Rythu
-
పోరాటం ఫలించింది!
దుద్యాల్: వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండల పరిధిలోని ప్రలు గ్రామాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో బాధిత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటం ఫలించిందని, ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే ఫార్మా కంపెనీల రాకను అడ్డుకోగలిగామని పోలేపల్లి, రోటిబండ తండా, పులిచర్లకుంట తండా, లగచర్ల, హకీంపేట్ గ్రామాల ప్రజలు సంబరపడుతున్నారు. వ్యవసాయ భూములే తమ కు దిక్కని, ఇతర కంపెనీల ఏర్పాటుపై కూడా ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.లగచర్లలో భూసేకరణపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు వెళ్లిన కలెక్టర్ సహా ఉన్నతాధికారులపై స్థానికులు దాడి చేశారనే వార్తలు సంచలనం సృష్టించాయి. లగచర్ల ఘటన తర్వాత ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గురించి దేశ వ్యాప్త చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావించిన సీఎం.. దుద్యాల్ మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పా టును రద్దు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ఐదు గ్రామాల్లో 1,358.37 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే.. ఫార్మా విలేజ్ కోసం భూములు సేకరించేందుకు మండల పరిధిలోని పోలేపల్లిలో గత అక్టోబర్ 18న ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించగా అధికారులు నమోదు చేసుకున్నారు. ఎలాంటి గొడవలు లేకుండానే సమావేశం పూర్తయింది. అనంతరం అక్టోబర్ 25న లగచర్లలో చేపట్టిన సమావేశానికి వస్తున్న కాంగ్రెస్ పార్టీ దుద్యాల్ మండల అధ్యక్షుడు అవుటి శేఖర్ వాహనాన్ని రోటిబండతండా వద్ద ఆపారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులను దుర్భాషలాడటంతో ఆగ్రహానికి గురైన తండా వాసులు ఆయనపై దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో అప్పటి ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం అర్ధంతరంగా నిలిచిపోయింది.ఆ తర్వాత నవంబర్ 11న లగచర్ల రైతుల ప్రజాభిప్రాయ సేకరణ కొరకు దుద్యాల్, లగచర్ల మధ్య సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర ప్రసాద్, తహసీల్దార్ కిషన్ తదితరులు సమావేశ స్థలానికి చేరుకున్నారు. కానీ రైతులెవరూ అక్కడికి రాకపోవడంతో అధికారులు లగచర్లకు వెళ్లారు. గ్రామస్తులకు విషయం వివరించేందుకు ప్రయతి్నస్తుండగానే అధికారులపై దాడి తదనంతర పరిణామాలు చోటు చేసుకున్నాయి. -
సంపూర్ణ రుణమాఫీ జరిగే వరకు పోరాటం
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని పేర్కొంటూ, ఇందుకు నిరసనగా భారత్ రాష్ట్ర సమితి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన రైతు ధర్నాలో పాల్గొన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం తీరును ఎండగట్టారు. రేవంత్ ప్రభుత్వం మెడలు వంచి సంపూర్ణ రైతు రుణమాఫీ జరిగేంతవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.కేటీఆర్ చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు రైతు ధర్నాలో పాల్గొన్నారు. రైతులతో కలిసి నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆలేరు, జనగామ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో దేవుళ్ల మీద ఒట్లు వేసి సీఎం రేవంత్ రైతులను మోసగించారంటూ, ఆయన చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కాకుండా రక్షించాలని యాదాద్రి ఆలయం తూర్పు రాజగోపురం వద్ద హరీశ్‌రావు పాప పరిహార పూజలు చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు, పరస్పర దాడులతో ఉద్రిక్తత నెలకొంది.ఈ సందరభంగా గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కుమార్ పరామర్శించారు. కొన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని ధర్నా శిబిరాల్లో రైతులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఎమ్మె ల్సీలు, ఇతర నేతలు ధర్నాకు నేతృత్వం వహించారు.తిరుమలగిరిలో రాళ్లు, కోడిగుడ్లతో పరస్పరం దాడులుతిరుమలగిరి (తుంగతుర్తి): సూర్యాపేట జిల్లా తిరుమల గిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు గురువారం పోటాపోటీగా చేపట్టిన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారితీశాయి. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టణ చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఇందుకు పోటీగా అదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు. బీఆర్ఎస్ శిబిరం వద్ద పలువురు నాయకులు మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ శిబిరం వైపు వెళ్లడానికి ప్రయత్నించారు.పోలీసులు అడ్డుకున్నప్పటికీ కొంతమంది నాయకులు బారికేడ్లను తోసుకొని శిబిరం వద్దకు వెళ్లడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, రాళ్లు, టమాటాలు విసురుకున్నారు. దీంతో ప్రజలు, ఆర్టీసీ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాళ్లు రువ్విన సంఘటనలో రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరు పార్టీల నాయకులకు స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేసి అందరినీ చెదరగొట్టారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. సూర్యాపేట డీఎస్పీ రవి ఆధ్వర్యంలో సాయంత్రం వరకు పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. సీఎం డైరెక్షన్లోనే బీఆర్ఎస్పై దాడులు: జగదీశ్‌రెడ్డి సంపూర్ణ రైతురుణ మాఫీ కోసం తిరుమలగిరిలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్లోనే బీఆర్ఎస్పై దాడులు జరుగుతున్నా యని ఆయన ఆరోపించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వరదలో చిక్కుకున్న ట్రాక్టర్
-
నీ గాడ్ ఫాదర్‌కే భయపడలేదు
సాక్షి, హైదరాబాద్: ‘రైతు రుణమాఫీని పాక్షికంగా అమలు చేసి లక్షలాది మంది రైతులకు ఎగనామం పెట్టి.. సీఎం నోరు పెద్దగా చేసుకుని మాట్లాడితే లాభం ఉండదు. బూతులు తిడితే రుణమాఫీ జరిగి రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా. దమ్ముంటే ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో శ్వేతపత్రం విడుదల చేయి. తప్పు జరిగిందని రైతులకు క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘రుణమాఫీలో కోతలపై ప్రశ్నిస్తే మేము చావాలని రోత మాటలు మాట్లాడుతున్నాడు. నీ గాడ్ ఫాదర్‌కే భయపడలేదు. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. రైతులందరికీ రుణమాఫీ వర్తించేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌ను వదిలి పెట్టం. బీఆర్ఎస్ పక్షాన మరో రైతాంగ ఉద్యమానికి త్వరలో కార్యాచరణ ప్రకటించి పోరాటం చేస్తాం’ అని హరీశ్‌రావు ప్రకటించారు. సిద్దిపేటలో తన క్యాంపు ఆఫీసుపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఇలాంటి దాడులకు భయపడేది లేదని, ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.ఎక్కడికి రమ్మంటావో దమ్ముంటే చెప్పు‘రైతులందరికీ రుణమాఫీ జరిగిందని మభ్యపెడుతూ మోసగిస్తున్న రేవంత్‌రెడ్డి సిద్దిపేట, కొడంగల్ సహా ఏ నియోజకవర్గానికి ఏ తేదీన, ఏ టైమ్‌కు రావాలో దమ్ముంటే చెప్పాలి. రైతులందరికి రుణమాఫీ జరిగిందని నిరూపించాలి. ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారంటీల సంపూర్ణ అమలు చేయాలనే నా డిమాండ్‌ను పక్కన పెట్టి నేను రాజీనామా చేయాలని రంకెలు వేస్తున్నవు. రుణమాఫీ జరగని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటూ వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతూ అధికారుల కాళ్ల మీద పడుతున్నరు.అయినా ప్రభుత్వం కళ్లు, చెవులు, నోరు లేనట్లు వ్యవహరిస్తోంది’ అని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘పరిపాలన ఫ్లాప్.. తొండి చేయడంలో తోపు.. బూతులు మాట్లాడ్డంలో టాప్ అన్నట్లుగా రేవంత్ పనితీరు ఉంది. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగవేసినట్లు ప్రభుత్వ రికార్డులే చెప్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రుణమాపీ అర్హుల సంఖ్య 47 లక్షలుగా చూపి, మూడు విడతల్లో 22 లక్షల మందికే వర్తింప చేశారు’ అని చెప్పారు.ప్రజలకు కీడు చేయొద్దని వేడుకుంటా..‘ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తానంటూ గుడులు, చర్చి, మసీదు సాక్షిగా హిందూ, క్రిస్టియన్లు, ముస్లింలు నమ్ముకున్న దేవుళ్లపై రేవంత్ ఒట్లు వేసి మాట తప్పి రైతు, దైవద్రోహానికి పాల్పడ్డాడు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు. అది రాష్ట్రానికి చుట్టుకుంటుందని ప్రజలు భయపడుతున్నారు. ప్రాయశ్చిత్తం చేసుకునే ఉద్దేశం సీఎంకు లేదు కాబట్టి ఆయన చేసిన పాపం ప్రజలకు శాపం కావద్దని మా పార్టీ నేతలతో కలిసి నేను తీర్థయాత్రకు బయలుదేరుతా.ఈ పాపాత్ముడు చేసిన తప్పులకు ప్రజలకు కీడు చేయొద్దని ముక్కోటి దేవతలతోపాటు అల్లా, జీసస్‌ను వేడుకుంటా. త్వరలో పర్యటన షెడ్యూలు ప్రకటిస్తా’ అని హరీశ్ చెప్పారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, మాణిక్‌రావు, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
-
ప్రజాభిప్రాయమే జీవోగా రైతుభరోసా
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రజల అభిప్రాయాలనే ప్రభుత్వ ఉత్తర్వులుగా..చరిత్రాత్మక నిర్ణయంగా తీసుకురావడంలో ఎలాంటి సందేహం లేదని, రైతుభరోసా విషయంలో కూడా ప్రజల అభిప్రా యమే జీవోగా రాబోతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతుల అభిప్రా యాల మేరకు శాసనసభలో రైతుభరోసా పథకం రూపకల్పనకు చర్చిస్తామని చెప్పారు. సోమ వారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫ రెన్స్ హాల్లో రైతుభరోసా పథకం అమలు కోసం విధివిధానాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది.మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు జిల్లామంత్రులు మంత్రి కొండా సురే ఖ, ధనసరి అనసూయ (సీతక్క), ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, హాజరయ్యారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రైతులు, రైతుసంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతుభరోసా విషయంలో సంపూర్ణంగా ప్రజలు ఏం చెబితే దాన్నే అమ లు చేస్తామన్నారు. అందరి సూచనలు నోట్ చేసు కున్నామని, వాటిని ప్రభుత్వం పరిశీలిస్తుందని, అందరి అభిప్రాయానికి తగినట్టుగా సబ్‌కమిటీ నిర్ణయం తీసుకుంటుందని భట్టి విక్రమార్క చెప్పా రు. వరంగల్ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రైతు æభరోసా హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైతుభరోసాపై అసెంబ్లీలో ఒక రోజంతా చర్చిస్తామని, ఆ తర్వాత అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకుంటామని భట్టి పేర్కొన్నారు. రైతుల నోటా..వైఎస్ రాజశేఖరరెడ్డి మాటహన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడిన రైతుల్లో 90శాతం మంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావించారు. నాడు వైఎస్ వల్లనే ఉచిత విద్యుత్, మద్దతుధర, సబ్సిడీ విత్తనాలు, పంట బీమా వచ్చాయని తెలిపారు. ఆయన కాలంలో వ్యవసాయం పండుగలా సాగిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వ్యవసాయం గురించి, రైతుల గురించి పట్టించుకున్న ప్రభుత్వం, నాయకులు లేరన్నారు. రైతును రాజును చేయడానికి వైఎస్ కృషి చేశాడని కొనియాడారు. -
‘రైతు భరోసా’పై దృఢ సంకల్పంతో ఉన్నాం: భట్టి విక్రమార్క
సాక్షి, ఖమ్మం: రైతు భరోసా పథకంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి విస్తృత సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతుల నుంచి మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెజార్టీ రైతులు 10 ఎకరాల లోపు రైతు భరోసా ఇవ్వాలని మంత్రులు సూచించారు.బీడు భూములు, పంట సాగు చేయని వారికి ఇవ్వొద్దని సూచించారు.. ఇదే సందర్భంలో కౌలు రైతులకు సాగు చేయడానికి ఇచ్చిన పట్టా భూములు ఉన్న రైతులు అంగీకరణ పాత్రలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అని అడగగా రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. మీము ఇవ్వడానికి సిద్ధంగా లేమని పట్టా భూములు ఉన్న రైతులు తేల్చి చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని మంత్రులకు సూచించారు. కౌలు రైతుల విషయంలో మాత్రం మంత్రుల సబ్ కమిటీ సమావేశం లో ఎటువంటి క్లారిటీ రాలేదు.రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవన భృతి కి దోహదపడుతున్న రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీగా హామీ ఇచ్చిందని.. ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఈ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రైతు భరోసా పథకం అమలుపై విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీ నియామకం చేసింది.ఈ సబ్ కమిటీలో తాను, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరావు దుద్దిల శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నాము.. రైతు భరోసా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించి ఈ పథకం అమలు కోసం ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటన చేసి ప్రజలు రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించామన్నారు.ఇది పేదోడి ప్రభుత్వం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిఇది పేదోడి ప్రభుత్వం.. ఓపెన్ గా డిబెట్ చేసి రైతుల నుంచి వివరాలు తీసుకోవాలన్నదే ఈ కమిటీ ఉద్దేశమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అన్ని జిల్లా లో సబ్ కమిటీ పర్యటించి వివరాలు సేకరిస్తుంది. మా సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకొం. ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయాలు ఉంటాయి. ప్రతి పక్ష బీఆర్ ఎస్ ఇష్టానుసరంగా మాట్లాడుతుంది.. రైతుల ప్రభుత్వం ఎవరిదో త్వరలో రైతులే చెబుతారన్నారు. -
కౌలు రైతులకూ ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులకు కూడా రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ వానాకాలం నుంచే అమలు చేయాలని యోచిస్తోంది. రైతుభరోసాపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఎన్నికలకు ముందు రైతులతోపాటు కౌలు రైతులకు కూడా రైతుభరోసా సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందించనుంది. అయితే కౌలు రైతులను గుర్తించడమే ప్రభుత్వానికి అసలు సవాల్‌గా మారింది. చాలామంది కూలీలు రైతుల వద్ద కొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తుంటారు. కొందరు రైతులు కూడా తమ భూమితోపాటు ఇతర రైతుల వద్ద కౌలుకు తీసుకొని కూడా సాగు చేస్తుంటారు. ఇలా రెండు విధాలుగా కౌలు రైతులుంటారు. ఒకరు భూమి ఉన్నవారు, ఇంకొకరు భూమిలేని కౌలు రైతులు. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులుండగా కౌలు రైతులు సుమారు 25 లక్షల వరకు ఉంటారని అంచనా. అయితే వీరిని గుర్తించేందుకు 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతుల చట్టం తెచ్చింది. దీనిప్రకారం కౌలు రైతులను గుర్తిస్తామని ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు అనేక అధికారాలు సంక్రమిస్తాయి. అదేవిధంగా చట్టపరంగా కౌలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు రైతులు కౌలుపై అధికారికంగా ఒప్పందం చేసుకోవడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుందా అన్న సందేహం తలెత్తుతోంది. కౌలు రైతు కోసం అసలు రైతు పెట్టుబడి సాయాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా ఉంటారా అనేది ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో కౌలు రైతులను ఎలా గుర్తించాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఏదిఏమైనా జూలై 15లోపు రైతుభరోసాపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉపసంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సబ్‌కమిటీ త్వరలో పలువురు రైతు సంఘాల నేతలతోనూ, మేధావులతోనూ సమావేశం కానుంది. రైతుభరోసా మార్గదర్శకాల్లో భాగంగానే కౌలు రైతులకు ఎలా ఇవ్వాలన్న దానిపై అభిప్రాయాలు స్వీకరిస్తారు. కాగా, రైతు భరోసాకు నిబంధనలు కఠినంగా ఉంటాయన్న చర్చ జరుగుతోంది. పీఎం కిసాన్ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటారన్న వాదనలు కూడా ఉన్నాయి. వాస్తవంగా రైతుబంధుకు, రైతుభరోసాకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటుందని అధికారులు అంటున్నారు. అదీగాక రైతుబంధు మార్గదర్శకాలన్నీ పూర్తిస్థాయిలో మారుతాయని, దాని స్వరూపమే మారుతుందని చెబుతున్నారు. -
‘పెట్టుబడి’ గండం! సర్కారు సాయం కోసం రైతన్న ఎదురు చూపులు
సాక్షి, అమరావతి: జోరందుకున్న వర్షాలతో ఖరీఫ్ సాగు ఊపందుకుంటోంది. ఈ సమయంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనుల కోసం రైతన్నలకు పెట్టుబడి ఖర్చులు చాలా కీలకం. సకాలంలో సాయం చేతికందితే వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇదే దృక్పథంతో గత ఐదేళ్లూ మే/జూన్‌లో తొలి విడత పెట్టుబడి సాయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అందించింది. తాము అధికారంలోకి వస్తే ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందచేస్తామని సూపర్ సిక్స్‌లో హామీ ఇచి్చన సీఎం చంద్రబాబు ఆ ఊసే పట్టన్నట్లు వ్యవహరించడంపై అన్నదాతల్లో ఆందోళన రేగుతోంది.కూటమి సర్కారు పగ్గాలు చేపట్టిన వెంటనే రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చడం మినహా డబ్బులు విడుదల చేయలేదు. ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు తొలి ఐదు సంతకాల్లో పెట్టుబడి సాయం పెంపు ఉంటుందని ఆశించిన రైతన్నలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత కేబినెట్ భేటీలో అయినా చర్చిస్తారనుకున్నారు. చివరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం జరిపిన తొలి సమీక్షలో మాట వరసకైనా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. దీంతో ఏటా సీజన్‌కు ముందుగానే చేతికి అందే తొలి విడత పెట్టుబడి సాయం డబ్బులు ఎప్పుడిస్తారో అంతుబట్టక అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీ కంటే మిన్నగా.. ఇచ్చిన హామీ కంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించి z ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలిచింది. ప్రతి రైతు కుటుంబానికి పీఎం కిసాన్తో కలిపి ఏటా మే/ జూన్‌లో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో 2 వేలు చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు. ఏటా సగటున 51.50 లక్షల మందికి ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ పథకం కింద రూ.34,288.17 కోట్లు జమ చేసి తోడుగా నిలిచారు. పీఎం కిసాన్ పరిధిలోకి రాని నాన్ వెబ్‌ల్యాండ్ భూ యజమానులతో పాటు వారసత్వంగా భూములు పొందినవారు, ఎక్వైర్డ్ ల్యాండ్ సాగుదారులతో సహా అటవీ, దేవదాయ భూసాగుదారులకే కాకుండా సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు ఈ ఐదేళ్లూ వైఎస్ జగన్ ప్రభుత్వమే సొంతంగా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం జమ చేసింది. మళ్లీ వడ్డీ వ్యాపారుల చుట్టూ.. ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి నేతలు సూపర్‌సిక్స్‌లో హామీ ఇచ్చారు. పీఎం కిసాన్తో కలిసి రైతు భరోసా సాయాన్ని అందించినప్పుడు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు తామిచ్చిన హామీ మేరకు రూ.20 వేలు సొంతంగా ఇస్తారా? లేక పీఎం కిసాన్తో కలిపి ఇస్తారా? అన్నది స్పష్టత ఇవ్వడం లేదు. పైగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు నెల రోజులవుతోంది.గతంలో సీజన్‌కు ముందుగానే తొలివిడత సాయం రైతులకు చేతికొచ్చేది. ఈ సొమ్ములు ఖరీఫ్‌లో విత్తనాల కొనుగోలు, దుక్కులు, నారుమడులు, నాట్లు వేసుకునేందుకు ఉపయోగపడేవి. ఈసారి మాత్రం తొలి విడత పెట్టుబడి సాయం ఎప్పుడు చేతికి వస్తుంది? ఎంత వస్తుంది? అనే సంగతి తేలకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదునులో పెట్టుబడి సాయం చేతికి రాకపోవడంతో రైతులు మళ్లీ అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, దళారీల చుట్టూ ప్రదక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోదీ తొలి సంతకం పీఎం కిసాన్పైనే.. కేంద్రంలో మూడోసారి పగ్గాలు చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే పీఎం కిసాన్ సాయంపై తొలి సంతకం చేసి రైతుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. 2018–19 నుంచి ఏటా మూడు విడతల్లో కేంద్రం ఈ సాయం అందిస్తోంది. ఇప్పటివరకు 16 విడతల్లో రాష్ట్రంలోని అర్హులైన రైతులకు రూ.14,717 కోట్లు జమ చేసింది. ఈ నెల 18న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ బటన్ నొక్కి పీఎం కిసాన్ తొలి విడత సాయాన్ని జమ చేశారు. 2024–25 సీజన్లో రాష్ట్రంలో తొలి విడత సాయం కోసం 40.91 లక్షల మంది అర్హత పొందగా వీరికి రూ.824.61 కోట్లు పెట్టుబడి సాయం జమ చేశారు.అన్నదాతా అంటూ నాడు మోసంతాము అధికారంలోకి రాగానే వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తామని 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు అన్నదాత సుఖీభవ అంటూ చంద్రబాబు హడావుడిగా ఓ పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఆగమేఘాల మీద జీవో 28 జారీ చేశారు.ఆ జీవో ప్రకారం 2 హెక్టార్లలోపు సన్న, చిన్నకారు రైతులకు ఏటా రూ.15 వేలు, రెండు హెక్టార్లకు పైబడిన వారికి రూ.10 వేలు, కౌలురైతులు, అటవీ, దేవదాయ భూసాగుదారులకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన రూ.9,225 కోట్లు జమ చేయాల్సి ఉండగా.. రెండు విడతల్లో 43.26 లక్షల మందికి రూ.4 వేల చొప్పున రూ.2,440.29 కోట్లు మాత్రమే జమ చేశారు. ఈ మొత్తంలో పీఎం కిసాన్ కింద కేంద్రం అందించింది రూ.675 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.1,765.29 కోట్లు జమ చేసిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.అప్పులు చేయక తప్పదు గత ఐదేళ్లుగా ఖరీఫ్ సీజన్‌కు ముందే మే నెలలోనే పెట్టుబడి సాయం అందేది. దీంతో అప్పుల కోసం వ్యాపారులపై ఆధారపడాల్సిన అగత్యం ఉండేది కాదు. ఈ సొమ్ములు దుక్కి దున్నుకోవడం, నారు మళ్లు పోసుకోవటానికి ఎంతగానో ఉపయోగపడేవి. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చంది. రూ.20 వేలు పెట్టుబడి సాయం చేస్తామన్నారు. ఎప్పుడు జమ చేస్తారో ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈసారి పెట్టుబడుల కోసం అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. –కె.ధనుంజయరావు, సింగుపాలెం, బాపట్ల జిల్లావెంటనే జమ చేయాలి ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం చేస్తామని సూపర్ సిక్స్‌లో హామీ ఇచ్చారు. అదును దాటి పోకుండా జమ చేస్తే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గతంలో ఐదేళ్లు సీజన్‌కు ముందుగానే సాయం అందించారు. కూటమి ప్రభుత్వం కూడా అదే రీతిలో వెంటనే పెట్టుబడి సాయం జమ చేయాలి. –కె.ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘంపెట్టుబడి కోసం ఇబ్బందులుపదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. 6 ఎకరాల్లో చీని, 4 ఎకరాల్లో టమోటా, 3 ఎకరాల్లో ఆముదం, కంది, 5 ఎకరాల్లో అరటి, 6 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నా. గత ఐదేళ్లూ క్రమం తప్పకుండా సీజన్‌కు ముందుగానే పెట్టుబడి సాయం అందింది. ఈసారి ప్రభుత్వం పెట్టుబడి సాయం సకాలంలో ఇవ్వకపోవడంతో పంట సాగుకు ఇబ్బందిపడుతున్నా. –హనుమంతరాయుడు, కదిరిదేవరపల్లి, అనంతపురం జిల్లా ప్రతి కౌలు రైతుకూ ఇవ్వాలి సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ప్రతీ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల పెట్టుబడి సాయం అందించాలి. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి కౌలు రైతుకూ సాయం జమ చేయాలి. భూ యజమానులకు రుణాలిస్తారు. కౌలు రైతులకు రుణాలు దక్కడం లేదు. వారికి ఎలాంటి సంక్షేమ ఫలాలు అందడం లేదు. కనీసం పెట్టుబడి సాయమైనా జమ చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. –పి.జమలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతు సంఘం -
కాంగ్రెస్, బీజేపీలు రైతు వ్యతిరేక పార్టీలు
సాక్షి, సిద్దిపేట: ‘కాంగ్రెస్, బీజేపీలు రైతు వ్యతిరేక పార్టీలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసింది. బీజేపీ నల్ల చట్టాలను తీసుకువచ్చింది’అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కానీ కేసీఆర్ రైతు నేస్తం అని, ఆయన చెప్పినవి, చెప్పనవి కూడా చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ చెప్పినవే చేయడం లేదని, అందుకే ఆ పార్టీపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, ఆ పార్టీని నమ్మి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. రూ.90 వేలకోట్ల ఖర్చుతో కేసీఆర్ విద్యుత్ వ్యవస్థను బాగు చేశారన్నారు. కేసీఆర్ పాలనలో పదేళ్లు కరువే లేదన్నారు. కాంగ్రెస్ అడుగుపెట్టింది.. మళ్లీ కరువొచ్చిందన్నారు. మళ్లీ బోర్లలో పూడిక తీసుడు.. కరెంటు మోటార్లు కాలుడు మొదలైందని విమర్శించారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లకు చురక పెడితేనే దారికొస్తారన్నారు. సమావేశం అనంతరం కార్యకర్తలకు హరీశ్‌రావు స్వయంగా భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. -
రైతులను ఆదుకునే దాకా ఉద్యమిస్తాం
సాక్షి, హైదరాబాద్/ సిరిసిల్ల/ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/జహీరాబాద్: కరువు పరిస్థితులతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు దీక్షలు’ చేపట్టింది. పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ దీక్షలు నిర్వహించారు. రైతుల ధాన్యంకు ప్రతీ క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని.. అకాల వర్షాలు, వడగండ్లు, ఎండలతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.25వేలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సిరిసిల్లలో, మాజీ మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డిలో, జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో, గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూరు క్రాస్‌రోడ్డు, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన దీక్షల్లో పాల్గొన్నారు. ఇక చెన్నూరులో మాజీ విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో రైతు దీక్షకు ఏర్పాట్లు చేయగా.. అనుమతిలేదటూ పోలీసులు టెంట్‌ను తొలగించారు. రాష్ట్రవ్యాప్తంగా మిగతా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన దీక్షల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయారు: కేటీఆర్ వరికి రూ.500 బోనస్, నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించడానికి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని, తాము మద్దతు ఇస్తామని చెప్పారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ రైతుదీక్షలో కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని, ఇప్పుడు గోస పడుతున్నారని వ్యాఖ్యానించారు. రైతుబంధు అందక, రుణమాఫీ కాక, పంటలు ఎండి రైతులు.. ప్రభుత్వ వ్రస్తోత్పత్తి ఆర్డర్లు రాక నేతన్నలు, దళితబంధు అందక దళితులు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఇలా రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆందోళనలో ఉన్నాయని పేర్కొన్నారు. సరిగా వర్షాలు పడక కరువు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి శ్రీధర్‌బాబు అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 300 పిల్లర్లు ఉంటే.. రెండు, మూడు పిల్లర్లలో సమస్య వస్తే మొత్తం ప్రాజెక్టునే విఫలమంటూ కాంగ్రెస్ యాగీ చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కేసీఆర్‌ను బద్నాం చేసి, రాజకీయ లబ్ధి పొందేందుకే లక్షల ఎకరాల పంట పొలాలను ఎండబెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు రైతుభరోసా రూ.15వేలు, రూ.4వేల పెన్షన్, రూ.2లక్షల రుణమాఫీ పొందిన వాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయాలని.. లేకుంటే బీఆర్ఎస్కు ఓటేయాలని పిలుపునిచ్చారు. సర్కారుకు మిషన్ భగీరథ నిర్వహించడం చేతగాక.. తాగునీటి కొరత వచ్చిందని ఆరోపించారు. తమ హయాంలో పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలను కాంగ్రెస్ సర్కారు ఇచ్చినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక బీజేపీ నేతలు రుణమాఫీ గురించి మాట్లాడటమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని విమర్శించారు. రైతులకు కన్నీళ్లే మిగిలాయి: హరీశ్‌రావు వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రెండు వందల మందికిపైగా రైతులు చనిపోయారని.. మంత్రులు కనీస పరామర్శకు రావడం లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతలకు కళ్లు నెత్తికెక్కాయని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో, జహీరాబాద్‌లో జరిగిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేక రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పిందని, కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ పా ర్టీకి.. తుక్కుగూడ సభలో మేనిఫెస్టోను ప్రకటించే నైతికత ఎక్కడిదని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు బోనస్, కౌలురైతులకు రూ.15 వేల ఆర్థిక సాయం వంటి హామీల అమలు ఏదని నిలదీశారు. రైతుబంధు డబ్బు జమ కాలేదనే వారిని చెప్పుతో కొట్టాలని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారని.. చెప్పులతో కొట్టించుకునేందుకే ప్రజ లు కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో కరెంట్, కాలువల్లో నీళ్లున్నాయని.. కాంగ్రెస్ రాగానే ఏమైపోయాయని హరీశ్‌రావు నిలదీశారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 నగదు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ నేత లు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తే చీపురు మడతపెట్టి తరమాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారని చెప్పుకునేందుకు మంత్రి ఉత్తమ్‌కు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు కేసీఆర్ జిల్లాల పర్యటన చేపడితేనే.. రాష్ట్ర బీజేపీ నేతలు కళ్లు తెరిచి, దీక్షలు చేపట్టారని విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. -
సాగురైతుల అభివృద్దే లక్ష్యం: రాహుల్ గాంధీ
నాసిక్: రైతుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా విపక్షాల ‘ఇండియా’ కూటమి పనిచేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ ప్రకటించారు. తమ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే చేపట్టబోయే రైతు సంక్షేమ కార్యక్రమా లను రాహుల్ వివరించారు. గురువారం మహారాష్ట్రలో చాంద్‌వడ్‌లో రైతుర్యాలీలో ప్రసంగించారు. ‘‘ రైతన్నల ప్రయోజనాలే మాకు పరమావధి. వ్యవసాయాన్ని జీఎస్టీ పరిధి నుంచి తొలగిస్తాం. పంట బీమా పథకంలో సంస్కరణలు తెచ్చి రైతు అనుకూల విధానాలను ప్రవేశపెడతాం’ అని అన్నారు. -
‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం. 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన. రూ.97 కోట్లతో ప్రాజెక్టు అమలే లక్ష్యంగా, మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటుకు రూ. 4.07 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ఫ్లాట్ ఫారం ఉండనుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చించనున్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవటం. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవటం. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంది. తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహాయంతో రైతులకు పలు సూచనలు చేయనున్నారు. ఇదీ చదవండి: టీవీ-5 సాంబశివరావు బాగోతం.. మరో కేసు నమోదు -
విద్యుత్ ప్లాంట్లలో రూ.15 వేల కోట్ల అవినీతి
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే 20 వేల మిలియన్ యూనిట్లు కావాలి. ఈ మేరకు విద్యుత్ కొనేందుకు ఏటా రూ.16,500 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ప్రభుత్వం లెక్కలు చూపెడుతోంది. కానీ రైతులకు ఇస్తున్నది 8–10 గంటలే. ఇందుకు అయ్యే ఖర్చు రూ.8వేల కోట్లు మాత్రమే. మరి మిగతా రూ.8,500 కోట్లు ఎక్కడికి వెళుతున్నాయి? దానిపై బీఆర్ఎస్ సర్కారు విచారణకు సిద్ధమా?’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. రాష్ట్రంలో చేపట్టిన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ అంచనాలను పెంచేసి కమీషన్లు తీసుకున్నారని, ఈ వ్యవహారంలో రూ.15 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పేరుతో జరుగుతున్న దుర్వినియోగాన్ని తాను ప్రస్తావిస్తే బీఆర్ఎస్ నేత లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మంత్రి కేటీఆర్ గంతులు వేస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ అంశంపై సిరిసిల్ల, సిద్ధిపేట, చింతమడక, గజ్వేల్‌లలో రైతు వేదికలు సహా ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని, దమ్ముంటే రావాలని కేటీఆర్‌కు సవాల్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించ తలపెట్టిన మూడు పవర్ ప్రాజెక్టులకు రూ.45,730 కోట్లతో టెండర్లు పిలిస్తే అందులో రూ.15వేల కోట్లు అవినీతి జరిగిందని, కేసీఆర్ ప్రభుత్వం 30% కమీషన్లు తీసుకుందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల పేరిట తీసుకున్న రుణాలతో జెన్కో, ట్రాన్స్‌కో అప్పుల పాలయ్యాయని.. ఆ భారం విద్యుత్ వినియోగదారులపై పడుతోందని చెప్పారు. బందిపోటు దొంగలు, దండుపాళ్యం ముఠాలు కూడా బీఆర్ఎస్లా దోపిడీకి పాల్పడ లేవని విమర్శించారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తే మహిళల మెడలోని తాళిబొట్లనూ అమ్మేస్తుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలను నిలదీయండి విద్యుత్ రంగంలో ప్రభుత్వ అవినీతి, రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ నేతలను నిలదీయాలని, వారు రైతు వేదికల వద్దకు వచ్చినప్పుడు నిరసన తెలపాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు. రుణమాఫీ చేసే వరకు రైతు వేదికలకు తాళాలు వేయాలని, పేదల నుంచి లాక్కున్న అసైన్డ్ భూములను తిరిగి ఇచ్చే వరకు నేతలను నిర్బంధించాలని సూచించారు. ఎమ్మెల్యే లను కూడా చెట్లకు కట్టేయాలని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు ఆ స్థాయి ఉందా? ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు ఉందా అని రేవంత్ మండిపడ్డారు. ఏది కావాలనుకున్నా తన ముందుకు తెచ్చుకోగలిగిన స్థాయి ఉన్న, చదువుకున్న రాహుల్ వంటి నేత.. పేదలు, రైతుల కష్టాలను తెలుసు కునేందుకు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. కేటీఆర్‌కు వ్యవసాయం అంటే ఏమిటో తెలుసా, దుక్కి దున్నడం, సాలు కొట్టడ మంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. వ్యవసాయం అంటే అంట్లు తోమడం కాదు కేటీఆర్‌పై రేవంత్ ట్వీట్ ఎడ్లు, వడ్ల గురించి రాహుల్ గాంధీకి తెలియదన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి స్పందించారు. వ్యవసాయమంటే అమెరికాలో అంట్లు తోమడం కాదని, ఎడ్లు, వడ్లు అని ప్రాస కోసం పాకులాడే గాడిదలకు గంధపు చెక్కల వాసన ఏం తెలుస్తుందని సోమవారం ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. ‘ఎవుసం అంటే గెస్ట్‌హౌస్‌లలో సేదతీరడం కాదు. సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదు. అది మట్టి మనసుల పరిమళం. మట్టి మనుషుల ప్రేమ’ అని పేర్కొన్నారు. తన ట్వీట్‌కు రాహుల్ దుక్కి దున్ని నాట్లు పెడుతున్న ఫొటోలను జత చేశారు. -
సీఎం జగన్ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు: నాగిరెడ్డి
-
దూకుడు పెంచిన కాంగ్రెస్
-
రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యం
మక్కువ : పంట కాలంలో 14 వారాల పాటు శిక్షణ ఇచ్చి రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యమని మండల వ్యవసాయాధికారి కె. తిరుపతిరావు అన్నారు. సరయ్యవలస రైతుభరోసా కేంద్రం పరిధిలోని బంగారువలసలో సోమవారం నిర్వహించిన పొలంబడి గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, ఎంపిక చేసిన పంటలో 14 వారాల పాటు 25 మంది రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. నిరంతర పంటల పరిశీలన ద్వారా మిత్ర పురుగులు, వాతావరణాన్ని పరిశీలిస్తూ అవసరమైన నిర్ణయాలపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. గ్రామ రైతులందరూ రాబోయే ఖరీఫ్ సీజన్లో నిర్వహించే పొలంబడికి పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. సర్పంచ్ శంబంగి హరికృష్ణ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పచ్చిరొట్ట, పత్తి విత్తనాలు తొందరగా అందించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ టి. శ్రీరాములు, వీఏఏ త్రివేణి, రైతులు పాల్గొన్నారు. (చదవండి: పంట భద్రుడు...ఆదర్శ రైతుగా మారిన ఉపాధ్యాయుడు) -
AP: రైతు ఉగాది పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు రూరల్: వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నూతన ఆలోచనలు, ఆవిష్కరణల రూపకర్తలైన అభ్యుదయ రైతులకు ఈ ఏడాది ఉగాది పురస్కారాలను అందించేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రాష్ట్రం లోని 13 జిల్లాల నుంచి ఆసక్తిగల రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ పి.రాంబాబు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. చదవండి: ప్రభుత్వోద్యోగులకు ఏపీ సర్కార్ మరో తీపికబురు రైతులు తమకు సమీపం లోని వ్యవసాయ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలలో దరఖాస్తులు పొందవచ్చు. భర్తీ చేసిన దరఖాస్తులకు ధ్రువపత్రాలను జత చేసి ఈ నెల 16వ తేదీలోగా అందజేయాలన్నారు. ప్రతిభ కనబరిచిన రైతులకు పురస్కారంతో పాటుగా, రూ 5,000 నగదు బహుమతి, జ్ఞాపికను అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్’ను సంప్రదించాలని సూచించారు. -
రైతుకు తోడుగా రైతు భరోసా కేంద్రాలు
-
రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చాలి
సాక్షి, హైదరాబాద్: అధిక ఉత్పత్తి, సమీకృత మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధికి రైతుబంధు సమితులు క్రియాశీలకంగా వ్యవహరించి రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పంచాయతీ రాజ్, సహకార స్ఫూర్తి అమలుకాకపోవడంతో సీఎం కేసీఆర్ కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చారని చెప్పారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా నాలుగోరోజు పుణె సమీపంలోని బారామతి సోమేశ్వర రైతు సహకార చక్కెర కర్మాగారాన్ని సందర్శించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. మహారాష్ట్రలో అభివృద్ధి చెందిన వ్యవసాయానికి శరద్ పవార్‌ను ఆద్యుడిగా రైతులు భావిస్తారని మంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర సహకార రంగంలో రైతుల పాత్ర అద్వితీయమని కొనియాడారు. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడి లేకుండా రైతులే సహకార సంఘాలుగా ఏర్పడి అనేక కర్మాగారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. 27 వేల మంది రైతులు సమష్టిగా చెరుకు పండించి వారే తమ సహకార పరిశ్రమలో చక్కెర, ఇథనాల్, కరెంటు తయారు చేసి అధిక లాభాలు ఆర్జిస్తున్నారన్నారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుండడంపై శరద్ పవార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, పంటల పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తను, తన పార్టీ అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట వేయడం సంతోషంగా ఉందన్నారు. -
15న నెల్లూరులో రైతు భరోసా ప్రారంభం
సాక్షి, అమరావతి: ఈ నెల 15వ తేదీన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభం కాబోతున్నది. నెల్లూరు నగర సమీపంలోని కాకుటూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. తొలుత ఆయన ఆరోజు ఉదయం 10.30గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణం చేరుకుంటారు. ఆ తరువాత కౌలు రైతులకు కార్డుల పంపిణీ అనంతరం రైతులకు వైఎస్సార్ రైతుభరోసా చెక్కులను పంపిణీ చేసి అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికేందుకు వైస్సార్సీపీ నేతలు,అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. -
15న ‘వైఎస్సార్ రైతు భరోసా’ ప్రారంభించనున్న సీఎం జగన్
-
సర్వే.. సవాలే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే వ్యవసాయ శాఖకు సవాల్‌గా మారింది. క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకురావడం.. ఇంకా స్వల్ప సమయమే మిగిలి ఉండటంతో సర్వే సకాలంలో పూర్తవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు ఎండలు మండిపోతుండడంతో రైతుల సమగ్ర వివరాలు రాబట్టడం వ్యవసాయ సిబ్బందికి అగ్నిపరీక్షగా మారింది. ఉద్దేశమిదీ.. రైతులకు అన్ని ప్రయోజనాలు చేకూరేందుకు వీలుగా వారి సమగ్ర వివరాలు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి రైతును కలిసి అన్ని వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. పంట కాలనీల ఏర్పాటు, భవిష్యత్‌లో రైతులకు వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ఈ వివరాలు కీలకంగా మారుతాయని సర్కారు భావించింది. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం, పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం, ఆన్లైన్లో చెల్లింపులు, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, సబ్సిడీ చెల్లింపులు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల అమలుకు రైతు సమగ్ర సమాచారాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. వివరాల సేకరణ బాధ్యతలను వ్యవసాయ విస్తీర్ణాధికారుల(ఏఈఓ)కు అప్పగించింది. సాధ్యమేనా..? వాస్తవంగా లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే జిల్లాలో సమగ్ర సర్వే ప్రారంభమైంది. ఆ వెంటనే నోటిఫికేషన్ వెలువడటంతో సర్వే నిలిచిపోయింది. వ్యవసాయ శాఖ అధికారులకు ఎన్నికల విధులు కేటాయించడంతో ముందుకు సాగలేదు. తాజాగా ఎన్నికలు ముగియడంతో.. ఈనెల 15 నుంచి సర్వేను వేగవంతం చేశారు. జిల్లాలో 2.75 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరందరి నుంచి వివరాలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లాలోని 80 మంది ఏఈఓలది. ప్రభుత్వ నిర్దేశించిన ప్రొఫార్మా ప్రకారం అన్ని వివరాలు తీసుకోవడానికి వీరు ప్రతి రైతును విధిగా కలవాల్సిందే. ఒక్కో రైతు నుంచి వివరాలు సేకరించడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతోంది. ఈ లెక్కన ఒక్కో ఏఈఓ రోజుకు సగటున 25 నుంచి 30 మంది రైతులను మాత్రమే కలవగలుగుతున్నారు. అంటే జిల్లా అంతట కలుపుకుంటే రోజుకు 2,400 మంది వివరాలు మాత్రమే తీసుకోగలుగుతున్నారు. వచ్చేనెల 15లోపు సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారం గడువు తేదీ వరకు 60 వేల మంది రైతుల వివరాలు మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఉంది. వేగం మరింత పెంచినా... ఈ సంఖ్య లక్ష దాటదని క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తోంది. ఈ బాధ్యతలు కూడా.. రైతుల నుంచి రబీ ధాన్యం సేకరించే బాధ్యతలను కూడా ఏఈఓలకు అప్పగించారు. ఇప్పటికే సర్వే పనిభారంతో సతమతమవుతున్న ఏఈఓలకు.. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ తదితర వాటి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొను గోలుకేంద్రాల వద్ద కూడా వీరు విధులు నిర్వహించాల్సి ఉంది. దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను కూడా ఏఈఓలకు అప్పగించారు. కొందరు ఎన్నికల శిక్షణకు కూడా హాజరవుతున్నారు. దీంతో వీరికి పనిభారం పెరిగింది. 39 కాదు.. 44 అంశాలపై వివరాలు రైతు సమగ్ర సమాచార సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలుత 39 అంశాలతో కూడిన ప్రొఫార్మాను రూపొందించింది. తాజాగా ఈ జాబితాలో మరో 5 అంశాలను చేర్చి 44కు పెంచడంతో ఏఈ ఓలు రైతుల వివరాల సేకరణ కోసం మరికొంత సమయాన్ని అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. ఇది కూడా జాప్యానికి కొంత కారణమవుతోంది. ఠారెత్తిస్తున్న భానుడు ఎండలు మండిపోతున్నాయి. పగలు సగటున 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం పదిన్నర గంటలు దాటితే కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం 11 గంటలోపు, ఆ తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాతే రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం మీద రోజుకు ఏడు గంటలపాటు ఏఈఓలు క్షేత్రస్థాయిలో తిరుగుతూ వివ రాలు సేకరిస్తున్నారు. ఇలా అన్నీ ప్రతికూల పరిస్థితులు చుట్టుముడుతుండటంతో సర్వే సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గడువులోగా పూర్తిచేస్తాం స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి ఏఈఓలను మినహాయించాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరుతున్నాం. ఈ విధులను సడలిస్తే కొంత ఊరట కలుగుతుంది. ఇలా దాదాపు ఐదు రోజులు మాకు కలిసివస్తాయి. సకాలంలో రైతుల సమగ్ర సర్వే పూర్తి చేయడంలో ఇవి కీలకంగా మారుతాయి. సాధ్యమైనంత వరకు గడువులోపు రైతులందరి వివరాలు సేకరిస్తాం. అవసరమైతే ఏఈఓలకు సహాయకులుగా మరికొంత మంది సిబ్బంది సేవలను తీసుకోవాలని యోచిస్తున్నాం. – గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిణి సేకరిస్తున్న వివరాలు ఇవీ.. రైతు భూమి విస్తీర్ణం, విద్యార్హతలు, సాగునీటి వసతి, సూక్ష్మనీటి పారుదల విస్తీర్ణం, నేల స్వభావం, సర్వే నంబర్ల వారీగా భూ విస్తీర్ణం, ఖరీఫ్–యాసంగి సీజన్లలో వేసిన పంటలు, తదుపరి సాగుచేయాలనుకుంటున్న పంట, తోటల సాగు, పంటరుణం, రైతుబంధు, రైతుబీమా, పంట బీమా, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, సాగు చేయడానికి రైతులు ఇష్టపడుతున్న పంటలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఫోన్ సౌకర్యం, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన ఉందా? కిసాన్ పోర్టల్ నుంచి సలహాలు అందుతున్నాయా? తదితర అంశాలకు çసంబంధించి వివరాలను రైతుల నుంచి సేకరిస్తున్నారు. -
రైతు ఐక్యత సభకు తరలి రావాలి
పెర్కిట్/ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో గల మినీ స్టేడియంలో 9న నిర్వహించే రైతు ఐక్యత సభకు విద్యార్థులు, యువత, మేధావులు తరలి వచ్చి మద్దతు తెలపాలని రైతు ఐక్య కమిటీ నాయకులు, రైతు ఎంపీ అభ్యర్థులు కోరారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ ఎమ్మార్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో శనివారం రైతు నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు ఐక్య కమిటీ నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, అన్వేష్ రెడ్డి, వీ ప్రభాకర్, దేగాం యాదాగౌడ్ రైతు ఎంపీ అభ్యర్థులు గడ్డం సంజీవ్ రెడ్డి, కోల వెంకటేశ్ రైతు ఐక్యత సభ గురించి వెల్లడించారు. వారు మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్‌తో 178 మంది రైతులు నామినేషన్ వేసి తొలిదశలోనే విజయం సాధించామన్నారు. నామినేషన్లతో యావత్తు దేశం నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల వైపు ఉత్కంఠతో చూస్తున్నారన్నారు.ఈసభకు రైతులు, రైతు కూలీలు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, మేధావులు, వ్యాపారులు వేలాదిగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని కోరుతున్నారు. రైతుల ఐక్యతను చాటడానికి నిర్వహిస్తున్న సభను అడ్డుకోవద్దని అధికార పార్టీని వారు వేడుకున్నారు. ఆర్మూర్‌లో ప్రచారం.. ఆర్మూర్ పట్టణంలోని ఆరు పంతాల సంఘాల వద్ద రైతు నాయకులు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్‌లో నిర్వహించనున్న రైతు ఐక్యత ప్రచార సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. -
నిజామాబాద్‌లో.. పేపర్ బ్యాలెట్‌తోనే నిర్వహించాలి
సుభాష్‌నగర్: నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల్లో పోటీ చేస్తున్న రైతులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో నగరశివారులోని విజయలక్ష్మి ఫంక్షన్హాల్లో ఈవీఎంలపై అవగాహన కల్పించే కేంద్రం వద్ద ఆందోళన చేశారు. ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. అభ్యర్థులైన రైతులు మాట్లాడుతూ తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని, కుట్రలు జరిగే అవకాశముందని ఆరోపించారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తే న్యాయం జరుగుతుందన్నా రు. ఏర్పాట్లు చేసేందుకు సమయం లేకుంటే ఎన్నికలను వాయిదా వేయాల ని డిమాండ్ చేశారు. అంతేగాకుండా బరిలో నిలిచిన రైతు అభ్యర్థులు కొంత మందికి ఇంకా అధికారికంగా గుర్తు కేటాయించలేదని, తాము ఎప్పుడు ప్రచారం చేసుకోవాలని ప్రశ్నించారు. రైతులంటే అధికారులు, ప్రభుత్వానికి చులకనగా ఉందని ఆరోపించారు. ఉదయం 11 గంటలకు ఈవీఎంలపై అవగాహన కేంద్రానికి చేరుకోవాలని నోటీసులిచ్చి.. తీరా సాయంత్రం 5 గంటలకు రావాలని సూచించడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా రైతు అభ్యర్థులను చుల కనగా చూస్తున్నారని ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. సీపీ కార్తికేయ జోక్యం చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో అధికార యంత్రాం గం పనిచేస్తుందని, సంయమనం పాటించి సహకరించాలని కోరారు. దీంతో వారు ఆందోళన విరమించి కేం ద్రంలోకి వెళ్లారు. అనంతరం సాయం త్రం మరోమారు ఆందోళన చేశారు. ఎంపీ అభ్యర్థులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఈవీఎంలపై అవగాహన కల్పించడంలో ఆలస్యం, తదితర అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎం తనిఖీ కేంద్రం పరిశీలన.. కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్ ఈవీఎం తనిఖీ నిర్వహిస్తున్న కేంద్రం, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఏర్పాట్లపై అన్ని విషయాలను వివరించారు. ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఈవీఎం చెకింగ్‌ల ప్రక్రియ, ఏర్పాట్లను తెలియజేశారు. ఎం–3 ఈవీఎంలపై ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఆయా శాఖల ఉద్యోగులకు అవగాహన కల్పించారు. కాగా బుధవారం రాత్రి 7.30 తర్వాత ఎం–3 ఈవీఎంలు సుమారు 15 ట్రక్కుల్లో జిల్లాకు చేరుకున్నాయి.