గుంటూరు రూరల్: వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నూతన ఆలోచనలు, ఆవిష్కరణల రూపకర్తలైన అభ్యుదయ రైతులకు ఈ ఏడాది ఉగాది పురస్కారాలను అందించేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రాష్ట్రం లోని 13 జిల్లాల నుంచి ఆసక్తిగల రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ పి.రాంబాబు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.
చదవండి: ప్రభుత్వోద్యోగులకు ఏపీ సర్కార్ మరో తీపికబురు
రైతులు తమకు సమీపం లోని వ్యవసాయ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలలో దరఖాస్తులు పొందవచ్చు. భర్తీ చేసిన దరఖాస్తులకు ధ్రువపత్రాలను జత చేసి ఈ నెల 16వ తేదీలోగా అందజేయాలన్నారు. ప్రతిభ కనబరిచిన రైతులకు పురస్కారంతో పాటుగా, రూ 5,000 నగదు బహుమతి, జ్ఞాపికను అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్’ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment