కోర్టులోనే తేల్చుకుంటానన్న మురుగదాస్‌! | AR Murugadoss Respond On Dispute Sarkar Story | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 28 2018 12:02 PM | Last Updated on Sun, Oct 28 2018 4:30 PM

AR Murugadoss Respond On Dispute Sarkar Story - Sakshi

తమిళ సెన్సేషన్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌, ఇళయ దళపతి విజయ్‌ కాంబినేషన్‌ అంటే తమిళనాట బాక్సాఫీస్‌ రికార్డులు క్రియేట్‌ అవ్వాల్సిందే. ఇప్పటికే తుపాకి, కత్తి సినిమాలతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌లు కొట్టిన ఈ కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టడానికి రెడీ అయ్యింది. తాజాగా కార్పోరేట్‌ క్రైమ్‌ నేపథ్యంలో తెరకెక్కిన సర్కార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు.  

అయితే ఇంతలోనే ఈ సినిమా కథ తనదేనంటూ కొన్ని సంవత్సరాల క్రితమే ఈ కథను తాను రిజిస్టర్‌ చేశానంటూ వరుణ్‌ రాజేంద్రన్‌ అనే వ్యక్తి కేసు వేశాడు. అయితే దీనిపై మురుగదాస్‌ స్పందిస్తూ.. ఇది పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడని, ఇంకా విడుదల కాకుండానే ఈ కథ ఆయనదేనని ఎలా అంటాడని, ఈ విషయాన్ని తాను కోర్టులోనే తేల్చుకుంటానని తెలిపాడు. అయితే వరుణ్‌ మాత్రం తనకు రూ.30లక్షల నగదు, టైటిల్స్‌లో స్టోరీ క్రెడిట్‌ ఇవ్వాలని డిమాండ్‌చేసినట్లు తెలుస్తోంది. కీర్తి సురేశ్‌, వరలక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని దీపావళి కానుకగా నవంబర్‌ 6న విడుదల చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement