‘సర్కార్‌’ హైదరాబాద్‌కు వస్తున్నాడా? | Vijay Sarkar Pre Release Event At Hyderabad On 29th October | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 22 2018 8:12 PM | Last Updated on Mon, Oct 22 2018 8:59 PM

Vijay Sarkar Pre Release Event At Hyderabad On 29th October - Sakshi

ఇళయ దళపతి విజయ్‌ హైదరాబాద్‌కు విచ్చేస్తున్నాడు. స్టార్‌ డైరెక్టర్‌ ఏ ఆర్‌ మురుగదాస్‌, విజయ్‌ కాంబినేషన్‌లో సర్కార్‌ సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. ఇటీవలె విడుదల చేసిన సర్కార్‌ టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. 

అయితే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను అక్టోబర్‌ 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు , ఈ వేడుకకు విజయ్‌ హాజరుకానున్నట్లు సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ విజయ్‌ పీఆర్‌ టీమ్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దంటూ అభిమానులకు సూచించింది. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ ఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement