బాలయ్యకు బిగ్బి నో చెప్పాడా..? | Amitabh Bachchan Is NOT A Part Of Balakrishna's Rythu | Sakshi
Sakshi News home page

బాలయ్యకు బిగ్బి నో చెప్పాడా..?

Published Tue, Nov 15 2016 10:26 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలయ్యకు బిగ్బి నో చెప్పాడా..? - Sakshi

బాలయ్యకు బిగ్బి నో చెప్పాడా..?

ప్రస్తుతం గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా పనుల్లో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ, కొద్ది రోజుల క్రితం సర్కార్ 3 సెట్స్లో బిగ్బి అమితాబ్ బచ్చన్ను కలిసారు.  ఆ సమయంలో బాలయ్యతో పాటు కృష్ణవంశీ కూడా ఉండటంతో ఈ భేటి మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తన 100వ సినిమాలో నటిస్తున్న బాలయ్య, ఆ తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమా చేయనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు అమితాబ్ను సంప్రదించారన్న టాక్ వినిపించింది. అంతేకాదు అమితాబ్ కూడా బాలయ్య సినిమాలో గెస్ట్ రోల్లో నటించేందుకు అంగీకరించారని, త్వరలోనే అధికారంగా ఎనౌన్స్మెంట్ కూడా వస్తుందని భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం బిగ్ బి బాలయ్య సినిమాకు నో చెప్పాడట. ప్రస్తుతం పలు చిత్రాలతో పాటు కమర్షియల్ యాడ్స్తో బిజీగా ఉన్న అమితాబ్ బాలయ్య సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట. దీంతో బాలయ్య సినిమాలో బిగ్బి కనిపించే అవకాశం లేదన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement