ఆయన అలానే సెట్‌లోకి వస్తారు : కీర్తి సురేష్‌ | Keerthy Suresh Chit Chat In Sarkar Promotions | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 1 2018 7:17 PM | Last Updated on Thu, Nov 1 2018 7:17 PM

Keerthy Suresh Chit Chat In Sarkar Promotions - Sakshi

తమిళసినిమా : అతి చిన్న వయసు, అంతే కాదు అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్‌. మలయాళం, తమిళ్‌, తెలుగు భాషల్లో దూసుకుపోతున్న బహుభాషా నటి కీర్తీ. 2015 విక్రమ్‌ప్రభుకు జంటగా ‘ఇదు ఎన్న మాయం’ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ మూడేళ్లలోనే విజయ్, విశాల్, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్‌ అంటూ స్టార్‌ హీరోలందరితోనూ నటించి క్రేజీ కథానాయకిగా రాణిస్తోంది. తాజాగా ఈ అమ్మడు విజయ్‌తో రొమాన్స్‌ చేసిన సర్కార్‌ చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 6న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా కీర్తీసురేశ్‌తో చిన్న చిట్‌చాట్‌..

ప్ర: విజయ్‌ సహా పలువురు స్టార్‌ హీరోలతో జత కట్టారు. అజిత్‌తో నటించేదెప్పుడు?
జ: త్వరలోనే అదీ జరుగుతుందని భావిస్తున్నాను. అజిత్‌తో నటించడం కోసం ఎదురుచూస్తున్నాను.

ప్ర: మహానటి చిత్రానికి ముందు, ఆ తరువాత అన్నంతగా నటిగా ఉన్నత స్థాయికి ఎదిగారు. దీని గురించి మీకేమనిపిస్తుంది?
జ: మహానటి నా జీవితంలో గొప్ప చిత్రం. అలాంటి చిత్రం ఎప్పుడో ఒకసారి గానీ అమరదు. అలాంటి అవకాశం రావడం నిజంగా కష్టమే.

ప్ర: నటి కావడంతో మీ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోయానని అనుకుంటున్నారా?
జ: ఈ విషయంలో పలుమార్లు బాధ పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రైవెసీ కోసం బయట ప్రపంచంలో స్వేచ్ఛగా తిరగాలంటే నటి అనే ఈ కీర్తీని పొందలేను. మనం అనుకున్నవన్నీ జరిగితే జీవితంలో అర్థమే ఉండదు. ఒకటి కావాలంటే మరొకటి కోల్పోవాల్సి ఉంటుందన్నదాన్ని అర్థం చేసుకున్నాను. అయితే ఇప్పుడు దుప్పట ముఖానికి చుట్టుకుంటే బయట ప్రపంచానికి తెలియదు కదా. అలా నేనూ చాలా సార్లు షాపింగ్‌ చేశాను. చాలా థ్రిల్లింగ్‌ అనిపించింది.

ప్ర: గాయని కీర్తీసురేశ్‌ గురించి చెప్పండి?
జ: పాడడం, డాన్స్‌ కొద్దిగా నేర్చుకున్నాను.అయితే నేను పెద్ద గాయనిని కాదు.బాత్‌రూమ్‌ గాయనినే. ఇప్పుడు ఎవరైనా పాడవచ్చన్నట్టు మారిందిగా.

ప్ర: సినిమాలో ఏం సాధించాలని కోరుకుంటున్నారు?
జ: సాధించాలన్న ఆశ ఏమీ లేదు.అయితే నేను రాసిన కథను అక్క దర్శకత్వంలో నాన్న చిత్రం నిర్మించాలని, అందులో అమ్మ, అమ్మమ్మ, నేను కలిసి నటించాలన్న ఆశ మాత్రం ఉంది. మరో విషయం ఏమిటంటే నా కథకు కథనం, మాటలను అందిస్తానని దర్శకుడు లింగుస్వామి చెప్పారు.

ప్ర: విశాల్‌తో నటించిన అనుభవం గురించి?
జ: విశాల్‌ షూటింగ్‌ స్పాట్‌లో ఎప్పుడూ చేతిలో ఫోన్‌తోనే ఉంటారు. ఆయనకు మరో చెయ్యి ఉంటే దానిలోనూ ఫోనే ఉంటుందనిపిస్తుంది.ఆయన అలానే సెట్‌లోకి వస్తారు. విశాల్‌ చాలా ఫ్రెండ్లీ.

ప్ర: విజయ్‌తో బైరవా చిత్రం తరువాత సర్కార్‌ చిత్రంలో నటించడం గురించి?
జ: నటినవ్వక ముందు మీలాగే నేను ఆయన్ని తెరపై చూసి ఆనందించాను. అలాంటిది ఇప్పుడు ఆయనకు జంటగా రెండు చిత్రాల్లో నటించాను. విజయ్‌ను చూసి ఈలలు వేసి చప్పట్లు కొట్టిన నేనేనా ఆయనతో కలిసి నటించానన్నది ఒక్కోసారి నమ్మశక్యం కానంతగా ఆశ్యర్యపోతుంటాను. సర్కార్‌ చిత్రం డబుల్‌ ధమాకా అన్నది విజయ్‌ అభిమానులకే కాదు నాకు కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement