లను తొలగించాలని తమిళనాడు మంత్రులతో పాటు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ సీన్లను తొలగించకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సినిమాలోని అభ్యంతకరమైన సీన్లను తొలగించేందుకు నిర్మాతలు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. (‘సర్కార్’పై ఏమిటీ అరాచకం!) అయితే, తమ అభిమాన హీరో సినిమాపట్ల అన్నాడీఎంకే నేతలు వ్యవహరించిన తీరుపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. హీరో విజయ్ చెప్పింది నిజమేనంటూ ‘సర్కార్’ సినిమాలో చూపిన విధంగా.. జయలలిత హయాంలో ఇచ్చిన ఉచిత కంప్యూటర్లు, గ్రైండర్లు, మిక్సీలు, టేబుల్ ఫ్యాన్లు, ఇతర వస్తులవులను మంటల్లో వేసి బూడిద చేశారు. ఇప్పుడీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో ‘మహానటి’ ఫేం కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించారు. (వంద కోట్లు కొల్లగొట్టిన ‘సర్కార్’!) (చదవండి : ప్రభుత్వం అంత బలహీనమా?) (చదవండి : హై డ్రామా) -
ప్రభుత్వం అంత బలహీనమా?
చెన్నై, సినిమా: రాష్ట్ర ప్రభుత్వం మరీ అంత బలహీనంగా ఉందా అంటూ నటి వరలక్ష్మీశరత్‌కుమార్ వెటకారం చేశారు. సమకాలీన పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించే ఈ సంచలన నటి ప్రస్తుతం సర్కార్ వర్సెస్ సర్కార్ (సర్కార్ చిత్రం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం) మధ్య జరుగుతున్న రచ్చపై తీవ్రంగానే స్పందించారు. విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రం సర్కార్. కీర్తీసురేశ్ కథానాయకిగా నటించిన ఇందులో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ ప్రతికథానాయకి పాత్రలో రాజకీయనాయకురాలిగా నటించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్.మురుగదాస్ దర్శకుడు. ఇంతకు ముందే ఈ చిత్ర కథ వివాదంలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ స్పందిస్తూ దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌కు మద్దతుగా నిలిచారు. ఆ వివాదంలో ఏఆర్.మురుగదాస్ తగిన మూల్యం చెల్లించారనే ప్రచారం జరిగింది. తాజాగా తెరపైకి వచ్చిన సర్కార్ చిత్రంపై అన్నాడీఎంకే నేతలు ఒక్క సారిగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో చాలా విషయాలు జరిగిపోయాయి. అన్నాడీఎంకే కార్యకర్తలు సర్కార్ చిత్ర ప్రదర్శన థియేటర్లపై దాడి చేయడం, పోస్టర్లు, బ్యానర్లు చించేయడం లాంటి సంఘటనలతో పాటు, కొన్ని థియేటర్లలో ప్రదర్శనలు రద్దు చేయడం, సర్కార్ చిత్ర వర్గాలు దిగిరావడం, చిత్రంలోని అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించడానికి అంగీకరించడం, హుటాహుటిన ఆ పని కూడా జరిగిపోవడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. అంతేకాదు ముఖ్యమంత్రిని నటుడు విజయ్ శుక్రవారం కలవడానికి అపాయింట్మెంట్ కోరినట్లు కూడా సమాచారం. మొత్తానికి సర్కార్ గొడవ సద్దుమణిగినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. ఒక చిత్రాన్ని చూసి భయపడేంతగా ప్రభుత్వం బలహీనంగా ఉందా మీరు ఏదైతే చేయకూడదో అదే చేస్తూ మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు. ఇలాంటి తెలివి తక్కువ చేష్టలు చేయడం మానుకోండి. క్రియేటివిటీ స్వేచ్ఛను హరించకండి అని నటి వరలక్ష్మీశరత్‌కుమార్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. మరి ఈ అమ్మడి వ్యాఖ్యలకు అన్నాడీఎంకే నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా ఇందులో వరలక్ష్మీశరత్‌కుమార్ పాత్ర పేరు కోమళవళ్లి (ఇది జయలలిత అసలు పేరు అన్నది గమనార్హం). అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉచిత పథకాల సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించారు. ఇలా అన్నాడీఎంకే నేతలు అభ్యంతరం చెప్పిన సన్నివేశాలను తొలగించి సర్కార్ చిత్రాన్ని రీ సెన్సార్ చేసి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. సర్కార్ చిత్రంలో కట్ చేసిన సన్నివేశాలను విజయ్ అభిమానులు వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తూ తమ వీరాభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. -
హై డ్రామా
గురువారం రాత్రి చెన్నైలో దర్శకుడు మురుగదాస్ ఇంటి వద్ద చిన్నపాటి డ్రామా నడిచింది. తన లేటెస్ట్ చిత్రం ‘సర్కార్’తో తమిళనాడులో పొలిటికల్ పార్టీల ఆగ్రహానికి గురయ్యారని, అందుకే ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లారని సమాచారం. ఈ విషయాన్ని ‘సర్కార్’ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ‘మురగదాస్‌ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటివద్దకు వెళ్లారు’ అని ట్వీట్ చేశారు. ఆ వెంటనే ‘‘మా ఇంటికి పోలీసులు వచ్చారు. నేను లేనని తెలుసుకొని తిరిగి వెళ్లిపోయారు’ అని మురుగదాస్ ట్వీట్ చేశారు. ఈ పరిస్థితుల్లో మురుగదాస్ ముందస్తు బెయిల్‌కి దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 27 వరకూ ఆయన్ని అరెస్ట్ చేయకూడదని చెన్నై కోర్ట్ ఆదేశించింది. ఈ చిత్రాన్ని మళ్లీ సెన్సార్ చేసి, మూడు సన్నివేశాల్లో చిన్న కట్స్ చేయమని ఆదేశించారు. -
‘సర్కార్’పై ఏమిటీ అరాచకం!
పుస్తకాలు మొదలుకొని చలనచిత్రాలు, ఛాయాచిత్రాల వరకూ సృజనాత్మక రంగంలోని సకల పార్శా్వల్లోనికీ జొరబడి తమ మాటే చెల్లుబాటు కావాలంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చే ధోరణి ఉన్నకొద్దీ పెరుగుతోంది. సర్వోన్నత న్యాయస్థానం పదే పదే చెప్పినా ఈ విషయంలో ఏ మార్పూ రావడం లేదు. తాజాగా వివిధ భాషల్లో విడుదలైన తమిళ చిత్రం ‘సర్కార్’ చుట్టూ ఆ మాదిరి వివాదమే రాజుకుంది. అందులోని కొన్ని సన్నివేశాలు తమ పార్టీ అధినేత జయలలితను, ఆమె తీసుకొచ్చిన జన సంక్షేమ పథకాలను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ పాలక అన్నా డీఎంకే కార్యకర్తలు తమిళనాడులోని థియేటర్లపై పడ్డారు. ఆ చిత్రం బ్యానర్లు, పోస్టర్లు చించి కటౌట్లు ధ్వంసం చేశారు. మంత్రులు ఆ చిత్ర కథానాయకుడు విజయ్, దర్శకుడు మురుగదాస్‌లకు వ్యతిరేకంగా ప్రకటనలి చ్చారు. ఒక మంత్రి ‘దేశద్రోహం’ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కొన్ని సన్నివేశాలు ప్రభుత్వా నికి వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నది అన్నాడీఎంకే నేతల అభియోగం. మురుగ దాస్‌పై ఫిర్యాదు రావడం తరవాయిగా ఆయన ఇంటిపై రాత్రికి రాత్రే పోలీసులు దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక సాధారణ పౌరుడెవరైనా తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇంత వేగంగా కదులుతారా? మురుగదాస్ తెల్లారి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. చివరకు అన్నా డీఎంకే కార్యకర్తలకు అభ్యంతరకరం అనిపించిన సన్నివేశాల తొలగింపునకు, కొన్ని పదాలు వినబడకుండా చేసేందుకు చిత్ర నిర్మాతలు అంగీ కరించాల్సి వచ్చింది. తమ అధినేతను అవమానించినవారిని సాష్టాంగపడేలా చేయగలిగామన్న సంతృప్తి అన్నా డీఎంకే నేతలకు ఉండొచ్చు. కానీ సాధారణ ప్రజలకు ఇదెలాంటి సందేశాన్ని పంపు తుంది? బలప్రయోగంతో దేన్నయినా సాధించుకోగలమన్న అభిప్రాయం కలిగించదా? ప్రభుత్వా నికి సారథ్యం వహించే పార్టీకి ఇది మంచి చేస్తుందా? రేపెవరైనా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇదే మార్గాన్ని అనుసరిస్తే ముఖ్యమంత్రి పళనిస్వామి ఏం చేస్తారు? ప్రజలు ఎన్నికల్లో ఓట్లేసి అధి కారం కట్టబెట్టేది తమ సమస్యలు పరిష్కరించడానికి. అంతేతప్ప తమకు శిరోభారం కలిగించమని కాదు. కానీ అది పుస్తకం కావొచ్చు, అయ్యప్ప సన్నిధికి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు నిర్ణయం కావొచ్చు... దేన్లోనైనా వివాదం రెచ్చగొట్టి లబ్ధిపొందుదామని చూసే ధోరణి రాజ కీయ నాయకుల్లో పెరుగుతోంది. ఏదైనా కళారూపంపై అందరికీ ఏకీభావం ఉండాలని లేదు. దాన్ని మెచ్చేవారున్నట్టే, అదంటే నచ్చనివారు కూడా ఉంటారు. రచయితలైనా, కళాకారులైనా సమాజంలో జరిగేవాటిని విమర్శ నాత్మకంగా ప్రతిబింబిస్తారు తప్ప దేన్నీ గాల్లోంచి సృష్టించలేరు. మనకు రోజూ తారసపడేదే అయినా, అది మన అనుభవంలోకి పదే పదే వస్తున్నా మనం చూడని భిన్న కోణాన్ని వారు అందులో స్పృశించి ఉండొచ్చు. అది సరైంది కాదనుకునేవారు దాన్ని నిశితంగా విమర్శించవచ్చు. నిరసన వ్యక్తం చేయొచ్చు. అదెలా తప్పో నిరూపించవచ్చు. న్యాయస్థానాల్ని సైతం ఆశ్రయించ వచ్చు. కానీ ఈ మార్గాలను వదిలిపెట్టి ఆవేశంతో రోడ్లెక్కి వ్యక్తులపై దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తుంది. కానీ చిత్రమేమంటే ఆవేశంతో చెలరేగే గుంపులు మాత్రమే కాదు... ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే నేతలు సైతం ఇలాంటి పనులు చేయడానికి వెరవడం లేదు. జనాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించి వారి మెప్పు పొందాలని ఒకప్పుడు పార్టీలు తహతహలాడేవి. ఇప్పుడు రోజులు మారాయి. తామను కునే అభిప్రాయాన్ని వారిపై రుద్ది, దాన్ని జనాభిప్రాయంగా చలామణి చేసి ఆ వంకన ‘బ్లాక్‌మెయి లింగ్’కు దిగే ధోరణి పెరిగిపోయింది. ‘పద్మావత్’ చిత్రం పడిన కష్టాలు ఇందుకు ఉదాహరణ. షూటింగ్ జరుపుకునే దశ నుంచి దానిపై కర్ణి సేన దాడులు చేస్తూ వచ్చింది. ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తలలు తీసుకొచ్చినవారికి రూ. 5 కోట్లిస్తామనే వరకూ వ్యవహారం వెళ్లింది. చివరకు ఆ చిత్రంలో తామనుకున్నట్టు ఎలాంటి అభ్యంతరకర సన్నివే శాలూ లేవని తెలిసినా ఈ గుంపు విధ్వంస పోకడల్ని విడనాడలేదు. తమిళనాడు థియేటర్ యజ మానుల సంఘం నాయకుడు సుబ్రమణియమ్ ఆవేదన గమనించదగ్గది. రాజకీయ పార్టీలకూ, నటులకూ మధ్య వివాదం తలెత్తినప్పుడల్లా తమ ఆస్తులు ధ్వంసమవుతున్నాయని, వ్యాపారం దెబ్బతింటున్నదని ఆయన చెప్పారు. నిజమే... ప్రముఖ నటుడు రజనీకాంత్ చిత్రం ‘కాలా’పై ఆర్నెల్లక్రితం ఇలాంటి వివాదమే చెలరేగింది. అనేక కారణాలు చెప్పి ‘కాలా’కు అడ్డంకులు సృష్టిం చేందుకు అటు కర్ణాటకలో, ఇటు తమిళనాడులో అనేక సంఘాలు ప్రయత్నించాయి. చివరకు ఆ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది. ఇప్పుడు ‘సర్కార్’కు కూడా అవరోధాలు తప్పలేదు. మన కున్న కళారూపాల్లో సినిమా అనేది కోట్లాది రూపాయలతో ముడిపడి ఉన్న వ్యాపారం. ఏవో సాకులు చెప్పి అడ్డుకోవాలని చూడటం భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడం మాత్రమే కాదు... దానిపై ఆధారపడి ఉన్న వందల కుటుంబాల జీవికను దెబ్బతీయడం. తమిళనాడు ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. చలనచిత్రాలను చూసి, అవి ప్రదర్శనయోగ్యంగా లేవనుకుంటే కత్తిరించడానికి లేదా మొత్తంగా అనుమతి నిరా కరించడానికి ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు వంటివి ఉన్నాయి. వాటిపై ఆఖరి మాట చెప్పడానికి న్యాయస్థానాలున్నాయి. అసలు ప్రజాస్వామ్యంలో ఈ సెన్సారింగ్ విధానమే సరికాదని వాద నలొస్తున్న తరుణంలో...రాజకీయ పార్టీలు, కులసంఘాలు సెన్సారింగ్ బాధ్యతను తమ భుజాలకెత్తుకుని అధికారం అండతో గొడవలు సృష్టించడం, బెదిరింపులకు దిగడం దారుణం. రాజ్యాంగంపై, చట్టాలపై విశ్వాసమున్నదని చెబుతున్నవారు ఇలాంటి పోకడలకు పోవడం సరికాదు. -
మురుగదాస్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, చెన్నై: సర్కార్ మూవీ తమిళనాట పలు వివాదాలకు కేంద్రబిందువవుతోంది. ఈ సినిమాలోని కొన్ని డైలాగులు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని పాలక ఏఐఏడీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈనెల 27 వరకూ సర్కార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌ను అరెస్ట్ చేయవద్దని మద్రాస్ హైకోర్ట్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐఏడీఎంకే నేతలు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చేపట్టిన నిరసనలకు తలొగ్గిన చిత్ర మేకర్లు వివాదాస్పద సంభాషణలను తొలగించేందుకు అంగీకరించారు. చిత్ర దర్శకుడు మురుగదాస్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఏ ఒక్కరినీ బాధపెట్టాలన్నది తన ఉద్దేశం కాదని మురుగదాస్ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా మురుగదాస్‌ను అరెస్ట్ చేసేందుకు చెన్నై పోలీసులు సిద్ధమయ్యారని గురువారం రాత్రి చిత్ర నిర్మాతలు సన్ పిక్చర్స్ ట్వీట్ చేయగా, పోలీసు అధికారులు దీన్ని తోసిపుచ్చారు. రొటీన్ గస్తీలో భాగంగా ఆ ప్రాంతంలో పోలీస్ బృందం పహారాలో ఉందని వివరణ ఇచ్చారు. మరోవైపు గత రాత్రి పోలీసులు తమ ఇంటికి వచ్చి తన తలుపు తట్టారని, ఆ సమయంలో తాను ఇంట్లో లేకపోవడంతో వారు వెనుదిరిగారని, ప్రస్తుతం తన ఇంటి వద్ద పోలీసులు ఎవరూ లేరని తనకు తెలిసిందని దర్శకుడు మురుగదాస్ ఆ తర్వాత ట్వీట్ చేశారు. సర్కార్ మూవీకి నిరసనల సెగతో రజనీకాంత్, కమల్‌హాసన్ చిత్ర బృందానికి బాసటగా నిలిచారు. ఒత్తిడి పెంచేందుకు ఇలాంటి చర్యలను ఎంచుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. కాగా సర్కార్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు.విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలైన రెండు రోజులకే రూ 100 కోట్ల క్లబ్లో చేరింది. -
సర్కార్ ఎఫెక్ట్: పీక్స్‌లో 49-పీ
స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్, ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సర్కార్’ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా అభ్యంతరకరమైన దృశ్యాలంటూ తమిళనాడు సర్కార్ గుర్రుగా ఉండటం ఒక ఎత్తయితే.. ఈ మూవీ ఒక కీలక అంశంపై చర్చకు తెరతీయడం మరోఎత్తు. అదే సెక్షన్ 49-పీ. ఓటు హక్కుపై అవగాహనపెంచడం ద్వారా సమాజంలో మార్పు తేవడానికి కొంత ప్రయత్నం చేసిన ఈ మూవీ 49-పీ అంశాన్ని చర్చకు తెచ్చిందంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో. ఈ మూవీలో 49పీ’ అనే ప్రస్తావన హీరో విజయ్ ద్వారా తేవడంతో ఒక్కసారిగా 49-పీపై జనానికి ఆసక్తి పెరిగింది. సర్కార్ మూవీని దర్శించిన ప్రేక్షకజనం గూగుల్‌లో 49పీ’ కోసం భారీగా సెర్చ్ చేసేశారు. దీంతో గూగుల్ ట్రెండింగ్ అనలిటిక్స్‌లో టాప్‌లో నిలిచింది. సినిమా విడుదలైన 24 గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో సర్కార్ మూవీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ విషయాన్ని ట్విటర్లో పోస్ట్ చేసింది. చర్చకు నేపథ్యం సన్ పిక్చర్స్ బ్యానర్ లో విడుదలైన ఈ సినిమా తమిళంతో పాటుగా, తెలుగులోనూ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే ఈ మూవీ కథలో ఎన్నారై సుందర్ రామస్వామి (విజయ్) ప్రపంచంలో నెంబర్ వన్ కార్పొరేట్ సంస్థకు సీఈవో పని చేస్తుంటారు. ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇండియాకు వస్తాడు. ఈ క్రమంలో ఆయన ఓటు ఎవరో దొంగ ఓటు వేస్తారు. ఈ క్రమంలో ‘సెక్షన్ 49పి’ అంటూ ఒక చట్టాన్ని బయటపెడతారు. దీంతో ‘సెక్షన్ 49పి’ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు ఇలాంటి సెక్షన్ ఒకటుందని ఆ విషయం తమకు తెలియదని, సినిమా ద్వారా ఈ విషయాన్నీ తెలియజేసినందుకు సర్కార్ యూనిట్ తోపాటు, తమఅభిమాన హీరో విజయ్‌కు కూడా ధన్యవాదాలు చెబుతున్నారు ఫ్యాన్స్. 49-పీ అంటే ఏమిటి? తన ఓటును మరొకరు వేసి దుర్వినియోగపర్చినప్పుడు, ఒక పౌరుడు తన ఓటును కాపాడుకునేందుకు రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. పోలింగ్ సమయంలో తన ఓటును ఎవరైనా వేసినట్టు సదరు ఓటురు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలింగ్ బూత్‌కు వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమని అధికారులను కోరే అవకాశాన్ని ఈ సెక్షన్ పౌరుడికి కల్పిస్తుంది. ‘కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961’లోని సెక్షన్ 49పీ చెబుతున్న అంశం ఇదే! ఈ విషయాన్నే ‘సర్కార్’ మూవీలో హీరో విజయ్ చేత చెప్పించారు డైరెక్టర్ మురుగదాస్. మరోవైపు తమిళనాడు సర్కార్ గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈ చిత్రంలో అభ్యంతరకరమైన సన్నివేశాలను, డైలాగులను తొలగించేందుకు ఈ మూవీ మేకర్స్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఓటర్లకు మిక్సర్ గ్రైండ్లను అభ్యర్థులు పంపిణీ చేసే సీన్ తో సహా..ఇంకా పలు వివాదాస్పద డైలాగులను ఎడిట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. Google search trends peak for #49P after the release of #Sarkar. https://t.co/677MFHqDia@ARMurugadoss #BlockBusterSarkar #Thalapathykingofboxoffice pic.twitter.com/szBBPY1vIH — Sun Pictures (@sunpictures) November 7, 2018 -
‘సర్కార్’ వివాదంపై కుదిరిన సయోధ్య
చెన్నై: తమిళ హీరో విజయ్, కీర్తి సురేశ్ జంటగా ప్రముఖ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ‘సర్కార్’ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. తమిళనాడు దిగవంత సీఎం జయలలిత, ఆమె ప్రవేశపెట్టిన ఉచిత పథకాలపై విమర్శనాత్మకంగా ఉన్న కొన్ని సీన్లను తొలగించాలని తమిళనాడు మంత్రులతో పాటు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ సీన్లను తొలగించకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సినిమాలోని అభ్యంతకరమైన సీన్లను తొలగించేందుకు నిర్మాతలు అంగీకరించారు. శుక్రవారం సాయంత్రం నుంచి సదరు సీన్లను తొలగించిన సినిమాను ప్రదర్శిస్తామని వెల్లడించారు. -
‘సూపర్ స్టార్ అంటే స్టార్డమ్ మాత్రమే కాదు’
ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించిన యంగ్ హీరో కార్తికేయ, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కార్తీకేయ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. దీపావళి కానుకగా విడుదలైన విజయ్, మురుగదాస్‌ల సర్కార్ సినిమాపై మహేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. సర్కార్ బాగుందంటూ మహేష్ చేసిన ట్వీట్‌కు మురుగదాస్ రిప్లై కూడా ఇచ్చాడు. తాజాగా ఈ ట్వీట్ పై స్పందించిన కార్తికేయ ‘సూపర్‌స్టార్ గా ఉండటం అంటే స్టార్డమ్ మాత్రమే కాదు. మహేష్ సర్ లాంటి వారు చూపించే యాటిట్యూడ్ అది. స్పైడర్ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినా.. మురుగదాస్ గారి పట్ల మహేష్ గారి గౌరవం అలాగే ఉంది. ఒక స్టార్ మరో స్టార్ హీరో సినిమాను ప్రమోట్ చేయటం చాలా గొప్ప విషయం’ అంటూ ట్వీట్ చేశాడు కార్తికేయ. Being a superstar is not just about stardom,its the attitude they carry that makes one like our @urstrulyMahesh sir. .Though spyder didnot reach the expectations his respect for @ARMurugadoss sir is the same and best part is promoting #sarkar made with another star. https://t.co/aM8QSmCQoe — Kartikeya (@ActorKartikeya) 7 November 2018 -
వంద కోట్లు కొల్లగొట్టిన ‘సర్కార్’!
ఇళయ దళపతి విజయ్ సినిమా అంటేనే బాక్సాఫీస్‌లు బయపడుతుంటాయి. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా రికార్డులను వేటాడేస్తుంది. ఇంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ ఈ మంగళవారం ‘సర్కార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్ హిట్లను తన అభిమానులకు అందించిన విజయ్.. ఈ సారి సర్కార్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా మొదటిరోజే కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఒక్క మొదటిరోజే తమిళనాడులో దాదాపు ముప్పై కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2.32కోట్లు, కేరళలో దాదాపు 6కోట్లను కలెక్ట్ చేసి.. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికాల్లో ఈ సినిమా దూసుకెళ్తోంది. ఈ మూవీ రెండు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను దాదాపు 3400 స్ర్కీన్స్‌పై విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం మెర్సెల్ రికార్డులను అధిగమించేట్టుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. #Sarkar100CrIn2Days According to Team #Sarkar , the movie has crossed 100 Crs gross WW in 2 Days.. pic.twitter.com/HlrRPftudJ — Ramesh Bala (@rameshlaus) November 8, 2018 -
గూగుల్ సర్చ్‌లో ఇప్పుడు అదే టాప్!
మనకు ఏ విషయం గురించి తెలియకపోయినా.. వెంటనే చేసే పని గూగుల్‌లో వెతకడం. గూగుల్‌లో ఎప్పుడు ఏదీ ఎలా ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టమే. రోజుకు కొన్ని కోట్ల మంది గూగుల్‌లో ఏదో ఒక విషయం గురించి సర్చ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఇలా ఎక్కువమంది టాపిక్ ఏంటో తెలుసా?. విజయ్ నటించిన సర్కార్ మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో దొంగ ఓట్ల నేపథ్యంలో తెరకెక్కించగా.. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే ఈ సినిమాలో సెక్షన్ 49పి అనే టాపిక్ హైలెట్‌గా మారింది. కథ అంతా ఈ సెక్షన్ చుట్టూనే తిరుగుతుంది. ఈ సెక్షన్ ప్రకారం పోలింగ్ సమయంలో తన ఓటును ఎవరైనా వేసినట్టు ఓటరు గుర్తిస్తే వెంటనే ఆ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమనీ, మళ్లీ తన ఓటు తాను వేసుకునే వీలు కల్పించమని అడిగే హక్కు ఓటరుకు ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి సెక్షన్ ఒకటి ఉందని తెలియని నెటిజన్లు దీని గురించి గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారట. -
‘సర్కార్’పై వివాదం.. సన్నివేశాలు తొలగించాలని డిమాండ్!
తమిళనాట విజయ్ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తుంటారో తెలిసిందే. అయితే ఆయన సినిమాలను వివాదాల్లోకి లాగడానికి కూడా ఎదురుచూసేవాళ్లు ఉంటారు. ఈయన చిత్రాలు వివాదాలు సృష్టించడం కొత్తేంకాదు. ఈయన గత చిత్రం మెర్సెల్‌లో జీఎస్టీ, భారత ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలపై చిత్రీకరించిన సన్నివేశాలను తొలగించాల్సిందిగా కొంతమంది నానారచ్చ చేశారు. చివరగా వాటికి సంబంధించిన సన్నివేశాల్లో మాటలను కట్ చేశారు. వివాదాలతోనే ఈయన సినిమాలు మరింత దూసుకెళ్తున్నాయి. మెర్సెల్ అంతగా విజయం సాధించడానికి అది కూడా ఒక కారణమే. అయితే రీసెంట్గా విడుదలైన సర్కార్... కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా కూడా రాజకీయ వ్యవస్థపైనే చిత్రీకరించారు. ఇందులో జయలలితను తప్పుగా చూపించారంటూ అన్నాడీఎంకే మంత్రులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి ఇంతకి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు.