Applications
-
అసెస్మెంట్ నిపుణుల దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, అమరావతి: ఏపీ ఎస్సీఈఆర్టీలో అసెస్మెంట్ నిపుణుల ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగించినట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.అర్హత గల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆన్ డ్యూటీ ప్రాతిపదికన ఈనెల 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు https://forms.gle/q FRjhWHMtVJ5UXUT8వెబ్సైట్ చూడాలని విజ్ఞప్తి చేశారు. -
‘కల్లు గీత కులాల’ మద్యం షాపులపై టీడీపీ సిండికేట్ పడగ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం దుకాణాలను గుప్పిట పట్టిన టీడీపీ లిక్కర్ సిండికేట్.. ఇప్పుడు కల్లుగీత కులాలకు కేటాయించిన దుకాణాలనూ చేజిక్కించుకొంటోంది. కల్లు గీత కులాల కుటుంబాలకు 10 శాతం మద్యం దుకాణాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం.. వాటని కూడా సొంత సిండికేట్‌కే అప్పగిస్తోంది. అధికార సిండికేట్ బహిరంగంగా సాగిస్తున్న ఈ దందా ఇదిగో ఇలా ఉంది... వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసి మద్యం దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం రాచబాట వేసింది. రాష్ట్రంలో అనుమతించిన 3,396 ప్రైవేటు మద్యం దుకాణాల్లో ఒక్కటి కూడా సామాన్యులకు దక్కకుండా బెదిరింపులకు దిగి, టీడీపీ సిండికేటే మొత్తం చేజిక్కించుకుంది. ఇక కల్లు గీత కులాలకు కేటాయించిన 335 దుకాణాలను కులాలవారీగా రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. వీటిని కూడా టీడీపీ సిండికేట్‌కే అప్పజెప్పాలని ప్రభుత్వ పెద్దలు పరోక్షంగా జిల్లా ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. అంటే కల్లు గీత కులాల దుకాణాలు టీడీపీ సిండికేట్ అదనపు దోపిడీకి సాధనంగా చేశారు. టీడీపీ సిండికేట్ వీటికి కూడా బినామీ పేర్లతో దరఖాస్తు చేసింది. కల్లు గీత కులాలకు చెందిన సామాన్య వ్యాపారులు, రాజకీయ నేపథ్యంలేని వారు దరఖాస్తు చేసేందుకు యత్నిస్తే వారిని బెదిరించి బెంబేలెత్తించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ, సాంకేతిక సమస్యలు సృష్టించి ఆ విధానం పనిచేయకుండా చేసింది. ఎక్సైజ్ కార్యాలయాల వద్ద టీడీపీ సిండికేట్ ముఠాలు మకాం వేసి, దరఖాస్తు చేసేందుకు వచ్చేవారిని బహిరంగంగానే బెదిరించి వెనక్కి పంపేశాయి. ఇదిగో మచ్చుతునక.. టీడీపీ సిండికేట్‌దందాకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ఉదంతం ఓ మచ్చుతునక. ఒక దుకాణానికి దరఖాస్తు చేసేందుకు బ్రహ్మం గౌడ్ యత్నిoచారు. కానీ టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి అనుచరుడైన టీడీపీ నేత శ్రీనివాస రెడ్డి అతనికి ఫోన్ చేసి తీవ్రంగా దూషించారు. దరఖాస్తు చేస్తే చంపేస్తానని బెదిరించారు. దాంతో బ్రహ్మం గౌడ్ భయపడిపోయారు. టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి బెదిరింపుల ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయినా పోలీసులు, టెండర్లను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ఏమాత్రం పట్టించుకోలేదు.దుకాణానికి 3 దరఖాస్తులు కూడా రాలేదు టీడీపీ సిండికేట్‌కు భయపడి కల్లు గీత కులాలకు చెందిన వ్యాపారులు దరఖాస్తు చేసేందుకు కూడా సాహసించడం లేదు. టీడీపీ నేతలే బినామీల పేర్లతో ఈ దుకాణాలకు దరఖాస్తు చేశారు. దరఖాస్తుల తొలి గడువు బుధవారంతో ముగిసింది. వచ్చిoది కేవలం 768 దరఖాస్తులే. అంటే ఒక్కో దుకాణానికి సగటున మూడు దరఖాస్తులు కూడా రాకుండా టీడీపీ సిండికేట్ అడ్డుకుందన్నది సుస్పష్టం. ఇప్పుడు లాటరీ వేసినా సిండికేట్‌కే దుకాణాలు వస్తాయి. వాస్తవానికి సాధారణ దుకాణాలకు లైసెన్సు ఫీజు రూ.6 లక్షలు. కల్లు గీత కులాలకు కేటాయించిన దుకాణాలకు లైసెన్సు ఫీజు 50 శాతం తగ్గించి రూ.3 లక్షలే చేశారు. అయినా అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కల్లు గీత కులాల ముసుగులో టీడీపీ సిండికేట్‌కు ప్రయోజనం కలిగించేందుకే లైసెన్సు ఫీజును ప్రభుత్వం 50 శాతం తగ్గించిందని కూడా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.పొడిగింపు పేరిట డ్రామా.. కల్లు గీత కులాల దుకాణాల కోసం టీడీపీ సిండికేట్ సాగిస్తు న్న దందాపై విమర్శలు రావడంతో ఈ ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని బుకాయిoచేందుకు ప్రభు త్వం కొత్త ఎత్తుగడ వేసింది. దరాఖాస్తుల గడువు తేదీని ఈ నెల 8 వరకు పొడిగిస్తున్నట్టు బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ మూడు రోజుల్లోనూ టీడీపీ సిండికేట్ ఎవరినీ దరఖాస్తు చేయనివ్వబోదన్నది అందరికీ తెలిసిన విషయమే. -
సెబీకి త్వరలో కొత్త చీఫ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రభుత్వం కొత్త చైర్మన్‌ను ఎంపిక చేయనుంది. ఇందుకు ఆర్థిక శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రస్తుత చైర్‌పర్శన్ మాధవీపురీ బచ్ మూడేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 28న ముగియనుంది. సెబీకి కొత్త చీఫ్‌ను ఐదేళ్ల కాలానికి ఎంపిక చేయనున్నట్లు లేదా అభ్యర్థికి 65 ఏళ్ల వయసు(ఏది ముందయితే)వరకూ బాధ్యతలు అప్పగించనున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ తెలియజేసింది. దరఖాస్తుల దాఖలుకు ఫిబ్రవరి 17 గడువుగా పేర్కొంది. ఈ నెలలో 60వ వసంతంలో అడుగు పెట్టనున్న బచ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. కొత్త చైర్మన్‌గా ఎంపికయ్యే వ్యక్తికి సెబీ నిర్వహణపై ప్రభావం చూపగల ఎలాంటి ఆర్థిక లేదా సంబంధిత వ్యవహారాలు ఉండకూడదని ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. 25ఏళ్లకు మించిన వృత్తి సంబంధ అనుభవంతోపాటు 50ఏళ్లకు మించిన వయసుగల వ్యక్తులు దరఖాస్తు చేయవచ్చని వివరించింది. ఎంపికైన అభ్యర్థి ప్రభుత్వ కార్యదర్శి స్థాయిలో నెలకు రూ. 5,62,500 చొప్పున వేతనాన్ని పొందనున్నట్లు తెలియజేసింది. సాధారణంగా ప్రభుత్వం సెబీ చీఫ్‌ను తొలుత మూడేళ్ల కాలానికి ఎంపిక చేస్తుంది. తదుపరి మరో రెండేళ్లు పదవీ కాలాన్ని పొడిగిస్తుంది. అయితే ఇంతక్రితం యూకే సిన్హా ఐదేళ్ల కాలానికి పదవిని స్వీకరించారు. తదుపరి మరో ఏడాది బాధ్యతలు నిర్వహించారు. -
Maha Kumbh-2025: 104 నాగసాధు అభ్యర్థనలు రద్దు.. 12 అఖాడాల నిర్ణయం
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతకు నిలయంగా మారింది. ఇక్కడికి వచ్చే సామాన్యులను మహామండలేశ్వరులు, నాగ సాధువులు అమితంగా ఆకర్షిస్తున్నారు. అయితే మహామండలేశ్వరులు, నాగసాధువులుగా మారడం అంత సులభం కాదు.మహామండలేశ్వరులు, నాగ సాధువులుగా మారేందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. జీవితంలో సత్యనిరతి, సనాతనధరంపై అంకితభావం కలిగివుండాలి. ఈ విలువలకు అఖాడాలు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. మహామండలేశ్వరులు, నాగ సాధువులకు అఖాడాలు దీక్షనిస్తారు. జీవితంలో ఏమాత్రం విలువలు పాటించకుండా సాధకులమని చెప్పుకునేవారికి దీక్షలు ఇచ్చేందుకు అఖాడాలు ఆసక్తి చూపరు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో మహామండలేశ్వరులు, నాగసాధుకులుగా మారాలనుకున్న పలువురికి నిరాశ ఎదురయ్యింది.మహామండలేశ్వరులుగా మారాలనుకున్న 12 మంది సాధకులు, సాగ సన్యాసం స్వీకరించాలనుకున్న 92 మంది సాధకుల దరఖాస్తులను అఖాడాలు తిరిస్కరించారు. జునా అఖాడా, ఆవాహన్ అఖాడా, నిరంజని అఖాడా, బడా నిరంజని అఖాడాలు మొత్తం 104 అభ్యర్థనలను తిరస్కరించారు. ఈ అభ్యర్థుల తీరుతెన్నులు సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా లేవని తేలండంతో అఖాడాలు వీరి దరఖాస్తులను తిరస్కరించారు.మకర సంక్రాంతి నుండి ఇప్పటివరకు వివిధ అఖాడాలలో కొత్తగా 30 మందికి మహామండలేశ్వరులుగా, 3,500మందికి నాగ సాధువులుగా దీక్ష ఇచ్చారు. వసంత పంచమి నాడు జరిగే మూడవ అమృత స్నానం వరకు, మహామండలేశ్వరులకు, నాగ సన్యాసులకు దీక్షనిచ్చే కార్యక్రమం కొనసాగుతుంది.మహామండలేశ్వరులు, లేదా నాగ సాధువుగా మారేందుకు ముందుగా అఖాడాలలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం వారు ఆ దరఖాస్తులో తల్లిదండ్రులు, విద్యార్హతతో సహా పలు వ్యక్తిగత వివరాలు తెలియజేయాలి. వీటిని అఖాడాలు సమగ్రంగా పరిశీలిస్తారు. ఈ విధంగా వచ్చిన దరఖాస్తులలో నిరంజని అఖాడా ఆరు దరఖాస్తులను, జునా అఖాడా నాలుగు దరఖాస్తులను, ఆవాహన్ అఖాడా మహామండలేశ్వర్‌గా మారేందుకు వచ్చిన రెండు దరఖాస్తులను రద్దు చేసింది. నాగ సాధువులుగా మారేందుకు వచ్చిన దరఖాస్తులలో 92 దరఖాస్తులను రద్దు చేశారు. ఇది కూడా చదవండి: Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి -
ఇంకెన్నిసార్లు అప్లై చేయాలి?.. ‘ప్రజాపాలన’పై హరీశ్‌రావు ఫైర్
సాక్షి,సిద్దిపేట: పథకాల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం(జనవరి22) సిద్దిపేటలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలకు ఎన్నో షరతులు పెడుతున్నారన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా రైతులకు పూర్తి రుణమాఫీ చెయ్యకుండా ఎగ్గొట్టారని విమర్శించారు. పథకాల కోసం ప్రజాపాలనలో ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘సంక్షేమ పథకాలకు ఏడాది కిందట దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ దిక్కు లేదు, మళ్ళీ ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలి. దరఖాస్తుల పేరుతో డబ్బులు వృథా అవుతున్నాయి. దరఖాస్తులతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. అబద్దాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్దాల పరంపర కొనసాగిస్తోంది. అప్పుడు అందరికీ పరమాన్నం పెడతామన్నారు. ఇప్పుడు అందరికీ పంగ నామాలు పెడుతున్నారు. రుణమాఫీ అయిందని రేవంత్‌రెడ్డి హైదారాబాద్ లో చెప్తున్నాడు దమ్ముంటే ఇక్కడికి రా చూపెడత ఎంతమందికి కాలేదనేది. వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫి చేస్తానని ఇప్పుడు మిత్తీ కట్టించుకుని పాక్షిక రుణమాఫి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు, అబద్ధాలు. దమ్ముంటే రేవంత్ రెడ్డి గ్రామ సభలకు రావాలి నేను కూడా వస్తా. పోలీసులను పెట్టి నిర్బంధాల మధ్య గ్రామ సభ నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి డమ్మీ రుణమాఫీ చెక్ ఇచ్చావు. రెండు నెలలు అయినా రేవంత్ రెడ్డి ఇచ్చిన చెక్ పాస్ కాలేదు. ఈ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు. ఈ ప్రభుత్వానికి మోసాలు తప్ప, నీతి నిజాయితీ లేదు. రుణమాఫీపై వైట్ పెపర్ రిలీజ్ చేయాలి. ఎప్పటి లోగా చేస్తారో ఎన్ని చేయాలో చెప్పాలి. రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. వానాకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారో చెప్పాలి. ఇచ్చిన మాట ప్రకారం 15వేల రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ద్రవ్యోల్బణం పెరిగినందున రేషన్ కార్డు ఇన్‌కం లిమిట్ పెంచాలి.కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే తిరుబాటు తప్పదు. అర్హులకు ఇళ్లు ఇవ్వాలి. గ్రామ సభలలో కాంగ్రెస్ ఎంఎల్ఏ ఉన్న చోట ఎమ్మెల్యే ఫొటో పెడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట ఫోటోలు పెట్టడం లేదు. ప్రోటోకాల్ పాటించడం లేదు. రేవంత్ రెడ్డి ఏడాదిలోనే ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్నారు’అని హరీశ్‌రావు విమర్శించారు. -
దరఖాస్తులకు మరో చాన్స్
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 21 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గ్రామసభల్లోనూ ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో ఆదివారం ఓ సర్క్యులర్‌ను పంపారు. దాని ప్రకారం గ్రామ సభల్లో కొత్త రేషన్‌కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్ల చేర్పు కోసం దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది. అదే విధంగా ఒక కుటుంబం నుంచి వేరు పడుతున్న కుటుంబాలకు కొత్త కార్డులిచ్చేందుకు కూడా దరఖాస్తులు తీసుకోవాలి. కుటుంబ పెద్దతో పాటు ఇతర కుటుంబ సభ్యు ల వివరాలు, వారి ఆధార్ కార్డులు, కులం, మొబైల్ నంబర్, చిరునామా తదితర వివరాలను సేకరించాలి. అదేవిధంగా ప్రజాపాలన సేవా కేంద్రాలు, మీసేవ కేంద్రాల నుంచి వచ్చే దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక ఇప్పటికే వచ్చిన 1.36 కోట్ల మందికి సంబంధించిన 41.25 లక్షల కుటుంబాల దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేయాలి. కులగణనలో భాగంగా కార్డు లేదని సమాచారం ఇచ్చిన వారి వివరాలను కూడా పరిశీలించాలి. వీటికి తోడు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించిన తర్వాతే లబ్ధిదారుల జాబితాను ఖరారు చేయాల్సి ఉంటుందని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.గ్రామసభల్లో ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి ఇందిరమ్మ ఇళ్లకు కూడా గ్రామసభల్లో దరఖాస్తులు వస్తే తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో పక్కా ఇళ్లు లేని వారి వివరాలను కలెక్టర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల లాగిన్‌లో అందుబాటులో ఉంచామని, వాటి పరిశీలన వెంటనే పూర్తి చేయాలని సర్క్యులర్‌లో సూచించారు. రేషన్‌కార్డుల తరహాలోనే దరఖాస్తుదారుల అన్ని వివరాలను గ్రామ సభల్లో నమోదు చేసుకోవాలని, ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా వచ్చే దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను మదింపు చేయడం, ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోలేని వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడం, ఇందుకు సంబంధించి ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునే విధంగా గ్రామసభలు నిర్వహించాలని సూచించారు.ఆ పంచాయతీల్లోనూ ఆత్మీయ భరోసా భూమి లేని పేదల కుటుంబాలకు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాయాన్ని ఆ కుటుంబంలోని మహిళల బ్యాంకు ఖాతాకు జమ చేయాలని సీఎస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను ఇప్పటికే కలెక్టర్లకు, డీఆర్డీవోలకు పంపామని పేర్కొన్నారు. అదే విధంగా 2023–24 సంవత్సరంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం అయిన 156 గ్రామ పంచాయతీల్లోనూ ఈ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని సర్క్యులర్‌లో సీఎస్ స్పష్టం చేశారు. -
లోకల్ టు గ్లోబల్!
సాక్షి, హైదరాబాద్: చేనేత, హస్తకళలతోపాటు వ్యవసాయ రంగంలో ఘన సాంస్కృతిక వారసత్వాన్ని, నైపుణ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. తెలుగు నేలపై ప్రత్యేకత సంతరించుకున్న మరికొన్ని ఉత్పత్తులకు ఈ ఏడాది భౌగోళిక గుర్తింపు (జీఐ) సాధించేందుకు పోటీపడుతున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి మరో 10 ఉత్పత్తులు, ఏపీ నుంచి ఇంకో 12 ఉత్పత్తులు జీఐ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తుకు రానున్నాయి.ఈ మేరకు ఆయా చేనేత, హస్తకళల గుర్తింపు కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ ఉత్పత్తులకు గుర్తింపు కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వవిద్యాలయం, వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే తెలంగాణలో 17 ఉత్పత్తులకు జీఐ గుర్తింపు లభించగా ఏపీలో 19 ఉత్పత్తులకు జీఐ హోదా లభించింది. తాజా ప్రతిపాదనలకు కూడా జీఐ ట్యాగ్ లభిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 58 ఉత్పత్తులకు ఆ ఘనత లభించినట్లు అవుతుంది.తెలంగాణ నుంచి జీఐ దరఖాస్తులివీ.. హైదరాబాద్ ముత్యాలు, ఆర్మూర్ పసుపు, నారాయణపేట ఆభరణాల తయారీ కళ, మెదక్‌కు చెందిన బాటిక్ పెయింటింగ్, నల్లగొండలోని బంజారా కుట్లు–అల్లికలు, బంజారా గిరిజన ఆభరణాలు, బాలానగర్ సీతాఫలం, నల్లగొండ దోసకాయ (ఓరియెంటల్ పిక్లింగ్ మెలన్), అనబ్–ఈ–షాహీ ద్రాక్ష, ఖమ్మం మిర్చి.ఏపీ నుంచి జీఐ దరఖాస్తులివీ.. తిరుపతిలోని మాధవమాల హస్తకళా శిల్పాలు, జమ్మలమడుగులోని డూపియన్ సిల్‌్క, వైఎస్సార్ కడపలోని మాధవరం కాటన్ అండ్ సిల్క్ చీరలు, పోలవరం చీరలు, బొబ్బిలి చీరలు, కడపగుంట తెల్లజిల్లేడు చెక్క విగ్రహాలు, పాలమ్నేరు టెర్రకోట, సుగంధాల అరటి, మైదుకూరు పసుపు, పోలూరు వంకాయ, దుర్గాడ మిర్చి, కాకినాడ గులాబీ.జీఐ గుర్తింపు ఎందుకు? మన సంప్రదాయాన్ని, ఆర్థికాభివృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పే సాధనమే జీఐ. దీనివల్ల నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలకు చెందిన ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి పరిరక్షించడం వీలవుతుంది. ప్రస్తుతం దేశంలో 1,408 ఉత్పత్తులు జీఐ గుర్తింపు కోసం దరఖాస్తు చేయగా వాటిలో 658 ఉత్పత్తులు జీఐ గుర్తింపు పొందాయి.చట్టపరమైన రక్షణ.. భౌగోళిక గుర్తింపు వల్ల ఆయా ఉత్పత్తులకు చట్టపరమైన రక్షణ లభిస్తుంది. అలాగే వాటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఏర్పడుతుంది. ఫలితంగా ఉత్పత్తుల ఎగుమతితో ఉత్పత్తిదారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. జీఐ ఉత్పత్తులకు ఉండాల్సిన అర్హతలు ఇవే.. ⇒ ఆయా ఉత్పత్తి తప్పనిసరిగా స్థానిక భౌగోళిక ప్రాంతానికి చెందినదై ఉండాలి⇒ భౌగోళిక స్థానంతో కొంత అనుసంధానమై ఉండాలి ⇒ స్థానికంగా, జాతీయంగా లేదా ప్రపంచ స్థాయిలో ఖ్యాతిని కలిగి ఉండాలి⇒ ఆయా ఉత్పత్తులకు చారిత్రక ఆధారాలు, ఉనికి కలిగి ఉండాలి⇒ ఇతర ఉత్పత్తులతో కొంత ప్రత్యేకత కలిగి ఉండాలి⇒ స్థానిక సంఘం ద్వారా తయారై లేదా ఉత్పత్తి అయి ఉండాలిజీఐ గుర్తింపుతో వారసత్వ పరిరక్షణ సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ మన వారసత్వం, విలువలు, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేవి సాంస్కృతిక, హస్త, చేనేత కళలే. జీఐ గుర్తింపుతో ఉత్పత్తుల వారసత్వ పరిరక్షణతో పాటు ప్రపంచ దేశాలలో వ్యాపార డిమాండ్‌కు అవకాశం ఏర్పడుతుంది. – సుభాజిత్ సాహా, జీఐ ప్రాక్టీషనర్ -
ఓటర్ జాబితా తారుమారుకు బీజేపీ కుట్ర: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. ‘‘ఢిల్లీలో ఒక్క అసెంబ్లీ స్థానంలోనే 11 వేల ఓట్లను తొలగించాలంటూ ఈసీకి బీజేపీ దరఖాస్తులు చేసింది. నేను పోటీ చేసే న్యూఢిల్లీ స్థానంలోనూ 12,500 పేర్లను తొలగించాలంటూ దరఖాస్తు చేసింది. మేం ఈసీ దృష్టికి తీసుకెళ్లడం వల్ల పేర్ల తొలగింపు ఆగిపోయింది’’ అని వివరించారు. బీజేపీ ఆటలను సాగనివ్వబోమన్నారు. -
New Ration Cards: సంక్రాంతి నుంచి రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: పేద ప్రజల ఆహార భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌కార్డుల ద్వారా రాయితీపై బియ్యం, ఇతర వస్తువులు అందిస్తున్నాయి. గత ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీపై దృష్టి సారించకపోవడంతో దరఖాస్తుదారులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. ఆరేళ్లుగా కార్డుల జారీ నిలిపివేత నగర శివార్లలో ఆరేళ్లుగా పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేశారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు వేలల్లో ఉన్నారు. కార్డుల్లో మార్పు చేర్పులకు దరఖాస్తు చేసుకున్న వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. 2018లో కేవలం ఒకసారి మాత్రమే కొన్ని కార్డులను జారీచేసి పలు కారణాలతో నిలిపివేశారు. పదేళ్లుగా కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు, కార్డుల్లో పిల్లల పేర్లు నమోదు చేయాల్సిన వారంతా మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల్లో అయోమయంరేషన్ కార్డుల జారీ కాకపోవడంతో రేషన్‌కార్డుతో పాటు వచ్చే ఆరోగ్యశ్రీ సేవలను పొందలేకపోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డులను ముడిపెట్టడంతో కార్డులు లేని వారిలో అయోమయం నెలకొంది. ఇళ్ల మంజూరు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డులను ప్రామాణికంగా తీసుకోవడంతో కార్డులు లేని వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ప్రకటనతో హర్షం కొత్తగా వివాహాలు చేసుకున్న వారికి అర్హత ఉన్నా.. రేషన్‌కార్డులు లేకపోవడంతో ఆహార భద్రతా పథకంతో పాటు పలు పథకాలకు దూరమవుతున్నారు. తాజాగా ప్రభుత్వ ప్రకటనతో దరఖాస్తుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ⇒ మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం 10,82,348 రేషన్ కార్డులు ఉండగా, 35,40,883 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఇందులో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 5,32,938 రేషన్‌కార్డులు ఉండగా.. 17,18,351 మంది లబి్ధదారులు ఉన్నారు. ఏళ్లుగా రేషన్ కార్డులు అందకపోవడంతో కొంతమంది అర్హులు ప్రభుత్వ పథకాలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజాపాలనలో.. ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. నగర శివారు 3.89 లక్షల దరఖాస్తులు పౌరసరఫరాలశాఖ అధికారులకు చేరాయి. తాజాగా సంక్రాంతి నుంచి కొత్త కార్డులను జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో మరోసారి స్వీకరించే అవకాశాలున్నాయి. ఈ ప్రక్రియ కోసం అవసరమైన మార్గదర్శకాలు జనవరి మొదటి వారానికి కొలిక్కి రానున్నాయి. ఆదేశాలు రాగానే.... ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కొత్తరేషన్ కార్డుల జారీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికార వర్గాలు ప్రకటించాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని అధికారులు చెబుతున్నారు. రేషన్‌కార్డులు ప్రామాణికం ఉచిత బియ్యంతో పాటు ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసి, ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి నుంచి కొత్త రేషన్‌కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వాటి కోసం.. దరఖాస్తు చేసుకున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. -
దరఖాస్తు చేస్తే చాలు.. హజ్ యాత్రకు..
సాక్షి, హైదరాబాద్: హజ్ కమిటీ చరిత్రలో తొలిసారి దరఖాస్తు చేసుకున్న వారందరికీ హజ్ యాత్రకు వెళ్లే అవకాశం దక్కింది. తొలిసారి రాష్ట్రం నుంచి దాదాపు 10 వేల మంది యాత్రికులు 2025 హజ్ యాత్రకు వెళ్లనున్నట్టు రాష్ట్ర హజ్ కమిటీ ఈవో లియాకత్ హుస్సేన్ వెల్లడించారు. ఏటా గరిష్టంగా 6 నుంచి 7 వేల మందికే యాత్రకు అవకాశం దక్కేది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 40–50 శాతం మందికే యాత్రకు వెళ్లే అవకాశం లభించేది. కానీ ఈసారి రాష్ట్ర హజ్ యాత్ర కోటా పెరగడం.. దరఖాస్తులు తక్కువగా రావడంతో యాత్రకు వెళ్లే అవకాశం అందరికీ దక్కింది. ఈ ఏడాది 10 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటికే 8,500 మంది యాత్రకు ఎంపికయ్యారు. మిగతా 1,500 మంది మరో 2–3 నెలల్లో ఎంపికవుతారని రాష్ట్ర హజ్ కమిటీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది 2024 హజ్ యాత్రకు 11 వేల దరఖాస్తులు రాగా.. ఇందులో రాష్ట్రం నుంచి 7,500 మందికి మాత్రమే యాత్రకు వెళ్లే అవకాశం దక్కింది. 2025కు కేంద్ర హజ్ కమిటీ.. రాష్ట్ర హజ్ యాత్రికుల కోటా పెంచడంతో వెయ్యి దరఖాస్తులు తగ్గాయి. వచ్చే ఏడాది జూన్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు హజ్ యాత్ర కొనసాగనుంది. యాత్రకు నెల రోజుల ముందు నుంచే.. నగరం నుంచి హజ్ కమిటీ ద్వారా ప్రయాణం ప్రారంభం కానుందని లియాకత్ హుస్సేన్ చెప్పారు. -
రోజూ రూ.కోటి డ్రిప్ పరికరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతులకు రానున్న 90 రోజులపాటు ప్రతీరోజు రూ.కోటి విలువైన డ్రిప్ పరికరాలు సబ్సిడీపై అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. ఇందుకోసం రైతుల నుంచి ఈ 90 రోజులపాటు నిత్యం దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, కో–ఆపరేటివ్ శాఖల రాష్ట్రస్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.కొంతకాలంగా నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని యాసంగి నుంచి అమలుచేసి రైతులకు నాణ్యమైన పనిముట్లు, యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్‌పామ్‌తోపాటు ఉద్యాన పంటలకు కూడా డ్రిప్, స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు 2.31 లక్షల ఎకరాలకు చేరిందని తెలిపారు. ఆయిల్‌పామ్ ప్లాంటేషన్‌లో తక్కువ పురోగతి ఉన్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, వచ్చే ఏడాది మార్చికల్లా ముందుగా నిర్దేశించిన లక్ష ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. 8.59 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి సేకరణ రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకు మార్కెటింగ్ శాఖ అధికారులు 3,56,633 మంది రైతుల నుంచి మద్దతు ధరతో 8,59,272.68 మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించినట్లు అధికారులు మంత్రి తుమ్మలకు వివరించారు. గత సంవత్సరం ఇదే సమయానికి 1,99,108.43 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించినట్లు గుర్తుచేశారు. మరో రెండు నెలలపాటు పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే, ప్రాథమిక సహకార సంఘాల పనితీరు మెరుగుపరిచి ఎక్కువ మంది రైతులకు వాటి సేవలు చేరేలా నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆ శాఖ డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్‌కుమార్, హారి్టకల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
ఎడతెగని ఎదురుచూపు
రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన సంగీత గతేడాది బీటెక్ పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాలోని ప్రఖ్యాత వర్సిటీలో దరఖాస్తు చేయగా.. 2023 ఆగస్టులో ఆమెకు అడ్మిషన్ లభించింది. దీంతో ఆమె రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు పరిశీలన పూర్తి చేసుకుని పీజీ కోర్సులో చేరిపోయింది. స్కాలర్షిప్ వస్తుందన్న ఆశతో అప్పు చేసి అమెరికా వెళ్లింది. ప్రస్తుతం ఎమ్మెస్ మొదటి సంవత్సరం పూర్తయ్యింది. వచ్చే ఏడాది మార్చిలో రెండో సంవత్సరం కూడా పూర్తవుతుంది. కానీ విద్యానిధి పథకానికి ఆమె అర్హత సాధించిందా? లేదా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. సంగీత తండ్రి మాసాబ్‌ట్యాంక్‌లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించగా.. అర్హుల జాబితా ఇంకా సిద్ధంకాలేదని అధికారులు చెబుతున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఆయనకు అధికారుల నుంచి ఇదే సమాధానం వస్తోంది. ఇది ఒకరిద్దరి ఆవేదన కాదు.. దాదాపు ఆరువేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఎదురు చూపులివి.సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న మహాత్మా జ్యోతి బా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హుల ఎంపిక ఏడా దిన్నరగా నిలిచిపోయింది. 2023– 24 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద దరఖాస్తుల స్వీకరణే తప్ప అర్హులను తేల్చటంలేదు. దీంతో ఈ స్కాలర్షిప్ వస్తుందన్న ఆశతో అప్పులు చేసి విదేశాలకు వెళ్లిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకొన్న చాలామంది విద్యార్థులు ఇప్పటికే సగం కోర్సు కూడా పూర్తిచేశారు. కానీ తమ దరఖాస్తుల పరిస్థితి ఏమిటనేది ఇప్పటికీ తేలలేదు. దాదాపు రెండు సీజన్లలో వచ్చిన దరఖాస్తుల విషయం ఎటూ తేల్చకుండానే.. ఇప్పుడు మరోమారు దరఖాస్తుల స్వీకరణ సైతం చేపట్టారు. బీసీ సంక్షేమ శాఖ నాన్చుడు ధోరణి వల్ల దాదాపు ఆరువేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిభావంతులైన బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కూడా ఆయా సామాజిక వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యానిధి పథకాన్ని అందిస్తున్నాయి. ఆ శాఖలు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి స్కాలర్షిప్లు అందిస్తుండగా, బీసీ సంక్షేమ శాఖలో మాత్రం ఏడాదిన్నరగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నది.డిమాండ్ ఎక్కువ.. కోటా తక్కువపూలే విదేశీ విద్యానిధి పథకానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇతర శాఖలతో పోలిస్తే బీసీ సంక్షేమ శాఖలో వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ పథకం కింద ఏటా రెండు దఫాలుగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ స్ప్రింగ్ సీజన్, ఫాల్ సీజన్ అని ఏటా రెండుసార్లు ఉంటుంది. సెప్టెంబర్ వరకు మొదటి దఫా, జనవరిలో రెండో దఫా దరఖాస్తులను సంక్షేమ శాఖలు స్వీకరిస్తాయి. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత... విద్యార్థుల డిగ్రీ మార్కులతోపాటు జీఆర్ఈ/జీమ్యాట్‌లో మార్కులు, ఐఈఎల్టీఎస్/టోఫెల్ మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు శాఖలవారీగా ప్రత్యేక కమిటీలుంటాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లో పోటీ తక్కువగా ఉండడంతో అర్హుల ఎంపిక ఆలస్యం లేకుండా సాగిపోతున్నది. బీసీ సంక్షేమ శాఖలోవిపరీతమైన పోటీ ఉండడంతో ఉప కులాలవారీగా కోటాను విభజిస్తూ అర్హులను ఎంపిక చేస్తున్నారు. బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీలవారీగా అర్హులను ఎంపిక చేస్తారు. ఏటా (రెండు సీజన్లు కలిపి) 300 మందికి స్కాలర్షిప్లు ఇస్తారు. ఒక్కో సీజన్‌కు సగటున 3 వేల దరఖాస్తులు వస్తున్నాయి. ఈ లెక్కన గత రెండు సీజన్లలో 6 వేలకు పైబడి దరఖాస్తులు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అర్హులను ఎంపిక చేయలేదు. కోటా పెంపు కోసమేనట!పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి డిమాండ్ అధికంగా ఉండటంతో ప్రస్తుతం 300 యూనిట్లుగా ఉన్న కోటాను కనీసం వెయ్యికి పెంచాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై పలు సమీక్షలు నిర్వహించిన తర్వాత బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కోటా పెంపు ప్రతిపాదనలు పంపింది. ఏటా కనీసం 800 మంది విద్యార్థులకైనా ఈ పథకం కింద స్కాలర్íÙప్లు ఇవ్వాలని సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ ఫైలు సీఎం వద్దకు చేరి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ మోక్షం కలగలేదు. కోటా పెంపు తర్వాతే అర్హుల ఎంపిక చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి ప్రస్తుత పరిస్థితి2023–24 విద్యా సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులు 6 వేలకుపైగా ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి ఇచ్చే స్కాలర్షిప్ రూ.20 లక్షలు సంవత్సరానికి ఇచ్చే మొత్తం స్కాలర్íÙప్లు 300 -
విదేశీ విద్యకు సాయమందించండి
సాక్షి, హైదరాబాద్: తమ పిల్లలు చదువుకునేందుకు విదేశాలకు వెళ్లారని, వారికి అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద సాయమందించాలని పలువురు తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. గురువారం గాందీభవన్‌లో ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన మల్లు భట్టి విక్రమార్కను సామాన్య ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. విదేశీ విద్యానిధి పథకం కింద పెద్ద చదువులు చదువుకునే విద్యార్థులకు ప్రజాప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పిన భట్టి.. వీలున్నంత త్వరగా ఆ నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. » తన తల్లి బ్రెస్ట్ కేన్సర్‌తో బాధపడుతున్నారని, ఆమె ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు అవసరమైన సాయం అందించాలని మహేశ్ కోరగా, భట్టి వెంటనే స్పందించి ఇప్పటివరకు అయిన ఆస్పత్రి బిల్లులకు ఎల్ఓసీ ఇప్పించాలని తన పీఏను ఆదేశించారు. స్వయంగా తన నంబరు ఆ యువకుడికి ఇచ్చి ఎలాంటి సమస్య ఉన్నా తనకు తెలియజేయాలని సూచించారు. » జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా తమకు పోస్టింగులు ఇవ్వలేదంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగులు భట్టికి విజ్ఞప్తి చేయగా, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. » ట్రాన్స్‌కో, జెన్కోలలో ఖాళీగా ఉన్న డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, ఇంజనీర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంబంధిత శాఖ సిబ్బంది కూడా విజ్ఞప్తి చేశారు. » ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల కోసం పలువురు విజ్ఞప్తి చేశారు. మంత్రితో ముఖాముఖిలో భాగంగా మొత్తం 300 దరఖాస్తులు వచ్చాయి.ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యే శంకర్, టీపీసీసీ ప్రధానకార్యదర్శి అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. భట్టి దృష్టికి పటాన్చెరు పంచాయితీ పటాన్చెరు నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ నేత లు, ప్రస్తుత ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిల మధ్య నెలకొన్న రాజకీయ పంచాయితీ భట్టి దృష్టికి వచ్చింది. పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో వచ్చిన నేతలంతా తమపై మహిపాల్‌రెడ్డి పెత్తనం చేస్తున్నారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి అన్యాయం చేస్తున్నారని, తద్వారా నియోజకవర్గంలో పార్టీకి నష్టం జరుగుతోందని వివరించారు. ఆ తర్వాత కాట శ్రీనివాస్‌గౌడ్ కూడా టీపీసీసీ అధ్యక్షుడి చాంబర్లో భట్టితో పాటు మహేశ్‌గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. -
విద్యార్థులకు ఆధార్.. బాధార్..
ప్రభుత్వం నుంచి పొందే సేవలన్నింటినీ ఆధార్‌తో ముడిపెట్టడంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నత విద్య, ఉద్యోగ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలోను ఆధార్ కార్డునే పరిగణనలోకి తీసుకుంటుండడం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ఆధార్ కార్డును గుర్తింపు ధ్రువీకరణగా మాత్రమే చూడాలని కేంద్రం స్పష్టం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఆధార్ సమస్య వేధిస్తోంది. జనవరిలో జరగనున్న జేఈఈ మెయిన్–2025 మొదటి సెషన్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు గడువు ఈనెల 22న ముగియనుంది. దరఖాస్తు చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనలు విద్యార్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. ప్రధానంగా ఆధార్ కార్డులోను, టెన్త్ సర్టిఫికెట్లోను విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా ఒకే విధంగా ఉండాలనే నిబంధన చాలా ఇబ్బందిగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 20 వేలమందికిపైగా జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఆధార్‌కార్డు, టెన్త్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయగానే నేమ్స్ మిస్ మ్యాచ్ అని చూపిస్తోందని ఎక్కువశాతం మంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. –గుంటూరు ఎడ్యుకేషన్ఆధార్ కేంద్రాల వద్ద ఆలస్యం దీంతో జేఈఈ మెయిన్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు ఆధార్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఒక్క గుంటూరు నగరంలోనే వందలమంది విద్యార్థులు నెలరోజులుగా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. పేర్ల సవరణల కోసం ప్రయత్నిస్తున్నారు. పేరులో తప్పుల సవరణ, బయోమెట్రిక్ నమోదు, చిరునామా మార్పు ఒకేసారి చేయడం కుదరదని, మరోసారి రావాలని ఆయా కేంద్రాల సిబ్బంది చెబుతుండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దరఖాస్తుకు గడువు సమీపిస్తుండటం వారిని కలవరపరుస్తోంది. ఆధార్‌కార్డులో సవరణలకు 15 రోజుల నుంచి నెలరోజుల సమయం పట్టడం కూడా ఇబ్బందిగా మారింది. తగినన్నిఆధార్ కేంద్రాలేవి?జేఈఈ మెయిన్‌తోపాటు ఇంటర్మీడియెట్, అపార్ నమోదు కోసం ఆధార్‌లో సవరణలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తగినన్ని ఆధార్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఎంపిక చేసిన బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే ఉన్న ఆధార్ కేంద్రాలు ప్రస్తుతం కిటకిటలాడుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చి గుంటూరులోని ప్రైవేటు జూనియర్ కళాశాలల హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆధార్ కార్డులో సవరణలు కోసం ఎక్కడో మారుమూల ఉన్న ఊర్ల నుంచి తల్లిదండ్రులు వచి్చ, పిల్లలను వెంటబెట్టుకుని ఆ«ధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. రోజుల తరబడి ఇక్కడే ఉండాలంటే వారికి కష్టంగా ఉంటోంది. పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సిన విద్యార్థుల సమయం ఆధార్ కేంద్రాల వద్దే గడిచిపోతోంది. దీనికితోడు గుంటూరులో చంద్రమౌళీనగర్‌లోని పోస్టాఫీసులో ఉన్న ఆధార్ కేంద్రాన్ని ఇటీవల మూసేశారు. విద్యార్థుల కోసం ఆధార్ సవరణలకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన జిల్లా అధికారులు తరువాత పట్టించుకోలేదు. -
అర్జీలన్నీ అంతే సంగతులా!?
విజయవాడ కండ్రికలోని ఈమె ఇల్లు ఇటీవల బుడమేరు వరదల్లో పూర్తిగా మునిగింది. 12 రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపింది. సర్వే సిబ్బంది వివరాలు రాసుకుని వెళ్లారు. అయితే, పరిహారానికి సంబంధించిన జాబితాలో మాత్రం ఈమె పేరులేదు. సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితంలేదు. కలెక్టరేట్లో కూడా మరోసారి దరఖాస్తు చేసుకుంది. చివరికి.. ఎవరిని అడిగినా లాభంలేక సాయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ : బుడమేరు వరదతో విజయవాడలో నిండా మునిగిన బాధితులకు నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వరదలు వచ్చి 45 రోజులకు పైగా గడిచినప్పటికీ, సాయం కోసం ఇంకా వేలాది మంది బాధితులు నిరీక్షిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క బాధితుడికి సహాయం అందిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. రకరకాల సాకులతో బాధితుల జాబితాకు కోతేసి గతనెల 17న సచివాలయాల్లో ప్రదర్శించారు. కానీ, సర్వే అంతా తప్పుల తడకగా ఉందని, గ్రౌండ్‌ఫ్లోర్ అయితే, ఫçస్ట్ ఫ్లోర్ అని.. వాహనాలు నమోదు కాలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మరికొందరైతే తమ పేర్లు నమోదు చేయలేదంటూ రోడ్డెక్కి ధర్నా చేశారు. దీంతో బాధితుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు సచివాలయాల పరిధిలో దరఖాస్తులు తీసుకున్నారు. ఆ సమయంలో 18వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో కొన్నింటిని పరిష్కరించి, వరద బాధితుల ఖాతాల్లో నగదు జమచేశారు. అయినా ఇంకా తమకు పరిహారం అందలేదంటూ చాలామంది సెపె్టంబరు 27 వరకు సచివాలయాల చుట్టూ తిరిగారు. తామేమీ చేయలేమని అక్కడి సిబ్బంది చెతులేత్తేయడంతో సెప్టెంబరు 28 నుంచి బాధితులు దరఖాస్తులతో విజయవాడలోని కలెక్టరేట్ బాటపట్టారు. ఇలా వచ్చిన దరఖాస్తులు 21వేలకు పైగా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సాయం కోసం ఎదురుచూపులు.. సీన్ కట్‌చేస్తే.. ఇప్పుడీ దరఖాస్తుల గురించి సమా«ధానం చెప్పేవారే కరువయ్యారు. వీటిని అధికారులు పరిశీలించి, అర్హులైన జాబితాలు సచివాలయాల్లో ఉంచితే బాధితుల్లో గందరగోళం ఉండేది కాదు. అయితే, దరఖాస్తులు కంటితుడుపుగా తీసుకున్నారా లేక కాలయాపన చేసి వీటిని కోల్డ్‌స్టోరేజిలోకి నెడతారా అని బాధితులు అనుమానిస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోవడంతో, బాధితుల అర్జీలన్నీ బుట్టదాఖలు అయినట్లేనని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు. అంచనా బృందాల అరాచకం.. ఇక నష్టం అంచనా జాబితాలోనే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందంటూ బాధితులు మండిపడుతున్నారు. అంచనా బృందాలు వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నా డోర్‌లాక్ అని నమోదు చేశారని, గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటే నాలుగో అంతస్తు అని నమోదు చేశారని.. ఇల్లంతా బురదమయంగా కనిపిస్తున్నా.. నష్టం జరగలేదని నమోదు చేశారని, వాహనాలు పూర్తిగా పాడైనా.. ఎలాంటి నష్టం జరగలేదని నమోదు చేశారని, ఆధార్, బ్యాంకు ఖాతాలన్నీ సక్రమంగానే ఉన్నా నాట్ ట్రేస్డ్ అని నమోదు చేశారని బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారు. సాయం చేసింది గోరంతే.. ఇదిలా ఉంటే.. వరద నష్టం అంచనా పూర్తయిన తరువాత ముంపు ప్రాంతాల్లో 2.68 లక్షల కుటుంబాలకు నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇందులో 2.32 లక్షల కుటుంబాలకు సంబంధించి 1,700 సర్వే బృందాలతో సర్వే చేయించారు. ఇందులో ఇప్పటివరకు 89,616 ఇళ్లు నీట మునిగినందున రూ.188.80 కోట్ల పరిహారం అందించారు. ఎంఎస్ఎంఈలు, వాహనాలు, వ్యవసాయరంగం, పశువులు, మత్స్యశాఖ, చేనేత, ఉద్యానవనం అన్ని శాఖలకు కలిపి రూ.97.66 కోట్ల సాయం మాత్రమే అందించారు. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించే రూ.55.60 కోట్ల పరిహారం ఉంది. అంటే.. వరదకు సంబంధించి జిల్లాలో అన్ని రకాల సాయం కింద అందించింది కేవలం రూ.286.46 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక బాధితులకు ఇచ్చిన పరిహారం కంటే అగ్గిపెట్టెలు, భోజనాలు ఇతర ఖర్చుల కింద ఎక్కువగా ఖర్చుచేయడం విశేషం. అతీగతీలేని సాయం.. మేం రాజీవ్‌నగర్ ప్లాట్ నెంబరు 26లో ఉంటున్నాం. బుడమేరు వరదలో ఇల్లు పూర్తిగా మునిగింది. సర్వే సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. నష్టపరిహారానికి సంబంధించిన జాబితాలో పేరున్నా డబ్బు మాత్రం పడలేదు. ఎవర్ని అడిగినా సమా«ధానం కరువైంది. చివరికి కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు అతీగతీలేదు. – వెంగల సాయితేజ, రాజీవ్‌నగర్ -
ఏకంగా 155 లిక్కర్ షాపులకు ఢిల్లీ వ్యాపారి దరఖాస్తులు.. ఇంతకీ లక్ తగిలిందా?
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వైన్‌షాపుల కోసం ఒకవైపు కూటమి ప్రజాప్రతినిధులు, సిండికేట్లు పెద్ద ఎత్తున పోటీ పడగా.. మరో వైపు ఢిల్లీకి చెందిన లిక్కర్ వ్యాపారి కూడా విశాఖ జిల్లాలో మద్యం వ్యాపారంపై దృష్టి పెట్టాడు. ఇక్కడి సిండికేట్లను మించి 155 వైన్‌షాపులకు దరఖాస్తులు చేశాడు. అమిత్ అగర్వాల్, నందినీ గోయల్, సారికా గోయల్, సౌరభ్ గోయల్ పేర్లతో దరఖాస్తులు సమర్పించాడు.ఒక్కో దుకాణ లాటరీకి దరఖాస్తు చేసిన 24 నుంచి 30 మంది మారుతున్నప్పటికీ ఆయన మాత్రం అక్కడి నుంచి కదలలేదు. వరుసగా అన్ని షాపుల లాటరీ నిర్వహణలోను పాల్గొనడంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎక్సైజ్ సిబ్బంది ద్వారా ఆరా తీశారు. అతడిని ప్రశ్నించిన ఎక్సై జ్ అధికారులతో పాటు కలెక్టర్, జేసీ కూడా విస్తుపోయారు.155 షాపులకు దరఖాస్తు చేసినట్లు సదరు వ్యక్తి చెప్పడంతో షాక్‌కు గురయ్యారు. అన్ని షాపులకు కలిపి దరఖాస్తు రుసుమే రూ.3 కోట్లు అవుతుంది. అంత స్థాయిలో దరఖాస్తు ఫీజు చెల్లించి సదరు వ్యాపారికి లాటరీలో 6 షాపులు దక్కాయి. ఒడిశా నుంచి కూడా ఒక లిక్కర్ కింగ్ భారీగా దరఖాస్తులు సమర్పించినప్పటికీ.. కేవలం 2 షాపులు మాత్రమే లభించాయి.ఇదీ చదవండి: ‘ముఖ్య’ నేత మాటే ఫైనల్.. మాఫియాదే రాజ్యం -
సిండికేట్ కైవశం!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేటే పైచేయి సాధించింది. ప్రైవేటు మద్యం దుకాణాలకు లైసెన్సుల ప్రక్రియను ఆ ‘పచ్చ’ముఠా పూర్తిగా హైజాక్ చేసేసింది. ప్రభుత్వ ముఖ్య నేత పన్నాగం.. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టెండర్ల వైపు ఇతరులెవ్వరూ కన్నెత్తి చూడకుండా ఎప్పటికప్పుడు వారిని అడుగడుగునా అడ్డుకుంటూ హడలెత్తించారు. తద్వారా.. రాష్ట్రంలో మద్యం వ్యాపారం ద్వారా భారీ దోపిడీకి మొదటి అంకాన్ని అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తిచేశారు. దీంతో రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 87,116 దరఖాస్తులు రాగా.. వాటిలో దాదాపు 99 శాతం టీడీపీ మద్యం సిండికేట్‌వే. సాధారణ వ్యాపారులు దరఖాస్తులు దాఖలు చేయకుండా.. అదే సమయంలో తమలో తామే పోటీపడినట్లు బిల్డప్ ఇస్తూ మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియను ఏకపక్షంగా పూర్తిచేశారు. ఇక లాటరీ ద్వారా టీడీపీ సిండికేట్ ఏకపక్షంగా మొత్తం 3,396 దుకాణాలను దక్కించుకోవడం.. ఆ తర్వాత యథేచ్ఛగా మద్యం ఏరులను పారిస్తూ భారీ దోపిడీకి తెగబడటమే తరువాయి.టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దందా..2014–19 కంటే రెట్టింపు స్థాయిలో మద్యం వ్యాపారం ద్వారా దోపిడీయే లక్ష్యంగా అధికార టీడీపీ కూటమి మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియను శాసించింది. ఎందుకంటే ఏకంగా ముఖ్యనేతే ఇందుకు పచ్చజెండా ఊపడంతో ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డూ అదుపులేకుండా చెలరేగిపోయారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ మద్యం సిండికేట్‌ను ఏర్పాటుచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినవారు తప్ప ఇతరులెవరూ దరఖాస్తులు చేయడానికి వీల్లేదని హెచ్చరికలు జారీచేశారు. కాదని ఎవరైనా దరఖాస్తు చేసినా వారికి మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎవరూ షాపులు అద్దెకు ఇవ్వకూడదని బహిరంగంగానే ప్రకటించారు. ఇక ఇతరులు తమ సొంత దుకాణాల్లో ఏర్పాటుచేసుకుంటే ఎక్సైజ్ శాఖ అధికారులతో తరచూ తనిఖీలు, దాడులతో వేధిస్తామని అల్టిమేటం జారీచేశారు. అయినా కొందరు దరఖాస్తులు దాఖలు చేసేందుకు ప్రయత్నించగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వారిపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడి బెదరగొట్టారు. దీంతో అసలు టెండర్లు దాఖలు చేసేందుకు సాధారణ వ్యాపారులెవరూ సాహసించలేదు. నిజానికి.. టెండర్ల ప్రక్రియలో మొదటి వారం రోజులు ఒక్కో దుకాణానికి సగటున 10 కూడా దరఖాస్తులు రాలేదు. దీంతో టీడీపీ సిండికేట్ వ్యవహారం బహిరంగ దందాగా మారింది. ఆ తర్వాత ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రభుత్వ ముఖ్యనేత కొత్త ఎత్తుగడ వేశారు. దరఖాస్తుల సంఖ్య కొంత పెంచాలని.. కానీ, అవి కూడా టీడీపీ సిండికేట్ సభ్యులవే ఉండేలా చూడాలన్నారు. తద్వారా ఒక్కో మద్యం దరఖాస్తుకు రూ.2 లక్షల వరకు నాన్ రిఫండబుల్ డిపాజిట్ భరించాలన్నారు. ఎలాగూ మద్యం దందా ద్వారా విచ్చలవిడి దోపిడీకి పచ్చజెండా ఊపాం కదా అని అసలు లోగుట్టు చెప్పారు. ఫలితంగా.. టీడీపీ సిండకేట్ సభ్యులే ఒక్కొక్కరు వేర్వేరు పేర్లతో దరఖాస్తులు దాఖలు చేశారు.దాచినా దాగని దందా..ఇక టీడీపీ మద్యం సిండికేట్ దందాకు ఎంతగా కనికట్టు చేయాలని చూసినా కుదరలేదు. తెలంగాణతో పోల్చిచూస్తే రాష్ట్రంలో ఈ దరఖాస్తుల ప్రక్రియ ఎంత ఏకపక్షంగా సాగిందన్నది స్పష్టమవుతోంది. విస్తీర్ణపరంగా ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నదైన తెలంగాణలో మద్యం దుకాణాల సంఖ్య కూడా తక్కువే. తెలంగాణలో గత ఏడాది మొత్తం 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు పిలవగాఏకంగా 1.50 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అంటే.. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 57 దరఖాస్తులు దాఖలయ్యాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో అంతేకంటే అధికంగా 3,396 మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు పిలిచారు. కానీ, దరఖాస్తులు మాత్రం కేవలం 87,116 మాత్రమే రావడం గమనార్హం.అంటే సగటున ఒక మద్యం దుకాణానికి 25 మాత్రమే వచ్చాయి. చివరికి..ఆ దరఖాస్తులుకూడా టీడీపీ సిండికేట్‌వే. ‘బెల్టు’లూ బార్లా..ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పంచాయతీలో రెండు నుంచి ఆరు వరకు బెల్టుషాపులను ఏర్పాటుచేసేందుకు కసరత్తు జరుగుతోంది. పట్టణాల్లో వీటి సంఖ్య మరింత పెరగనుంది. ఇప్పటికే గత టీడీపీ హయాంలోని బెల్టు షాపుల నిర్వాహకులతో సిండికేట్ సభ్యులు మంతనాలు మొదలుపెట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బలంగా ఉన్న మద్యం సిండికేట్లే ఇప్పుడూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. చాలాచోట్ల ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఈ సిండికేట్లను వెనకుండి నడిపిస్తున్నారు. ఒకవేళ లాటరీలో బయటివారికి షాపులు దక్కినా వారి వ్యాపారం సజావుగా సాగాలంటే తమ సిండికేట్లలో కలవాల్సిందేనని సంకేతాలిస్తున్నారు. ఇక ఒక్కో బెల్టుషాపు ఏర్పాటుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్టు చెల్లించాలని చెబుతున్నట్లు తెలిసింది. డిపాజిట్ చేసిన వారికే తమ షాపుల పరిధిలో బెల్టుషాపు ఏర్పాటుకు అనుమతించి అందుకు అవసరమైన సరుకు ఇస్తామంటున్నారు. లేనిపక్షంలో దాడులు చేయించి కేసులు పెట్టిస్తామని హెచ్చరిస్తున్నట్టు సమాచారం. కాగా.. షాపుల నిర్వహణ తగ్గించుకునేందుకే సిండికేట్లు బెల్టుషాపుల ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో మద్యం షాపు నిర్వహణకు నెలనెలా అన్ని రకాల ఖర్చులకు లక్షకు పైగానే వ్యయమవుతుందని వారి అంచనా. ఈ భారాన్ని తగ్గించుకునేందుకే వారు ‘బెల్టు’ వైపు మొగ్గుచూపుతున్నారు.చివరిరోజూ అరాచకమే..టెండర్ల చివరిరోజైన శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బెదిరింపుల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. టెండరు కేంద్రాల వద్ద సినీఫక్కీ మాదిరిగా ఎమ్మెల్యేలు, మంత్రుల అనుచరులు మాటువేశారు. ఉదయం నుంచి సాయంత్రం గడువు ముగిసే వరకూ అడుగడుగునా నిఘా ఏర్పాటుచేశారు. వేరే వ్యక్తి ఎవరైనా ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లినా.. టెండరు వేసేందుకు దరఖాస్తు తీసుకున్నా.. క్షణాల్లో వారిపై బెదిరింపులకు పాల్పడేలా మందీమార్బలాన్ని మోహరించారు. ‘ఏం మిస్టర్.. ఎక్సైజ్ ఆఫీస్‌కి వెళ్లావట. దరఖాస్తు చేద్దామనా? అప్లై చేసి చూడు.. మా వాళ్లను కాదని టెండరు వేస్తే తాటతీస్తా’.. అంటూ కృష్ణాజిల్లాలోని ఓ ఎమ్మెల్యే మద్యం షాపు దరఖాస్తు కోసం వెళ్లిన వ్యక్తిని బెదిరించారంటే అధికార పార్టీ సిండికేట్ల అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. అలాగే.. ఇదే జిల్లా గన్నవరం, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లో గతంలో షాపులు నిర్వహించుకున్న వారు లేదా స్థానికులు లేదా ఇతర పార్టీల వారు దరఖాస్తుకు వెళ్తే స్థానిక ఎమ్మెల్యేల అనుచరులు వార్నింగ్‌లు ఇచ్చి వెనక్కి పంపేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఒకవైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతుండగా మరోవైపు.. సామ, దాన, భేద దండోపాయాలనూ పోలీసుల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రయోగించింది. చివరికి.. అధికార పార్టీ నేతలకూ ఈ హెచ్చరికలు తప్పలేదని భోగట్టా. -
అందని పరిహారం.. ఆగని దరఖాస్తులు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): బుడమేరు వరద బాధితులు నెల రోజులుగా పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. వరదకు సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన తమకు ప్రభుత్వం సహాయం చేస్తుందేమోనన్న ఆశతో వేలాది బాధితులు నిత్యం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నారు. కార్యాలయం గేట్లు మూసేసి పోలీసులు దూరంగా తోసేస్తున్నా, అధికారులు ఛీత్కరించుకుంటున్నా ‘వరదకు బలైపోయాం.. సాయం చేయండయ్యా’ అని వేడుకొంటున్న తీరు అందరినీ కదిలిస్తోంది తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం చలనం రావడంలేదు. బాధితులకు ఏదో చేసేశామంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలే తప్ప.. వాస్తవంగా ఒరిగిందేమీ లేదు. ఈ విషయాన్ని కలెక్టరేట్ వద్దకు వస్తున్న బాధితుల సంఖ్యే చెబుతోంది. నిత్యం వందలాది బాధితులు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌కు క్యూ కడుతూనే ఉన్నారు. బాధితుల నుంచి గుట్టలుగుట్టలుగా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. శనివారం నాడు కూడా కండ్రిక, వైఎస్సార్ కాలనీ, ఉడా కాలనీ, భవానీపురం ప్రాంతాల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారిని కలెక్టర్ కార్యాలయం లోపలికి అనుమతించకపోవడంతో బందరు రోడ్డుపై ఎండలోనే చంటి పిల్లలతో సహా పడిగాపులుకాశారు. చాలా సేపటి తర్వాత అధికారులు వచ్చి దరఖాస్తులు స్వీకరించారు. అయితే, దరఖాస్తులో సచివాలయ నంబర్ తప్పనిసరిగా రాయాల్సి రావడంతో బాధితులు ఇబ్బందులు పడ్డారు. తమ ప్రాంత సచివాలయ కోడ్ తెలియక ఒకటికి రెండు సార్లు ఇంటికి, కలెక్టరేట్‌కు తిరిగారు. నెల రోజులుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పటికీ రూపాయి సాయం అందలేదని బాధితులు వాపోతున్నారు. పరిహారం ఎందుకు జమ కాలేదో ఏ ఒక్కరూ చెప్పడంలేదని మండిపడుతున్నారు. వరదల్లో అన్నీ కోల్పోయిన తమకు పరిహారం ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది, స్థానిక వీఆర్వోలు కలెక్టరేట్‌కు వెళ్లమని చెబుతున్నారే తప్ప సరైన కారణాలు చెప్పడం లేదని మండిపడుతున్నారు. రీ సర్వే చేయాలి ఎఫ్‌సీఐలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యాను. హెచ్ఐజీ–2లో 235 ఫ్లాట్‌లో ఉంటున్నా. వరదలకు ఇల్లు మునిగిపోయింది. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, మోటార్, కారు, స్కూటర్ మొత్తం దెబ్బతిన్నాయి. రూ. 2 లక్షలకు పైగా నష్టం వచి్చంది. సర్వే టీం రెండు మూడు సార్లు వచ్చి రాసుకున్నారు. వాళ్లేమి రాశారో తెలీదు. ఈ రోజుకు కూడా నాకు పరిహారం అందలేదు. స్థానిక ఎమ్మెల్యేను కలిసి విన్నవించాను. కలెక్టర్‌ను కలిసేందుకు వస్తే అందుబాటులో లేరు. మా ప్రాంతంలో రీ సర్వే చేసి నష్టం వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి. – వీవీ సూర్యనారాయణ రావు, హౌసింగ్ బోర్డు కాలనీ, భవానీపురం -
Tech Talk: యూట్యూబ్‌లో.. ఈ ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఉన్నాయని మీకు తెలుసా!
క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ ఇన్నోవేటివ్ ఫీచర్లను ప్రకటించింది. కంటెంట్ క్రియేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ అధునాతన వీడియో జనరేషన్ టెక్నాలజీ, కమ్యూనిటీ ఫీచర్లు ఉపయోగపడతాయి.వీయో ఇన్ డ్రీమ్ స్క్రీన్: షార్ట్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ జనరేట్ చేయడం కోసం రూపొందించిన యూట్యూబ్ డ్రీమ్స్క్రీన్ ఫీచర్ ఇప్పుడు గూగుల్ డీప్‌మైండ్ వీయోను ఇంటిగ్రేట్ చేస్తుంది. ఈ అప్‌గ్రేడ్ క్రియేటర్లకు సహజత్వంతో కూడిన బ్యాక్‌గ్రౌండ్, స్టాండ్‌లోన్ వీడియో క్లిప్‌లను క్రియేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. షార్ట్–ఫామ్ కంటెంట్ నాణ్యతను పెంచుతుంది.ఇన్స్పిరేషన్ ట్యాబ్ అప్‌గ్రేడ్: ఐడియాలు, టైటిల్స్, థంబ్ నెయిల్స్, ఔట్లైన్స్ను మెరుగుపరచడానికి ఉపకరిస్తుంది.కమ్యూనిటీస్: ఈ సరికొత్త కమ్యూనిటీస్ ఫీచర్ ద్వారా క్రియేటర్లు, సబ్స్క్రైబర్లు వీడియోలు, టాపిక్స్ గురించి చర్చించుకోవచ్చు.ఆటో డబ్బింగ్: యూట్యూబ్ ‘ఆటో డబ్బింగ్’ ఫీచర్‌ని విస్తరించనుంది. డబ్బింగ్ ఆడియో ట్రాక్‌లను ఆటోమేటిక్‌గా యాడ్ చేయడానికి క్రియేటర్లకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇది వీడియోలను ప్రపంచ ప్రేక్షలకు చేరువ చేస్తుంది. భాష అడ్డంకులు లేకుండా చేస్తుంది.హైప్ ఫీచర్: ‘హైప్’ ఫీచర్ ద్వారా ఔత్సాహిక క్రియేటర్లు కొత్త ఆడియెన్స్‌తో కనెక్ట్ కావచ్చు. అయిదు లక్షల కంటే తక్కువ చందాదారులు ఉన్న క్రియేటర్ల నుంచి వీడియోలను హైప్ చేయడానికి ఈ ఫీచర్ వినియోగదారులకు ఉపయోగపడుతుంది. చిన్న, మధ్యతరహా క్రియేయేటర్ల అభివృద్ధికి ఉపయోగపడే ఫీచర్‌ను తీసుకురావాలనే జెన్ జెడ్‌లోని అత్యధికుల విన్నపం మేరకు ‘హైప్’ ఫీచర్‌ని తీసుకువచ్చారు. గూగుల్ పిక్సెల్ 9ప్రో..డిస్ప్లే: 6.30 అంగుళాలు ; బరువు: 199 గ్రా.మెమోరీ: 128జీబి 16జీబి ర్యామ్/256జీబి 16జీబి ర్యామ్/ 512 జీబి 16జీబి ర్యామ్బ్యాటరీ: 4700 ఎంఏహెచ్ఫ్రంట్ కెమెరా: 42 ఎంపీడిజిటెక్ స్మార్ట్‌ఫోన్ జింబల్..బ్రాండ్: డిజిటెక్ బరువు: 400 గ్రా. కలర్: లైట్ గ్రే 3 క్రియేటివ్ ఆపరేషన్ మోడ్స్:ఆల్ ఫాలో మోడ్హాఫ్ ఫాలో మోడ్ ఆల్ లాక్ మోడ్పోర్టబుల్ అండ్ ఫోల్డబుల్ఇన్స్టా ‘రీల్స్’ (ఆండ్రాయిడ్) డౌన్లోడ్ చేయడానికి...‘వీడియో డౌన్లోడర్ ఫర్ ఇన్స్టాగ్రామ్’లాంటి యాప్‌లను ఉపయోగించి ‘రీల్స్’ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ‘రీల్స్’ లింక్‌ను కాపీ చేసి యాప్‌లో పేస్ట్ చేయడం ద్వారా ఫోన్ గ్యాలరీలో డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఐఫోన్ యూజర్లు ‘రీల్స్’ను డౌన్లోడ్ చేసుకోవడానికి ‘ఇన్సేవర్:రీపోస్ట్ ఫర్ ఇన్స్టాగ్రామ్’లాంటి యాప్‌లను ఉపయోగించవచ్చు. థర్డ్–పార్టీ యాప్‌లపై మీకు ఆసక్తి లేకపోతే ‘స్క్రీన్ రికార్డింగ్’ అనేది ఒక ఆప్షన్.కొత్త ఇమోజీలు..మన భావోద్వేగాలను వేగంగా వ్యక్తీకరించడానికి ఇమోజీ అనేది చక్కటి మార్గం. కోపం, నిరాశ, నిరుత్సాహం, ఉత్సాహం... ఇలా ప్రతి భావోద్వేగానికి ఒక ఇమోజీ ఉంది. ఇప్పుడు ఉన్న ఎన్నో ఇమోజీలకు కొత్తగా మరో 8 యాడ్ కానున్నాయి. దీంతో ఇమోజీల ప్రపంచం మరింతగా విస్తరించనుంది.కొత్త ఇమోజీలను సృష్టించే బాధ్యత యూనికోడ్ స్టాండర్డ్ తీసుకుంటుంది. సార్క్ అధికారిక జెండా, పార, రూట్ వెజిటేబుల్, కంటికింద సంచులతో అలిసిపోయిన ముఖం, పెయింట్ స్పా›్లట్, చెట్టు కొమ్మ, వేలిముద్ర, హర్ప్(మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్)... ఇలాంటి కొత్త ఐకాన్లను యూనికోడ్ ఎనౌన్స్ చేసింది.ఇవి చదవండి: హెల్దీ డైట్.. క్యారమెల్ బార్స్! -
తొలిరోజు 285 దరఖాస్తులు... 30 పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: పార్టీ కార్యకర్తలు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం ‘మంత్రులతో ముఖాముఖి’కార్యక్రమం ప్రారంభమైంది. తొలిరోజు కార్యక్రమానికి హాజరైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజల నుంచి 4 గంటల పాటు దరఖాస్తులు తీసుకున్నారు. దాదాపు 285 దరఖాస్తులు రాగా, అందులో 30కి పైగా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు. ఇందుకోసం బాధితుల సమక్షంలోనే ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతోపాటు పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసిన దామోదర.. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ముఖ్యంగా 317 జీవో కారణంగా ఇబ్బందులు పడుతున్న గురుకుల ఉపాధ్యాయులు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు వచ్చి తమ అర్జీలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లు కావాలని, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలని, రేషన్‌కార్డులు కావాలని, ఉపాధి కల్పించాలని, చిన్నారుల ఆరోగ్య సమస్యలకు సాయం చేయాలని, 108 సిబ్బందికి ఏఎన్ఎం ఉద్యోగ నోటిఫికేషన్లలో వెయిటేజీ ఇవ్వాలని కోరుతూ పలువురు దరఖాస్తులు సమర్పించారు. గత పదేళ్లలో తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయించాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. తొలిరోజు వచ్చిన దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించామని, ఎప్పటికప్పుడు ఈ సమస్యల పరిష్కార దశలను తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెప్పాయి. అద్భుత ఆలోచన: మంత్రి దామోదర గాంధీభవన్‌లో ప్రజావాణి చేపట్టడం అద్భుతమైన ఆలోచన అని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ను అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను పరిష్కరించే మాట అటుంచితే కనీసం వారి గోడు వినేవారు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు తాము ప్రజల సమస్యలు విని పరిష్కరించే దిశలో అడుగులు వేస్తున్నామని చెప్పారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆయా శాఖలకు పంపుతామని, వీలున్న దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ కాంగ్రెస్ పారీ్టకి ప్రజలు, కార్యకర్తలంటే ఎంతో గౌరవమని, అందుకే వారి సమస్యల పరిష్కారం కోసం గాంధీభవన్‌లో ప్రజావాణి లాంటి కార్యక్రమాన్ని చేపట్టామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీభవన్‌కు వచ్చి ప్రజలు, కార్యకర్తలతో మమేకమవుతారని, వారి సమస్యలపై అర్జీలు తీసుకుంటారని చెప్పారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని ఆయన కార్యక్రమ ప్రారంభ సభలో చెప్పారు. -
లైసెన్స్ కోసం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దరఖాస్తు
న్యూఢిల్లీ: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఏయూఎస్ఎఫ్బీ) పూర్తి స్థాయి బ్యాంక్ లైసెన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్బీఐ) దరఖాస్తు సమర్పించింది. కనీస నికర విలువ రూ. 1,000 కోట్లతో సహా నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న చిన్న ఆర్థిక బ్యాంకులు.. పూర్తి స్థాయి బ్యాంక్‌లుగా మారడానికి ఏప్రిల్‌లో ఆర్బీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకు అనుగుణంగా దరఖాస్తు సమర్పించినట్లు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక బీఎస్ఈ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.ప్రైవేట్ రంగంలో చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీ) పూర్తి స్థాయి బ్యాంకుగా మారడానికి సంబంధించిన లైసెన్సింగ్ మార్గదర్శకాలను నవంబర్ 2014లో ఆర్బీఐ జారీ చేసింది. జైపూర్‌కు చెందిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ ఏడాది మొదట్లో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ను కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి విలీనం అమల్లోకి వచ్చింది. దీనితో విలీన సంస్థ మొత్తం వ్యాపార పరిమాణం రూ. 1.8 లక్షల కోట్లు దాటింది. -
కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్: బాలికలకు స్కాలర్షిప్స్..
సాక్షి, సిటీబ్యూరో: కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాలలో భాగంగా కోటక్ మహీంద్రా గ్రూప్ ఆధ్వర్యంలోని కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కెఈఎఫ్) తమ కన్య స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా 500 మందికి స్కాలర్షిప్లను ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికల ఉన్నత విద్యార్జనకు వీలుగా ఏటా రూ. 1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని 4–5 సంవత్సరాల పాటు అందిస్తామని చెప్పారు. రూ.6లక్షల లోపు వార్షికాదాయం కలిగిన కుటుంబాలకు చెందినవారై, 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో 75 శాతం ఆ పైన మార్కులు సాధించిన వారు ఈ స్కాలర్షిప్స్ దరఖాస్తుకు అర్హత పొందుతారని తెలియజేశారు.ఇవి చదవండి: ‘ఒలింపిక్’ స్ఫూర్తిని పంచేందుకు.. -
‘ఇంటింటా ఇన్నోవేటర్-2024’ దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటింటా ఇన్నోవేటర్ 2024 కార్యక్రమం కోసం దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వెల్లడించింది. ఆవిష్కర్తలు తమ ఎంట్రీలను సమర్పించడానికి ఈ నెల 10 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది 6వ ఎడిషన్‌తో ముందుకు వచ్చిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం గ్రామీణ తెలంగాణలో ఆవిష్కరణ, వ్యవస్థాపకతను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.స్థానిక సవాళ్లకు పరిష్కారాలను తీసుకువచ్చే ఉద్దేశంతో, తమ ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు తయారు చేసిన ప్రజలను రాష్ట్ర ప్రజలకు పరిచయం చేస్తూ, ఆ ఆవిష్కరణలను ఆగస్టు 15న ప్రదర్శించే అవకాశాన్ని అందిస్తుంది.దరఖాస్తులను వాట్సాప్ ద్వారా 9100678543కు పంపించాలి. పేరు, వయస్సు, ఫోటో, వృత్తి, గ్రామం, మండలం, ఆవిష్కరణ పేరు, ఆవిష్కరణ గురించి 100 పదాల వివరణ, నాలుగు అధిక-రిజల్యూషన్ చిత్రాలతో పాటు రెండు వీడియోలు (2నిమిషాలలోపు) పంపించాలని ఇన్నోవేషన్ సెల్ తెలిపింది. -
చైనా నిపుణులకు వీసాల జోరు పెంచండి
న్యూఢిల్లీ: చైనా నిపుణుల కొరత దేశీ కంపెనీలను వేధిస్తోంది. ముఖ్యంగా టాటా పవర్ సోలార్, రెన్యూ ఫోటోవోల్టాయిక్ , అవాడా ఎలక్ట్రో వంటి సోలార్ మాడ్యూల్ తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చైనా ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల వీసా అప్లికేషన్లను వేగంగా అనుమతించాలంటూ ఆయా కంపెనీలు ప్రభుత్వాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చైనా నుంచి నిపుణుల రాక ఆలస్యం కావడంతో పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా కార్యకలాపాలను పెంచలేకపోతున్నామని కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ మూడు కంపెనీలు తమ సోలార్ మాడ్యూల్ ప్లాంట్లలో అవసరమైన 36 మంది చైనా నిపుణుల కోసం బిజినెస్ వీసాల కోసం ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేయగా.. ఇప్పటిదాకా వాటికి అనుమతులు రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో టాటా పవర్ సోలార్ అత్యధికంగా 20 మంది చైనా నిపుణుల కోసం వీసాలివ్వాల్సిందిగా కోరింది. ఈ కంపెనీ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో 4 గిగావాట్ల (జీడబ్ల్యూ) గ్రీన్‌ఫీల్డ్ సోలార్ సెల్, 4 జీడబ్ల్యూ సామర్థ్యం గల సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. దీనికోసం సుమారు రూ. 3,000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఇక రెన్యూ పవర్ గుజరాత్‌లోని ధోలెరాలో, అవాడా కంపెనీ ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్లో సోలార్ సెల్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. 500 జీడబ్ల్యూ లక్ష్యం.. 2030 నాటికి దేశంలో సౌరశక్తి, గాలి వంటి పునరుత్పాదక వనరుల ద్వారా 500 జీడబ్ల్యూ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అధునాతన పరికరాలు, సాంకేతికత కోసం చైనా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారీ ఎగుమతుల్లో చైనా ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. చైనాతో సరిహద్దు వివాదాలు ముదరడంతో పాటు కోవిడ్ మహమ్మారి విరుచుకుపడటంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు చైనా యాప్‌లను నిషేధించింది. పెట్టుబడులపై కూడా డేగకన్ను వేస్తోంది ప్రభుత్వం. చైనీయులు భారత్‌లో రాకపోకలను కూడా కఠినతరం చేసింది. దీనివల్ల ప్రాజెక్టులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యంతో పాటు వ్యయాలు పెరిగిపోయేందుకు దారితీస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
భారత ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ పదవికి 291 దరఖాస్తులు
ఖాళీగా ఉన్న భారత సీనియర్ పురుషుల హెడ్ కోచ్ పదవి కోసం 291 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ జాబితాలో భారత జట్టు మాజీ సభ్యుడు, గతంలో మోహన్ బగాన్ క్లబ్, ఈస్ట్ బెంగాల్ క్లబ్ జట్లకు కోచ్‌గా ఉన్న స్టాన్లీ రొజారియో... నార్త్ ఈస్ట్ యునైటెడ్ క్లబ్ అసిస్టెంట్ కోచ్ నౌషాద్ మూసా కూడా ఉన్నారు. 64 ఏళ్ల రొజారియో సరీ్వసెస్‌తో తన కోచింగ్ కెరీర్‌ను మొదలుపెట్టి 2006 నుంచి 2008 వరకు టీమిండియాకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు. ఈ నెలాఖరుకు కొత్త కోచ్‌ను నియమిస్తారు.